హైదరాబాద్ : పై-లిన్ తుపాను ముప్పును ఎదుర్కొనేందుకు అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నామని విపత్తు నివారణ శాఖ కమిషనర్ రాధా తెలిపారు. క్షేత్రస్థాయిలో అధికార యంత్రాంగాన్ని సిద్ధం చేసినట్లు ఆయన శనివారమిక్కడ పేర్కొన్నారు. ప్రతీ తీర ప్రాంతంలో రెవెన్యూ బృందం అప్రమత్తంగా ఉందని, తుపాను తీరం దాటేటప్పుడు గాలులు ఎక్కువగా ఉండవచ్చని తెలిపారు. మరబోట్లతో సముద్రంలోకి వేటకు వెళ్లిన జాలర్ల జాడ కనుక్కోవటం కష్టంగా ఉందని రాధా చెప్పారు.
కాగా విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం బర్రెపేటలో ముగ్గురు, పిప్పల వలసలో ఒకరు సముద్రంలో చిక్కుకున్నారు. తుపాను ప్రభావిత తీర ప్రాంత గ్రామాల్లో సహాయక చర్యల కోసం 250మంది ఆర్మీ సైన్యం జిల్లాకు చేరుకుంది. కాకినాడలో తుపాను నేపధ్యంలో కాకినాడ-ఉప్పాడ బీచ్‌రోడ్డును పోలీసులు మూసివేసి, వాహనాల రాకపోకలను నిలిపివేశారు. సహాయక చర్యలను పర్యవేక్షించేందుకు విశాఖ చేరుకున్న రెవెన్యూ మంత్రి రఘువీరారెడ్డి ఫిషింగ్ హార్బర్‌ను సందర్శించారు.
విజయనగరం: 0892-2236947 టోల్ ఫ్రీ: 1077
తూర్పుగోదావరి: 0884-2365506
పశ్చిమగోదావరి: 0881230617
నెల్లూరు: 08612331477