అట్టహాసంగా జాతీయ సదస్సు ప్రారంభం
Published Sun, Jan 29 2017 12:12 AM | Last Updated on Tue, Sep 5 2017 2:21 AM
వెలుగోడు: అడ్వాన్స్ ఇన్ కెమిస్ట్రీ అనే అంశంపై స్థానిక శ్రీ నీలం సంజీవరెడ్డి డిగ్రీ కళాశాలలో జాతీయ సదస్సు ప్రారంభమైంది. రెండు రోజులు జరిగే ఈ సదస్సుకు మొదటిరోజు శనివారం వివిధ ప్రాంతాల నుంచి గ్రాడ్యుయేటర్లు, అధ్యాపకులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. నంద్యాల రామకృష్ణ విద్యా సంస్థల అధినేత డాక్టర్ రామకృష్ణారెడ్డి జ్యోతిప్రజల్వన చేసి ప్రారంభించారు. హైదరాబాద్‌కు చెందిన ట్రిపుల్‌ఐటీ కళాశాల ఫ్రొఫెసర్ నాగయ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. అడ్వాన్స్ ఇన్ కెమిస్ట్రీపై విద్యార్థులు, అధ్యాపకులు సుదీర్ఘంగా చర్చించారు. రసాయనరంగంలో వస్తున్న విప్లవాత్మక మార్పులపై స్టాల్స్ ఏర్పాటు చేసి విద్యార్థులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో కాలేజీ కరస్పాండెంట్ రత్నస్వామి, సదస్సు చైర్మన్, కళాశాల ప్రిన్సిపాల్ రాంభూపాల్ చైర్మన్, ఆర్గనైజింగ్ సెక్రటరీ టీఎస్ రాజేంద్రకుమార్, కాలేజీ అధ్యాపకులు పాల్గొన్నారు.
Advertisement