
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్‌గా డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్‌ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. కమిషన్‌కు సభ్య కార్యదర్శిగా బీసీ సంక్షేమ శాఖ కమిషనర్ వ్యవహరించనుం డగా..కమిషన్ సభ్యులుగా సీహెచ్. ఉపేంద్ర, శుభప్రద్‌పటేల్, కె.కిషోర్‌గౌడ్‌లు ఉంటారు. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ సోమవారం నోటిఫికేషన్ జారీ చేశారు. పూర్తిస్థాయి ఉత్తర్వులు త్వరలో జారీ చేయనున్నారు. రాష్ట్ర అవతరణ తర్వాత తొలి బీసీ కమిషన్‌లో సభ్యులుగా వకుళాభరణం సేవలందించిన సంగతి తెలిసిందే.