
న్యూఢిల్లీ: అప్పుల ఊబిలో కూరుకుపోయిన టెలికం కంపెనీ ‘రిలయన్స్ కమ్యూనికేషన్స్’ నవంబర్ 30 నాటికి తన నష్టాల్లోని వైర్‌లెస్ టెలిఫోన్ బిజినెస్(2జీ, 3జీ)ను నిలిపివేయనుంది. ఇక సంస్థ కేవలం 4జీ సేవలపైనే పూర్తిగా దృష్టి కేంద్రీకరించనుంది. ‘వైర్‌లెస్ బిజినెస్‌కు ముగింపు పలకాల్సిన రోజు వచ్చింది. వచ్చే 30 రోజుల్లో వైర్‌లెస్ బిజినెస్‌ను మూసివేస్తాం’ అని ఆర్‌కామ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గుర్దీప్ సింగ్ తాజాగా ఉద్యోగులకు చెప్పారు.
ఇంటర్నేషనల్ లాంగ్ డిస్టెన్స్ (ఐఎల్‌డీ) వాయిస్, కన్సూమర్ వాయిస్, 4జీ డాంగిల్ పోస్ట్ పెయిడ్ సర్వీసెస్, మొబైల్ టవర్ వ్యాపారాలను లాభదాయకంగా ఉన్నంత వరకూ కొనసాగిస్తామని తెలియజేశారు. కాగా వైర్‌లెస్ టెలిఫోన్ బిజినెస్ మూసివేతకు సంబంధించి ఆర్‌కామ్‌కు వివిధ వార్తాసంస్థల నుంచి మెయిల్ పంపినా సమాధానం రానట్లు అవి తెలియజేశాయి. నవంబర్ 21న లైసెన్స్ గడువు ముగిశాక డీటీహెచ్ బిజినెస్‌ను కూడా ఆపివేస్తామని సింగ్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment