విశాఖలో చినరాజప్ప సమీక్ష | World Conference on Disaster Management | Sakshi
Sakshi News home page

విశాఖలో చినరాజప్ప సమీక్ష

Published Thu, Nov 5 2015 1:30 PM | Last Updated on Sun, Sep 3 2017 12:04 PM

World Conference on Disaster Management

విశాఖపట్నం: ఈ నెల 19న జరగనున్న రెండవ ప్రపంచ కాంగ్రెస్ విపత్తు నిర్వాహణ సదస్సు కోసం జరుగుతున్న ఏర్పాట్లపై ఉప ముఖ్యమంత్రి చిన రాజప్ప గురువారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ నెల 19 నుంచి 22 వరకు నాలుగు రోజుల పాటు జరగనున్న ఈ సమావేశానికి ప్రపంచంలోని 43 దేశాలకు చెందిన 150 మంది విదేశి ప్రతినిధులు హాజరుకానున్నారు.

ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న 28 విపత్తులకు సంబంధించిన అంశాలు, వాటిని ఎదుర్కోవడానికి అనుసరించవలసిన మార్గాలు అనే అంశాలపై ఏయూ కాన్వకేషన్ హాల్లో ఈ సదస్సు జరగనుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లపై ఉప ముఖ్యమంత్రి చిన రాజప్ప అధికారులతో సమావేశమై చర్చించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement