సిక్కోలులో 4లక్షల మందిపై పై-లిన్ ప్రభావం | 4 lakh people Impacted by Cyclone Phailin in srikakulam district alone | Sakshi
Sakshi News home page

సిక్కోలులో 4లక్షల మందిపై పై-లిన్ ప్రభావం

Published Fri, Oct 18 2013 2:51 PM | Last Updated on Fri, Sep 1 2017 11:45 PM

4 lakh people Impacted by Cyclone Phailin in srikakulam district alone

శ్రీకాకుళం : శ్రీకాకుళం జిల్లాలో పై-లిన్ తుఫాన్ నాలుగు లక్షల మందిపై ప్రభావం చూపిందని జిల్లా కలక్టర్ సౌరభ్ గౌర్ ప్రకటించారు. పైలిన్ తుఫాన్ వెలిసిన వారం రోజుల తరువాత అధికార్లు నష్టం అంచనాలను ప్రకటించడం విశేషం. ఎక్కడా ప్రాణ నష్టం సంభవించకపోగా, ఎనభై నాలుగు పశువులు మృతి చెందాయన్నారు. 

382 ఇళ్లు పూర్తిగా, 800 వందల ఇళ్లు పాక్షికంగా , పన్నెండు వందల విద్యుత్ స్థంబాలు ధ్వంసం అయ్యాయన్నారు. 442 గ్రామాలు తుఫాన్ ధాటికి గురి అయ్యాయని, 9వేల హెక్టార్లలో పంట పొలాలు, 8 వేల హెక్టార్లలో ఇతర పంటలు నాశనం అయ్యాయని తెలిపారు. తుఫాన్ పునరావాస చర్యలు కొనసాగుతున్నాయన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement