
ఈ నెల 15, 16న వార్షిక ఇండియా కాన్ఫరెన్స్
భారతీయ వ్యాపారం, విధానాలు, సంస్కృతిపై హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో రిలయన్స్(Reliance) ఫౌండేషన్ గౌరవ ఛైర్‌పర్సన్ నీతా అంబానీ(Nita Ambani) కీలకోపన్యాసం చేయనున్నారు. 2025 ఫిబ్రవరి 15 నుంచి 16 వరకు జరిగే వార్షిక ఇండియా కాన్ఫరెన్స్‌లో ఆమె ప్రసంగిస్తారు. ఈ సదస్సుకు విధానకర్తలు, వ్యాపారవేత్తలు, మేధావులతో సహా 1,000 మందికి పైగా ప్రతినిధులు హాజరువుతున్నారు.
ఈ కాన్ఫరెన్స్‌లో భాగంగా నీతా అంబానీ ప్రముఖ విద్యావేత్త, హార్వర్డ్ బిజినెస్ స్కూల్ మాజీ డీన్ నితిన్ నోహ్రియాతో భారతదేశ కళలు, సంస్కృతి, ఆధునిక ప్రపంచంలో భారతదేశం పాత్ర వంటి అంశాలపై చర్చిస్తారు. ప్రపంచ వేదికలపై దేశం తరఫున వివిధ అంశాలపై మాట్లాడే ప్రభావవంతమైన వ్యక్తుల్లో నీతా అంబానీ ఒకరిగా నిలిచారు. కళలు, హస్తకళలు, క్రీడలు, విద్య, ఆరోగ్య సంరక్షణకు సంబంధించిన కార్యక్రమాల ద్వారా రిలయన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆమె ఎంతో సేవలందిస్తున్నారు.
ఇదీ చదవండి: నెమ్మదించిన పారిశ్రామికోత్పత్తి వృద్ధి
వార్షిక ఇండియా కాన్ఫరెన్స్‌కు సంబంధించి ఈ సంవత్సరం థీమ్ ‘ఫ్రమ్ ఇండియా టు ది వరల్డ్’గా నిర్ణయించారు. ప్రపంచవ్యాప్తంగా శాంతి, శ్రేయస్సు కోసం భారతీయ ప్రయత్నాలు ఎలా ఉన్నాయో, దేశంలో అనుసరిస్తున్న విధానాలు, వాటి రూపకల్పన వంటి వాటిపై ఈ కాన్ఫరెన్స్‌లో చర్చ జరగనుంది. 22 సంవత్సరాలకు పైగా హార్వర్డ్ విద్యార్థులు వ్యాపారం, ఆర్థిక శాస్త్రం, విద్య, సంస్కృతి వంటి విభిన్న విభాగాలకు చెందిన నిపుణులు ఈ కాన్ఫరెన్స్‌లో మాట్లాడేందుకు ఆతిథ్యం ఇస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment