100 అడుగుల ముందుకు వచ్చిన సముద్రం
శ్రీకాకుళం : శ్రీకాకుళం జిల్లాకు పొంచి ఉన్న ‘పై-లీన్’ పెను తుపాను ముప్పును ఎదుర్కొని సహాయ చర్య లు చేపట్టేందుకు జిల్లా యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. మరోవైపు సముద్ర తీరంలో ఇప్పటికే 3 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తుతో కెరటాలు వస్తున్నాయి. తుపాను ప్రభావితం చేసే 11 మండలాల్లో 237 గ్రామాలు గుర్తించారు. దాంతో 134 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. కవిటి మండలం ఇత్తివానిపాలెం, గార మండలం బందరువాణి పేట వద్ద సముద్రం 100 అడుగుల ముందుకు వచ్చింది. 12,500మందిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
తుపాను తీరం దాటే సమయంలో పెనుగాలుల ధాటికి చెట్లు, టెలిఫోన్, విద్యుత్ స్తంభాలు, ఇళ్లు కూలిపోయి ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. కలెక్టరేట్లో 24 గంటలూ పనిచేసే కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని, అవసరమైన సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందవచ్చని తెలిపారు. శ్రీకాకుళం కలెక్టరేట్లో కంట్రోల్ రూం నెంబర్లు :
నంబర్లు-08942 240557, 96528 38191
విజయనగరం: 0892-2236947 టోల్ ఫ్రీ: 1077
తూర్పుగోదావరి: 0884-2365506
పశ్చిమగోదావరి: 0881230617
నెల్లూరు: 08612331477