పశ్చిమ గోదావరి జిల్లాలో భారీ వర్షాల కారణంగా రైల్వేట్రాక్పై వరద నీరు పొంగిపొర్లుతుంది. దాంతో జిల్లాలోని వివిధ స్టేషన్లలో పలు రైళ్లు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. తాడేపల్లిగూడెంలో ప్రశాంతి ఎక్స్ప్రెస్ దాదాపు రెండు గంటలుగా నిలిచిపోయింది. అలాగే తూర్పు గోదావరి జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో పిఠాపురం - సామర్లకోట పరిసర ప్రాంతాల్లోని రైల్వే ట్రాక్పైకి భారీగా వరద నీరు వచ్చి చేరింది.
దాంతో ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయని దక్షిణ మధ్య రైల్వే భావించింది. దాంతో రాజమండ్రి- విశాఖపట్నం మధ్య రైల్వే సర్వీసులను నిలిపివేసింది. దీంతో హైదరాబాద్ నుంచి విశాఖ పట్నం వెళ్లవలసిన గోదావరి ఎక్స్ప్రెస్ తూర్పుగోదావరి జిల్లాలోని గొల్లప్రోలు వద్ద నిలిపివేశారు. అలాగే మచిలీపట్నం - విశాఖపట్నం ప్యాసింజర్ రైలును బిక్కవోలు వద్ద అపివేశారు.