mobile business
-
ఈ స్మార్ట్‌ఫోన్ అభిమానులకు షాకింగ్ న్యూస్
సాక్షి, న్యూఢిల్లీ: మీరు ఎల్జీ స్మార్ట్‌ఫోన్ అభిమానులా? అయితే మీకో షాకింగ్ న్యూస్. దక్షిణ కొరియా సంస్థ ఎల్జి ఎలక్ట్రానిక్స్ ఎల్జీ ఫ్యాన్స్‌ను నిరాశపర్చే సంచలన నిర్ణయం దిశగా కదులుతోందట. మొబైల్ కమ్యూనికేషన్ వ్యాపారాన్ని పూర్తిగా మూసివేయాలని కంపెనీ భావిస్తోందట. స్మార్ట్‌ఫోన్ విక్రయాలకు సంబంధించిన వ్యూహాలు సఫలం కాకపోవడం వ్యాపార భాగస్వామ్య చర్చలు కార్యరూపం దాల్చకపోవడమే ఇందుకు కారణమని అంచనా. దక్షిణ కొరియాకు చెందిన డోంగా ఇల్బో నివేదిక ప్రకారం స్మార్ట్ ఫోన్ల అమ్మకాలపై ఇప్పటికే జర్మనీకి చెందిన వోక్స్వ్యాగన్ ఏజీ, వియత్నాంకు చెందిన వింగ్రూప్ జేఎస్సి అనే రెండు సంస్థలతో ఎల్జీ చర్చలు జరిపింది. ఈ చర్చలు విఫలమవడంతో మొత్తం మొబైల్ కమ్యూనికేషన్ వ్యాపారాన్నే మూసివేయాలని ఎల్జీ నిర్ణయించుకుంది. ఈ ఏడాది మొదటి అర్ధభాగంలో అన్ని కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచింగ్ ప్లాన్లను ఎల్జీ నిలిపివేసింది. రోలబుల్ డిస్ప్లే ఫోన్ల ఉత్పత్తిని కంపెనీ గత నెలలో నిలిపివేసిందని డోంగా తెలిపింది. 'ది రోలబుల్' గా పిలువబడే ఈ ఫోన్‌ను ఎల్జీ తిరిగి సీఈఎస్ 2021లో ప్రదర్శించింది. అటు మొబైల్ పరికరాలకు గ్లోబల్ మార్కెట్లో పోటీ తీవ్రంగా ఉన్నందున ఎల్జీ మంచి నిర్ణయం తీసుకునే సమయం ఆసన్నమైందని. స్మార్ట్ఫోన్ల అమ్మకాలు నిలిపివేసి, ఆ వ్యాపారం నుంచి పూర్తిగా వైదొలిగే వైపు ఆలోచన చేస్తోందని కొరియా హెరాల్డ్ జనవరిలో ఒక ఎల్జీ అధికారిని ఉటంకిస్తూ తెలపింది. కాగా మొబైల్ కమ్యూనికేషన్స్‌లో కంపెనీ నష్టాలను చవి చూస్తోందని ఎల్జీ ఎలక్ట్రానిక్స్ సీఈఓ క్వాన్ బాంగ్ సియోక్ గత జనవరి నెలలో ప్రకటించారు. గత ఐదేళ్లలో కంపెనీ 4.5 బిలియన్ల డాలర్లు (రూ.32,856 కోట్లు) కోల్పోయినట్లు ఉద్యోగులకు రాసిన లేఖలో ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే మొబైల్ కమ్యూనికేషన్స్‌ని విడిచిపెట్టాలని నిర్ణయించి నట్లు బాంగ్ తెలిపారు. దీనిపై విధివిధాలను ఏప్రిల్ తొలివారంలో ప్రకటిస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. -
మొబైల్ బిజినెస్‌కు రిలయన్స్ గుడ్ బై!!
న్యూఢిల్లీ: అప్పుల ఊబిలో కూరుకుపోయిన టెలికం కంపెనీ ‘రిలయన్స్ కమ్యూనికేషన్స్’ నవంబర్ 30 నాటికి తన నష్టాల్లోని వైర్లెస్ టెలిఫోన్ బిజినెస్(2జీ, 3జీ)ను నిలిపివేయనుంది. ఇక సంస్థ కేవలం 4జీ సేవలపైనే పూర్తిగా దృష్టి కేంద్రీకరించనుంది. ‘వైర్లెస్ బిజినెస్‌కు ముగింపు పలకాల్సిన రోజు వచ్చింది. వచ్చే 30 రోజుల్లో వైర్లెస్ బిజినెస్‌ను మూసివేస్తాం’ అని ఆర్‌కామ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గుర్దీప్ సింగ్ తాజాగా ఉద్యోగులకు చెప్పారు. ఇంటర్నేషనల్ లాంగ్ డిస్టెన్స్ (ఐఎల్‌డీ) వాయిస్, కన్సూమర్ వాయిస్, 4జీ డాంగిల్ పోస్ట్ పెయిడ్ సర్వీసెస్, మొబైల్ టవర్ వ్యాపారాలను లాభదాయకంగా ఉన్నంత వరకూ కొనసాగిస్తామని తెలియజేశారు. కాగా వైర్లెస్ టెలిఫోన్ బిజినెస్ మూసివేతకు సంబంధించి ఆర్‌కామ్‌కు వివిధ వార్తాసంస్థల నుంచి మెయిల్ పంపినా సమాధానం రానట్లు అవి తెలియజేశాయి. నవంబర్ 21న లైసెన్స్ గడువు ముగిశాక డీటీహెచ్ బిజినెస్‌ను కూడా ఆపివేస్తామని సింగ్ తెలిపారు. -
శాంసంగ్ లాభాలు హై జంప్
సియోల్: దక్షిణ కొరియా టెక్నాలజీ సంస్థ శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ లాభాల్లో దూసుకుపోయింది. సంస్థ కిందటి త్రైమాసికంలో గైడెన్స్‌ను అధిగమించి క్యూ2లో73శాతం వృద్ధితో భారీ లాభాలను నమోదు చేసింది. ముఖ్యంగా గత మూడు నెలల్లో మొమరీ చిప్ ద్వారా వచ్చిన ఆదాయంతో క్వార్టర్ 2 లాభాలు భారీగా పుంజుకున్నాయని కంపెనీ గురువారం ప్రకటించింది. దీంతో పాటు బై బ్యాక్ ఆఫర్‌ను కూడా ప్రకటించింది. ఈ సంవత్సరంలో ఇది మూడవసారి కావడం విశేషం. గురువారం ప్రకటించిన సంస్థ ఆదాయ ఫలితాల్లో ఆజూన్క్వార్టర్లో రికార్డ్ ఆపరేటింగ్ లాభాలను సాధించింది.ఆ పరేటింగ్ లాభం గత సంవత్సరం ఇదే త్రైమాసికంతో పోలిస్తే 72.7 శాతం పెరిగింది. 14.1 లక్షల కోట్ల డాలర్లకు (12.68 బిలియన్ డాలర్లు) సాధించిందని శాంసంగ్ పేర్కొంది. ఆదాయం 19.8 శాతం పెరిగి 61 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది. జూలైలో 14 ట్రిలియన్ల గెలుస్తుందని అంచనా వేసింది. అలాగే థర్డ్ క్వార్టర్లో 15 ట్రిలియన్ కంటే ఎక్కువ (మూడవ త్రైమాసికంలో లాభాలు) లాభాలను ఆర్జించనుందని ఇన్వెస్ట్మెంట్ అండ్ సెక్యూరిటీస్‌లో విశ్లేషకుడు గ్రెగ్ రో చెప్పారు. మెమోరీ చిప్స్, స్మార్ట్ఫోన్లు, టెలివిజన్ రంగంలో ప్రపంచంలోనే అతిపెద్ద తయారీ సంస్థ శాంసంగ్ రికార్డు లాభాలను పూర్తిస్థాయిలో సాధించినుందని భావిస్తున్నారు. శాంసంగ్ మొబైల్ వ్యాపారంలో త్రైమాసిక లాభాల కంటే మెరుగైన పనితీరు పెరగడంతో, ఎక్కువగా లాభాలు ఆర్జించిందని విశ్లేషకులు చెప్పారు. అలాగే 1.7 ట్రిలియన్ డాలర్ల (1.53 బిలియన్ డాలర్లు) విలువైన