Phailin
-
పైలీన్ కంటే తీవ్రంగా దూసుకొస్తున్న హుదూద్
హుదూద్ తుఫాను గత సంవత్సరం అక్టోబర్ నెలలో వచ్చిన పైలీన్ తుఫాను కంటే మరింత బీభత్సంగా ఉంటుందని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీని ప్రభావంతో గాలి వేగం ఎక్కువగా ఉంటుందని అంటున్నారు. దీని ప్రభావంతో శుక్రవారం నాడు ఈదురుగాలులు, శనివారం ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపారు. ఆదివారం మధ్యాహ్నానికి ఇది విశాఖపట్నం, గోపాల్పూర్ మధ్య ఏదో ఒక ప్రాంతంలో తీరం దాటే అవకాశం ఉంది. ప్రస్తుతం హుదూద్ తుఫాను విశాఖపట్నానికి 600 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. దీని ప్రభావంతో సముద్రం రెండు మూడు అడుగులు ముందుకు రావచ్చని చెబుతున్నారు. ప్రధానంగా విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలతో పాటు ఉభయ గోదావరి జిల్లాలపై తుఫాను ప్రభావం అధికంగా ఉండబోతోంది. శ్రీకాకుళం జిల్లాకు ఆంధ్రప్రదేశ్‌లోనే అత్యధికంగా 192 కిలోమీటర్ల తీరప్రాంతం ఉండటంతో ఇక్కడ తుఫాను మరింత ఎక్కువ ప్రభావం చూపిస్తుందని ఆందోళన వ్యక్తమవుతోంది. దాంతో ఇప్పటికే ఆర్మీ, నేవీ, కోస్ట్‌గార్డ్ దళాలు అప్రమత్తమయ్యాయి. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా చేరుకున్నాయి. శ్రీకాకుళం కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ ముందు జాగ్రత్త చర్యలను సమీక్షిస్తున్నారు. మరోవైపు గుంటూరు జిల్లా యంత్రాంగం కూడా తుఫాను నేపథ్యంలో అప్రమత్తమైంది. జిల్లాలోని అందరు ఆర్డీవోలు, తహసీల్దార్లతో కలెక్టర్ కాంతిలాల్ దండే సమీక్షించారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. విశాఖపట్నం ఓడరేవులో రెండో నెంబరు ప్రమాదహెచ్చరిక ఎగరేశారు. కలెక్టరేట్లో కంట్రోల్ రూంలు ఏర్పాటుచేశారు. వీటి నెంబర్లు 0863-2234070, 2234301. -
తల్లడిల్లుతున్న తీరప్రాంతం
రేపల్లె, న్యూస్‌లైన్: వరుస తుపానులతో తీరం తల్లడిల్లిపోతోంది. బంగాళాఖాతంలో ఏర్పడ్డ మాదీ తుపాను బలపడి తీవ్రంగా మారుతుందనే హెచ్చరికలు తీరప్రాంత ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. నిజాంపట్నం హార్బర్లో రెండవ నంబర్ ప్రమాద హెచ్చరికను జారీచేశారు. వేటకు వెళ్లిన మత్య్సకారులు ఒడ్డుకుచేరాలని ఫోన్ మెసెజ్‌లను అందించారు. దీంతో సముద్రంలోకి వేటకు వెళ్లిన బోట్లు ఒక్కొక్కటిగా హార్బర్‌కు చేరుకుంటున్నాయి. వరుసగా గత రెండు మాసాలలో పైలీన్, హెలెన్, అధిక వర్షపాతాలు, లెహర్లతో ఇబ్బందులకు గురైన తీరప్రాంత ప్రజలు ‘మాదీ’ తుపాను హెచ్చరికలు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. ఆక్టోబర్ మాసంలో పైలీన్, నవంబర్ మొదటివారంలో హెలెన్, చివరి వారంలో లెహర్ తుపానులు సంభవించడంతో సముద్రపు వేట పూర్తిగా నిలిచిపోయింది. ఒక్క తుపాను ప్రభావం నుంచి పూర్తిగా తేరుకోకముందే మరొక తుపాను ముంచుకొస్తుండడంతో తీరప్రాంతంలోని మత్య్సపరిశ్రమ తీవ్ర సంక్షోభంలో పడింది. నిజాంపట్నం హార్బర్లో 150 మెక్‌నైజ్డ్ బోట్లు, నిజాంపట్నం, రేపల్లె మండలాల పరిధిలో 700 వరకు మోటరైజ్డ్ బోట్లలో మత్య్సకారులు నిరంతరం సముద్ర వేట నిర్వహిస్తుంటారు. వరుస తుపానులతో పనులు లేక మత్స్యకార కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనాల్సిన దుస్థితి ఏర్పడింది. విపత్కర పరిస్థితుల్లో పనులు కోల్పోతున్న మత్య్సకారులను ఆదుకునే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వినవస్తున్నాయి. -
పైరు పోయింది.. కన్నీరు మిగిలింది
వరుస విపత్తులతో వెన్నువిరిగిన అన్నదాత శ్రీకాకుళం, విశాఖపట్నం, కాకినాడ, ఏలూరు, విజయవాడ, సాక్షి ప్రతినిధులు వరుస విపత్తులు.. ఒకదాని వెనుక మరొకటి ముంచుకొస్తున్న తుపాన్లు.. మొన్న పై-లీన్, నిన్న కుండపోత వర్షాలు.. నేడు హెలెన్.. అన్నదాతను దెబ్బ మీద దెబ్బ కొడుతున్నాయి. ఇవన్నీ చాలవన్నట్టు లెహెర్ రూపంలో మరో పెను తుపాను తరుముకొస్తోంది! కేవలం నెల వ్యవధిలోనే కనీవినీ ఎరుగని రీతిలో ప్రకృతి విరుచుకుపడడంతో రాష్ట్రంలో రైతులు విలవిలలాడిపోతున్నారు. ఇన్నాళ్లూ కంటికి రెప్పలా కాపాడుకున్న వరి పంట సరిగ్గా చేతికొచ్చే సమయంలోనే సర్వనాశనమైంది. ఖరీఫ్‌లో వేసిన పంటంతా ఆనవాళ్లు లేకుండా తుడిచిపెట్టుకుపోయింది. శ్రీకాకుళం, విశాఖపట్నం, తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లో పెనునష్టం వాటి ల్లింది. హెలెన్ దెబ్బకు ఈ ఐదు జిల్లాల్లోనే దాదాపు 11 లక్షల ఎకరాల్లో వరి పంట దెబ్బతింది. కోనసీమ కల్పవృక్షమైన కొబ్బరి దారుణంగా దెబ్బతింది. లక్షకు పైగా కొబ్బరి చెట్లు నేలకూలడంతో రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. మామిడి, అరటి, జీడి తోటలతోపాటు కాయగూర పంటలు కూడా హెలెన్ దెబ్బకు నేలపాలయ్యాయి. ఈ వరుస విపత్తులతో ఈ ఐదు జిల్లాల్లోనే వరి రైతులకు రూ.1,800 కోట్ల నష్టం వాటిల్లింది. ఇతర పంటలకు మరో రూ.500 కోట్ల నష్టం జరిగింది. గోరుచుట్టుపై రోకటిపోటులా రైతులపై దెబ్బమీద దెబ్బ పడుతున్నా ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోంది. నష్టపరిహారం ఊసే మర్చిపోయింది. పెట్టుబడి రాయితీ అందని ద్రాక్షే అవుతోంది. అక్కడక్కడ ఏదో మొక్కుబడిగా కొందరు రైతులకు పరిహారం అందజేసి ప్రభుత్వం చేతులు దులుపుకుంటోంది. పశ్చిమగోదావరికి పెను నష్టం.. ఈ ఏడాది పశ్చిమగోదావరి జిల్లాను వరుస తుపానులు కోలుకోలేని విధంగా దెబ్బతీశాయి. రైతులకు అపార నష్టం వాటిల్లింది. తాజా హెలెన్ తుపాను కారణంగా భారీ వర్షాలు కురిసి 2.73 లక్షల ఎకరాల్లో వరి పంట దెబ్బతింది. అంతకు ముందు పై-లీన్ కారణంగా 34,171 ఎకరాల్లో వరి నాశనమైంది. ఈ రెండు తుపానుల కారణంగా జిల్లాల్లో రైతులు రూ.220 కోట్ల మేర నష్టపోయారు. జిల్లా అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడం తప్పితే నష్టపోయిన రైతులకు ఇప్పటికీ పైసా పెట్టుబడి రాయితీ అందించలేదు. ‘తూర్పు’లో కుదేలైన కొబ్బరి రైతు వరి అత్యధికంగా పండించే తూర్పుగోదావరి జిల్లా వరుస తుపాన్లతో అల్లాడింది. జిల్లాలో హెలెన్ దెబ్బకు దాదాపు 4.70 లక్షల ఎకరాల్లో వరి దెబ్బతింది. కోనసీమలో కొబ్బరి రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈ ఒక్క జిల్లాలోనే సుమారు 80 వేల కొబ్బరి చెట్లు కూలిపోవడంతో కోట్లలో నష్టం వాటిల్లింది. బోండాలు రాలిన నష్టమే రూ.28 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. మొత్తమ్మీద ఈ జిల్లాలో రైతులు రూ.225 కోట్ల మేర నష్టపోయారు. శ్రీకాకుళంలో అపార నష్టం పై-లీన్, హెలెన్ దెబ్బకు జిల్లాలో ఆహార పంటలతో పాటు ఉద్యాన పంటలు పనికి రాకుండా పోయాయి. వరి, ఇతర పంట పొలాల్లో ఇంకా నీరు నిలిచే ఉండడంతో రైతులు దిగుబడిపై ఆశలు వదులుకున్నారు. అధికారుల అంచనా ప్రకారం పై-లీన్, హెలెన్ కారణంగా సుమారు 3 లక్షల ఎకరాల్లో పంటలు నీటిపాలయ్యాయి. కొబ్బరి, జీడి తోటలు నాశనమవడంతో రైతుల గుండె చెదిరింది. రెండు తుపాన్లతో జిల్లాలో రైతులు రూ.312 కోట్ల మేర నష్టపోయారు. విపత్తులతో జిల్లాలో 80 వేల మంది రైతులు నష్టపోయినా ప్రభుత్వం నుంచి వారికి ఇప్పటికీ నయా పైసా సాయం అందలేదు. విశాఖకు ‘నీలం’ సాయమే అందలేదు.. జిల్లాలో గతేడాది నీలం తుపానుతో నష్టపోయిన రైతులకే పరిహారం నేటికీ అందలేదు. తాజాగా వచ్చిన పై-లీన్, హెలెన్ తుపాన్లతో రూ.416.76 కోట్ల మేర పంట నష్టం వాటిల్లింది. విపత్తులతో 71,042.5 ఎకరాల్లో రూ.59.62 కోట్ల పంట నష్టం జరిగిందని అధికారులు లెక్క కట్టారు. 61,269మంది రైతులు నష్టపోయినట్టు గుర్తించారు. ఇప్పటికీ వారికి పెట్టుబడి రాయితీ పూర్తిస్థాయిలో అందలేదు. కృష్ణా జిల్లాలో భారీ నష్టం వరుస తుపాన్లతో కృష్ణా జిల్లాలో 2.25 లక్షల ఎకరాల్లో వరి పంట నీట మునిగింది. నీటిపాలైన పంటలో కొంతైనా దక్కకపోతుందా అనే ఆశతో రైతన్నలు చేల వద్దే రాత్రి పగలు నీటిని తోడుతున్నారు. గూడూరు, మచిలీపట్నం, పెడన, బంటుమిల్లి, కత్తివెన్ను మండలాల్లోని వరి పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. అవనిగడ్డ, పామర్రు, పెనమలూరు నియోజకవర్గాల పరిధిలోని పలు ప్రాంతాల్లో దాదాపు 46 వేల ఎకరాల్లో కూరగాయల తోటలు దెబ్బతిన్నాయి. అధికారుల ప్రాథమిక అంచనా ప్రకారం రైతులకు రూ.275 కోట్ల మేర నష్టం వాటిల్లింది. పై-లీన్ తుపాను కారణంగా నష్టపోయిన 60 వేల మంది రైతులకు ఇప్పటికీ పైసా సహాయం అందలేదు. అప్పులెలా తీర్చాలో తెలియడం లేదు.. ‘‘నేను రెండెకరాల భూమి కౌలుకు తీసుకొని వరి వేశా. మొన్న అక్టోబర్‌లో భారీ వర్షాల వల్ల గింజ సరిగా పాలుపోసుకోలేదు. ఉన్నవాటినైనా దక్కించుకుందామనుకున్న సమయంలో హెలెన్ వచ్చింది. పైరు మొత్తం నీట మునిగింది. ఇప్పటివరకు అప్పులు తెచ్చి రెండెకరాలకు రూ.40 వేలు పెట్టుబడి పెట్టాను. పంట పోయింది. చేతిలో చిల్లిగవ్వ లేదు. అప్పు ఎలా తీర్చాలో అర్థం కావడం లేదు’’ - భూపతి పరశురామయ్య, చినకామనపూడి, కృష్ణా జిల్లా పంటపై ఆశలు వదిలేసుకున్నా.. ‘‘నేను సొంతానికి ఐదెకరాలు, కౌలుకు మరో ఐదెకరాలు సాగు చేస్తున్నాను. ఎకరాకు రూ.15 వేల చొప్పున ఇప్పటి దాకా రూ.1.5 లక్షలు పెట్టుబడి పెట్టాను. మరో పది రోజుల్లో కోతలు కోద్దామని అనుకునే సరికి హెలెన్ ముంచేసింది. పంటపై ఆశలు వదిలేసుకున్నాను. ఇప్పుడున్న పరిస్థితుల్లో కోతలు కోయిస్తే కూలీల ఖర్చులకే అప్పులు చేయాల్సిన పరిస్థితి ఉంది. ఒక్క గింజ కూడా చేతికొచ్చే అవకాశంలేదు’’ - దున్నాల రామకృష్ణయ్య, వానపల్లిపాలెం, తూర్పుగోదావరి కూరగాయల రైతులకు పరిహారం ఇవ్వాలి ‘‘ఎన్నో ఏళ్లుగా కూరగాయ పంటలు సాగుచేస్తున్నాను. తుపానులు, భారీ వర్షాలతో ఈ ఏడాది మొక్కలు, పాదులు నాశనమయ్యాయి. ఎకరం విస్తీర్ణంలో కూరగాయలకు రూ.20 వేల పెట్టుబడి పెట్టాను. ఇంత దారుణంగా ఎన్నడూ నష్టపోలేదు. ప్రభుత్వం కూరగాయల రైతులకు కూడా నష్టపరిహారం అందజేసి ఆదుకోవాలి’’ - జక్కంశెట్టి రాముడు, జిన్నూరు, పశ్చిమగోదావరి జిల్లా -
'సెల్ ఫోన్ లైట్లతో పంట నష్టం అంచనా వేయడం దారుణం'
ఆంధ్రప్రదేశ్ నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున 33 మంది ఎంపీలు లోక్‌సభకు ఎన్నికయ్యారు. కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటులో వారు కీలక పాత్ర పోషించారు. అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం రాష్ట్రంపై చిన్న చూపు చూస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి ఆరోపించారు. బుధవారం హైదరాబాద్‌లో గవర్నర్ ఈ ఎస్ ఎల్ నరసింహన్‌ను బీజేపీ నేతలు కలిశారు. అనంతరం కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. పై-లిన్ తుపాన్ బాధితులను ఆదుకోవడానికి రూ.46 వేల కోట్లు కావాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరిందని, అయితే కేంద్రం మాత్రం రూ. 2 వేల కోట్లు ఇచ్చిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సెల్ ఫోన్ లైట్లతో పంట నష్ట్రాన్ని అంచనా వేయడం దారుణమని ఆయన వ్యాఖ్యానించారు. పంట పోయిందని ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు భరోసా కల్పించాలని కిషన్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. -
పైలీన్ ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా పంటలకు భారీ నష్టం
సాక్షి, నరసరావుపేట జిల్లాలో వరి, మిర్చి, పత్తి, అక్కడక్కడా వేరుశనగ, పసుపు, కంది, పొగాకు వంటి పంటలను పండించడం రైతులకు అలవాటుగా ఉంది. అయితే ప్రధాన పంటలకు ప్రభుత్వ సబ్సిడీలు రాకపోవడంతో మండలాల్లో అధిక శాతంలో వేసిన వరి, మిర్చి, పత్తి పంటల్లో కొంత విస్తీర్ణాన్ని తగ్గించి జొన్న, జూట్, సజ్జ, పెసర, మినుము, నువ్వులు, సోయాబీన్, ఆముదం మొదలగు పంటలు వేసినట్లుగా లెక్కలు తయారు చేసి పంపడం వ్యవసాయాధికారులకు పరిపాటిగా మారి ం ది. ఈ పంటలకు విత్తనాల దగ్గర నుంచి ప్రతి ఒక్కదానికి ప్రభుత్వం అధిక శాతం సబ్సిడీ ఇస్తుండటంతో వీ టి ద్వారా లబ్ధిపొందాలనే ఉద్దేశంతో రైతులు ఈ పం టలను అధికంగా సాగు చేసినట్లుగా లెక్కలు తయారు చేసి అధికారులకు పంపుతున్నారు. అయితే వ్యవసాయాధికారులు పంపుతున్న తప్పుడు లెక్కలు కొన్ని సందర్భాల్లో రైతుల పాలిట శాపంగా మారుతున్నాయి. అదెలాగంటే.. గతంలో నీలం తుపాను, ఇటీవల పై-లీన్ తుపాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు అధిక శాతం పత్తి, మిర్చి, వరి పంటలు దెబ్బతిన్నాయి. అయితే అధికారులు కొన్ని మండలాల్లో వీటి సాగును తగ్గించి పంపివుండడంతో, దెబ్బతిన్న పంటల విస్తీర్ణాన్ని కూడా తక్కువ చేయాల్సిన దుస్థితి నెలకొంది. దీంతో దెబ్బతిన్న పంటలను పరిహార జాబితాలోకి చేర్చకపోవడంతో బాధిత రైతులు తీవ్రంగా నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొంతమంది రైతులు పదెకరాల్లో వరి, మిర్చి, పత్తి సాగు చేసి పూర్తిగా నష్టపోయినప్పటికీ లెక్కలను సరి చేయాలనే ఉద్దేశంతో 50 శాతం కంటే ఎక్కువ దెబ్బతిన్న పంటలను మాత్రమే జాబితాలో చేర్చాలనే ప్రభుత్వ నిబంధన సాకుగా చూపుతూ రెండు మూడెకరాల్లో మాత్రమే పంట నష్టం జరిగిందని లెక్కలురాసి చేతులు దులుపుకుంటున్నారు. వ్యవసాయాధికారులు ప్రధాన పంటల విస్తీర్ణాన్ని తగ్గించి ఇతర పంటల సాగును అధికంగా చూపడం ప్రస్తుత విపత్తు సమయంలో రైతులకు తీవ్ర నష్టాన్ని చేకూర్చే అంశంగా మారింది. అధికారుల లెక్కల ప్రకారం పంట సాగు వివరాలు జిల్లాలో వ్యవసాయాధికారుల లెక్కల ప్రకారం మొత్తం 5,59,831 హెక్టార్లలో పంటలను సాగు చేశారు. వరి 2,63,481 హెక్టార్లు, పత్తి 1,80,202 హెక్టార్లు, మిర్చి 57,030 హెక్టార్లలో సాగు చేసినట్లుగా వ్యవసాయాధికారులు లెక్కలు చూపారు. సబ్సిడీలు అధికంగా వచ్చే జొన్న, సజ్జ, కంది, మొక్కజొన్న, పెసర, మినుము, వేరుశనగ, నువ్వులు, సోయాబీన్, ఆముదం, చెరకు, పసుపు, పొగాకు, జూట్ మరికొన్ని ఇతర పంటలు కలిపి 59,118 హెక్టార్లలో సాగు చేసినట్లుగా చూపారు. అయితే పంటల విస్తీర్ణాన్ని పరిశీలిస్తే వరి, పత్తి, మిర్చి పంటలు మినహా మిగిలిన అన్ని పంటల విస్తీర్ణం 20వేల హెక్టార్లలోపుగానే ఉంటుందని రైతుసంఘాల నాయకులు చెబు తున్నారు. వీటిని ఎక్కువగా చూపడం వల్ల పంట నష్టపరిహారం అంచనా జాబితాలో వేలాది మంది బాధిత రైతులకు అన్యాయం జరుగుతుందని వారు మండిపడుతున్నారు. -
బాంబు పేలుళ్ల నుంచి రాంచీని రక్షించిన ఫైలీన్ తుఫాన్
ఇటీవల వచ్చిన ఫై-లీన్ తుఫాన్ ఒడిషాతో పాటు ఉత్తరాంధ్రకు అపార నష్టం కలిగించగా, జార్ఖండ్ రాజధాని రాంచీకి మాత్రం ఎంతో మేలు చేసింది. పెద్ద ఉపద్రవం నుంచి బయటపడేసింది. గత నెలలో దుర్గా పూజ సందర్భంగా రాంచీలో వరుస బాంబు పేలుళ్లకు ఉగ్రవాదులు కుట్ర పన్నిన సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ), జార్ఖండ్ పోలీసులు ఇటీవల రాంచీలోని ఓ లాడ్జిపై దాడి చేసి తొమ్మిది బాంబులు, 25 జిలెటిన్ స్టిక్స్, 14 డిటోనేటర్లు, 12 టైమర్లను స్వాధీనం చేసుకున్నారు. దుర్గా పూజ సందర్భంగా రాంచీలో పేల్చేందుకు బాంబులను సిద్ధం చేసినట్టు ఓ పోలీస్ అధికారి తెలిపారు. సాధారణంగా ప్రజలు భారీ సంఖ్యలో పూజా కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు. అయితే గత నెలలో తుఫాన్ కారణంగా రాంచీలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురిశాయి. దీంతో ప్రజలు ఇళ్లు విడిచి బయటకు రాలేకపోయారు. దీంతో ఉగ్రవాదుల పన్నాగం విఫలమైంది. ఇండియన్ ముజాహిద్దీన్ జార్ఖండ్‌లోని కొన్ని ప్రాంతాల్లో యువతను ఉగ్రవాద కార్యకలాపాల వైపు మళ్లిస్తోందనే ఆరోపణలు వస్తున్నాయి. పాట్నా బాంబు పేలుళ్ల కేసులో రాంచీకి చెందిన ఇద్దరు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. -
వర్షం దెబ్బ
ఉట్నూర్, న్యూస్‌లైన్ : జిల్లా వ్యాప్తంగా రైతులు 62,300 ఎకరాల్లో టమాటా సాగు చేశారు. మంచి ధర పలకడం, స్వల్పకాలిక పంటకావడంతో రైతులు మొగ్గు చూపారు. జిల్లాలోని ఇంద్రవెల్లి, జైనథ్, కెరమెరి, గుడిహత్నూర్, ఉట్నూర్, సిర్పూర్(యు), బజార్హత్నూర్, నార్నూర్, జైనూర్, బోథ్, తాంసి, తలమడుగు, ఇచ్చోడ, నేరడిగొండ మండలాల్లో టమాటా సాగవుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇంద్రవెల్లి మండలం టమాటా సాగులో పేరు గాంచింది. ఇక్కడ ఈసారి దాదాపు 5 వేల హెక్టార్లలో పంట సాగు చేస్తున్నారు. టమాటాకు మంచి ధర పలకడంతో ఆశించిన లాభాలు వస్తాయని రైతులు భావించారు. కానీ వర్షాలు, వరదలు నట్టేట ముంచాయి. నిండాముంచిన వర్షాలు.. పొగమంచు.. వర్షాలు, వరదలు టమాటా రైతులను నిండా ముంచాయి. పది రోజుల క్రితం బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, పై-లీన్ తుపాన్ ప్రభావంలో టమాటా సాగుపై పండింది. అధిక వర్షాలతో చేలలో నీరు నిల్వ ఉండటంతో మొక్కల వేర్లు మురిగిపోయాయి. దీనికి తోడు టమాటా కాయలు బురదలో వేలాడటంతో మురిగిపోయాయి. రైతులు చేలలోకి వెళ్లే పరిస్థితి లేకపోవడంతో బ్యాక్టిరియా సోకి కాయలకు నల్లమచ్చలు ఏర్పడ్డాయి. ఇటువంటి టమాటాలను ఏరివేస్తున్నా ఫలితం ఉండటం లేదని రైతులు పేర్కొంటున్నారు. టమాటా దిగుబడి పెరగాలంటే పొగమంచు అదుపులో ఉండాలి. కానీ, ఆకాల వర్షాలు తగ్గినప్పటి నుంచి వేకువజామున పొగమంచు విపరీతంగా కురుస్తుండటంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. పొగమంచు పెరగడంతో కాత, పూత రాలడం.. కాయ ఎదుగుదల లేకుండా పోయి దిగుబడి తగ్గుతోంది. పొగమంచు తగ్గుముఖం పడితే గాని దిగుబడి పెరిగే అవకాశం లేదని రైతులు తెలుపుతున్నారు. టమాటా సీజన్ కావడంతో సాధారణంగా ఈ సీజన్లో కిలో టమాటా ధర రూ. 10 నుంచి రూ.20 మధ్య ఉంటుంది. కానీ, వర్షాలు, పొగమంచు కారణంగా దిగుబడి తగ్గడంతో మార్కెట్లో ప్రస్తుతం కిలో టమాటా ధర రూ.40పైగా పలుకుతోంది. మార్కెట్లో ధర ఉండటం, పంట దిగుబడి లేక రైతులు అల్లాడుతున్నారు. నష్టాల ఊబిలో రైతులు ఎకరం టమాటా పంట సాగు చేయాలంటే రైతుకు రూ.20 వేల నుంచి రూ.25వేల వరకు పెట్టుబడికి ఖర్చవుతుంది. ఎకరం సాగులో వారానికి 20 క్యారెట్ల టామాటాను మార్కెకు తరలిస్తే రైతులకు లాభాలు వస్తాయి. ఈసారి వర్షాలు, పొగమంచు కారణంగా దిగుబడి తగ్గి ఎకరం చేనులో వారానికి మూడు లేదా నాలుగు క్యారెట్ల టమాటా కూడా మార్కెట్‌కు తరలించడం లేదు. కానీ, గతేడాది దిగుమతి పెరిగి.. ధర లేక నష్టపోయామని రైతులు పేర్కొంటున్నారు. ఈ మూడు, నాలుగు క్యారెట్ల టమాటా కాయలపై కూడా నల్లమచ్చలు ఉండటంతో ధర రావడం లేదని రైతులు వాపోతున్నారు. ప్రస్తుతం క్యారెట్ ధర రూ.700 నుంచి రూ.1,300 వరకు పలుకుతుంది. ఈ సమయంలో టమాటా దిగుబడి ఆశించిన విధంగా ఉంటే లాభాలు వచ్చేవని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
నిట్టూర్పే మిగిలింది!
శ్రీకాకుళం, కలెక్టరేట్: జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి పర్యటన మొక్కుబడిగా ముగిసింది. పై-లీన్ తుపాను, భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమైన జిల్లాలో సీఎం పర్యటిస్తున్నారంటే తమకు ఏదైనా మేలు జరుగుతుందని ప్రజలు భావించారు. తమ గోడు వింటారు.. సమస్యలు పరిష్కరిస్తారు.. పునరావాసం, వరదల నుంచి శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఆశించారు. పరిహారం కూడా ఎక్కువ వస్తుందని ఎదురుచూశారు. ఎంతో ఆశించిన ప్రజలు సీఎం పర్యటన తర్వాత తీవ్ర నిరాశకు గురయ్యారు. గతాంశాలే తప్ప ప్రస్తుతం వాటిల్లిన నష్టాన్ని ఎలా భర్తీ చేయనున్నారో ఒక్క మాట కూడా చెప్పలేదు. నాలుగు చోట్ల పర్యటనలోకానీ, విలేకరుల సమావేశంలో కానీ ఏ అంశంపైనా స్పష్టమైన వాగ్దానంగానీ, పరిహారానికి సంబంధించి నిధులు గురించి కానీ ప్రస్తావించలేదు. పై-లీన్ తుపాను వల్ల సుమారు రూ.435కోట్లు జిల్లాలో నష్టం వాటిల్లిందని జిల్లా యంత్రాంగం వారం రోజుల కిందటే ముఖ్యమంత్రికి నివేదిక సమర్పించింది. క్షేత్రస్థాయి పర్యటన తర్వాత నష్టం మరింత పెరిగింది. ఈనెల 23 నుంచి 28 వరకు కురిసిన భారీ వర్షాలతో జిల్లాలో వ్యవసాయంతో పాటు ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులకు తీవ్ర నష్టం వాటిల్లింది. దీనిని పూడ్చేందుకు, బాధితులను ఆదుకునేందుకు రూ.529 కోట్లు కావాలని జిల్లా యంత్రాంగం మరో నివేదిక అందజేసింది. ్ల సుమారు వెయ్యి కోట్లు నష్టం జరిగిందని అధికారులు ముఖ్యమంత్రికి నివేదించినా పరిహారంపై ఏ విధమైన హామీ ఇవ్వలేదు. ‘నీలం’పైనా చర్యలేనట 2012 అక్టోబర్‌లో సంభవించిన నీలం తుపానుకు సంబంధించి జిల్లాకు ఇంతవరకూ ఇన్‌పు ట్ సబ్సిడీ రాలేదు. వారం రోజుల్లో చెల్లించేం దుకు చర్యలు తీసుకుంటామన్నరే తప్ప స్పష్టమైన హామీ ఇవ్వలేదు. రబీకి ఉచితంగా విత్తనాలు ఇవ్వాలని కోరినా రాయితీపై తప్ప ఉచితంగా ప్రస్తావించలేదు. రుణాల మాఫీపై ప్రస్తావిస్తే కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తామన్నారే తప్ప ప్రభుత్వ వాటాగా కొంత మేరైనా ఆదుకుంటామని భరోసా ఇవ్వలేదు. ఒప్పంగి లో రైతాంగం బాగా నష్టపోయిందని రుణాలు తీర్చుకోలేని పరిస్థితిలో ఉన్నామని ఆత్మహత్యలే శరణ్యమన్నపుడు కూడా రుణమాఫీ ప్రస్తావించలేదు. రీషెడ్యూల్ చేస్తామన్నారు. దీనివల్ల మరింత రుణభారం పెరుగుతుంది. విద్యార్థులకూ మొండి చేయి ఇటీవల వచ్చిన తుపాను వల్ల జిల్లావ్యాప్తంగా పంటలు దెబ్బతినడంతో ఫీజులు చెల్లించలేని స్థితిలో విద్యార్థులు ఉన్నారు. పరీక్ష ఫీజు మినహాయింపు విద్యార్థులు కోరుతున్నారు. దీనిపై గతంలో ముఖ్యమంత్రి జిల్లా పర్యటనలో ఈ అంశాన్ని పరిశీలిస్తామని చెప్పిన ఈసారి ఈ విషయాన్నే ఆయన ప్రస్తావించలేదు. ప్రతిపక్ష నేతల పర్యటనలతో... ముఖ్యమంత్రి పర్యటన వెనుక ప్రతిపక్ష నేతల పర్యటనే కారణమనే విమర్శలు వస్తున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పర్యటన పూర్తైది. రాష్ట్రంలో బలమైన ప్రతిపక్ష పార్టీ నేత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ బుధవారం జిల్లాలో పర్యటించేందుకు రావడంతో సీఎంకు రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రతిపక్ష పార్టీ నేతలు ప్రజల సానుభూతి ఎక్కడ పొందుతారో అన్న భయంతో ముఖ్యమంత్రి జిల్లాలో పర్యటనకు వచ్చారని విమర్శలు వస్తున్నాయి. ఏ విధమైన స్పష్టమైన హామీలు ఇవ్వని సీఎం పర్యటన వల్ల ఉపయోగమేమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. -
రైతులకు ధైర్యాన్నిచ్చిన విజయమ్మ
-
రైతులకు ధైర్యాన్నిచ్చిన విజయమ్మ
దొంగరావిపాలెం (పెనుగొండ రూరల్), న్యూస్‌లైన్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ సోమవారం జిల్లాలో వరద ముంపు ప్రాంతాలను పరిశీలించి పంట నష్టపోయిన రైతుల్లో ఆత్మస్థైరాన్ని నింపారని ఆ పార్టీ జిల్లా కన్వీనర్, పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు అన్నారు. విజయమ్మ జిల్లా పర్యటన ముగిసిన అనంతరం దొంగరావిపాలెంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో విజయమ్మ నాలుగు నియోజకవర్గాల్లో పర్యటించారని, అడుగడుగునా రైతులు ఆమె వద్ద గోడు వెళ్లబోసుకున్నారని చెప్పారు. పెట్టుబడులు నష్టపోయి నిండా మునిగి పోయామని ఆమె వద్ద రైతులు ఆవేదన చెందినట్టు తెలిపారు. రైతులకు భరోసా కల్పించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని విమర్శించారు. తూతూమంత్రం చర్యలతో ప్రభుత్వం చేతులు దులుపుకుంటోందని ఆరోపించారు. వారం రోజులుగా చేలల్లో నీరు నిలిచి పనలు కుళ్లిపోతున్నా.. అధికారులు నష్టం అంచనాలకు సమాయత్తం కాకపోవడం దారుణమన్నారు. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి రైతులకు అధిక నష్టపరిహారం ఇప్పించేందుకు, రుణమాఫీ చేసేందుకు విజయమ్మ పోరాటం చేస్తానని చెప్పారన్నారు. కౌలు రైతులకు రుణాలను రీషెడ్యూల్ చేయాలని, సబ్సిడీపై విత్తనాలు సరఫరా చేయాలని, ఇన్పుట్ సబ్సిడీ వెంటనే విడుదల చేయాలని బాలరాజు డిమాండ్ చేశారు. డెల్టా ఆధునికీకరణను వేగవంతం చేయాలని విజయమ్మ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారన్నారు. మహానేత వైఎస్సార్ హయాంలో రుణమాఫీ చేసి రైతులను ఆదుకున్నారని గుర్తుచేశారు. పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయితేనే రైతులకు పూర్తిన్యాయం జరుగుతుందని బాలరాజు పేర్కొన్నారు. వైసీపీ జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు గూడూరి ఉమాబాల, మాజీ ఎమ్మెల్యే తానేటి వనిత, ఆచంట, చింతలపూడి సమన్వయకర్తలు కండిబోయిన శ్రీనివాసు, కర్రా రాజారావు, జిల్లా అధికార ప్రతినిధి ఊదరగొండి చంద్రమౌళి, పెనుగొండ సర్పంచ్ యాదాల ఆశాజ్యోతి, ఆచంట మాజీ జెడ్పీటీసీ సభ్యు డు ముప్పాళ వెంకటేశ్వరరావు, వైసీపీ ఆచంట, పెనుగొండ మండల కన్వీనర్లు గుడాల విజయబాబు, యాదాల రవిచంద్ర, జిల్లా కార్యవర్గ సభ్యులు పిల్లి వెంకట సత్తిరాజు, యాదాల నాగరాజు, ఆలిండియా క్రిస్టియన్ కౌన్సిల్ మీడియా కార్యదర్శి గుత్తుల సాల్మన్ దొర, మాజీ ఎంపీపీ మట్టా ఆనంద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
తీరప్రాంత విద్యుత్ కష్టాలకు చెక్!
సాక్షి, విశాఖపట్నం :పై-లీన్ తుపానుతో కేంద్ర ప్రభుత్వంలో కదలిక వచ్చింది. తుపాను వచ్చిన ప్రతిసారీ తీరప్రాంతాల్లో విద్యుత్ వ్యవస్థ చిన్నాభిన్నం కావడంపై దృష్టి సారించింది. భవిష్యత్‌లో ఇలాంటి విపత్తులను ఎదుర్కొనేందుకు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగానే తుపాను ప్రభావిత తీర ప్రాంతాల్లో భూగర్భ విద్యుత్ లైన్ల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తోంది. తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఈపీడీసీఎల్) ఇప్పటికే రూ.100 కోట్లు ఖర్చుకాగల పనులకు ప్రతిపాదనల్ని కేంద్రానికి పంపించింది. ఐదు జిల్లాలు.. 20 ప్రాంతాలు జాతీయ తుపాను విపత్తు నిర్వహణ కార్యక్రమంలో భాగంగా జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ వివిధ విభాగాలను హెచ్చరించింది. భవిష్యత్‌లో తుపానులు సంభవిస్తే తట్టుకునేలా తీర ప్రాంతాల్లో నిర్మాణాలు, వివిధ వ్యవస్థలు ఆధునికీకరించుకోవాల్సిందిగా సూచించింది. ప్రపంచ బ్యాంకుకు చెందిన ఆర్థిక వ్యవ హారాల విభాగం అడాప్ట్బుల్ ప్రోగ్రాం లోన్ కింద నిధులు మంజూరుకు అంగీకరించింది. రాష్ట్రానికి రూ.1,496.71 కోట్లు ప్రతిపాదించగా.. ఇందులో ప్రపంచ బ్యాంకు రూ.1,198.44 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం రూ.298.27 కోట్లు భరించనున్నాయి. ఇందులో భాగంగా ఈపీడీసీఎల్ పరిధిలోని ఐదు జిల్లాల్లో 20 పట్టణ/మండల కేంద్రాల్లో భూగర్భ విద్యుత్ లైన్ల ఏర్పాటుకు ప్రతిపాదించారు. ఒక్కో ప్రాంతంలో రూ.2.50 కోట్ల వ్యయంతో 33/11 కేవీ భూగర్భ విద్యుత్ సబ్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నారు. ఇక్కడి నుంచి తీర ప్రాంతాలకు 151 కిలోమీటర్ల మేర భూగర్భ కేబుళ్లు ఏర్పాటు చేయనున్నారు. డీపీఆర్ తర్వాత పనులు ఢిల్లీలో ఉన్న జాతీయ విపత్తు నిర్వహణ సంస్థకు ఈపీడీసీఎల్ అధికారులు ఇప్పటికే ప్రతిపాదనలు పంపించారు. దీనిపై సమగ్ర నివేదిక తయారు చేయాల్సి ఉంది. ఇప్పటికే ఓ జాతీయ సంస్థకు ఈ బాధ్యతలు అప్పగించేందుకు కేం ద్రం సన్నద్ధమైనట్టు అధికారులు చెప్తున్నారు. పై-లీన్ తుపాను అనంతరం జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ఉపాధ్యక్షుడు మర్రి శశిధర్‌రెడ్డి జిల్లా పర్యటనలో భాగంగా మాట్లాడుతూ చాలా దేశాల్లోని తీర ప్రాంతాల్లో ఇప్పటికే భూగర్భ విద్యుత్ లైన్ల వ్యవస్థ అందుబాటులో ఉందని, ఇక్కడ కూడా ఆ వ్యవస్థ ఏర్పాటుకు కేంద్రానికి నివేదిస్తామన్నారు. -
ధైర్యంగా ఉండండి
‘అమ్మా.. ఈ పాలకులకు కనికరం లేదు. నష్టాల్లో కూరుపోయి.. కష్టాల్లో చిక్కుకున్న మమ్మల్ని పట్టించుకున్న నాథుడే లేడు. ఓటేసి గెలిపించిన ప్రజాప్రతినిధులెవరూ వచ్చింది లేదు. మాటమాత్రంగానైనా మమ్మల్ని పలకరించింది లేదు. రైతు ఏమైపోతున్నాడోనన్న ఆలోచన వాళ్లెవరికీ లేదు. ఇదిగోండమ్మా మేం పండించిన పంట. ఇదిగో ఇలా నీటిపాలైంది. అక్కడ చూడండి ధాన్యం మొలకొచ్చేస్తోంది. దీన్ని చూడండమ్మా.. ఈ చేను పొట్ట దశలో ఉంది. నీళ్లల్లో మునిగిపోవడంతో గింజలు దక్కే పరిస్థితి లేదు. ఇదేదో మా ఊరోళ్ల కష్టం మాత్రమే కాదమ్మా.. జిల్లాలో అన్ని పంటలూ మునిగిపోయూయి. రైతులంతా పుట్టెడు దుఃఖంలో ఉన్నారు. మమ్మల్ని ఆదుకోమని ఈ ప్రభుత్వమోళ్లకు మా ఆత్మబంధువైన మీరు గట్టిగా చెప్పండమ్మా...’ అంటూ వైఎస్ విజయమ్మ ఎదుట రైతులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. వారి కష్టాలను స్వయంగా చూసిన ఆ తల్లి గుండె చలించిపోయింది. ‘మీ రాజన్నే ఉంటే మీకు ఈ కష్టాలు వచ్చేవి కాదు. వ్యవసాయం పండగలా మారి ఉండేది. అధైర్యపడకండి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. మీకొచ్చిన కష్టాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి తెలియజేసి మిమ్మల్ని ఆదుకోమని గట్టిగా నిలదీస్తాం. ఆరు నెలలు ఓపిక పట్టండి. జగన్‌బాబు అధికారంలోకి వస్తాడు. మీ కష్టాలను కడతేరుస్తాడు’ అంటూ రైతన్నలకు విజయమ్మ భరోసా ఇచ్చారు. సాక్షి ప్రతినిధి, ఏలూరు : భారీ వర్షాలు రైతులను మరోసారి తీవ్రంగా కుంగదీశాయని.. వారికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అన్నివిధాలా అండగా ఉంటుందని పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ భరోసా ఇచ్చారు. రైతు బాగుంటేనే ప్రభుత్వాలు బాగుంటాయని వైఎస్ రాజశేఖరరెడ్డి భావించేవారని.. ఆ దిశగానే వారికి మేలు చేకూర్చేవారని తెలిపారు. కానీ గడచిన నాలుగేళ్ల నుంచి రైతులు ఏదో ఒక రూపంలో నష్టపోతున్నారని, ఈ ప్రభుత్వం అన్నదాతలను పట్టించుకున్న పాపానపోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. భారీ వర్షాలకు జిల్లాలో నీట మునిగి దెబ్బతిన్న పంట పొలాలను సోమవా రం ఆమె పరిశీలించారు. పలుచోట్ల రైతుల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వర్షాల కారణంగా జిల్లాలో నలుగురు చనిపోయారని వారి కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియో ఇవ్వాలని, రైతులను సత్వరమే ఆదుకునే చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వంతోపాటు కేంద్రంపైనా ఒత్తిడి తెస్తామని చెప్పారు. ఈ ప్రభుత్వం ఇంకా ఆరు నెలలు అధికారంలో ఉంటుందని, ఈలోపు రైతులను ఆదుకోవాలని కోరారు. ఈ కొద్దికాలం ఓపిక పడితే త్వరలోనే వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వస్తారని స్పష్టం చేశారు. అప్పుడు అందరికీ న్యాయం చేస్తారని భరోసా ఇచ్చారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలకు వైఎస్ జగన్మోహన్రెడ్డి శాశ్వత పరిష్కారాలు చూపిస్తారని హామీ ఇచ్చారు. రైతులు ధైర్యం కోల్పోకుండా నిబ్బరంగా ఉండాలని అన్నారు. ఉదయం 11గంటలకు కృష్ణాజిల్లా సరిహద్దున గల అప్పనవీడు వద్ద ఆమె జిల్లాలోకి ప్రవేశిం చారు. అక్కడి నుంచి ఉంగుటూరు మండలం నారాయణపురం చేరుకున్న విజయమ్మ నీటిలో నడుచుకుంటూ వెళ్లి మునిగిన వరి చేలను చూశారు. రైతులతో మాట్లాడి ఎంత నష్టం వచ్చింది, ఎంత పెట్టుబడి పెట్టారు వంటి విషయాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఉంగుటూరు మండలం నాచుగుంట వద్ద జాతీయ రహదారి పక్కన దెబ్బతిన్న పొలాలను చూసి రైతులతో మాట్లాడారు. అక్కడి నుంచి నేరుగా నందమూరు అక్విడెక్టు వద్దకు వెళ్లి పరిశీలించారు. ఎర్రకాలువ పొంగినప్పుడల్లా తమ పొలాలు ముని గిపోతున్నాయని అక్కడి రైతులు ఆమెకు తమ బాధలను చెప్పారు. ఎగువ రైతులు, దిగువ రైతుల సమస్యల విన్న తర్వాత విజయమ్మ ఇరువురికీ నష్టం కలగకుండా పరిష్కారం చూపడానికి ప్రభుత్వం ప్రయత్నించాలని, ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళతామని హామీ ఇచ్చారు. అనంతరం తణుకు మండలం దువ్వలో నేలకొరిగిన పంటచేలను పరిశీలించి నష్టం వివరాలను తెలుసుకున్నారు. దువ్వలో రైతు జేఏసీ ఆధ్వర్యంలో సమైక్యాంధ్ర కోరుతూ చేపట్టిన రిలే నిరాహారదీక్షా శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలి పారు. ఆ తర్వాత తణుకు మీదుగా ఇరగవరం మండలం గోటేరు, కంతేరు గ్రామాల్లో పర్యటించి నేలకొరిగిన పంటచేలను పరిశీలించారు. నష్టపరిహారం అందేవరకూ రైతులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కత్తవపాడు వద్ద ఆచంట నియోజకవర్గ నాయకులు విజయమ్మకు స్వాగతం పలికారు. అక్కడి నుంచి బయలుదేరి ఆలమూరు చేరుకున్న ఆమె అక్కడ వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం మార్టేరు మీదుగా కవిటం సెంటర్‌కు చేరుకున్నారు. పోడూరు నుంచి మినిమించిలిపాడు వరకూ పూర్తిగా మునిగిన పంట చేలను పరిశీలించి రైతులతో మాట్లాడారు. ఆచంట వేమవరంలో చేనేత కార్మికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అదే ప్రాంతంలో పంట పొలాలను పరిశీలించారు. సాయంత్రం 6 గంటలకు పెనుగొండ మండలం సిద్ధాంతం మీదుగా తూర్పు గోదావరి జిల్లాకు వెళ్లారు. విజయమ్మ వెంట వైసీపీ జిల్లా కన్వీనర్, పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకులు తోట చంద్రశేఖర్, మాజీ ఎమ్మెల్యేలు ఆళ్ల నాని, మద్దాల రాజేష్, ముదునూరి ప్రసాదరాజు, తానేటి వనిత, పాతపాటి సర్రాజు, నియోజకవర్గ సమన్వయకర్తలు చీర్ల రాధయ్య, కర్రా రాజారావు, చలుమోలు అశోక్‌గౌడ్, పుప్పాల వాసు, కండిబోయిన శ్రీనివాసు, తలారి వెంకట్రావు, డి.సువర్ణరాజు, నాయకులు వగ్వాల అచ్యుత రామారావు, ఊదరగొండి చంద్రమౌళి, కౌరు సర్వేశ్వరరావు తదితరులు ఉన్నారు. -
భారీ వర్షాలతో అప్రమత్తంగా ఉండాలి
గుంటూరుసిటీ, న్యూస్‌లైన్ :జిల్లాలో రాగల 48 గంటలలో భారీ వర్షాలు కురిసే అవకాశమున్నందున గ్రామ, మండల, డివిజన్ జిల్లాస్థాయి అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక ్టర్ ఎస్.సురేశ్‌కుమార్ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ నుంచి మండల అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ వర్షాల నేపథ్యంలో అధికారులు తీసుకోవాల్సిన చర్యలపై పలు సూచనలిచ్చారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి, శుద్ధమైన నీటిని సరఫరా చేయాలన్నారు. అవసరమైతే స్వచ్చంద సంస్థల, దాతల సహకారం తీసుకోవాలని సూచించారు. పునరావాస కేంద్రాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలని, రాత్రి సమయాలలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవలసిన అవసరం ఉందని చె ప్పారు. కేంద్రాల వద్ద సంపూర్ణ పారిశుధ్యం ఉండేలా చూడాలన్నారు. ప్రతి పునరావాస కేంద్రంలో ఏర్పాట్ల పర్యవేక్షణకు ఒక అధికారిని నియమించుకోవాలన్నారు. గ్రామాల్లో, పంట పొలాల్లో నీరు నిల్వలేకుండా తొలగింపుకు చర్యలు తీసుకోవాలన్నారు. రహదారులపై వాగులు, వంకలు పొంగుతున్న చోట ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించాలన్నారు. వర్షాలు, వరదలు పూర్తిగా తగ్గే వరకు అందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎప్పటి కపుడు పరిస్థితులను సమీక్షించుకుని, తదనుగుణమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్ సూచించారు. అర్బన్ ఎస్పీ బి.వి రమణకుమార్ మాట్లాడుతూ పునరావాస, సహాయ కార్యక్రమాలలో పోలీసు అధికారులు సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తారన్నారు. ఈ కాన్ఫరెన్స్‌లో జె.సి వివేక్ యాదవ్, అదనపు జె.సి కె.నాగేశ్వరరావు, డి.ఆర్వో నాగబాబు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
పై-లీన్ ముంచేసింది
ప్రకృతి పగబట్టింది. జిల్లా రైతులను నిలువునా ముంచేసింది. నిన్న పై-లీన్ రూపంలో గాలి దుమారం రేపి ఉద్దానం ప్రాంతాన్ని కుదిపేసింది. ఇప్పుడు అల్పపీడనం రూపు దాల్చి వర్షాలు, వరదలతో ముంచెత్తుతోంది. నిన్న వేల ఎకరాల్లో ఉద్యాన పంటలు కోల్పోయిన రైతులు.. నేడు లక్షల ఎకరాల్లో వరి, ఇతర ఆహార పంటలకు నీళ్లొదులుకోవాల్సిన దుస్థితి. రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ఊళ్లకు ఊళ్లు వరద ముట్టడిలో చిక్కుకున్నాయి. పంటపొలాలు మనిషెత్తు నీటిలో కనుమరుగై నదులను తలపిస్తున్నాయి. కల్వర్టులు, వంతెనల మీద నుంచి వరద నీరు పొంగిపొర్లుతూ రహదారులను దిగ్బంధించింది. ఫలితంగా పదుల సంఖ్యలో గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. ప్రాథమిక అంచనాల ప్రకారం సుమారు 50 వేల హెక్టార్ల(1.25 లక్షల ఎకరాలు)లో వరి, మరో పది వేల హెక్టార్ల(25 వేల ఎకరాలు)లో ఇతర ఆహార, వాణిజ్య పంటలు నీటిపాలయ్యాయి. సుమారు 80 గ్రామాలు జలదగ్బంధంలో చిక్కుకొని బాహ్య ప్రపంచంతో సంబంధం కోల్పోయాయి. పెద్ద సంఖ్యలో ఇళ్లు కూలిపోవడమో.. దెబ్బతినడమో జరిగింది. పట్టణ, గ్రామాణ ప్రాంతాల్లోని ఇళ్లు, కార్యాలయాల్లోకి నీరు చేరి జనానికి నిలువ నీడ లేకుండా చేసింది. -వార్తలు, ఫొటోలు.. 2, 8, 9, 10 పేజీల్లో... సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: జిల్లాలో మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు అన్ని రకాల పంటలు దెబ్బతిన్నాయి. ప్రధానంగా వరి, పత్తి, మిర్చి, కంది, ఉల్లి పంటలు చేతికి రాకుండా పోతాయని రైతులు ఆవేదన చెందుతున్నారు. సుమారు 50 వేల హెక్టార్లలో వరిపంట పనికిరాకుండా పోయి ఉంటుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. కలెక్టర్ సౌరభ్ గౌర్ ఆదేశాల మేరకు పంటల పరిస్థితిని పరిశీలించి నష్టం వివరాలు సేకరించేందుకు రెవెన్యూ, వ్యవసాయశాఖల అధికారులు, ఉద్యోగులు బుధవారం రంగంలోకి దిగారు. ఇచ్ఛాపురం, పలా స నియోజకవర్గాల్లోని పలు గ్రామాల్లోకి నీరు చేరటంతో జనం బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. పైలీన్ తుపానువల్ల దెబ్బతిన్న అనేక పూరిళ్లు ఇప్పుడు పూర్తిగా పడిపోయాయి. కొన్నిచోట్ల పక్కా ఇళ్లు కూడా దెబ్బతిన్నాయి. ఈ రెండు నియోజకవర్గాల్లో సుమారు 1200 ఇళ్లు దెబ్బతిన్నట్లు అధికారులు అంచనా వేశారు. శ్రీకాకుళం నియోజకవర్గం గార మండలంలోని లోతట్టు ప్రాంతాల వరి చేలల్లో వర్షపు నీరు నిలిచిపోయింది. నీరు తగ్గేకొద్దీ చేలంతా పడిపోయే అవకాశం ఉంది. వాడాడ, జొన్నలపాడు తదితర ప్రాంతాల్లో 1500 ఎకరాల్లో వరి చేలు పడిపోయింది. నాగావళి, వంశధార నదులు పొంగిపొర్లుతున్నాయి. కొన్ని చోట్ల పొలాల గట్లు తెగిపోయాయి. శ్రీకాకుళం రూరల్ మండలం ఒప్పంగి, బలివాడ తదితర ప్రాంతాల్లో వరి పంట పడిపోయింది. సుమారు 2 వేల ఎకరాల్లో పడిపోయినట్టు రైతులు చెబుతున్నారు. మొక్కజొన్న పంటకు నష్టం తీవ్రంగా ఉంటుందని వాపోతున్నారు. జిల్లా కేంద్రం శ్రీకాకుళంలోని వీధుల న్నీ జలమయమయ్యాయి. పీఎన్ కాలనీ లోపలికి వెళ్లేందుకు వీలులేకుండా నీరు నిలబడిపోయింది. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లల్లోకి వర్షపు నీరు చేరింది. పలాస మండలంలో కంబిరిగాం బ్రిడ్జి మీదుగా వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో కేదారిపురం, గంగువాడ, చినంచల, పెదంచల తదితర 10 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. బ్రాహ్మణతర్లా వద్ద వరహాలగెడ్డ ఉధృతంగా ప్రవహిస్తుండడంతో పరిసర గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీలోని మొగిలిపాడు, ప్రకాశనగర్, ఇందిరాకాలనీ, శాంతినగర్ తదితర ప్రాంతాల్లో పలుచోట్ల పూరి గుడిసెలు కూలిపోయాయి. కొన్నిళ్ల గోడలు పడిపోయాయి. ప్రకాశనగర్కు చెందిన వీర్రాజు అనే కార్మికుని పూరిల్లు పూర్తిగా పడిపోవడంతో కుటుంబ సభ్యులు ఇబ్బందులు పడుతున్నారు. హరిసాగరం నిండిపోవటంతో సర్ల్పస్వియర్ మీదుగా నీరు ప్రవహించి అల్లుకోల కాలనీలోకి చొచ్చుకుపోయింది. దీంతో పలు ఇళ్లు నీటమునిగాయి. మందస మండలం పుచ్చపాడు, వజ్రపుకొత్తూరు మండలం పూడిలంక జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. మందస మండలంలోని చీపి గెడ్డ ఉప్పొంగడంతో పొత్తంగి, సిరిపురం, బుడారిసింగి, గౌడుగురంటి తదితర 20 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వజ్రపుకొత్తూరు మండలంలో బెండి గెడ్డ పొంగిపొర్లడంతో మహదేవుపురం, గుల్లలపాడు, నగరంపల్లి, పొల్లాడ, బట్టుపాడు, లింగాల పాడు, బెండిసీతాపురం, కొండవూరు తదితర గ్రామాల్లో వరి పొలాలు ముంపునకు గురయ్యాయి. ఇచ్ఛాపురం, సోంపేట, కవిటి, కంచిలి మండలాల్లో సుమారు 20 వేల ఎకరాల్లో పంట పూర్తిగా నీట మునిగింది. చాలా చెరువులు నిండిపోవటంతో నీరు గ్రామాల్లోకి ప్రవేశించింది. ఇచ్ఛాపురంలో బహుదానది ప్రమాదస్థాయి దాటి ప్రవహిస్తోంది. ప్రస్తుతం 14.3 అడుగుల ఎత్తులో నీరు ప్రవహిస్తోంది. రత్తకన్న గ్రామం వద్ద భీమసముద్రం గెడ్డ, ఇన్నీసుపేట వద్ద పద్మనాభపురం గెడ్డ పొంగి పోర్లడంతో వేలాది ఎకరాల్లో పంట నీటి మునిగింది. నియోజవర్గంలో వెయ్యికి పైగా ఇళ్లు దెబ్బతిన్నాయి. ఇచ్ఛాపురం పట్టణంలో కోటేరుబంద చెరువు నిండిపోవడంతో రెవెన్యు అధికారులు రోడ్డుకు గండికొట్టారు. పైలీన్ తుపాను కారణంగా దెబ్బతిన్న మత్స్యకార గ్రామాలకు భారీ వర్షాలు తీవ్ర నష్టం కలిగించాయి. గతంలో కొద్దిగా దెబ్బతిన్న ఇళ్లు ఇప్పుడు పూర్తిగా కూలిపోయాయి. ఇచ్ఛాపురం మండలంలోని ఇన్నీసుపేట, బోడ్డబడ గ్రామాలు జలదిద్బంధంలో చిక్కుకున్నాయి. ఆమదాలవలస నియోజకవర్గంలోని సరుబుజ్జిలి మండలంలో సుమారు 4 వేల ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. 3430 ఎకరాల్లో వరి, మిగిలిన విస్తీర్ణంలో మెక్కజొన్న, చెరకు, అరటి పంటలు నీట మునిగాయి. పల్లపు ప్రాంతాలయిన తురకపేట, వీర మల్లిపేట, మూలసవళాపురం, సిందువాడ, విజయరాంపురం, కెజెపేట, పురుషోత్తపురం, పాలవలస, పెదవెంకటాపురం, సుబ్బపేట తదితర గ్రామాల్లో పంట నష్టాలు అధికంగా సంభవించాయి. ఆమదాలవలస, బూర్జ, పొందూరు మండలాల్లో వరి పంటకు కొంతమేర నష్టం వాటిల్లింది. నరసన్నపేట మండలంలోని 100 ఎకరాల్లో వరి పంట గాలికి వాలిపోయింది. పోలాకి మండలంలో సుమారు 200 ఎకరాల వర తంపర భూములు నీట మునిగాయి. జలుమూరులో 100, సారవకోటమండలంలో 150ఎకరాల్లో వరి చేలు వాలిపోయాయి. పాలకొండ వ్యవసాయ సబ్ డివిజన్లో వరి, చెరకు పంటలకు తీవ్ర నష్టం వాటిల్లే పరిస్థితులు కనిపిస్తున్నాయి. పాలకొండ, వీరఘట్టం, సీతంపేట, బూర్జ మండలాల్లోని వెయ్యి ఎకరాల్లో వరి పంట నీట మునిగింది. 500 ఎకరాల్లోని చెరుకు పంట నీటిలో ఉంది. వర్షాలు కొనసాగితే ఈ పంటలకు పూర్తిగా నష్టం వాటిల్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాజాం నియోజకవర్గంలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. గురవాం గ్రామంలోని నిర్వాసిత కాలనీని కొత్త చెరువు వరద నీరు ముంచెత్తింది. వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త పీఎంజే బాబు ఆ ప్రాంతాన్ని సందర్శించారు. బాధితులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. రాజాం నగర పంచాయతీ పరిధి కొండంపేటలో గెదెశెట్టి పార్వతమ్మ ఇంటి గోడ కూలిపోయింది. అమరాం నుంచి రాజాం వచ్చే మార్గంలో వంతెనపై నుంచి గెడ్డ నీరు ప్రవహించడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. సంతకవిటి మండలం చిన్నయ్యపేట, మల్లయ్యపేట, హొంజరాం, చిత్తారిపురం తదితర గ్రామాల్లో వరి పంట నేలకొరిగింది. చెరకు, కూరగాయల పొలాల్లోకి నీరుచేరింది. సిరిపురం సమీపంలో వంతెన మీదుగా రెల్లిగెడ్డ నీరు ప్రవహించడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మండాకురిటిలో బైరవాని చెరువు చప్టా కొట్టుకుపోయింది. మల్లయ్యపేటలో బి.గోవిందరావుకు చెందిన పూరింటి గోడ కూలిపోయింది. రేగిడి మండలంలోని ఆకులకట్టలోవ గెడ్డ ఉధృతంగా ప్రవహించడంతో వరి, చెరకు పంటలు నీట మునిగాయి. వంగర మండలంలో పలుచోట్ల పంటలకు నష్టం వాటిల్లింది. పాతపట్నం నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో కొన్నిచోట్ల వరి పంట నేలకొరిగింది. కొత్తూరు మండలంలో పత్తి పంటకు, ఎల్.ఎన్.పేట, హిరమండలం మండలాల్లో కూరగాయల పంట లకు నష్టం వాటిల్లింది. మెళియాపుట్టి మండలంలో చాలాచోట్ల వరి చేలు నేలకొరగడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎచ్చెర్ల నియోజకవర్గంలో కూరగాయల పంటలకు ఎక్కువగా నష్టం వాటిల్లింది. ఎచ్చెర్ల మండలంలో కంది, బెండ, కాలీప్లవర్, మిరప పంటలు దెబ్బతిన్నాయి. లావేరు, రణస్థలం మండలాల్లో మొక్కజొన్న, పత్తి పంటలకు, జి. సిగడాంలో మొక్కజొన్న, అరటి పంటలకు నష్టం వాటిల్లింది. నియోజకవర్గ వ్యాప్తంగా వరికి కొంతవరకు నష్టం జరిగింది. టెక్కలి, కోటబొమ్మాళి, సంతబొమ్మాళి, నందిగాం మండలాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. టెక్కలి, నందిగాం, సంతబొమ్మాళి మండలాల్లోని చాలాచోట్ల వరి చేలు పూర్తిగా నేలకొరిగిపోగా అరటి చెట్లు విరిగిపోయాయి. కోటబొమ్మాళి మండలంలో పందిరి కూరగాయ మొక్కలు నేలకొరిగాయి. పొట్ట దశలో ఉన్న వరి చేలు విరిగిపోవడంతో ధాన్యం చేతికి చిక్కే అవకాశం లేకుండా పోయింది. -
తుఫాన్ దాటికి 26 లక్షల చెట్లు నేలమట్టం
-
తుపాను బాధితులను నిరాశ పరిచిన సీఎం టూర్
లేటుగా వచ్చినా లేటెస్టుగా స్పందిస్తారని ఆశించారు.. ఏదో సాయం ప్రకటించకపోతారా!.. అని ఎదురు చూశారు. కానీ చివరికి నిరాశే మిగిలింది. గాలి దుమారం తప్ప.. గట్టి హామీ ఏదీ లభించలేదు. గాలిలో చక్కర్లు కొట్టి.. మత్స్యకారులు, రైతులకు నాలుగు గాలి కబర్లు చెప్పి తుపాను ప్రాంతాల పర్యటన అయ్యిందనిపించారు.. ముఖ్యమంత్రిగారు!. తుపాను బీభత్సం సృష్టించిన వారం తర్వాత ఆ ప్రాంత పర్యటనకు వచ్చిన ఆయన ఏదో ఉద్ధరిస్తారన్న రైతుల ఆశలు ఆయన హెలికాప్టర్ సృష్టించిన గాలిలో కలిసిపోయాయి. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి ఆదివారం జరిపిన పర్యటన బాధితులకు ఏమాత్రం ప్రయోజనం చేకూర్చకపోగా.. మరింత కుంగిపోయేలా చేసింది. మత్స్యకారులకు రూ.40 కోట్లతో సహాయ కార్యక్రమాలు చేపడతామన్న ప్రకటన తప్ప.. ఇతరత్రా ఏ ఒక్క డిమాండునూ ముఖ్యమంత్రి అంగీకరించలేదు. తక్షణ సాయం గురించి కూడా మాట మాత్రంగానైనా ప్రస్తావించకపోవడం రైతులను తీవ్ర నిరాశకు గురిచేసింది. తుపాను ప్రాంతాల్లో ఏరియల్ సర్వేతోపాటు ఇచ్ఛాపురం మండలం డొంకూరు, కవిటిల్లో మత్స్యకారులు, రైతులతో ముఖాముఖి కార్యక్రమాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఉదయం ముందుగా డొంకూరు చేరుకున్న సీఎం మత్స్యకారులతో మాట్లాడారు. తమ కష్టాలను విడమరచి చెప్పారు. సముద్రంలో చేపల వేటకు వెళ్లి మృతి చెందిన వారికి ప్రస్తుతం ఆపద్బంధు పథకం కింద రూ.50 వేలు ఇస్తున్నారు. దాన్ని పెంచి రూ.5 లక్షల పరిహారం ఇవ్వాలని వారు కోరగా ముఖ్యమంత్రి స్పందించ లేదు. జిల్లాలోని మత్స్యకారుల కోసం రూ. 40 కోట్లతో వివిధ సహాయ కార్యక్రమాలు చేపడతామని మాత్రం హామీ ఇచ్చారు. చేపల నిల్వ కోసం రూ.కోటితో కోల్డ్ స్టోరేజీ ఏర్పాటు చేస్తామన్నారు. డొంకూరు మహిళా సంఘానికి చేపల అమ్మకానికి రెండు వాహనాలు కొనుగోలు చేసుకునేందుకు రుణం ఇస్తామని హామీ ఇచ్చారు. అక్కడి నుంచి కవిటికి చేరుకున్న ఆయన రైతులతో ముఖాముఖి నిర్వహించారు. కొబ్బరి రైతులు పూర్తిగా నష్టపోయారని, అదే విధంగా జీడి, మామిడి తోటలు వేసిన రైతులదీ అదే దుస్థితి అంటూ చెట్టుకు రూ.2 వేలు చొప్పన వెంటనే పరిహారం ఇవ్వాలని ఈ సందర్భంగా పలువురు రైతులు కోరారు. వారి విజ్ఞప్తిని సీఎం మన్నించలేదు. నష్టంపై సర్వేకు ఆదేశించినందున పూర్తి వివరాలు వ చ్చిన తర్వాతే పరిహారం నిర్ణయిస్తామని తేల్చి చెప్పారు. సర్వే ఎలా జరుగుతుందనే సందేహాలు రైతుల్లో ఉన్నాయంటూ దాని గురించి వివరించాలని ఉద్యానవన శాఖ కమిషన ర్ను ఆదేశించగా.. ఆయన సర్వే తీరును వివరించారు. నష్టపోయిన చె ట్ల స్థానంలో కొత్తగా కొబ్బరి మొక్కలు నాటేందుకు, కూలిన చెట్టు తొలగించి, భూమి బాగుచేసుకునేందుకు ఉపాధి హామీ పథకం కింద ఎకరాకు రూ.5 వేలు ఖర్చు చేసేలా వెసులుబాటు కల్పిస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి.. దాని సాధ్యాసాధ్యాలను మాత్రం వివరించలేదు. ఈ ప్రాంతంలో వాణిజ్య పంటలు తప్ప ఆహార పంటలు కనిపించడం లేదని, ఈ రైతులను ఎలా ఆదుకోవాలనే విషయంలో అధికారుల సూచనలు పాటిస్తామని చెప్పారు. అంతకుమించి ఇంకేమీ హామీలు ఇవ్వలేదు. కవిటిలో సమైక్య నినాదాలు కవిటిలోకి రాగానే రోడ్డుపై కాన్వాయ్ దిగిన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి వైపు చూస్తూ జై సమైక్యాంధ్ర అంటూ కొందరు నినాదాలు చేశారు. వారి వద్దకు వచ్చిన సీఎం నేను కూడా సమైక్యవాదినేనని చెప్పారు. రైతులతో మాట్లాడుతున్నప్పుడు కూడా విభజన తుపానును అడ్డుకుంటామని చెప్పారు. దానికి మీ సహాయ సహకారాలు కోరుకుంటున్నామని అన్నారు. ఇచ్ఛాపురంలో అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో కూడా ఉద్యాన రైతుల గురించి సీఎం పెద్దగా మాట్లాడలేదు. త్వరగా నివేదిక ఇస్తే ఏ విధ మైన పరిహారం ఇవ్వాలనే విషయాన్ని పరిశీలిస్తానని మాత్రమే చెప్పారు. సీఎంతో పాటు కేంద్ర మంత్రి కృపారాణి, రాష్ట్ర మంత్రులు శత్రుచర్ల విజయరామరాజు, కోండ్రు మురళి, గంటా శ్రీనివాసరావు, పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఫీజులు రద్దు చేయాలి ఇంటర్, డిగ్రీ, పీజీ పరీక్ష ఫీజులు రద్దు చేయాలని కవిటి ముఖాముఖీలో పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు సీఎంను కోరారు. ఈనెల 23వ తేదీలోగా ఫీజు కాట్టాలని కళాశాలల వారు ఒత్తిడి తెస్తున్నారని, తుపానులో పూర్తిగా నష్టపోయిన తాము ఫీజులు చెల్లించలేని ఉన్నందున తమ పిల్లలకు పరీక్ష ఫీజులు రద్దు చేయాలని కోరారు. అయితే సీఎం వారికి ఎటువంటి హామీ ఇవ్వలేదు. -
పచ్చదనంపై తుపాను పంజా
భువనేశ్వర్, న్యూస్‌లైన్: పై-లీన్ తుపాను ఒడిశాకు పెను నష్టాన్ని మిగిల్చింది. దీని దెబ్బకు రాష్ట్రంలో కనీసం 26 లక్షల చెట్లు నేలకూలినట్టు తేలింది. తుపాను దెబ్బకు రాష్ట్రంలో చాలా అటవీ ప్రాంతాల్లో ఇంకా అడుగుపెట్టలేని పరిస్థితి ఉందని, వాటిని కూడా పరిశీలిస్తే వృక్ష నష్టం మరెంతో ఎక్కువగా ఉండవచ్చని అటవీ అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా గంజాం, గజపతి జిల్లాల్లో ఈ నష్టం చాలా ఎక్కువగా ఉంది. దీన్ని పూడ్చుకోవడానికి చాలా ఏళ్లు పడుతుందని అధికారులన్నారు. ఈ నేపథ్యంలో త్వరలో భారీ ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టనున్నట్టు అటవీ మంత్రి బిజయ్శ్రీ చెప్పారు. గత 14 ఏళ్లలో భారత తూర్పు తీరాన్ని అతలాకుతలం చేసిన అత్యంత శక్తివంతమైన తుపానుగా పై-లీన్ నిలిచింది. 1999 సూపర్ సైక్లోన్ సైతం ఒడిశాలోని లక్షల చెట్లను నేలకూల్చింది. ఇక పై-లీన్ వల్ల ఒడిశాకు కనీసం రూ.4,242 కోట్ల మేరకు నష్టం సంభవించిందని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. కేంద్ర హోం శాఖ కార్యదర్శి అనిల్ గోస్వామికి ఈ మేరకు నివేదించింది. ఇందులో ఒక్క గంజాం జిల్లాలోనే ఏకంగా రూ.1,550 కోట్ల మేరకు నష్టం వాటిల్లినట్టు వివరించింది. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో గోస్వామి ఆదివారం పర్యటించారు. గంజాం జిల్లాను ప్రత్యక్షంగా పరిశీలించారు. పై-లీన్ నష్టాన్ని అంచనా వేసేందుకు రెండు, మూడు రోజుల్లో మంత్రుల బృందం ఏర్పాటవుతుందని, ప్రభావిత ప్రాంతాలను అది పరిశీలిస్తుందని తెలిపారు. వేగంగా పెరిగే చెట్లే ఎక్కువ కూలాయి! వేగంగా పెరుగుతాయన్న భావంతో పెంచిన స్థానికేతర జాతుల చెట్లే తుపాను గాలుల ధాటికి ఎక్కువగా కూలాయని నిపుణులు చెప్పారు. యూకలిప్టస్, గుల్మొహర్ వంటి మెతక జాతుల చెట్లు ఎక్కువగా నాశనమయ్యాయి. దృఢమైన చింత, మామిడి, వేప, జామ, మర్రి మొక్కలను నాటితే మేలని నిపుణులు సూచిస్తున్నారు. మొబైల్స్, రేడియోలే ప్రాణదాతలు పూరీ (ఒడిశా): అక్టోబర్ 12న ఒడిశాలో పెను విధ్వంసం సృష్టించిన పై-లీన్ తుపాను బారి నుంచి పలువురిని కాపాడటంలో రేడియోలు, మొబైల్ ఫోన్లు కీలక పాత్ర పోషించాయి. పై-లీన్ దెబ్బకు వేలాది కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగినా ప్రాణ నష్టం మాత్రం కేవలం 44కు పరిమితమవడంలో వాటి పాత్ర చాలా ఉంది. తుపా ను సమీపిస్తున్న విషయాన్ని రేడియోలో వినడం వల్లే తాను, తన కుటుంబం బతికి బయట పడ్డామని గజేంద్ర జనా (55) చెప్పారు. రేడియోలో ప్రత్యేక తుపాను హెచ్చరికలను వినగానే వీలైనన్ని నిత్యావసరాలను వెంటబెట్టుకుని ఆయన కుటుంబమంతా సమీపంలోని తుపాను షెల్టర్‌కు చేరుకుంది. ఆ వెంటనే విరుచుకుపడ్డ తుపాను ఆయన ఇంటిని నేలమట్టం చేసింది. అధికారులు కూడా మొబైల్ ఫోన్లను వీలైనంత విరివిగా వాడటం ద్వారా తుఫాను ప్రభావిత ప్రాంతాల్లోని అత్యధికులను సురక్షిత ప్రాంతాలకు తరలించగలిగారు. రేడియో, మొబైల్స్ లేకుండా ఇది సాధ్యపడేది కాదని విపత్తు నిర్వహణ శాఖ అధికారులు అంగీకరిస్తున్నారు. తుపాను హెచ్చరికల అనంతరం రాష్ట్రంలో రేడియోల అమ్మకాలు కూడా బాగా పుంజుకోవడం విశేషం! బాధితులకు సైకత శిల్పి బాసట పై-లీన్ బాధితులను ఆదుకునేందుకు ప్రముఖ అంతర్జాతీయ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ ముందుకొచ్చారు. కాన్వాస్‌పై తాను సృజించిన పలు సైకత మూర్తులను విక్రయించి, తద్వారా వచ్చే మొత్తాన్ని బాధితులకు అందజేస్తానని ప్రకటించారు. -
'పై-లిన్ భారీ నుంచి రేడియోనే కాపాడింది'
రేడియోనే తనను,తన కుటుంబాన్ని పై లిన్ తుఫాన్ భారీ నుంచి రక్షించిందని ఒడిశాలోని పూరీ నివాసి గజేంద్ర జేనా ఆదివారం వెల్లడించారు.పై లిన్ తుపాన్‌పై రేడియోలో ఎప్పటికప్పుడు ప్రసారం అయిన బులిటెన్లతో తాము అప్రమత్తమైయ్యామని చెప్పారు.సముద్ర తీరానికి 5 కిలోమీటర్లలోపు నివసించేవారు తక్షణం సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని రేడియో ద్వారా తెలుసుకున్నానని తెలిపారు. పై లిన్ తుపాన్ వల్ల ప్రచండవేగంతో ఈదురుగాలులు వీచాయి,భారీ వర్షాలు కురిశాయి.దాంతో తాను నివసించే ఇంటిపై కప్పు సిమెంట్ రేకులు గాలికి కొట్టుకుపోయాయి.దాంతో తమ కుటుంబానికి దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది.రేడియోలో పై లిన్ తుపాన్‌పై వచ్చిన బులిటెన్ వినకుంటే ఇంటి సమీపంలోనే తలదాచుకుని ఉండేవారమని చెప్పారు. దీంతో తాను తన కుటుంబ సభ్యుల ప్రాణాలు ఎప్పుడో అనంత వాయువుల్లో కలిసిపోయేవని తెలిపారు.రేడియోలో పై లిన్ తుపాన్ తీవ్రతను ప్రసారం చేయడం ద్వారా తాను తన భార్య ఇద్దరు పిల్లలతోపాటు రేడియో తీసుకుని పునరావాస కేంద్రానికి తరలినట్లు గజేంద్ర జేనా వెల్లడించారు.పై లిన్ తుపాన్ నుంచి తమ ప్రాణాలు రేడియోనే కాపాడిందని గజేంద్ర జేనా తెలిపారు. -
పునరావాస చర్యలు వేగవంతం
శ్రీకాకుళం కలెక్టరేట్, న్యూస్‌లైన్ : పై-లీన్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పునరావాస చర్యలను వేగవంతం చేస్తామని, 38 మండలాల్లోనూ వరి, ఇతర పంటలకు జరిగిన న ష్టంపై సర్వేలు చేసి బాధితులకు పరిహారం చెల్లిస్తామని జిల్లా కలెక్టర్ సౌరభ్ గౌర్ చెప్పారు. కలెక్టరేట్లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తుపాను కారణంగా జిల్లాలోని రైతులు, మత్స్యకారులకు అపార నష్టం జరిగిందన్నారు. ముందస్తు చర్యలు తీసుకోవటంతో ప్రాణనష్టం ఎక్కువగా జరగకుండా నిరోధించగలిగామని తెలిపారు. పశువులను కూడా చాలావరకు రక్షించగలిగామన్నారు. ప్రస్తుతం పునరావాస కార్యక్రమాలపై దృష్టి పెట్టామని, ఇవి వేగంగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. మంగళవారం నాటికి అన్ని శాఖల సర్వేలు పూర్తిచేసి నివేదికలను రాష్ట్ర ప్రభుత్వానికి అందజేస్తామని అన్నారు. వైద్య బృందాలు తీర ప్రాంత గ్రామాల్లో పర్యటిస్తున్నాయని, తాగునీటి వనరులను క్లోరినేషన్ చేయిస్తున్నామని వెల్లడించారు. రోడ్లు, విద్యుత్ సరఫరా పునరుద్ధరణ, తాగునీటి సౌక ర్యం కల్పనకు ప్రత్యేక బృందాలు యుద్ధప్రాతిపదకన పనిచేస్తున్నాయని తెలిపారు. ఇళ్లు నష్టపోయినవారికి పరిహారం శనివారం నుంచి చెల్లిస్తామన్నారు. పలు మండలాల్లో మత్స్యకారులకు బియ్యాన్ని ఇప్పటికే పంపిణీ చేశామన్నారు. కూలిన ఇళ్ల శిథిలాలు, పడిపోయిన చెట్ల తొలగింపు పనులను ఉపాధి హామీ పథకం ద్వారా చేపడతామని వెల్లడించారు. కొబ్బరి రైతులకు చెట్ల లెక్కన పరిహారం నష్టపోయిన కొబ్బరి రైతులకు చెట్ల లెక్కన పరిహారం చెల్లిస్తామని చెప్పారు. 1996లో ఇచ్చిన ప్యాకేజీని సవరించి పరిహారం పెంచనున్నారని పేర్కొన్నారు. దీనిపై ప్రభుత్వం సమీక్షిస్తోందని తెలిపారు. ఇప్పటికీ 78 గ్రామాలకు విద్యుత్ సరఫరా పునరుద్ధరణ జరగలేదని, 9 తాగునీటి ప్రాజెక్టులు పనిచేయటం లేదని వెల్లడించారు. తుపాను ముందస్తు చర్యల కోసం రూ.80 లక్షలు ఖర్చు చేశామని తెలిపారు. ఉద్యాన పంటల పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలను రైతులకు తెలియజేసేందుకు, నష్టాన్ని అంచనా వేసేందుకు శాస్త్రవేత్తల బృందం పర్యటిస్తోందని తెలిపారు. కంట్రోల్ రూం కొనసాగింపు బాధితులను ఆదుకునేందుకు కలెక్టరేట్లోని కంట్రోల్ రూమును కొనసాగిస్తున్నామని కలెక్టర్ చెప్పారు. సర్వే బృందాలు రాకపోయినా, పరిహారం చెల్లింపులో తేడాలు.. ఇతర ఇబ్బందులు ఉన్నా.. 08948-240557, 96528 38191 నంబర్లకు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. వచ్చిన ఫిర్యాదులను నమోదు చేసి తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. సమావేశంలో ఏజేసీ ఆర్.ఎస్.రాజ్‌కుమార్, డీఆర్ఓ నూర్‌బాషా ఖాసీం, డ్వామా పీడీ కల్యాణచక్రవర్తి తదితరులు పాల్గొన్నారు. -
తుపాను బాధిత రైతులకు అన్యాయం జరిగే ప్రమాదం
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: జిల్లాలోని పై-లీన్ తుపా ను బాధిత రైతులు, బాధిత కుటుంబాలకు సహా యాన్ని ఏ ప్రాతిపదకన, ఏ మేరకు ఇస్తారనేది ఇంతవరకు తేలలేదు. పైగా ప్రస్తుతం అధికారులు చేపట్టిన సర్వేల తీరు బాధితులకు అన్యాయం చేసేలా ఉండటంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ముఖ్యంగా రైతులకు తీవ్ర అన్యాయం జరిగే ప్రమాదం కనిపిస్తోంది. రెండు రోజులుగా అధికారులు నష్టం అంచనాల తయారీలో ఉన్నా.. ఇంతవరకు 20 శాతం సర్వే కూడా పూర్తి కాలేదు. ఇళ్లు, ఇతర ఆస్తులకు జరిగిన నష్టాలను అంచనా వేసే పనిలో రెవెన్యూ, హౌసింగ్ శాఖలు ఉండగా, వాణిజ్య పంటలకు జరిగిన నష్టాలను ఉద్యానవన శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. టేకు చెట్లకు జరిగిన నష్టాన్ని అటవీశాఖ, ఆహార పంటల నష్టాలను వ్యవసాయశాఖ సిబ్బంది అంచనా వేస్తున్నారు. కొబ్బరి రైతులకు తీవ్ర నష్టం జిల్లా వ్యాప్తంగా సుమారు 40 వేల హెక్టార్లలో కొబ్బరి తోటలు సాగు చేస్తుండగా, ఒక్క ఉద్దానం ప్రాంతంలోనే 20 వేల హెక్టార్ల వరకు ఉంది. తుపాను వల్ల ఉద్దానం ప్రాంతం తీవ్రంగా నష్టపోయింది. సుమారు 15 వేల హెక్టార్లలో కొబ్బరి తోటలు పనికి రాకుండా పోయాయి. అధికారుల అంచనా ప్రకారం ఎకరా భూమిలో 60 చెట్ల వరకు పెంచుకోవచ్చు. అయితే రైతులు 80 వరకు చెట్లు పెంచుతున్నారు. దేశవాళీ చెట్టు పెరిగి కాపు రావాలంటే కనీసం 12 సంవత్సరాలు పడుతుంది. ప్రస్తుతం కొబ్బరి పూర్తిగా కాపులో ఉంది. తుపానుకు నూరుశాతం చెట్లు పనికి రాకుండా పోయాయి. ఒక ఎకరాలోని చెట్లు ఓ కుటుంబాన్ని జీవితకాలం పోషిస్తాయని రైతులు చెబుతున్నారు. ప్రస్తుతం మూడు రకాలుగా విభజించి నష్టం అంచనాలు తయారు చేస్తున్నారు. ‘పూర్తిగా పడిపోయిన చెట్లు, మొవ్వ విరిగిన చెట్లు, మెలిపెట్టుకుపోయి ముద్దగా మారిన చెట్టు’ అంటూ మూడు రకాలుగా విభజించారు. మొవ్వ విరిగిన చెట్టు తిరిగి కాపునకు రావాలంటే కనీసం మూడేళ్లు పడుతుంది. మెలిపెట్టుకుపోయిన చెట్టు పనికి రాదు. పూర్తిగా విరిగిన చెట్టుగానే పరిగణనలోకి తీసుకుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ అధికారులకు పట్టడం లేదు. ఎకరాను యూనిట్‌గా కాకుండా చెట్లను లెక్కలోకి తీసుకొని పరిహారం ఇవ్వాలనే ఆలోచన పూర్తిస్థాయిలో నష్టం చేస్తుందని రైతులు చెబుతున్నారు. తోటల్లో పడిపోయిన కొబ్బరి చెట్టును వేళ్లతో పెకిలించి బయటకు చేర్చాలంటే కనీసం రూ. 500లు ఖర్చవుతుందని రైతులు చెబుతున్నారు. 1999లో వచ్చిన తుపాను సమయంలో పాక్షికంగా పాడైన చెట్టుకు రూ.వంద, పూర్తిగా పోయిన చెట్టుకు రూ. 250లు చొప్పున పరిహారం ఇచ్చారు. ఇప్పుడు ఎలా.. ఎంత పరిహారం ఇస్తారో తెలియటం లేదు. ప్రభుత్వం ఏ విధమైన ప్రకటన లేకుండా అంచనాలు ఎలా తయారు చేయమన్నదో, అధికారులు ఏమి చేయదలుచుకున్నారోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇక జీడితోటలు, మామిడి తోటల్లో ఏ స్థాయిలో నష్టం జరిగిందో అధికారులు చెప్పే పరిస్థితి లేదు. ఉద్యానవన శాఖ వద్ద కూడా సరైన లెక్కలు లేవు. కొబ్బరి తోటల్లో అంతర పంటలుగా జీడి, మామిడి తోటలు వేసిన వారు ఉన్నారు. ఇందులో పూర్తిగా పడిపోయిన చెట్లనే పరిగణలోకి తీసుకుంటున్నారు. కవిటి, కంచిలి, సోంపేట, ఇచ్ఛాపురం, వజ్రపుకొత్తూరు, మందస మండలాల్లో పూర్తిస్థాయిలో కొబ్బరి, జీడి, మామిడి తోటలు దెబ్బతిన్నాయి. అధికారుల అంచనాలు ఇందుకు విరుద్ధంగా ఉంటున్నాయి. కంచిలి మండలంలో నాలుగు రోజులుగా పర్యటిస్తున్న అధికారులు నాలుగు పంచాయతీల్లో మాత్రమే సర్వేను పూర్తి చేయగలిగారు. తోటల్లో పడిపోయిన చెట్లను అలాగే ఉంచితే, పురుగులు వట్టి మిగిలిన చెట్లు కూడా పనికిరాకుండా పోయే అవకాశముందని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఆహార పంటల విషయంలోనూ అధికారులు సరైన పద్ధతులు పాటించడం లేదు. అనేక చోట్ల వరి పొలాలు నీట మునిగాయి. నాట్లు కుళ్లిపోయి పనికి రాకుండా పోయాయి. మిగతా పంటలు కూడా బాగా దెబ్బతిన్నాయి. అధికారులు ఒక పద్ధతి లేకుండా ఇష్టాను సారం నష్టం అంచనాలు తయారు చేస్తున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే.. కొన్ని మార్గదర్శకాల మేరకు అంచనాలు తయారు చేయాల్సిందిగా ఉన్నతాధికారులు ఆదేశించారు.. వీటి ప్రకారమే సర్వేలు చేస్తున్నాం.. అంతకు మించి ఏమీ చెప్పలేమని సర్వే అధికారులు చెబుతున్నారు. ఇక మత్స్యకారులు, ఇళ్లు కోల్పోయిన వారు నడిరోడ్డుపై నిలబడ్డారు. వారి పునరావాసం గురించి అధికారులు ఇంతవరకు పట్టించుకోలేదు. పదికేజీల బియ్యం ఇచ్చి చేతులు దులుపుకునే ప్రయత్నంలో ఉన్నారు. మత్స్యకారులకు జరిగిన నష్టంపై ఫిషరీస్ అధికారుల అంచనాలు ఎప్పటికి పూర్తవుతాయో తెలియటం లేదు. -
దేశంలో మరో తుఫాన్ వీస్తోంది: నరేంద్ర మోడీ
ప్రస్తుతం దేశంలో మార్పు అనే తుఫాన్ బలంగా వీస్తోంది అని భారతీయ జనతా పార్టీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడి అన్నారు. ఫైలీన్ తుఫాన్ మించి ఉంటుందని చెన్నైలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ఆయన వ్యాఖ్యానించారు. దేశంలో మార్పు అనే తుఫాన్ ఉంది అని.. ఎంతో నష్టాన్ని కలిగించిన ఫైలీన్ తుఫాన్ ను ఆపివేస్తుంది అని అన్నారు. ఈ సమావేశంలో కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఉత్తర ప్రదేశ్ లోని ఉన్నావ్ లో బంగారం కోసం తవ్వకాలు చేపట్టకుండా.. విదేశీ బ్యాంకుల్లో నల్లధనం వెనక్కి తీసుకురావడానికి ప్రయత్నించాలి అని విమర్శించారు. దేశ రాజధాని ఢిల్లీలో మార్పు చోటుచేసుకోవాలని తమిళనాడు ప్రజలు కోరుకుంటున్నారని.. బీజేపీ అధికారంలోకి రావడంతో తమిళ ప్రజల కలలు నిజమవుతాయని ఆయన అన్నారు. -
సిక్కోలులో 4లక్షల మందిపై పై-లిన్ ప్రభావం
శ్రీకాకుళం : శ్రీకాకుళం జిల్లాలో పై-లిన్ తుఫాన్ నాలుగు లక్షల మందిపై ప్రభావం చూపిందని జిల్లా కలక్టర్ సౌరభ్ గౌర్ ప్రకటించారు. పైలిన్ తుఫాన్ వెలిసిన వారం రోజుల తరువాత అధికార్లు నష్టం అంచనాలను ప్రకటించడం విశేషం. ఎక్కడా ప్రాణ నష్టం సంభవించకపోగా, ఎనభై నాలుగు పశువులు మృతి చెందాయన్నారు. 382 ఇళ్లు పూర్తిగా, 800 వందల ఇళ్లు పాక్షికంగా , పన్నెండు వందల విద్యుత్ స్థంబాలు ధ్వంసం అయ్యాయన్నారు. 442 గ్రామాలు తుఫాన్ ధాటికి గురి అయ్యాయని, 9వేల హెక్టార్లలో పంట పొలాలు, 8 వేల హెక్టార్లలో ఇతర పంటలు నాశనం అయ్యాయని తెలిపారు. తుఫాన్ పునరావాస చర్యలు కొనసాగుతున్నాయన్నారు. -
పరిహారం అందేలా ఒత్తిడి తెస్తాం: వైఎస్ విజయమ్మ
ఉద్దానం ప్రాంత రైతుల క ష్ట నష్టాలు తెలుసుకుంటూ...బాధిత రైతులను పరామర్శిస్తూ... వలలు, బోట్లు, ఆస్తులు కోల్పోయిన మత్స్యకారులకు భరోసానిస్తూ... మిహ ళా రైతులకు అండగా ఉంటామని హామీనిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వై.ఎస్.విజయమ్మ తుపాను బాధిత ప్రాంతాల్లో బుధవారం పర్యటన సాగించారు. ఆమెకు వినతులు అందించేందుకు బాధితులు ఆరాటపడ్డారు. వృద్ధులు గోడు వినిపించారు. ఉద్యానవన రైతులు విజ్ఞాపనలు చేశారు. జగన్‌బాబు అధికారంలోకి వచ్చిన వెంటనే కష్టాలు తీర్చుతామని, ప్రస్తుతం నష్టపరిహారం అందేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని చెబుతూ ఆమె ముందుకు సాగారు. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: గ్రామం: చిన్నకొజ్జిరియా సమయం : 12.30 గంటలు కనుచూపు మేరలో చుట్టూ నేలకొరిగిన కొబ్బరిచెట్లు... మధ్యలో నేలకూలిన ఇళ్లు... అక్కడే నిల్చొని ఆతృతగా వైఎస్ విజయమ్మ కోసం ఎదురు చూస్తున్న తుపాను బాధిత ప్రజలు... నేరుగా కాన్వాయ్ అక్కడికి వెళ్లి ఆగగానే సాదర ఆహ్వానం. అక్కడ ఉన్న బాధితుల్లో ఒకరైన బొడ్డా నరసింహమూర్తి మైకు తీసుకొని తమ బాధలు చెప్పడం మొదలు పెట్టాడు... అమ్మా నమస్కారం. మేము ఎక్కువగా కొబ్బరి పంట పండిస్తాం. తుపాను వచ్చి కొబ్బరి, జీడి పంటలను నాశనం చేసింది. పురుగు మందులు వాడినా ప్రయోజనం లేదు. మరి మీరొక్కరవ్వ మా తరఫున పోరాడి ఏదో కొంత వరకు సాయం అందించాలి. ప్రస్తుతానికి నాలుగైదు రోజులైంది. ఇంతవరకు పట్టించుకున్న వారు లేరు. ప్రస్తుతానికి మంచినీరు లేదు. కరెంటు లేదు. స్తంభాలు వేయడం లేదు. ఇక్కడ దించి పాతుకోమంటున్నారు. మీరు మా తరఫున పోరాడి... మా అయ్యగారు రాజశేర్‌రెడ్డిలా పోరాడి మాకు న్యాయం చేయాలి. ఇక్కడ 60 శాతం మంది కిడ్నీ జబ్బులు ఉన్నవారు ఉన్నారు. వైద్యం లేదు. జబ్బులతోనే సత్తున్నాం. మా బాధలు విన్నోళ్లూలేరు. ఆయన మాటలకు విజయమ్మ స్పందిస్తూ... మిమ్మల్ని చూస్తే చాలా బాధనిపిస్తావుంది. రాజశేఖర్‌రెడ్డి ఆరోజు సునామీ వచ్చినప్పుడు ఆదుకున్నారు. ఇప్పుడు కూడా పూర్తిస్థాయిలో ఆదుకొనేవారు. ఇప్పుడు పథకాలు సక్రమంగా అమలు జరగడం లేదు. ఇవన్నీ జగన్‌బాబు నాయకత్వంలో మనం సంపాదించుకుందాం. ఇప్పుడైతే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. జీడిమామిడి చెట్లకు, కొబ్బరి చెట్లకు ఎకరాను పరిగణలోకి తీసుకొని నష్ట పరిహారం ఇవ్వాలి. ఇళ్లు కూలి పోయిన చోట ఇందిరమ్మ ఇళ్లు కట్టించాలి. కొబ్బరి కొత్త మొక్కలు ఇవ్వాలి, ఏరియల్ స్ప్రే చేయించాలి. ఆదాయం రావాలంటే కనీసం ఆరు సంవత్సరాలు పడుతుంది. అందుకే ఆదాయం వచ్చే వనరులు కల్పించాలి. ఆరు నెలల్లో జగన్ నాయకత్వంలో ప్రభుత్వం వస్తుంది. మీరంతా ధైర్యంగా ఉండండి. మీకు ధైర్యం చెప్పడానికే ఇక్కడికి వచ్చాను. అన్ని రకాలుగా మీ పక్షాన పోరాటాలు చేస్తామంటూ మాట్లాడుతుంటే అక్కడి జనం విజయమ్మకు జై.. జగన్‌కు జై, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. జిల్లాలోని కంచిలి, కవిటి, సోంపేట మండలాల్లోని జాడుపూడి, పెద్దకొజ్జిరియా, చిన్న కొజ్జిరియా, రాజపురం, జగతి, దొరివంక, ఇద్దివానిపాలెం, బి.గొనపపుట్టుగ, కుసుంపురం, కళింగపట్నం, బల్లిపుట్టుగ, రుషికుడ్డ, ఇసుకలపాలెం, రామాయపట్నం, గొలగండి, బారువ గ్రామాల్లో పర్యటించారు. ఈ గ్రామాల్లో బాధితులు పడుతున్న బాధలను కళ్లారా సూచిన విజయమ్మ పలు చోట్ల మాట్లాడారు. అనేక మంది తమ బాధలు వివరించారు. కన్నీటి పర్యంతమయ్యారు. బారువలో మత్స్యకారులు కన్నీరు పెట్టుకున్నారు. వలలు, ఇతర సామాన్లు పనికి రాకుండా పోయాయని వాపోయారు. కళింగపట్నంలో పార్వతి అనే మహిళ సీసా పట్టుకొని ట్యాంకర్ వస్తేనే మాకు మంచినీరు, లేకుంటే ఈ మురికినీరే తాగాలంటూ కన్నీటి పర్యంతమయ్యారు. వంతునూరులో 270 ఇళ్లు ఉన్నాయి. ఈ ఊరికి చుట్టూ నీరు ఉంది. ఎటుపోవడానికి వీలు లేకుండా పోయింది. ఉద్దాన ప్రాంతంలో ఎక్కడైనా స్థలం ఇస్తే ఇళ్లు కట్టుకుంటామంటూ విజ్ఞప్తిచేశారు. ఇంకా పలువురు మహిళలు, విద్యార్థులు, వృద్ధులు విజయమ్మ వద్ద తన ఆవేదన వ్యక్తం చే శారు. రాజపురం గ్రామంలో కాముట ఆరుద్రమ్మ మాట్లాడుతూ తన ఇల్లు కూలిపోయింది. నాకు దిక్కులేదని కన్నీరు పెట్టింది. విజయమ్మ వెంటనే ఆ ఇంట్లోకి వెళ్లి చూశారు. తప్పకుండా సాయం అందించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. త్వరలోనే జగన్‌బాబు ప్రభుత్వం వస్తుంది. మీకు మంచే జరుగుతుందని చెప్పారు. సనపల సరస్వతి అనే మహిళ మాట్లాడుతూ తనకు ఎనిమిది ఎకరాలు కొబ్బరితోట ఉంది. మొత్తం కూలిపోయింది. ఇక నేనేమి చేయాలి. నాకు పింక్ కార్డు ఇచ్చారు. కనీసం బియ్యం తీసుకునేందుకు కూడా నాకు అర్హతలేదంటూ కన్నీరు పెట్టుకున్నారు. ఇలా ప్రతి గ్రామంలోనూ వేదనలు, రోదనలు మిన్నంటాయి. రాబోయేది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమేనని, తప్పకుండా అందరికీ న్యాయం జరుగుతుందని, సాయం అందించేందుకు మీ పక్షాన పోరాడతామని విజయమ్మ వారికి భరోసా ఇచ్చారు. -
పై-లీన్ తుపాను బాధితులకు విజయమ్మ మనోధైర్యం
సాక్షి, శ్రీకాకుళం: ఇరవయ్యేళ్ల కష్టం.. మరో ఇరవయ్యేళ్ల జీవితం.. ఓ తరానికి సరిపోయే జీవనోపాధి. కళ్లముందే నేల కొరిగింది. పై-లీన్ తుపాను తాకిడికి వేల సంఖ్యలో కొబ్బ రి, జీడి మామిడి, పనస తదితర ఉద్యాన పంటలు నాశనమయ్యాయి. ఇళ్లు శిథిలమయ్యాయి. మత్స్యకారులకు కూడు పెట్టే పడవ లు, వలలు అలలకు కొట్టుకుపోయాయి. బతుకు తెరువు పోయిందన్న బాధ ఓ వైపు. ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదు. ఏసీ కార్లలో వస్తున్న నేతలు.. నేల మీద అడుగు పెట్టకుండానే.. వెళ్లిపోతున్నారన్న ఆవేదన మరో వైపు. ఇలాంటి బాధాతప్త హృదయాల్ని అక్కున చేర్చుకునేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ జిల్లాలోని తుపాను బాధిత ప్రాంతాల్లో బుధవారం ఉదయం నుంచి రాత్రి వరకు పర్యటించారు. రైతులు, మత్స్యకారుల గోడు స్వయంగా విన్నారు. తమ పార్టీ తరఫున ప్రభుత్వాన్ని నిలదీస్తామన్న భరోసా ఇచ్చారు. మరికొద్ది నెలల్లో జగన్ బాబు ప్రభుత్వం వస్తుందని, అప్పుడు అందరి బాధలూ తీరిపోతాయన్న ఆశలు నిం పారు. కొండంత ధైర్యాన్నిచ్చారు. ‘20 ఏళ్లపాటు ఫలసాయమిచ్చే కొబ్బరి, జీడి తోటలు నాశనమయ్యాయి. కాంగ్రెస్‌కు చెందిన ముగ్గురు మంత్రులు ఇలా వచ్చి.. అలా వెళ్లిపోయారు. కార్లు దిగకుండానే.. ఇక్కడేం నష్టం జరగలేదంటూ తేల్చి చెప్పేశారు’.. - పలికల భాస్కర్, జాడుపూడి ‘అధికార బృందం రాలేదు. నష్టాన్ని అంచనా వేసేవాళ్లు లేరు. ఏం జరిగిందని అడిగే నాథుడే లేడు. చాలా కుటుం బాలు రోడ్డునపడ్డాయి. ఊరంతా అంధకారంలోనే ఉంది. జనరేటర్ల సాయంతో ట్యాంకర్లకు నీటిని నింపి సరఫరా చేసుకుంటున్నాం. వీఆర్వోను అడిగితే.. సమ్మెలో ఉన్నట్టు చెప్పారు. ఒక్కో చెట్టుకు పరిహారంగా రూ.10 వేలిచ్చినా సరిపోదు’.. - బొడ్డ రామ్‌కుమార్, సర్పంచ్, పెద్దకొజ్జిరియా ‘ఉన్న ఎనిమిదెకరాల్లోని కొబ్బరి పంట నాశనమైంది. ఆ పొలం ఉందని సెప్పి తెల్లకార్డు ఇవ్వలేదు. పెన్షన్‌కు దూరం చేశారు. ఇపుడు నా పంటంతా పోయినాది. నాకు దిక్కేటి’.. - సనపల సరస్వతి, రాజపురం ‘మారాజు. దేవుడిలాంటి వైఎస్సార్ ఇల్లు కట్టుకోడానికి భూమిచ్చారు. పేదలం. ఇల్లు కట్టుకునేందుకు సొమ్మేదీ..! దయచేసి మాకు ఒక రూమ్‌తో ఇల్లు కట్టిత్తే ఆ నాయన పేరు సెప్పుకుని బతికేత్తాం’.. - రట్టి శేషమ్మ, ఇద్దివానిపాలెం ‘మా ఊళ్లో 270 వరకు ఇళ్లున్నాయి. ఎటేపు నుంచీ దారి లేదు. చుట్టూ ఏరే. ట్యాంక్ నీరొస్తే ఫర్వాలేదు. లేదంటే.. మురికినీరే గతి. ఉదానం వైపు మాకు భూమిస్తే ఊరంతా ఎల్లి ఇళ్లు కట్టుకుంటాం’.. - పార్వతి, ఒంటూరు ఒకరేంటి.. ఒక్కో ఊళ్లో ఒక్కో రకమైన ఆవేదన. కిడ్నీ వ్యాధుల నుంచి తమను రక్షించాలని, ఆరోగ్య శ్రీ పథకాన్ని మరింత పెంచాలంటూ కుసుంపురం వాసులు, బీల నీటి ముంపుతో వరి పొలాలు పాడైపోయాయని రుషికుడ్డ ప్రజలు, థర్మల్ విద్యుత్‌ప్లాంట్ అనుమతులు రద్దు చేయాలని బారువ ప్రజలు.. జగన్ వస్తేనే తమ సమస్యలు తీరుతాయన్న నమ్మకంతో.. ఆయన తరఫున తమ బాధలు తెలుసుకునేందుకు వచ్చిన వైఎస్ఆర్సీపీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ ముందు గోడు వెల్లబోసుకున్నారు. కన్నీరు పెట్టుకున్నారు. ప్రతి ఒక్కరి బాధనూ ఆమె సాంతం విన్నారు. పలు విషయాలు అడిగి మరీ తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ‘జిల్లాలో తుపాను ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. మిమ్మల్ని పరామర్శించి ధైర్యం నింపడానికే నన్ను జగన్ బాబు ఇక్కడికి పం పించాడు. కొబ్బరి, జీడి తోటలు, బోట్లు, వల లు, ఇళ్లు పాడయ్యాయి. చూస్తే చాలా బాధగా ఉంది. రాజశేఖరరెడ్డిగారున్నపుడు సునామీ వస్తే ఎంతగానో ఆదుకున్నారు. చివరి నిమిషం వరకు మీ కోసమే తపించారు. ఇపుడు ఆ సంక్షేమ పథకాలు అందే పరిస్థితి లేదు. మీ తరఫున మా ఎమ్మెల్యేలంతా కలిసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. అసెంబ్లీ పెడితే.. అక్కడా చర్చిస్తాం. చెట్టుగా కాకుండా ఎకరానికి లెక్కిం చి నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తాం. ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించాలని కోరుతాం. ఐదారు నెలల్లో జగన్ నాయకత్వంలో మంచి రోజులు వస్తాయి. వేటకెళ్లి గల్లంతైన మత్స్యకారులకు వెంటనే రూ.50 వేలు, ఆరు మాసాల వరకు జాడ కానరాకపోతే మిగిలిన రూ.4.50 లక్షలు పరిహారం ఇస్తాం. మీ నుంచి ఒకర్ని ఎమ్మెల్యేగా శాసనసభకు పంపిస్తానంటూ జగన్ ఎప్పుడో మాటిచ్చారు. మీరంతా ధైర్యం గా ఉండండి. రాజశేఖరరెడ్డి పథకాలన్నింటినీ అమలు చేస్తారంటూ భరోసా ఇచ్చారు. -
చీకటి కిరణం
-
పరిష్కారానికి కృషి చేస్తామని విజయమ్మ హామీ
-
తీవ్రంగా దెబ్బతిన్న శ్రీకాకుళం ఉద్దాన ప్రాంతం
-
చిక్కుల్లో సిక్కోలు
-
ఫైలిన్ తుఫాన్ శ్రీకాకుళం కకావికలం
-
కోలుకుంటోన్న ఒడిశా
-
నేడు శ్రీకాకుళం జిల్లాలోవిజయమ్మ పర్యటన
-
కరువు మేఘాలు
అలో లక్ష్మణా అంటూ అన్నదాత వాపోతున్నాడు. ఆరుగాలం కష్టించినా నాలుగువేళ్లు నోటికి వెళ్లే దారిలేక, బతికేందుకు వేరే మార్గం కానరాక కుంగిపోతూ... తన దురదృష్టానికి తిట్టుకుంటూ కన్నీరుకారుస్తున్నాడు. తుఫాన్ వచ్చినా కనీస స్థాయిలో కూడా వర్షాలు పడలేదు. పై-లీన్ ముప్పు తప్పడంతో కలిగిన ఆనందం... కనీస స్థాయిలో కూడా వర్షాలు కురవకపోవడంతో ఆవిరైంది. వర్షాభావ పరిస్థితుల కారణంగా నెర్రెలు వారిన నేలకు తుఫాన్ తీరం దాటిన సమయంలో పడే వర్షాలకు జీవం వస్తుందని ఆశించిన రైతులకు, అధికారులకు నిరాశేమిగిలింది. విజయనగరం వ్యవసాయం, న్యూస్‌లైన్: ఈ ఏడాది కూడా రైతులకు కష్టాలు తప్పేటట్టు లేవు. వర్షాభావ పరిస్థితులతో జిల్లాపై కరువు మేఘాలు కమ్ముకున్నాయి. తుఫాన్ సమయంలోనైనా తగిన స్థాయిలో వర్షాలు పడలేదు. శని,ఆదివారాల్లో అంతంత మాత్రం గానే కురిశాయి. అదికూడా కొమరాడ, గుమ్మ లక్ష్మీపురం, కురుపాం, జియ్యమ్మవలస, బలిజి పేట,చీపురుపల్లి, పూసపాటిరేగ, భోగా పురం మండలాల్లో కొద్దిపాటి వర్షం పడిం ది. ఖరీఫ్ సీజన్లో(జూన్ నుంచి సెప్టెంబర్ నెలాఖరు నాటికి) జిల్లాలో 692.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదుకావలసి ఉండగా 574.2 మిల్లీమీటర్ల వర్షపాతం మాత్రమే నమోదైంది. డెం కాడ, జామి, భోగాపురం, మెరకముడిదాం మండలాల్లో 40 శాతం కంటే తక్కువ వర్షపా తం నమోదైంది. విజయనగరం, పూసపాటిరేగ, చీపురుపల్లి, బొండపల్లి, గుర్ల, కొమరాడ, ఎల్.కోట, ఎస్.కోట, గంట్యాడ మండలాల్లో 50 శాతం కంటే తక్కువ వర్షపాతం నమోదైంది. 30 వేల హెక్టార్లలో నాట్లు లేవు వర్షాభావ పరిస్థితుల కారణంగా చాలా ప్రాం తాల్లో నాట్లు వేయని పరి స్థితి నెలకొంది. గత ఏడా ది ఖరీఫ్ సీజన్లో 1,20,475 హెక్టార్లలో వరి పంట సాగవగా ఈ ఏడా ది కేవలం 90 వేల హెక్టార్లలో మాత్రమే నాట్లు వేశారు. 30,475 హెక్టార్ల లో నాట్లు వేయలేదు. గుండె చెరువు... గ్రామాల్లోని చెరువులను చూస్తుంటే రైతులకు గుండె చెరువవుతోంది. వర్షాలు కురవకపోవడంతో వాటిలో చుక్కనీరు చేరలేదు. దీంతో చాలా చెరువులు ఆనవాళ్లు కోల్పోయాయి. కనీసం చెరువుల్లో నీరున్నా ఆయిల్ ఇంజిన్లతో నీటిని తోడైనా నాట్లు వేసుకునే పరిస్థితి ఉండే ది. నీరు లేక పొలాలు బీటలు వారుతున్నాయి. దీంతో ఏమి చేయాలో తెలియక రైతులు భగవంతునిపై భారం వేసి మిన్నుకుంటున్నారు. ప్రత్యామ్నాయానికి అదునులేదు సాధారణంగా ఖరీఫ్ సీజన్లో వరిపంటను జూల్, ఆగస్టు నెలలో వేస్తారు. వర్షాలు ఆలస్యంగా కురిసినట్లయితే సెప్టెంబర్ మొదటి వారంతో ముగిస్తారు. సెప్టెంబర్ మొదటి వారం తర్వాత ఇంకా నాట్లు వేయని పరిస్థితి ఉంటే ప్రత్యామ్నాయ పంటలు కోసం వ్యవసాయశాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపించి, అమలుచేస్తుంది. అయితే సెప్టెంబర్ నెలకూడా ముగియడంతో ఇప్పుడు ప్రభుత్వం రాయితీపై విత్తనాలు, ఎరువులు ఇచ్చినా ఉపయోగించుకులేని పరిస్థితి. అపరాలు, చోడి పంట మేలు: ప్రస్తుత పరిస్థితుల్లో అపరాలైన పెసర, మినుము పంటలు లేదా, చోడి పంట వేసుకుంటే మేలని ఏరువాక కేంద్రం కోఆర్డినేటర్ పి.గురుమూర్తి తెలిపారు. పెసర, మినుము పంటలయితే 70 నుంచి 80 రోజుల్లో చేతికి అందివస్తాయన్నారు. చోడి పంటయితే 100 నుంచి 110 రోజుల్లో చేతికి వస్తుందని తెలిపారు. ఇప్పుడు వర్షాలు కురిసినట్టయితే స్వల్పకాలిక వరి రకాలైన 1010, పుష్కల విత్తనాలను డ్రమ్ సీడర్ పద్ధతిలో వెదజల్లుకోవాలని సూచించారు. ఈ రకాలు 100 రోజుల్లో పండుతాయని తెలిపారు. పంట ఎండిపోతోంది నాకున్న రెండు ఎకరాల్లో వరి వేశాను. రూ.20 వేల వర కు పెట్టుబడి పెట్టాను. నా ట్లు వేసినప్పటి నుంచి ఇప్పటివరకు వర్షాలు పడకపోవడంతో పంట ఎం డిపోయింది. గత ఏడాది పంట చేతికి అందివస్తుందనుకునే సమయంలో భారీ వర్షాలకు నీట మునిగింది. ఈ ఏడాది ఇలా అయింది. తిండి గింజలు కూడా దొరకని పరిస్థితి. ఇలా అయితే సాగు చేయడం చాలా కష్టం - వి.సింహాద్రి, పెదవేమలి గ్రామం, గంట్యాడ మండలం ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో సాగైన పంట వివరాలు పంటరకం= సాధారణం= సాగైంది వరి= 1,20,475= 90,000 జొన్న= 475= 83 గంటెలు= 663= 107 మొక్కజొన్న= 8805= 11,116 చోడి= 2528= 1457 సామ= 680= 25 కొర్ర= 330= 130 ఊద= 124= 0 చిరుధాన్యాలు= 177= 0 కంది= 1884= 1634 మినుము= 1698= 423 పెసర= 1611= 472 వేరుశనగ= 22,644= 8911 నువ్వులు= 11956= 7012 చెరుకు= 15078= 15602 పత్తి= 10691= 13903 గోగు= 18965= 4680 పొగాకు= 269= 3 -
మంత్రి శత్రుచర్ల కాన్వాయ్‌పై చెప్పుల దాడి
శ్రీకాకుళం : మంత్రి శత్రుచర్ల విజయ రామరాజుకు సమైక్య సెగ తగిలింది. పై-లిన్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న ఆయనను మంగళవారం సమైక్య వాదులు అడ్డుకున్నారు. సమైక్యవాదులు ఈ సందర్భంగా శత్రుచర్ల కాన్వాయ్‌పై చెప్పులు విసిరారు. సమైక్యాంధ్రకు మద్దతుగా మంత్రి శత్రుచర్ల రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. మరోవైపు కేంద్రమంత్రి కిల్లి కృపారాణికి కూడా సమైక్య సెగ తగిలింది. అయితే తన రాజీనామాతో రాష్ట్ర విభజన ఆగిపోదని ఆమె వ్యాఖ్యానించారు. -
తుపాను ప్రభావిత ప్రాంతాల్లో రేపు విజయమ్మ పర్యటన
హైదరాబాద్ : పై-లీన్ తుపాన్ ప్రభావ శ్రీకాకుళం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ బుధవారం పర్యటించనున్నారు. తుపాన్ వల్ల నష్టపోయిన ప్రాంతాలను ఆమె పర్యటిస్తారు. బాధితుల్ని పరామర్శిస్తారు . పై-లిన్ విసిరిన పంజాకు శ్రీకాకుళం జిల్లా కకావికలమైంది. భారీగా పంటలకు నష్టం వాటిల్లింది. ఇప్పటికీ పలు ప్రాంతాలు జల దిగ్బంధంలోనే ఉన్నాయి. విద్యుత్ లేక చాలా గ్రామాలు ఇంకా అంధకారంలోనే ఉన్నాయి. దాంతో విద్యుత్ సరఫరాను పునర్నిర్మించుకోడానికి మత్స్యకారులు తమంతట తాము ముందుకొస్తున్నారు. తుఫాను తీరం దాటే సమయంలో దాదాపుగా గంటకు 220-240 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలుల వల్ల శ్రీకాకుళం జిల్లా తీరప్రాంతంలో ఏకంగా 832 కిలోమీటర్ల మేర విద్యుత్ లైన్లు ధ్వంసమయ్యాయి. -
తుఫాను వెలిసింది...కష్టం మిగిలింది
-
'శ్రీకాకుళం జిల్లా రైతులకు నష్ట పరిహారం చెల్లించాలి'
-
'శ్రీకాకుళం జిల్లా రైతులకు నష్ట పరిహారం చెల్లించాలి'
ఫై-లిన్ తుఫాన్ కారణంగా నష్టపోయిన శ్రీకాకుళం జిల్లా రైతులకు ప్రభుత్వం తక్షణమే నష్టపరిహారం చెల్లించాలని వైయస్ఆర్ సీపీ రైతు విభాగం రాష్ట్ర కన్వీనర్ నాగిరెడ్డి మంగళవారం హైదరాబాద్‌లో డిమాండ్ చేశారు. ఫై-లిన్ తుఫాన్ తాకిడి వల్ల శ్రీకాకుళం జిల్లాలో అపారమైన పంటనష్టం జరిగిందని తెలిపారు. కనీసం త్రాగునీరు కూడా లభించక జిల్లా ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని నాగిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. పైలిన్ తుఫాన్ తీరం దాటిన తర్వాత ఒడిశాలో కురిసిన భారీ వర్షాలకు శ్రీకాకుళం జిల్లాలో వంశధార నదీకి వరద పోటెత్తింది. దాంతో నదీలో నీటి మట్టం గరిష్ట స్థాయికి చేరింది. దీంతో గొట్టా బేరీజీలోని అన్ని గేట్లు ఎత్తివేసి అధికారులు నీటిని దిగువకు విడిచిపెట్టారు. వంశధార నదీ పరివాహక ప్రాంతంమైన ఆముదాలవలస మండలం చెవ్వాకుల పేట గ్రామంలోకి భారీగా వరద నీరు చేరుతుంది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ముందస్తు చర్యల్లో భాగంగా అధికారులు ఆ గ్రామానికి చేరుకున్నారు. దాదాపు డభ్బై కుటుంబాలను రామచంద్రాపురం తరలించారు. స్థానిక పాఠశాలలో వారికి పునరావాసం కల్పించారు. -
పై-లిన్ ప్రభావిత ప్రాంతాల్లో ఒడిశా సీఎం ఏరియల్ సర్వే
భువనేశ్వర్ : పై-లిన్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఏరియల్ సర్వే నిర్వహించారు. పై-లిన్ తుపాన్‌తో జరిగిన నష్టాన్ని స్వయంగా పరిశీలించారు. బాధితులందరినీ ఆదుకుంటామని నవీన్ పట్నాయక్ హామీ ఇచ్చారు. సహాయక చర్యలపై అధికారులతో సమీక్ష జరిపారు. గోపాల్ పూర్, గంజాం జిల్లాల్లో పర్యటించారు. అయితే కొన్నిచోట్ల సీఎం కాన్వాయ్ ని బాధితులు అడ్డుకున్నారు. సహాయక చర్యలు అందటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు పై-లిన్ ప్రభావంతో రద్దు చేసిన అన్ని రైళ్లను పునరుద్దరించినట్లు తూర్పు కోస్తా రైల్వే అధికారులు తెలిపారు. మరోవైపు పాడయిన రైల్వే ట్రాక్ పనులను పునరుద్దరిస్తున్నారు. -
పై-లీన్ విపత్తులో మన నేరమెంత?
పై-లీన్ తుపాను గండం దాటిపోయిందంటూ 'హమ్మయ్య' అని ఈ నిట్టూర్పు విడిచేసి, చేతులు దులిపేసుకుంటే అంతకి మించి నేరం మరొకటి లేదంటున్నారు నిపుణులు. లక్షలాది ఇళ్లు నేలమట్టం చేసి, లక్షల కుటుంబాలకీ నిలవ నీడ లేకుండా చేసి, రవాణా, ప్రసార వ్యవస్థల్ని చిన్నాభిన్నం చేసి, వేల కోట్ల రూపాయల నష్టం కలిగించిన పై-లీన్ విషయంలో హమ్మయ్య అనుకోవలసిందేమైనా ఉందంటే అది ప్రాణనష్టాన్ని నివారించచడం ఒక్కటే. 1999 ఒడిశా పెను తుపాను తర్వాత, ఈ 14 ఏళ్లలో అతి పెద్ద తుపాను పై-లీన్ అని వాతావరణ శాఖ ప్రకటించింది. రగులుతున్న రాజకీయ వర్తమానం నుంచి, సమస్యల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి అది దేవుడిచ్చిన అవకాశంగా అనుకున్నాయో, లేదా వాతావరణ శాఖ చేసిన హెచ్చరికల ఫలితమో గానీ, ప్రభుత్వాలు ముందెన్నడూ లేనంత భారీ ఎత్తున లక్షలాది మంది ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకి తరలించాయి. చనిపోయిన వారి సంఖ్య 25 (మాత్రమే) కావడం కూడా 'హమయ్య' అనుకునే వెసులుబాటు ఇచ్చింది. కానీ, ఎన్ని సార్లైనా, చేతులు కాలాక మాత్రమే ఆకులు పట్టుకుంటున్న ఈ నిర్లక్ష్యం ఉపేక్షించరానిది. ప్రచండ పై-లీన్ ప్రతాపం పెనుగాలులు, కుండపోత వర్షం, గట్లు తెగిన నదులు, పోటెత్తి జనవాసాల్లోకి చొచ్చుకొచ్చిన సముద్రం. నేలమట్టమైన ఇళ్లు, కొట్టుకుపోయిన పంటలు, కుప్పకూలిన కొబ్బరి చెట్లు, తెప్పలా తేలిన జీడిమామిడి చెట్లు, ఆచూకీలేని అరటి తోటలు.. అంతా కన్ను మూసి తెరిచేంతలో జరిగిపోయిన విషాదం. ప్రాథమిక అంచనా ప్రకారం.. మన రాష్ట్రం వరకూ 6000 హెక్టార్లలో అరటి, జీడి, మొక్కజొన్న, కొబ్బరి, , చెరకు పంటలు దెబ్బతిన్నాయి. వీటిలో కొబ్బరి విస్తీర్ణం అధిక శాతం కనుక, బాధిత రైతుల్లో 90 శాతం కొబ్బరి రైతులే! ఇది కాకుండా, కేవలం ఆరు మండలాల్లోనే 8000 హెక్టార్లలో వరి నాశనమైంది. ఇందులో పొట్ట దశకు వచ్చి పాడైన పంట 3500 హెక్టార్లలో ఉంది. లక్షలాది టేకు చెట్లు వెన్ను విరిగి కూలాయి. గాలులు గంటకి 230 కిలో మీటర్ల వేగంతో వీచాయి, దానితో కమ్యూనికేషన్ల వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది. వంగిపోయిన విద్యుత్ స్థంభాలు ఎన్నో. పశువులు, సైబేరియా నుంచి వచ్చిన వలస పక్షులు ఎన్ని చనిపోయాయో లెక్కకి తేలదు. కుండపోత వర్షాలకి వరదలెత్తిన నదులు గ్రామాలకి గ్రామాల్నే ముంచెత్తాయి. 150 ఎకరాల్లో రొయ్యల చెరువులు దెబ్బ తిన్నాయి. మానవ తప్పిదమెంత? ప్రకృతి వైపరీత్యాన్ని అడ్డుకోలేక పోయినా, ఆ తీవ్రతని తగ్గించే ప్రత్యామ్నాయాల్ని చేజేతులా నాశనం చేసుకోవడం వల్లే తుపానులు, ఉప్పెనల్లో భారీ నష్టం జరుగుతుంది. "ఏ ట్రాపికల్ సైక్లోన్ (ఉష్ణమండలాల్లో వచ్చే తుపానులు) పరిణామాలైనా మూడు- ఒకటి పెనుగాలులు, రెండు కుంభవృష్టి, మూడు ఉప్పెన (లేదా సునామి). ఈ మూడు వైపరీత్యాల తీవ్రతని 40 శాతం వరకూ తగ్గించే రక్షణ కవచాలు మడ చెట్లు. సముద్రం ఒడ్డున పెరిగే ఈ అడవుల్ని కొందరు వ్యక్తులు తమ స్వార్థ ప్రయోజనాలకోసం అడ్డగోలుగా నరికేస్తుంటే పట్టించుకునే నాథులే లేరు," అని వాపోయారు ఆంధ్రా యూనివర్సిటీ ఓషనోగ్రఫీ విభాగం విశ్రాంత ఆచార్యులు ప్రొఫెసర్ ఓఎస్ఆర్యు భానుకుమార్. సోమవారం సాక్షితో మాట్లాడుతూ, మడ అడవుల్ని సంరక్షించుకోగలిగినట్టైతే పై-లీన్ తుపాను నష్టం ఎంతో నివారించబడేదని ఆయన అన్నారు. "ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు మడ అడవులు గోడలా నిలిచి మానవాళికి రక్షణ కల్పిస్తున్నాయి. తీరం కోతకు గురవకుండా ఇవి కాపాడతాయి. సునామీ సమయాల్లో సముద్రపు నీరు నేరుగా లోపలికి రాకుండా అడ్డుకుంటాయి. ముఖ్యంగా ఇలవమడ, నల్లమడ, గుగ్గిలం తెల్లమడ ఈల్వమడతోపాటు మొత్తం 35 రకాల చెట్లు ఈ అడవుల్లో కనిపిస్తాయి. ఇవి రెండు నుంచి 25 మీటర్ల ఎత్తు వరకు ఎదిగి తీరంలో రక్షణ కవచంగా నిర్మిస్తాయి," అని ఆయన చెప్పారు. ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ స్వామినాథన్ మడ చెట్ల పెంపకం గురించి ఒక కొత్త పథకాన్ని రూపొందించారని ఆయన తెలిపారు. మడ చెట్లు రక్షణ కవచమే కాకుండా, చేపల పునరుత్పత్తికి దోహదపడతాయనీ, దాని వల్ల దేశ సముద్ర ఉత్పత్తులు గణనీయంగా పెరుగుతాయని మరో వాతావరణ అధ్యయన నిపుణులు అచ్యుతరావు తెలిపారు. అయితే, కొందరు స్వార్థపరులు మడ అడవులను నరికేస్తూ, చేపల చెరువులు, రొయ్యల చెరువులు తవ్వుతున్నారు; దానికి రెవెన్యూ అధికారులు వత్తాసు పలుకు తున్నారు. ఎంతో విలువైన వృక్ష సంపద వంట చెరకుగా మారిపోతోంది. మడ అడవులు తరిగిపోతూ తీర్రపాంతంలో భూమి కోతకు గురికావడం, సముద్ర మట్టాలు పెరగడం వంటి దుష్పరిణామాలతో పాటు, ప్రకృతి విలయానికి వేల కోట్లలో నష్టం కలుగుతోంది. దానికి ప్రాణనష్టం కూడా తోడైతే ఏ గణాంకాలు ఆ తీవ్రతని అంచనా వేయగలవు? అందరి సమష్టి బాధ్యత సముద్ర తీర ప్రాంతాల్లో మాంగ్రోవ్ అని పిలవబడే మడ అడవుల పెంపకం అమెరికా వంటి దేశాల్లో విధిగా ఆచరిస్తారు. వాటిని నరికివేయడం పెద్ద నేరం. దానికి కఠినమైన శిక్షలు అమలు చేసాయి ఆ ప్రభుత్వాలు. "నిజానికి మన దేశంలో కూడా కోస్టల్ రెగ్యులేషన్ జోన్ (సీఆర్‌జడ్) నిబంధనలు ఉన్నాయి. ఆ నిబంధనల ప్రకారం, సముద్రతీరంలో ఎటువంటి తవ్వకాలు చేపట్టకూడదు," అన్నారు కోస్తా పర్యావరణ అధ్యయన ఆచార్యులు డి ఇ బాబు. ఆ నిబంధనలకి ఎటువంటి పరిస్థితుల్లోనూ సడలింపు ఉండదని ఆయన సాక్షి కి వివరించారు. అయితే నిషేధాలని పక్కనపెట్టి అక్రమార్కులు యథేచ్చగా చేపల చెరువులను తవ్వేస్తున్నారు, అధికారులు వారికి కొమ్ము కాస్తున్నారు. పై-లీన్ ఉత్తర వాయువ్య దిశగా ఒడిషా వైపు వెళ్లిపోవడం వల్ల, నిలకడగా ఒక చోట నిలవకపోవడం వల్ల ఆంధ్రప్రదేశ్‌కు ముప్పు తప్పింది. లేకుంటే, తెలంగాణా జిల్లాలకి కూడా వాన దెబ్బ తగిలేదని, హైదరాబాదు వాతావరణ శాఖ అధికారి నరసింహారావు అన్నారు. ఉష్ణ,సమశీతోష్ణ మండల తీరప్రాంతాలలో ఉప్పునీటిలో పెరిగే చెట్లు,పొదల సముదాయమే మడ అడవులు. ఆ తీరప్రాంతాల్లో, నదీ ముఖద్వారాలలో పరిశ్రమలు స్ధాపించడం, చేపల, రొయ్యల చెరువులు తవ్వడం తీవ్రమైన నేరాలు. వాటి వల్ల మడ అడవులను అంతరించకుండా రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీదే కాదు ప్రతీ ఒక్కరిమీద వుంది. -
వంశధారకు పోటెత్తిన వరద నీరు
శ్రీకాకుళం : వంశధారకు వరద నీరు పోటెత్తుతుంది. అధికారులు ముందు జాగ్రత్త చర్యగా మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసారు. కొత్తూరులో నివగాం, మదనాపురంలోని రహదారిపైకి వరదనీరు చేరింది. ఒడిశాలోని నదీ పరివాహక ప్రాంతంలో భారీ వర్షాలు కురియడంతో శ్రీకాకుళం జిల్లాలోని వంశధార, బాహుదా, మహేంద్రతనయ నదుల్లో వరదనీరు పోటెత్తుతుంది. వంశధార గొట్టా బ్యారేజీ వద్ద ప్రస్తుత నీటి ప్రవాహం 53వేల క్యూసెక్కులకు చేరింది. అధికారులు బ్యారేజీ అన్ని గేట్లు ఎత్తివేసి నీటిని దిగువకు విడిచి పెట్టారు. ఇక పై-లీన్ తుపాను బీభత్సానికి శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతం కకావికలమైంది. శనివారం రాత్రి వీచిన ప్రచండ గాలులకు ఒకరు మృతి చెందారు. సుమారు రూ.1,000 కోట్లకు పైగా నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక అంచనా. ఉద్యాన పంటలు దాదాపు తుడిచిపెట్టుకుపోయాయి. మిగతా పంటలు కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయి. -
జలదిగ్బంధంలో చెవ్వాకుల పేట
ఆముదాలవలస : శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస మండలం చెవ్వాకుల గ్రామం వద్ద వంశధార పొంగి పొర్లుతోంది. దాంతో చెవ్వాకుల గ్రామం జలదిగ్బంధంలో చిక్కుకుంది. మరోవైపు వంశధార వరద ఉధృతి పెరగటంతో 54వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. కాగా హీరమండలం వద్ద గొట్టా బ్యారెజ్ అన్ని గేట్లు ఎత్తివేసి నీటిని దిగువకు వదులుతున్నారు. అలాగే మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. పై-లిన్ తుపాన్ ప్రభావంతో జిల్లాలో లక్ష ఎకరాల్లో పంట దెబ్బతింది. 20వేల ఎకరాల్లో కొబ్బరి తోటలకు నష్టం వాటిల్లింది, ఇక ఒడిశాలోని పలు ప్రాంతాల్లో నిన్న భారీ వర్షాలు కురియడంతో వంశధార నదికి వరద వచ్చే అవకాశం ఉందని భావిస్తూ కలెక్టర్ మొదటి ప్రమాద హెచ్చరికను జారీచేశారు. ఎగువ ప్రాంతంలో కురిసిన వర్షాల వల్ల మరో 10 వేల క్యూసెక్కుల నీరు అదనంగా చేరవచ్చని, దీనివల్ల వరద ప్రమాదం ఉండదని నీటిపారుదల శాఖ అధికారులు చెబుతున్నారు. వంశధార నదీతీర వాసులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు. -
దెబ్బతిన్న రైల్వే ట్రాక్‌లు పునరుద్దరణ
విశాఖ : పై-లిన్ తుపాను కారణంగా దెబ్బతిన్న రైల్వే ట్రాక్‌ల పునరుద్దరణ పనులను రైల్వే అధికారులు సోమవారం ప్రారంభించారు. విశాఖ నుంచి భువనేశ్వర్, కోల్‌కతా రైలు మార్గంలో మరమ్మతులు చేపట్టారు. అలాగే ఈ మార్గంలో పరిమిత వేగంతో రైళ్లు నడపాలని నిర్ణయించారు. కాగా పై-లీన్ తుపాను ప్రభావం తగ్గడంతో కొన్ని రైళ్లను పునరుద్ధరిస్తున్నట్లు తూర్పు కోస్తా రైల్వే నిన్న ప్రకటించింది. పలు స్టేషన్లలో నిలిచిపోయిన ప్రయాణికుల కోసం ప్రత్యేక రైళ్లను నడిపినట్లు తెలిపింది. హౌరా- పూరి మధ్య రైలు సర్వీసులను పునరుద్ధరించినట్లు పేర్కొంది. భువనేశ్వర్-రూర్కెలా ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్, పూరి- సంబల్పూర్ ఎక్స్‌ప్రెస్, భువనేశ్వర్-న్యూఢిల్లీల మధ్య సంపర్క్‌క్రాంతి, రాజధాని ఎక్స్‌ప్రెస్‌లు నిన్న సాయంత్రం షెడ్యూల్ సమయం కన్నా ఆలస్యంగా భువనేశ్వర్ నుంచి బయల్దేరాయి. పూరి నుంచి బయల్దేరనున్న కొన్ని ఎక్స్‌ప్రెస్ రైళ్లను షెడ్యూల్ ప్రకారమే నడిపిస్తున్నామని, మరికొన్ని ఆలస్యంగా బయల్దేరుతాయని పేర్కొంది. -
రైళ్ల రాకపోకలపై తుపాను ప్రభావం
= దారి మళ్లింపుతో గంటల కొద్దీ ఆలస్యం = సరైన సమాచారం తెలియక ప్రయాణికుల ఇక్కట్లు = మరో రెండురోజుల వరకు ఇదే పరిస్థితి? విజయవాడ, న్యూస్‌లైన్ : పై-లీన్ తుపాను కోస్తా ప్రాంతంలో రైళ్ల రాకపోకలపై తీవ్ర ప్రభావం చూపింది. తుపాను ప్రభావంతో ఈ మార్గంలో నడిచే పలు రైళ్లను దారి మళ్లించారు. విశాఖపట్నం నుంచి భువనేశ్వర్ వైపు వెళ్లే అన్ని సర్వీసులను నిలిపివేశారు. హౌరా-అసోం నుంచి వచ్చే రైళ్లు గంటల కొద్దీ ఆలస్యంగా నడుస్తున్నాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు. ఆదివారం ఉదయం రావలసిన పలు రైళ్లు బలార్ష మీదుగా వస్తుండటంతో అవి నగరానికి అర్ధరాత్రి చేరుకునే అవకాశముంది. ఈ రైళ్లే గమ్యస్థానం నుంచి మరలా రావలసి ఉంది. దీంతో సోమ, మంగళవారాల్లో రావాల్సిన రైళ్లు వస్తాయా? లేదా? అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అధికారులు రైళ్లను నడుపుతున్నా అవి ఎంత ఆలస్యంగా నడుస్తాయో చెప్పలేకపోతున్నారు. విజయవాడ నుంచి విశాఖపట్నం, పలాస, భువనేశ్వర్ మీదుగా హౌరా వెళ్లే రైళ్లను కాజీపేట, వరంగల్, బలార్ష, రాయ్‌పూర్ మీదుగా హౌరాకు మళ్లించినట్లయితే 560 కిలోమీటర్లు అధికంగా ప్రయాణించవలసి ఉంటుంది. ఈ నేపథ్యంలో దారి మళ్లించిన అన్ని రైళ్లు 12 నుంచి 15 గంటలు ఆలస్యంగా నడుస్తున్నాయి. ప్రయాణికులు ఇబ్బందులు పడకుండా రైల్వే ఉన్నతాధికారులు ఎక్కడికక్కడ ఆహారం, మంచినీరు, పాలు వంటివి ఏర్పాటు చేస్తున్నారు. ఈస్ట్‌కోస్ట్ రైల్వేలో దెబ్బతిన్న రైల్వేట్రాక్‌ను యుద్ధప్రాతిపదికన పునరుద్ధరించడానికి చర్యలు చేపట్టారు. దీంతో సోమవారం నుంచి అటువైపు రైళ్ల రాకపోకలు యథావిధిగా జరిగే అవకాశమున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. పలు రైళ్లను దారి మళ్లించడం, మరికొన్నింటిని రద్దు చేయడం, ఇంకొన్నింటిని పాక్షికంగా రద్దు చేయడంతో వాటి వివరాలను ప్రయాణికులకు అందించడం సమాచార కేంద్రాల్లో ఉన్న సిబ్బందికి తలకు మించిన భారంగా మారింది. ఉదయం రావలసిన రైళ్లు రాత్రికి, రాత్రికి రావలసిన రైళ్లు మరుసటి రోజు మధ్యాహ్నానికి వస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ఏ రైలు ఎప్పుడు వస్తుందో.. అది ఎంత వరకు వెళ్తుందో తెలియక ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. ముంబై - భువనేశ్వర్ కోణార్క్ ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్ - భువనేశ్వర్ విశాఖ ఎక్స్‌ప్రెస్‌లను విశాఖపట్నం వరకే నడిపారు. హౌరా నుంచి వాస్కోడిగామా వెళ్లాల్సిన అమరావతి ఎక్స్‌ప్రెస్ ఆదివారం రద్దయ్యింది. ఆదివారం ఉదయం విజయవాడకు చేరుకోవలసిన కోరమండల్ ఎక్స్‌ప్రెస్ అర్ధరాత్రి దాటిన తర్వాత రావచ్చునని తెలుస్తోంది. ఈ విధంగా దారి మళ్లించిన అన్ని రైళ్లు గంటలకొద్దీ ఆలస్యంగా నడుస్తుండటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ పరిస్థితుల్లో వారు టికెట్లను రద్దు చేసుకుంటే తిరిగి నగదు చెల్లించడానికి ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశారు. దీనికితోడు వారు వెళ్లవలసిన రైలులో కాకుండా వేరొక రైలులో ప్రయాణించేందుకు కూడా అధికారులు అనుమతించారు. రానున్న రెండు రోజుల వరకు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశమున్నట్లు అధికారులు భావిస్తున్నారు. ప్రయాణికుల రద్దీని నివారించడానికి కాకినాడ నుంచి సికింద్రాబాద్‌కు ఆదివారం రెండు ప్రత్యేక రైళ్లను నడిపారు. మచిలీపట్నం నుంచి సికింద్రాబాద్‌కు ఇంకొక రైలును నడిపారు. దసరా పండగ సందర్భంగా ప్రయాణికుల రద్దీ పెరిగే అవకాశం ఉండటంతో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు తెలిపారు. -
పై-లీన్ తో లైట్‌హౌస్ ఢీ!
గోపాల్పూర్: దేశవ్యాప్తంగా గుండెల్లో గుబులు పుట్టించిన పై-లీన్ ఆగ్రహాన్ని ఒడిశా గోపాల్పూర్ బీచ్‌లోని లైట్‌హౌస్ దీటుగా ఎదుర్కొంది! ఉవ్వెత్తున ఎగసిపడిన సముద్రం, వందల మైళ్లు విస్తరించిన తుపాను గురించి క్షణక్షణం అధికారులకు, తద్వారా ప్రజలకు ఎప్పటికప్పుడు కచ్చితమైన సమాచారాన్ని చేరవేసింది. తుపాను భయంతో గోపాల్పూర్ ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లడం తెలిసిందే. ఈ లైట్‌హౌస్‌లోని కొద్దిపాటి సిబ్బంది మాత్రం విధుల్లో భాగంగా పై-లీన్‌తో ఢీకొన్నారు. సిబ్బందికి చెందిన రెండు కుటుంబాలు కూడా అక్కడే ఉండిపోయాయి. కేంద్రం ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఈ లైట్‌హౌస్.. తీర గస్తీ దళానికి, నౌకాదళానికి దిక్సూచి. ఇందులో వైర్లెస్వ్యవస్థ, వాతావరణ అంచనా పరికరాలు ఉన్నాయి. శనివారం సాయంత్రం ఐదు గంటల నుంచి జూనియర్ సివిల్ ఇంజనీరు జీకే ప్రమోద్ నేతృత్వంలో నలుగురు అధికారులు పై-లీన్‌ను క్షణక్షణం అంచనా వేస్తూ, సమాచారాన్ని ఎప్పటికప్పుడు కోల్‌కతాలోని తమ కేంద్ర కార్యాలయానికి, ఢిల్లీలోని విపత్తు ప్రతిస్పందన కేంద్రానికి చేరవేశారు. తుపాను ధాటి కి లైట్‌హౌస్ స్వల్పంగా దెబ్బతింది. కాంపౌండ్‌లోని కొన్ని చెట్లు కూలాయి. కొన్ని షెడ్లు ఎగిరిపోయాయి. అయినా సిబ్బంది ప్రాణాలకు తెగించి విధులు నిర్వహించారు. -
మా అంచనాలే కచ్చితం: ఐఎండీ
న్యూఢిల్లీ: పై-లీన్ కారణంగా గంటకు దాదాపు 300 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశముందని అమెరికా నౌకాదళం, బ్రిటన్ వాతావరణ శాఖ అంచనా వేసి హెచ్చరించటంతో.. ఇది విలయం సృష్టిస్తుందన్న భయాందోళనలు చెలరేగాయి. అయితే.. ఈ తుపాను గాలుల వేగం 200 నుంచి 220 కిలోమీటర్ల స్థాయిలో ఉంటుందన్న తమ అంచనాలే కచ్చితమైనవిగా నిరూపణ అయిందని భారత వాతావరణ విభాగం(ఐఎండీ) పేర్కొంది. మిగతా ఏజెన్సీల మాదిరిగా ప్రజలను భయాందోళనలకు గురిచేయడం తమ విధానం కాదని ఐఎండీ డెరైక్టర్ జనరల్ ఎల్ఎస్ రాథోడ్ ఆదివారం తెలిపారు. పై-లీన్‌ను భారత వాతావరణ శాఖ తక్కువగా అంచనా వేస్తోందని, అది అత్యంత తీవ్రమైన కేటగిరీ - 5లోకి వస్తుందని అమెరికాకు చెం దిన వాతావరణ నిపుణుడు ఎరిక్ హోల్తాస్ వ్యాఖ్యానించాడని, అయి తే, తీవ్రమైన తుపాను కేటగిరికి మాత్రమే చెందుతుందని ప్రకటించామన్నారు. చివరకు తమ అంచనానే నిజమైందని రాథోడ్ తెలిపారు -
తుఫాను భాదిత ప్రాంతాల నుంచి సాక్షి గ్రౌండ్ రిపోర్ట్
-
మీడియా పాత్ర బేష్: ఐఎండీ
పై-లీన్ తుపాన్ వల్ల ఆంధ్రప్రదేశ్‌కు ప్రస్తుతం ఏలాంటి ముప్పు లేదని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఆదివారం న్యూఢిల్లీలో స్పష్టం చేసింది. ఎక్కడ ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా పటిష్టమైన చర్యలు చేపట్టినట్లు తెలిపింది. అంతేకాకుండా మీడియా కవరేజ్ వల్ల అటు ఒడిశా, ఇటు ఉత్తరాంధ్రలోని తీరప్రాంత ప్రజలు మరింత అప్రమత్తమైయ్యారని పేర్కొంది. కచ్చితమైన హెచ్చరికల వల్ల నష్టాన్ని చాలా వరకు నివారించగలిగామని భారత వాతావరణ శాఖ అభిప్రాయపడింది. రానున్న 24 గంటల్లో 100 నుంచి 110 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. ఛత్తీస్‌గఢ్, పశ్చిమ బెంగాల్లో భారీగా వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని చెప్పింది. అంతేకాకుండా తుపాన్ ప్రభావంతో నేపాల్, బీహార్ సరిహద్దుల్లో భారీ వర్షపాతం నమోదు అవుతుందన్నారు. -
పై-లీన్ తుఫాన్ వల్ల ఒడిశాలో ఏడుగురు మృతి
పై-లీన్ తుపాన్ ప్రభావంతో బలమైన గాలులు, భారీ వర్షాల కారణంగా ఒడిశా రాష్ట్రం చిగురుటాకులా వణికింది. దాంతో గత రాత్రి ఏడుగురు వ్యక్తులు మృత్యువాత పడ్డారని ఒడిశా రెవెన్యూ శాఖ, విపత్తు నిర్వహాణ మంత్రి సూర్య నారాయణ పాత్రో ఆదివారం వెల్లడించారు. జనావాసాలపై చెట్లు కులడంతో వారంత మరణించారని తెలిపారు. ఒడిశా తీర ప్రాంతంతో పాటు రాజధాని భువనేశ్వర్‌లో బలమైన గాలులు వీచడంతో వందలాది చెట్టు నెలమట్టమైనాయని చెప్పారు. తుపాన్ ప్రభావ ప్రాంతాల్లో సహాయ చర్యలు ముమ్మరం చేసినట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లన్ని జలమైనాయన్నారు.లోతట్టు ప్రాంతాల్లోని దాదాపు 10 లక్షల మంది ప్రజలకు సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు చెప్పారు. రోడ్డు, రవాణా, కమ్యూనికేషన్ వ్యవస్థలు పూర్తిగా దెబ్బతిన్నాయన్ని సూర్య నారాయణ పాత్రో తెలిపారు. -
'పై-లీన్'తో పలు ఎక్స్‌ప్రెస్, ప్యాసింజర్ రైళ్లు రద్దు
పై-లీన్ తుఫాన్‌తో ఒడిశా, ఉత్తరాంధ్రలోని జిల్లాలు చిగురుటాకులా వణికాయి. ఈ నేపథ్యంలో పలు రైళ్ల సర్వీసులను రద్దు చేస్తున్నట్లు ఈస్ట్ కోస్ట్ రైల్వే ఆదివారం విడుదల చేసిన ఓ ప్రకటనలో వెల్లడించింది. బెంగళూరు-భువనేశ్వర్ (ప్రశాంతి ఎక్స్‌ప్రెస్), భువనేశ్వర్- యశ్వంత్‌పూర్, పూరి- చెన్నై,భువనేశ్వర్- తిరుపతి, భవనేశ్వర్- సికింద్రాబాద్, భువనేశ్వర్ - విశాఖ (ఇంటర్ సిటీ), భువనేశ్వర్-జగదల్పూర్ (హీరాఖండ్ ఎక్స్‌ప్రెస్), అహ్మదాబాద్ - పూరి, ముంబై - భువనేశ్వర్, పూరి- తిరుపతి, గౌహతి- చెన్నై (ఎగ్మోర్ ఎక్స్‌ప్రెస్) తదిరత ఎక్స్‌ప్రెస్ రైళ్లు రద్దు చేసినట్లు తెలిపింది. అలాగే విశాఖ - మచిలీపట్నం, విశాఖ - రాజమండ్రి, పలాస - విశాఖ, పూరి - గుణుపూర్, పలాస - గుణుపూర్, విజయనగరం - విశాఖ, విజయవాడ - రాయఘడ్ మధ్య నడిచే ప్యాసింజర్ రైళ్లను తాత్కాలికంగా నిలిపివేసినట్లు ప్రకటించింది. -
పై-లీన్ ప్రభావంతో ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు
రాగల 36 గంటల్లో ఉత్తర కోస్తాలోని పలు జిల్లాల్లో ఓ మోస్తారు నుంచి భారీగా వర్షాలు పడతాయని విశాఖపట్నంలోని వాతావరణ శాఖ ఆదివారం వెల్లడించింది. అలాగే 36 గంటల్లో తీరం వెంబడి 60 కిలోమీటర్ల నుంచి 70 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. సముద్రం అల్లకల్లోలంగా ఉన్న నేపథ్యంలో మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. కళింగపట్నం,భీముని పట్నం ఓడరేవుల్లో10వ నెంబర్, విశాఖ, గంగవరం, కాకినాడ ఓడరేవుల్లో 8వ నెంబర్, మచిలిపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నంలో 3వ ప్రమాద నెంబర్ హెచ్చరికాలు కొనసాగుతున్నాయి. -
గండం గడిచినట్టే!
ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లావాసుల గుండెల్లో ప్రకంపనాలు సృష్టించిన ‘పై-లీన్’ తీరం దాటింది. ప్రజలతో పాటు సమైక్యాంధ్ర సమ్మెలో ఉంటూనే తుపాను ప్రభావంతో ఉత్పన్నం కాగల పరిస్థితిని ఎదుర్కొనేందుకు కంటికి కునుకు లేకుండా అప్రమత్తమైన జిల్లా యంత్రాంగం కూడా గండం నుంచి జిల్లా గట్టెక్కినట్టేనని ఊపిరి పీల్చుకున్నారు. అయితే రానున్న 24 గంటల్లో జిల్లాలోని తీర మండలాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణశాఖ హెచ్చరించడంతో ఎలాంటి నష్టం వాటిల్లకుండా అవసరమైన అన్ని చర్యలూ చేపట్టారు. సాక్షి, కాకినాడ :కోనసీమను కకావికలం చేసిన 1996 తుపాను కంటే నాలుగైదు రెట్ల విధ్వంసం సృష్టించగల ‘పై- లీన్’ విరుచుకు పడుతోందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో జిల్లా ప్రజలు వణికిపోయారు. బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ తుపాను నిజంగానే తమ పాలిట యమగండంగా మారుతుందేమోనని భయకంపితులయ్యారు. ఆంధ్రా-ఒడిశాల మధ్య శనివారం అర్ధరాత్రి తీరం దాటుతుందని వాతావరణ శాఖ హెచ్చరించడం, దానికి తోడు తుపాను గంటకొక దిశగా పయనించడంతో జిల్లా వాసులు ఆందోళనకు గురయ్యారు. వాతావారణ శాఖ అంచనాల కంటే ముందే ‘పై-లీన్’ ఒడిశాలో తీరం దాటడంతో జిల్లాకు గడిచినట్టయ్యింది. కోనపాపపేట వద్ద తీరం కోత తుపాను తీరం దాటే సమయంలో అధికారులు హెచ్చరించినట్టే తీరంలో సముద్రం అల్లకల్లోలంగా మారింది. ఉప్పాడ వద్ద అలలు 12 మీటర్ల ఎత్తున ఎగసిపడుతుండడంతో తీరవాసులు భయకంపితులయ్యారు. ఉప్పాడ, అంతర్వేది, ఓడలరేవు, కోనపాపపేట తదితర తీరప్రాంతాల్లో సముద్రం తీరం పైకి చొచ్చుకొచ్చింది. వాకలపూడి బీచ్‌లో 40 అడుగుల మేర, ఉప్పాడ తీరంలో వంద అడుగుల మేర చొచ్చుకు వచ్చింది. గతంలో ఎన్నడూ లేని రీతిలో అలలు బీచ్ రోడ్‌పైకి ఉవ్వెత్తున ఎగసిపడడంతో వాకలపూడి లైట్‌హౌస్ నుంచి ఉప్పాడ వరకు సుమారు పది కిలోమీటర్ల మేర బీచ్‌రోడ్డును పూర్తిగా మూసివేశారు. కోనపాపపేట తీరప్రాంతం తీవ్ర కోతకు గురైంది. తీరమండలాల్లో సుమారు 1.50 లక్షల మంది తుపాను ప్రభావానికి గురవుతారని అంచనా వేసిన యంత్రాంగం 25 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేసింది. అయి తే తుపాను తీరం దాటడంతో పునరావాస కేంద్రాలకు వెళ్లేందుకు అత్యధికులు ఆసక్తి చూపలేదు. వాసాలతిప్ప లో 117 మంది వలస మత్స్యకారులతో పాటు తీరమండలాల్లో సుమారు వెయ్యి మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తొలిసారిగా తుపాను నేపథ్యంలో జిల్లాకు చేరుకున్న 40 మంది సిబ్బంది కలిగిన నేషనల్ డిజాస్టర్ రెస్క్యూ ఫోర్స్ దళాన్ని అత్యంత సమస్యాత్మక ప్రాంతాలకు పంపి, పునరావాస చర్యలను చేపట్టారు. అధికారుల పర్యటన జిల్లా తుపాను ప్రత్యేకాధికారి ఎం. రవిచంద్ర శనివారం ఉదయం జిల్లా అధికారులతో సమా వేశమయ్యారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. కలెక్టర్ నీతూప్రసాద్, జాయింట్ కలెక్టర్ ఆర్.ముత్యాలరాజు, ట్రైనీ కలెక్టర్ కర్ణన్ తీరమండలాల్లో పర్యటించారు. తుపాను తీరం దాట డంతో జిల్లాలోని తీరగ్రామాల్లో ఈదురు గాలుల జోరు కొద్దిగా పెరగడం తప్ప ఎక్కడా చెప్పుకోతగ్గ స్థాయిలో వర్షాలు కురవలేదు. గత 24 గంటల్లో కేవలం 15 మండలాల్లో 2.2 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. ఈ నేపథ్యంలో ‘పై-లీన్’ వల్ల జిల్లాకు ఎలాంటి నష్టం ఉండదని అధికారులు అంచనా వేస్తున్నారు. ఒడిశాలో తీరం దాటడంతో జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడకపోవచ్చని భావిస్తున్నారు. దీంతో 2.25 లక్షల ఎకరాల్లో సాగవుతున్న వరికి నష్టం వాటిల్లే అవకాశం లేదని రైతులు ఊపిరి పీల్చుకుంటున్నారు. కాగా జిల్లా, డివిజన్ స్థాయిల్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్‌లను రానున్న 48 గంటల్లో అత్యవసరసేవల కోసం అందుబాటులో ఉంచారు. కొన్ని రైళ్ల రద్దు.. మరికొన్ని దారి మళ్లింపు రాజమండ్రి సిటీ, న్యూస్‌లైన్ : పై-లీన్ తుపాను కారణంగా రైల్వేశాఖ రాజమండ్రి మీదుగా ప్రయాణించే రైళ్లలో కొన్నింటిని రద్దు చేసింది. మరికొన్నింటిని దారి మళ్లించింది. చెన్నై-హౌరా మెయిల్‌ను రాజమండ్రి నుంచి వెనక్కు విజయవాడ పంపి, అక్కడ నుంచి బల్లార్షా మీదుగా మళ్లించారు. ముంబై-భువనేశ్వర్ కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌ను సామర్లకోట వరకే నడిపారు. వాస్కోడిగామా-హౌరా ఎక్స్‌ప్రెస్‌ను విశాఖపట్నం వరకూ నడిపి అక్కడి నుంచి తిరిగి వాస్కాడిగామా పంపారు. యశ్వంతపూర్-హౌరా, తిరుచునూర్-హౌరా, ధన్‌బాద్ -అలెప్పి బొకారో ఎక్స్‌ప్రెస్, బెంగళూరు-గౌహటి, చెన్నై-హౌరా కోరమండల్ ఎక్స్‌ప్రెస్‌లను బల్లార్షా, నాగపూర్‌ల మీదుగా మళ్లించారు. యశ్వంతపూర్-హౌరా ఎక్స్‌ప్రెస్‌ను రాయపూర్ మీదుగా మళ్లించారు. సికింద్రాబాద్-విశాఖపట్నం విశాఖ ఎక్స్‌ప్రెస్, సత్రాగంచి-కొలెచ్చి, సత్రాగంచి-చెన్నై, చెన్నై-అసన్సోల్, అలెప్పి-బొకారో ఎక్స్‌ప్రెస్‌లను రద్దు చేశారు. విజయవాడ-విశాఖపట్నం ప్యాసింజర్ రైలును రాజమండ్రిలో నిలిపివేసి, దానిలోని ప్రయాణికులను వెనుకగా వచ్చిన సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌లో ఎక్కించారు. విజయవాడ -రాయగడ ప్యాసింజర్‌ను అనకాపల్లి వరకే నడిపి, అక్కడి నుంచి తిరిగి విజయవాడ పంపారు. విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ వెళ్లే రైళ్లన్నీ యథావిధిగా నడిచాయి. రైళ్ల రద్దు, దారి మళ్లింపుతో రిజర్వేషన్లు రద్దు చేయించుకున్న వారికి రైల్వే అధికారులు పూర్తి మొత్తం చెల్లించారు. కాగా ప్రయాణికుల సౌకర్యార్థం రాజమండ్రి స్టేషన్లో 0883-2420541,2420543 నంబర్లతో హెల్ప్‌లైన్ ఏర్పాటు చేశారు. -
తుపాను గండం గడిచింది
తప్పిన ముప్పుపెను ముప్పు తప్పింది. తుపాను గండం గడిచింది. దాదాపు 48 గంటలపాటు తీవ్ర భయాందోళనకు గురిచేసిన ‘పై-లీన్’ తుపాను ఒడిశాలో తీరాన్ని తాకడంతో జిల్లా అధికార యంత్రాంగం, ప్రజానీకం ఊపిరి పీల్చుకుంది. ప్రధానంగా జిల్లాలోని ఆరు తీరప్రాంత మండలాలు చిగురుటాకులా వణికిపోయాయి. పై-లీన్ తుపాను హెచ్చరికలతో సముద్రంలోకి వేటకు వెళ్లిన మత్స్యకారులు సైతం వెనక్కు వచ్చేశారు. బోట్లు, నావలు, వలలను భద్ర పరుచుకున్నారు. మరో విపత్తుకు సమాయత్తమయ్యారు. పై-లీన్ పెను తుపానుగా మారిందని తెలిసి భయకంపితులయ్యారు. తుపానును సమర్థంగా ఎదుర్కొనేందుకు అధికారులు సాధనా సంపత్తిని సిద్ధం చేసుకున్నారు. తీరంలోని ప్రజలను అప్రమత్తం చేశారు. అవసరమైన తుపాను సహాయక చర్యలు చేపట్టేందుకు జిల్లా కలెక్టర్ నేతృత్వంలో ఎన్డీఆర్ఎఫ్ సైతం రంగంలోకి దిగింది. శనివారం రాత్రి పై-లీన్ తుపాను ఒడిశాలోని గోపాల్పూర్ వద్ద తీరాన్ని తాకడంతో పెను ముప్పు తప్పిందని వెల్లడించిన అధికారులు మరో 24 గంటలపాటు జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశం వుందని ప్రకటించారు. ఆ మేరకు ప్రజలను అప్రమత్తం చేశారు. సాక్షి, గుంటూరు:‘పై-లీన్’ తుపాను ఒడిశాలోని గోపాల్పూర్ వద్ద శనివారం రాత్రి తీరాన్ని తాకింది. దీని ప్రభావం మరో 24 గంటలపాటు జిల్లాపై వుంటుందని అధికారులు వెల్లడించారు. భారీ వర్షాలు పడతాయని ప్రకటించారు. జిల్లా కలెక్టర్ ఎస్ సురేశ్‌కుమార్ అన్ని మండలాల తహశీల్దార్లతో మాట్లాడారు. తుపాను చర్యలపై అప్రమత్తంగా ఉండాలని సెట్‌కాన్ఫరెన్స్ ద్వారా ఆదేశాలిచ్చారు. తీరప్రాంత మండలాలైన బాపట్ల, కర్లపాలెం, రేపల్లె, నగరం, పిట్టలవానిపాలెం, నిజాంపట్నంలో పరిస్థితిని సమీక్షిస్తున్న ప్రత్యేక అధికారులు జిల్లా కేంద్రానికి సమాచారం అందజేస్తున్నారు. నిజాంపట్నం ఓడరేవులో మూడో నంబర్ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. మత్స్యకారుల వేటపై నిషేధాజ్ఞలు వున్నాయి. సూర్యలంకలో 20 మీటర్ల మేర సముద్రం ముందుకు రాగా, అలలు మూడు మీటర్ల ఎత్తున ఎగిసిపడుతున్నాయి. బాపట్ల మండలం అడవిపందులపాలెం వద్ద ఈదురు గాలులు భారీగా వీస్తున్నాయి. జిల్లా జాయింట్ కలెక్టర్ వివేక్ యాదవ్ నిజాంపట్నం వద్ద మెరైన్బోటులో ప్రయాణించి తీర ప్రాంత పరిస్థితిని పరిశీలించారు. మూడ్రోజులుగా కురుస్తున్న భారీవర్షాలకు డెల్టాలోని నల్లమడ, పెరలి, వెదుళ్లపల్లి, ఈపూరుపాలెంలో డ్రెయిన్లు పొంగిపొర్లుతున్నాయి. రైతుల్లో గుండెదడ... జిల్లాలో ‘పై-లీన్’ తుపాను ఉధృతికి డెల్టాలో వరితో పాటు ఉద్యాన, వాణిజ్య పంటలు అక్కడక్కడ లంకగ్రామాల్లో నీటమునిగాయి. పంటనష్టం అంచనాలపై వ్యవసాయ అధికారులు కసరత్తు చేస్తున్నారు. డెల్టా ప్రాంతంలోని పొలాల నుంచి జేసీబీలు, డీజిల్ ఇంజిన్ల సాయంతో నీటిని బయటకు పంపుతున్నారు. సగటున ఎకరాకు రూ. 15వేల చొప్పున నష్టం వాటిల్లగా, కౌలురైతుకు ఎకరాకు రూ. 25 వేలు వరకు ఆర్థికభారం పడింది. తీరప్రాంతగ్రామాలపై అధికారుల దృష్టి బాపట్లటౌన్: 36 గంటలపాటు ప్రశాంతంగా కనిపించిన సముద్రతీరం ఒక్కసారిగా శనివారం రాత్రి అల్లకల్లోలంగా మారింది. దీనికితోడు తీరప్రాంత గ్రామాల్లో ఈదురు గాలులు బలంగా వీయటం, సముద్రంలో రెండు నుంచి మూడు మీటర్ల మేర ఎత్తులో అలలు ఎగసిపడుతుండటంతో తీరప్రాంతప్రజలు కొంతమేర ఆందోళన చెందారు. అయితే తుపాను తీరం దాటే సమయంలో భారీవర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు ముందుగా తెలియజేయడంతో కొంతమేర ఊపిరిపీల్చుకున్నారు. ముఖ్యంగా బాపట్ల మండలం కృపానగర్, దాన్వాయ్‌పేట, సూర్యలంక, రామచంద్రాపురం, కర్లపాలెం మండలంలో పేరలి, తుమ్మలపల్లి, నర్రావారిపాలెం, పెదపులుగువారిపాలెం, పిట్టలవానిపాలెం మండలం అల్లూరు గ్రామాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. మరో 48 గంటలపాటు ఆయా గ్రామాల్లో వైద్య శిబిరాలు, ప్రత్యేక అధికారులను అందుబాటులో ఉంచుతున్నట్టు ఉన్నతాధికారులు తెలిపారు. పొంగిపొర్లుతున్న డ్రెయిన్లు... పై-లీన్ తుపాను ప్రభావంతో మూడురోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు తీర ప్రాంత మండలాల్లోని డ్రెయిన్లు పరవళ్ళుతొక్కుతున్నాయి. భారీ వర్షాలతోపాటు సముద్రం అల్లకల్లోలంగా మారడంతో డ్రెయిన్లకు సముద్రపు నీరు ఎగతన్నుతోంది. దీంతో డ్రెయిన్లకు గండ్లుపడే ప్రమాదం వుందని రైతులు భయాందోళనలు చెందుతున్నారు. ముఖ్యంగా నల్లమడ, పేరలి, వెదుళ్ళపల్లి, ఈపూరుపాలెం డ్రెయిన్లు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. వెదుళ్ళపల్లి డ్రెయిన్‌కు ఇటీవల మరమ్మతులు నిర్వహించడంతో కరకట్టల మట్టి కరిగిపోయి అక్కడక్కడ కోతకు గురయ్యే అవకాశం ఉంది. -
తుఫాను తీవ్రతపై అప్రమత్తంగా ఉన్నాం: రఘువీరారెడ్డి
పై-లీన్ తుఫాను తీవ్రతపై తాము అప్రమత్తంగా ఉన్నామని, లోతట్టు ప్రాంతాల ప్రజలు ఖాళీ చేయకపోతే వారిని బలవంతంగా ఖాళీ చేయిస్తున్నామని రాష్ట్ర రెవెన్యూ మంత్రి రఘువీరారెడ్డి తెలిపారు. తుఫాను ప్రభావం తీవ్రంగా ఉన్న విశాఖపట్నానికి ఆయన ఉదయమే చేరుకున్నారు. సహాయక చర్యలను ఆయన దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. తీరప్రాంతాల్లో ఇప్పటికే ఆర్మీ, మిలటరీ, నేవీ దళాలు గస్తీ నిర్వహిస్తున్నాయని, సముద్రంలో చిక్కుకుపోయిన 40 మంది మత్స్యకారులు పారాదీప్‌లో సురక్షితంగా ఉన్నారని చెప్పారు. విశాఖ తీరంలో 40బోట్లు దెబ్బతినగా, 3 ఇళ్లు కూలిపోయాయని, బాధితులకు పూర్తిస్థాయిలో న్యాయం చేస్తామని రఘువీరారెడ్డి చెప్పారు. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో సుమారు 64వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు చెప్పారు. మూడు రోజుల పాటు రఘువీరారెడ్డి విశాఖలోనే ఉండి తుపాను సహాయక చర్యలను పర్యవేక్షిస్తారు. తుపాను ప్రభావిత జిల్లాల అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్ష జరుపుతున్నారు. కంట్రోల్ రూం నెంబర్లు శ్రీకాకుళం: 0894-2240557/ 9652838191 విశాఖపట్టణం: 1800425002 విజయనగరం: 0892-2236947 టోల్ ఫ్రీ: 1077 తూర్పుగోదావరి: 0884-2365506 పశ్చిమగోదావరి: 0881230617 కృష్ణా: 086722525, టోల్ ఫ్రీ: 1077 గుంటూరు : 08632345103/08632234990 నెల్లూరు: 08612331477 -
పైలీన్ గండం
-
పైలీన్ తుఫాను - తీసుకోవలసిన జాగ్రత్తలు
-
ఉద్ధానంలో విద్యుత్, టెలిఫోన్ వ్యవస్థలు నిలిపివేత
శ్రీకాకుళం : శ్రీకాకుళం జిల్లా ఉద్ధానంలో ముందు జాగ్రత్త చర్యగా విద్యుత్, టెలిఫోన్ వ్యవస్థలను అధికారులు శనివారం నిలిపివేశారు. పై-లిన్ తుపాన్ ప్రభావంతో ఉద్దానంలో జోరుగా ఈదురు గాలులు వీస్తున్నాయి. కాగా ఇప్పటివరకూ జిల్లాలో 60వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు మంత్రి కొండ్రు మురళి తెలిపారు. ప్రతి మండలంలో నాలుగు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. హెల్ప్ లైను నెంబర్లు: శ్రీకాకుళం: 0894-2240557/ 9652838191 విశాఖపట్టణం: 1800425002 విజయనగరం: 0892-2236947 టోల్ ఫ్రీ: 1077 తూర్పుగోదావరి: 0884-2365506 పశ్చిమగోదావరి: 0881230617 కృష్ణా: 086722525, టోల్ ఫ్రీ: 1077 గుంటూరు : 08632345103/08632234990 నెల్లూరు: 08612331477 ..... కాగా పై-లిన్ తుఫాన్ ప్రభావంతో పలు రైళ్లు రద్దు భువనేశ్వర్-తిరుపతి ఎక్స్‌ప్రెస్ రద్దు (భువనేశ్వర్-సికింద్రాబాద్) విశాఖ ఎక్స్‌ప్రెస్ రద్దు గుంటూరు- సింహాద్రి ఎక్స్‌ప్రెస్ రద్దు హౌరా-భువనేశ్వర్ జనశతాబ్ధి ఎక్స్‌ప్రెస్ రద్దు హౌరా-పూరి శతాబ్ది ఎక్స్‌ప్రెస్ రద్దు భువనేశ్వర్-ఢిల్లీ రాజధాని ఎక్స్‌ప్రెస్ రద్దు హౌరా-విశాఖ దారిలో ప్రయాణించే రైళ్లు రద్దు హౌరా నుంచి చెన్నై వెళ్లాల్సిన పలు రైళ్లు దారి మళ్లింపు -
తీర ప్రాంతాల్లో 6 నుంచి 8 గంటలపాటు తుపాను ప్రభావం
-
ముందుగానే తీరం దాటనున్న ఫైలిన్
విశాఖ : పై-లిన్ తుపాను అనుకున్న సమయం కన్నా ముందుగానే తీరం దాటనుంది. ఈరోజు సాయంత్రం ఆరు గంటల నుంచి రాత్రి 8గంటల మధ్య తుపాను తీరం దాటనుంది. తీరం దాటే సమయంలో గంటకు 240 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. ఒడిశాలోని గోపాల్ పూర్ వద్ద తుపాను తీరం దాటనుంది. తీరం దాటే సమయంలో 3.5 మీటర్ల ఎత్తుకు అలలు ఎగిసి పడనున్నాయి. అలాగే తీర ప్రాంతాల్లో 6 నుంచి 8 గంటలపాటు తుపాను ప్రభావం చూపనుంది. తీరం దాటాక తీవ్ర వాయుగుండంగా మారనుంది. ఒడిశా, కోస్తాంధ్రలో 2.5 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు అధికారులు తరలిస్తున్నారు. ఒక్క గోపాల్ పూర్లోనే లక్షమందిని తరలించారు. మరోవైపు పారాదీప్ పోర్టులో కార్యకలాపాలను అధికారులు నిలిపివేశారు. సీ-17 విమానంలో అత్యవసర సామాగ్రిని తరలించారు. శ్రీకాకుళం: 0894-2240557/ 9652838191 విశాఖపట్టణం: 1800425002 విజయనగరం: 0892-2236947 టోల్ ఫ్రీ: 1077 తూర్పుగోదావరి: 0884-2365506 పశ్చిమగోదావరి: 0881230617 కృష్ణా: 086722525, టోల్ ఫ్రీ: 1077 గుంటూరు : 08632345103/08632234990 నెల్లూరు: 08612331477 -
ఓషియన్ ఇన్ఫర్మేషన్ సెంటర్ సూచనలు
-
శ్రీకాకుళంజిల్లా తీరప్రాంతంలో అలజడి
-
'పైలిన్'ను ఎదుర్కొనేందుకు సిద్ధం: రాధా
హైదరాబాద్ : పై-లిన్ తుపాను ముప్పును ఎదుర్కొనేందుకు అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నామని విపత్తు నివారణ శాఖ కమిషనర్ రాధా తెలిపారు. క్షేత్రస్థాయిలో అధికార యంత్రాంగాన్ని సిద్ధం చేసినట్లు ఆయన శనివారమిక్కడ పేర్కొన్నారు. ప్రతీ తీర ప్రాంతంలో రెవెన్యూ బృందం అప్రమత్తంగా ఉందని, తుపాను తీరం దాటేటప్పుడు గాలులు ఎక్కువగా ఉండవచ్చని తెలిపారు. మరబోట్లతో సముద్రంలోకి వేటకు వెళ్లిన జాలర్ల జాడ కనుక్కోవటం కష్టంగా ఉందని రాధా చెప్పారు. కాగా విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం బర్రెపేటలో ముగ్గురు, పిప్పల వలసలో ఒకరు సముద్రంలో చిక్కుకున్నారు. తుపాను ప్రభావిత తీర ప్రాంత గ్రామాల్లో సహాయక చర్యల కోసం 250మంది ఆర్మీ సైన్యం జిల్లాకు చేరుకుంది. కాకినాడలో తుపాను నేపధ్యంలో కాకినాడ-ఉప్పాడ బీచ్‌రోడ్డును పోలీసులు మూసివేసి, వాహనాల రాకపోకలను నిలిపివేశారు. సహాయక చర్యలను పర్యవేక్షించేందుకు విశాఖ చేరుకున్న రెవెన్యూ మంత్రి రఘువీరారెడ్డి ఫిషింగ్ హార్బర్‌ను సందర్శించారు. శ్రీకాకుళం: 0894-2240557/ 9652838191 విశాఖపట్టణం: 1800425002 విజయనగరం: 0892-2236947 టోల్ ఫ్రీ: 1077 తూర్పుగోదావరి: 0884-2365506 పశ్చిమగోదావరి: 0881230617 కృష్ణా: 086722525, టోల్ ఫ్రీ: 1077 గుంటూరు : 08632345103/08632234990 నెల్లూరు: 08612331477 -
కళింగపట్నం, భీమిలి ఓడరేవుల్లో పదో నెంబరు ప్రమాద హెచ్చరిక జారీ
-
కళింగపట్నం, భీమిలీలో 10వ నెం. ప్రమాద హెచ్చరికలు
విశాఖ : పై-లిన్ తుపాన్ నేపథ్యంలో విశాఖ జిల్లా కళింగపట్నం, భీమిలీ పోర్టులో 10వ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. విశాఖ, గంగవరంలో 8వ నెంబర్ ప్రమాద హెచ్చరికలను అధికారులు శనివారం జారీ చేశారు. ఇక కాకినాడలో 5వ నెంబర్, నిజాంపట్నం, మచిలీపట్నం, కృష్ణపట్నంలో 3వ నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు పై-లీన్ తుపాను తీరం వైపు వేగంగా కదులుతోంది. కడపటి సమాచారం మేరకు కళింగపట్నానికి 200 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. తుపాను తీరం దాటే సమయంలో పెను ముప్పు తప్పదని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. తీరం వెంబడి 220 కిలోమీటర్ల వేగంతో పెను గాలులు వీస్తాయి. సముద్రపు అలలు 50 అడుగులకు పైగా ఎగసిపడుతున్నాయి. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. అత్యధికంగా 25 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదు అవుతుందని అంచనా. శ్రీకాకుళం సహా 4 జిల్లాలకు పెనుముప్పు తప్పదని అంచనా వేస్తున్నారు. జిల్లాలో 52000మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇప్పటికే అన్ని పోర్టుల్లో ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. మత్స్యకారులు వేటకు వెళ్లరాదని ఆదేశించారు. పలు రైళ్లు రద్దు అయ్యాయి. పెనుతుపాను ఈరోజు రాత్రికి గోపాల్ పూర్ వద్ద తీరం దాటే అవకాశం ఉంది. తీరప్రాంతాల్లో ఇప్పటికే వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. రెవెన్యూ కేంద్రాల్లో కంట్రోలు రూమ్‌లు ఏర్పాటు చేశారు. శ్రీకాకుళం: 0894-2240557/ 9652838191 విశాఖపట్టణం: 1800425002 విజయనగరం: 0892-2236947 టోల్ ఫ్రీ: 1077 తూర్పుగోదావరి: 0884-2365506 పశ్చిమగోదావరి: 0881230617 కృష్ణా: 086722525, టోల్ ఫ్రీ: 1077 గుంటూరు : 08632345103/08632234990 నెల్లూరు: 08612331477 -
వాయుగుండం సాక్షి ఎక్స్‌క్లూజివ్ విజువల్స్
-
5లక్షల మందిని ఖాళీ చేయిస్తున్న ఒడిశా సర్కార్
-
5లక్షల మందిని ఖాళీ చేయిస్తున్న ఒడిశా సర్కార్
భువనేశ్వర్ : పై-లిన్ తుపాను ప్రభావంతో ఒడిశా గడగడ వణికిపోతోంది. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ శనివారం సహాయక చర్యలపై శనివారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. మరోవైపు ఒడిషాలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. భువనేశ్వర్ పూర్తిగా తడిచి ముద్దయ్యింది. లోతట్టు ప్రాంతాల వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. సహాయక చర్యలను ముమ్మరం చేశారు. ఒడిశాలోని గోపాల్పూర్ వద్ద తుపాను తీరం దాటనుంది. ప్రస్తుతం 200 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. పై-లీన్ తుపాను వల్ల ప్రాణనష్టం సాధ్యమైనంత తక్కువగా ఉండాలన్న లక్ష్యంతో ఒడిశా సర్కారు చర్యలు చేపట్టింది. తుపాను తీవ్ర ప్రభావం చూపే 7 కోస్తా జిల్లాల్లో దాదాపు 5 లక్షల మందిని ఖాళీ చేయిస్తోంది. గంజాం, గజపతి, పూరి, ఖుద్రా, జగత్సింగ్పూర్, కేంద్రపర, నయాగఢ్ జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న ప్రభుత్వం భద్రక్, బాలాసోర్ జిల్లాలనూ అప్రమత్తం చేసింది. తుపాను నేపథ్యంలో వాయుసేనకు చెందిన 2 ఐఎల్-76 విమానాల్లో విపత్తు సహాయ దళం బృందాలు, పరికరాలను అధికారులు భువనేశ్వర్ తరలించారు. రాయ్‌పూర్, నాగ్‌పూర్, జగ్దల్పూర్, బారక్పూర్, రాంచి, గ్వాలియర్ తదితర వైమానిక స్థావరాల్లో వైమానిక బలగాలను సిద్దంగా ఉంచారు. తుపాను తీరాన్ని తాకగానే సహాయ, రక్షణ చర్యలు చేపట్టడానికి 28 ఎన్డీఆర్ఎప్ దళాలను అందుబాటులో ఉంచారు. అన్ని ప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించారు.మరోవైపు ఏ క్షణంలో ముప్పు ముంచుకు వస్తుందోననే ప్రజలు భయంతో బిక్కుబిక్కుమంటున్నారు. తీర ప్రాంత జిల్లాల ప్రజలు ప్రమాదం ఎప్పుడు దాటిపోతుందా అని క్షణమొక యుగంలా కాలం గడుపుతున్నారు. -
పై-లిన్ పై అలర్ట్
-
73 తుపాన్లలో అక్టోబర్‌లోనే 30 తుపానులు
హైదరాబాద్ : రాష్ట్రంలో 1891 నుంచి 2012 దాకా 73 తుపానులు సంభవించాయి. ఈ 73 తుపాన్లలో అక్టోబర్‌లోనే 30 తుపానులు సంభవించాయి. నవంబర్‌లో 19, మేలో తొమ్మిది, సెప్టెంబర్‌లో ఎనిమిది, జూన్‌లో మూడు, డిసెంబర్లో మూడు, జులైలో ఒకసారి తుపాను వచ్చింది. వీటిల్లో 23 తుపానులు నెల్లూరు జిల్లాలో తీరం తాకగా, 15 కృష్ణాలో, 11 తూర్పుగోదావరిలో, పది శ్రీకాకుళం జిల్లాలో, ఏడు విశాఖపట్నంలో, అయిదు ప్రకాశం జిల్లాలలో తీరం దాటాయి. శ్రీకాకుళం: 0894-2240557/ 9652838191 విశాఖపట్టణం: 1800425002 విజయనగరం: 0892-2236947 టోల్ ఫ్రీ: 1077 తూర్పుగోదావరి: 0884-2365506 పశ్చిమగోదావరి: 0881230617 కృష్ణా: 086722525, టోల్ ఫ్రీ: 1077 గుంటూరు : 08632345103/08632234990 నెల్లూరు: 08612331477 -
తుఫాను సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలివీ
-
పై-లిన్‌పై భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్
భువనేశ్వర్ : బంగాళాఖాతంలో క్రమంగా బలోపేతం అవుతూ తూర్పు తీరం వైపు వేగంగా కదులుతున్న పై-లీన్ తుపానుపై భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. 54 అడుగులకు పైగా ఎత్తులో అలలు ఎగిసిపడి తీరంపై విరుచుకుపడతాయని వాతావరణ శాఖ హెచ్చరికలు చేసింది. కాగా పై-లిన్ తుపాన్ ఒడిశాలోని గోపాల్‌పూర్‌కు ఆగ్నేయ దిశలో 260 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని జాతీయ విపత్తు నివారణ సంస్థ వైస్ ఛైర్మన్ మర్రి శశిధర్ రెడ్డి తెలిపారు. ఈ సాయంత్రం తుఫాన్ తీరం దాటే అవకాశముందని ఆయన పేర్కొన్నారు. మరోవైపు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తుపాను ప్రభావంపై అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. ఇప్పటికే రెవెన్యూ శాఖ మంత్రి రఘువీరారెడ్డి విశాఖ చేరుకున్నారు. తుపాను ప్రభావ నేపథ్యంలో సహాయక చర్యలపై సమీక్షించనున్నారు. శ్రీకాకుళం: 0894-2240557/ 9652838191 విశాఖపట్టణం: 1800425002 విజయనగరం: 0892-2236947 టోల్ ఫ్రీ: 1077 తూర్పుగోదావరి: 0884-2365506 పశ్చిమగోదావరి: 0881230617 కృష్ణా: 086722525, టోల్ ఫ్రీ: 1077 గుంటూరు : 08632345103/08632234990 నెల్లూరు: 08612331477 -
తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
పై-లిన్ తుపాను పట్ల తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నెల్లూరు జిల్లా కలెక్టర్ ఎన్. శ్రీకాంత్ విజ్ఞప్తి చేశారు. తుపాన్ ప్రభావం ఉండే 21 మండలాల్లో 23 మంది ప్రత్యేక అధికారులను నియమించారు. కావలి, విడవలూరుకు ఇద్దరు చొప్పున అధికారులు నియమితులయ్యారు. 21 మండలాల్లో కంట్రోల్ రూంలను ఏర్పాటు చేశారు. ఇప్పటికే కృష్ణపట్నం పోర్టులో మూడో నెంబరు ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. జిల్లాలో తుపాన్ తీవ్రత ఎక్కువగా ఉండే మండలాల అధికారులతో కలెక్టర్ శ్రీకాంత్ తరచూ సంప్రదిస్తున్నారు. మండలాల వారీగా ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెలుసుకుంటున్నారు. ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేలా వారికి సూచనలు ఇస్తున్నారు. ప్రత్యేక అధికారులు రాత్రి వేళలో మండలాల్లోనే ఉండాలని ఆదేశాలు ఇచ్చారు. మత్స్యకారులు చేపల వేటకెళ్లకుండా చర్యలు చేపట్టారు. తీరప్రాంత గ్రామాల్లో దండోరా వేయించి ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. కలెక్టరేట్లో కంట్రోలు రూం ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నారు. పునరావాస కేంద్రాల్లో అవసరమైన నిత్యావసర సరుకులు సిద్ధమయ్యాయి. తుపాన్ ప్రభావంతో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది వచ్చినా కంట్రోల్ రూంకు తెలియచేయాలని అధికారులు సూచించారు. కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు నంబర్లు: 1800 425 2499, 08612-331477 శ్రీకాకుళం: 0894-2240557/ 9652838191 విశాఖపట్టణం: 1800425002 విజయనగరం: 0892-2236947 టోల్ ఫ్రీ: 1077 తూర్పుగోదావరి: 0884-2365506 పశ్చిమగోదావరి: 0881230617 కృష్ణా: 086722525, టోల్ ఫ్రీ: 1077 గుంటూరు : 08632345103/08632234990 నెల్లూరు: 08612331477 -
100 అడుగుల ముందుకు వచ్చిన సముద్రం
-
తూర్పులో వర్షాలు: అప్రమత్తమైన అధికారులు
-
అప్రమత్తమైన కృష్ణాజిల్లా యంత్రాంగం
మచిలీపట్నం : పై-లిన్ తుపాను దృష్ట్యా కృష్ణాజిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. తుపాను తీరం దాటే సమయంలో భారీ వర్షాలు పడే అవకాశం ఉండటంతో పర్యాటకులను, జాలర్లను అధికారులు అనుమతించటం లేదు. దాదాపు ఆరడుగుల ఎత్తులో అలలు ఎగసిపడుతున్నాయి. గిలకలదిండి హార్బర్ వద్ద మూడో నంబరు ప్రమాద హెచ్చరిక ఎగురవేశారు. దీంతో మంగినపూడి బీచ్‌లోకి పర్యాటకులను కూడా అనుమతించలేదు. కాగా సముద్రంలో ఉండిపోయిన 24 బోట్లు సముద్రపు పోటు అధికంగా ఉన్న సమయంలో హార్బర్‌కు చేరే అవకాశం ఉంది. మరోవైపు తుపాను కారణంగా కురిసిన భారీ వర్షాలతో పశ్చిమ కృష్ణాలోని కొండవాగు, బుడమేరు, పోతులవాగు, కుంపిణీ వాగు పొంగి ప్రవహిస్తున్నాయి. కృష్ణా: 086722525, టోల్ ఫ్రీ: 1077 శ్రీకాకుళం: 0894-2240557/ 9652838191 విశాఖపట్టణం: 1800425002 విజయనగరం: 0892-2236947 టోల్ ఫ్రీ: 1077 తూర్పుగోదావరి: 0884-2365506 పశ్చిమగోదావరి: 0881230617 కృష్ణా: 086722525, టోల్ ఫ్రీ: 1077 గుంటూరు : 08632345103/08632234990 నెల్లూరు: 08612331477 -
100 అడుగుల ముందుకు వచ్చిన సముద్రం
శ్రీకాకుళం : శ్రీకాకుళం జిల్లాకు పొంచి ఉన్న ‘పై-లీన్’ పెను తుపాను ముప్పును ఎదుర్కొని సహాయ చర్య లు చేపట్టేందుకు జిల్లా యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. మరోవైపు సముద్ర తీరంలో ఇప్పటికే 3 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తుతో కెరటాలు వస్తున్నాయి. తుపాను ప్రభావితం చేసే 11 మండలాల్లో 237 గ్రామాలు గుర్తించారు. దాంతో 134 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. కవిటి మండలం ఇత్తివానిపాలెం, గార మండలం బందరువాణి పేట వద్ద సముద్రం 100 అడుగుల ముందుకు వచ్చింది. 12,500మందిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తుపాను తీరం దాటే సమయంలో పెనుగాలుల ధాటికి చెట్లు, టెలిఫోన్, విద్యుత్ స్తంభాలు, ఇళ్లు కూలిపోయి ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. కలెక్టరేట్లో 24 గంటలూ పనిచేసే కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని, అవసరమైన సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందవచ్చని తెలిపారు. శ్రీకాకుళం కలెక్టరేట్లో కంట్రోల్ రూం నెంబర్లు : నంబర్లు-08942 240557, 96528 38191 శ్రీకాకుళం: 0894-2240557/ 9652838191 విశాఖపట్టణం: 1800425002 విజయనగరం: 0892-2236947 టోల్ ఫ్రీ: 1077 తూర్పుగోదావరి: 0884-2365506 పశ్చిమగోదావరి: 0881230617 కృష్ణా: 086722525, టోల్ ఫ్రీ: 1077 గుంటూరు : 08632345103/08632234990 నెల్లూరు: 08612331477 -
తూర్పులో వర్షాలు: అప్రమత్తమైన అధికారులు
పైలిన్ తుపాన్ నేపథ్యంలో తూర్పు గోదావరి జిల్లాలో సహాయక చర్యలు కోసం ప్రభుత్వం నియమించిన ప్రత్యేక అధికారి రవిచంద్ర శనివారం కాకినాడు చేరుకోనున్నారు. ఆయన ఈ రోజు ఉదయం కాకినాడ కలెక్టరేట్లో అన్ని శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో వర్షాలు జోరుగా కురుస్తున్నాయి. దాంతో జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ అధికారులు అప్రమత్తమైయ్యారు. అలాగే కాకినాడ ఓడరేవులో 3వ ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు. సముద్రంలో వేటకు వెళ్లరాదని మత్స్యకారులను అధికారులు హెచ్చరించారు. కాకినాడ కలెక్టరేట్, అమలాపురం ఆర్డీవో కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు జిల్లా ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. తుపాన్ వల్ల విపత్కర పరిస్థితులు ఎదురైతే వెంటనే 0884-2365506,0884-1077,08856 233100 లేదా ఇండియన్ కోస్ట్ గార్డ్ -1554, మెరైన్ పోలీస్ 1093లకు ఫోన్ చేయాలని అధికారులు వివరించారు. అలాగే జిల్లాలో గోదావరి డెల్టా కింద 4.50 లక్షల ఎకరాల్లో వరి సాగువుతోంది. తుపాన్ వల్ల భారీ వర్షాలు కురిస్తే 2.50 లక్షల ఎకరాల్లోని ఖరీఫ్ పంటకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. దాంతో జిల్లాలోని రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. శ్రీకాకుళం: 0894-2240557/ 9652838191 విశాఖపట్టణం: 1800425002 విజయనగరం: 0892-2236947 టోల్ ఫ్రీ: 1077 తూర్పుగోదావరి: 0884-2365506 పశ్చిమగోదావరి: 0881230617 కృష్ణా: 086722525, టోల్ ఫ్రీ: 1077 గుంటూరు : 08632345103/08632234990 నెల్లూరు: 08612331477 -
ఉత్తరాంధ్రలో కురుస్తున్న వర్షాలు
-
పై-లీన్ తుపాను సహాయక చర్యలపై రఘువీరా సమీక్ష
విశాఖ : రెవెన్యూ శాఖ మంత్రి రఘువీరారెడ్డి శనివారం ఉదయం విశాఖ చేరుకున్నారు. పై-లీన్ తుపాను నేపథ్యంలో ఆయన సహాయక చర్యలు పర్యవేక్షించనున్నారు. ఈ సందర్భంగా రఘువీరారెడ్డి మాట్లాడుతూ తీరప్రాంతాల్లో ఇప్పటికే ఆర్మీ, మిలటరీ, నేవీ దళాలు గస్తీ నిర్వహిస్తున్నాయన్నారు. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో సుమారు 64వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు చెప్పారు. మూడు రోజుల పాటు రఘువీరారెడ్డి విశాఖలోనే ఉండి తుపాను సహాయక చర్యలను పర్యవేక్షిస్తారు. తుపాను ప్రభావిత జిల్లాల అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్ష జరుపుతున్నారు. శ్రీకాకుళం: 0894-2240557/ 9652838191 విశాఖపట్టణం: 1800425002 విజయనగరం: 0892-2236947 టోల్ ఫ్రీ: 1077 తూర్పుగోదావరి: 0884-2365506 పశ్చిమగోదావరి: 0881230617 కృష్ణా: 086722525, టోల్ ఫ్రీ: 1077 గుంటూరు : 08632345103/08632234990 నెల్లూరు: 08612331477 -
పలు రైళ్లు రద్దు,మరికొన్ని దారి మళ్లింపు
-
విశాఖ మత్స్యకారుల పైలిన్ ప్రభావం
-
పై-లీన్ గండం!
-
పడగ విప్పుతున్న పై-లీన్ పెను తుపాన్ !
-
పై-లీన్ తుపానుతో మత్స్యకారుల ఆవేదన
బాపట్ల టౌన్/నిజాంపట్నం, న్యూస్‌లైన్ : పై-లీన్ తుపాను జిల్లాలో 27,248 మంది మత్స్యకారులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. తుపాను హెచ్చరికల నేపథ్యంలో వేట మాని ఇంటికి చేరిన మత్స్యకారులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైంది. విపత్తుల సమయంలో కూడా కనీసం చేయూతనివ్వకపోవటంపై మత్స్యకారులు ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పై-లీన్ తుపాను హెచ్చరికలు విన్న మత్స్యకారులు రెండు రోజుల కిందటనే సముద్రపు వేటను నిలిపివేసి బోట్లను ఒడ్డుకు చేర్చుకున్నారు. తుపాను ప్రభావం మరో రెండు, మూడు రోజుల వరకు ఉంటుందని అప్పటి వరకు వేటకు వెళ్లరాదని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అయితే ఇప్పుడు ఎలా బతకాలని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేటపైనే జీవనాధారం జిల్లాలో లంకేవానిదిబ్బ నుంచి బాపట్ల వరకు 22 కిలోమీటర్ల సముద్రతీరం ఉంది. మొత్తం జిల్లాలో 6,812 మత్స్యకార కుటుంబాలు ఉండగా 27,248 మత్స్యకారులు ఉన్నారు. వీరిలో అధికశాతం వేటపైనే ఆధారపడి జీవిస్తున్నారు. వీరిపై పై-లీన్ తుఫాన్ ప్రభావం తీవ్రంగా చూపుతుంది. నిజాంపట్నం ఓడ రేవులోనే సుమారు 3వేలకు మందికిపైగా జీవిస్తుంటారు. అయితే వేట నిలిచిపోవటంతో ఉపాధి కోల్పోయారు. తీర ప్రాంతాల్లోని మత్స్యకారులకు ప్రతి ఏటా సెప్టెంబర్ నుంచి జనవరి వరకు నాలుగు నెలలు పాటు వేటలు బాగా సాగుతాయి. ఈ సమయంలోనే మత్స్యసంపద సముద్రంలో నుంచి భూ ఉపరితలానికి వందల టన్నుల్లో బయటకు వస్తుంటుంది. పట్టిన చేపలు తీరానికి సమీపంలో ఉన్న ఫారెస్ట్భూమి పర్రలో రెండు, మూడు రోజులపాటు ఎండబెట్టి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతోపాటు ఇతర రాష్ట్రాలకు కూడా ఎగుమతి చేస్తుంటారు. అయితే ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి అక్టోబర్ 5వ తేదీ వరకు ఏ ఒక్కరికి కూడా ఒక్క చాప పడిన దాఖలాలు లేవు. గత రెండు, మూడు రోజుల నుంచే చేపలు కనిపిస్తుండగా, ఇంతలోనే ముంచుకొచ్చిన వాయుగుండం వారి జీవితాల్లో చీకట్లు నింపింది. ఆందోళనలో మత్స్యకారులు ... గత నాలుగు నెలల నుంచి వేటలు సాగక..అప్పోసప్పో తెచ్చుకుతింటున్న మత్స్యకారులను ఇటీవల కురిసిన భారీ వర్షాలు వేటలకు వెళ్లకుండా చేస్తే బుధవారం రాత్రి వాయుగుండం కారణంగా వచ్చిన భారీ వర్షం చేపలు ఎండబెట్టుకునే ప్రాంతాన్ని కూడా ముంచెత్తింది. ముఖ్యంగా సముద్రతీరప్రాంత గ్రామాలైన సూర్యలంక, అడవిపల్లిపాలెం, పాండురంగాపురం, కృపానగర్, రామచంద్రపురం, ఓడరేవు, దాన్వాయ్‌పేట, ముత్తాయపాలెం, రామానగర్, ఆదర్శనగర్ గ్రామాల్లోని మత్స్యకారులంతా సముద్రం మీద జీవిస్తుంటారు. పై-లీన్ తుపాను ప్రభావంతో వేట సాగకపోవడంతో ఎన్ని రోజలు పస్తులు ఉండాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది అన్నీ నష్టాలే... ఈ ఏడాది ఏ ఘడియలో వలలు తడిపామో కానీ.... అన్నీ నష్టాలే ఎదురవుతున్నాయి. మొన్నటి దాకా వేటకు వెళ్లినప్పటికీ చేపలు పడక ఇబ్బందులు ఎదుర్కొన్నాం. ఇప్పుడిప్పుడే నాలుగు చేపలు పడుతున్నాయన్న ఆశతో వలలు వేద్దామనుకుంటుండగా వానదేవుడు మాపై పగపట్టాడు. వలలు, పడవలు, చేపలు ఎండపెట్టుకునే ప్రాంతం అంతా నీటితో ముంచెత్తాడు. - పెసికం పెదసింగ్, మత్స్యకారుడు పాలకులు స్పందించాలి ఏడాదిలో నాలుగు నెలలు మాత్రమే వేటలు సాగుతాయి. అది కూడా వాతావరణం అంతా అనుకూలంగా ఉంటే నాలుగు రూపాయ లు మిగులుతాయి. లేకుంటే లేదు. దాంతో ఏడాదంతా తినాలి. ఈ ఏడాది ఇంత వరకు ఒక్కరోజు కూడా వేటకు వెళ్ళలేదు. వేటకు అయితే సెలవు పెట్టమంటున్నారు...కానీ ప్రభుత్వం తరఫున ఏ మాత్రం సాయం అందించడం లేదు. - కొక్కిలిగడ్డ నారాయణ స్వామి, మత్స్యకారుడు -
పెను తుపానుగా మారిన ‘పై-లీన్’
సాక్షి, గుంటూరు: పై-లీన్ తుపాను శుక్రవారం మరింత బలపడి పెనుతుపానుగా మారింది. జిల్లా అధికార యంత్రాంగానికి నిద్ర లేకుండా చేస్తోంది. బంగాళాఖాతంలో 600 కిలోమీటర్ల దూరాన కేంద్రీకృతమై ఉన్న తుపాను మరింత బలపడి శనివారం సాయంత్రానికి శ్రీకాకుళం జిల్లా కళింగపట్నం, ఒడిశాలోని గోపాలపూర్ ప్రాంతాల్లో తీరం దాటే అవకాశాలున్నాయని విశాఖపట్నం వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో జిల్లా అధికారులు తీరంలో అప్రమత్తం అయ్యారు. నిజాంపట్నం ఓడరేవులో శుక్రవారం సాయంత్రం మూడో నంబర్ ప్రమాద హెచ్చరికను ఎగురవేశారు. సమ్మె నుంచి బయటకు వచ్చి తుపాను సహాయక చర్యలకు సిద్ధంగా ఉండాలని కలెక్టర్ సురేశ్‌కుమార్ కోరడంతో జిల్లాలోని 80 శాతం మంది ఉద్యోగులు శుక్రవారం విధులకు హాజరయ్యారు. బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం ప్రభావంతో శుక్రవారం సాయంత్రం జిల్లా అంతటా భారీ వర్షాలు మొదలయ్యాయి. పై-లీన్ తుపాను తీరం దాటే సమయంలో జిల్లాలో 200 నుంచి 230 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచి భారీ వర్షాలు కురిసే ప్రమాదముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో కలెక్టర్ సురేశ్‌కుమార్ మరింత అప్రమత్తమై శుక్రవారం తీరం వెంబడి ఉన్న ఆర్డీవోలు, తహశీల్దార్లు, ఎంపీడీవోలు, ఇరిగేషన్ అధికారులతో మాట్లాడారు. నిజాంపట్నం, నగరం, రేపల్లె, బాపట్ల, కర్లపాలెం మండలాల్లోని 116 గ్రామాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. తీరంలోని తుపాను పునరావాస కేంద్రాలను సిద్ధం చేయాలని సూచించారు. అంతేకాకుండా తెనాలి, రేపల్లె, గుంటూరుల్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూముల్లో 48 గంటల పాటు రాత్రింబవళ్లు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. తుపాను ప్రభావంతో భారీ వర్షాలు పడితే పశ్చిమ డెల్టాలోని వరి, వేరుశెనగ, పసుపు పంటలు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉన్నందున ప్రధాన పంటకాల్వల్లోని సాగునీటి విడుదల పరిమాణాన్ని తగ్గించాలని ఇరిగేషన్ అధికారుల్ని ఆదేశించారు. పొలాల్లోని మురుగునీరు ఎప్పటికప్పుడు బయటకు వెళ్లేలా చర్యలు తీసుకోవాలన్నారు. రంగంలోకి దిగిన ఎన్డీఆర్ఎఫ్.. కాగా జిల్లాకు జాతీయ విపత్తుల నివారణ బలగాలు (ఎన్డీఆర్ఎఫ్) పెద్ద సంఖ్యలో చేరుకున్నాయి. మంగళగిరి కేంద్రంగా పనిచేస్తున్న బలగాలను తూర్పు, విశాఖ, శ్రీకాకుళం జిల్లాలకు పంపారు. వీరితో పాటు అత్యవసర సర్వీసుల కోసం చెన్నై, ముంబాయిల నుంచి అదనంగా 200 మందిని జిల్లాకు రప్పించారు. వీరికి నాగార్జునా యూనివర్సిటీలో వసతి కల్పించారు. సముద్ర తీరంలోని మెరైన్ పోలీసుల్ని కూడా అప్రమత్తం చేశారు. స్పీడ్‌బోట్లను రంగంలోకి దించి సహాయక చర్యలకు సిద్ధంగా ఉండాలని సూచించారు. ఇదిలావుంటే తుపాను కారణంగా రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిస్తే పంటలు ముంపునకు గురై తీవ్రంగా నష్టపోవడం ఖాయమని పశ్చిమ డెల్టా రైతాంగం ఆందోళన వ్యక్తం చేస్తోంది. పరిస్థితిని సమీక్షిస్తున్నాం: కలెక్టర్ తుపాను వాతావరణం నెలకొన్న నేపథ్యంలో సముద్రతీరంలోని పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షిస్తున్నామని కలెక్టర్ సురేశ్‌కుమార్ వివరించారు. పై-లీన్ తుపాను బలపడి పెనుతుపానుగా మారిన నేపథ్యంలో అధికార యంత్రాంగమంతా అప్రమత్తంగా ఉన్నట్లు వివరించారు. జిల్లాలో పరిస్థితిని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి హైదరాబాద్ నుంచి సమీక్షించారు. జిల్లా అధికారులు అప్రమత్తంగా ఉండాలని టెలీకాన్ఫరెన్స్‌లో ఆదేశించారు. -
‘పై-లిన్’ గండం: మోస్తరు నుంచి భారీ వర్షాలు
పై-లిన్ తుపాను శనివారం ఆంధ్రా-ఒడిశా వద్ద తీరం దాటే అవకాశం ఉంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి. హార్బర్లలో 3వ నెంబరు ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. సహాయక చర్యలపై అధికారులు దృష్టి సారించారు. చెన్నై, సాక్షి ప్రతినిధి: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్రరూపం దాల్చింది. దీనికి ఫైలిన్గా నామకరణం చేశారు. నాగపట్నం, చెన్నై, కడలూరు హార్బర్లలో 3వ నెంబరు ప్రమాద హెచ్చరికను ఎగురవేశారు. ఫైలిన్ తుపాను నేరుగా తమిళనాడుపై ప్రభావం చూపకపోవచ్చని అధికారులు తెలిపారు. అయితే తీరం దాటే సమయంలో వర్షాలు పడగలవని పేర్కొన్నారు. సముద్రతీర ప్రాంతాలు, జాలర్ల గ్రామాలు భారీ వర్షాలను, ఈదురు గాలులను ఎదుర్కొనే అవకాశం ఉందని ప్రకటించారు. మళ్లీ అధికారికంగా ప్రకటించే వరకు జాలర్లు సముద్రంలోకి చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరించారు. ఫైలిన్ తుపాన్ నేపథ్యంలో ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. సముద్ర తీరంలోని జాలర్ల కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. సహాయక చర్యల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించరాదని కలెక్టర్లు ఆదేశాలు జారీ చేశారు. ఇసుక బ్యాగులు, ఆహార, తాగునీటి పొట్లాలను అందుబాటులో ఉంచుకోవాలని మండలస్థాయి అధికారులను అప్రమత్తం చేశారు. భారీ వర్షం-రైతన్నకు నష్టం గురు, శుక్రవారాల్లో రాష్ట్రంలోని డెల్టా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. దీంతో రైతన్నకు భారీనష్టం వాటిల్లింది. అదిరామ్పట్టిలోని 3 వేల ఎకరాల్లో పంటపొలాలు ఉప్పునీటి వరదతో మునిగిపోయాయి. అక్కరపట్టి, కల్లూరు ప్రాంతాల్లో 20 విద్యుత్ స్తంభాలు, భారీ చెట్లు నేలకూలాయి. కల్లూరులో జాలర్ల బోట్లు గాలి ఉద్ధృతికి ఎగిరిపడ్డాయి. తిరుచ్చి, కరూర్, పెంబలూరు జిల్లాలు సైతం భారీ వర్షాలు, ఈదురు గాలులతో వణికిపోయాయి. -
వణుకుతున్న తీరం: భయం గుప్పిట ఉప్పాడ
పిఠాపురం/కొత్తపల్లి, న్యూస్‌లైన్ : పై-లీన్ తుపాను ప్రభావంతో జిల్లాలోని తీర ప్రాంతం వణికిపోతోంది. కొత్తపల్లి మండలంలో అనేక గ్రామాలు భయంగుప్పెట గడుపుతున్నాయి. మండలంలోని ఉప్పాడ, కోనపాపపేట, మూలపేట, మాయాపట్నం, అమీనాబాద తదితర గ్రామాల్లో తీరప్రాంతం సముద్ర కోతకు గురవుతోంది. రెండు రోజులుగా కెరటాల ఉధృతి పెరగ్గా, శుక్రవారం మరింత తీవ్ర రూపం దాల్చింది. సుమారు 10 మీటర్ల ఎత్తుకు ఎగసిపడుతుండడంతో తీరం కోత ఎక్కువైంది. ఉప్పాడతో పాటు కోనపాపపేటపై సముద్ర కెరటాలు విరుచుకుపడ్డాయి. ఈదురు గాలులకు గృహాలు ధ్వంసమవుతున్నాయి. మత్స్యకారులు సముద్రంలో లంగరు వేసిన బోట్లు, ఇతర సామగ్రిని సురక్షిత ప్రాంతాలకు తరలించుకున్నారు. కెరటాల ఉధృతి అంతకంతకూ పెరుగుతుండడంతో తీరం వెంబడి నివసిస్తున్న మత్స్యకారులు తమ గృహాలను కాపాడుకునేందుకు ఇసుక బస్తాలతో రక్షణ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఉప్పాడ రక్షణకు ప్రభుత్వం జియోట్యూబ్ టెక్నాలజీ ద్వారా రక్షణ గోడ నిర్మించడంతో ఈ ప్రాంతంలో సముద్ర కోత తగ్గుముఖం పట్టింది. ఈ క్రమంలో కోత ప్రభావం కోనపాపపేటపై చూపుతోంది. ప్రమాదభరితంగా బీచ్ రోడ్డు సముద్ర కెరటాల ఉధృతి ప్రమాదకరంగా మారడంతో ఉప్పాడ నుంచి కాకినాడ వరకున్న బీచ్‌రోడ్డు ప్రమాదభరితంగా మారింది. సముద్ర కోత నుంచి రక్షణగా వేసిన రాళ్లు కెరటాల ఉధృతికి లేచిపడడంతో బీచ్ రోడ్డు ఛిద్రంగా మారింది. కెరటాల ధృతి మరింత పెరిగే అవకాశం ఉండడంతో బీచ్ రోడ్డుపై రాకపోకలను అధికారులు నిలిపివేశారు. ఉప్పాడ సమీపంలో ఎస్పీజీఎల్ వద్ద చిన వంతెన ప్రమాద స్థితికి చేరుకోవడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సముద్రంలో మత్స్యకారులు? సముద్రంలోకి వేటకు వెళ్లిన కొందరు మత్స్యకారులు తిరిగి రాలేదని తెలిసింది. ఐదు రోజుల క్రితం చేపల వేటకు వెళ్లిన ఉప్పాడ, కోనపాపపేట తదితర గ్రామాలకు చెందిన కొం దరు ఇంకా సముద్రంలోనే ఉన్నట్టు స్థానికులు చెబుతున్నా రు. వారు తిరుగు ప్రయాణంలో ఉండడంతో స్థానిక మత్స్యకారులు వారి వివరాలు వెల్లడించడం లేదు. శుక్రవారం రాత్రికి వారు తీరానికి చేరుకుంటారని భావిస్తున్నారు. సుద్దగెడ్డకు భారీ వరద గొల్లప్రోలు, న్యూస్‌లైన్ : పై-లీన్ ప్రభావంతో మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు గొల్లప్రోలు జలమయమైంది. ఎడతెరిపి లేకుండా వర్షం కురవడంతో భారీఎత్తున వరద నీరు పట్టణాన్ని ముంచెత్తుతోంది. పీబీసీ, సుద్దగెడ్డ, ఏలేరు కాలువలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. మరోవైపు నీరు కిందకు ప్రవహించకపోవడంతో అంతకంతకూ పరిస్థితి ప్రమాదకరంగా మారుతోంది. భయంగుప్పిట కాలనీ వాసులు గొల్లప్రోలులోని ఎస్సీ కాలనీ, సూరంపేట, ఈబీసీ కాలనీ వాసులు భయంగుప్పిట కాలం వెళ్లదీస్తున్నారు. సుద్దగెడ్డ నుంచి గంటగంటకూ నీటి ప్రవాహం పెరుగుతుండడంతో కాలనీలోకి ముంపునీరు చేరుతోంది. ఇప్పటికే ఈబీసీ కాలనీ, ఎస్సీ కాలనీ, సూరంపేట, శివాలయ మాన్యం, దేవీనగర్‌లోని పల్లపు ప్రాంతాలు జలమయమయ్యాయి. సూరంపేటకు రాకపోకలు స్తంభించాయి. భయపెడుతున్న కాలువలు నీటి ఉధృతి పెరుగుతుండడంతో కాలువలు కలిసిపోయి ప్రవహిస్తున్నాయి. దీంతో ఎక్కడ గండ్లు పడతాయోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. పీబీసీ, సుద్దగెడ్డ ఉధృతికి సూరంపేటకు రాకపోకలు నిలిచిపోయాయి. సుద్దగెడ్డ ముంపుతో కాలనీ నీట మునగడంతో స్థానికులకు ఏమీ తెలియని పరిస్థితి ఏర్పడింది. తాటిపర్తి పుంత రోడ్డుపై పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి. తాటిపర్తి-రాయవరం రోడ్డుపై సుద్దగెడ్డ నాలుగు అడుగుల మేర నీరు ప్రవ హిస్తోంది. వారం వ్యవధిలో ఆయా కాలనీలు రెండుసార్లు ముంపునకు గురయ్యాయి. -
జిల్లాలో పై-లీన్ టెన్షన్: అధికారులు అప్రమత్తం
జిల్లాను పై-లీన్ తుపాను టెన్షన్ ఆవరించింది. ఈ తుపాను శనివారం తీరం దాటవచ్చని భావిస్తున్నారు. ఆ సమయంలో బలమైన ఈదురుగాలులు వీయవచ్చని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. తీర ప్రాంతంలో 13 మండలాల అధికారులను జిల్లా యంత్రాంగం అప్రమత్తం చేసింది. తుపాను తీరం దాటాక కురవనున్న భారీ వర్షాలతో ఏపుగా ఎదిగిన ఖరీఫ్ పంట ముంపుబారిన పడుతుందేమోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. సాక్షి ప్రతినిధి, కాకినాడ : పై-లీన్ తుపాను జిల్లాలోని తీర ప్రాంత ప్రజల గుండెలపై కుంపటిగా మారింది. తుపాను ప్రభావంతో ప్రజలు భయంతో వణికిపోతున్నారు. ఈ తుపాను శనివారం రాత్రి తీరం దాటే అవకాశం ఉందనే సమాచారంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. తుపాను భయం జిల్లాను వీడాలంటే మరో 24 గంటలు ఆగాలని అధికారులు చెబుతున్నారు. 1996 నవంబరు ఆరున వచ్చిన తుపాను సృష్టించిన విలయతాండవం ఇంకా జిల్లావాసులను పీడకలగా వెంటాడుతూనే ఉంది. ఇప్పుడు పొంచి ఉన్న పై-లీన్ తుపాను అప్పటి కంటే ఉగ్రరూపం దాల్చనుందనే సమాచారంతో తీర ప్రాంతంలో భయం వెంటాడుతోంది. కాకినాడ, ఉప్పాడ, అంతర్వేది, ఓడలరేవు తదితర తీర ప్రాంతాల్లో ఆరేడు మీటర్ల మేర సముద్రం ఉవ్వెత్తున ఎగసిపడుతోంది. దీని ప్రభావంతో తీర గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. తీరమంతా అల్లకల్లోలంగా మారింది. ప్రస్తుతం గంటకు 15 కిలోమీటర్ల వేగంతో నడుస్తోన్న తుపాను తీరం దాటే సమయానికి మరింత ఉధృతమయ్యే ప్రమాదం పొంచి ఉందన్న సమాచారంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. 13 తీరప్రాంత మండలాల పరిధిలో అధికారులను జిల్లా యంత్రాంగం అప్రమత్తం చేసింది. రానున్న 72 గంటల్లో మత్స్యకారులెవ్వరూ సముద్రంలోకి వేటకు వెళ్లరాదని జిల్లా కలెక్టర్ నీతూకుమారి ప్రసాద్ ఆదేశించారు. కాకినాడ పోర్టులో మూడో నంబర్ ప్రమాద హెచ్చరిక అమలులో ఉంది. పై-లీన్ కళింగపట్నానికి తూర్పు ఆగ్నేయ దిశగా 448 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. రాగల 24 గంటల్లో 210 నుంచి 235 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయవచ్చునని వాతావరణ కేంద్రం శుక్రవారం రాత్రి విడుదల చేసిన బులిటెన్‌లో వెల్లడించింది. కృష్ణా జిల్లా చినగొల్లపాలెం నుంచి రెండు బోట్లలో వేటకు వచ్చిన 10 మంది మత్స్యకారులు సఖినేటిపల్లి మండలం అంతర్వేది వద్ద సముద్రంలో చిక్కుకున్నారనే సమాచారంతో జిల్లా యంత్రాంగం అక్కడి అధికారులను అప్రమత్తం చేసింది. అయితే, వేసిన వలలు తీయడం సాధ్యం కాకపోవడంతో వాటిని అక్కడే వదిలిపెట్టి వారు తిరిగి స్వస్థలానికి బయలుదేరినట్టు తెలిసింది. తీర ప్రాంతంలోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఇండియన్ కోస్ట్‌గార్డు విభాగాన్ని అప్రమత్తం చేశారు. అత్యవసర సహాయం కోసం టోల్‌ఫ్రీ హెల్ప్‌లైన్-1554 (కోస్ట్‌గార్డు), 1093 (మెరైన్)ను ఏర్పాటు చేశారు. కాకినాడ కలెక్టరేట్లో 0884-2365506 నంబర్‌తో తుపానుపై అప్రమత్తం చేసేందుకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. తుపాను తీరం దాటిన తరువాత 48 గంటల పాటు విస్తారంగా వర్షాలు పడతాయని వాతావరణ హెచ్చరికల కేంద్రం ప్రకటించింది. ఈ వర్షం మరింత ఉధృతమైతే పంటలు నీటమునిగిపోతాయనే బెంగ రైతులను వేధిస్తోంది. ఖరీఫ్ పంట ఈదురుగాలులు, వర్షాలతో నేలనంటుతుందనే దిగులు ఈస్ట్రన్, సెంట్రల్ డెల్టా రైతులను కలవరపెడుతోంది. భారీ వర్షాలకు రాజానగరం మండలం రావులచెరువుకు పడ్డ గండిని ఇంకా పూడ్చలేకపోయారు. కొత్తకాలనీ, సుబ్బారావు కాలనీలు ముంపుబారి నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాయి. తుపాను భయంతో పంపా ఆయకట్టు రైతులు చందాలు వేసుకుని గట్టు ఎత్తును పెంచుకున్నారు. జిల్లా కలెక్టరేట్‌తో పాటు ఆర్డీఓ, తహశీల్దార్ కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేసి జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖలను అప్రమత్తం చేశారు. తీర గ్రామాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. కాగా, సమ్మె కొనసాగిస్తూనే కలెక్టర్ సూచనల మేరకు పునరావాస కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఏపీఎన్జీఓ సంఘ అధ్యక్ష, కార్యదర్శులు బూరిగ ఆశ్వీరాదం, పితాని త్రినాధ్ నిర్ణయించారు. తహశీల్దార్లు, వీఆర్వో, వీఆర్ఏలు గ్రామాల్లో మకాం వేశారు. లోతట్టు ప్రాంతాలను అప్రమత్తం చేశారు. నేడు ప్రత్యేకాధికారి సమీక్ష ఈ పరిస్థితులను అంచనా వేసి అధికారులను అప్రమత్తం చేసేందుకు ప్రభుత్వం తుపాను ప్రత్యేకాధిరిగా గతంలో ఇక్కడ కలెక్టర్‌గా పనిచేసిన అనుభవం ఉన్న ఏపీహెచ్‌ఎంహెచ్‌ఐడీసీ ఎండీ ముద్దాడ రవిచంద్రను నియమించింది. ఆయన శనివారం జిల్లాకు వస్తున్నారు. ఆయన హైదరాబాద్ నుంచి గౌతమి ఎక్స్‌ప్రెస్‌లో వచ్చి జిల్లాలో తుపాను పరిస్థితిని ఉదయం 11 గంటలకు కాకినాడ కలెక్టరేట్లో అన్ని శాఖల అధికారులతో సమీక్షించనున్నారు. అనంతరం తీర ప్రాంత మండలాల్లో పర్యటించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. విద్యుత్తు శాఖ అత్యవసర కంట్రోల్ రూములు సాక్షి, రాజమండ్రి : పై-లిన్ తుపాను వల్ల తలెత్తే విద్యుత్తు సంబంధ సమస్యల పరిష్కారానికి కంట్రోల్ రూములు ఏర్పాటు చేసినట్టు ఈపీడీసీఎల్ ఎస్ఈ యలమంచిలి శ్రీమన్నారాయణ ప్రసాద్ తెలిపారు. జిల్లా కంట్రోల్ రూము ల్యాండ్ నెంబరు 0883 2463354, సెల్ 73822 99960. డివిజన్= కంట్రోల్ రూం= డివిజనల్ ఇంజనీరు రాజమండ్రి= 94910 45661= 94408 12585 కాకినాడ= 0884 2366265= 94408 12586 అమలాపురం= 08856 234828= 94408 12588 రామచంద్రపురం= 08857 243082= 94408 12587 జగ్గంపేట= 08852 233975 =94408 12589 -
తీరంలో పై-లీన్ అలజడి: ఆక్వాకు పొంచివున్న ముప్పు
భీమవరం, న్యూస్‌లైన్ : పై-లీన్ తుపాను డెల్టా రైతుల గుండెల్లో దడ పుట్టిస్తోంది. పంట చేతికొస్తుందనుకుంటున్న సమయంలో తుపాను ప్రభావంతో కురుస్తున్న వర్షాలు, వీస్తున్న ఈదురుగాలులు బెంబేలెత్తి స్తున్నాయి. తుపాను ప్రభావం అధికంగా ఉండే తీర ప్రాంతంలోని నరసాపురం, మొగల్తూరు, భీమవరం, యలమంచిలి, ఆచంట మండలాల్లో సుమారు 35 వేల హెక్టార్లలో వరి పంటకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. 1.30 లక్షల ఎకరాల్లో చేపలు, రొయ్యలు సాగు చేస్తుండగా, అందులో సుమారు 24వేల ఎకరాల్లో వనామి రొయ్యల సాగు ఉంది. మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండటంతో ఆక్వా రైతులు బెంబేలెత్తుతున్నారు. వర్షాలు మరో రెండు మూడు రోజులు కురిస్తే ఆక్సిజన్ సమస్యలు తలెత్తి రొయ్యలు, చేపలు మృత్యువాత పడే అవకాశం ఉందని గగ్గోలు పెడుతున్నారు. ఉద్యాన రైతులు కూడా వర్షాలు, తుపాను వల్ల తీవ్రంగా నష్టపోవాల్సి ఉంటుందని ఆందోళన చెందుతున్నారు. మొగల్తూరు, నరసాపురం మండలాల్లోని తీరప్రాంత మత్స్యకారులు మూడు రోజులుగా వేటకు వెళ్లకపోవడంతో జీవనాధారం లేక ఇబ్బందులు పడుతున్నారు. రానున్న 24 గంటల్లో తుపాను తీరం దాటుతుందని అధికారులు చెబుతుండగా ఎటువంటి నష్టాన్ని చేకూరుస్తుందోనని రైతులు, మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. ఎగిసిపడుతున్న అలలు మొగల్తూరు, న్యూస్‌లైన్ : పై-లీన్ తుపాన్ ప్రభావంతో పేరుపాలెం వద్ద సముద్రం అలలు ఎగసిపడుతున్నాయి. సముద్రం ఉగ్రరూపం చూసి స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. సముద్రం నుంచి వస్తున్న హోరు మరింత భయపెడుతోంది. శుక్రవారం ఉదయం ఒక పెద్ద అల సుమారు రెండు వందల మీటర్ల దూరం తోసుకువచ్చిందని స్థానికులు చెప్పారు. సముద్రంలో చేపల వేటను అధికారులు నిషేధించారు. పేరుపాలెం బీచ్ పర్యాటక ప్రదేశం కావడంతో సముద్ర స్నానానికి పలువురు వస్తుంటారు. సముద్రం ఎగసిపడుతుండడంతో స్నానానికి ఎవరూ సముద్రంలోకి వెళ్లకుండా మొగల్తూరు ఎస్ఐ సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశారు. -
పై-లీన్ ప్రభావం: భయం గుప్పిట్లో పశ్చిమ
సాక్షి, ఏలూరు : పై-లీన్ తుపాను పొంచి ఉందన్న వార్త లు పశ్చిమ వాసులకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. అక్టోబర్, నవంబర్ నెలల పేరు చెబితేనే జనం వణికిపోయేలా గతేడాది నీలం కన్నీరు మిగిల్చితే, ఈ ఏడాది పైలీన్ విరుచుకుపడేందుకు సిద్ధంగా ఉంది. శుక్రవారం జిల్లా సగటు వర్షపాతం 16.8 మిల్లీ మీటర్లుగా కాగా కామవరపుకోట మండలంలో అత్యధికంగా 72.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. సమైక్యాంధ్ర పరిరక్షణ కోసం జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ విభాగాల అధికారులు, సిబ్బంది సమ్మె చేస్తున్నారు. ప్రజలను పై-లీన్ బారినుంచి కాపాడేందుకు విద్యుత్ ఉద్యోగులు సమ్మెను విరమిస్తే పంచాయతీరాజ్ సహా పలు విభాగాల ఉద్యోగులు సమ్మెను కొనసాగిస్తూనే తుపానులో సేవలందించేందుకు విధుల్లో పాలుపంచుకోవాలని నిర్ణయించారు. అధికారులు అప్రమత్తం ప్రభుత్వం జిల్లాకు నియమించిన ప్రత్యేకాధికారి, ఐటీ కమిషనర్ సంజయ్‌జాజు, జిల్లా కలెక్టర్ సిద్దార్థజైన్ శుక్రవారం నరసాపురం, ఆచంట, మొగల్తూరు, భీమవరం మండలంలోని నాగిడిపాలెం, లోసరి, దొంగపిండి గ్రామాలను అధికారులతో కలిసి పర్యటించారు. 9 మండలాల్లో తుపాన్ ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున ఆయా మండలాల్లో నియమించిన ప్రత్యేక పర్యవేక్షక అధికారులు 24 గంటలూ ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించా రు. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని సూచించారు. నీటిపారుదల, రెవెన్యూ, విద్యుత్, పౌరసరఫరాలు, వైద్యారోగ్యశాఖ, అగ్నిమాపక, వ్యవసాయ, పశుసంవర్థక శాఖల అధికారులను జిల్లా కలెక్టర్ సిద్ధార్ధ్‌జైన్ అప్రమత్తం చేశారు. జిల్లా వ్యవసాయశాఖ సంయుక్త సంచాలకులు వీడీవీ కృపాదాస్ తాడేపల్లిగూడెం పరిసర ప్రాంతాల్లో పర్యటించారు. రాష్ట్ర సాంఘి క సంక్షేమ శాఖ మంత్రి పితాని సత్యనారాయణ హైదరాబాద్ నుంచి శుక్రవారం రాత్రి బయలుదేరి శనివారం ఉదయం నేరుగా జిల్లాకు రానున్నారు. జిల్లా అధికారులతో ఏలూరులోని జెడ్పీ అతిథి గృహంలో తుపాన్ పరిస్థితిపై సమీక్షించనున్నారు. డీఆర్డీఏ పీడీ వై.రామకృష్ణ కలెక్టర్‌తో పాటు పర్యటించారు. ప్రత్యేక ఏర్పాట్లు లోతట్టుప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి, వారికి మౌలిక సదుపాయాలు కల్పిం చేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. నిత్యావసరాలు, కిరోసిన్ అందించేందుకు పౌరసరఫరాలశాఖ ఏర్పాట్లు చేస్తోంది. డెల్టా ప్రాం తంలోని కాలువల గట్ల పరిస్థితిని అంచనా వేస్తూ బలహీనంగా ఉన్నవాటిని వెంటనే పటిష్టం చేసేందుకు ఇరిగేషన్ అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఇసుక బస్తాలను పెద్ద ఎత్తు న సిద్ధం చేస్తున్నారు. సమ్మెలో ఉన్నప్పటికీ పారి శుద్ధ్య పనులు నిర్వహించనున్నట్టు పురపాలకశాఖ ఉద్యోగులు ప్రకటించారు. వైద్య ఆరోగ్య శాఖ ఇప్పటికే వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తోంది. మంచినీటి సరఫరాకు ట్యాంకర్లు ఏర్పాటు చేసేందుకు ఆర్డబ్ల్యూఎస్ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. తాత్కాలిక మరుగుదొడ్లు, జనరేటర్ల సాయం తీసుకుని లైటింగ్ ఏర్పాట్లు చేయనున్నారు. ఏలూరుకు తమ్మిలేరు ముప్పు నీలం తుపాను సమయంలో తమ్మిలేరుకు భారీ గా వరదలు వచ్చి ఏలూరు నగరాన్ని ముంచెత్తింది. ఈసారి కూడా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల వల్ల తమ్మిలేరుకు భారీగా వరదనీరు వచ్చి చేరనుంది. దీంతో నగరంతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలు భయపడుతున్నారు. డ్రయినేజీ వ్యవస్థను క్రమబద్ధీకరించి వరదనీరు సక్రమంగా ప్రవహించేలా చర్యలు తీసుకోవాలని నగరపాలక సంస్థ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. అర్ధరాత్రి ఫోన్ చేసినా ప్రత్యేకాధికారులు స్పందించాలని లేదంటే వారిపై కఠిన చర్య తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. -
పలు ప్యాసింజర్ రైళ్లు రద్దు:ఈస్ట్ కోస్ట్ రైల్వే
ఫై-లిన్ తుఫాన్ కారణంగా ఈ రోజు పలు ప్యాసీంజర్ రైళ్లు రద్దు చేసినట్లు ఈస్ట్ కోస్ట్ రైల్వే శుక్రవారం విశాఖపట్నంలో విడుదల చేసిన ఓ ప్రకటనలో వెల్లడించింది. రైల్ నెం: 78532 విశాఖపట్నం - పలాస, 67292 విశాఖపట్నం - విజయనగరం ప్యాసింజర్ రైళ్లు రద్దు చేసినట్లు తెలిపింది. అలాగే రేపు 78531 పలాస-విశాఖపట్నం, 58418 /58417 గున్పూర్-పూరీ-గున్పూర్, 58419పలాస-గుణ్‌పూర్, 58526 / 58525 విశాఖపట్నం - పలాస -విశాఖపట్నం, 67291 విజయనగరం-పలాస, 67294 / 67293 విశాఖపట్నం-పలాస ప్యాసింజర్ రైళ్లు రద్దు చేసినట్లు ఈస్ట్ కోస్ట్ రైల్వే తెలిపింది. -
పై-లిన్ పై అప్రమత్తం: రఘువీరా
హైదరాబాద్ : పైలిన్ తుపాను వల్ల ఎదురయ్యే సమస్యలను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సన్నద్ధం అవుతోంది. తుపానుతో భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని రెవెన్యూ శాఖ మంత్రి రఘువీరారెడ్డి తెలిపారు. లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నట్లు మంత్రి చెప్పారు. తుపాను తీవ్ర ప్రభావం చూపు అవకాశం ఉన్న శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో 64వేల మందిని సురక్షిత ప్రాంతానికి తరలించేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. అధికారులు ఇచ్చే సూచనలను పాటించి ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. మరోవైపు ఫైలిన్ తుపాను సూపర్ సైక్లోన్‌గా మారే అవకాశం లేదని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. అదే సమయంలో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. తుపాను తూర్పు ఆగ్నేయ దిశగా ప్రయణించి శనివారం నాటికి ఒడిశా-కళింగపట్నం-గోపాలపూర్ ప్రాంతాల్లో తుపాను తీరం దాటే అవకాశం ఉందని వివరించారు. అల్పపీడన ద్రోణి కూడా కొనసాగుతున్న కారణంగా రానున్న 12 గంటల్లో ఉత్తర కోస్తాంధ్రలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. కోస్తా అంతటా భారీగా ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లొద్దని సూచించారు. శ్రీకాకుళం: 0894-2240557/ 9652838191 విశాఖపట్టణం: 1800425002 విజయనగరం: 0892-2236947 టోల్ ఫ్రీ: 1077 తూర్పుగోదావరి: 0884-2365506 పశ్చిమగోదావరి: 0881230617 కృష్ణా: 086722525, టోల్ ఫ్రీ: 1077 గుంటూరు : 08632345103/08632234990 నెల్లూరు: 08612331477 For the latest stories, you can like Sakshi News on Facebook and also follow us on Twitter. Get the Sakshi News app for Android or iOS -
ఫైలిన్ తుపానుపై అప్రమత్తం: రఘువీరా
-
ముంచుకొస్తోన్న ఫైలిన్ తుపాన్ ముప్పు
-
పొంచి ఉన్న ఫైలిన్
సాక్షి, నెల్లూరు: జిల్లాలో ఫైలిన్ తుపాను ప్రభావం కనిపించింది. గురువారం మధ్యాహ్నం నెల్లూరు నగరంలో భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇక జిల్లావ్యాప్తంగా మధ్యాహ్నం నుంచి మబ్బులు కమ్మి పలు ప్రాంతాల్లో ఒక మోస్తరు వర్షం కురవగా, మిగిలిన చోట్ల చిరుజల్లులు పడ్డాయి. శుక్రవారం నాటికి తుపాను ప్రభావం అధికంగా ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. భారీ వర్షాలు కురిస్తే చేపట్టాల్సిన చర్యలకు సంబంధించి కలెక్టర్ శ్రీకాంత్ నేతృత్వంలో తీరప్రాంత అధికారులతో సమావేశం నిర్వహించారు. ఇప్పటికే కృష్ణపట్నం ఓడరేవులో రెండో నెంబర్ ప్రమాద హెచ్చరికను ఎగురవేశారు. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని, ఇప్పటికే వెళ్లిన వారు తక్షణం తిరిగి రావాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. తుపాను ప్రభావంతో సముద్రంలో అలజడి నెలకొంది. తుపాను తీవ్ర రూపం దాల్చే పరిస్థితిలో లోతట్టు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇప్పటికే సమ్మెలో ఉన్న అధికారులందరినీ విధుల్లో చేరాలని కలెక్టర్ ఆదేశించారు. తీరం.. అప్రమత్తం బిట్రగుంట, న్యూస్‌లైన్: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం పెనుతుపాన్‌గా మారే ప్రమాదం ఉందనే అధికారిక హెచ్చరికల నేపథ్యంలో తూర్పుతీరం అప్రమత్తమైంది. విపత్తుల సమయంలో కీలకంగా వ్యవహరించే రెవెన్యూ ఉద్యోగులు సహా వివిధ విభాగాలు సమైక్య సమ్మెలో ఉండటంతో తీరప్రాంత గ్రామాల్లోని మత్స్యకారులు, కాపులే ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మరోవైపు తీరంలోనూ వాతావరణ పరిస్థితి క్రమంగా అల్లకల్లోలంగా మారుతుంది. ‘ఫైలిన్’ పెనుతుపాన్ హెచ్చరికలు చేసిన కొద్ది గంటలకే తీరం వెంట సముద్రం అల్లకల్లోలంగా మారడంతో మత్స్యకారులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. మధ్యాహ్నం నుంచి వాతావరణంలో అనూహ్యంగా మార్పులు ఏర్పడి సముద్రంలో అలల ఉధృతి అధికమైంది. ఉవ్వెత్తున ఎగసిపడుతున్న అలలతో తీరం అల్లకల్లోలంగా ఉంది. తాటిచెట్లపాళెం వద్ద సముద్రం కొంత మేర ముందుకు దూసుకువచ్చింది. అలల ఉధృతికి తోడు భారీ జల్లులు పడుతుండటంతో పడవలు, వలలను తీరానికి దూరంగా తరలించి భద్రపరచుకునేందుకు మత్స్యకారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. జోరువానలో తడుస్తూనే వలలు, పడవలను తీరానికి దూరంగా తరలించారు. ఈదురు గాలులకు తోడు పెద్దపెద్ద శబ్దాలతో అలలు విరుచుకుపడుతుండటంతో గంగపుత్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. తుపాన్ భయంతో తీరప్రాంత గ్రామాలైన బంగారుపాళెం, కొత్తబంగారు పాళెం, పాతబంగారు పాళెం, అలిచెర్లబంగారుపాళెం, తాటిచెట్లపాళెం, కడపాళెం, కొత్తకడపాళెం, టెంకాయచెట్లపాళెం చెందిన మత్స్యకారులు హడలిపోతున్నారు. సమైక్య రైతు దీక్ష ఆనం రామనారాయణరెడ్డి ఇంటి ముట్టడికి యత్నించారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఉదయగిరి బస్టాండ్ సెంటర్లో జేఏసీ నాయకులు ప్రజాకోర్టు నిర్వహించారు. సమైక్యాంధ్రకు మద్దతుగా వైఎస్సార్ సీపీ సర్వేపల్లి నియోజకవర్గ సమన్వయకర్త కాకాణి గోవర్ధనరెడ్డి నాయకత్వంలో రైతు దీక్షలు జరిగాయి. గూడూరులో పొట్టిశ్రీరాములు విగ్రహం వద్ద జేఏసీ నాయకులు రోడ్డుపై పడుకుని నిరసన వ్యక్తం చేశారు. మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అపర భగీరథుడని వైఎస్సార్సీపీ సీఈసీ సభ్యుడు ఎల్లసిరి గోపాల్‌రెడ్డి అన్నారు. గూడూరు రూరల్ మండలం తిప్పవరప్పాడు క్రాస్‌రోడ్డు వద్ద రైతు దీక్షలు జరిగాయి. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త పాశం సునీల్‌కుమార్, మండల, పట్టణ కన్వీనర్లు మల్లు విజయ్‌కుమార్‌రెడ్డి, నాశిన నాగులు, నాయకులు రాధాకృష్ణారెడ్డి, రాజే శ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. చిట్టమూరు మండల పరిధిలోని కొత్తగుంటలో వైఎస్సార్సీపీ నాయకుల ఆధ్వర్యంలో సమైక్య రైతు దీక్షలు నిర్వహించారు. ఈ దీక్షలకు వైఎస్సార్సీపీ నేతలు ఎల్లసిరి గోపాల్‌రెడ్డి, పాశం సునీల్‌కుమార్, డాక్టర్ బాలచెన్నయ్య సంఘీభావం తెలిపారు. వాకాడులో వైఎస్సార్సీపీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు నేదురుమల్లి పద్మనాభరెడ్డి, మండల కన్వీనర్ నేదురుమల్లి ఉదయ్‌శేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో మండల రైతులు గురువారం రైతు దీక్ష చేపట్టారు. సైదాపురం, రాపూరు, వెంకటగిరిలో జరిగిన రైతు దీక్షల్లో వెంకటగిరి నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త కొమ్మి లక్ష్మయ్యనాయుడు పాల్గొన్నారు. సూళ్లూరుపేట బస్టాండ్ సెంటర్లో నియోజకవర్గ సమన్వయకర్త దబ్బల రాజారెడ్డి ఆధ్వర్యంలో రైతుదీక్ష నిర్వహించారు. నాయుడుపేటలో మరో సమన్వయకర్త నెలవల సుబ్రమణ్యం ఆధ్వర్యంలో రైతులతో కలిసి ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహించి రైతుదీక్షను చేపట్టారు. సమన్వయకర్త కిలివేటి సంజీవయ్య ఆధ్వర్యంలో తడ, ఓజిలి మండలాల్లో రైతుదీక్ష చేశారు. పెళ్లకూరు, సూళ్లూరుపేట, దొరవారిసత్రం మండలాల్లో జరిగిన దీక్షల్లో కూడా ఆయన పాల్గొని సంఘీభావం తెలిపారు. ఆత్మకూరులో వైఎస్సార్ టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో రిలే దీక్షలు నిర్వహించారు.కావలిలో గాంధీబొమ్మ సెంటర్లో నియోజకవర్గ సమన్వయకర్త రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో రైతు దీక్షలు ప్రారంభమయ్యాయి. -
‘ఫైలిన్’పెనుతుపానుతో రైతులు ఆందోళన
అమలాపురం, న్యూస్‌లైన్ : ‘ఫైలిన్’ పేరుకు అర్థం ఏమో గానీ- అది తమకు ఎలాంటి అనర్థం తెచ్చి పెడుతుందోనని రైతులు భీతిల్లుతున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం పెను తుపానుగా మారిందన్న సమాచారంతో వారి గుండె లు గుబగుబలాడుతున్నాయి. నేలను నమ్ముకుని పెట్టిన పెట్టుబడి, పడ్డ కష్టం ఎక్కడ గంగ పాలవుతాయోనని దిగాలు పడుతున్నారు. ఇప్పటి వరకు నైరుతి రుతుపవనాలు ముఖం చాటేయడంతో సరైన వర్షం లేక ఇబ్బందులు ఎదుర్కొన్న రైతులు గత వారం రోజుల నుంచి ఉపరితల ఆవర్తన ద్రోణి వల్ల కురుస్తున్న వర్షాలతో ఊరట పొందుతున్నారు. ఈ సమయంలో తుపాను హెచ్చరిక వారి కంటికి కునుకు కరువు చేసింది. గత ఐదేళ్లలో ఒక్క 2011లో మినహా మిగిలిన నాలుగేళ్లు జిల్లాలో ఖరీఫ్ పంట తుపానులకు, భారీ వర్షాలకు తుడిచిపెట్టుకుపోవడం ఆనవాయితీగా మారింది. ఖైముకి, జల్, నీలం తుపానుల వల్ల రైతులు ఖరీఫ్ సాగులో తీవ్ర నష్టాలను చవి చూశారు. గత ఏడాది నీలం తుపానువల్ల జిల్లాలో 3.50 లక్షల ఎకరాల్లో వరిసాగు సర్వ నాశనం కావడంతోపాటు లంక గ్రామాల్లో పైరులు, కూరగాయల పంటలను రైతులు కోల్పోయారు. ఏడాది గడుస్తున్నా ఆ తుపాను పరిహారం రూ.167 కోట్లు రైతులకు ఇప్పటికీ అందలేదు. ఈ ఖరీఫ్‌లో సైతం వాతావరణం అనుకూలించక, పెట్టుబడులకు చేతుల్లో సొమ్ములు లేకున్నా అన్నదాతలు అష్టకష్టాలు పడి సాగు మొదలుపెట్టారు. వర్షాభావ పరిస్థితుల వల్ల మెట్టలో సుమారు 50 వేల ఎకరాల్లో వరినాట్లు పడలేదు. ఇదే సమయంలో గోదావరి వరదల వల్ల డెల్టాలోని 5 వేల ఎకరాల్లో వరిసాగు తుడిచిపెట్టుకుపోయింది. ఇప్పుడిప్పుడే అడపాదడపా వర్షాలు పడుతూ, ఎండలు కాస్తూ వాతావరణం సానుకూలంగా మారి పైర్ల ఎదుగుదలకు సహకరిస్తోందని, మంచి దిగుబడులు వస్తాయని ఆశలు పెట్టుకున్నారు. తూర్పుడెల్టా పరిధిలోని ఆలమూరు, రామచంద్రపురం, అనపర్తి, పెద్దాపురం సబ్ డివిజన్ల పరిధిలో వరిచేలు ఈనికదశలో ఉండి కంకులు బయటకు వస్తున్నాయి. మధ్యడెల్టాలోని ముమ్మిడివరం, అమలాపురం, పి.గన్నవరం, రాజోలు, తూర్పు డెల్టాలోని కరప, కాకినాడ రూరల్, పిఠాపురం సబ్ డివిజన్ల పరిధిలో వరిచేలు ఇప్పుడిప్పుడే పాలు పోసుకుంటున్నాయి. ఈ సమయంలో బంగాళాఖాతంలో తీవ్రవాయుగండం ‘ఫైలిన్’ తుపానుగా మారడం రైతులకు పెనుగండంగా తోస్తోంది. ఉత్తరాంధ్రతోపాటు కోస్తా జిల్లాల్లో తుపాను ప్రభావం ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతుండడంతో రైతులకు నీలం తుపాను నష్టం కళ్లముందు కదలాడుతోంది. డెల్టాలో ముఖ్యంగా కోనసీమలో మురుగునీటి కాలువలు అధ్వానస్థితిలో ఉండి కనీస మరమ్మతులకు కూడా నోచుకోలేదు. ఈ ఏడాది సుమారు రూ.23 కోట్లతో చేపట్టాల్సిన డ్రైన్ల ఆధునికీకరణ టెండర్ల ప్రక్రియ సమ్మె వల్ల నిలిచిపోయింది. కనీసం పూడికతీత పనులకు సైతం నిధులు కేటాయించలేదు. కొద్ది వర్షం కురిసినా చేలు ముంపుబారిన పడే అవకాశం ఉండగా ఫైలిన్ ఏ ముప్పు తెస్తుందోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. -
ఫైలిన్ పెనుతుపాను: పలుచోట్ల కుండపోత వర్షం
కడలి కల్లోలానికి వేదికైంది. జిల్లాకు పలుమార్లు చేదు అనుభవాలను చవి చూపిన బంగాళాఖాతం ‘ఫైలిన్’ తుపాను రూపంలో మరోసారి భయపెడుతోంది. తుపాను ప్రభావంతో జిల్లా అంతటా వర్షాలు కురుస్తున్నాయి. విపత్కర పరిస్థితులను ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం సన్నద్ధంగా కాగా ఉద్యోగులు తాత్కాలికంగా సమ్మెను విరమించి పునరావాస చర్యల్లో పాల్గొనడానికి ఉద్యుక్తులయ్యారు. కాగా ఖరీఫ్‌లో వరుస నష్టాలతో కుదేలవుతున్న అన్నదాతలు ‘గోరుచుట్టుపై రోకలి పోటు’లా ఫైలిన్ ఎక్కడ తమ పుట్టి ముంచుతుందోనని కలవరపడుతున్నారు. సాక్షి, కాకినాడ : విశాఖపట్నానికి తూర్పు ఆగ్నేయ దిశగా 950 కిలోమీటర్లదూరంలో బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ‘ఫైలిన్’ పెనుతుపానుగా మారడంతో గురువారం జిల్లావ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రాజమండ్రిలో మధ్యాహ్నం, అమలాపురంలో సాయంత్రం కుండపోత వర్షం కురిసింది. కాకినాడలో రాత్రి ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. తీరమండలాలతో పాటు దాదాపు అన్ని ప్రాంతాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. గడిచిన 24 గంటల్లో జిల్లాలో 18.4 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. తీరమండలాల్లో గురువారం ఉదయం నుంచి వీస్తున్న ఈదురుగాలుల వేగం సాయం త్రానికి మరింత పెరిగింది. సముద్రం అల్లకల్లోలంగా ఉంది. ఓడలరేవు, ఉప్పాడ తదితర తీర ప్రాంతాల్లో అలలు ఉవ్వెత్తున ఎగసి పడుతున్నాయి. కొన్ని చోట్ల తీరం మీదకు చొచ్చుకొస్తున్నాయి. కాగా ఎలాంటి విపత్కర పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం సర్వసన్నద్ధంగా ఉంది. సమ్మెలో కొనసాగుతూనే రెవెన్యూ సిబ్బంది తుపాను పునరావాస చర్యల్లో పాల్గొంటున్నారు. మరోపక్క విద్యుత్ ఉద్యోగులు కూడా సమ్మెను తాత్కాలికంగా విరమించడంతో సహాయ పునరావాస చర్యలను ముమ్మరం చేసేందుకు వెసులుబాటు కలిగింది. కలెక్టరేట్‌తో పాటు ఆర్డీఓ, తహశీల్దార్ కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేశారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖలను అప్రమత్తం చేశారు. తీర గ్రామాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సముద్రంలోకి వేటకు వెళ్లవద్దంటూ టాంటాంలు వేయిస్తున్నారు. తహశీల్దార్లు మండల కేంద్రాల్లో మకాం వేయగా, వీఆర్వో, వీఆర్ఏలు గ్రామాల్లో మకాం వేశారు. గత వారం రోజులుగా సముద్రంలోకి వేటకు వెళ్లి ఇంకా రాని వారి వివరాలను తెలుసుకొని వారి ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నారు. పరిస్థితిని బట్టి లోతట్టు ప్రాంతాల వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. జిల్లాలో తీర ప్రాంత వాసులు బిక్కుబిక్కుమంటూ కాలక్షేపం చేస్తున్నారు. భారీ వర్షాలకు రాజానగరం మండలం రావులచెరువుకు గండిపడడంతో కొత్తకాలనీ, సుబ్బారావు కాలనీ ముంపుబారినపడ్డాయి. చక్రద్వారబంధం, రాధేయపాలెం తదితర ప్రాంతాల నుంచి వస్తున్న ముంపునీరు సూర్యారావుపేట జంక్షన్ వద్ద జాతీయ రహదారి-16ను ముంచెత్తుతోంది. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. జాతీయ రహదారి విస్తరణ సమయంలో పాతరహదారిపై తూరలు తొలగించి కల్వర్టులు నిర్మించాల్సి ఉండగా, వాటి స్థానంలో మళ్లీ తూరలే వేయడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందంటూ ముంపునకు గురైన రహదారిని పరిశీలించిన వైఎస్సార్ కాంగ్రెస్ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి ఆందోళన వ్యక్తం చేశారు. ఒడిశా తీరంలోని కళింగపట్నం - పరదీప్ల మధ్య ఈనెల 12న అర్ధరాత్రి ఫైలిన్తీరం దాటే అవకాశం ఉందని, తీరం దాటిన తర్వాత కూడా 48 గంటల పాటు విస్తారంగా వర్షాలు పడతాయని వాతావరణ హెచ్చరికల కేంద్రం ప్రకటించడంతో ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్టు కలెక్టర్ నీతూప్రసాద్ చెప్పారు. రానున్న 72 గంటలు మత్స్యకారులెవ్వరూ సముద్రంలోకి వేటకు వెళ్లరాదన్నారు. అవసరమైతే తీరప్రాంతంలోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఇండియన్ కోస్ట్‌గార్డు విభాగాన్ని అప్రమత్తం చేశారు. అత్యవసర సహాయం కోసం టోల్‌ఫ్రీ హెల్ప్లైన్లు 1554 (కోస్ట్‌గార్డు), 1093 (మెరైన్)ను ఏర్పాటు చేశారు. మరో పక్క సమ్మె కొనసాగిస్తూనే కలెక్టర్ సూచనల మేరకు ఫైలిన్ తుపాను పునరావాస చర్యల్లో పాల్గొంటామని ఏపీ ఎంపీడీఓల అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పీఎన్ మూర్తి, కేసీహెచ్ అప్పారావు, కోశాధికారి సీహెచ్‌కే విశ్వనాథరెడ్డి గురువారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపారు. అన్ని చర్యలూ తీసుకోండి.. ఫైలిన్ తుపానును ఎదుర్కోవడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని రాష్ర్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి.కె.మహంతి జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. హైదరాబాద్ నుంచి గురువారం ఆయన జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి తుపాను ప్రభావంతో తూర్పుగోదావరి జిల్లాలో భారీ వర్షాలు పడతాయని, అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కలెక్టర్ నీతూప్రసాద్ మాట్లాడుతూ అన్ని శాఖల అధికారులతో సమావేశం నిర్వహించి అప్రమత్తం చేశామన్నారు. జిల్లాకు ఒక జాతీయ విపత్తు రక్షక దళాన్ని పంపాలని కోరారు. కాన్ఫరెన్స్‌లో జేసీ ఆర్.ముత్యాలరాజు, ట్రైనీ కలెక్టర్ కన్నన్, సబ్ కలెక్టర్ గంధం చంద్రుడు, డీఆర్వో బి.యాదగిరి, ఆర్డీఓలు పి.సంపత్‌కుమార్, జవహర్లాల్ నెహ్రూ, ఇరిగేషన్ ఎస్ఈ కాశీ విశ్వేశ్వరరావు, ఇతర జిల్లాఅధికారులు పాల్గొన్నారు. గంగవరం మండలంలో అత్యధిక వర్షపాతం సాక్షి, కాకినాడ : జిల్లాలో గడిచిన 24 గంటల్లో 18.4 మి.మీ. సగటు వర్షపాతం నమోదైంది. అత్యధికంగా గంగవరం మండలంలో 108.4 మి.మీ. వర్షపాతం నమోదుకాగా, అత్యల్పంగా రామచంద్రపురం మండలంలో ఒక మి.మీ. వర్షపాతం నమోదైంది. మండలాల వారీ వర్షపాతం (మిల్లీ మీటర్లలో) వై.రామవరం 20, కోటనందూరు 95.6, తుని 5.4, తొండంగి 4, ప్రత్తిపాడు 7.4, గంగవరం 108.4, సీతానగరం 5, కోరుకొండ 2, గోకవరం 12.4, కొత్తపల్లి 2.4, కాకినాడ రూరల్ 2.4, కాకినాడ అర్బన్ 2.4, రంగంపేట 19.4, రాజానగరం 82.4, రాజమండ్రి రూరల్ 1.4, రాజమండ్రి అర్బన్ 10.6, కడియం 7.6, మండపేట 8, అనపర్తి 2.2, పెదపూడి 18.2, కరప 8.2, రామచంద్రపురం 1, కపిలేశ్వరపురం 14.4, ఆలమూరు 15.8, ఆత్రేయపురం 59.2, పామర్రు 8.4, కొత్తపేట 74.2, పి.గన్నవరం 19.6, అంబాజీపేట 25.8, అయినవిల్లి 2.2, ముమ్మిడివరం 15.2, ఐ.పోలవరం 15.4, కాట్రేనికోన 16.8, ఉప్పలగుప్తం 32.4, అమలాపురం 18.2, అల్లవరం 24.2, మామిడికుదురు 48.2, రాజోలు 44.2, మలికిపురం 42.8, సఖినేటిపల్లి 17.8 నమోదైంది. తీర ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : కలెక్టర్ రాజమండ్రి రూరల్, న్యూస్‌లైన్ : జిల్లాలోని సముద్ర తీర ప్రాంత ప్రజలంతా 48 గంటలపాటు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ నీతూకుమారి ప్రసాద్ సూచించారు. గురువారం లాలాచెరువులో పోలీస్ పాసింగ్ అవుట్ పెరేడ్ అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడారు. సముద్రంలోకి 2000 మంది మత్య్సకారులు వేటకు వెళ్ళగా, 1800 మంది వెనక్కు వచ్చేశారన్నారు. మిగతా 200 మందిని సురక్షితంగా తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. అవసరమైతే కోస్టుగార్డుల సహకారం తీసుకుంటామన్నారు. ఎటువంటి ఉపద్రవం వచ్చినా తట్టుకోవడానికి అధికారులను అప్రమత్తం చేశామన్నారు. జిల్లాలో అన్ని శాఖల ఉద్యోగులూ తుపాను కారణంగా తాత్కాలికంగా సమ్మెను విరమించి విధుల్లో చేరినట్టు చెప్పారు. జిల్లా కేంద్రంలో, ఆర్డీఓ, తహశీల్దార్ల కార్యాలయాల్లో కంట్రోలు రూంలను ఏర్పాటు చేశామన్నారు. -
వణికిస్తున్న తుఫాన్
విజయనగరం కలెక్టరేట్, న్యూస్‌లైన్: బంగాళాఖాతంలో ఏర్పడిన ఫైలిన్ తుఫాన్‌ను సమర్ధంగా ఎదుర్కోడానికి జిల్లా యంత్రాంగం సన్నద్ధమెంది. తుఫాన్ ప్రభావంతో ఉద్ధృతంగా ఈదురు గాలులు వీయడంతో పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం ముందుజాగ్రత్త చర్యలు చేపట్టింది.తీరప్రాంత జిల్లాల్లో ప్రభుత్వం హైఅలెర్ట్ ప్రకటించడంతో అధికారులు ఆందోళన చెందుతున్నారు. తీరానికి 500 కిలో మీటర్ల లోపు కేంద్రీకృతమై ఉంటే ప్రభావాన్ని కచ్చితంగా అంచనా వేయగలరు. ఇప్పుడు విశాఖ తీరానికి 850 కిలోమీటర్ల దూరంలో ఉండడంతో ఒక అంచనాకు రాలేకపోతున్నారు. ఫైలిన్ ఏ మేరకు విరుచుకుపడుతుంతో తెలియక ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటున్నారు. అత్యవసర సేవలందించడానికి రెవెన్యూ, ఇతర శాఖల ఉద్యోగులు అందుబాటులో ఉండాలని కలెక్టర్ చేసిన విజ్ఞప్తి మేరకు పలువురు ఉద్యోగులు గురువారం విధులకు హాజరయ్యారు. తొమ్మిది మంది డిప్యూటీ కలెక్టర్లు, పూసపాటిరేగ, భోగాపురం, కొమరాడ, పార్వతీపురం మండలాలకు చెందిన ఎంపీడీఓలు, తహశీల్దార్ విధుల్లో పాల్గొన్నారు. మండలానికి ఒకరు చొప్పున ఉండే స్పెషల్ ఆఫీసర్లు కూడా రేపటి నుంచి విధులకు హాజరుకానున్నారు. తుఫాన్ తీరం దాటే సమయంలో గంటకు 170 నుంచి 185 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉండడంతో భారీ నష్టం జరిగే ప్రమాదం ఉందని, అందువల్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. సముద్రంలో వేటకు వెళ్లరాదని మత్స్యకారులకు హెచ్చరికలు జారీ చేశారు. ఈదురు గాలుల వల్ల పూరిపాకలు, విద్యుత్ స్తంభాలు కూలిపోయే ప్రమాదం ఉంది. అలాగే ఇళ్ల పైకప్పుగా ఉండే రేకులు ఎగిరి పడవచ్చని,అందువల్ల జిల్లా వాసులు తుఫాన్ సమయంలో ఇళ్లలో నే ఉండాలని, బయట సంచరించకూడదని అధికారులు సూచించారు. లోతట్టు గ్రామాల ప్రజలు ఎప్పటికప్పుడు తుఫాన్ సమాచారాన్ని తెలుసుకుంటూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు ప్రచారం చేస్తున్నారు. అందుబాటులో 13 తుఫాన్ సెంటర్లు జిల్లాలో 33 తుఫాన్ షెల్టర్లు ఉండగా వాటిలో కేవలం 13 మాత్రమే విని యోగానికి పనికి వస్తాయని అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో ప్ర త్యామ్నాయ ఏర్పాట్లు వైపు దృష్టి సారించారు. అవసరమైన మేర గుడారాలు ఏర్పాటు చేయటానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. జిల్లాలోని తీరప్రాంత మండలాలైన భోగాపురం, పూసపాటిరేగ మండలాలతో పాటు అధిక వర్షాలు, ఒడిశా నుంచి వచ్చే వరదలకు ముంపునకు గురయ్యే పార్వతీపురం, కొమరాడ మండలాల్లో కూడా పునరాసవాస ఏ ర్పాట్లకు అధికారులు సన్నద్ధమయ్యారు. జి ల్లాలో 28 కిలోమీటర్ల మేర తీరప్రాంతానికి ఆనుకుని ఉన్న 23 గ్రామాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. గురువారం నాటికి జిల్లావ్యాప్తంగా 2 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ వర్షాల తీవ్రత మ రింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు బులిటెన్ విడుదల చేశారు. మండలాల ప్రత్యేకాధికారులు తమ మండలాలకు వె ళ్లాలని కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయాల్సి వస్తే బాధితులకు ఆహారం సమకూర్చడానికి అవసరమైన బియ్యం, కందిపప్పు, పామోలివ్ ఆయిల్‌ను సిద్ధం చేశారు. తాగునీరు, విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా చర్యలు చేపట్టాలని ఇంజినీరింగ్ అధికారులకు, గాలుల బీభత్సానికి చెట్లు విరిగి పడితే వాటిని వెంటనే తొలగించడానికి సిద్ధంగా ఉండాలని ఆర్అండ్బీ అధికారులకు సూచించారు. అలాగే మత్య్స శాఖ, వ్యవసాయ, పశుసంవర్థక శాఖ, అ గ్నిమాపక శాఖల అధికారులకు కూడా ఆదేశాలు జారీ చేశారు. ప్రత్యేకాధికారుల నియామకం... గతంలో ఇక్కడ కలెక్టర్‌గా పని చేసిన రజిత్కుమార్ను ప్రభుత్వం ప్రత్యేకాధిగారిగా నియమించింది. జిల్లాలోని తీరప్రాంత మండలాలైన పూసపాటిరేగ, భోగాపురంలోని 23 గ్రామాల్లో ఆరు లోతట్టు గ్రామాలను అధికారులు గుర్తించారు. వీటికి ఆరుగురు జిల్లాస్థాయి అధికారులను ప్రత్యేకాధికారులుగా నియమించారు. భోగాపురం మండలంలోని చేపలకంచే రు గ్రామానికి జెడ్పీ సీఈఓ మోహనరావును, కొంగవానిపాలెం గ్రామానికి డ్వామా పీడీ ఎస్.అప్పలనాయుడులను నియమించారు. పూసపాటిరేగ మండలంలోని కోనాడ గ్రామానికి డీఆర్డీఏ పీడీ జ్యోతి, చింతపల్లికి జిల్లాపంచాయతీ అధికారి సత్యసాయిశ్రీనివాస్, కొల్లాయి వలస గ్రా మానికి ఏజేసీ యూసీజీ నాగేశ్వరరావులను నియమించారు. జిల్లాకు రెస్క్యూ బృందం ప్రత్యేక శిక్షణ పొందిన రెస్క్యూ బృందాన్ని గుంటూరు జిల్లా మంగళగిరి నుంచి రానుంది. ఈ బృందంలో 16 మంది సభ్యులుంటారు. వీరితో జిల్లా స్థాయిలో అగ్నిమాపక సిబ్బంది, మత్స్యశాఖ గుర్తించిన ఈతగాళ్లను సిద్ధం చేస్తున్నారు. అవసరం మేరకు హెలికాఫ్టర్ సేవలను కూడా వినియోగించుకునేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. కంట్రోల్ రూం నంబర్లు ఇవే... కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన 1077 టోల్‌ఫ్రీ నంబర్‌తో పాటూ 08922-236947 అందుబాటులోకి తెచ్చారు. అలాగే విజయనగరం ఆర్డీఓ కార్యాలయంలో 0822-276888, పార్వతీపురంలో 08963-221006 నంబర్లను అందుబాటులోకి తెచ్చారు. -
