ఏపీలో భారీ వర్షాలు.. పలు జిల్లాలో పాఠశాలలకు సెలవు | Heavy Rain Fall Across Andhra Pradesh Updates | Sakshi
Sakshi News home page

ఏపీలో భారీ వర్షాలు.. పలు జిల్లాలో పాఠశాలలకు సెలవు

Published Sat, Aug 31 2024 7:11 AM | Last Updated on Sat, Aug 31 2024 10:27 AM

Heavy Rain Fall Across Andhra Pradesh Updates

Rain Updates..

👉బంగాళాఖాతంలో తీవ్ర అ‍ల్ప పీడనం కారణంగా ఏపీలో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తరాంధ్రలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. మరోవైపు.. మత్య్సకారులు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

👉భారీ వర్షాల కారణంగా విశాఖ, ఎన్టీఆర్‌, అనకాపల్లి జిల్లాల్లో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు విద్యాశాఖ అధికారులు సెలవు ప్రకటించారు. 

👉భారీ వర్షాల కారణంగా అమ్మవారి ఘాట్‌ రోడ్‌ను అధికారులు మూసివేశారు. వర్షాలకు ఘాట్‌ రోడ్‌లో మూడు చెట్లు విరిగిపోయాయి. ఇంకా కొన్ని చెట్లు వేలాడుతున్నాయి. దీంతో, అటుగా వెళ్తున్న వావానాదారులు భయాందోళనకు గురవుతున్నారు. ఈ క్రమంలో వీఎంసీ సిబ్బంది చెట్లను తొలగిస్తున్నారు.

👉భారీ వర్షాల నేపథ్యంలో విజయవాడలో విషాద ఘటన చోటుచేసుకుంది. మొగల్రాజపురం సున్నపుపట్టీల సెంటర్ వద్ద ఇళ్లపై కొండచరియలు విరిగిపడిన ఘటనలో ఒకరు మృతిచెందగా.. ముగ్గురు గాయపడ్డారు. రెండు ఇళ్లపై కొండచరియలు విరిగిపడ్డాయి. ఇళ్లు ధ్వంసం కావడంతో శిధిలాల కింద ముగ్గురు చిక్కుకున్నారు. వారిని పోలీసులు కాపాడారు.

👉గుడివాడ బస్టాండ్‌లో భారీగా వరద నీరు చేరుకుంది. 

👉ఇక, రానున్న 24 గంట్లలో అల్పపీడనం వాయుగుండంగా మారనుంది. ఈ క్రమంలో నేడు, రేపు.. ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. మరోవైపు.. విజయవాడలో కుండపోతగా ఎడతెరిపిలేని వర్షం కురుస్తోంది. నిన్నటి నుంచి ఏకధాటిగా వాన పడుతోంది. వర్షం కారణంగా రోడ్లన్నీ జలమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి.

నేడు పాఠశాలలకు సెలవు..
👉విశాఖలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జిల్లాలో అన్ని పాఠశాలకు విద్యాశాఖ అధికారులు సెలవు ప్రకటించారు. ఈ మేరకు డీఈవో ఉత్తర్వులు జారీ చేశారు.

 

 👉ఈ సందర్బంగా ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ మాట్లాడుతూ.. వాయువ్య బంగాళాఖాతంలో  అల్పపీడనం కొనసాగుతోంది. ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాల వైపు కదులుతూ వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. కోస్తా తీరం వెంబడి గంటకు 45-65కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయి. మత్య్సకారులు వేట కోసం సముద్రంలోకి వెళ్లరాదు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

👉జిల్లాలకు వర్ష సూచన ఇలా..

👉నేడు శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు

👉కర్నూలు, నంద్యాల, అనంతపురం, వైఎస్సార్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం

👉మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం 
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement