Disaster management
-
ఉత్తరాంధ్ర మీదుగా తీరం దాటనున్న వాయుగుండం!
సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడుతోందని, ఇది వాయుగుండంగా మారి 24 గంటల్లో ఉత్తరాంధ్ర జిల్లాల మీదుగా తీరాన్ని దాటే అవకాశాలున్నాయని విశాఖలోని తుఫాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు. పశ్చిమ మధ్య, వాయువ్య బంగాళాఖాతంపై ఏర్పడిన ఈ అల్పపీడనం ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా మధ్యలో తీవ్ర అల్పపీడనంగా బలపడి, పశ్చిమ వాయువ్య దిశగా నెమ్మదిగా కదులుతోందని చెప్పారు. ఇది తీరాన్ని దాటిన అనంతరం తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ మీదుగా ప్రయాణించి బలహీనపడుతుందని వెల్లడించారు. దీని ప్రభావంతో శని, ఆది వారాల్లో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి, ఏలూరు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, డా.అంబేడ్కర్ కోనసీమ, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలు, కృష్ణా, బాపట్ల, గుంటూరు, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశాలున్నట్లు అధికారులు తెలిపారు. తీరం వెంబడి గంటకు 55 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని తెలిపారు. వాయుగుండం, భారీ వర్షాల నేపథ్యంలో మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్ళకూడదని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ కూర్మనాథ్ సూచించారు. -
ఇక పిడుగుల మోతతో వానలు
సాక్షి, విశాఖపట్నం/అనంతపురం (అగ్రికల్చర్): రాష్ట్రంలో పిడుగులు మోత మోగించనున్నాయి. రానున్న ఐదు రోజులు ఇవి దడ పుట్టించనున్నాయి. రెండు మూడు మినహా మిగిలిన జిల్లాల్లో పిడుగులు ప్రభావం చూపనున్నాయి. మరోవైపు రాష్ట్రంలో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నాయి. ప్రస్తుతం సముద్ర మట్టానికి 3.1, 5.8 కి.మీ. మధ్య ఉన్న గాలుల కోత, షీర్ జోన్ కొనసాగుతున్నాయి. ఫలితంగా బుధ, గురువారాల్లో అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, కోనసీమ, తూర్పు, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. శుక్రవారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలకు ఆస్కారం ఉందని పేర్కొంది. అదే సమయంలో వానలు, ఉరుములు, మెరుపులతోపాటు పిడుగులు కూడా సంభవిస్తాయంది. ‘అనంత’లో వర్షాలుజిల్లాలో వర్షాలు కొనసాగుతున్నాయి. సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు జిల్లాలోని 29 మండలాల పరిధిలో వర్షం కురిసింది. ఉరవకొండలో 29.6 మి.మీ, పామిడిలో 20.4 మి.మీ, వజ్రకరూరులో 20.2 మి.మీ, గార్లదిన్నెలో 20 మి.మీ. చొప్పున వర్షపాతాలు నమోదయ్యాయి. పెద్దవడుగూరు, శింగనమల, గుంతకల్లు, యాడికి, పుట్లూరు, యల్లనూరు, గుత్తి, రాయదుర్గం, అనంతపురం, బుక్కరాయసముద్రం, ఆత్మకూరు, నార్పల తదితర మండలాల్లో మోస్తరు వర్షం కురిసింది. -
ఏపీలో రేపటి నుంచి భారీ వర్షాలు
సాక్షి, అమరావతి: రాబోవు రెండు, మూడు రోజుల్లో నైరుతి రుతు పవనాలు కేరళ, కర్ణాటక, తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లో ముందుకు సాగాడానికి అలాగే రాయలసీమలో ప్రవేశించడానికి పరిస్థితులు అనుకులంగా ఉన్నాయని విపత్తుల సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు. కోస్తాంధ్ర ప్రాంతంలో ఆవర్తనం విస్తరించి ఉందని దీని ప్రభావంతో రాగల నాలుగు రోజులు అక్కడక్కడ భారీవర్షాలు పడే అవకాశం ఉందన్నారు. రేపు రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడనున్నట్లు తెలిపారు. లోతట్టు ప్రాంత ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు.అల్లూరి సీతారామరాజు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు,తిరుపతి జిల్లాల్లో రేపు(ఆదివారం) అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామ రాజు, కృష్ణ, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, వైఎస్ఆర్ , చిత్తూరు జిల్లాల్లో ఎల్లుండి(సోమవారం) అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, శ్రీ సత్యసాయి, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తెలిపాటి జల్లులు కురిసే అవకాశం ఉందన్నారు.అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు కర్నూలు, నంద్యాల, తిరుపతి జిల్లాల్లో జిల్లాల్లో జూన్ 4(మంగళవారం) అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో జూన్ 5(బుధవారం) అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, వైఎస్ఆర్ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.ఉరుములతో కూడిన వర్షం పడేపుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశు-గొర్రెల కాపరులు చెట్ల క్రింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని సూచించారు.శనివారం సాయంత్రం 7 గంటల నాటికి అన్నమయ్య జిల్లా రాజంపేటలో 32.5మిమీ,అనంతపురం జిల్లా గుంతకల్లులో 30.5మిమీ, చిత్తూరు జిల్లా గుడుపల్లెలో 24.2మిమీ, చిత్తూరులో 21మిమీ, తవణంపల్లె 18.7మిమీ,విశాఖ జిల్లా భీమునిపట్నంలో 18.2మిమీ,అల్లూరి జిల్లా కొయ్యురులో 17.7మిమీ, కాకినాడ జిల్లా తొండంగిలో 15.2మిమీచొప్పున వర్షపాతం నమోదైందన్నారు. -
ఎండ ప్రచండం
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు ఉగ్రరూపం దాలుస్తూనే ఉన్నాయి. అసాధారణ ఎండలు జనాన్ని అల్లాడిస్తున్నాయి. కొద్దిరోజులుగా కొన్నిచోట్ల ఉష్ణోగ్రతలు 47 డిగ్రీలు (సాధారణం కంటే 4–7 డిగ్రీలు అధికంగా) నమోదవుతుండగా.. ఇప్పుడు 48 డిగ్రీలకు చేరువగా పయనిస్తున్నాయి. శుక్రవారం రాష్ట్రంలోనే అత్యధికంగా నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు, గోస్పాడుల్లో 47.7 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయింది. ఈ సీజన్లో అత్యధిక ఉష్ణోగ్రత ఇదే. ఇంకా అర్ధవీడు (ప్రకాశం)లో 47.3, చిన్నచెప్పలి (వైఎస్సార్) 47.2, వి.అక్కమాంబపురం (నెల్లూరు) 47.1, పెద్దకన్నాలి (తిరుపతి) 46.9, పంచలింగాల (46.8), తవణంపల్లె (చిత్తూరు), రావిపాడు (పల్నాడు)ల్లో 46 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇంకా 15 జిల్లాల్లో 44 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. 63 మండలాలు తీవ్ర వడగాడ్పులతో అల్లాడిపోగా.. 208 మండలాల్లో వడగాడ్పులు వీచాయి. శనివారం 58 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 169 మండలాల్లో వడగాడ్పులు వీస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఆదివారం మరింత తీవ్ర రూపం దాల్చి 78 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 273 మండలాల్లో వడగాడ్పులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. -
ఏపీ ప్రజలకు అలర్ట్.. రేపు ఈ మండలాల్లో తీవ్ర వడగాల్పులు
గుంటూరు: రాష్ట్రంలో పలు మండలాల్లో తీవ్రవడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. బుధవారం 11 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 134 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని అలాగే ఎల్లుండి 16 మండలంలో తీవ్ర వడగాల్పు అలాగే 92 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్లు విపత్తుల సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్ తెలిపారు. రేపు తీవ్రవడగాల్పులు వీచే అవకాశం ఉన్న మండలాలు(11): మన్యం జిల్లాలో 2 మండలాలు, శ్రీకాకుళం జిల్లాలో 8మండలాలు, విజయనగరం వేపాడ మండలంలో తీవ్రవడగాల్పులు వీచే అవకాశం ఉంది. రేపు వడగాల్పులు వీచే అవకాశం ఉన్న మండలాలు(134): శ్రీకాకుళం జిల్లా 17 మండలాలు, విజయనగరం జిల్లాలో -25, పార్వతీపురంమన్యం-11, అల్లూరిసీతారామరాజు-10, విశాఖపట్నం-3, అనకాపల్లి- 16, కాకినాడ- 10, కోనసీమ- 9, తూర్పుగోదావరి- 19, పశ్చిమగోదావరి- 4, ఏలూరు- 7, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో-2, పల్నాడు అమరావతి మండలంలో వడగాల్పులు వీచే అవకాశం ఉందని చెప్పారు. ప్రజలు వీలైనంతవరకు ఉదయం 11 నుంచి సాయంత్రం 4 వరకు ఇంట్లోనే ఉండాలి, వృద్దులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలి. డీహైడ్రేట్ కాకుండా ఉండటానికి ORS (ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్), ఇంట్లో తయారుచేసిన పానీయాలైనలస్సీ, నిమ్మకాయ నీరు, మజ్జిగ, కొబ్బరి నీరు మొదలైనవి త్రాగాలని విపత్తుల సంస్థ ఎండి కూర్మనాథ్ సూచించారు. మండలాల పూర్తి వివరాలు క్రింది లింక్‌లో -
సిక్కిం వరదలు..18కి చేరిన మరణాలు
గ్యాంగ్‌టక్: సిక్కింలో సంభవించిన ఆకస్మిక వరదల్లో మృతుల సంఖ్య 14కు చేరుకుంది. అదేవిధంగా, 22 మంది ఆర్మీ అధికారులు సహా గల్లంతైన వారి సంఖ్య 98కు పెరిగింది. ఉత్తర సిక్కింలో తీస్తా నదీ పరీవాహక ప్రాంతంలోని ఎల్‌హొనాక్ సరస్సు ఉప్పొంగి సంభవించిన వరదల్లో గల్లంతైన మరో ఆరుగురి మృతదేహాలు లభ్యం కావడంతో మరణాల సంఖ్య 18కు చేరుకుందని రాష్ట్ర విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ(ఎస్‌ఎస్‌డీఎంఏ) గురువారం బులెటిన్‌లో తెలిపింది. ఇప్పటివరకు 2,011 మందిని కాపాడినట్లు పేర్కొంది. గల్లంతైన 22 మంది జవాన్ల ఆచూకీ కోసం దిగువ ప్రాంతాల్లో గాలింపు చర్యలు ముమ్మరం చేశామని వివరించింది. ఇలా ఉండగా, వరదల్లో కొట్టుకువచ్చిన 18 మృతదేహాల్లో నాలుగు జవాన్లవని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం తెలిపింది. ఇవి సిక్కింలో గల్లంతైన జవాన్ల మృతదేహాలా కాదా అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. బుధవారం సంభవించిన ఆకస్మిక వరదలతో చుంగ్థంగ్ డ్యామ్ ధ్వంసం కావడం.. విద్యుత్ మౌలిక వ్యవస్థలు దారుణంగా దెబ్బతినడంతోపాటు నాలుగు జిల్లాల్లోని పలు గ్రామాలు, పట్టణాలు జల దిగ్బంధంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. మంగన్ జిల్లాలోని 8 వంతెనలు సహా మొత్తం 11 బ్రిడ్జీలు వరదల్లో కొట్టుకుపోయాయి. రాష్ట్రానికి గుండెకాయ వంటి పదో నంబర్ రహదారి పలుచోట్ల ధ్వంసమైంది. చుంగ్థంగ్ పట్టణం తీవ్రంగా దెబ్బతింది. తీస్తా నదికి వరద ఉధృతి మరింత పెరిగే అవకాశాలున్నందున, పరీవాహక ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రదేశాలకు చేరుకోవాలని ఎస్‌ఎస్‌డీఎంఏ కోరింది. సిక్కింలోని వేర్వేరు ప్రాంతాల్లో వరదల్లో చిక్కుకుపోయిన వేల మంది పర్యాటకుల్లో విదేశీయులూ ఉన్నారు. -
రామోజీ.. మీ ఆకాంక్షే గాలిలో దీపం
రోజుకో తప్పుడు కథనం.. అంశం ఏదైనా సరే దురుద్దేశం.. వెరసి వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై దుష్ప్రచారం.. ప్రజల్లో విష బీజాలు నింపడమే లక్ష్యం.. చంద్రబాబుకు అనుకూల పరిస్థితి సృష్టించాలన్న తాపత్రయం.. ఇదీ ఈనాడు రామోజీరావు ఆకాంక్ష. ప్రజలేమను కుంటారోనన్న కనీస స్పృహను ఏనాడో వదిలేసిన ఈయన ప్రతిపక్ష నేతపై ఆశలు పెంచుకుని నెట్టుకొస్తూ సరికొత్త పాత్రికేయానికి తెరలేపారు. కళ్లార్పకుండా అబద్ధాలు చెప్పడంలో చంద్రబాబు దిట్ట అయితే, వాటిని ప్రచారం చేయడంలో ఆయన తాత రామోజీ! ఈయన గారి ఆకాంక్ష గాలిలో దీపంలా మిణుకుమిణుకు మంటోందన్నది మాత్రం నిజం. త్వరలో అది ఆరిపోతుందనేది ఇంకా పచ్చి నిజం. సాక్షి, అమరావతి: పచ్చ కామెర్లు సోకిన వాడికి లోకమంతా పచ్చగా కనిపిస్తుందన్న సామెత ఈనాడు రామోజీరావుకు సరిగ్గా అతికినట్లు సరిపోతుంది. విపత్తుల నిర్వహణలో మన రాష్ట్రం దేశానికే రోల్ మోడల్‌గా ఉందనే పచ్చి నిజాన్ని కావాలని విస్మరించి, రాష్ట్రంలో విపత్తుల నిర్వహణ గాలిలో దీపమేనంటూ దుష్ప్రచారానికి దిగడం దుర్మార్గం. బరితెగించి మరీ అబద్ధపు కథనం రాసి తన స్థాయిని మరింత దిగజార్చుకున్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వంపై ఉన్న ఈర్ష, ద్వేషాన్ని వెళ్లగక్కారు. మన విపత్తుల నిర్వహణ విధానం బాగుందని దేశ వ్యాప్తంగా ప్రసంశలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో తెలంగాణ, ఉత్తరాఖండ్ వంటి పలు రాష్ట్రాల అధికారులు ఏపీకి వచ్చి అధ్యయనం చేసి వెళ్లారు. జాతీయ విపత్తుల నిర్వహణ విధానం కంటే రాష్ట్ర విపత్తు నిర్వహణ విధానమే బాగుందని సాక్షాత్తూ ఆ సంస్థే పలు సందర్భాల్లో కితాబిచ్చింది. ఈ వాస్తవాలకు మసిపూసి, అసలు విపత్తుల ప్రణాళికే లేదని ఈనాడు తప్పుడు కథనాన్ని ప్రచురించడం పట్ల సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. మూడు రకాల ప్రణాళికలతో సిద్ధం ప్రకృతి వైపరీత్యాలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మండల, గ్రామ, జిల్లా స్థాయిల్లో పక్కాగా ఏర్పాట్లు చేసింది. ఇందుకోసం ఎప్పటికప్పుడు కార్యాచరణ ప్రణాళికలను రూపొందించుకుని అమలు చేస్తోంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక 2021లో స్టేట్ సైక్లోన్ ప్రిపేర్డ్నెస్ (తుపాను సంసిద్ధత) ప్లాన్, ఫ్లడ్ అట్లాస్ (వరదల కోసం), విపత్తుల సంరక్షణా నియమావళి తయారు చేసింది. రాష్ట్ర స్థాయిలో స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్.. జిల్లా, మండల స్థాయిల్లో ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్లను సాంకేతికంగా అభివృద్ధి చేసింది. ఆధునిక టెక్నాలజీ వ్యవస్థలను వాటికి అనుసంధానించి, ఆ డేటాను విశ్లేషించి.. విపత్తుల సమయంలో వినియోగిస్తున్నారు. ఏపీ అలెర్ట్ విధానంపై దేశం చూపు దేశంలోనే మొదటిసారిగా ఏపీ అలెర్ట్ సిస్టమ్ ఏర్పాటు చేసి, ప్రజలను అప్రమత్తం చేసే మెసేజ్‌లను పంపే విధానాన్ని ఏడాది క్రితం వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రారంభించింది. దీని ద్వారా ఇప్పటి వరకు 8 కోట్ల మెసేజ్‌లను ప్రజలకు పంపారు. తద్వారా తుపానులు, పిడుగులు, వడగాడ్పులు, భారీ వర్షాల సమాచారాన్ని ప్రజలను పంపి అప్రమత్తం చేస్తున్నారు. 5,400 ఆపద మిత్ర వలంటీర్లకు విపత్తుల నిర్వహణపై శిక్షణ ఇచ్చి విపత్తులకు గురయ్యే ప్రాంతాల్లో నియమించారు. గ్రామ, వార్డు సచివాలయ కార్యదర్శులకు సైతం విపత్తుల నిర్వహణపై శిక్షణ ఇచ్చారు. సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ కోసం విపత్తులకు గురయ్యే ప్రతి జిల్లాకు రెస్క్యూ బోట్స్, లైట్స్, పవర్ సాస్, లైఫ్ జాకెట్స్ వంటి పరికరాలను పంపారు. ఈ చర్యల ద్వారా గత నాలుగేళ్లలో విపత్తుల వల్ల జరిగే నష్టాన్ని గణనీయంగా తగ్గించగలిగారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన అలెర్ట్ సిస్టం పనితీరును పరిశీలించేందుకు దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి ప్రత్యేక బృందాలు ఏపీకి వచ్చాయి. ఉత్తరాఖండ్ (17–05–22), ఒడిశా (22–03–22), అస్సాం (18–01–22), తమిళనాడు (23–03–22), తెలంగాణ (19–05–23), ఢిల్లీ–ఎన్డీఎంఏ (01–07–22) అధికారుల బృందాలు తాడేపల్లిలోని స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ వ్యవస్థను సందర్శించాయి. విపత్తు నిర్వహణలో రాష్ట్రం అత్యుత్తమ విధానాలు అమలు చేస్తుందనే దానికి ఇవే నిదర్శనం. ప్రాణ, ఆస్తి నష్టం నివారణ దాదాపు 16 సంవత్సరాల తర్వాత 2022 జూలైలో ధవళేశ్వరం బ్యారేజి వద్ద 22,58,895 క్యూసెక్కుల స్థాయికి వరద ప్రవాహం చేరింది. విపత్తుల ప్రణాళిక ప్రకారం ముందస్తు చర్యలు తీసుకోవడం ద్వారా అప్పుడు ప్రాణ, ఆస్తి నష్టాన్ని బాగా తగ్గించగలిగారు. 48 గంటలు ముందుగానే వరద ప్రభావంతో ముంపునకు గురయ్యే గ్రామాలను రిమోట్ సెన్సింగ్, జీఐఎస్ ద్వారా గుర్తించి ఆ జిల్లాల కలెక్టర్లకు సమాచారం ఇచ్చారు. రాష్ట్రంలోని బ్యారేజీల వద్దకు, ప్రాజెక్టుల నుంచి ఎన్ని క్యూసెక్కుల నీరు విడుదలైతే ఎన్ని మండలాలు, ఎన్ని గ్రామాలు ముంపునకు గురవుతాయనే సమాచారాన్ని జిల్లా కలెక్టర్లకు పంపుతున్నారు. క్షేత్ర స్థాయిలో సమర్థవంతమైన వ్యవస్థ రాష్ట్రంలో అధికార వికేంద్రీకరణ జరగడం వల్ల క్షేత్ర స్థాయిలో ప్రభుత్వ వ్యవస్థలన్నీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా బలోపేతమయ్యాయి. జిల్లాల విభజన వల్ల కలెక్టర్లు, జేసీలు, ఎస్పీల సంఖ్య పెరిగింది. ఫలితంగా విపత్తుల నిర్వహణ సహా అనేక ప్రభుత్వ పాలనా కార్యక్రమాలు వేగంగా, చురుగ్గా జరిగేందుకు ఆస్కారం ఏర్పడింది. రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనలో విప్లవాత్మకంగా ప్రారంభించిన గ్రామ, వార్డు సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థ, ప్రజల ముంగిటకే ప్రభుత్వ సేవలను అందిస్తున్నాయి. ప్రతి 2 వేల జనాభాకు 10, 11 మంది ప్రభుత్వ ఉద్యోగులు, వీరికి అనుబంధంగా ప్రతి 50 ఇళ్లకు ఒక వలంటీర్ సేవలు అందిస్తున్నారు. విపత్తుల సమయంలో వీరు అందిస్తున్న సేవలు ప్రజల మన్ననలు పొందుతున్నాయి. ప్రజలను అప్రమత్తం చేయడం, సహాయ, పునరావాస కార్యక్రమాలు, బాధితులకు తోడుగా నిలవడం, సహాయ శిబిరాల నిర్వహణ వంటి పనుల్ని అత్యంత వేగంగా, మెరుగ్గా చేపడుతున్నారు. గత ఏడాది గోదావరి వరదల సమయంలో గ్రామ సచివాలయాల వ్యవస్థ, వలంటీర్ల వ్యవస్థ గొప్పగా సేవలు అందించింది. తద్వారా ప్రాణ, ఆస్తి నష్టాన్ని నివారించడంలో దోహదపడ్డారు. గతం కంటే మిన్నగా సాయం జాతీయ విపత్తు నిర్వహణ మార్గదర్శకాల కన్నా మిన్నగా రాష్ట్ర ప్రభుత్వం సహాయం అందిస్తోందనేది జగమెరిగిన సత్యం. విపత్తు సంకేతాలు వచ్చిన వెంటనే ఆయా జిల్లాల కలెక్టర్లకు నిధులు విడుదల చేస్తోంది. గత ప్రభుత్వ హయాంలో ఈ నిధులు ఇవ్వక కలెక్టర్లు, అధికారులు నానా యాతన పడేవారు. చివరకు సహాయ కార్యక్రమాలు చేపట్టలేక బాధితులు కన్నీటి పర్యంతమయ్యేవారు. ఈ ప్రభుత్వం ఆ పరిస్థితిని మార్చేసింది. తాజా గోదావరి వరదల్లో కూడా రూ.31.71 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన విడుదల చేసింది. కేంద్ర మార్గదర్శకాల్లో లేకపోయినా ఇళ్లలోకి నీళ్లు చేరితే చాలు ప్రతి కుటుంబానికి రూ.2 వేలు అందిస్తోంది. గతంలో ఈ నగదు సహాయం ఇచ్చే వారు కాదు. వీటితోపాటు బియ్యం, ఇతర నిత్యావసర వస్తువులు, కూరగాయలు, పాలను నేరుగా బాధితుల ఇళ్లకు అందించేలా చర్యలు తీసుకుంది. కచ్చా ఇళ్లు దెబ్బతింటే కేంద్ర మార్గదర్శకాల ప్రకారం ఇవ్వాల్సిన సహాయం రూ.5 వేలు కాగా, రాష్ట్ర ప్రభుత్వం రూ.10 వేలు ఇస్తోంది. పంట నష్టపోతే ఆ సీజన్ ముగిసేలోగానే ఇన్పుట్ సబ్సిడీని అందిస్తోంది. గత ప్రభుత్వంలో ఇలాంటి సహాయ కార్యక్రమం ఎప్పుడూ జరగలేదన్న విషయం మీకు తెలియదా రామోజీ? అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా.. ► టీడీపీ అధికారంలో ఉన్న 2014–19 సంవత్సరాల్లో హుదుద్, తిత్లి తుపానులతో సహా విపత్తుల సహాయ చర్యల కోసం విడుదల చేసిన మొత్తం నిధులు రూ.2014 కోట్లు మాత్రమే. 2019–23 మధ్య వైఎస్ జగన్ ప్రభుత్వం సహాయక చర్యల కోసం రూ.2422 కోట్లు విడుదల చేసింది. ► టీడీపీ హయాంలో రెస్క్యూ కార్యకలాపాల కోసం అసలు బడ్జెట్ విడుదల చేయనేలేదు. ఈ నాలుగేళ్లలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఇందుకు రూ.1969.83 కోట్లు విడుదల చేసింది. చంద్రబాబు తన పాలనలో విపత్తులప్పుడు సహాయ శిబిరాల్లో ఉన్న కుటుంబాలకు ప్రత్యేక ఆర్థిక సహాయం గురించి పట్టించుకోలేదు. జగన్ అధికారంలోకి వచ్చాక ఒక్కో కుటుంబానికి రూ.2 వేల వరకు ప్రత్యేక ఆర్థిక సహాయం అందిస్తున్నారు. ► బియ్యం, నూనె, ఉల్లి, కిరోసిన్ మొదలైన నిత్యావసర సరుకులు 2014–19 మధ్య హుద్ హుద్, తిత్లీ తుపాను సమయంలో మాత్రమే ఇచ్చారు. ఈ ప్రభుత్వం 2020, 2021, 2023 సంవత్సరాల్లో రాష్ట్రం ఎదుర్కొన్న అన్ని విపత్తుల్లోనూ నిత్యావసర సరుకులు అందించింది. ► చంద్రబాబు హయాంలో ఇన్పుట్ సబ్సిడీ సకాలంలో చెల్లించలేదు. 2019 నుంచి ప్రస్తుత ప్రభుత్వం వెనువెంటనే చెల్లించింది. -
హెచ్చరిక: ఏపీలో నేడూ భగభగలే.. బయటకు రాకపోవడమే బెటర్
సాక్షి, అమరావతి/విశాఖపట్నం: రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో శనివారం కూడా అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశమున్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ బీఆర్ అంబేడ్కర్ వెల్లడించారు. అల్లూరి జిల్లాలోని నెల్లిపాక, చింతూరు, కూనవరం, వైఎస్సార్ జిల్లాలోని కమలాపురం, వీరపునాయునిపల్లె, ఎర్రగుంట్ల, ఏలూరు జిల్లా కుక్కునూరు, పార్వతీపురం మన్యం జిల్లాలోని కొమరాడ మండలంలో తీవ్ర వడగాడ్పులు వీస్తాయని తెలిపారు. మరో 256 మండలాల్లో వడగాడ్పులు వీచే అవకాశముందన్నారు. విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, అంబేడ్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో శనివారం 45–47 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందన్నారు. అలాగే, శ్రీకాకుళం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో 42–44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందన్నారు. 20 జిల్లాల్లో 42–45 డిగ్రీల ఉష్ణోగ్రతలు మరోవైపు.. శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా ఎండలు మండాయి. 20 జిల్లాల్లో 150 మండలాలకు పైగా 42–45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఫలితంగా అనేక ప్రాంతాల్లో తీవ్ర వడగాడ్పులు వీచాయి. పల్నాడు, కృష్ణా, ఏలూరు, బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, గుంటూరు, కాకినాడ, బాపట్ల, ఎన్టీఆర్, కర్నూలు, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో తీవ్ర వడగాడ్పులు వీచాయి. ఈ జిల్లాల్లో 44 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పల్నాడు జిల్లా రావిపాడులో రాష్ట్రంలోకెల్లా అత్యధికంగా 45 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత రికార్డయింది. అదే జిల్లా ఈపూరు, విజయనగరం జిల్లా కనిమెరకలో 44.9 డిగ్రీలు, ఏలూరు జిల్లా శ్రీరామవరం, ఈదులగూడెంలో 44.8 డిగ్రీలు, ప్రకాశం జిల్లా కొనకనమిట్లలో 44.8 డిగ్రీలు, బాపట్లజిల్లా వల్లపల్లిలో 44.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైంది. ఆయా ప్రాంతాల్లో 50 డిగ్రీలకు పైగా ఉష్ణతీవ్రత ఉన్న అనుభూతి కలిగింది. ఉదయం తొమ్మిది గంటలకే పలుచోట్ల 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. అలా సాయంత్రం ఐదు గంటల వరకూ అదే తీవ్రత కొనసాగింది. వడగాడ్పుల ధాటికి జనం అల్లాడిపోతున్నారు. ఇళ్ల నుంచి బయటకు రావడానికి బెంబేలెత్తిపోతున్నారు. అలాగే, గాలిలో తేమ అధికంగా ఉండడంతో ఉక్కపోత కూడా జనాన్ని ఇబ్బందిపెడుతోంది. ఈనెల 8 వరకు వడగాడ్పుల ప్రభావం కొనసాగుతుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. రానున్న మూడ్రోజులు రాష్ట్రంలోని ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమల్లో సాధారణంకంటే 2–4 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. అదే సమయంలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతోపాటు పిడుగులు సంభవించే అవకాశముందని, గంటకు 40–50 కి.మీల వేగంతో ఈదురుగాలులు కూడా వీస్తాయని వివరించింది. విస్తరిస్తున్న రుతుపవనాలు ఇక నైరుతి రుతుపవనాలు దక్షిణ అరేబియా సముద్రం, మాల్దీవుల్లోని కొన్ని ప్రాంతాలు, లక్షద్వీప్‌లోని కొన్ని ప్రాంతాలకు కొమరిన్‌లోని అన్ని ప్రాంతాలు, దక్షిణ బంగాళాఖాతంలోని కొన్ని భాగాల్లోకి విస్తరించినట్లు వాతావరణ శాఖ తెలిపింది. వచ్చే రెండ్రోజుల్లో మరింత విస్తరించే అవకాశముందని పేర్కొంది. ఇది కూడా చదవండి: ఏపీలో పుష్కలంగా కరెంటు -
మండుతున్న సూరీడు.. ఆ జిల్లాలో అత్యధికంగా 45.1 డిగ్రీల ఉష్ణోగ్రత
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో భానుడు భగభగలాడుతున్నాడు. అధిక ఉష్ణోగ్రతలకు తోడు వేడిగాలులతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గురువారం ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం కసుమూరులో అత్యధికంగా 45.1 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. పల్నాడు, శ్రీకాకుళం, వైఎస్సార్ జిల్లాల్లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. అత్యల్పంగా విశాఖపట్నం (గంభీరం)లో 38.9, కోనసీమ అంబేడ్కర్ జిల్లా(అంగర)లో 39.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వైఎస్సార్ జిల్లా సింహాద్రిపురం, వల్లూరు మండలంలో తీవ్ర వడగాడ్పులు వీచాయని, మరో 27 మండలాల్లో వడగాడ్పులు వీచాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. శుక్రవారం 29 మండలాల్లో వడగాడ్పుల ప్రభావం ఉండనుంది. అనకాపల్లి జిల్లాలో 5, గుంటూరులో ఒకటి, కాకినాడలో ఒకటి, ఎన్టీఆర్ జిల్లాలో 2, పల్నాడులో 2, మన్యంలో 5, విజయనగరంలో 5, వైఎస్సార్ జిల్లాలో 8 మండలాల్లో వడగాడ్పులు వీచే అవకాశం ఉంది. శనివారమూ 33 మండలాల్లో వడగాడ్పులు ఉంటాయని అంచనా వేస్తున్నారు. నేడు 44 నుంచి 45 డిగ్రీల వరకు శుక్రవారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామ రాజు, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 44 నుంచి 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, తూర్పు గోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో 42 నుంచి 43 డిగ్రీలు, అంబేడ్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, శ్రీ సత్యసాయి జిల్లాల్లో 40 నుంచి 41 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉండనున్నాయి. గర్భిణులు, చిన్నారులు, వృద్ధుల విషయంలో జాగ్రత్తలు వహించాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. -
ఏపీలో తీవ్ర వడగాల్పులు.. ఈ జిల్లాల ప్రజలకు వాతావరణశాఖ హెచ్చరిక
సాక్షి, అమరావతి: నేడు రాష్ట్రంలో 127 మండలాల్లో తీవ్రవడగాల్పులు,173 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ తెలిపింది. బుధవారం 92 మండలాల్లో తీవ్ర వడగాల్పులు,190 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. మిగిలిన చోట్ల కూడా ఎండ ప్రభావం చూపే అవకాశం ఉంది. ప్రజలు ఎండ తీవ్రత పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ముఖ్యంగా వృద్దులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పింది. నేడు తీవ్రవడగాల్పులు వీచే అవకాశం ఉన్న మండలాలు(127) : ⇒ అల్లూరి జిల్లా -2 ⇒ అనకాపల్లి -8 ⇒ బాపట్ల -9 ⇒ తూర్పుగోదావరి -17 ⇒ ఏలూరు -3 ⇒ గుంటూరు -13 ⇒ కాకినాడ -18 ⇒ కోనసీమ -15 ⇒ కృష్ణా -18 ⇒ ఎన్టీఆర్ -8 ⇒ పల్నాడు -2 ⇒ మన్యం -1 ⇒ విశాఖ -3 ⇒ పశ్చిమగోదావరి జిల్లాలోని 13 మండలాల్లో తీవ్రవడగాల్పులు, మరో 173 మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపే అవకాశం ఉంది. ⇒ నేడు విజయనగరం, మన్యం, అల్లూరి, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ,ఉభయగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, SPSR నెల్లూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 45°C - 47°Cల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది ⇒ కర్నూలు, నంద్యాల, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 42°C - 44°C ల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. ఆదివారం ఎన్టీఆర్ జిల్లాలో 10 మండలాలు, మిగిలిన చోట్ల మొత్తం 34 మండలాల్లో వడగాల్పులు వీచాయి. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలంలో 44.8°C, ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల మండలంలో 44.7°C ల అధిక ఉష్ణోగ్రతలు నమోదైనవి. -డా.బి.ఆర్ అంబేద్కర్, మేనేజింగ్ డైరెక్టర్, విపత్తుల నిర్వహణ సంస్థ. చదవండి: బంగ్లా తీరాన్ని తాకిన మోకా -
5జీతో విద్య, వైద్యంలో పెను మార్పులు
న్యూఢిల్లీ: అత్యంత వేగవంతమైన 5జీ సర్వీసులతో హెల్త్‌కేర్, విద్య, వ్యవసాయం, విపత్తు నిర్వహణ మొదలైన విభాగాల్లో భారీ మార్పులు రాగలవని టెలికం సంస్థ రిలయన్స్ జియో చైర్మన్ ఆకాశ్ అంబానీ తెలిపారు. వీటితో నగరాలు స్మార్ట్‌గా, సొసైటీలు సురక్షితమైనవిగా మారగలవని ఆయన పేర్కొన్నారు. బడ్జెట్ అనంతర వెబినార్‌లో పాల్గొన్న సందర్భంగా ఆకాశ్ అంబానీ ఈ విషయాలు చెప్పారు. ఆరోగ్యసంరక్షణ రంగంలో 5జీ వినియోగంతో అంబులెన్సులు డేటా, వీడియోను రియల్ టైమ్‌లో వైద్యులకు చేరవేయగలవని, రిమోట్ కన్సల్టేషన్లు, వేగవంతమైన రోగనిర్ధారణ విధానాలతో మారుమూల ప్రాంతాలకు కూడా నాణ్యమైన వైద్య సేవలను అందించడం సాధ్యపడుతుందని పేర్కొన్నారు. వ్యవసాయం విషయానికొస్తే వాతావరణం తీరుతెన్నులు, నేలలో తేమ స్థాయి, పంటల ఎదుగుదల మొదలైన వాటి గురించి డేటా ఎప్పటికప్పుడు పొందడం ద్వారా సరైన సాగు విధానాలు పాటించేందుకు వీలవుతుందని ఆకాశ్ చెప్పారు. అంతిమంగా సమాజంపై 5జీ, అనుబంధ టెక్నాలజీలు సానుకూల ప్రభావాలు చూపగలవని వివరించారు. -
Cyclone Asani: సర్కారు హై అలర్ట్
సాక్షి, అమరావతి: తుపాను తీవ్రత నేపథ్యంలో ముందే అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం హైఅలర్ట్ ప్రకటించింది. అన్ని జిల్లాల అధికార యంత్రాంగాల్ని అప్రమత్తం చేయడంతోపాటు విపత్తుల నిర్వహణ సంస్థ ద్వారా ముందుగానే సహాయక చర్యలకు సిద్ధమైంది. తుపాను ప్రభావం ఎక్కువగా ఉండే ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసింది. మత్స్యకారులు వేటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంది. 65 మండలాల్లోని 555 గ్రామాల్లో రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ముందస్తు సహాయక చర్యలు చేపట్టింది. రాష్ట్రస్థాయిలో స్టేట్ ఎమర్జెన్సీ సెంటర్ 24 గంటలూ పనిచేస్తూ పరిస్థితిని పర్యవేక్షిస్తోంది. అన్ని జిల్లాల ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్లు, మండల ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్లు, 219 మల్టీపర్పస్ సైక్లోన్ సెంటర్లు, 16 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లను క్రియాశీలకం చేశారు. రంగంలోకి ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల కోసం ముందస్తుగా 6 ఎస్డీఆర్ఎఫ్ బృందాలు, 16 ఎన్టీఆర్ఎఫ్ బృందాలను సిద్ధం చేశారు. కాకినాడ జిల్లాకు ఇప్పటికే 2 ఎన్డీఆర్ఎఫ్, 2 ఎస్డీఆర్ఎఫ్ బృందాలను ముందస్తుగా పంపారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు ఒక్కొక్కటి చొప్పున ఎన్డీఆర్ఎఫ్, ఎస్టీఆర్ఎఫ్ బృందాలు, విశాఖకు ఒక ఎన్డీఆర్ఎఫ్, 2 ఎస్డీఆర్ఎఫ్, యానాంకు ఒక ఎన్డీఆర్ఎఫ్, కోనసీమకు ఒక ఎన్డీఆర్ఎఫ్, మచిలీపట్నానికి ఒక ఎన్డీఆర్ఎఫ్ బృందాల్ని పంపించారు. మిగిలిన బృందాలను అవసరమైన చోటుకు పంపేందుకు అందుబాటులో ఉంచారు. తీర ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు తుపాను షెల్టర్లను సిద్ధం చేశారు. అవసరాన్ని బట్టి స్కూళ్లు, కమ్యూనిటీ హాళ్లు, సహాయక శిబిరాలను కూడా గుర్తించారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రణాళికలను ప్రాంతాల వారీగా తయారు చేశారు. టెలీ కమ్యూనికేషన్లు, తాగునీరు, నిత్యావసర వస్తువులు నిల్వ చేసుకోవడం, ట్రాఫిక్‌ను యుద్ధప్రాతిపదికన క్లియర్ చేయడానికి ముందస్తు ప్రణాళికలను జిల్లా యంత్రాంగాలు సిద్ధం చేసుకున్నాయి. తాత్కాలిక విద్యుత్ ఏర్పాట్లు చేసుకోవాలని విద్యుత్ శాఖను ఆదేశించారు. ఇదిలావుండగా.. తుపాను విషయంలో అప్రమత్తంగా ఉండాలని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి, విశాఖపట్నం జిల్లా ఇన్చార్జి మంత్రి విడదల రజని కలెక్టర్ ఎ.మల్లికార్జునరావుకు మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. విశాఖలోని ఫిషింగ్ హార్బర్ వద్ద అలల ఉధృతి గ్రామాల వారీగా కమిటీలు తుపాను ప్రభావంతో రెండు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆయా జిల్లాలోని గ్రామాల్లో పంచాయతీరాజ్ సిబ్బంది పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక కమిషనర్ శాంతిప్రియపాండే మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. హోం మంత్రిత్వ శాఖ వీడియో కాన్ఫరెన్స్ తుపాను ప్రభావిత రాష్ట్రాల విపత్తుల శాఖ అధికారులతో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కార్యదర్శి మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్‌లో ఏపీ విపత్తుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్, డైరెక్టర్ బీఆర్ అంబేడ్కర్ పాల్గొన్నారు. విపత్తుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్ ముందస్తుగా తీసుకున్న చర్యలను వివరించారు. -
100 శాతం సామర్థ్యంతో ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు
న్యూఢిల్లీ: లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ అధ్యక్షతన జరిగిన ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ భేటీ ముగిసింది. ఈ సమావేశంలో రాత్రి కర్ఫ్యూ సమయాన్ని గంటసేపు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకూ రాత్రి కర్ఫ్యూ కొనసాగనుంది. సోమవారం నుంచి విద్యాసంస్థలు, కోచింగ్ సెంటర్లు తిరిగి తెరచుకోనున్నాయి. అయితే పాఠశాలలు తెరవడానికి దశల వారీగా అనుమతిచ్చారు. 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు పాఠశాలలు ఫిబ్రవరి 7 నుంచి పునఃప్రారంభంచనున్నారు. నర్సరీ నుంచి 8వ తరగతి వరకు ఫిబ్రవరి 14 నుంచి వర్చువల్ బోధన కొనసాగించనున్నారు. టీకాలు వేసుకోని ఉపాధ్యాయులకు పాఠశాలలకు అనుమతిని నిరాకరించారు. చదవండి: ('సీఎం సార్ హెల్ప్ మీ'.. వెంటనే కారు ఆపి..) ఉన్నత విద్యాసంస్థలు ప్రామాణిక నిబంధనలకు లోబడి తెరవబడతాయి. 100 శాతం సామర్థ్యంతో ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలకు అనుమతిచ్చారు. జిమ్ సెంటర్లు, స్విమ్మింగ్ పూల్స్, రెస్టారెంట్లు, బార్లు ప్రారంభానికి అనుమతిచ్చారు. వ్యాపార సంస్థలన్ని యథాప్రకారంగా కొనసాగనున్నాయి. -
థర్డ్ వేవ్‌కు మార్కెట్లే హాట్స్పాట్లా?
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి సెకండ్ వేవ్‌లో తీవ్రంగా ప్రభావితమైన దేశ రాజధాని ఢిల్లీలో నెల రోజులుగా పరిస్థితులు కాస్త కుదుటపడుతున్నాయి. ప్రస్తుతం ఢిల్లీలో రోజువారీగా పాజిటివ్ కేసులు దాదాపు వందలోపే నమోదవుతున్నాయి. కేసుల సంఖ్యలో గణనీయమైన తగ్గుదల నమోదు కావడంతో లాక్డౌన్ సమయంలో కరోనా భయంతో ఇళ్లకే పరిమితమైన ఢిల్లీ వాసుల వ్యవహారశైలిలో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. కేసులు తగ్గుముఖం పట్టినప్పటికీ, దశల వారీగా అన్‌లాక్ ప్రక్రియ జరుగుతున్న సమయంలో ప్రతీ ఒక్కరు తప్పనిసరిగా మాస్క్ ధరించడం, భౌతిక దూరాన్ని పాటించడంతో పాటు రద్దీ ఉండే ప్రదేశాలకు వెళ్లరాదన్న ప్రోటోకాల్స్‌ను చాలామంది తుంగలో తొక్కేస్తున్నారు. కరోనా వచ్చే ముందు ఏవిధంగా ఢిల్లీలోని మార్కెట్లు కిటకిటలాడాయో, ఇప్పుడూ అవే దృశ్యాలు కనిపిస్తున్నాయి. వీటిని చూస్తుంటే ప్రజల్లో కరోనా పట్ల భయం ఏమాత్రం లేదన్నదని స్పష్టంగా అర్థమౌతోంది. దేశవ్యాప్తంగా సెప్టెంబర్–అక్టోబర్ నెలల్లో కరోనా మూడో వేవ్ వస్తుందనే అంచనాలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అదే సమయంలో డెల్టా ప్లస్ వేరియంట్ కారణంగా రాబోయే కొద్ది నెలల్లో దేశంలో మూడో వేవ్ వచ్చే అవకాశాలున్నాయని పరిశోధకులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఊహాగానాల మధ్య ప్రజలు తమ షాపింగ్ ఆసక్తిని ఏమాత్రం తగ్గించుకోవట్లేదనేది ఇక్కడ పరిశీలించాల్సిన అంశం. ఢిల్లీలో అన్‌లాక్ ప్రక్రియ ప్రారంభమై, మార్కెట్లు తెరుచుకున్నప్పటి నుంచి షాపింగ్‌కు వెళ్లే ప్రజల సంఖ్య రోజు రోజుకీ పెరుగుతోంది. దీంతో లజ్‌పత్‌నగర్, సరోజిని నగర్, సదర్ బజార్‌తో సహా ఢిల్లీలోని అనేక మార్కెట్లలో కోవిడ్ ప్రోటోకాల్స్ పాటించే విషయంలో జరుగుతున్న నిర్లక్ష్యం, ప్రజల అలసత్వం కారణంగా ఇవి మూడో వేవ్‌కు హాట్స్పాట్లుగా మారే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నారు. గత నెలలో జరిగిన ఒక విచారణ సందర్భంగా, ఢిల్లీ హైకోర్టు సైతం కోవిడ్ విషయంలో మార్కెట్లలో నెలకొన్న నిర్లక్ష్యంపై పదునైన వ్యాఖ్యలు చేసింది. దీంతో జనసాంద్రత ఎక్కువగా ఉండే జనపథ్ , కన్నాట్ ప్లేస్ , కరోల్‌బాగ్, సరోజిని నగర్, సదర్ బజార్ ,లజ్‌పత్ నగర్, చాందిని చౌక్, ఐఎన్ఏ మార్కెట్, పట్‌పడ్ గంజ్, లక్ష్మీ నగర్ వంటి మార్కెట్లపై ఢిల్లీ ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఈ మార్కెట్లలో ప్రజలు భౌతిక దూరం పాటించే పరిస్థితి మాత్రం కనిపించదు. ఇలాంటి పరిస్థితి ఎదురైతే ఈ మార్కెట్లు కరోనా హాట్స్పాట్లుగా మారే అవకాశాలున్నాయని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్‌లాక్–1 ప్రకటన సందర్భంగా వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ మార్కెట్లే కాక మంగోల్‌పురి, మధు విహార్, త్రినగర్, పహాడ్‌గంజ్ మెయిన్ బజార్, పాత ఢిల్లీ మార్కెట్, సఫ్దర్‌జంగ్ మార్కెట్ సమీపంలోని దక్షిణ ఢిల్లీ మార్కెట్, ఇండియా గేట్ సమీపంలోని న్యూ ఢిల్లీ మార్కెట్, కన్నాట్ ప్లేస్ ఎదురుగా ఉన్న ఎం బ్లాక్ మార్కెట్, డిఫెన్స్ కాలనీ దగ్గర ఉన్న దక్షిణ ఢిల్లీ మార్కెట్లలో కోవిడ్ ప్రోటోకాల్స్ పాటించే విషయంలో ఇప్పటికే హెచ్చరికలు జారీ అయ్యాయి. లజ్‌పత్ నగర్ మార్కెట్ మూసివేత కోవిడ్ నియమాలను పాటించని కారణంగా లజ్‌పత్‌నగర్, సరోజిని నగర్ సహా ఇతర మార్కెట్ల మూసివేతపై ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ (డీడీఎంఏ) నోటీసులు జారీ చేసింది. ఈ మార్కెట్లో కోవిడ్ ప్రోటోకాల్స్ పాటించకపోవడమే కాకుండా, వందలాది మంది విక్రేతలు మార్కెట్లో అక్రమంగా వస్తువులను విక్రయిస్తున్నారని స్థానిక దుకాణాదారులు ఎన్డీఎంసీకి లేఖ రాశారు. అదే సమయంలో ఢిల్లీలోని అన్ని జిల్లాల అధికారులకు అందుతున్న ఫిర్యాదుల మేరకు కోవిడ్ ప్రోటోకాల్స్ పాటించని మార్కెట్లు, షాపులపై దాడి చేసి సీల్ చేస్తున్నారు. అయితే మూడో వేవ్ ఊహాగానాల నేపథ్యంలో కరోనా వ్యాప్తిని అపే విషయంలో పాలనా యంత్రాంగం, వ్యాపారస్థుల ముందు పెద్ద సవాలు ఉంది. దుకాణదారులు వ్యాపారంతో పాటు కరోనా సంక్రమణ నివారణపై దృష్టిపెట్టాలని అధికారులు సూచిస్తున్నారు. మార్కెట్లలో నిబంధనలను కచ్చితంగా పాటించాలని హెచ్చరిస్తున్నారు. ఆరోగ్య శాఖ గణాంకాల ప్రకారం ఢిల్లీలో ఇప్పటివరకు 14,34, 608 కరోనా కేసులు నమోదయ్యాయి. అందులో 14,08,699 మంది రోగులు నయమయ్యారు. రికవరీ రేటు 98.18 శాతంకు చేరింది. అదే సమయంలో, మృతుల సంఖ్య 24,997కు పెరిగింది. ఢిల్లీలో కంటైన్మెంట్ జోన్ల సంఖ్య 695కి చేరింది. -
ఏపీ, తెలంగాణ వారికి నెగెటివ్ రిపోర్టు అక్కర్లేదు
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్, తెలంగాణల నుంచి ఢిల్లీకి వచ్చే వారికి ఇకపై ఆర్టీ–పీసీఆర్ నెగెటివ్ రిపోర్టు అవసరం లేదని ఢిల్లీ విపత్తు నిర్వహణ అథారిటీ పేర్కొంది. విమానాలు, రైళ్లు, బస్సులు, కార్లు, ఇతరత్రా ప్రయాణ సాధానాల ద్వారా ఢిల్లీ వచ్చే వారికి ఎలాంటి నెగెటివ్ రోపోర్టు అవసరం లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు మే 19న ఇచ్చిన ఉత్తర్వులు (ఆర్టీపీసీఆర్ నెగెటివ్ రిపోర్టు తప్పనిసరి, 14 రోజుల క్వారంటైన్) ఆర్డర్‌ను ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపింది. ఢిల్లీ విపత్తు నిర్వహణ అథారిటీ ఇచ్చిన ఆదేశాలను పలు విమానయాన సంస్థలు తమతమ ట్విటర్ ఖాతాల్లో పోస్టు చేశాయి. రెండు నెలల తర్వాత రెస్టారెంట్లు దేశరాజధానిలో సుమారు రెండు నెలల తర్వాత రెస్టారెంట్లు తెరచుకున్నాయి. అన్‌లాక్ మార్గదర్శకాల ప్రకారం 50 శాతం సామర్థ్యం, భౌతికదూరం పాటిస్తూ నిర్వాహకులు రెస్టారెంట్లు తెరిచారు. మరోవైపు, ప్రయాణికులతో మెట్రో స్టేషన్లు కిటకిటలాడాయి. దేశరాజధానిలో గడిచిన 24 గంటల్లో 131 కొత్త కరోనా కేసులు నమోదు కాగా 16 మంది మృతి చెందారు. 16 నుంచి తెరచుకోనున్న స్మారక కట్టడాలు ఈ నెల 16 నుంచి స్మారక కట్టడాలు, మ్యూజియంలు తెరవడానికి ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) అనుమతిసస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా మార్గదర్శకాలు అనుసరిస్తూ సందర్శకులకు అనుమతి ఇవ్వాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. తాజ్‌మహల్‌తో పాటు ఏఎస్ఐ సంరక్షణలో ఉన్న 3,693 చారిత్రక కట్టడాలు, ప్రదేశాలు, 50 మ్యూజియంలను బుధవారం నుంచి తెరువనున్నారు. సందర్శకులు ఆన్లైన్లో టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చని ఏఎస్ఐ తెలిపింది. చదవండి: 8 గంటల ఫలితం.. దక్కిన ఓ ప్రాణం -
ఆపదమిత్ర పథకం శిక్షణకు కృష్ణా జిల్లా ఎంపిక
అమరావతి : విపత్తు నిర్వహణ కింద కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఆపదమిత్ర పథకంలో శిక్షణకు కృష్ణా జిల్లా ఎంపికైంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో తక్షణ సాయం అందించేందుకు దేశ వ్యాప్తంగా ఆరువేల మంది కమ్యూనిటీ వలంటీర్లను కేంద్రం సిద్దం చేస్తుంది. దీనిలో భాగంగా దేశవ్యాప్తంగా తీరప్రాంతాల్లోని 30 జిల్లాల్లో ఎంపిక చేసిన వాలంటీర్లకు శిక్షణ ఇచ్చేందుకు ప్రణాళికలు రచిస్తోంది. దీనిలో భాగంగా కృష్ణా జిల్లాలోని 200 మంది కమ్యూనిటీ వలంటీర్లను ప్రభుత్వం గుర్తించింది. వారికి ఎన్డీఆర్ఎఫ్ పదో బెటాలియన్ ద్వారా కమ్యూనిటీ వాలంటీర్లకు శిక్షణ ఇవ్వనుంది. తీరప్రాంతాల్లో అత్యవసర పరిస్థితులు, వరద సమయాల్లో అత్యవసరంగా స్పందించేందుకు విపత్తు నిర్వహణ సంస్థ రాష్ట్రంలోని 9 జిల్లాల్లో హ్యామ్ రేడియో వ్యవస్థను ఏర్పాటు చేసింది. (రైతుల ఖాతాల్లోకి వైఎస్సార్ రైతు భరోసా సాయం ) -
వ్యాక్సిన్ పంపిణీకి ప్రధాని కీలక సూచనలు
సాక్షి,న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సిన్ పంపిణీకి సంబంధించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఎన్నికలు నిర్వహించే తరహాలోనే వ్యాక్సిన్ పంపిణీకి సిద్దం కావాలంటూ ప్రధాని అధికారులకు పిలుపునిచ్చారు. ఎన్నికలు, విపత్తు నిర్వహణ మాదిరిగానే కరోనా వ్యాక్సీన్ డెలివరీ వ్యవస్థ ఉండాలన్నారు. ఈ ప్రక్రియలో అన్ని స్థాయిల ప్రభుత్వ శాఖలు, సామాజిక సంస్థలు పాల్గొనేలా చూడాల్సి ఉందన్నారు. దేశంలోని కోవిడ్-19 మహమ్మారి పరిస్థితిని, టీకా పంపిణీ, ఆయా వ్యవస్థల సంసిద్ధతను ప్రధాని శనివారం సమీక్షించారు. (రష్యా వ్యాక్సిన్ ట్రయల్స్ కు గ్రీన్ సిగ్నల్) దేశ భౌగోళిక పరిధిని, వైవిధ్యాన్ని దృష్టిలో ఉంచుకుని, వ్యాక్సిన్‌ను వేగంగా ప్రజలకు అందేలా చూడాలని ప్రధాని కోరారు. ప్రతి వ్యక్తికీ వ్యాక్సీన్ అందుబాటులో ఉండాలని సూచించారు. లాజిస్టిక్స్, డెలివరీ, పద్ధతులు అడుగడుగునా కఠినంగా ఉండాలని, కోల్డ్ స్టోరేజ్ చెయిన్ అధునాతన ప్రణాళిక, పంపిణీ నెట్వర్క్, వ్యాక్సినేషన్ క్లినిక్ పర్యవేక్షణ తదితర ఏర్పాట్లపై ఇప్పటి నుంచే దృష్టి పెట్టాలని ప్రధాని కోరారు. ఇందుకు దేశంలో ఎన్నికలు, విపత్తు నిర్వహణను విజయవంతంగా నిర్వహించిన అనుభవాన్ని ఉపయోగించుకోవాలని అధికారులకు ఆదేశించారు. ఇందులో రాష్ట్రాల భాగస్వామ్యంతోపాటు, కేంద్రపాలిత ప్రాంతాలు, జిల్లా స్థాయి కార్య నిర్వాహకులు, పౌరసమాజ సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, అవసరమైన అన్ని డొమైన్ల నిపుణులు కీలక భూమిక పోషించాలన్నారు. ఈ సమావేశంలో కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్, ప్రధాని ప్రధాన కార్యదర్శి, నీతి ఆయోగ్ సభ్యుడు (హెల్త్), ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్, సీనియర్ శాస్త్రవేత్తలు, ఇతర ముఖ్య అధికారులు, ప్రభుత్వ ఇతర విభాగాలు పాల్గొన్నాయి. కాగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శనివారం నాటి గణాంకాల ప్రకారం దేశంలో కరోనా కేసుల సంఖ్య 74 లక్షలు దాటింది. మరణాల సంఖ్య 1,12,998కు చేరుకుంది. అయితే వ్యాధి నుంచి కోలుకున్న వారి సంఖ్య 65 లక్షలు దాటి రికవరీ రేటు 87.78 శాతానికి చేరిందని మంత్రిత్వ శాఖ వెల్లడించిన సంగతి తెలిసిందే. -
ఈ యాప్స్ గురించి ఎందరికి తెలుసు ?!
సాక్షి, న్యూఢిల్లీ : భూకంపాలు, సునామీలు రావడం, అగ్ని పర్వతాలు రాజుకోవడం, అడవులు తగలబడడం, అధిక వర్షాలతో వరదలు ముంచెత్తడం లాంటి ప్రకృతి ప్రళయాలు సంభవించినప్పుడే కాకుండా కరోనా వైరస్, సార్స్, మెర్స్‌లాంటి వైరస్లు విజృంభించినప్పుడు మానవ జాతి ఎంతో నష్టపోతోంది. అలాంటప్పుడు నష్ట నివారణ చర్యలు చేపట్టేందుకు భారత్ సంక్షోభ నివారణ వ్యవస్థ ఒకటి ఏర్పాటై ఉంది. అయితే నష్టాన్ని అరికట్టడం ఆ ఒక్క సంస్థ వల్ల సాధ్యమయ్యే పనికాదు. ప్రజలంతా ఒకరికొకరు సాయం చేసుకోవడమే కాకుండా ఎక్కడ, ఎవరికి, ఎలాంటి ప్రమాదం పొంచి ఉందో? అందుకు ఎలాంటి సాయం అవసరం అవుతుందో ఎప్పటికప్పుడు సంబంధిత అధికారులకు సమాచారం చేరవేయాల్సిన బాధ్యత ప్రజలకుంది. నేటి ఆధునిక సమాచార సాంకేతిక యుగంలో ఆ బాధ్యత మరింత పెరిగింది. అలా సమాచారాన్ని చేరవేయడానికి భారత్‌లో 33 యాప్స్ అందుబాటులో ఉన్నాయి. అవన్నీ ఉచితంగా లభించే యాప్స్. ఆండ్రాయిడ్ బేస్డ్గా ఉన్న ఈ యాప్స్ అన్నీ ‘గూగుల్ ప్లే స్టోర్’లో అందుబాటులో ఉన్నాయి. అయినప్పటికీ ఈ యాప్‌ల గురించి ఎవరికి పెద్దగా తెలియదని, తెల్సినా వినియోగం తక్కువేనని జపాన్‌లోని కియో యూనివర్శిటీ ఇటీవల నిర్వహించిన అధ్యయనంలో వెల్లడయింది. వీటిలో ప్రభుత్వంతోపాటు ప్రైవేటు సంస్థలు, విద్యా సంస్థలు, పరిశోధనా సంస్థలు ప్రవేశపెట్టినవి ఉన్నాయి. 2005లో ‘డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్’ తీసుకొచ్చాక ఈ యాప్‌లన్నీ పుట్టుకొచ్చాయి. ఈ 33 యాప్స్‌లో ఐయోవా లీగల్ ఎయిడ్, డిజాస్టర్ రెస్పాన్స్ టీమ్, బిల్డింగ్ ఇవాక్ అనే యాప్స్ మాత్రం భారత్‌ను దష్టిలో పెట్టుకొని రూపొందించినవి ఎంతమాత్రం కాదు. అవి అందించే విషయ పరిజ్ఞానం భారతీయులకు కూడా ఎంతో అవసరం కనుక ఆ మూడింటిని కూడా 30 యాప్స్‌తో కలిపి కియో యూనివర్శిటీ బృందం, ఎందుకు వీటికి ఎక్కువ ఆదరణ లేకుండా పోతుందనే విషయంపై ఈ అధ్యయనం జరిపింది. వీటిలో 18 యాప్స్ ప్రకృతి వైపరీత్యాలపై అవగాహన కల్పించేవి మాత్రమేనట. డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్‌తో వచ్చిన ‘డిజాస్టర్ మేనేజ్మెంట్ యాప్’ను ఎక్కువ మంది డౌన్లోడ్ చేసుకున్నారట. ఇది పలు రకాల ప్రకతి వైపరీత్యాల గురించి సమాచారం అందించడమే కాకుండా కొన్ని ముందు జాగ్రత్తలు సూచిస్తోందట. ఐదు యాప్స్ మాత్రం రాష్ట్రానికి, సిటీకి మాత్రమే పరిమితమై ఉన్నాయట. ‘సిక్కిం స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ’ యాప్ కేవలం సిక్కిం రాష్ట్రానికే పరిమితమైనది. వీటిలో ఏడింటికి మాత్రమే జీపీఎస్ సెన్సర్లు కలిగి ఉన్నాయి. వాటిలో నాలుగు యాప్స్ ప్రాథమిక ఫంక్షన్నే కలిగి ఉన్నాయి. ఇలా ప్రతి దానిలో ఏదో ఒక లోపం ఉండడమే వల్లనే వీటికి ఎక్కువగా ఆదరణ లేకపోయిందని యూనివర్శిటీ బందం కేంద్రానికి ఓ నివేదికను సమర్పించింది. ఆ మధ్య ముంబై నగరంతోపాటు, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో భారీ వరదలు వచ్చినప్పుడు వీటిలో కొన్ని యాప్స్ బాగానే ఉపయోగపడ్డాయట. -
‘ప్రజలను అప్రమత్తం చేయడంలో ఏపీ ముందంజ’
సాక్షి, విజయవాడ: పిడుగుపాట్ల నుంచి ప్రజలను అప్రమత్తం చేయడంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందంజలో ఉందని డిజాస్టర్ మేనేజ్మెంట్, రెవెన్యూ డిపార్టుమెంట్ సెక్రటరీ ఉషారాణి తెలిపారు. నగరంలో ఏపీ డిజాస్టర్ మేనేజ్మెంట్, నేషనల్ ఇస్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్, యూనిసెఫ్ ఆధ్వరంలో ‘పిడుగు పాటు ముందస్తు సూచనలు, అవగాహన విధానాలు’పై బుధవారం వర్క్‌షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఉషారాణి మీడియాతో మాట్లాడుతూ.. వివిధ రాష్ట్రాలు ప్రకృతి విపత్తులను ఏవిధంగా ఎదుర్కొంటున్నాయని.. ఉరుములు, మెరుపులు, పిడుగుపాట్లపై అనుసరిస్తున్న విధానాలపై చర్చించామని ఆమె తెలిపారు. దేశవ్యాప్తంగా గడిచిన పదేళ్లలో పిడుగుపాటుకు 25 వేల మంది చనిపోయారని ఆమె వెల్లడించారు. సాంకేతికతను వినియోగించుకుని పిడుగుపాట్లపై మండలస్థాయిలో ప్రజలను చైతన్య పరుస్తున్నామని ఉషారాణి పేర్కొన్నారు. అదేవిధంగా మోబైల్‌ఫోన్లకు సందేశాలు సైతం పంపుతున్నామని ఆమె చెప్పారు. పిడుగుపాట్ల నుంచి ప్రజలను అప్రమత్తం చేయడంలో ఏపీ ముందంజలో ఉందన్నారు. ప్రజలు సైతం అవగాహన కలిగి ఉండాలని ఆమె వ్యాఖ్యానించారు. వర్షం పడే సమయంలో చెట్ల కిందకు వెళ్లకూడదని.. ఇళ్ల నిర్మాణం చేపట్టినప్పుడు యర్త్ఇన్ చేసుకోవాలని ఉషారాణి సూచించారు. గ్లోబుల్ వార్మింగ్ సైతం తగ్గించేలా చెట్లను పెంచాలని ఆమె తెలిపారు. రాష్ట్రంలోని గ్రామ సచివాలయాల ద్వారా ప్రజలకు అవగాహన సదస్సులు నిర్వహిస్తామని సెక్రటరీ ఉషారాణి పేర్కొన్నారు. -
సమష్టిగా విపత్తు నిర్వహణ
ఒసాకా: విపత్తు నిర్వహణ విషయంలో జి20 బృందం ప్రపంచదేశాలతో కలిసి కూటమిగా ఏర్పడాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. సాధారణంగా విపత్తులు సంభవించినప్పుడు సహాయక చర్యలు, పునరావాసం ఎంత త్వరగా చేపడితే నష్టం అంత తక్కువగా ఉంటుందని తెలిపారు. ఇలాంటి వైపరీత్యాల సమయంలో నిరుపేద ప్రజలే ఎక్కువగా నష్టపోతుంటారని వ్యాఖ్యానించారు. జపాన్‌లోని ఒసాకా నగరంలో జరుగుతున్న జి20 సదస్సులో శనివారం ప్రధాని మోదీ ప్రసంగించారు. ‘విపత్తులను తట్టుకునే మౌలికవసతుల కల్పన కోసం అంతర్జాతీయ కూటమితో చేతులు కలపాలని జి20 దేశాలను నేను కోరుతున్నాను. ఈ రంగంలో తమ అనుభవాన్ని, నైపుణ్యాన్ని పంచుకోవాలని ఆహ్వానిస్తున్నాను. రండి.. సురక్షితమైన ప్రపంచం కోసం మనమందరం చేతులు కలుపుదాం’ అని మోదీ పిలుపునిచ్చారు. విపత్తులను తట్టుకునే మౌలికవసతుల ఏర్పాటు అన్నది కేవలం అభివృద్ధికి సంబంధించిన విషయం మాత్రమే కాదనీ, ప్రకృతి విపత్తులను ఎదుర్కోవడంలో ఈ మౌలిక వసతులు ఎంతో కీలకమని వ్యాఖ్యానించారు. బిజీబిజీగా మోదీ.. జి20 సదస్సు చివరి రోజైన శనివారం ప్రధాని మోదీ బిజీబిజీగా గడిపారు. ఇండోనేసియా, బ్రెజిల్, టర్కీ, ఆస్ట్రేలియా, సింగపూర్, చిలీ దేశాల అధినేతలతో వేర్వేరుగా సమావేశమైన మోదీ వాణిజ్యం ఉగ్రవాదంపై పోరు, తీరప్రాంత భద్రత, రక్షణ సహా పలు అంశాలపై చర్చించారు. ఇండోనేసియా అధ్యక్షుడు జొకొ విడోడోతో మోదీ తొలిసారి అధికారికంగా సమావేశం అయ్యారు. ఈ భేటీలో వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, తీర భద్రత రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని నిర్ణయించారు. అనంతరం బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బాల్సోనారోతో వాణిజ్యం, పెట్టుబడులు, వ్యవసాయం, జీవ ఇంధనాలు, వాతావరణ మార్పు వంటి అంశాలపై మోదీ విస్తృత స్థాయిలో చర్చలు జరిపారు. ఆ తర్వాత టర్కీ అధ్యక్షుడు రెసిప్ తయ్యిప్ ఎర్డోగన్‌ను కలుసుకున్నారు. భారత్–టర్కీల మధ్య పటిష్టమైన భాగస్వామ్యం కొనసాగాలని వారు ఆకాంక్షించారు. ఈ పర్యటనలో భాగంగా సింగపూర్ ప్రధాని లీహసియన్ లూంగ్, చిలీ అధ్యక్షుడు సెబాస్టియన్ పినెరాలతో ప్రధాని మోదీ సుహృద్భావ పూర్వకంగా సమావేశమయ్యారు. ద్వైపాక్షిక సంబంధాలపై ఆయా దేశాధినేతలతో వీరు చర్చించారు. కితనా అచ్చేహై మోదీ! భారత ప్రధాని మోదీకి ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్ ఇచ్చిన కితాబు ఇది. ఒసాకాలో జరిగిన జి–20 సదస్సుకు హాజరయిన మారిసన్,మోదీలు శనివారం సమావేశమయ్యారు. క్రీడలు, గనుల తవ్వకం, రక్షణ, తీర ప్రాంత భద్రత వంటి విషయాల్లో సహకారాన్ని పెంపొందించుకునేందుకు ఇరువురు అంగీకరించారు. ఆ సందర్భంగా మారిసన్ ప్రధాని మోదీతో సెల్ఫీ దిగారు. దాన్ని ట్విట్టర్లో పెట్టారు. ఆ ఫొటోకు ‘కితనా అచ్చే హై మోదీ’అని కాప్షన్ ఇచ్చారు. దాన్ని చూసి మోదీ మురిసిపోయారు. ఆస్ట్రేలియా ప్రధాని ట్వీట్‌కు స్పందిస్తూ మారిసన్ను ‘మేట్’అని సంబోధించారు. ఆస్ట్రేలియా భాషలో మేట్ అంటే స్నేహితుడని అర్థం. భారత్–ఆస్ట్రేలియా సంబంధాల పట్ట సంతోషంగా ఉన్నానని మోదీ ట్వీట్ చేశారు.‘కితనా అచ్చే హై మోదీ అంటూ హిందీలో నన్ను అభినందించడం ద్వారా ఈ ట్వీట్‌ను వైరల్ చేశారు.దానికి నేను కృతజ్ఞుడిని’అని మోదీ తన ట్వీట్లో పేర్కొన్నారు. -
యూపీలో ధూళి తుపాను బీభత్సం
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో దుమ్ము తుపాను బీభత్సం సృష్టిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో 26 మంది మృతి చెందగా, 57 మంది గాయపడ్డారు. తుపాను ధాటికి ఇంటి గోడలు కూలిపోగా, చెట్లు నేలకొరిగాయి. దీంతో పెద్ద ఎత్తున సహాయక చర్యలు చేపట్టినట్లు విపత్తు నిర్వహణ అధికారులు వెల్లడించారు. మైన్‌పురిలో పలు చోట్ల గోడ కూలిన ఘటనలో అత్యధికంగా ఆరుగురు మృతి చెందారని విపత్తు కమిషనర్ తెలిపారు. అలాగే మైన్‌పురి జిల్లాలో 41 మంది గాయపడ్డారని, చెట్లు కూకటి వేళ్లతో సహా రహదారికి అడ్డంగా పడటంతో చాలా సేపటి వరకు పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయిందని చెప్పారు. ఆ సమయంలో ప్రజలు వారి ఇళ్లలో నిద్రిస్తున్న సమయంలో హఠాత్తుగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసిందని, దీంతో ఇంటి గోడలు కూలి చాలావరకు గాయాలపాలయ్యారని పోలీసులు తెలిపారు. ‘ఇప్పటి వరకు మాకున్న సమాచారం ప్రకారం దుమ్ము తుపాను కారణంగా మైన్‌పురిలో ఆరుగురు, ఎటా, కాస్గంజ్ల్లో ముగ్గురు, ఫరూఖాబాద్, బారాబంకిల్లో ఇద్దరు, మొరాదాబాద్, బదౌన్, పిలిభిత్, మధుర, కనౌజ్, సంభాల్, ఘజియాబాద్, అమ్రోహ, బదౌన్, మహోబాల్లో ఒక్కొక్కరి చొప్పున మృతి చెందారు’అని కమిషనర్ పేర్కొన్నారు. కాగా, తాజా పరిస్థితులపై రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. తుపాను బాధితులకు సాయం అందించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. -
ప్రజా రక్షణకు ప్రాధాన్యం
సాక్షి, హైదరాబాద్: వేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్‌లో ప్రజా రక్షణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని మునిసిపల్ మంత్రి కేటీ రామారావు అన్నారు. అనుకోని విపత్తులు... ఆకస్మిక ప్రమాదాలు జరిగినప్పుడు అన్ని శాఖలు సమన్వయంతో వెంటనే స్పందించి నష్టనివారణ చర్యలు చేపట్టేందుకు జీహెచ్ఎంసీలో డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్(డీఆర్ఎఫ్)ను ఏర్పాటు చేశామన్నారు. జీహెచ్ఎంసీలోని ఎన్ఫోర్స్మెంట్, విజిలెన్స్, డిజాస్టర్ మేనేజ్మెంట్ (ఈవీడీఎం) డైరెక్టరేట్ ఆధ్వర్యంలో డీఆర్ఎఫ్ విభాగాన్ని మంత్రి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దేశంలోనే డీఆర్ఎఫ్ను ఏర్పా టు చేసిన తొలి నగరం హైదరాబాదేనన్నారు. ముంబై తరువాత ఈవీడీఎం ఏర్పాటు చేసిన కార్పొరేషన్ జీహెచ్ఎంసీయే అన్నారు. అగ్ని ప్రమాదాలు, భవనాలు కూలినప్పుడు, వర దలు ఇతరత్రా ప్రమాద సమయాల్లో అన్ని శాఖలు సమన్వయంతో ఆస్తి, ప్రాణనష్టం జరగకుండా డీఆర్ఎఫ్ పనిచేస్తుందని చెప్పారు. గత నాలుగేళ్లలో నగరంలో నేరాల సంఖ్య గణనీయంగా తగ్గిందంటూ, ఇదే అంశాన్ని మినిస్టర్ ఆఫ్ హోం అఫైర్స్(ఎంహెచ్ఏ) నివేదిక స్పష్టం చేసిందన్నారు. నగరాన్ని సేఫ్ సిటీగా మార్చేందుకు 10 లక్షల సీసీ కెమెరాల ఏర్పాటు లక్ష్యం కాగా, ఇప్పటి వరకు 4 లక్షలు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. భవనం కూలిన దుర్ఘటనతోనే.. నానక్‌రామ్‌గూడలో నిర్మాణంలోని భవనం కూలి పలువురు మృత్యువాత పడటం తననె ంతో కలచివేసిందని, ఆ సమయంలోనే నగరంలో శాస్త్రీయ పద్ధతిలో విపత్తులను ఎదుర్కొనే డీఆర్ఎఫ్ను ఏర్పాటు చేయాలనుకున్నట్లు తెలిపారు. దీని కోసం ఈవీడీఎంను ఏర్పాటు చేసి డైరెక్టర్‌గా ఐపీఎస్ అధికారి విశ్వజిత్‌ను నియమించామన్నారు. ప్రస్తుతం డీఆర్ఎఫ్లో 120 మంది శిక్షణపొందిన సిబ్బంది ఉన్నారని, ఈ సంఖ్యను మరింత పెంచుతామన్నారు. ప్రజల ‘రైట్ టు వాక్’అమలు చేసేందుకు జీహెచ్ఎంసీ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం నగరంలోని 8వేలకు పైగా ఫుట్‌పాత్‌ల ఆక్రమణలు తొలగించిందన్నారు. వినూత్న కార్యక్రమాల జీహెచ్ఎంసీ.. దేశంలోనే పలు వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుడుతూ జీహెచ్ఎంసీ ప్రత్యేకతను చాటుకుంటోందన్నారు. బాండ్ల ద్వారా నిధు లు సేకరించాలన్న ప్రధాని సూచన మేర కు రూ. 200 కోట్లు సేకరించగా, త్వరలోనే మరో రూ. 200 కోట్లు సేకరించనున్నట్లు చెప్పారు. ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు సీఎం సూచనల మేరకు పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా మరిన్ని సర్కిళ్లు, జోన్లు, మానవ వనరులను పెంచనున్నట్లు తెలిపారు. మేయర్ బొంతు రామ్మోహన్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్, జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్ధన్‌రెడ్డి, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ సిన్హా, హెచ్ఎండీఏ కమిషనర్ చిరంజీవులు, హైదరాబాద్ మెట్రోరైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి పాల్గొన్నారు. నగరంలో వరదలు, చెట్లు పడిపోవడం, నిర్మాణాలు కూలిపోవడం వంటి ఘటనలు జరిగినప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశాలపై 120 మందికి పోలీస్‌శాఖ, సెంట్రల్ ఎమర్జెన్సీ టీంలతో శిక్షణ ఇచ్చాం. వీరితో నేషనల్ ఇండస్ట్రీ సెక్యూరిటీ అకాడమీ, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అకాడమీల నుంచి సర్టిఫికెట్ కోర్సులు చేయిస్తాం. ప్రత్యేక వాహనంలో ఐదుగురు సిబ్బందితోపాటు పంప్‌లు, సబ్‌మెర్జబుల్స్, కట్టర్లు, హ్యామర్లు తదితర పరికరాలుంటాయి. ఇప్పుడున్న సిబ్బంది సామర్థ్యంతో 5 నుంచి 10 నిమిషాల్లో చేరుకునేలా చర్యలు చేపడుతున్నాం. – విశ్వజిత్, డైరెక్టర్, ఈవీడీఎం. ఆపదల సమయంలో ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకునేలా మాకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. మా వద్ద ఉన్న సామగ్రితో ఎలా ప్రమాద తీవ్రతను తగ్గించాలనే విషయాలను నేర్పించారు. ఇలాంటి విభాగంలో పనిచేస్తున్నందుకు సంతోషంగా ఉంది. – టి.ప్రభాకర్, మహ్మద్ మోయిస్, శివ బృందం -
ఆర్తుల్ని ఆదుకోవాలి
భువనేశ్వర్ : రానున్నది విపత్తు కాలం. విపత్తు చెంతలో తలదాచుకుంటున్న వర్గాలను ఆదుకునేందుకు అనుబంధ యంత్రాంగాలు సిద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ పిలుపునిచ్చారు. ఆయన అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన విపత్తు నిర్వహణ సమావేశంలో మంత్రిమండలి సభ్యులు, ప్రతిపక్ష నాయకుడు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు అన్ని విభాగాల కార్యదర్శులు ఇతరేతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఆకస్మిక విపత్తు తాండవించే ఊహాతీత పరిస్థితుల్లో గర్భిణులు, దివ్యాంగులు, వయోవృద్ధులు, వితంతువులు, పిల్లలు వగైరా వర్గాలపట్ల ప్రత్యేక దృష్టి సారించాలి. ఈ వర్గాలను తక్షణమే అక్కున చేర్చుకుని విపత్తు నుంచి కడతేర్చాలని ముఖ్యమంత్రి ప్రత్యేకంగా సూచించారు. వాతావరణ కదలికను గమనించాలి ఈ ఏడాది వాతావరణంలో అవాంఛనీయ మార్పులు సంభవిస్తున్నాయి. రుతుపవనాలు నిర్ధారిత సమయం కంటే ముందుగా రాష్ట్రాన్ని తాకినప్పటికీ వానలు కనుమరుగ య్యాయి. వేసవి మరోసారి పునరావృతమై వాతావరణం వేధిస్తోంది. విపరీతమైన వేడి, ఉక్క పోత వంటి సహించ లేని వాతావరణం అల్లాడిస్తోంది. వానలు గాలిలో తేలిపోతున్నాయి. ఇటువంటి వాతావరణ మార్పుల పట్ల వ్యవసాయ శాఖ ప్రత్యేకంగా దృష్టి సారించడం అనివార్యం. స్థానిక ఒడిశా యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ టెక్నాలజీ అనుసంధానంతో వ్యవసాయ శైలిని ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలి. ఏటా రాష్ట్రానికి ఏదో రీతిలో విపత్తు పీడించడం నిరవధికంగా జరుగుతోంది. గత ఏడాది రాష్ట్రంలో కరువు తాండవించడంతో పంటకు చీడ పట్టి వేధించిన పరిస్థితుల్ని ముఖ్యమంత్రి వ్యవసాయ శాఖకు వేలెత్తి చూపారు. విపత్తు నిర్వహణ కంటే నివారణ ప్రధానంగా అనుబంధ వర్గాలు గుర్తించాలి. వాతావరణ స్థితిగతులకు అనుగుణంగా పొంచి ఉండే విపత్కర పరిస్థితుల్ని వ్యవసాయ పరిశోధకులు, నిపుణులతో సాంకేతిక, పాలన వర్గాలు అనుసంధానపరుచుకుని ముందుకు సాగితే విపత్తు నివారణ సాధ్యమవుతుందన్నారు. ప్రజల సంరక్షణతో పంటల సంరక్షణ కూడా అంతే అవసరంగా అధికారులు గుర్తించి విపత్తు నిర్వహణ కోసం నడుం బిగించి సిద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. వానలు వచ్చినట్లు వచ్చి కనుమరుగయ్యాయి. వేసవి కంటే అధికంగా వేధిస్తుండడంతో రాష్ట్రవ్యాప్తంగా విద్యా సంస్థలకు వేసవి సెలవుల్ని వరుసగా రెండు సార్లు పొడిగించిన విషయాన్ని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. పంచా యతీ రాజ్ విభాగం ఆధ్వర్యంలో జలాశయాలు, నీటి వనరుల సమీకరణ కోసం ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ మేరకు అదనపు నిధుల్ని ప్రభుత్వం కేటాయిస్తుందని బిజూ జనతా దళ్ నాయకుడు అమర ప్రసాద్ శత్పతి తెలిపారు. కాగితాలకే పరిమితం కాకూడదు: నర్సింగ మిశ్రా విపత్తు నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు అభినందనీయం. ఈ నేపథ్యంలో తీర్మానించిన భావి కార్యాచరణ వాస్తవంగా అమలుచేసి విపత్తు నుంచి రక్షణ కల్పించాలి. సమావేశం తీర్మానాలు కలం–కాగిత పత్రాలకు పరిమితమైతే ప్రయోజనం ప్రాణాంతకంగా మారుతుందని ప్రధాన ప్రతిపక్ష నేత కాంగ్రెస్ శాసనసభా పక్ష నాయకుడు నర్సింగ మిశ్రా తెలిపారు. -
ఆపదొస్తే ఆగమే!
సాక్షి,సిటీబ్యూరో : భారీ వర్షాలు, వరదలు, అగ్నిప్రమాదాలు, భారీ భవంతులు కూలి పోవడం వంటి విపత్తులు సంభవిస్తే తక్షణమే స్పందించే ‘విపత్తు నివారణ వ్యవస్థ’ నగరంలో అధ్వానంగా మారింది. భారీ వర్షాలు కురిసిన ప్రతిసారి నగరంలోని పలు ప్రాంతాలు నీటమునుగుతూనే ఉన్నాయి. జనం ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. రెండేళ్ల క్రితం బండారీ లేఅవుట్.. గతేడాది రామంతాపూర్ ప్రాంతాలు భారీ వర్షాల కారణంగా నీటమునిగిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో ఈ ఏడాది వర్షాకాలంలో మళ్లీ ఏప్రాంతాలు నీటమునుగుతాయోనని నగరవాసులు ఆందోళనకు గురవుతున్నారు. వాస్తవంగా నగరంలో వరదనీరు సాఫీగా వెళ్లేందుకు సరైన వ్యవస్థ లేదు. నాలాలు భారీగా ఆక్రమణలకు గురయ్యాయి. రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారాయి. ఈ కారణాల వల్లే భారీ వర్షం కురిస్తే వరద నీరు వెళ్లే దారిలేక ఇళ్లను ముంచెత్తుతోంది. విశ్వనగరంలో గంటకో సెంటీమీటరు చొప్పున వర్షం కురిస్తే 24 గంటల్లో మహానగరం నీట మునగడం తథ్యమని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నగరంలో సుమారు 234 నీట మునిగే(వాటర్‌లాగింగ్) ప్రాంతాలు, సుమారు 300 బస్తీలు తరచూ నీటమునుగతున్నట్లు బల్దియా లెక్కలు వేసినా..నివారణ చర్యలు తీసుకోవడంలో విఫలమవుతోంది. సాక్షాత్తు రాష్ట్ర గవర్నర్ నివాసం ఉండే రాజ్‌భవన్, అసెంబ్లీ, అమీర్‌పేట్ మైత్రీవనం, ఖైరతాబాద్ తదితర ప్రధాన ప్రాంతాలు నీటమునిగే జాబితాలో ఉన్నాయంటే పరిస్థితి తీవ్రతను అర్థంచేసుకోవచ్చు. వరదనీరు సాఫీగా వెళ్లేందుకు తగిన ప్రణాళిక కానీ, చేసిన పనులు కానీ లేవంటే అతిశయోక్తి కాదు. 2016 సెప్టెంబర్ నెలలో మహానగరంలో ఒకే రోజు సుమారు 22 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో నిజాంపేట్ పరిధిలోని బండారీ లేఅవుట్ సహా పదికిపైగా కాలనీలు నీటమునిగాయి. వందలాది బస్తీల్లో ఇళ్లలోకి నీరుచేరింది. వారం రోజులపాటు ప్రధాన రహదారులు మోకాళ్లలోతున వరదనీరు నిలిచి అధ్వాన్నంగా మారాయి. ఏడాది గడిచినా ఈ దుస్థితిలో ఎలాంటి మార్పురాకపోవడం గ్రేటర్ దుస్థితికి అద్దం పడుతోంది. కాగితాలపైనే కిర్లోస్కర్ నివేదిక.. నగరంలో వరదనీటి కాలువల అధ్యయనం..విపత్తులు సంభవించినప్పుడు తీసుకోవాల్సిన చర్యలపై గతంలోనే కిర్లోస్కర్ కన్సల్టెంట్స్‌కు బాధ్యత అప్పగించారు. 2003లో నివేదిక నందించిన కిర్లోస్కర్ కమిటీ వరదనీరు సాఫీగా వెళ్లేందుకు నాలాలను అభివృద్ధి చేయాలని సూచించింది. అందుకు దాదాపు రూ. 264 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. పాత ఎంసీహెచ్ పరిధిలోని 170 చ.కి.మీ. ఉన్న నగరంలో మేజర్ నాలాల అభివృద్ధికోసం కిర్లోస్కర్ కమిటీ ఈ నివేదిక రూపొందించగా, మైక్రోలెవల్ వరకు వరదనీటి నిర్వహణకు మాస్టర్‌ప్లాన్ రూపొందించాల్సిందిగా అధికారులు 2006లో కిర్లోస్కర్ కమిటీకి సూచించారు. 2007 ఏప్రిల్‌లో నగర శివార్లలోని 12 మున్సిపాలిటీల విలీనంతో గ్రేటర్ హైదరాబాద్‌గా ఏర్పటయ్యాక విస్తీర్ణం 625 చ.కి.మీలకు పెరిగింది. దీంతో గ్రేటర్ మొత్తానికీ ‘సమగ్ర మాస్టర్‌ప్లాన్.. సూక్ష్మస్థాయి వరదనీటి పారుదల నెట్వర్క్ప్లాన్ ..మేజర్, మైనర్ వరదకాలువల ఆధునీకరణకు సమగ్ర ప్రాజెక్టు రిపోర్టు(డీపీఆర్) బాధ్యతను ఓయంట్స్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు అప్పగించారు. దాని ప్రాథమిక అంచనా మేరకు గ్రేటర్లో వరదనీటి సమస్య పరిష్కారానికి రూ. 6247 కోట్లు అవసరమవుతాయి. ఈ నిధులతో మేజర్ నాలాలను ప్రక్షాళన చేయాలి. ఆక్రమణలు నిరోధించాలి. సుమారు 390 కి.మీ మేర విస్తరించిన ప్రధాన నాలాలకు ఆనుకొని ఉన్న సుమారు 9 వేల ఆక్రమ నిర్మాణాలను తొలగించాలి. కానీ పరిస్థితి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగానే ఉంది. మెట్రో నగరాల్లో విపత్తు స్పందన భేష్.. ముంబయి, బెంగళూరు, ఢిల్లీ, కోల్‌కతా మెట్రో నగరాల్లో విపత్తును సమర్థంగా ఎదుర్కొనేందుకు ఆయా ప్రభుత్వ విభాగాల అధికారులు, సిబ్బంది సమన్వయంతో ఏర్పాటు చేసిన విపత్తు స్పందన దళం(ఎన్డీఆర్ఎఫ్) అందుబాటులో ఉంది. ఇందులో ఆయా నగరపాలక సంస్థలు, జలబోర్డులు, అగ్నిమాపక, రెవెన్యూ శాఖల ప్రతినిధులు సభ్యులుగా ఉంటారు. విపత్తు నిర్వహణ విభాగానికి ప్రత్యేక కార్యాలయం, ప్రత్యేక బడ్జెట్‌ను కేటాయిస్తారు. విపత్తు సంభవించిన ప్రతిసారీ సంస్థ సభ్యులు ఆయా విభాగాలను అప్రమత్తం చేయడంతోపాటు సుశిక్షితులైన సిబ్బంది సహకారంతో సహాయక చర్యలు చేపడతారు. వీరికి అవసరమైన సాధనాసంపత్తి అందుబాటులో ఉంది. ఏదేని భవంతి నేలమట్టమయిన వెంటనే విపత్తు స్పందనా దళం సభ్యులు నిమిషాల వ్యవధిలో అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపడతారు. విపత్తును ఇలా ఎదుర్కొంటేనే మేలు.... నగరంలో జీహెచ్ఎంసీ, జలమండలి, రెవెన్యూ, పోలీసు, వాతావరణశాఖ, అగ్నిమాపక శాఖ, హెచ్ఎండీఏల సమన్వయంతో విపత్తు స్పందనా దళం ఏర్పాటు చేయాలి. నగర భౌగోళిక పరిస్థితిపై విపత్తు స్పందన దళానికి స్పష్టమైన అవగాహన ఉండాలి. ఇందుకు సంబంధించిన మ్యాప్‌లు వారి వద్ద సిద్ధంగా ఉండాలి. లోతట్టు ప్రాంతాలు, వరద ప్రభావిత ప్రాంతాల్లో విపత్తు రాకముందే మాక్‌డ్రిల్ చేసిన అనుభవం బృందానికి ఉండాలి. విపత్తు స్పందన దళానికి ప్రత్యేక కార్యాలయం ఉండాలి. గ్యాస్‌కట్టర్లు, రెస్క్యూల్యాడర్లు, ప్రొక్లెయిన్లు, ఫైరింజన్లు, క్రేన్లు, అగ్నినిరోధక దుస్తులు, ఆక్సిజన్ సిలిండర్లు, ఫస్ట్ఎయిడ్కిట్లు, అంబులెన్స్ తదితరాలు సొంతంగా ఉండేలా చూడాలి. నగరంలోని పురాతన భవనాల్లో ఉన్న సూక్ష్మ పగుళ్లు, భవనాల నాణ్యత, మన్నికను గుర్తించేందుకు బార్క్(బాబా ఆటమిక్ రీసెర్చ్‌సెంటర్)సిద్ధంచేసిన రేడియోధార్మిక టెక్నాలజీని వినియోగించాలి. నగరంలోని అన్ని నాలాలు, లోతట్టు ప్రాంతాలకు జీఐఎస్ పరిజ్ఞానం ద్వారా గుర్తించి మ్యాపులు సిద్ధంచేయాలి. లోతట్టు ప్రాంతాల్లో ఆటోమేటిక్ రెయిన్‌గేజ్ యంత్రాలు ఏర్పాటుచేయాలి. వర్షాకాలానికి ముందే వరదనీటి కాల్వలు, నాలాలు, భూగర్భ డ్రైనేజి లైన్లను పూడిక తీయాలి. వరద ముప్పున్న ప్రాంతాల్లో అత్యవసర మోటార్లు ఏర్పాటుచేసి నీటిని తోడాలి. ఇళ్లలోకి నీరు ప్రవేశించకుండా చూడాలి. ప్రతి నాలాకు రక్షణ వలయం, నాలాకు ఆనుకొని ఉన్న బస్తీలకు రక్షణ గోడను, ఇసుకబస్తాలను ఏర్పాటుచేసి రక్షణ కల్పించాలి. నాలాలు, చెరువులు, కుంటల ఆక్రమణలను పూర్తిగా తొలగించాలి. -
ఏడాదిలోపే ఎన్ఐడీఎం నిర్మాణం: రిజిజు
సాక్షి, గన్నవరం : నేషనల్ ఇనిస్టిట్యూట్ డిజాస్టర్ మేనేజిమెంట్ సౌత్ క్యాంపస్ కార్యాలయానికి భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు మంగళవారం శంకుస్థాపన చేశారు. ఏపీ పునర్విభజనలో భాగంగా జాతీయ విపత్తు నిర్వహణ సంస్థను కేంద్ర ప్రభుత్వం కృష్ణాజిల్లా గన్నవరం మండలం కొండపావులూరులో ఏర్పాటు చేస్తున్న విషయం విదితమే. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ.. ‘జాతీయ ప్రకృతి వైపరీత్యాల నివారణ సంస్థ ఈ ప్రాంత ప్రతిష్ట పెంచనుంది. ఎన్ఐడీఎం చుట్టుపక్కల చాలా ప్రతిష్టాత్మక సంస్థలు ఏర్పాటు అవుతున్నాయి. 400 ఎకరాల విస్తీర్ణంలో ఇక్కడ వివిధ సంస్థలు వస్తున్నాయి. గతేడాది శంకుస్థాపన చేసిన ఎన్డీయేఎఫ్ బెటాలియన్ నిర్మాణాలు ఆలస్యంగా జరుగుతున్నాయి. వాటిని త్వరగా పూర్తి చేయాలని కేంద్రమంత్రి కిరణ్ రిజిజును కోరుతున్నా. కాలం గతి తప్పుతోంది. రుతువులు క్రమం తప్పుతున్నాయి. దీనికి మనం చేస్తున్న పనులు కూడా కారణం. ప్రకృతితో సహజీవనం చేయటం అలవర్చుకోవాలి. భూమి,నీరు, ఆకాశం, వెలుతురుని సద్వినియోగం చేసుకోవాలి. అతిపెద్ద కోస్త తీరప్రాంతం ఉన్న ఏపీకి ఎన్ఐడీఎం ఎంతో అవసరం. అతి తక్కువ కాలంలో ఎక్కువ సంస్థలు రాష్ట్రానికి వచ్చేలా చూసా. ప్రకృతి వైపరీత్యాల నివారణలో ప్రజలకు అవగాహన కల్పించడం చాలా ముఖ్యం. విపత్తులను ఎదుర్కోవడంలో ఏపీ అధికారులకు అనుభవం ఉంది. ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పులు పెను సవాల్‌గా పరిణమించాయి.’ అని అన్నారు. ఏడాదిలోపే ఎన్ఐడీఎం నిర్మాణం: రిజిజు విపత్తు నిర్వహణ విషయంలో దేశవ్యాప్తంగా రెండువేల కోట్లతో ప్రత్యేక ప్రాజెక్టు కింద పనులు చేపట్టినట్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. అందులో ఏపీలో మెజార్టీ కార్యాకలాపాలు నిర్వహించబోతున్నట్లు పేర్కొన్నారు. కొండపావులూరులో ఎన్ఐడీఎం నిర్మాణం ఏడాదిలోపే పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం నుంచి పూర్తిస్థాయిలో సహకారం ఉంటుందని తెలిపారు. కాగా అతి పెద్ద కోస్తా తీరం, దక్కన్ పీఠభూమి, పశ్చిమ కనుమలతో ఉండే దక్షిణ భారతదేశంలో విపత్తులకు ఆస్కారం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఈ సెంటర్ ద్వారా విపత్తుల సమయంలో ప్రజలను ఆదుకోవడంతో పాటు ఎదుర్కొనే సత్తా ఎన్డీఆర్ఎఫ్కు ఉంది. కాగా ఈ కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ కొనకళ్ల నారాయణ, పలువురు అధికారులు పాల్గొన్నారు.