షేర్లను కొనుగోలు చేయనుంది. దీంతో జనవరి నెలలో ప్రకటించిన బై బ్యాక్ తో కలిపి మొత్తం బై వ్యాక్ విలువ 9.3 ట్రిలియన్ డాలర్లకు చేరింది. అలాగే 2 ట్రిలియన్ల సొంత వాటాలను రద్దును కూడా ప్రకటించింది. మెమరీ చిప్ సూపర్-సైకిల్ కారణంగా మూడవ-త్రైమాసిక ఆదాయం, రెండవ త్రైమాసికాన్న దాటిపోతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. -
'గ్యాంగ్‌స్టర్‌ని కాదు.. మొబైల్ షాపు ఓనర్ని'
ముంబయి: తాను గ్యాంగ్‌స్టర్‌ని కాదని ఇటీవల సింగపూర్ పోలీసుల చేతికి చిక్కిన కుమార్ పిళ్లై అన్నాడు. చైనాలో ఓ మొబైల్ షాపు నిర్వహించుకుంటున్నానని చెప్పాడు. ముంబయిలోని పలు వ్యాపారుస్తులను, బిల్డర్స్‌ను అతడు డబ్బుకోసం తీవ్రంగా బెదిరిస్తున్నాడని ఆరోపణలు రావడంతోపాటు పోలీసులు అతడికోసం తీవ్రంగా గాలిస్తున్నారు. గతంలో హత్య, దోపిడీ కేసుల కిందట అరెస్టయిన అతడు బెయిల్ పేరిట బయటకొచ్చి 1990లో పారిపోయాడు. అప్పటి నుంచి ఎటు వెళ్లిపోయాడో ఎవరికీ తెలియదు. అయితే, విదేశాలకు పారిపోయాడని తెలిసింది. ఈ నేపథ్యంలో ఇంటర్ పోల్ అధికారులు అతడిపై రెడ్ కార్నర్ నోటీసులు కూడా జారీ చేశారు. ఇదిలా ఉండగా, ఈ మధ్యకాలంలో ముంబయిలో పలువురు బిల్డర్లను బెదిరిస్తూ సెటిల్ మెంట్ లు చేసేందుకు గుట్టుచప్పుడు కాకుండా భారత్ లో అడుగు పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే అతడిని సింగపూర్ పోలీసులు గత ఫిబ్రవరిలో అరెస్టు చేశారు. కాగా, అక్కడి నుంచి ముంబయికి తీసుకొచ్చిన పోలీసులు అతడిని ప్రశ్నించగా తాను గ్యాంగ్ స్టర్ ని కాదని, చైనాలో మొబైల్ షాపు నిర్వహిస్తున్నానని చెప్పాడు. అలాగే, ఎల్టీటీఈకి తనకు సంబంధం లేదన్నాడు. ముంబయిలో తాను సెటిల్ మెంట్లు చేయలేదని, తన పేరు చెప్పుకొని తన అనుచరుడు రవి పూజారీ ఈ పనిచేసి ఉంటాడని, రవికి తనకు సంబంధాలు 2000 నుంచే తెగిపోయాయని చెప్పాడు. -
ఆన్లైన్ అమ్మకాలపై జగదీశ్ మార్కెట్ నిరసన
నగరంలోని జగదీశ్ మార్కెట్ వద్ద జంటనగరాల సిటీ మొబైల్, రిటైల్ వ్యాపారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఆన్లైన్ మార్కెట్లో నోకియా ఉత్పత్తులను కారుచౌకగా అమ్మేస్తున్నారంటూ వాళ్లు నిరసన వ్యక్తం చేశారు. ఆన్లైన్లో నోకియా ఉత్పత్తుల అమ్మకాలను వెంటనే నిలిపివేయాలని వ్యాపారులు డిమాండ్ చేశారు. లేకపోతే నోకియా సహా ఇతర ఉత్పత్తులను తామంతా బహిష్కరిస్తామని వ్యాపారులు హెచ్చరించారు. ఇటీవలి కాలంలో కొన్ని బ్రాండ్ల ఉత్పత్తులను కేవలం ఆన్లైన్లో మాత్రమ విక్రయిస్తున్న విషయం తెలిసిందే. మధ్యలో ఎవరూ లేకపోవడంతో వీటి ధర చాలావరకు తగ్గుతోంది. ఇది రిటైల్ వ్యాపారాలకు ఇబ్బందికరంగా మారింది. అందుకే జగదీశ్ మార్కెట్ వద్ద ఆందోళన జరిగింది.