prasanti express
-
గొల్లప్రోలు వద్ద నిలిచిపోయిన గోదావరి ఎక్స్‌ప్రెస్
పశ్చిమ గోదావరి జిల్లాలో భారీ వర్షాల కారణంగా రైల్వేట్రాక్‌పై వరద నీరు పొంగిపొర్లుతుంది. దాంతో జిల్లాలోని వివిధ స్టేషన్లలో పలు రైళ్లు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. తాడేపల్లిగూడెంలో ప్రశాంతి ఎక్స్‌ప్రెస్ దాదాపు రెండు గంటలుగా నిలిచిపోయింది. అలాగే తూర్పు గోదావరి జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో పిఠాపురం - సామర్లకోట పరిసర ప్రాంతాల్లోని రైల్వే ట్రాక్‌పైకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. దాంతో ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయని దక్షిణ మధ్య రైల్వే భావించింది. దాంతో రాజమండ్రి- విశాఖపట్నం మధ్య రైల్వే సర్వీసులను నిలిపివేసింది. దీంతో హైదరాబాద్ నుంచి విశాఖ పట్నం వెళ్లవలసిన గోదావరి ఎక్స్‌ప్రెస్ తూర్పుగోదావరి జిల్లాలోని గొల్లప్రోలు వద్ద నిలిపివేశారు. అలాగే మచిలీపట్నం - విశాఖపట్నం ప్యాసింజర్ రైలును బిక్కవోలు వద్ద అపివేశారు. -
'పై-లీన్'తో పలు ఎక్స్‌ప్రెస్, ప్యాసింజర్ రైళ్లు రద్దు
పై-లీన్ తుఫాన్‌తో ఒడిశా, ఉత్తరాంధ్రలోని జిల్లాలు చిగురుటాకులా వణికాయి. ఈ నేపథ్యంలో పలు రైళ్ల సర్వీసులను రద్దు చేస్తున్నట్లు ఈస్ట్ కోస్ట్ రైల్వే ఆదివారం విడుదల చేసిన ఓ ప్రకటనలో వెల్లడించింది. బెంగళూరు-భువనేశ్వర్ (ప్రశాంతి ఎక్స్‌ప్రెస్), భువనేశ్వర్- యశ్వంత్‌పూర్, పూరి- చెన్నై,భువనేశ్వర్- తిరుపతి, భవనేశ్వర్- సికింద్రాబాద్, భువనేశ్వర్ - విశాఖ (ఇంటర్ సిటీ), భువనేశ్వర్-జగదల్పూర్ (హీరాఖండ్ ఎక్స్‌ప్రెస్), అహ్మదాబాద్ - పూరి, ముంబై - భువనేశ్వర్, పూరి- తిరుపతి, గౌహతి- చెన్నై (ఎగ్మోర్ ఎక్స్‌ప్రెస్) తదిరత ఎక్స్‌ప్రెస్ రైళ్లు రద్దు చేసినట్లు తెలిపింది. అలాగే విశాఖ - మచిలీపట్నం, విశాఖ - రాజమండ్రి, పలాస - విశాఖ, పూరి - గుణుపూర్, పలాస - గుణుపూర్, విజయనగరం - విశాఖ, విజయవాడ - రాయఘడ్ మధ్య నడిచే ప్యాసింజర్ రైళ్లను తాత్కాలికంగా నిలిపివేసినట్లు ప్రకటించింది.