పై-లీన్ తుఫాన్తో ఒడిశా, ఉత్తరాంధ్రలోని జిల్లాలు చిగురుటాకులా వణికాయి. ఈ నేపథ్యంలో పలు రైళ్ల సర్వీసులను రద్దు చేస్తున్నట్లు ఈస్ట్ కోస్ట్ రైల్వే ఆదివారం విడుదల చేసిన ఓ ప్రకటనలో వెల్లడించింది.
బెంగళూరు-భువనేశ్వర్ (ప్రశాంతి ఎక్స్ప్రెస్), భువనేశ్వర్- యశ్వంత్పూర్, పూరి- చెన్నై,భువనేశ్వర్- తిరుపతి, భవనేశ్వర్- సికింద్రాబాద్, భువనేశ్వర్ - విశాఖ (ఇంటర్ సిటీ), భువనేశ్వర్-జగదల్పూర్ (హీరాఖండ్ ఎక్స్ప్రెస్), అహ్మదాబాద్ - పూరి, ముంబై - భువనేశ్వర్, పూరి- తిరుపతి, గౌహతి- చెన్నై (ఎగ్మోర్ ఎక్స్ప్రెస్) తదిరత ఎక్స్ప్రెస్ రైళ్లు రద్దు చేసినట్లు తెలిపింది.
అలాగే విశాఖ - మచిలీపట్నం, విశాఖ - రాజమండ్రి, పలాస - విశాఖ, పూరి - గుణుపూర్, పలాస - గుణుపూర్, విజయనగరం - విశాఖ, విజయవాడ - రాయఘడ్ మధ్య నడిచే ప్యాసింజర్ రైళ్లను తాత్కాలికంగా నిలిపివేసినట్లు ప్రకటించింది.