తమిళనాడుకు ‘ఫైలిన్’భయం లేదు
బంగాళాఖాతంలో ఏర్పడిన ఫైలిన్ తుపానుతో రాష్ట్రానికి తీవ్ర నష్టం కలిగే అవకాశాలు లేవని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. సరిహద్దు దాటే క్రమంలో ఉరుములతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. చెన్నై, సాక్షి ప్రతినిధి: అండమాన్ దీవులకు ఉత్తరాన కేంద్రీకృతమై ఉన్న ఫైలిన్ తుపాను శనివారం కళింగపట్టణం-పారాదీప్ మధ్య తీరం దాటే అవకాశం ఉంది. మంగళవారం ఏర్పడిన అల్పపీడనం బుధవారం బలపడింది. దీని ప్రభావం వల్ల ఈ నెల 12వ తేదీన తమిళనాడులోని ఉత్తర జిల్లాలు, పుదుచ్చేరిలోని సముద్రతీర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ సమయంలో గంటకు 50 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొన్నారు. చెన్నై శివారు తిరువత్తియూరు వద్ద ఉన్న సముద్రంలో బుధవారం అర్ధరాత్రి రాక్షస అలలు ఉవ్వెత్తున ఎగసిపడ్డాయి. మత్స్యకారులు సముద్రంలోకి చేపల వేటకు వెళ్లరాదని, ఇప్పకికే వెళ్లిన వారు వెంటనే ఒడ్డుకు చేరుకోవాలని వాతా వరణశాఖ అధికారులు ప్రకటించారు. చెన్నై, కడలూరు, నాగపట్నంలో 6వ నెంబరు, పుదుచ్చేరి, ఎన్నూరు, కాట్టుపల్లి, పాంబన్, తూత్తుకుడి హార్బర్లలో 1వ నెంబరు తుపాను హెచ్చరికలు ఎగురవేశారు. రాష్ట్రంలోని ఉత్తర జిల్లాలతోపాటు చెన్నైనగరంలో శనివారం ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. నాలుగు నెలలుగా ఎండకు నోచుకోని ఊటీ ప్రజలు వారం క్రితం సూర్యుడు తొంగిచూడడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఇంతలో రెండు రోజులుగా అక్కడ వర్షాలు ప్రారంభమై సూర్యుడు మళ్లీ కనుమరుగయ్యాడు. ఈ భారీ వర్షాలకు ఊటీలో వంద ఎకరాల్లో సాగు చేసిన బంగాళాదుంపలు, క్యారెట్, క్యాబేజీ తదితర పంటలు దెబ్బతిన్నాయి. -
పొంచి ఉన్న ఫైలిన్ తుఫాన్
ఒంగోలు కలెక్టరేట్, న్యూస్‌లైన్: ఫైలిన్ తుఫాన్‌పై జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. తీర ప్రాంత మండలాలపై ప్రత్యేక దృష్టి సారించింది. మండలాల వారీగా ప్రభావిత గ్రామాల వివరాలు సేకరించింది. సముద్రం ఉధృతంగా ఉన్న నేపథ్యంలో వేటకు వెళ్లిన మత్స్యకారులను తిరిగి వెనక్కి రప్పించేందుకు చర్యలు చేపట్టింది. శుక్ర, శనివారాల్లో ఫైలిన్ తుఫాన్ ప్రభావం ఉండవచ్చని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. తీర ప్రాంతాల్లోని అన్ని మండలాల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసింది. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు తీర ప్రాంతంలోని పదకొండు మండలాలకు స్పెషల్ ఆఫీసర్లను నియమించి ఎప్పటికప్పుడు నివేదికలు అందించాలని ఆదేశించింది. జిల్లాలోని ఒంగోలు, నాగులుప్పలపాడు, కొత్తపట్నం, గుడ్లూరు, చీరాల, చినగంజాం, సింగరాయకొండ, టంగుటూరు, ఉలవపాడు, వేటపాలెం, జరుగుమల్లి మండలాల్లో 102 కిలోమీటర్ల మేర సముద్ర తీరం విస్తరించి ఉంది. తీరం వెంబడి ఉన్న 79 హ్యాబిటేషన్లపై యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది. తుఫాన్ ప్రభావంతో జిల్లాలో 17.1 మిల్లీమీటర్ల సగటు వర్షం నమోదైంది. గురువారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది. సాయంత్రానికి ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకోవడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కోస్తా తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం ప్రకటించడం, మేఘాలు దట్టంగా కమ్ముకొని ఉండటంతో ఎక్కడ కుండపోత వర్షం కురుస్తుందోనని ప్రజలు ఆందోళన చెందారు. లోతట్టు ప్రాంతాల్లో నివసించే వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. బోట్లు, బియ్యం సిద్ధం తీర ప్రాంతాల్లో తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉంటుందని వాతావరణ కేంద్రం హెచ్చరించడంతో పరిస్థితులను అన్ని విధాలుగా ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది. తీర ప్రాంత మండలానికి ఒకటి చొప్పున బోట్లను సిద్ధం చేసింది. ఎవరైనా నీటిలో కొట్టుకుపోతే ఆదుకునేందుకు ఈతగాళ్లను కూడా అందుబాటులోకి తెచ్చింది. కోస్ట్‌గార్డ్ సిబ్బంది సేవలను వినియోగించుకునేందుకు వారిని సిద్ధం చేసింది. బియ్యం, ఇతర నిత్యావసరాలు నిల్వ చేసింది. చీరాల నుంచి గుడ్లూరు వరకు ఐదారు పెట్రోలు బంకుల్లో పెట్రోల్, డీజిల్‌ను నిల్వ చేసే పనిలో నిమగ్నమైంది. వైద్య బృందాలను, అంబులెన్స్‌లను కూడా సిద్ధం చేసింది. అంటువ్యాధులు వ్యాపించకుండా ఉండేందుకు ఏర్పాట్లు చేసింది. నాలుగైదు రోజుల్లో ప్రసవించే గర్భిణుల వివరాలు సేకరించే పనిలో సిబ్బంది నిమగ్నమయ్యారు. వారిని ముందుగానే వైద్యశాలలకు తరలించే ఏర్పాట్లు చేశారు. ఉధృతంగా గుండ్లకమ్మ గుండ్లకమ్మ ప్రాజెక్టులో నీటి ఉధృతి రోజురోజుకూ పెరిగిపోతోంది. ప్రాజెక్టులో ప్రస్తుతం 4,000 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా, 4,400 క్యూసెక్కుల ఔట్ ఫ్లో ఉంది. ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు వస్తుండటంతో ప్రాజెక్టు ఇంజినీరింగ్ అధికారులు ఇప్పటికే రెండు గేట్లను ఎత్తివేశారు. నీటి ఉధృతి ఎక్కువగా ఉంటే మరో గేట్ ఎత్తివేసే అవకాశం ఉంది. మూడో గేట్‌ను కూడా ఎత్తివేస్తే ప్రాజెక్టు పరిధిలోని గుండ్లాపల్లి, అన్నంగి, మల్లవరం, నేలటూరు, ఏడుగుండ్లపాడు, వెల్లంపల్లి గ్రామాల్లోకి నీరు వచ్చే ప్రమాదం ఉంది. ప్రాజెక్టు ఇంజినీరింగ్ అధికారులు ముందస్తు చర్యలు తీసుకోకపోవడంతో సంబంధిత గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. నాగులుప్పలపాడు మండలం మద్దిరాలపాడు - చదలవాడ చప్టాకు దగ్గరగా నీరు ప్రవహిస్తోంది. గుండ్లకమ్మ ప్రాజెక్టు మూడో గేట్ ఎత్తివేస్తే చప్టాపై నీరు ప్రవహిస్తూ రాకపోకలకు అంతరాయం కలిగే ప్రమాదం ఉంది. అప్రమత్తంగా ఉండాలి ఫైలిన్ తుఫాన్ పట్ల అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పీకే మహంతి ఆదేశించారు. తుఫాన్ ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో గురువారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్లు అప్రమత్తంగా ఉండి తుఫాన్ తీవ్రతను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. కలెక్టర్ విజయకుమార్ మాట్లాడుతూ తుఫాన్‌ను ఎదుర్కొనేందుకు అన్ని విధాలా సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. బియ్యం, పప్పు, పామాయిల్ నూనె, కిరోసిన్ పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు వివరించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ యాకూబ్‌నాయక్, జిల్లా రెవెన్యూ అధికారి గంగాధర్‌గౌడ్, సీపీఓ వెంకయ్యతో పాటు పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. -
వణికిస్తున్న ఫైలిన్: జిల్లావ్యాప్తంగా కుండపోత వర్షం
సాక్షి/న్యూస్‌లైన్, ఏలూరు : ఫైలిన్ తుపాను ప్రభావంతో జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గురువారం ఉదయం 8.30 గం టల సమయూనికే జిల్లాలో 32.4 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. రోడ్లు జలమయయ్యాయి. కోతకు వచ్చిన వరిచేలు నేలకొరిగాయి. జిల్లా కలెక్టర్ సిద్ధార్థజైన్ పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ యంత్రాంగానికి తగిన సూచనలు ఇస్తున్నారు. నష్టనివారణకు తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై వివిధ శాఖల అధికారులు, ప్రత్యేక అధికారులతో గురువారం ఆయన సమీక్షించారు. తుపాను ప్రభావిత మండలాల్లో ప్రత్యేకాధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మెట్ట, డెల్టా ప్రాంతాల్లో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీకిస్తూ అవసర మైన ముందస్తు చర్యలు తీసుకునే విషయంలో నీటిపారుదల శాఖ అధికారులు చురుకైన పాత్ర పోషించాలని ఎస్ఈ వైఎస్ సుధాకర్‌ను కలెక్టర్ ఆదేశించారు. బలహీనంగా ఉన్న చెరువు గట్లను పటిష్టపరిచేందుకు చర్యలు తీసుకోవాలని, అవసరమైన చోట్ల ఇసుక బస్తాలను అందుబాటులో ఉంచాలని సూచించారు. దొంగరావిపాలెం, సిద్ధాంతం ఏటిగట్లు, రాజులంక, నక్కల డ్రెయిన్, నందమూరు ఆక్విడెక్టు, కడెమ్మ స్లూయిజ్, కాజ డ్రెయిన్ పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు. జాతీయ విపత్తుల నివారణ సంస్థకు చెందిన 40 మంది బృందాన్ని జిల్లాకు రప్పిస్తున్నామని, వీరిలో సగం మందిని నరసాపురం, మరో సగం మందిని పోలవరం ప్రాంతానికి పంపుతామని కలెక్టర్ చెప్పారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని ట్రాన్స్‌కో ఎస్ఈ టీవీ సూర్యప్రకాష్‌కు ఆదేశాలిచ్చారు. కూలిపోయే అవకాశం ఉన్న చెట్లను ముందుగానే తొలగించాలని ఆర్ అండ్ బీ, పంచాయతీరాజ్ అధికారులను ఆదేశించారు. ముంపు ప్రాంతాల్లోని నీటిని తొలగించేందుకు ఫైర్ ఇంజిన్లు, మోటార్లను సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. రెండు, మూడు రోజుల్లో కాన్పు అయ్యే అవకాశం ఉన్న గర్భిణులను సురక్షిత ప్రాంతాల్లో ఉంచేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. అవసరమైన చోట్ల వెంటనే వైద్యం అందించేందుకు ఆరోగ్య సిబ్బంది అందుబాటులో ఉండాలని, అంగన్ వాడీ కేంద్రాల్లో బియ్యం, పప్పు దినుసుల నిల్వలను సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. మత్స్యకారులు వేటకు వెళ్లకుండా చూడాలని, లోత ట్టు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు చేర్చేందుకు బోట్లను, గజ ఈతగాళ్లను సిద్ధం చేయూలన్నారు. భారీ వర్షాలు కురిసే ప్రాంతాల్లో కళ్లాలపై ఉన్న పంటను కాపాడేందుకు వ్యవసాయ శాఖ ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. పొగాకు నర్సరీలకు నష్టం వాటిల్లకుండా అవసరమైన చర్యలు తీసుకునేందుకు రాజమండ్రిలోని సీటీఆర్ఐ అధికారులతో సంప్రదింపులు జరపాలని వ్యవసాయ శాఖ జేడీ కృపాదాస్‌ను ఆదేశించారు. సమావేశంలో జేసీ టి.బాబూరావునాయుడు, డీఆర్వో ఎం.ప్రభాకరరావు, ఆర్డీవోలు శ్రీనివాస్, గోవిందు, నాన్‌రాజు, జె.వసంతరావు, వివిధ శాఖల ఎస్ఈలు సూర్యప్రకాష్, పి.శ్రీమన్నారాయణ, బి.రమణ, జెడ్పీ సీఈవో వి.నాగార్జున సాగర్ పాల్గొన్నారు. వ్యవసాయ, విద్యుత్ శాఖలు అప్రమత్తం తుపాను నేపథ్యంలో వ్యవసాయశాఖ అప్రమత్తమైంది. వ్యవసాయ అధికారులంతా రైతులకు అందుబాటులో ఉండాలని, పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ పంటల్ని కాపాడుకునే విషయంలో వారికి తగిన సూచనలు ఇవ్వాలని ఆ శాఖ సంయుక్త సంచాలకులు కృపాదాస్ ఆదేశించారు. తుపాను నేపథ్యంలో విద్యుత్ శాఖ అధికారులు అప్రమత్తమయ్యూరు. సమ్మెను తాత్కాలికంగా విరమించి పరిస్థితులను ఎదుర్కోవడానికి ప్రణాళికలు సిద్ధం చేశారు. కంట్రోల్ రూమ్‌ల ఏర్పాటు ఏలూరు (ఫైర్‌స్టేషన్ సెంటర్), న్యూస్‌లైన్ : తుపాను నేపథ్యంలో జిల్లాలోని అన్ని డివిజన్లలో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసినట్టు కలెక్టర్ సిద్ధార్థజైన్ తెలిపారు. ప్రజ లు విలువైన వస్తువులను ప్లాస్టిక్ కాగితం లో సురక్షిత ప్రాంతాల్లో భద్రపర్చుకోవాలని సూచించారు. విత్తనం, ఎరువు లు, ధాన్యం బస్తాలు, ఎండు చేపలు వంటి వాటిని ఎత్తై అటకలపై ఉంచాలని, పడవలు, వలలు, మగ్గాలు, పంపుసెట్లు వంటివి పాడవకుండా జాగ్రత్త వహించాలన్నారు. పశువులను మెట్ట ప్రాంతాలకు తరలించి, తగినంత మేత ఉండేలా చూడాలన్నారు. కంట్రోల్ రూమ్ నంబర్లు కలెక్టరేట్ - 08812-230617 ఆర్డీవో- ఏలూరు- 08812-232044 ఆర్డీవో- నరసాపురం- 08812-276699 ఆర్డీవో- కొవ్వూరు- 08813-231488 ఆర్డీవో- జంగారెడ్డిగూడెం- 08821-223660 ప్రత్యేక అధికారుల నియూమకం ఏలూరు, న్యూస్‌లైన్ : తుపాను ప్రభావిత మండలాలకు జిల్లాస్థారుు అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆచంటకు పౌర సరఫరాల శాఖ జిల్లా మేనేజర్ సలీంఖాన్ (77020 03552), ఆకివీడుకు ఎస్ఈ కార్పొరేషన్ ఈడీ ఎన్వీవీ సత్యనారాయణ (80083 01168), యలమంచిలికి డ్వామా పీడీ ఎన్.రామచంద్రరెడ్డి (98665 52678), కొవ్వూరుకు జె డ్పీ సీఈవో వి.నాగార్జునసాగర్ (94937 42399), మొగల్తూరుకు డీఆర్డీఏ పీడీ వై.రామకృష్ణ (97049 79777), నరసాపురానికి డీఈవో నరసింహరావు (98499 09105), పోడూరుకు గృహ నిర్మాణ సంస్థ పీడీ జి.సత్యనారాయణ (77997 21148), పోలవరానికి కేఆర్‌పురం గిరిజన సంక్షేమ స్పెషల్ డెప్యూటీ కలెక్టర్ ఝాన్సీరాణి (94406 64161), భీమవరం మండలానికి పశుసంవర్థక శాఖ జేడీ కె.జ్ఞానేశ్వరావు (99899 32844) నియమించారు. -
ముందుకొచ్చిన సముద్రం
ఫైలిన్ తుపాను ప్రభావంతో వజ్రపుకొత్తూరు మండలం మంచినీళ్లపేట వద్ద సముద్రం 60 మీటర్లు ముందుకు వ చ్చింది. దీంతో సుమారు రూ.2 లక్షలు విలువైన ఫైబర్ బోటు ధ్వంసమైంది. గార మండలం కళింగపట్నం, బందరువానిపేట గ్రామాల వద్ద సముద్రం 50 అడుగుల మేర ముందుకు రావడంతో మత్స్యకారులు అప్రమత్తమై పడవ లను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇచ్ఛాపురం మండలం డొంకూరు వద్ద అలలు ఎగసి పడడంతో పడవతోపాటు వలలు కొట్టుకుపోయి లక్ష రూపాయలు, కవిటి మండలం కపాసుకుద్ది మత్స్యకారుల వలలు ధ్వంసమవటంతో 6 లక్షల రూపాయల మేర నష్టం వాటిల్లింది. పూండి, న్యూస్‌లైన్: బంగాళా ఖాతంలో పైలిన్ తుపాను ప్రభావంతో సముద్రంలో అలలు ఎగసిపడుతున్నాయి. సముద్రం ముందుకు రావడంతో తీరప్రాంత మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. అధికారుల హెచ్చరికల నేపథ్యంలో మత్స్యకారులు అప్రమత్తమవడంతో నష్టం తగ్గింది. వజ్రపుకొత్తూరు మండలంలోని తీర ప్రాంతంలో అలలు ఉవ్వెత్తున ఎగసి పడుతుండడంతో అలల కల్లోలం తీవ్రమైంది. తుపాను హెచ్చరికలతో మత్స్యకారులు వేటకు వెళలేదు. దేవునల్తాడ తీరం నుంచి గుణుపల్లి వరకు బుధవారం రాత్రి బలమైన గాలులు వీయడంతో మంచినీళ్లపేట తీరం వద్ద సముద్రం 60 మీటర్లు ముందుకు వ చ్చింది. తీరంలో చోడిపల్లి ఎరకయ్యకు చెందిన సుమారు రూ.2 లక్షలు విలువ చేసే లంగరు వేసి ఫైబర్ బోటు ధ్వంసమైంది. సుమారు రూ.1.50 లక్షల నష్టం జరిగిందని మత్స్యకారుల తెలిపారు. రాత్రివేళల్లో అలల ఉద్ధృతి ఎక్కువగా ఉంటుందన్నారు. గ్రామానికి అధికారులు వచ్చి ఏ విధమైన సూచనలు ఇవ్వలేదన్నారు. బావనపాడు మెరైన్ పోలీసులు మంచినీళ్లపేట చేరుకుని ఫైబర్ బోటుకు జరిగిన నష్టాన్ని అంచనావేశారు. మత్స్యశాఖ నుంచి క్షేత్ర పర్యవేక్షకుడు పి.విజయ్‌కుమార్ ధ్వంసమైన తెప్పను పరిశీలించి అధికారులు దృష్టికి తీసుకెళతామని చెప్పారు. తీరం వెంట ఉన్న మత్స్యకారులను అప్రమత్తంగా ఉండాలని మెరైన్ పోలీసులు గోపాలకృష్ణ, వెంకటేశ్వరరావులు చెబుతున్నారు. ఫైబర్ బోటు ద్వంసమైన విషయాన్ని భావనపాడు మెరైన్ సీఐ ఎం. సన్యాసి నాయుడు దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. తుపానువల్ల నష్టానికి గురైన బోటు యజమాని చోడిపల్లి ఎరకయ్యను మత్స్యశాఖ ద్వారా ప్రభుత్వం ఆదుకోవాలని స్థానికులు సర్పంచ్ గుళ్ల చిన్నారావు, ఎ.భాస్కరరావు, కె.సింహాచలం, వంక రాజు కోరారు. అప్రమత్తమైన మత్స్యకారులు గార: పైలిన్ తుపాను ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా ఉంది. గురువారం ఉదయం కళింగపట్నం, బందరువానిపేట గ్రామాల వద్ద సముద్రం సుమారు 50 అడుగుల మేర ముందుకు వచ్చింది. అలలు ఎగసిపడడంతో అప్రమత్తమైన మత్స్యకారులు వలలు సముద్రంలోకి కొట్టుకుపోకుండా దూరంగా తరలించారు. ఉదయం వరకు సముద్రం ప్రశాంతంగానే ఉందని, ఒక్కసారిగా ఇలా మారిందని మత్స్యకారులు రాయితీ రాజారావు, మైలపల్లి సూర్యనారాయణ తెలిపారు. మూడురోజుల పాటు వేటకు వెళ్లవద్దని సర్పంచ్ గనగళ్ల లక్ష్మమ్మ, గ్రామ పెద్దలకు రెవెన్యూ అధికారులు సూచించారు. పడవ ధ్వంసం డొంకూరు (ఇచ్ఛాపురం రూరల్): బంగాళాఖాతంలో ఏర్పడిన తుపాను ప్రభావంతో సముద్రంలో అలలు ఎగసిపడుతున్నాయి. వేటకు వెళ్లవద్దని మత్స్యకారులకు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. వాతావరణం బాగాలేదని, వేటకు వెళ్లవద్దని బుధవారం ప్రసార మాధ్యమాల ద్వారా అధికారులు హెచ్చరికలు జారీ చేయడంతో మండలంలోని డొంకూరు ప్రాంత మత్స్యకారులు వేటకు వెళ్లలేదు. పడవలను, వలలను సముద్ర తీరానికి దూరంగా ఉంచారు. గ్రామానికి బడే జగ్గారావు అనే మత్స్యకారుడు ఊళ్లో లేకపోవడంతో అతని పడవ సముద్రపు ఒడ్డునే ఉంది. గురువారం వేకువజామున తుపాను ప్రభావంతో అలలు ఎగసిపడి కొన్ని మీటర్ల దూరం ముందుకు రావడంతో పడవతో పాటు అందులోని వలలు కొట్టుకుపోయాయి. అలల తాకిడికి పడవ పూర్తిగా ధ్వంసమైంది. దీంతో లక్ష రూపాయల ఆస్తి నష్టం వాటిల్లిందని మత్స్యకారుడు జగ్గారావు తెలిపారు. అప్పులు చేసి కొన్న వలలు, పడవ ఇంజిన్ నీటి పాలవడంతో తన జీవనాధారం పోయిందని, ఆదుకోవాలని ప్రభుత్వానిక కోరారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు తలదాచుకునేందుకు నిర్మించిన తుపాను షెల్టర్ శిథిలమైనా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానిక మత్స్యకారులు తెలిపారు. రూ.6 లక్షల నష్టం కపాసుకుద్ధి(కవిటి): సముద్రంలో వేటకు వెళ్లిన కపాసుకుద్ధికి చెందిన మత్స్యకారులు అలల ఉద్ధృతికి సుమారు 6 లక్షల విలువైన చేపలవల, ఇతర సామగ్రి నష్టపోయారు. మంగళవారం రాత్రి కపాసుకుద్ధి తీరం నంచి వల యజమానుదారులైన బడే దాలయ్య, తాతయ్య, జగదీష్, సోమయ్య, ఎర్రన్న, ఢిల్లేశు, పురుషోత్తం, వల్లయ్య తదితరులు 18 మంది వేటకు వె ళ్లారు. బుధవారం తుపాను ప్రకటనల నేపథ్యంలో స్థానికులు సెల్ఫోన్లో ఇచ్చిన సమాచారం మేరకు వారు వెనక్కు వచ్చేందుకు సిద్ధమయ్యారు. సముద్రంలో అలల ధాటికి వేట కోసం వినియోగించిన వల అడుగు భాగంలో రాళ్లు పైకి తేలడంతో వల చిరిగిపోయింది. సగంపైగా వల చిరిగిపోయిందని మత్స్యకారులు తెలిపారు. అప్పుచేసి ఇటీవల వల సమకూర్చుకున్నామన్నారు. మత్స్యశాఖ అధికారులు పరిశీలించి చర్యలు తీసుకోవాలని కోరారు. -
5 గంటలు.. ఒకటే టెన్షన్!
బందరువానిపేట (గార), న్యూస్‌లైన్ : తుపాను హెచ్చరికలను బేఖాతరు చేసి సముద్రంలో వేటకువెళ్లిన బందరువానిపేట మత్స్యకారులు గురువారం అటు అధికారులను, ఇటు గ్రామస్తులను తీవ్ర భయాందోళనకు గురిచేశారు. ఉదయం 9 గంటలకు మొదలైన టెన్షన్.. మధ్యాహ్నం 2 గంటల వరకు కొనసాగింది. ఎట్టకేలకు 15 పడవల్లో వేటకెళ్లిన 60 మంది విడతలవారీగా సురక్షితంగా ఒడ్డుకు చేరటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇదీ జరిగింది.. బంగాళాఖాతంలో ఏర్పడిన తుపాను కళింగపట్నం-పారాదీప్‌ల మధ్య తీరం దాటే అవ కాశం ఉందని వాతావరణ శాఖ ముందే హెచ్చరించినా.. వేటకు వెళ్లవద్దని రెవెన్యూ సిబ్బంది బుధవారం సాయంత్రమే దండోరా వేయించినా బందరువానిపేటకు చెందిన 60 మంది మత్స్యకారులు పట్టించుకోలేదు. ఎప్పట్లాగే వేకువజామున 4 గంటలకు తీరానికి చేరుకున్నారు. సముద్రం ప్రశాంతంగా ఉండటంతో 15 పడవల్లో వేటకు బయలుదేరారు. అయితే 9 గంటలకల్లా గాలులు పెరిగి సముద్రం అల్లకల్లోలంగా మారటంతో ఆందోళన చెందిన గ్రామస్తులు తీరానికి చేరుకున్నారు. సాధారణంగా 10, 11 గంటల మధ్య మత్స్యకారులు వేట నుంచి తిరిగొస్తారు. కానీ ఆ సమయానికి ఒక్క పడవే రావటంతో టెన్షన్ ఎక్కువైంది. మిగతావారి పరిస్థితేమిటని పడవలో వచ్చినవారిని ప్రశ్నిస్తే అంతా తిరుగుప్రయాణంలో ఉన్నారని చెప్పారు. ఈలోగా సమాచారం తెలిసి కళింగపట్నం మెరైన్ స్టేషన్ సీఐ పూరేటి నారాయణరావు సిబ్బందితో అక్కడికి చేరుకున్నారు. పాత పద్ధతుల్లో తుపాను తీవ్రతను అంచనా కట్టడం మానుకోవాలని హితవు చెప్పారు. ఏమైనా జరిగితే మీ కుటుంబాలకు దిక్కెవరని ప్రశ్నించారు. ఆర్ఐ బి.వి.రాజు కూడా వచ్చి మత్స్యకారులతో మాట్లాడారు. ఈ నేపథ్యంలో 12 గంటలకు 12 పడవల్లో మత్స్యకారులు ఒడ్డుకు చేరుకున్నారు. 2 గంటలకు రెండు పడవల్లో మిగిలినవారు ఒడ్డుకు చేరుకోవటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. బోట్లు లేని మెరైన్ పోలీసులు మెరైన్ పోలీస్ స్టేషన్‌కు బోట్లు లేకపోవటంతో బందరువానిపేట తీరానికి చేరుకున్న సిబ్బంది కేవలం మత్స్యకారులతో మాట్లాడ టానికే పరిమితమయ్యారు. వేటకు వెళ్లినవారికి ప్రమాదం జరిగితే మెరైన్ సిబ్బంది ఎలాంటి సహాయం అందించలేని పరిస్థితి. కళింగపట్నం మెరైన్ స్టేషన్ సిబ్బంది గార, శ్రీకాకుళం, ఎచ్చెర్ల, రణస్థలం మండలాల్లోని తీరాన్ని పర్యవే క్షిస్తారు. ఈ స్టేషన్‌కు 12 టన్నుల సామర్ధ్యం గల బోట్లు రెండు, 5 టన్నుల బోటు ఒకటి అవసరం. కానీ ఇంతవరకు ప్రభుత్వం వాటిని సమకూర్చలేదు. -
జిల్లా యంత్రాంగంఅప్రమత్తం
శ్రీకాకుళం కలెక్టరేట్, న్యూస్‌లైన్ : ఫైలిన్ తుపాను ముంచుకొస్తుండటంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లాలోని కళింగపట్నం వద్ద తుపాను తీరాన్ని దాటే అవకాశం ఉందని, ఆ సమయంలో గంటకు 140 నుంచి 200 కిలోమీటర్ల వేగంగా గాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించటంతో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధమైంది. సహాయ చర్యలకు ఏర్పాట్లు ముమ్మరం చేసింది. జిల్లాలోని 11 తీరప్రాంత మండలాల్లో ఉన్న 237 గ్రామాలపై తీవ్రప్రభావం ఉంటుందని గుర్తించి ఆ మేరకు ముందస్తు చర్యలు తీసుకుంది. పరిస్థితిపై జిల్లా కలెక్టర్ సౌరభ్ గౌర్ మండల స్థాయి అధికారులతో గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తుపాను ప్రభావం నాలుగు రోజులపాటు కొనసాగే అవకాశం ఉన్నందున.. తీసుకోవల్సిన ముందస్తు చర్యలు, ఏర్పాట్లపై ఆదేశాలిచ్చారు. సముద్రంలో చేపల వేటకు వెళ్లొద్దని తీర ప్రాంత గ్రామాల్లో ఇప్పటికే దండోరా వేయించారు. జిల్లాలోని 110 తుపాను రక్షిత భవనాలు, 24 పునరావాస కేంద్రాలను బాధితుల కోసం సిద్ధం చేశారు. మరికొన్ని చోట్ల పాఠశాలలు, వివిధ పారిశ్రామిక సంస్థలను కూడా వినియోగించేందుకు ఏర్పాట్లు చేశారు. పునరావాస కేంద్రాలకోసం ఇచ్ఛాపురం మండలం డొంకూరు, ఈదుపురం జెడ్పీ ఉన్నత పాఠశాలలు, కవిటి మండలం మాణిక్యపురం జెడ్పీ ఉన్నత పాఠశాల, కవిటి ప్రభుత్వ జూనియర్ కళాశాల, మందస మండలం హరిపురం, అంబుగాం జెడ్పీ ఉన్నత పాఠశాలలు, వజ్రపుకొత్తూరు మండలం పాత టెక్కలి, వజ్రపు కొత్తూరు జెడ్పీ ఉన్నత పాఠశాలలు, సంతబొమ్మాళి మండలం నౌపడ ప్రభుత్వ జూనియర్ కళాశాల, బోరుభద్ర జెడ్పీ ఉన్నత పాఠశాల, సోంపేట మండలం బారువ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, నడుమూరు జెడ్పీ ఉన్నత పాఠశాల, శ్రీకాకుళం మండలం కుందువానిపేట ఎంపీయుపీ పాఠశాల, పెద్ద గనగళ్లవలస జెడ్పీ ఉన్నత పాఠశాల, నరసన్నపేట మండలం మడపాం జెడ్పీ ఉన్నత పాఠశాల, మబగాం ఎంపీయూపీ పాఠశాల, గార మండలం మందురువానిపేట ప్రభుత్వ ఆశ్రమ పాఠశాల, వత్సవలస ట్రైమెక్స్ పాఠశాల, రణస్థలం మండలం మెంటాడ ఎంపీయూపీ పాఠశాల, నారువ జెడ్పీ ఉన్నత పాఠశాల, ఎచ్చెర్ల మండలం డి.మత్స్యలేశం జెడ్పీ ఉన్నత పాఠశాల, బందరువానిపేట ఎంపీయూపీ పాఠశాలలను సిద్ధం చేశారు. వీటితోపాటు సురక్షితంగా ఉన్న భవనాలను గుర్తించేందుకు మండల ప్రత్యేకాధికారులు ఆయా గ్రామాలను గురువారం సందర్శించారు. = తుపాన్ ప్రభావిత గ్రామాల నుంచి ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించేందుకు ప్రతి మండలంలో 5 నుంచి 6 ఆర్టీసీ బస్సులను సిద్ధం చేశారు. అవసరమైతే ప్రైవేట్ బస్సులను కూడా వినియోగిస్తారు. = పునరావాస కేంద్రాలకు అవసరమైన పాలు, నీరు, కిరోసిన్, గ్యాస్, పెట్రోల్‌ను అందుబాటులో ఉంచుతున్నారు. ఈ బాధ్యతను మండలాలవారీగా ఒక్కో డీలరుకు అప్పగించారు. తీరప్రాంత మండలాల్లోని పరిశ్రమల్లో ఉన్న మెస్‌లను పరిశీలించారు. వీటి నుంచి బాధితులకు ఆహారాన్ని అందించే విషయమై పరిశ్రమల అధికారులతో చర్చించారు. = బాధితుల కోసం అత్యవసర మందులను అందుబాటులో ఉంచారు. విశాఖపట్నంలోని కోస్టుగార్డు, నావికాదళ అధికారులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నారు. = పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించి తగిన చర్యలు తీసుకునేందుకు మండలాలకు ప్రత్యేకాధికారులను.. రెండు మూడు మండలాలకు పర్యవేక్షణ అధికారులను నియమించారు. వీరందరినీ జిల్లా కేంద్రం నుంచి ఏజేసీ సమన్వయపరుస్తారు. = తుపాను సహాయ చర్యలు చేపట్టేందుకు కేంద్రం నుంచి రెండు విపత్తు నివారణ బృందాలు జిల్లాకు చేరాయి. ఈ బృందాలు కళింగపట్నం, బారువ, భావనపాడు తీరాల్లో ఉండి సహాయ చర్యలు చేపడతాయి. = మెరైన్ పోలీస్ స్టేషన్ల వద్ద 12 బోట్లు, 175 మంది గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచారు. భారీ వాహనాల రాకపోకలపై నిషేధం తుపాను ప్రభావిత ప్రాంతాల్లో భారీ వాహనాల రాకపోకలను శుక్రవారం నుంచి తుపాను ముప్పు తొలగేవరకు నిషేధించారు. ఈ మేరకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. భారీ వాహనాలు తిరగడం వల్ల తుపాను సహాయ చర్యలకు ఆటంకం కలగవచ్చన్న ఉద్దేశంతో ఈ చర్య తీసుకున్నారు. తుపాను సమయంలో నదులు, వాగులను దాటవద్దని, ఈతకు వెళ్లవద్దని జిల్లా యంత్రాంగం ప్రజలకు పిలుపునిచ్చింది. 24 గంటల కంట్రోల్ రూం సిద్ధం పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకొనేందుకు కలెక్టరేట్లో 24 గంటలూ పనిచేసే కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఈ కేంద్రం ఫోన్ నంబర్లు 08942-240557, 9652838191. మండల తహశీల్దార్ కార్యాలయాల్లో కూడా కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశారు. పండుగ ముందు ప్రమాదం దసరా పండుగ ముందు ఇలాంటి విపత్తు ముంచుకొస్తుండటం జిల్లా ప్రజలకు, ముఖ్యంగా రైతులకు తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఖరీఫ్ పంటలకు ముప్పు వాటిల్లుతుందేమోనని భయపడుతున్నారు. -
గుంటూరు జిల్లాలో ఫైలిన్ కలకలం
సాక్షి, గుంటూరు/ న్యూస్‌లైన్,బాపట్లటౌన్ : ‘ఫైలిన్’ తుపాను జిల్లాలో కలకలం రేపుతోంది. గురువారం రాత్రికి తీరప్రాంతంలో సముద్ర అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. పరదీప్, కళింగపట్నం మధ్య 12వ తేదీ సాయంత్రానికి తుపాను తీరాన్ని దాటవచ్చని దీంతో జిల్లాలో భారీవర్షాలతో పాటు గంటకు 200 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయవచ్చని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. నిజాంపట్నం హార్బర్లో రెండోనంబర్ ప్రమాద సూచికను ఎగురవేశారు. అధికారుల ఆదేశాల మేరకు హార్బర్ నుంచి వేటకు వెళ్లిన బోట్లన్నీ గురువారం తిరిగి ఒడ్డుకు చేరాయి. కాకినాడకు చెందిన ఐదు బోట్లు, కృష్ణపట్నంకు చెందిన ఒక బోటు నిజాంపట్నం హార్బర్ కు చేరాయి. జిల్లా కలెక్టర్ ఎస్ సురేశ్‌కుమార్ ఆదేశాల మేరకు తుపాను ప్రభావిత మండలాలకు ప్రత్యేకంగా నియమించిన అధికారులు స్థానికంగా ఉంటూ ‘ఫైలిన్’ ప్రభావాన్ని గమనిస్తూ ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నారు. మత్స్యకారుల ఆందోళన... కిందటి ఓగ్ని, జల్, నీలం తుపానులను గుర్తుచేసుకుంటూ మత్స్యకారులు తమ బోట్ల భద్రతపై ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. జెట్ట్టీలోని బోట్లను రేవు మార్గం ద్వారా తరలించి గ్రామాలకు సమీపంలో భద్రపరుచుకునే ఏర్పాట్లు చేసుకుంటున్నారు. సముద్రంలోకి వెళ్లిన 150 మెకనైజ్డ్ బోట్లు, 150 మోటరైజ్డ్ బోట్లన్నీ హర్బర్‌కు చేరినట్లు అధికారులు ధృవీకరిస్తున్నారు. నిజాంపట్నం మండల తీరప్రాంత గ్రామలైన నక్షత్రనగర్, సంజీవనగర్, కొత్తపాలెం, తాళ్లతిప్ప, రేపల్లె మండలంలోని మోళ్లగుంట, లంకెవాని దిబ్బ, లక్ష్మీపురం గ్రామాల పరిధిలోని ఉన్న సుమారు 600 మోటరైజ్డ్ బోట్లు ఒడ్డుకు చేరాయి. కంట్రోల్‌రూమ్‌ల ఏర్పాటు ... తుపానుకు సంబంధించి అప్రమత్తచర్యల్లో భాగంగా జిల్లా కలెక్టర్ ఎస్ సురేశ్‌కుమార్ గురువారం అన్ని ప్రభుత్వశాఖల అధికారులతో సమీక్షించారు. అధికారయంత్రాంగం ప్రతీక్షణం అప్రమత్తంగా వ్యవహరించి రానున్న విపత్తును సమర్థంగా ఎదుర్కోవాలని ఆదేశాలిచ్చారు. గుంటూరు, తెనాలి ఆర్డీవో కార్యాలయాలతో పాటు కలెక్టర్ కార్యాలయంలోనూ ప్రత్యేక కంట్రోల్‌రూమ్‌లు ఏర్పాటు చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేశారు. ఆరు ప్రభావిత మండలాలు... జిల్లాలో ముఖ్యంగా బాపట్ల, కర్లపాలెం, పిట్టలవానిపాలెం, నిజాంపట్నం, నగరం, రేపల్లెను ఫైలిన్ తుపాను ప్రభావిత మండలాలుగా అధికారులు గుర్తించారు. ఆయా మండలాల్లోని తహశీల్దార్లు అప్రమత్తంగా ఉంటూ వీఆర్వోల సాయంతో తీరప్రాంతం వెంబడి పహారా నిర్వహించాలని కలెక్టర్ ప్రత్యేక ఆదేశాలిచ్చారు. బాపట్ల మండలంలోని సూర్యలంక, అడవిపల్లిపాలెం, కొత్త ఓడరేవు, దాన్వాయ్‌పేట గ్రామాల ప్రజలను అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. జిల్లా వైద్య,ఆరోగ్యశాఖ సిబ్బంది వైద్యశిబిరాలు ఏర్పాటు చేశారు. భారీ వర్షాలకు ఇప్పటికే బాపట్ల నియోజకవర్గంలో సుమారు 12 వేల ఎకరాల్లో వరి పంట నీట మునిగినట్లు స్థానిక అధికారులు అంచనా వేశారు. తీరప్రాంతాన్ని పరిశీలించిన అధికార యంత్రాంగం బాపట్లటౌన్: బాపట్ల డీఎస్పీ తన సిబ్బందితో కలసి గురువారం సూర్యలంక సముద్రతీరాన్ని పరిశీలించారు.మత్స్యకారులన బోట్లు, వలలు, సురక్షిత ప్రాంతాలకు తరలించుకోవాలని సూచించారు. రాత్రి సమయంలో వేటకు వెళ్లొద్దన్నారు. బాపట్ల డివిజన్ పరిధిలోని బాపట్ల, కర్లపాలెం, పిట్టలవానిపాలెం, రేపల్లె, నిజాంపట్నం, నగరం మండలాల పరిధిలో 28 తీరప్రాంత గ్రామాల్లో ప్రత్యేక బృందాలను నియమించడం జరిగిందన్నారు. కంట్రోల్ రూమ్ 08643-224310 నంబర్, డయల్ 100 లకు సమాచారం అందిస్తే తక్షణమే సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరుగుతుందన్నారు. ముఖ్యంగా బాపట్ల మండలం సూర్యలంక, అడవిపల్లిపాలెం, కృపానగర్, దాన్వాయ్‌పేట, రామచంద్రాపురం, రేపల్లెలో లంకెవానిదిబ్బ, పెసర్లంక, నిజాంపట్నంలలో ప్రత్యేక టీమ్‌లను కూడా నియమించామన్నారు. భారీ వర్షాల కారణంగా ఎక్కడైనా డ్రెయిన్లు, కాలువలకు గండ్లు పడినా వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. డిఎస్పీ వెంట సీఐ మల్లికార్జునరావు, రూరల్ ఎస్ఐ కోటేశ్వరరావు తదితరులున్నారు. అప్రమత్తమైన వైద్యాధికారులు ... అవసరమైతే తీరప్రాంత గ్రామాల్లో వైద్య సేవలు అందించేందుకు అప్పికట్ల ప్రాథమిక ఆరోగ్యకేంద్ర వైద్యాధికారి డాక్టర్ కర్రెద్దుల అరవింద బాబు సమ్మె విరమించి విధుల్లో చేరారు. సూపర్వైజర్ వెంకటేశ్వరరావు, సిబ్బందితో కలిసి స్థానిక ముత్తాయపాలెం సబ్సెంటర్లో మందులను అందుబాటులో ఉంచారు. తుఫాన్ ప్రభావం తగ్గేంత వరకు 24 గంటల పాటు మెడికల్ సిబ్బంది అందుబాటులో ఉంటారన్నారు. రెండో నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ నిజాంపట్నం: ఫైలిన్ తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో నిజాంపట్నం హార్బర్లో రెండో నం బర్ ప్రమాద సూచికను ఎగురవేశారు. సముద్రంలో వేటకు వెళ్లిన బోట్లు గురువారం సాయ ంత్రం ఒడ్డుకు చేరుతున్నాయి. దాదాపు బోట్లన్నీ హార్బర్ ఒడ్డుకు చేరాయని ఒకటో, రెండో బోట్లు రావాల్సి ఉన్నాయని అవి అర్ధరాత్రికి వస్తాయని మత్య్సకారులు తెలుపుతున్నారు. కంట్రోల్‌రూమ్ నంబర్లు కలెక్టర్ కార్యాలయం: 0863-2234990 గుంటూరు ఆర్డీవో : 98499 04006 తెనాలి ఆర్డీవో : 08644-223800 నరసరావుపేట ఆర్డీవో: 08647-222039 గురజాల ఆర్డీవో : 89859 20005 -
తీరానికి పెనుముప్పు!
విశాఖకు700 కి.మీ. దూరంలో కేంద్రీకృతమైన ‘ఫైలిన్’ పెను తుపానుగా మారి మున్ముందుకు.. రేపు ఒడిశాకు సమీపంలో తీరం దాటే అవకాశం ‘సూపర్ సైక్లోన్’గా మారే అవకాశం అదే జరిగితే తీవ్ర విధ్వంసం తప్పదని ఆందోళన కృష్ణా, శ్రీకాకుళం, గుంటూరులో భారీ వర్షాలు కృష్ణాలో వాగుల్లో కొట్టుకుపోయి ఇద్దరి మృతి సాక్షి నెట్వర్క్: ఫైలిన్ ముంచుకొస్తోంది. పెను తుపానుగా మారింది. ప్రస్తుతం విశాఖ తీరానికి 700 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. రెండ్రోజుల క్రితం బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ తుపాను గురువారం రాత్రికల్లా పెను తుపానుగా మారినట్లు విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు. తూర్పు ఆగ్నేయ దిశగా పయణించి శనివారం నాటికి ఒడిశా-కళింగపట్నం-గోపాలపూర్ ప్రాంతాల్లో తుపాను తీరం దాటే అవకాశం ఉందని వివరించారు. అల్పపీడన ద్రోణి కూడా కొనసాగుతున్న కారణంగా రానున్న 24 గంటల్లో ఉత్తర కోస్తాంధ్రలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. శుక్రవారం ఉదయం నుంచి కోస్తా అంతటా భారీగా ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లొద్దని సూచించారు. ఫైలిన్ తుపాను ‘సూపర్ సైక్లోన్’గా మారే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇదే జరిగితే గంటకు 175 నుంచి 185 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తాయి. ఆస్తుల ధ్వంసం తప్పదు. సముద్రం ముందుకు వస్తుంది. 20, 30 అడుగుల వరకు అలలు ఎగిసిపడతాయి. విద్యుత్, సమాచార వ్యవస్థ దెబ్బతింటుంది. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయి. ప్రస్తుత తుపాను ఒడిశాకు సమీపంలో తీరం దాటొచ్చని, భారీ నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని అధికారులు అంచనా వేశారు. తుపాను ప్రభావం ఆంధ్రప్రదేశ్ కంటే ఒడిశా పైనే ఎక్కువగా ప్రభావం చూపే అవకాశం ఉందంటున్నారు. సాధారణంగా అక్టోబర్‌లో ఏర్పడే తుపాన్లకు అధిక ప్రభావం ఉంటుంది. 1950కి పూర్వం దసరాకు ముందు ఏటా అధికంగా తుపాన్లు ఏర్పడేవని వాతావరణ శాఖ మాజీ అధికారి ఆర్.మురళీకృష్ణ చెప్పారు. మూడు జిల్లాల్లో భారీ వర్షాలు ఫైలిన్ తుపాను ప్రభావంతో కృష్ణా, శ్రీకాకుళం, గుంటూరు జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి. పశ్చిమ కృష్ణాలోని వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. వాగుల్లో పడి జిల్లాలో ముగ్గురు మృతిచెందారు. ఆగిరిపల్లి మండలం కుంపిణీ వాగులో ఇద్దరు బాలికలు కరేటి శైలజ (15), నక్కనబోయిన పావని (14) గల్లంతు కాగా వారిలో శైలజ మృతదేహం లభించింది. కంభంపాటి శాంతమ్మ (46) అనే మహిళ తన పుట్టిల్లయిన ముసునూరు మండలంలోని యల్లాపురానికి వస్తుండగా.. తమ్మిలేటి కొట్టుకుపోయి మృతి చెందింది. మైలవరంలోని కొండవాగు, బుడమేరు, పోతులవాగు, నందిగామ సమీపంలోని మునేరు వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. గుంటూరు జిల్లా బాపట్ల నియోజకవర్గంలో సుమారు 12 వేల ఎకరాలు వరి పంట మునిగిపోయినట్లు అధికారులు అంచనా వేశారు. జిల్లాలోని పిన్నెల్లి గ్రామంలో బుధవారం రాత్రి పిడుగుపాటుకు గురై 120 గొర్రెలు మరణించాయి. నిజాంపట్నం ఓడరేవులో రెండో ప్రమాద హెచ్చరిక ఎగుర వేశారు. సూర్యలంక సమీపంలోని 28 లోతట్టు గ్రామాలను అప్రమత్తం చేశారు. శ్రీకాకుళం జిల్లాలోని తీర ప్రాంతంలో గురువారం సముద్రం ముందుకువచ్చింది. వజ్రపుకొత్తూరు మండలం దేవునల్తాడ నుంచి గుణుపల్లి వరకు బలమైన గాలులు వీయడంతో మంచినీళ్లపేట వద్ద సముద్రం 60 మీటర్ల ముందుకు వ చ్చింది. దీంతో సుమారు రూ.2 లక్షలు విలువైన ఫైబర్ బోటు ధ్వంసమైందని మత్స్యకారులు తెలిపారు. గార మండలం కళింగపట్నం, బందరువానిపేట గ్రామాల వద్ద సముద్రం 50 అడుగుల మేర ముందుకు వచ్చింది. ఇచ్ఛాపురం మండలం డొంకూరులో అలలు ఎగసి పడడంతో ఒక పడవ, వలలు కొట్టుకుపోయాయి. అధికారులతో సీఎం కిరణ్ సమీక్ష ఫైలిన్ తుపాను నేపథ్యంలో ఎక్కడా ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. తుపాను పరిస్థితిపై గురువారం ఆయన రెవెన్యూ మంత్రి రఘువీరారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పీకే మహంతి, ఇతర ఉన్నతాధికారులతో సమీక్షించారు. లోతట్టు ప్రాంతాలవారిని ముందుగానే సురక్షిత ప్రాంతాలకు తరలించి పునరావాస కేంద్రాల్లో విద్యుత్తు, తాగునీరు, ఆహారం తదితర సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో నిత్యావసర సరుకులు, కిరోసిన్, మంచినీరు ప్యాకెట్లు సిద్ధంగా ఉంచుకోవాలని కోరారు. వైద్య సిబ్బందిని కూడా అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. వర్షం పడిన ప్రాంతాలివే బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం వరకు విజయవాడ, నర్సాపురం, ఎస్కోటలలో 8 సెం.మీ, గుడివాడ, కోడూరులలో 7, చోడవరం, రెంటచింతల, తెర్లాం, నందిగామ, మచిలీపట్నం, బాపట్ల ప్రాంతాల్లో 6 సెం.మీ. చొప్పున వర్షం కురిసింది. చిత్తూరు, శ్రీశైలం, పలమనేరు ప్రాంతాల్లో ఒక్కో సెం.మీ చొప్పున వాన పడింది. ఇల్లెందు, హైదరాబాద్‌ల్లో 10 సెం.మీ, భద్రాచలం, దుబ్బాక, మేడ్చల్, చేవెళ్ల, మధిర, హకీంపేట ప్రాంతాల్లో 7 సెం.మీ, భీంగల్, వనపర్తి, ఖాన్పూర్, గోల్కొండ ప్రాంతాల్లో 6 సెం.మీ చొప్పున వర్షం పడింది. ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలతోపాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో రానున్న 48 గంటల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణశాఖ విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొంది. కలెక్టర్లతో సీఎస్ వీడియో కాన్ఫరెన్స్ ఫైలిన్ తుపాను నేపథ్యంలో కోస్తాలోని తొమ్మిది జిల్లాల కలెక్టర్లతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) పీకే మహంతి గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. లోతట్టు ప్రాంతాలవారిని పునరావాస కేంద్రాలకు శుక్రవారం తరలించాలని ఆదేశించారు. -
ఫైలిన్ తుపాన్ కంట్రోలు రూం నెంబర్లు
విశాఖ : ఫైలిన్ తుపాను ప్రభావిత జిల్లాల్లో ప్రభుత్వం కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేసింది. ఆయా జిల్లాల కలెక్టర్లు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. శనివారానికి తుపాను తీరాన్ని దాటే అవకాశం ఉంది. దాంతో అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్లు ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదని ఆదేశాలు జారీ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు కలెక్టరేట్లో కంట్రోల్ రూం ఏర్పాటు. టోల్ ఫ్రీ నం. 08812 230617 తూర్పు గోదావరి జిల్లా అమలాపురం ఆర్డీవో కార్యాలయంలో తుఫాన్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు. టోల్ ఫ్రీ నంబర్లు- 08856 2 33100 గుంటూరు జిల్లా తెనాలి కంట్రోల్ రూమ్ నెంబరు- 08644 223800 నెల్లూరు కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు....నంబర్లు: 1800 425 2499, 08612 331477 శ్రీకాకుళం కలెక్టరేట్లో కంట్రోల్ రూం ఏర్పాటు .....టోల్ ఫ్రీ నంబర్లు-08942 240557, 9652838191 ప్రకాశం కలెక్టరేట్ కార్యాలయంలో కంట్రోల్ రూం ఏర్పాటు... టోల్ ఫ్రీ నంబర్లు: 08592 281400 -
స్థిరంగా కొనసాగుతున్న ఫైలిన్ తుపాన్
విశాఖ : తూర్పు మధ్య బంగాళాఖాతం ఏర్పడ్డ పైలిన్ తుపాను స్థిరంగా కొనసాగుతోంది. ఈనెల 12న కళింగపట్నం వద్ద తుపాను తీరం దాటే అవకాశం ఉంది. కళింగపట్నానికి తూర్పు ఆగ్నేయ దిశగా 190 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. రాగల 12 గంటల్లో తీవ్ర తుపానుగా మారే ప్రమాదమున్నట్లు విశాఖ వాతావరణ కేంద్రం ప్రకటించింది. కోస్తా తీరంలోని అన్ని ప్రధాన ఓడరేవుల్లో రెండో నెంబరు ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఉత్తర కోస్తా, ఒరిస్సావరకు వేటకు వెళ్లిన మత్స్యకారులంతా వెనక్కి రావాలని హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు వాతావరణ శాఖ 9 జిల్లాలకు తుపాను హెచ్చరిక చేసిన నేపధ్యంలో ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాలలో తుఫాను ప్రభావం ఎక్కువగా ఉంది. తుపాను తీరాన్ని దాటే సమయంలో 180 నుంచి 200 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంటుదని చెప్పారు. కాగా తుపాను తీవ్రరూపం దాల్చిన నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తం అయ్యింది. అమలాపురం ఆర్డీవో కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ కూడా తుపాను ప్రభావంపై సమీక్ష జరిపారు. -
ఫైలిన్ తుపాను ముంచుకొస్తోంది
-
తరుముకొస్తున్న తుఫాన్
శ్రీకాకుళం కలెక్టరేట్, న్యూస్‌లైన్: జిల్లాకు పెను తుపాను ముప్పు పొంచి ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుపానుగా.. ఆనక పెను తుపానుగా మారి శ్రీకాకుళం, ఒడిశా తీరం వైపు శరవేగంగా దూసుకొస్తుండటంతో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. సమైక్య సమ్మెలో ఉన్న వివిధ ప్రభుత్వ శాఖల ఉద్యోగులు సమ్మెలో కొనసాగుతూనే తుపాను సహాయ, పునరావాస చర్యల్లో పాల్గొనేందుకు ముందుకు వచ్చారు. ప్రస్తుతం అండమాన్ సమీపంలో కేంద్రీకృతమై ఉన్న పైలీన్ తుపాను ఉత్తర కోస్తా వైపు కదులుతోంది. ఇది ఈ నెల 12 నాటికి కళింగపట్నం, పారాదీప్‌ల మధ్య తీరం దాటే అవకాశం ఉందని.. దీని ప్రభావంతో జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని, పెనుగాలులు వీస్తాయని వాతావరణ విభాగం, విపత్తు నివారణ శాఖ అధికారులు హెచ్చరించడంతో జిల్లా యంత్రాంగం ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. ఉద్యోగులందరూ సమ్మెలో ఉండటంతో ముందుగా వారిని విధుల్లో చేరే లా ఒప్పించేందుకు కలెక్టర్ సౌరభ్ గౌర్ ఆయా శాఖల జేఏసీల ప్రతినిధులను కోరారు. సమ్మెలో కొనసాగుతూనే సహాయ చర్యల్లో పాల్గొంటామని వారు కలెక్టర్‌కు హామీ ఇచ్చా రు. జిల్లాలోని 11 సముద్ర తీర మండలాలతోపాటు వంశధార, నాగావళి తీర గ్రామాలను అప్రమత్తం చేయడంతోపాటు లోతట్టు ప్రాంతాల ప్రజలను తరలించే విషయంలోనూ సహకరిస్తామని పేర్కొన్నారు. అత్యవసర సమయాల్లో సమాచారం అందజేసేందుకు కలెక్టరేట్లో కంట్రోల్ రూం ఏర్పాటు చేస్తున్నామని కలెక్టర్ ఈ సందర్భంగా వెల్లడించారు. ఉన్నతాధికారులతో సమీక్ష తుపాను పరిస్థితి, తీసుకోవాల్సిన ముందు జాగ్రత్త చర్యలపై బుధవారం సాయంత్రం ఉన్నతాధికారులతో కలెక్టర్ సమీక్షించారు. పరిస్థితి తీవ్రంగా ఉండే అవకాశమున్నందున అధికారులందరూ అప్రమత్తంగా ఉండి, ఎప్పటికప్పుడు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే గురువారం ఉదయం 10 గంటలతో అన్ని శాఖల అధికారులతో విస్తృత సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ చెప్పారు. తీర మండలాల అధికారులతో సెట్ కాన్ఫరెన్స్ కూడా నిర్వహిస్తామన్నారు. ఈ సమావేశంలో అదనపు జాయింట్ కలెక్టర్ ఆర్.ఎస్. రాజకుమార్, జిల్లా రెవెన్యూ అధికారి నూర్‌భాషాఖాసీం, రెవెన్యూ డివిజనల్ అధికారులు జి.గణేష్‌కుమార్, వి. విశ్వేశ్వరరావు, బి.దయానిధి, నీటిపారుదల, పంచాయతీరాజ్, ఈపీడీసీఎల్ పర్యవేక్షక ఇంజినీర్లు బి.రాంబాబు, బి.వి.ఎస్.చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. మత్స్యకారుల వేటకు వెళ్లరాదు సముద్రం అల్లకల్లోలంగా ఉండే అవకాశం ఉన్నందున సముద్రంలో వేటకు వెళ్లరాదని మత్స్యకారులకు సూచించారు. పురపాలక సంఘాలు, గ్రామాల్లోనూ పారిశుద్ధ్యంపై తగు చర్యలు చేపట్టాలని జిల్లా పంచాయతీ అధికారి, పురపాలక సంఘాల కమిషనర్లను కలెక్టర్ ఆదేశించారు. జనరేటర్లు, ఇతర అత్యవసర సామగ్రి సిద్ధంగా ఉంచాలని సూచించారు. విద్యుత్తు వ్యవస్థ, రహదారులు దెబ్బతింటే వెంటనే పునరుద్ధరించేందుకు అవసరమైన ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. వరద ప్రమాదం ఉన్న ప్రాంతాల ప్రజలను తరలించేందుకు తుపాను షెల్టర్లు, సహాయ పునరావాస కేంద్రాలను సిద్ధం చేయాలని ఆర్డీవోలను ఆదేశించారు. కిరోసిన్, గ్యాస్, పెట్రోల్, ఆహార పదార్థాల నిల్వలు తగినంతగా అందుబాటులో ఉంచే బాధ్యతను ఆయా మండలాల డీలర్లకు అప్పగించారు. జిల్లా అంతటా భారీ వర్షాలు శ్రీకాకుళం, న్యూస్‌లైన్: తుపాను ప్రభావం అప్పుడే జిల్లాపై పడింది. బుధవారం సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. శ్రీకాకుళం పట్టణంతోపాటు జిల్లావ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గాలుల తీవ్రత కూడా పెరిగింది. ఫలితంగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఉదయం పోయిన కరెంటు రాత్రి 7 గంటలకు వచ్చింది. గంట వ్యవధిలోనే గాలుల తాకిడికి మళ్లీ పోవడంతో పట్టణాలు, గ్రామాలు అంధకారంలో చిక్కుకున్నాయి. ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు కురవడంతో జనం భయాందోళనకు గురయ్యారు. కంట్రోల్ రూమ్ ఫోన్ నంబర్లు : 08942-240557, 9652838191 -
పొంచి ఉన్న ఫైలిన్
విజయనగరం కలెక్టరేట్, న్యూస్‌లైన్: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం బుధవారం నాటికి తీవ్ర వాయుగుండంగా మారింది. ఇది తూర్పు ఆగ్నేయ దిశగా పయనించి రానున్న 12 గంటల్లో తుపానుగా మారే అవకాశం ఉంది. దీనికి ఫైలిన్ అని నామకరణం చేశారు. ఇప్పటికే అండమాన్ దాటేసిన వాయుగుండం పశ్చిమ వాయవ్య దిశగా కొనసాగుతోంది. ఈ ప్రభావం వల్ల జిల్లాలో భారీ వర్షాలు పడనున్నాయి. బుధవారం నుంచే తీర ప్రాంతంలో గంటకు 60 నుంచి 70 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచాయి. ఈ మేరకు మత్స్యకారులతో పాటు లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ప్రస్తుతం విశాఖ తీరానికి 1100 మీటర్ల దూరంలో అల్పపీడన ద్రోణి ఉన్నట్టు హేమరేడియో ఇన్చార్జ్ అరుణ్‌కుమార్ తెలిపారు. బుధవారం రాత్రి గంటకు 60 నుంచి 70 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలు వీచాయి. 10వ తేదీన 75 నుంచి 85, 11న 115 నుంచి 155, 12న నుంచి 180 నుంచి కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. 13, 14 తేదీల్లో ఈదురుగాలులు తగ్గే అవకాశముందని చెబుతున్నారు. తుపాను తీరం దాటే సమయంలో గంటకు 180 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయడంతో పాటు భారీ వర్షాలు కురిసే అవకాశముందని అధికారులు తెలిపారు. ఈ మేరకు జిల్లాలోని తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండడంతో పాటు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మరో 12 గంటలు గడిస్తే పూర్తి వివరాలు వెల్లడవుతాయని అధికారులు చెబుతున్నారు. తీవ్రంగా వీచే గాలుల వల్ల పూరిపాకలు, విద్యుత్ స్తంభాలు కూలే ప్రమాదముందని అధికారులు హెచ్చరిం చారు. తుపాను శ్రీకాకుళం జిల్లా కళింగపట్నం, ఒడిశాలోని పారాదీప్ వద్ద తీరం దాటే అవకాశం ఉంది. మత్స్యకారులూ బహుపరాక్ పూసపాటిరేగ: తీరప్రాంతంలో ఉన్న ప్రజలు, మత్స్యకారులు అప్రమత్తంగా వుండాలని తహశీల్దార్ వి.పద్మావతి హెచ్చరించారు. చింతపల్లి, పతివాడ బర్రిపేట , తిప్పలవలస ,కోనాడ గ్రామాలతో పాటు భోగాపురం మండలాల్లో ఉన్న తీర ప్రాంతగ్రామాలలో మత్స్యకార్లు అప్రమత్తంగా వుండాలను సూచించారు. సముద్రంలోకి వేటకు వెళ్లరాదని పేర్కొన్నారు. సూచించారు. -
వణికిస్తున్న ‘ఫైలిన్’
సాక్షి, కాకినాడ : అండమాన్ నికోబార్ దీవుల సమీపంలో బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ‘ఫైలిన్’ పెనుతుపానుగా మారుతుండడంతో జిల్లాలో తీర ప్రాంత ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. 1996 తుపాను మాదిరిగానే విధ్వంసం సృష్టించే సూచనలు కనిపిస్తుండడంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటున్నారు. కాగా తుపాను హెచ్చరికతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. కలెక్టర్ నీతూప్రసాద్ యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టారు. గత 58 రోజులుగా సమ్మెలో ఉన్న రెవెన్యూ ఉద్యోగులతో పాటు ఇరిగేషన్, పంచాయతీరాజ్, ఆర్ అండ్ బీ, వ్యవసాయ, ఆర్డబ్ల్యూఎస్, మత్స్య, ఏపీ ట్రాన్స్‌కో శాఖల సిబ్బందితో పాటు మండల ప్రత్యేకాధికారులను కూడా అప్రమత్తం చేశారు. సమ్మెను కొనసాగిస్తూనే తుపాను పునరావాస చర్యల్లో పాల్గొనాలని, ఇతర విధుల్లో పాల్గొనరాదని రెవెన్యూ ఉద్యోగుల అసోసియేషన్ సమావేశం నిర్ణయించింది. కలెక్టరేట్‌తో పాటు ఆర్డీఓ, తహశీల్దార్ల కార్యాలయాల్లో ప్రత్యేక కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశారు. కలెక్టరేట్లో 0884-2365506, టోల్ ఫ్రీ నం : 1077, అమలాపురం ఆర్డీఓ కార్యాలయంలో 08856- 233100 నంబర్లతో కంట్రోల్‌రూమ్‌లు పని చేయనున్నాయి. సమ్మెలో ఉన్న తీరప్రాంత తహశీల్దార్లు హుటాహుటిన కార్యాలయాలకు వెళ్లారు. భారీ వర్షాలు, బలమైన ఈదురు గాలులకు అవకాశం ఒడిశా తీరంలోని కళింగపట్నం-పరదీప్ల మధ్య ఈ నెల 12వ తేదీ అర్ధరాత్రి తుపాను తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ హెచ్చరికల కేంద్రం అంచనా వేసింది. తీరం దాటే వరకు ఒక మోస్తరు నుంచి 25 సెంటీమీటర్ల వరకు భారీ, అతి భారీ వర్షాలు కురుస్తాయని ఇప్పటికే సంబంధిత శాఖాధికారుల నుంచి హెచ్చరికలు జారీ అయ్యాయి. రానున్న మూడు రోజులు తీరంలో 175 నుంచి 185 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని, దీంతో మత్స్యకారులెవ్వరూ సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని కలెక్టర్ నీతూప్రసాద్ హెచ్చరించారు. ఇప్పటికే తీరంలో మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. వీఆర్వోలు, పంచాయతీ కార్యదర్శులు ప్రధాన కార్యస్థానాల్లో ఉండి ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెలపాలని కలెక్టర్ ఆదేశించారు. అధికారులు ముందస్తు సమాచారం లేకుండా పనిచేసే ప్రాంతం విడిచి వెళ్లవద్దన్నారు. కాగా తుపాను పునరావాస చర్యలను పర్యవేక్షించేందుకు జిల్లాకు ప్రత్యేకాధికారిగా ఎం.రవిచంద్రను నియమించారు. -
తీరంలో అలజడి.. తీరప్రాంతవాసుల్లో ఆందోళన
బాపట్ల టౌన్, న్యూస్‌లైన్ : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో సూర్యలంక సముద్రతీరం అల్లకల్లోలంగా మారింది. బుధవారం సాయంత్రానికి అలల ఉధృతి పెరగడంతోపాటు 70 మీటర్ల మేర సముద్రం ముందుకురావడంతో తీరప్రాంతవాసుల్లో ఆందోళన నెలకొంది. అల్పపీడనం కారణంగా కోస్తాప్రాంతాల్లో తుపాను వచ్చే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖాధికారులు సూచించడం.. రాత్రి భారీ వర్షం కురవడం, సముద్రంలోని అలలు ఒక్కసారిగా ఎగిసిపడడాన్ని గమనించిన తీరప్రాంతవాసులు ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని భయబ్రాంతులకు లోనవుతున్నారు. తీరప్రాంతవాసుల్లో ఆందోళన గంగమ్మను నమ్ముకొని జీవనం సాగించే గంగపుత్రులు సముద్రంలో మార్పులు వచ్చాయంటే కలవరపడుతున్నారు. గతంలో వచ్చిన లైలా, జల్, థానె, నీలం తుపానులు మత్స్యకారులను కొలుకోలేని దెబ్బతీశాయి. దీంతో సముద్రంలో ఎప్పుడు మార్పులు వచ్చినా మత్స్యకార కుటుంబాల్లో కలవరం మొదలవుతోంది. నాలుగునెలలుగా వేట సాగక.. తీరం వెంబడి పడవలను నిలుపుదల చేసిన మత్స్యకారులు హుటాహుటిన చేరుకొని పడవలు, వలలను మెరకప్రాంతాలకు తరలించే పనిలో నిమగ్నమయ్యారు. రాత్రికి బాపట్ల తహశీల్దార్ జీవీ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో ఆర్ఐ, వీఆర్వోల బృందం సూర్యలంక తీరం వద్ద పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. తీరంలో వేటకు వెళ్లొద్దు.. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా సూర్యలంక సముద్రతీరం అల్లకల్లోలంగా మారింది. గాలితీవ్రత ఎక్కువగా ఉండడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. రెండురోజుల క్రితం వేటకు వెళ్లిన మత్స్యకారులను కూడా వాళ్ల బంధువుల ద్వారా సమాచారం అందించి వెనక్కి రావాల్సిందిగా సూచించాం. సముద్రం యథాస్థితికి వచ్చేంతవరకు ఎవరూ వేటకు వెళ్లవద్దు. ప్రస్తుతానికి తీరప్రాంత గ్రామాలకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఇబ్బందికర పరిస్థితి ఏర్పడితే వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించేవిధంగా చర్యలు తీసుకుంటాం. -ఉషాకిరణ్, ఎఫ్‌డీవో మత్స్యకారులకు సమాచారం ఇచ్చాం.. వాతావరణంలో మార్పుల వల్ల సముద్రంలో అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. మరబోటులతో వేటకు వెళ్లిన 25మంది మత్స్యకారులకు ఫోన్‌ద్వారా సమాచారం అందజేశాం. వాళ్లు కూడా బయటకు వస్తున్నారు. తీరం ఒడ్డున ఉన్న పడవలు మొత్తం మెరక ప్రాంతాలకు తరలించుకుంటున్నాం. సముద్ర తీవ్రతకు తోడు గాలి కూడా వేగంగా వీస్తోంది. -కొక్కిలిగడ్డ వెంకటస్వామి, మత్స్యకారసంఘ యూనియన్ నాయకుడు, ఆదర్శనగర్ వేటకు వారం ఆగాల్సిందే.. సముద్రంలో అల్లకల్లోలం చూస్తుంటే ఇప్పట్లో వేటకు పరిస్థితులు కనిపించడం లేదు. సముద్రం అతలాకుతలంగా ఉంది. ఈదురుగాలులతో వాతావరణం చల్లబడింది. ఈ పరిస్థితుల్లో సముద్రం శాంతించినా మరో వారంపాటు వేటకు వెళ్లే పరిస్థితి కనిపించడం లేదు. -నాగేశ్వరరావు, మత్స్యకారుడు, కృపానగర్ -
ఫైలిన్ తుపాను ముంచుకొస్తోంది
ఆరు ఓడరేవుల్లో రెండో ప్రమాద హెచ్చరిక జారీ హెలికాప్టర్లు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచాలని ఆదేశం సాక్షి, హైదరాబాద్/విశాఖపట్నం : తూర్పు మధ్య బంగాళాఖాతంలో బుధవారం సాయంత్రం తుపాను ఏర్పడింది. దీనికి ‘ఫైలిన్’గా వాతావరణశాఖ నామకరణం చేసింది. ఇది మరింత బలపడి పశ్చిమ వాయవ్య దిశగా పయనించి ఈనెల 12వ తేదీ నాటికి కళింగపట్నం, పారాదీప్ మధ్య తీరం దాటే అవకాశం ఉంది. ప్రస్తుతం విశాఖ తీరానికి సుమారు 1100కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉన్న ఈ తుపాను మరింత చేరువకు వచ్చే అవకాశం ఉంది. దీంతో ఇప్పటికే సముద్రంలో వేటకు వెళ్లే మత్స్యకారుల్ని వెనక్కు వచ్చేయాలని అధికారులు సూచించారు. తుపాను నేపథ్యంలో విశాఖపట్నం, మచిలీపట్నం, కృష్ణపట్నం, నిజాంపట్నం, కాకినాడ, గంగవరం ఓడరేవుల్లో రెండవ నెంబర్ ప్రమాద హెచ్చరికలతో పాటు సెక్షన్ 3 హెచ్చరికలను కూడా జారీ చేశారు. ఇదే సమయంలో విదర్భ నుంచి దక్షిణ తమిళనాడు వరకు దక్షిణ కోస్తాంధ్ర మీదుగా అల్పపీడన ద్రోణి కూడా కొనసాగుతోంది. వీటన్నింటి కారణంగా రానున్న 24గంటల్లో ఉత్తర/దక్షిణ కోస్తాంధ్ర ప్రాంతాల్లో ఒకటి రెండుచోట్ల ఉరుములతో కూడిన వర్షాలు, మరికొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు. తుపాను అతి తీవ్ర తుపానుగాను, పెను తుపానుగానూ మారే అవకాశాలున్నాయని, గురువారం ఉదయం నాటికి కొంత స్పష్టత రావచ్చని చెప్పారు. నైరుతి రుతుపవనాల అనంతరం ఏర్పడిన ఈ తొలి తుపానువల్ల ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీగా వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ మాజీ అధికారి ఆర్. మురళీకృష్ణ తెలిపారు. వర్షాలు పడిన ప్రాంతాలివే : రాష్ట్రంలో మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు కోస్తాంధ్రలోని పొదిలిలో 5 సెం.మీ, మాచర్ల, కందుకూరులలో 4, భీమిలి, గుడివాడలలో 3 సెం.మీ చొప్పున వర్షం పడింది. రాయలసీమలో బద్వేల్, పలమనేరులలో 5 సెం.మీ, కమలాపురం, ఉటుకూరు, ఆళ్లగడ్డలలో 4, తిరుపతి, కుప్పంలలో 3 సెం.మీ చొప్పున వాన కురిసింది. తెలంగాణలోని వికారాబాద్‌లో 7 సెం.మీ, కొల్లాపూర్‌లో 5, పరిగి, చేవెళ్లలలో 4, మహబూబాబాద్, సంగారెడ్డి, షాద్‌నగర్, కల్వకుర్తి, నల్గొండ ప్రాంతాల్లో 3 సెం.మీ చొప్పున వ ర్షం పడింది. గురువారం రాత్రిలోపు కోస్తాంధ్ర, తెలంగాణ ప్రాంతాల్లో ఓ మోస్తరు జల్లులు, రాయలసీమలోని కొన్ని చోట్ల ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. ఆకాశం మేఘావృతమై ఉంటుందని, గరిష్ట/కనిష్ట ఉష్ణోగ్రతలు కొన్ని ప్రాంతాల్లో 33, 23 డిగ్రీలు న మోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణశాఖ విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొంది. పిడుగుపాటుకు ఇద్దరు మృతి పిడుగుపాటుకు విశాఖ జిల్లా ఎస్. రాయవరం మండలంలో ఒకరు, పెదబయలు మండలంలో మరొకరు మృత్యువాత పడ్డారు. కాగా, ఖమ్మం జిల్లా టేకులపల్లి మండలం ఎర్రాయిపాలెం గ్రామంలో పిడుగుపాటు శబ్దానికి ఇద్దరు మహిళలు, ముగ్గురు బాలికలు అస్వస్థతకు గురయ్యారు. వారిని కొత్తగూడెం ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వేల బస్తాల మొక్క జొన్న వర్షార్పణం రెండు రోజులపాటు కురిసిన భారీవర్షానికి మహబూబ్‌నగర్ జిల్లాలోని పలు వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో మొక్క జొన్న తడిసిపోయి రైతులకు తీవ్రనష్టం వాటిల్లింది. వనపర్తి మార్కెట్ యార్డులో 20వేల బస్తాల మొక్కజొన్న తడిసిపోయింది. నవాబ్‌పేట మార్కెట్ యార్డులో 12వేల బస్తాలకు నష్టం వాటిల్లింది. దీంతో రూ. 50 లక్షలకు పైగా నష్టం వాటిల్లినట్లు అధికారులు చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 6.2లక్షల హెక్టార్లలో సాగవుతున్న మొక్కజొన్నకు వర్షాలవల్ల భారీగా నష్టం వచ్చే అవకాశముందని అంచనా వేస్తున్నారు. పత్తికి కూడా ప్రమాదం పొంచి వుందని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. 70 మీటర్లు ముందుకు వచ్చిన సముద్రం తుపాను ప్రభావంతో గుంటూరు జిల్లాలోని సూర్యలంక సముద్రతీరం బుధవారం అల్లకల్లోలంగా మారింది. ఆలల ఉధృతితో పాటు సముద్రం దాదాపు 70 మీటర్లు ముందుకు రావడంతో తీరప్రాంత వాసులు ఆందోళన చెందుతున్నారు. కాగా, గుంటూరు జిల్లా దుర్గి మండలం గజాపురం తండాలో మంగళవారం రాత్రి 15 సెకన్ల పాటు వీచిన బలమైన గాలులకు చెట్లు, విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు, స్తంభాలు, పత్తిపైరు నేలకొరిగాయి. కంట్రోల్ రూమ్ ఏర్పాటు.. రాష్ట్ర ప్రకృతి విపత్తుల నివారణ శాఖ ఆధ్వర్యంలో సచివాలయంలో 24 గంటలపాటు పనిచేసే కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు అధికారులు వివరించారు. 040-23456005/23451034 ఫోన్‌నంబర్లు, ఫ్యాక్స్ 040-23451819కు సమాచారం తెలపవచ్చన్నారు. అన్ని జిల్లాల్లోనూ కంట్రోల్ రూములు ఏర్పాటు చేయాలని ఆదేశించినట్లు వివరించారు. ఈ సమీక్షా సమావేశాల్లో మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, రఘువీరారెడ్డి, పితాని సత్యనారాయణ, కోండ్రు మురళి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి, ప్రకృతి విపత్తుల నివారణ శాఖ కమిషనర్ రాధా, రెవెన్యూ శాఖ ముఖ్యకార్యదర్శి బీఆర్ మీనా, ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి సాంబశివరావు, నీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్శి అరవిందరెడ్డి, సివిల్ సప్లయ్స్ కార్పొరేషన్ ఎండీ అనిల్‌కుమార్ ఇతర శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. ప్రభుత్వం అప్రమత్తం రాష్ట్రానికి తుపాను ముప్పు ముంచుకొస్తున్న తరుణంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. కోస్తా జిల్లాల కలెక్టర్లను ముందుస్తుగా అన్ని ఏర్పాట్లుచేయాలని ఆదేశించింది. ఉత్తరకోస్తాలోని మూడు జిల్లాల్లో తీవ్ర ప్రభావం, మిగిలిన ఆరు కోస్తా జిల్లాల్లో ఓ మోస్తరు ప్రభావం పడనున్న నేపథ్యంలో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి సహచర మంత్రులతో కలిసి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి.కె. మహంతితోపాటు వివిధ శాఖల ఉన్నతాధికారులతో ముందస్తు ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. జాతీయ ప్రకృతి విపత్తుల నివారణ బృందాలు, ఆర్మీ, నేవీ, కోస్ట్‌గార్డ్, అగ్నిమాపక సిబ్బంది సేవలను వినియోగించుకోవాలని జిల్లాల కలెక్టర్లను ఆదేశించడంతోపాటు, పర్యవేక్షణకు సీనియర్ అధికారులను ప్రత్యేకంగా నియమించారు. ప్రభుత్వ ఉద్యోగులంతా సమ్మె విరమించి విధుల్లో చేరాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.