పై-లీన్ తుపాన్ ప్రభావంతో బలమైన గాలులు, భారీ వర్షాల కారణంగా ఒడిశా రాష్ట్రం చిగురుటాకులా వణికింది. దాంతో గత రాత్రి ఏడుగురు వ్యక్తులు మృత్యువాత పడ్డారని ఒడిశా రెవెన్యూ శాఖ, విపత్తు నిర్వహాణ మంత్రి సూర్య నారాయణ పాత్రో ఆదివారం వెల్లడించారు. జనావాసాలపై చెట్లు కులడంతో వారంత మరణించారని తెలిపారు.
ఒడిశా తీర ప్రాంతంతో పాటు రాజధాని భువనేశ్వర్లో బలమైన గాలులు వీచడంతో వందలాది చెట్టు నెలమట్టమైనాయని చెప్పారు. తుపాన్ ప్రభావ ప్రాంతాల్లో సహాయ చర్యలు ముమ్మరం చేసినట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లన్ని జలమైనాయన్నారు.లోతట్టు ప్రాంతాల్లోని దాదాపు 10 లక్షల మంది ప్రజలకు సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు చెప్పారు. రోడ్డు, రవాణా, కమ్యూనికేషన్ వ్యవస్థలు పూర్తిగా దెబ్బతిన్నాయన్ని సూర్య నారాయణ పాత్రో తెలిపారు.