ఆన్లైన్ అమ్మకాలపై జగదీశ్ మార్కెట్ నిరసన | will boycott nokia products, threaten retailers | Sakshi
Sakshi News home page

ఆన్లైన్ అమ్మకాలపై జగదీశ్ మార్కెట్ నిరసన

Published Fri, Nov 28 2014 4:31 PM | Last Updated on Sat, Sep 2 2017 5:17 PM

ఆన్లైన్ అమ్మకాలపై జగదీశ్ మార్కెట్ నిరసన

ఆన్లైన్ అమ్మకాలపై జగదీశ్ మార్కెట్ నిరసన

నగరంలోని జగదీశ్ మార్కెట్ వద్ద జంటనగరాల సిటీ మొబైల్, రిటైల్ వ్యాపారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఆన్లైన్ మార్కెట్లో నోకియా ఉత్పత్తులను కారుచౌకగా అమ్మేస్తున్నారంటూ వాళ్లు నిరసన వ్యక్తం చేశారు. ఆన్లైన్లో నోకియా ఉత్పత్తుల అమ్మకాలను వెంటనే నిలిపివేయాలని వ్యాపారులు డిమాండ్ చేశారు.

లేకపోతే నోకియా సహా ఇతర ఉత్పత్తులను తామంతా బహిష్కరిస్తామని వ్యాపారులు హెచ్చరించారు. ఇటీవలి కాలంలో కొన్ని బ్రాండ్ల ఉత్పత్తులను కేవలం ఆన్లైన్లో మాత్రమ విక్రయిస్తున్న విషయం తెలిసిందే. మధ్యలో ఎవరూ లేకపోవడంతో వీటి ధర చాలావరకు తగ్గుతోంది. ఇది రిటైల్ వ్యాపారాలకు ఇబ్బందికరంగా మారింది. అందుకే జగదీశ్ మార్కెట్ వద్ద ఆందోళన జరిగింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement