
పై-లిన్ ప్రభావిత ప్రాంతాల్లో ఒడిశా సీఎం ఏరియల్ సర్వే
భువనేశ్వర్ : పై-లిన్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఏరియల్ సర్వే నిర్వహించారు. పై-లిన్ తుపాన్తో జరిగిన నష్టాన్ని స్వయంగా పరిశీలించారు. బాధితులందరినీ ఆదుకుంటామని నవీన్ పట్నాయక్ హామీ ఇచ్చారు. సహాయక చర్యలపై అధికారులతో సమీక్ష జరిపారు. గోపాల్ పూర్, గంజాం జిల్లాల్లో పర్యటించారు.
అయితే కొన్నిచోట్ల సీఎం కాన్వాయ్ ని బాధితులు అడ్డుకున్నారు. సహాయక చర్యలు అందటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు పై-లిన్ ప్రభావంతో రద్దు చేసిన అన్ని రైళ్లను పునరుద్దరించినట్లు తూర్పు కోస్తా రైల్వే అధికారులు తెలిపారు. మరోవైపు పాడయిన రైల్వే ట్రాక్ పనులను పునరుద్దరిస్తున్నారు.