conferance
-
సూరత్‌లో వజ్రాల సదస్సు
ముంబై: ప్రయోగశాలల్లో తయారు చేసిన వజ్రాల (ఎల్జీడీ) విక్రేతలు, కొనుగోలుదారులకు సంబంధించి గుజరాత్‌లోని సూరత్‌లో తొలిసారిగా సదస్సును ప్రారంభించినట్లు రత్నాభరణాల ఎగుమతుల ప్రోత్సాహక మండలి (జీజేఈపీసీ) తెలిపింది. ఇందులో 13 దేశాల నుంచి 22 మంది ఎగ్జిబిటర్లు పాల్గొంటున్నట్లు పేర్కొంది. మూడు రోజుల పాటు జరిగే ఈ సదస్సులో కొనుగోలుదారులు, విక్రేతలు ప్రత్యక్షంగా డీల్స్ గురించి చర్చించుకోవచ్చని, దీర్ఘకాలిక వ్యాపార సంబంధాలను కుదుర్చుకోవచ్చని వివరించింది. గత అయిదేళ్లుగా భారత్‌లో ఎల్జీడీ విభాగం గణనీయంగా పెరిగిందని జీజేఈపీసీ చైర్మన్ విపుల్ షా వివరించారు. 2016–17లో 131 మిలియన్ డాలర్లుగా ఉన్న ఎగుమతులు 2022 ఏప్రిల్–2023 ఫిబ్రవరి మధ్య కాలంలో 1.5 బిలియన్ డాలర్లకు చేరాయని తెలిపారు. -
రీడిజైన్డ్ యాపిల్ మ్యాక్‌బుక్ ఎయిర్ వచ్చేసింది: ప్రత్యేకతలేంటి?
న్యూఢిల్లీ: యాపిల్ రీడిజైన్ చేసిన సరికొత్త మ్యాక్‌బుక్ ఎయిర్‌ను తీసుకొచ్చింది. ఎం1 చిప్‌ను అప్‌గ్రేడ్ చేసి ఎం 2 చిప్‌తో కొత్త మ్యాక్‌బుక్ ఎయిర్‌ను తాజాగా ఆవిష్కరించింది. యాపిల్ వరల్డ్‌వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్ (డబ్ల్యూడబ్ల్యూడీసీ) 2022లో యాపిల్ సీఈవో టిమ్ కుక్ లాంచ్ చేశారు. కోవిడ్ తరువాత ఆఫ్‌లైన్‌లో నిర్వహిస్తున్న తొలి డెవలపర్ల సమావేశంలో ఐవోస్ 16కి సంబంధించి కొత్త అపడేట్ సహా కొన్ని భారీ ప్రకటనలను కూడా చేసింది. ఇండియన్ మార్కెట్లో ధరలు 10 జీపీయూ కోర్ ఎం2 మ్యాక్‌బుక్ ఎయిర్ ధర రూ. 1,49,000 నుండి ప్రారంభం 8 జీపీయూ కోర్ ఎం2 మ్యాక్‌బుక్ ఎయిర్ ధర రూ. 1,19,900 నుండి మ్యాక్‌బుక్ ఎయిర్ ల్యాప్‌టాప్ ఫీచర్లు 13.6 అంగుళాల డిస్ప్లే (థిన్నర్ బెజెల్స్) 2560x1664 నేటివ్ పిక్సెల్స్ రిజల్యూషన్ బేస్ వేరియంట్‌తో 8జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ స్టోరేజీని 2టీవీ వరకు విస్తరించుకునే అవకాశం 11.3 మిమీ, బరువు 2.7 పౌండ్లు (1.22 కిలోలు) సిల్వర్, స్పేస్ గ్రే, స్టార్‌లైట్, మిడ్నైట్ బ్లాక్ . గోల్డ్ కలర్లలో లభ్యం. ఇందులోని ఎం2 చిప్ గత జనరేషన్ ఇంటెల్ ఆధారిత మ్యాక్‌బుక్ ఎయిర్ కంటే 5 రెట్లు వేగం, అలాగే 2020 ఎంఐ మ్యాక్‌బుక్ ఎయిర్ కంటే 40 శాతం వేగంగా పనిచేస్తుంది. ఇది డ్యూయల్ USC-C పోర్ట్‌లతో కూడా వస్తుంది, రెండూ ఫాస్ట్ ఛార్జింగ్ కోసం ఉపయోగించుకోవచ్చు. 20 గంటల బ్యాటరీ లైఫ్, 1080p హెచ్డీ కెమెరా, MagSafe ఛార్జింగ్, టచ్ ఐడీ, మేజిక్ కీబోర్డ్ , ఫోర్స్ టచ్ ట్రాక్‌ప్యాడ్ లాంటివి ఇతర ఫీచర్లు (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
జోరుగా సాగుతున్న ఆటా డీసీ కాన్ఫరెన్స్ సన్నాహాక ఏర్పాట్లు
అమెరికన్ తెలుగు అసోసియేషన్ మొట్ట మొదటిసారి అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీ నగరంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 17వ కాన్ఫరెన్స్ , యూత్ కన్వెన్షన్‌ని జులై 1 నుంచి 3 తారీకు వరకు ఘనంగా నిర్వహించనున్నారు. వాషింగ్టన్ డీసీ వాల్తేర్ ఏ కన్వెన్షన్ సెంటర్లో ఈ కార్యక్రమం జరగనుంది. దీనికి ముఖ్య అతిథులుగా సద్గురు జగ్గీవాసుదేవ్, విజయ్ దేవరకొండ, రకుల్ ప్రీత్ సింగ్, కపిల్ దేవ్, బాలకృష్ణ తదితరులు విచ్చేయచున్నారు. ఆబాలగోపాలాన్ని తన సంగీతంతో ఉర్రూతలూగించే మాస్ట్రో ఇళయరాజా ట్రూప్ చేత మ్యూజికల్ నైట్ ఏర్పాటు చేస్తున్నారు. ఎంతో మంది బిజినెస్, రాజకీయ, సామాజిక, సాహిత్య, కవులు కళాకారులు, ప్రముఖులు, మేధావులు హాజరవబోతున్న ఈ కార్యకమంలో దాదాపు 1౦,౦౦౦ మందికి పైగా భాగస్వాములు అవుతారని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. ఆంధ్ర ప్రదేశ్ సీఎం జగన్, కేంద్ర టూరిజం శాఖ మంత్రి కిషన్ రెడ్డి, టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి , కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, కవిత, జి.ఎం.ర్. ఉపాసన కామినేని తదితరులు ప్రత్యేక ఆహ్వానితులుగా ఉన్నారు. అమెరికన్ తెలుగు అసోసియేషన్ ప్రెసిడెంట్ భువనేశ్ బుజాల అధ్యక్షతన సుధీర్ బండారు కన్వీనర్‌గా, క్యాపిటల్ ఏరియా తెలుగు సొసైటీ కో-హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ కాన్ఫరెన్స్ కి ఉత్తర అమెరికాలో తెలుగు వారు పెద్ద ఎత్తున హాజరయ్యి తెలుగు వారి ప్రత్యేకతను చాటవలసిందిగా ఆటా కార్యవర్గం ఒక ప్రకటనలో తెలియజేసింది. దాదాపు 2.3 మిలియన చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ కన్వెన్షన్ సెంటర్ లో మినీ షాపింగ్ మాల్ తలపించనుంది. 200 పైగా ప్రత్యేక స్టాల్స్ ప్రత్యేక ఆకర్షణగా రియల్ ఎస్టేట్, జ్యుయల్లరీ, చీరలు, ఇన్సూరెన్స్, ఇన్నోవేటివ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ స్టాల్స్ ఏర్పాటు చేయబోతున్నారు. మిగిలి ఉన్న అతి కొద్ది వెండర్ బూత్ కొరకు త్వరగా దరఖాస్తు చేసుకోవాల్సిందిగా నిర్వాహకులు కోరుతున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధఙంచి మరిన్ని వివరాల్లో కోసం https://www.ataconference.org/exhibits సంప్రదించగలరు. చదవండి: సీఎం జగన్‌ను కలిసిన ఆటా ప్రతినిధుల బృందం -
త్వరలో దక్షిణాది బీసీ కమిషన్ల సదస్సు
సాక్షి, హైదరాబాద్: దక్షిణాది రాష్ట్రాల్లోని బీసీ కమిషన్లతో త్వరలో సదస్సు నిర్వహించనున్నట్లు తెలంగాణ బీసీ కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్ వెల్లడించారు. ఈ దిశగా ఏర్పాట్లు వేగవంతం చేశామన్నారు. కర్ణాటక రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ జయప్రకాశ్ హెగ్డే నేతృత్వంలోని బృందం గురువారం రాష్ట్రానికి వచ్చింది. తెలంగాణ బీసీ కమిషన్ కార్యా లయాన్ని సందర్శించింది. ఇక్కడ అమలు చేస్తున్న సంక్షేమ పథకాల తీరును అడిగి తెలుసుకుంది. ఈ సందర్భంగా రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ మాట్లాడుతూ దక్షిణాది రాష్ట్రాల సదస్సును విజయవంతం చేయాలని కోరారు. తెలంగాణ రాష్ట్రం ఇటీవల జారీ చేసిన టరమ్స్ ఆఫ్ రిఫరెన్స్ ఆధారంగా నిర్ధిష్టమైన పద్దతిలో అధ్యయనం ప్రారంభించామన్నారు. ఈ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నట్లు తెలిపారు. బీసీలకు బాసటగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుందని ఆయన వివరించారు. అనంతరం టీ–బీసీ కమిషన్ సభ్యులు కిషోర్‌గౌడ్, సీహెచ్ ఉపేంద్ర, శుభప్రద్‌పటేల్ తదితరులు కర్నాటక ప్రతినిధి బృందానికి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. -
సెప్టెంబరులో టొరంటో వేదికగా తెలుగు సాహితి సదస్సు
కెనడా ప్రధాన కేంద్రంగా టొరంటోలో జరుగుతున్న మొట్టమొదటి కెనడా తెలుగు సాహితీ సదస్సు , 12వ అమెరికా తెలుగు సాహితీ సదస్సుa నిర్వహాణకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయని నిర్వాహకులు తెలిపారు. 2021 సెప్టెంబరు 25, 26 తేదిల్లో వర్చువల్‌గా ఈ సదస్సు జరుగుతుందని కెనడా తెలుగు సంఘాల ఐక్యవేదిక తెలిపింది. కెనడాలో ఉన్న ఎనిమిది తెలుగు సంఘాలు సంయక్తంగా ఈ సాహితి సదస్సును నిర్వహిస్తున్నాయి. ఈ సాహితి సదస్సులో పాల్గొనేందుకు ఇప్పటికే వందకు పైగా ఎంట్రీలు వచ్చినట్టు నిర్వాహకులు తెలిపారు. వీరందరికి అవకాశం కలిగించడానికి సదస్సును రెండు రోజుల పాటు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ప్రతీ రోజు ఉదయం 9:00 గంటల నుంచి సాయంత్రం 7:00 గంటల దాకా (EST, Toronto Time) మొత్తం 20 గంటలకి పైగా ఈ సదస్సు జరుగుతుందని వెల్లడించారు చదవండి :డెట్రాయిట్లో తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ బోర్డు సమావేశం -
వాషింగ్టన్ డీసీ వేదికగా ఆటా వేడుకలు
వాషింగ్టన్ డీసీ: అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) 17వ కన్వెన్షన్ యూత్ కాన్ఫరెన్స్ని 2022 జులై 1, 2, 3 తేదీల్లో నిర్వహించనున్నట్టు ఆటా కార్యవర్గం ప్రకటించింది. వాషింగ్టన్ డీసీలో ఉన్న హెర్న్‌డాన్ వరల్డ్ గేట్ సెంటర్ ఏరియాలో క్రౌన్ ప్లాజా హోటల్లో జరిగిన ఆటా సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. సుమారు ఎనిమిది వందల మంది ఈ సమావేశానికి హాజరయ్యారు. మొదటిసారి ఇప్పటి వరకు 16 సార్లు ఆటా కన్వెన్షన్, యూత్ కాన్ఫరెన్స్‌లు జరిగాయి. అయితే ఇవన్నీ అమెరికాలోని వేర్వేరు నగరాల్లో జరిగాయి. అయితే 17వ కాన్ఫరెన్స్‌కి అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీ మొదటిసారి వేదికగా నిలవనుంది. ఈ వేడుకలు నిర్వహించేందుకు వాల్టేర్ ఈ కన్వెన్షన్ సెంటర్‌ని ఎంపిక చేశారు. ఈ కాన్ఫరెన్స్‌కి క్యాపిటల్ ఏరియా తెలుగు సంఘం, కాట్స్ కో హోస్ట్‌గా వ్యవహరిస్తోంది. ఏర్పాట్ల పరిశీలన ఆటా ప్రెసిడెంట్ భువనేశ్ బుజాల, ఆటా కాన్ఫరెన్స్ కన్వీనర్ సుధీర్ బండారు, కాట్స్ ఆధ్వర్యంలో 70 మందికి పైగా ఆటా కార్యవర్గ, అడ్హాక్, అడ్విసోరీ, లోకల్ కన్వెన్షన్ కమిటీలు కాన్ఫరెన్స్ ఏర్పాట్లను పరిశీలించారు. వాల్టేర్ ఈ కన్వెన్షన్ సెంటర్లో ఉన్న సౌకర్యాలను పర్యవేక్షించారు. 12 వేల మంది ఆటా కాన్ఫరెన్స్ యూత్ కన్వెన్షన్‌ను అంగరంగ వైభవంగా నిర్వహించబోతున్నారు. ఈ కార్యక్రమం లో 12,000 మందికి పైగా తెలుగు వారు పాల్గొనే అవకాశం ఉంది. అందుకు తగ్గట్టుగా అన్ని సౌకర్యాలు కల్పించటానికి ప్రణాళిక రూపొందిస్తున్నారు. -
World Heritage Sites : ‘వారసత్వ రేసులో రామప్ప’
సాక్క్షి, వెబ్‌డెస్క్ : ద్భుతాలకు నెలవైన రామప్ప వైభవం ములుగు జిల్లా వెంకటాపురం మండలం పాలంపేట నుంచి చైనాకు చేరుకుంది. వరల్డ్ హెరిటేజ్ సైట్స్ జాబితాలో కొత్తవాటిని చేర్చేందుకు యూనెస్కో సమావేశాలు చైనాలో జరుగుతున్నాయి. ఈ సమావేశాల్లో ఇండియా తరఫున 2020 నామినీగా రామప్ప ఎంపికైంది. వరల్డ్ హెరిటేజ్ గుర్తింపు తీసుకువచ్చేందుకు ఐదేళ్లుగా ఎలాంటి ప్రయత్నాలు చేశారో ఓ సారి చూద్దాం... -
హుందాతనం మరవొద్దు
కేవాడియా/సాక్షి, న్యూఢిల్లీ: ప్రజల విశ్వాసం పొంది, ఎన్నికల్లో గెలుపొందిన ప్రజాప్రతినిధులు చట్టసభల్లో హుందాగా వ్యవహరిం చాలని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సూచించారు. పార్లమెంట్లో, శాసన సభల్లో అర్థవంతమైన, ఆరోగ్యకరమైన చర్చలు జరపాలని పిలుపునిచ్చారు. అన్‌పార్లమెంటరీ పదజాలానికి దూరంగా ఉండాలని కోరారు. క్రమశిక్షణారాహిత్యం, అనుచితమైన పదప్రయోగం ప్రజల మనోభావాలను తీవ్రంగా గాయపరుస్తాయని అన్నారు. రాష్ట్రపతి కోవింద్ బుధవారం గుజరాత్‌లోని కేవాడియా పట్టణంలో 80వ ఆలిండియా ప్రిసైడింగ్ అధికారుల సదస్సులో మాట్లాడారు. చట్టసభల్లో ఆరోగ్యకరమైన చర్చలు జరిగేలా స్పీకర్లు చర్యలు తీసుకోవాలని రాష్ట్రపతి సూచించారు. బడుగుల అభివృద్ధే పరమావధి కావాలి చట్టసభల పనితీరుపై సామాన్య ప్రజల్లో అవగాహన పెరిగిందని, వారి ఆకాంక్షలు సైతం పెరుగుతున్నాయని రాష్ట్రపతి కోవింద్ గుర్తుచేశారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో అధికార పక్షంతోపాటు ప్రతిపక్షం పాత్ర ఎంతో కీలకమని అన్నారు. ఇరు పక్షాల మధ్య పరస్పర అవగాహన, సహకారం, ఆలోచనలు పంచుకోవడం చాలా అవసరమని వెల్లడించారు. అణగారిన, వెనుకబడిన వర్గాల అభివృద్ధే ప్రభుత్వాల పరమావధి కావాలని చెప్పారు. కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు అహ్మద్ పటేల్ మృతిపట్ల రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సంతాపం ప్రకటించారు. వ్యవస్థల మధ్య భేదాభిప్రాయాలు సహజమే: ఓం బిర్లా ప్రజాస్వామ్యంలో రాజ్యాంగ వ్యవస్థల మధ్య భేదాభిప్రాయాలు సహజమేనని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా చెప్పారు. రాజ్యాంగ విలువలు, ప్రజాస్వామ్య నిబంధనలు పాటిస్తూ ఈ భేదాభిప్రాయాలను తొలగించుకోవాలని అన్నారు. ప్రిసైడింగ్ అధికారుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థలు ఒకదానికొకటి సహకరించుకోవాలని అన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పార్లమెంట్, రాష్ట్రాల అసెంబ్లీలు పనిచేసేలా రాజ్యాంగం పునాదులు వేసిందని అన్నారు. ప్రజాప్రతినిధులుగా మనమంతా ప్రజల బాగు కోసమే పని చేయాలని స్పష్టం చేశారు. రాజ్యాంగ విలువలను కచ్చితంగా పాటించాలని ఓం బిర్లా పేర్కొన్నారు. మూడు వ్యవస్థలు కలిసి పని చేయాలి: వెంకయ్య ప్రజాస్వామ్యం వెలుగులు విరజిమ్మాలంటే శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థల మధ్య పరస్పర సహకారం అవసరమని ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. ఆలిండియా ప్రిసైడింగ్ ఆఫీసర్ల సదస్సులో ఆయన మాట్లాడారు. శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థలు వాటి పరిధిలో కలిసి పనిచేయాలని కోరారు. సామాజిక, ఆర్థిక వ్యవహారాల్లో çకోర్టులు చరిత్రాత్మక తీర్పులు వెలువరించాయని అన్నారు. అయితే, శాసన, కార్యనిర్వా హక వ్యవస్థల్లో కోర్టులు అనవసరంగా కలుగజేసుకుంటున్నాయన్న వాదనలు ఉన్నాయని వెల్లడించారు. చట్టసభల్లో తరచుగా జరుగుతున్న ఘటనలపై వెంకయ్య ఆందోళన వ్యక్తం చేశారు. మూడు ‘డి’లు.. డిబేట్, డిస్కస్, డిసైడ్కు ప్రజాప్రతినిధులు కట్టుబడి ఉండాలని కోరారు. -
26న హైదరాబాద్ హైటెక్స్‌లో డా. ఖాదర్ సదస్సులు
అటవీ కృషి, సిరిధాన్యాల సాగు– సిరిధాన్యాల ఆహారం ద్వారా సంపూర్ణ ఆరోగ్యం పొందే మార్గాలపై అటవీ కృషి, ఆరోగ్య, ఆహార నిపుణులు డా. ఖాదర్ వలి ఈ నెల 26న అనేక సదస్సుల్లో ప్రసంగించనున్నారు. మాదాపూర్‌లోని హైటెక్స్‌లో ‘సేంద్రియ ఉత్పత్తులు–చిరుధాన్యాలు– సంప్రదాయ వైద్య రీతులు’ పేరిట ఏర్పాటయ్యే మూడు రోజుల ఎగ్జిబిషన్లో భాగంగా ఈనెల 26 (ఆదివారం)న ఉ. 10 గం.–మ.12, మ.1 గం.–4 గం. మధ్య జరిగే సదస్సుల్లో డాక్టర్ ఖాదర్ ప్రసంగిస్తారని నిర్వాహకురాలు మాధవి తెలిపారు. రైతులు, ప్రజల ప్రశ్నలకు సమాధానాలు ఇస్తారు. ఈ ఉచిత సదస్సులకు అందరూ ఆహ్వానితులే. వివరాలకు.. 89782 45673, 81066 44699. ‘సిరిధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యం’ ఆంగ్ల పుస్తకాన్ని ఈ సందర్భంగా ఆవిష్కరిస్తారు. 28న హైదరాబాద్ సరూర్‌నగర్‌లో డా. ఖాదర్ సదస్సు హైదరాబాద్ సరూర్‌నగర్‌లోని కొత్తపేట బాబూ జగ్జీవన్‌రాం భవన్లో ఈ నెల 28(మంగళవారం)న మ. 3 గం. నుంచి రా. 7 గం. వరకు ‘సిరిధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యం– అటవీ కృషి ఆవశ్యకత’పై జరిగే సదస్సులో ప్రముఖ అటవీ కృషి, ఆహార, ఆరోగ్య నిపుణులు డా. ఖాదర్‌వలీ ప్రసంగిస్తారని రైతునేస్తం ఫౌండేషన్ చైర్మన్ వై. వెంకటేశ్వరరావు తెలిపారు. ప్రవేశం ఉచితం. వివరాలకు.. 98493 12629, 040–23395979 -
28న నేపాల్‌కు మోదీ
కఠ్మాండు: ఈ నెల 28–31 మధ్య నేపాల్ రాజధాని కఠ్మాండులో జరిగే బిమ్స్టెక్ దేశాల 4వ సదస్సుకు ప్రధాని మోదీ హాజరుకానున్నారు. ప్రధానిగా మోదీ నేపాల్‌లో పర్యటించడం ఇది నాలుగోసారి కావడం గమనార్హం. ఈ సందర్భంగా పశుపతినాథ్ ఆలయ ప్రాంగణంలో భారత్ ఆర్థికసాయంతో నిర్మించిన ‘ధరంశాల’ అనే ఆసుపత్రిని మోదీ ప్రారంభిస్తారు. -
ఏప్రిల్ 1నుంచి సీపీఐ రాష్ట్ర మహాసభలు
బెల్లంపల్లి : తెలంగాణ రాష్ట్ర ద్వితీయ మహాసభలు ఏప్రిల్ 1నుంచి 4వ తేదీ వరకు హైదరాబాద్‌లో నిర్వహించనున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు గుండా మల్లేష్, జిల్లా కార్యదర్శి కె.శంకర్ తెలిపారు. ఆదివారం పట్టణ సీపీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మహాసభల పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం సీపీఐ అలుపెరుగని పోరాటాలు చేస్తోందని తెలిపారు. రాష్ట్ర మహాసభల ప్రారంభాన్ని పురష్కరించుకుని ఏప్రిల్ 1న హైదరాబాద్ ఎగ్జిబిషన్ మైదానంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని తెలిపారు. ప్రజలు పెద్ద ఎత్తున సభకు తరలి వచ్చి విజయవంతం చేయాలని కోరా రు. మహాసభకు సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి, జాతీయ కార్యదర్శులు కె. నారాయణ, అతుల్‌కుమార్ అంజన్ హాజరవుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకులు చిప్ప నర్సయ్య, డి.సత్యనారాయణ, ఎం.వెంకటస్వామి, మల్లయ్య, చంద్రమాణిక్యం పాల్గొన్నారు. -
పొగాకు కంపెనీ నిధులతోనే ధూమపానంపై..
సాక్షి, న్యూఢిల్లీ : ఈ శతాబ్దంలో ధూమపానంతో సంక్రమించే జబ్బుల కారణంగా మరణించే వంద కోట్ల మంది ప్రాణాలను రక్షించడం ఎలా ? అన్న అంశంపై దక్షిణాఫ్రికాలో గతవారం జరిగిన అంతర్జాతీయ సదస్సులో వివిధ దేశాల నుంచి వచ్చిన వైద్యులు, నిపుణులు, సామాజిక కార్యకర్తలు అనర్గళంగా మాట్లాడారు. ‘యునైటింగ్ ది వరల్డ్ ఫర్ టొబాకో ఫ్రీ జనరేషన్ (పొగాకురహిత తరం కోసం ప్రపంచాన్ని ఏకం చేద్దాం)’ అన్న థీమ్పైనా ముందుగా ఈ చర్చ సజావుగానే జరిగింది. ఈ థీమ్‌ను ఖరారు చేసిందీ లాభాపేక్షలేని స్వతంత్ర, స్వచ్ఛంద సంస్థగా చెప్పుకునే ‘ఫౌండేషన్ ఫర్ ఏ స్మోక్ ఫ్రీ వరల్డ్’. ఈ అంతర్జాతీయ సంస్థకు సంధానకర్తగా వ్యవహరించిందీ కూడా ఈ సంస్థనే. అంతేకాదు, ధూమపానాన్ని నియంత్రించేందుకు ‘ఫ్రేమ్‌వర్క్ కన్వెన్షన్ ఆన్ టొబాకో కంట్రోల్ లేదా ఎఫ్‌సీటీసీ) పేరిట ఓ అంతర్జాతీయ ఒప్పందం కుదరడానికి కూడా గతేడాదే అమల్లోకి వచ్చిన ఈ స్మోక్ ఫ్రీ వరల్డ్ ఫౌండేషన్ అధిపతి, ప్రపంచ ఆరోగ్య సంస్థ మాజీ అధికారి డెరెక్ యాచ్ చేసిన కషే కారణం. ఇంతవరకు బాగానే ఉంది. అసలు విషయం వెలుగులోకి రావడంతో అప్పటి వరకు సజావుగా జరిగిన చర్చ మరో దిశకు మారి ధూమపానంలా వక్తలను ఉక్కిరిబిక్కిరి చేసింది. ఈ సంస్థకు ఏడాదికి 8 కోట్ల డాలర్ల ఆర్థిక సహాయాన్ని విరాళంగా ఇస్తున్నది మాత్రం ప్రపంచంలోనే అతిపెద్ద టొబాకో కంపెనీ అయిన ‘ఫిలిప్ మోరిస్ ఇంటర్నేషనల్ (పీఎంఐ)’ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ‘మార్ల్బోరో’ బ్రాండ్ ఈ కంపెనీదే. ప్రపంచవ్యాప్తంగా పొగాకు ఉత్పత్తులు అమ్ముకుంటూ అధిక లాభాలు గడిస్తున్న ఈ సంస్థ తమ ఉత్పత్తుల ప్రమోషన్ కోసం శాస్త్ర విజ్ఞాన, వైద్య అంశాలను వక్రీకరించిన సందర్భాలు కూడా ఉన్నాయి. స్మోక్ ఫ్రీ వరల్డ్ ఫౌండేషన్ అధికారి డెరెక్ యాచ్ రాసిన కొన్ని వ్యాసాలు కూడా అలాంటివేనన్న విమర్శలు ఉన్నాయి. ‘ఓ పొగాకు కంపెనీ నుంచి భారీ ఎత్తున విరాళాలు తీసుకుంటూ పొగాకు రహిత సమాజం కోసం ఎలా కషి చేయగలం? అందులో చిత్తశుద్ధి ఉంటుందా? నైతికత ఉంటుందా? ఆత్మవంచన కాదా? అభాసుపాలు కామా ? అంతర్జాతీయ సమాజం దీన్ని ఎలా అర్థం చేసుకుంటుందీ? అన్న ప్రశ్నలు సదస్సులో కొందర విమర్శకులు లేవనెత్తడంతో ముందుగా ఉక్కురిబిక్కిరైన వక్తలు ఆ తర్వాత తమలో తాము వాదించుకున్నారు. పొగాకు కంపెనీలకు పొగాకు, ధూమపానం నియంత్రణా సంస్థలు, విధానకర్తలు దూరంగా ఉండాటంటూ కొందరు వక్తలు ‘బ్రేకింగ్ బిగ్ టొబాకోస్ గ్రిప్’ అన్న నినాదాన్ని ముందుకు తీసుకొచ్చారు. ‘స్మోక్ ఫ్రీ వరల్డ్’ ఫౌండేషన్‌కు దూరంగా ఉండాలని కూడా అభిప్రాయపడ్డారు. ‘ఫిలిప్ మోరిస్ ఇంటర్నేషనల్’ కంపెనీ తన వెబ్సైట్లో ‘డిజైనింగ్ స్మోక్ ఫ్రీ ఫ్యూచర్’ అని చెప్పుకుంటోంది. అంతేకాదు, సిగరెట్ల తయారీలో ప్రపంచంలోనే అతిపెద్ద సంస్థ అయిన తమ కంపెనీ ‘మానేయడానికి’ ప్రయత్నిస్తోందంటూ ఈ ఏడాది వాణిజ్య ప్రకటనలను కూడా విడుదల చేసింది. ఇక్కడ ‘డిజైనింగ్ స్మోక్ ఫ్రీ ఫ్యూచర్’ అంటే పొగ రహిత భవిష్యత్తు కోసం అని అర్థం. సిగరెట్ల ఉత్పత్తిని మానేసేందుకు ప్రయత్నిస్తున్నామంటే వాటి స్థానంలో తక్కువ హానికరమైన మరో ప్రత్యామ్నాయం కోసం ప్రయత్నిస్తున్నామని అర్థం. ‘ఇక్కడ స్మోక్ ఫ్రీ, టొబాకో ఫ్రీ’ అనే పదాలకు మధ్య ఎంతో వ్యత్యాసం కనిపిస్తోంది. ఫిలిప్ మోరిస్ కంపెనీ ‘స్మోక్ ఫ్రీ’ అని చెబుతుందిగానీ ‘టొబాకో ఫ్రీ’ అని చెప్పడం లేదు. పొగరాని ఉత్పత్తులను తీసుకొస్తాంగానీ పొగాకులేని ఉత్పత్తులు తీసుకరామని కంపెనీ ఉద్దేశంగా కనిపిస్తోంది. ధూమపానం నియంత్రణ కోసం కషి చేస్తున్న ‘స్మోక్ ఫ్రీ వరల్డ్’కు తాము చిత్తశుద్ధితోనే విరాళాలు ఇస్తున్నామని అంతర్జాతీయ సదస్సలో గొడవ జరగడంతో ఫిలిప్ మోరిస్ కంపెనీ సమర్థించుకుంది. హానికరమైన ఉత్పత్తులపై చర్చ జరగాలని, వాటిని నియంత్రించేందుకు, అవసరమైన విధాన నిర్ణయాలు వెలువడేందుకు, తక్కువ హానికరమైన ఉత్పత్తులు మార్కెట్లోకి రావడానికి ఈ చర్చలు దోహద పడతాయని ఫిలిప్ మోరిస్ ఇంటర్నేషనల్ సీఈవో ఆండ్రీ కలాంట్జోపౌలస్ చెప్పారు. ఇలాంటి చర్చల ఫలితంగానే తాము తక్కువ హానికరమైన, తక్కువ వేడినిచ్చే సన్నటి సెగరెట్లను ‘ఐక్యూఓఎస్’ బ్రాండ్ పేరిట విడుదల చేశామని చెప్పారు. ఇప్పటికీ తమదీ ‘స్మోక్ ఫ్రీ ఫ్యూచర్’ అన్నదే నినాదమని ఆయన సమర్థించుకున్నారు. ‘స్వేచ్ఛగా ధూమపానం చేయండి’ అన్నది ఆయన మాటల్లోని అంతర్లీనార్థమేమో!. -
12 నెలలు సూచనలు
‘‘గ్లామర్ ఫీల్డ్‌లో ఉంది.. మహా అయితే నటించగలదు, డ్యాన్స్ చేయగలదు.. వాక్చాతుర్యం ఉంటుందా? అని తనను తక్కువ అంచనా వేసినవాళ్లకు ప్రియాంకా చోప్రా షాకిచ్చారు. ‘బ్యూటీ విత్ బ్రెయిన్’ అనేలా మాట్లాడి, అందర్నీ అబ్బురపరిచారు. ఓ ప్రముఖ పబ్లిషింగ్ సంస్థ నిర్వహించిన ‘యాన్యువల్ లెక్చర్’లో భాగంగా మాట్లాడటానికి ఆమెను ఆహ్వానించారు. రచయితలు, కథకుల మధ్య జరిగే సదస్సులో ప్రియాంక ఏం మాట్లాడతారని కొందరు పెదవి విరిచారు. కానీ, తన అద్భుతమైన స్పీచ్‌తో అందర్నీ ఆకట్టుకున్నారు. ‘‘మన ఆశలను, మన కలలను నిజం చేసుకోవాలంటే మనం బెస్ట్ అయ్యుండాలి. బెస్ట్ అనిపించుకోవాలంటే కొన్ని పాటించాలి’’ అంటూ ప్రియాంక కొన్ని సూచనలు కూడా చెప్పారు. ధైర్యంగా నిలబడగలగటం: మనం కన్న కలలకి, ఆశయాలకి మొట్టమొదటి శత్రువు మనలోని భయమే. ఆ భయంతో పోరాడాలి. ధైర్యంగా నిలబడి, గెలవాలి. సరైన నిర్ణయాలు తీసుకోగలగటం: మనం ఏం కావాలనుకుంటున్నామో అవి మనం తీసుకున్న నిర్ణయాల మీద ఆధారపడి ఉంటుంది. అవకాశాల్ని అందిపుచ్చుకోండి: అవకాశాలు తరచుగా రావు. చాలా అరుదు. అందుకే దొరికిన వాటిని అందిపుచ్చుకోండి. స్వార్థంగా ఉండండి: ‘ఇది లేక అది... ఏదో ఒకటి’ అంటూ మన కళ్ల ముందు ఒక్కోసారి రెండు చాయిస్‌లు ఉంటాయి. అలాంటి సందర్భాల్లో స్వార్థంగా ఉండండి. రెంటినీ సద్వినియోగం చేసుకోండి. కాంప్రమైజ్ కావద్దు: మీకు నచ్చిన విషయాల్లో అస్సలు కాంప్రమైజ్ కావద్దు. నిర్ణయాలు మీరు తీసుకోవాలి తప్ప పరిస్థితులు లేదా ఇంకొకరు కాదు. ఫెయిల్ అవ్వండి.. ఫెయిల్ అవుతూనే ఉండండి: మీరు ఎన్నిసార్లు ఫెయిల్ అయినా బాధపడకండి. ఫీనిక్స్ పక్షిని ఆదర్శంగా తీసుకోండి. ఫెయిల్యూర్స్ నుంచి నేర్చుకుంటూ ముందుకు వెళ్లండి. రిస్క్ తీసుకోండి: మనం ఎంత గొప్ప విజయం సాధించాలంటే అంత గొప్ప రిస్క్ తీసుకోవాలి అని నమ్ముతాను నేను. పాజిటివిటీ: మన సక్సెస్ మన చుట్టూ ఉన్న వారి మీద కూడా ఆధారపడి ఉంటుంది. అందుకే పాజిటివ్ పీపుల్‌తో స్నేహం ఏర్పరచుకోండి. అందర్నీ గెలవలేం: ఒక్కటి గుర్తుపెట్టుకోండి. మనం ఎంత సాధించినా అందర్నీ సంతృప్తిపరచలేం. అందర్నీ గెలవలేం. అవతలివాళ్లు ఏమనుకుంటారో అని ఆలోచించకుండా ముందుకు వెళం్లడి. మిమ్మల్ని మీరు సీరియస్‌గా తీసుకోకండి: మనం ఏం రాకెట్లు తయారు చేయడంలేదు. కూల్‌గా ఉండండి. జీవితాన్ని ఆస్వాదించండి. తిరిగి ఇచ్చేయండి: మన వంతుగా సమాజానికి సహాయం చేయాలి. మార్పు మనతో మొదలవ్వాలి. మూలాల్ని మరువకండి: ఎక్కణ్ణుంచి వచ్చామన్నది మరచిపోవద్దు. కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాం. ఏడాదికి 12 నెలలు. ప్రియాంక కూడా 12 సూచనలు చెప్పారు. ఒక్కో నెల ఒక్కటి ఫాలో అయినా ‘మనం బెస్ట్’ అనిపించుకోవచ్చేమో. -
లక్ష్యాలను పూర్తిచేసే వరకు సెలవుల్లేవ్
ఏలూరు (మెట్రో) : నిర్దేశించిన లక్ష్యాలను అధికారులు పూర్తిచేసే వరకూ జిల్లాలో ఏ ఒక్కరికీ సెలవుల్లేవని కలెక్టర్ కాటంనేని భాస్కర్ చెప్పారు. స్థానిక కలెక్టరేట్లో ప్రాధాన్యతా రంగాల అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగింపు మరో 50 రోజుల్లో పూర్తికానున్న నేపథ్యంలో అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ వివిధ పథకాలలో నిర్దేశించిన లక్ష్యాలు పూర్తి చేయాలని ఆదేశించారు. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి జూన్ మధ్య కాలంలో బడ్జెట్ రాలేదనే సాకుతో ఎలాగూ పనులు చేయరని, ఈ నేపథ్యంలో ఉన్న బడ్జెట్‌తో ఈ 50 రోజులూ పనులు పూర్తి చేయాలన్నారు. ప్రతి ఉద్యాన పంటకూ బిందుసేద్యం ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని ఏపీఎంఐపీ పీడీ శ్రీనివాసరావును ఆదేశించారు. వ్యవసాయం, పశుసంవర్ధక, మత్స్యశాఖ, ఉద్యానవనం వంటి శాఖల అధికారులు రైతులతో ఎఫ్‌పీవోలు ఏర్పాటు చేసి రైతులు పండించిన పంటలు వారే నేరుగా అమ్ముకునే వీలు కల్పించాలన్నారు. రైతులతో సమావేశాలు ఏర్పాటు చేసి వారికి అవసరమైన సలహాలు, సూచనలు అందించాలన్నారు. రైతులకు రుణాలు, ఉపకరణాలు వారి అర్హత మేరకు అందించాలన్నారు. ఈ పంపిణీలో ఏమైనా అవకతవకలు చోటు చేసుకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. అధికారులు ఫామ్‌పాండ్స్ తవ్వించి భూగర్భజలాలు పెంచేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతపురం, కర్నూలు, ప్రకాశం, కడప వంటి జిల్లాల్లో ప్రభుత్వం నిరే్ధశించిన లక్ష్యాలకన్నా బిందుసేద్యం పనులు ముమ్మరంగా సాగుతున్నాయని, ఈ జిల్లాల్లో వారంవారం సమీక్షలు నిర్వహిస్తున్నా బిందు సేద్యం లక్ష్యాలను ఎందుకు పూర్తిచేయలేకపోతున్నారని కలెక్టర్ ప్రశ్నించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ పులిపాటి కోటేశ్వరరావు, సీపీవో బాలకృష్ణ, వ్యవసాయశాఖ జేడీ సాయిలక్షీ్మశ్వరి, మార్కెటింగ్ డీఎం నాగమల్లిక పాల్గొన్నారు. 667 సోలార్ పంపుసెట్లు మంజూరు ఎన్టీఆర్ జలసిరి పథకం ఫేజ్–2లో భాగంగా జిల్లాలో 667 సోలార్ పంపుసెట్లు బ్లాక్‌లు మంజూరయ్యాయని కలెక్టర్ భాస్కర్ చెప్పారు. వీటిలో 351 బ్లాక్‌లలో రైతులకు బోర్లు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. బుధవారం జలసిరి, నీరు–చెట్టు పథకాలకు సంబంధించిన పనులపై అధికారులతో సమీక్షించారు. ఎన్టీఆర్ జలసిరి ఫేజ్–2లో నూతన విధానం ద్వారా ఇప్పటివరకూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ రైతుల నుంచి రూ.5 వేలతో సోలార్ పంపుసెట్లు ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు రూపొందిస్తున్నట్టు చెప్పారు. ప్రభుత్వ నూతన నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ రైతులు రూ.6 వేలు, ఓసీ, బీసీ రైతులు రూ.25 వేలు విరాళం ద్వారా వెంటనే చెల్లించిన వారికి సోలార్ పంపుసెట్లు ఇవ్వనున్నట్టు కలెక్టర్ చెప్పారు. డీఆర్వో హైమావతి, డ్వామా పీడీ ఎం.వెంకటరమణ, ఏపీడీ సత్యనారాయణమూర్తి పాల్గొన్నారు. గడువులోగా సీసీ రోడ్లు నిర్మించాలి జిల్లాలో పంచాయతీరాజ్ నిధులతో నిర్మించే సీసీ రహదారుల నిర్మాణ పనులు నిర్దేశించిన లక్ష్యం ప్రకారం మార్చి 20 నాటికి పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని పంచాయతీరాజ్ ఏఈలను కలెక్టర్ భాస్కర్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో పంచాయతీరాజ్ అధికారులతో సమీక్షించారు. జిల్లాలో మండల సమాఖ్య, అంగన్వాడీ భవనాల నిర్మాణ పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. పునాది దశలో ఉన్న నిర్మాణాలు వారం రోజుల్లో పూర్తి చేయాలని, ప్రారంభించని పనులు వెంటనే ప్రారంభించాలని కలెక్టర్ ఆదేశించారు. ఉపాధిహామీ పథకం ద్వారా నిర్మించాల్సిన సీసీ రోడ్లు త్వరగా పూర్తి చేయాలన్నారు. జిల్లాలో సీసీ రోడ్లు నిర్మాణ పనులు కాంట్రాక్టర్లు ప్రారంభించకుంటే నోటీసులిచ్చి బ్లాక్‌లిస్టులో పెట్టాలని ఆదేశించారు. నిబంధనలకు తూట్లు పొడిస్తే కఠిన చర్యలు జిల్లాలో పంటలు పండుతున్నా వ్యవసాయానికి పనికిరాదంటూ చేపల చెరువులకు అనుమతులు ఇచ్చే అధికారుల ఉద్యోగాలు పోతాయని జిల్లా కలెక్టర్ కాటంనేని భాస్కర్ హెచ్చరించారు. కలెక్టరేట్లో బుధవారం నిర్వహించిన చేపల చెరువుల అనుమతుల కమిటీ అధికారులతో కలెక్టర్ భాస్కర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో చేపల చెరువుల అనుమతుల కోసం వచ్చే దరఖాస్తులను పరిశీలించి ఆ భూమి వ్యవసాయానికి పనికి వస్తుందీ, లేనిదీ చూడాలని, భూసార పరీక్షలు నిర్వహించి పనికిరాదని తేలితే అనుమతులను మంజూరు చేయాలన్నారు. చేపల చెరువుల ఏర్పాటులో ఇన్, అవుట్ డ్రెయిన్లు సక్రమంగా ఉన్నదీ, లేనిదీ ఇరిగేషన్ అధికారులు పరిశీలించి అవి సక్రమంగా ఉంటేనే అనుమతులు మంజూరు చేయాలన్నారు. ఈ సమావేశంలో ఫిషరీస్ డీడీ యాకూబ్ బాషా, వ్యవసాయశాఖ జేడీ వై.సాయిలక్షీ్మశ్వరి, గ్రౌండ్ వాటర్ డీడీ రంగారావు పాల్గొన్నారు. పరిశ్రమలు నెలకొల్పేలా చర్యలు తీసుకోండి జిల్లాలో అనుమతులు మంజూరు చేసిన పరిశ్రమలు త్వరితగతిన నెలకొల్పేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కె.భాస్కర్ ఆదేశించారు. పరిశ్రమల స్థాపనపై అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సింగిల్ డెస్క్ విధానంలో త్వరితగతిన పరిశ్రమలకు అనుమతులు మంజూరు చేస్తున్నప్పటికీ ఇంతవరకూ జిల్లాలో ఆశించినస్థాయిలో పరిశ్రమలు ఎందుకు నెలకొల్పడం లేదని అధికారులను ప్రశ్నించారు. సాధ్యమైనంత వరకూ త్వరితగతిన జిల్లాలో పరిశ్రమలు స్థాపించేలా అధికారులు కృషి చేయాలన్నారు. దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిశీలించి వీలైతే అనుతులు ఇవ్వాలని, లేకుంటే ఏ కారణం చేత తిరస్కరిస్తున్నారో తెలిపి తిరస్కరించాలని ఆదేశించారు. జిల్లాలో ఇంకా 38 పరిశ్రమల అనుమతులు పెండింగ్‌లో ఉన్నాయని, వాటిపై త్వరితగతిన నిర్ణయం తీసుకోవాలన్నారు. రైల్వే ట్రాక్‌ల వెంబడి చేసే నిర్మాణాలకు రైల్వే ప్రాపర్టీ హద్దు నుంచి 30 మీటర్లు విడిచి నిర్మాణాలు చేపట్టాలనే నిబంధన ఉందని అధికారులు చెప్పడంపై కలెక్టర్ స్పందిస్తూ నష్టపోయిన సొంత భూమికి నష్టపరిహారం ఎవరిస్తారని ప్రశ్నించారు. దీనిపై ఒక నివేదిక తయారు చేయాలని చెప్పారు. -
లక్ష్యాలను పూర్తిచేసే వరకు సెలవుల్లేవ్
ఏలూరు (మెట్రో) : నిర్దేశించిన లక్ష్యాలను అధికారులు పూర్తిచేసే వరకూ జిల్లాలో ఏ ఒక్కరికీ సెలవుల్లేవని కలెక్టర్ కాటంనేని భాస్కర్ చెప్పారు. స్థానిక కలెక్టరేట్లో ప్రాధాన్యతా రంగాల అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగింపు మరో 50 రోజుల్లో పూర్తికానున్న నేపథ్యంలో అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ వివిధ పథకాలలో నిర్దేశించిన లక్ష్యాలు పూర్తి చేయాలని ఆదేశించారు. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి జూన్ మధ్య కాలంలో బడ్జెట్ రాలేదనే సాకుతో ఎలాగూ పనులు చేయరని, ఈ నేపథ్యంలో ఉన్న బడ్జెట్‌తో ఈ 50 రోజులూ పనులు పూర్తి చేయాలన్నారు. ప్రతి ఉద్యాన పంటకూ బిందుసేద్యం ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని ఏపీఎంఐపీ పీడీ శ్రీనివాసరావును ఆదేశించారు. వ్యవసాయం, పశుసంవర్ధక, మత్స్యశాఖ, ఉద్యానవనం వంటి శాఖల అధికారులు రైతులతో ఎఫ్‌పీవోలు ఏర్పాటు చేసి రైతులు పండించిన పంటలు వారే నేరుగా అమ్ముకునే వీలు కల్పించాలన్నారు. రైతులతో సమావేశాలు ఏర్పాటు చేసి వారికి అవసరమైన సలహాలు, సూచనలు అందించాలన్నారు. రైతులకు రుణాలు, ఉపకరణాలు వారి అర్హత మేరకు అందించాలన్నారు. ఈ పంపిణీలో ఏమైనా అవకతవకలు చోటు చేసుకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. అధికారులు ఫామ్‌పాండ్స్ తవ్వించి భూగర్భజలాలు పెంచేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతపురం, కర్నూలు, ప్రకాశం, కడప వంటి జిల్లాల్లో ప్రభుత్వం నిరే్ధశించిన లక్ష్యాలకన్నా బిందుసేద్యం పనులు ముమ్మరంగా సాగుతున్నాయని, ఈ జిల్లాల్లో వారంవారం సమీక్షలు నిర్వహిస్తున్నా బిందు సేద్యం లక్ష్యాలను ఎందుకు పూర్తిచేయలేకపోతున్నారని కలెక్టర్ ప్రశ్నించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ పులిపాటి కోటేశ్వరరావు, సీపీవో బాలకృష్ణ, వ్యవసాయశాఖ జేడీ సాయిలక్షీ్మశ్వరి, మార్కెటింగ్ డీఎం నాగమల్లిక పాల్గొన్నారు. 667 సోలార్ పంపుసెట్లు మంజూరు ఎన్టీఆర్ జలసిరి పథకం ఫేజ్–2లో భాగంగా జిల్లాలో 667 సోలార్ పంపుసెట్లు బ్లాక్‌లు మంజూరయ్యాయని కలెక్టర్ భాస్కర్ చెప్పారు. వీటిలో 351 బ్లాక్‌లలో రైతులకు బోర్లు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. బుధవారం జలసిరి, నీరు–చెట్టు పథకాలకు సంబంధించిన పనులపై అధికారులతో సమీక్షించారు. ఎన్టీఆర్ జలసిరి ఫేజ్–2లో నూతన విధానం ద్వారా ఇప్పటివరకూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ రైతుల నుంచి రూ.5 వేలతో సోలార్ పంపుసెట్లు ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు రూపొందిస్తున్నట్టు చెప్పారు. ప్రభుత్వ నూతన నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ రైతులు రూ.6 వేలు, ఓసీ, బీసీ రైతులు రూ.25 వేలు విరాళం ద్వారా వెంటనే చెల్లించిన వారికి సోలార్ పంపుసెట్లు ఇవ్వనున్నట్టు కలెక్టర్ చెప్పారు. డీఆర్వో హైమావతి, డ్వామా పీడీ ఎం.వెంకటరమణ, ఏపీడీ సత్యనారాయణమూర్తి పాల్గొన్నారు. గడువులోగా సీసీ రోడ్లు నిర్మించాలి జిల్లాలో పంచాయతీరాజ్ నిధులతో నిర్మించే సీసీ రహదారుల నిర్మాణ పనులు నిర్దేశించిన లక్ష్యం ప్రకారం మార్చి 20 నాటికి పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని పంచాయతీరాజ్ ఏఈలను కలెక్టర్ భాస్కర్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో పంచాయతీరాజ్ అధికారులతో సమీక్షించారు. జిల్లాలో మండల సమాఖ్య, అంగన్వాడీ భవనాల నిర్మాణ పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. పునాది దశలో ఉన్న నిర్మాణాలు వారం రోజుల్లో పూర్తి చేయాలని, ప్రారంభించని పనులు వెంటనే ప్రారంభించాలని కలెక్టర్ ఆదేశించారు. ఉపాధిహామీ పథకం ద్వారా నిర్మించాల్సిన సీసీ రోడ్లు త్వరగా పూర్తి చేయాలన్నారు. జిల్లాలో సీసీ రోడ్లు నిర్మాణ పనులు కాంట్రాక్టర్లు ప్రారంభించకుంటే నోటీసులిచ్చి బ్లాక్‌లిస్టులో పెట్టాలని ఆదేశించారు. -
అట్టహాసంగా జాతీయ సదస్సు ప్రారంభం
వెలుగోడు: అడ్వాన్స్ ఇన్ కెమిస్ట్రీ అనే అంశంపై స్థానిక శ్రీ నీలం సంజీవరెడ్డి డిగ్రీ కళాశాలలో జాతీయ సదస్సు ప్రారంభమైంది. రెండు రోజులు జరిగే ఈ సదస్సుకు మొదటిరోజు శనివారం వివిధ ప్రాంతాల నుంచి గ్రాడ్యుయేటర్లు, అధ్యాపకులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. నంద్యాల రామకృష్ణ విద్యా సంస్థల అధినేత డాక్టర్ రామకృష్ణారెడ్డి జ్యోతిప్రజల్వన చేసి ప్రారంభించారు. హైదరాబాద్‌కు చెందిన ట్రిపుల్ఐటీ కళాశాల ఫ్రొఫెసర్ నాగయ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. అడ్వాన్స్ ఇన్ కెమిస్ట్రీపై విద్యార్థులు, అధ్యాపకులు సుదీర్ఘంగా చర్చించారు. రసాయనరంగంలో వస్తున్న విప్లవాత్మక మార్పులపై స్టాల్స్ ఏర్పాటు చేసి విద్యార్థులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో కాలేజీ కరస్పాండెంట్ రత్నస్వామి, సదస్సు చైర్మన్, కళాశాల ప్రిన్సిపాల్ రాంభూపాల్ చైర్మన్, ఆర్గనైజింగ్ సెక్రటరీ టీఎస్ రాజేంద్రకుమార్, కాలేజీ అధ్యాపకులు పాల్గొన్నారు. -
18న రోబోటిక్, అవయవ మార్పిడి సర్జరీలపై సదస్సు
విజయవాడ (లబ్బీపేట) : ఏస్టర్ రమేష్ అకడమిక్ అలయన్స్ ఆధ్వర్యంలో నిష్ణాతులైన వైద్యులతో వైద్య విద్యా కార్యక్రమాలు నిర్వహించాలని భావించామని, ఆ క్రమంలో ఈనెల 18న జాతీయస్థాయిలో 16 మంది నిష్ణాతులైన వైద్య నిపుణులతో సదస్సు నిర్వహించనున్నట్లు రమేష్ ఆస్పత్రుల మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ పి.రమేష్‌బాబు చెప్పారు. బుధవారం విజయవాడలోని రమేష్ ఆస్పత్రిలో జరిగిన విలేకరుల సమావేశంలో రమేష్‌బాబు మాట్లాడుతూ.. ఈ సదస్సులో రోబోటిక్ సర్జరీలు, అవయవ మార్పిడి శస్త్రచికిత్సపై సింపోజియం నిర్వహించడంతోపాటు ప్రస్తుత వైద్య విధానాల్లో ఆధునిక పద్ధతులపై వైద్యులకు అవగాహన కలిగించనున్నట్లు వెల్లడించారు. ఏపీలోని ఆరు జిల్లాల నుంచి వైద్యులు పాల్గొంటారని, ప్రారంభోత్సవంలో వైద్యశాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ ముఖ్యఅతిథిగా హాజరవుతారని వివరించారు. చిన్న గాటుతో రోగి త్వరగా కోలుకునే చికిత్సలు ఇప్పుడు రోబోటిక్ సర్జరీల రూపంలో అభివృద్ధి చెందిన దేశాల్లో అందుబాటులో ఉన్నాయని, వాటిని ఇప్పుడిప్పుడే మన దేశానికి తీసుకొస్తున్నామని చెప్పారు. నవ్యాంధ్రలో ఏస్టర్ రమేష్ ఆస్పత్రి ఈ పరిజ్ఞానాన్ని మొట్టమొదటిసారిగా అవలంబించాలని సంకల్పించినట్లు వెల్లడించారు. గుండె, కిడ్నీ, లివర్ వంటి అవయవ మార్పిడి చికిత్సలు, మినమల్ యాక్సస్ గుండె బైపాస్ సర్జరీలు, కాస్మోటిక్ సర్జరీలు, గ్యాస్ట్రో ఇంటెసై్టనల్ అంకాలజీ సర్జరీలు గుంటూరు, విజయవాడల్లో తర్వలోనే నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. ఆయా సర్జరీలపై ఈ సదస్సులో అవగాహన కలిగించనున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో ఆస్పత్రి జీఎం డాక్టర్ సుదర్శన్, మెడికల్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస్, ఏజీఎం డాక్టర్ జె.రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
10న ప్రజాస్వామ్య పరిరక్షణ సదస్సు
న్యూశాయంపేట : కేంద్ర ప్రభుత్వ విధానాలు వ్యతిరేకిస్తూ, ప్రజాసామ్య పరిరక్షణ కోసం ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ఈ నెల 9న ధర్నా, 10న సుప్రీం కోర్టు ఎదుటనున్న ఇండియన్ సొసైటీ ఆఫ్ ఇంటర్నేషనల్ లా ఆడిటోరియంలో సదస్సు నిర్వహించనున్నారు. ఈమేరకు పౌరహక్కుల సంఘం జిల్లా అధ్యక్షుడు అనంతుల సురేష్, ప్రధాన కార్యదర్శి పెంట రమేష్ మంగళవారం సంయుక్త ప్రకటనలో తెలిపారు. దేశంలోని 19 రాష్ట్రాల ప్రజాహక్కుల సంఘాలు కలిసి ప్రజాస్వామిక హక్కుల సమన్వయ సంస్థ ఐక్యవేదికగా ఏర్పడి ఈ సదస్సు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. సదస్సును విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. -
విశాఖలో చినరాజప్ప సమీక్ష
విశాఖపట్నం: ఈ నెల 19న జరగనున్న రెండవ ప్రపంచ కాంగ్రెస్ విపత్తు నిర్వాహణ సదస్సు కోసం జరుగుతున్న ఏర్పాట్లపై ఉప ముఖ్యమంత్రి చిన రాజప్ప గురువారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ నెల 19 నుంచి 22 వరకు నాలుగు రోజుల పాటు జరగనున్న ఈ సమావేశానికి ప్రపంచంలోని 43 దేశాలకు చెందిన 150 మంది విదేశి ప్రతినిధులు హాజరుకానున్నారు. ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న 28 విపత్తులకు సంబంధించిన అంశాలు, వాటిని ఎదుర్కోవడానికి అనుసరించవలసిన మార్గాలు అనే అంశాలపై ఏయూ కాన్వకేషన్ హాల్లో ఈ సదస్సు జరగనుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లపై ఉప ముఖ్యమంత్రి చిన రాజప్ప అధికారులతో సమావేశమై చర్చించారు.