రిలయన్స్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ (RCPL) ఎస్ఐఎల్ బ్రాండ్‌ను కొనుగోలు చేసినట్లు ప్రకటించింది. ఎస్‌ఐఎల్(SIL) వివిధ రకాల జామ్‌లు, ఊరగాయలు, ఇతర ఆహార ఉత్పత్తులను తయారు చేస్తోంది. రిలయన్స్ ఈ బ్రాండ్‌ను కొనుగోలు చేయడంతో ఇకపై ఎస్‌ఐఎల్ ఉత్పత్తులు ఆర్‌సీపీఎల్ ఆధ్వర్యంలో తయారు చేయనున్నారు.
ఈ బ్రాండ్ కొనుగోలు కేవలం వ్యాపార లావాదేవీ మాత్రమే కాదని రిలయన్స్ తెలిపింది. ఐకానిక్ భారతీయ వారసత్వ బ్రాండ్లను పునరుద్ధరించడానికి, వాటిని విస్తరించడానికి ఆర్‌సీపీఎల్ వ్యూహాత్మక చర్యల్లో భాగమని పేర్కొంది. ఎస్ఐఎల్‌ను ప్రాచుర్యంలోకి తెచ్చిన ఉత్పత్తులను నిలుపుకుంటూ సమకాలీన అభిరుచులకు అనుగుణంగా కొత్త ఉత్పత్తులను పరిచయం చేస్తామని ఆర్‌సీపీఎల్ తెలిపింది. ఎస్ఐఎల్ ఉత్పత్తులు దేశవ్యాప్తంగా వినియోగదారులకు సులభంగా అందుబాటులో ఉండేలా రిలయన్స్ నెట్‌వర్క్ ఉపయోగపడనుంది.
విస్తరణ దిశగా మరో కంపెనీ..
కంపెనీలకు డిజిటల్ పరివర్తన సేవలు అందించే క్రెడెరా భారత్‌లో కార్యకలాపాలను విస్తరించడంపై మరింతగా దృష్టి పెడుతోంది. ప్రస్తుతం దేశీయంగా ఆరు గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లలో 1,300 మంది సిబ్బంది ఉండగా అతి పెద్దదైన హైదరాబాద్ సెంటర్‌లో 1,000 మంది పైగా ఉద్యోగులు ఉన్నట్లు క్రెడెరా ఇండియా సీఈవో గౌరవ్ మాథుర్ తెలిపారు. మరింత మంది మార్కెటింగ్, టెక్నికల్ నిపుణులను నియమించుకోనున్నట్లు చెప్పారు. పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా విద్యార్థులకు శిక్షణనిచ్చేందుకు పలు కళాశాలలతో కలిసి పనిచేస్తున్నట్లు వివరించారు. క్రెడెరాకు అంతర్జాతీయంగా 3,000 మంది సిబ్బంది ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment