సాక్షి, హైదరాబాద్: దక్షిణాది రాష్ట్రాల్లోని బీసీ కమిషన్లతో త్వరలో సదస్సు నిర్వహించనున్నట్లు తెలంగాణ బీసీ కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్ వెల్లడించారు. ఈ దిశగా ఏర్పాట్లు వేగవంతం చేశామన్నారు. కర్ణాటక రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ జయప్రకాశ్ హెగ్డే నేతృత్వంలోని బృందం గురువారం రాష్ట్రానికి వచ్చింది. తెలంగాణ బీసీ కమిషన్ కార్యా లయాన్ని సందర్శించింది. ఇక్కడ అమలు చేస్తున్న సంక్షేమ పథకాల తీరును అడిగి తెలుసుకుంది.
ఈ సందర్భంగా రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ మాట్లాడుతూ దక్షిణాది రాష్ట్రాల సదస్సును విజయవంతం చేయాలని కోరారు. తెలంగాణ రాష్ట్రం ఇటీవల జారీ చేసిన టరమ్స్ ఆఫ్ రిఫరెన్స్ ఆధారంగా నిర్ధిష్టమైన పద్దతిలో అధ్యయనం ప్రారంభించామన్నారు. ఈ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నట్లు తెలిపారు. బీసీలకు బాసటగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుందని ఆయన వివరించారు. అనంతరం టీ–బీసీ కమిషన్ సభ్యులు కిషోర్‌గౌడ్, సీహెచ్ ఉపేంద్ర, శుభప్రద్‌పటేల్ తదితరులు కర్నాటక ప్రతినిధి బృందానికి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment