Phailin Cyclone
-
మా గతేంకాను?
అయ్యో... గిదెక్కడి పాపం. కోతకొచ్చిన పంటలన్నీ తుపాను నీళ్లలో కొట్టుకుపోతే మంచిగున్నాయంటున్నారా... బాయికాడికి వచ్చిన అధికారులు వానకు నేలకొరిగిన పంటలను కళ్లారా చూశారు కదా. నాకున్న మూడెకరాల్లో వరి, రెండెకరాల్లో పత్తి సాగు చేసిన. వరి పంట మొత్తం నీళ్లలో వంగిపోయింది. కాయలు పగిలి పత్తి నల్లబడింది. వరదలో తడిసిన వరిని కోయగా... 16 బస్తాల దిగుబడి మాత్రమే వచ్చింది. అందులో 12 బస్తాలు తాలు ధాన్యమే... రెండెకరాల పత్తి మొత్తం ఏరితే ఒక్క క్వింటా దిగుబడి వచ్చింది.పెట్టుబడి ఖర్చులు 80 వేలయితే.. 8 వేల విలువైన దిగుబడి కూడా రాలే. ఇది నట్టం కాదా ? మరి గట్టెట్ల రాసిండ్రు. అంతా అయిపోయింది... ఇక మాకు దిక్కెవరు? మళ్ల ఫిర్యాదు చేస్తే రీ సర్వే చేత్తరట... ఇప్పుడేమైనా నీళ్లుంటయూ... రైతులంటే పతొక్కరికీ నవ్వులాటే.. ఇప్పుడచ్చి ఏం సూత్తరు... ఏం సేత్తరు... ...ఇదీ బచ్చన్నపేట మండలం రామచంద్రాపురానికి చెందిన అమనగంటి చంద్రమౌళి ఆవేదన... ఆక్రోశం. అతనే కాదు... ఆ ఊళ్లో ఏ రైతును పలకరించినా నెత్తీనోరు బాదుకుంటున్నాడు. అధికారుల నష్టం నివేదిక జాబితాలో ఆ గ్రామం పేరు లేకపోడమే ఇందుకు కారణం. ఇలా ఆ ఒక్క ఊరే కాదు... జిల్లావ్యాప్తంగా 350కి పైగా గ్రామాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. వాస్తవంగా ఆయూ ప్రాంతాల్లో నష్టం జరగలేదా అంటే... పై-లీన్ పంజాతో నేలకొరిగిన, నీట మునిగిన, దెబ్బతిన్న పంటల దృశ్యాలే నిజమని సమాధానం చెబుతాయి. మరి తప్పు ఎక్కడ జరిగింది... అవన్నీ లెక్కలోకి తీసుకోకుండా పంటనష్టం లేదని జాబితా రూపొందించిన అధికారులదా... 50 శాతానికి పైగా పంట దెబ్బతింటేనే నష్టపరిహారం వర్తిస్తుందని నిబంధనలు విధించిన ప్రభుత్వానిదా...హాస్యాస్పదమే... పంట నష్టం జరిగినా.. జాబితాలో పేరు లేదని ఎవరైనా ఫిర్యాదు చేస్తే రీ సర్వే చేస్తామని చెబుతుండడం అధికారులను నవ్వులపాల జేస్తోంది. పై-లీన్ తుపాన్ ప్రభావం ముగిసింది. వర్షంతో తుడిచిపెట్టుకుపోయిన వరి ఇప్పటికే కోతకు రాగా... నల్లబడిన పత్తిని రైతులు ఖర్చుల నిమిత్తం విక్రయించారు. మిగిలిన పంటలనైనా దక్కించుకుందామనే ఉద్దేశంతో నీటిని ఎత్తిపోశారు. తడిసిన పత్తి, మక్కలను ఎండబెట్టారు... ఎంతో కొంతకు అమ్ముకున్నారు. ఇప్పుడు దాదాపు మొదటి దశ పంట పూర్తిగా నాశనం కాగా... రెండో దశ పంటలో భాగంగా పత్తి మళ్లీ కాతకు వచ్చింది. ఈ సమయంలో రీ సర్వే కోసం పంటల వద్దకు వెళ్లితే ఏముటంటుంది... అక్కడ ఏమైనా నష్టం జరిగినట్లు కనిపిస్తుందా... ఏమో మరి.. రైతులన్నట్లు అధికారులే సమాధానం చెప్పాలి. అన్యాయం చేస్తే మట్టికొట్టుకుపోతరు... వాన ఎలువగానే సార్లు బాయికాడికి వచ్చిరి కదా. ఆగకుండా పడ్డ వానతో ఇరిగిపోయిన మక్క, కుళ్లిపోయిన వరి, పత్తి పంటలను సూపించా కదా. నేను సెప్పిందల్లా రాసుకుని పోయిండ్రు. ఎకరా పత్తిలో బత్తా కూడా దిగుబడి వచ్చేలా లేదు. ఇప్పుడు నట్టం జాబితాలో మా ఊరు పేరే లేదు. మా ఊళ్ల పంట నట్టం జరగలేదా... మాకు అన్యాయం చేస్తే మట్టికొట్టుకుపోతరు. వేలకువేలు పోసి పంటలు సాగుచేసినం. వానదేవుడు కోపగించి చేతికొచ్చే పంటలను తీసుకుపోతే ఆదుకోరా..? - పిట్టల సత్తయ్య, రైతు, ఇటికాలపల్లి ఇప్పుడు సర్వే చేస్తే ఏముంటది ? తుపానుతో వరిగింజలు, పత్తి, మక్క కంకులు తడిసిపోయి మొలకొచ్చినయి... అప్పులు తెచ్చి సాగుచేసినం అంటూ సర్వేకొచ్చినప్పుడు సార్లకు పంటలను చూపిస్తూ ఏడిసినం. అంతా పోయింది.. ఆదుకోం డి సారూ అంటూ రెండు చేతులెత్తి వేడుకున్న. అయినా వారి మనుసు కరగలే. రైతుల నో ట్లో మట్టికొట్టే సర్వేలు చేస్తున్నరు. అప్పుడేమో అంతా ఎత్తిపోసిన తర్వాత వచ్చిండ్రు... నట్టమేం లేదని రాసిండ్రు. ఇప్పుడు సర్వే చేసినా ఒరిగేదేముండదు. - ఉమ్మెత్తుల చంద్రారెడ్డి, ఇటికాలపల్లి, బచ్చన్నపేట ఇవి సాక్ష్యాలు కావా ? పంటల నష్టం అంచనాల్లో ఊళ్లకు ఊళ్లనే కొట్టేశారు. బచ్చన్నపేట మండలంలో 21 గ్రామపంచాయతీలు, 10 శివారు గ్రా మాలున్నాయి. ఇందులో ఎనిమిది గ్రామాలు పంట నష్టం జాబితాలో లేకుండా పోయూరుు. పై-లీన్ ధాటికి దబ్బగుం టపల్లి, గంగాపురం, ఇటికాలపల్లి, ల క్ష్మాపురం, లింగంపల్లి, కొన్నె, నాగిరెడ్డిపల్లి, రామచంద్రాపురంలో పత్తి, మక్క, వరి పంటలకు ఎలాంటి నష్టం జరగలేదని అధికారులు తేల్చేయడంతో అక్కడి రైతులు లబోదిబోమంటున్నారు. ఇలా ఒక్క బచ్చన్నపేట మండలమే కాదు... జిల్లావ్యాప్తంగా 350కి పైగా గ్రామాల్లోని రైతులు గుండెలు బాదుకుంటున్నా రు. మరి ఆయూ ప్రాంతాల్లో వాస్తవంగా పంట లు దిబ్బతినలేదా అంటే... ఇక్కడి ఫొటోలే నిదర్శనంగా నిలుస్తున్నారుు. చాలా మేరకు పంటలు నీటిలో కొట్టుకుపోరుునట్లు.. దెబ్బతిన్నట్లు స్పష్టం చేస్తున్నాయి. -
ఒక్కో రాష్ట్రానికి వెయ్యి కోట్లు: ప్రధాని
తుపాను, వరదలతో నష్టపోయిన ఆంధ్ర, ఒడిశాలకు ప్రధాని తాత్కాలిక సాయం వరద నష్టంపై మన్మోహన్‌ను కలిసి విన్నవించిన కిరణ్, కేంద్ర, రాష్ట్ర మంత్రులు సాక్షి, న్యూఢిల్లీ: పై-లీన్ తుపాను, భారీ వర్షాలతో అతలాకుతలమైన ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలను ఆదుకునేందుకు ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ ఒక్కో రాష్ట్రానికి రూ.1000 కోట్ల చొప్పున తాత్కాలిక సాయం ప్రకటించారు. అంతర్ మంత్రిత్వశాఖల కేంద్ర బృందం ఈ రెండు రాష్ట్రాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి పరిస్థితిని అంచనా వేసి ఇచ్చే నివేదికలను పరిశీలించాక మొత్తం సహాయం ఎంత అందించాలనేది నిర్ణయిస్తామని ప్రధాని కార్యాలయం శనివారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ఈ తాత్కాలిక సాయానికితోడు తుపాను మృతుల కుటుంబాలకు ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధి నుంచి రూ.2 లక్షల చొప్పున పరిహారం, తీవ్రంగా గాయపడిన వారికి రూ.50 వేల చొప్పున సాయాన్ని ప్రధాని మంజూరు చేశారు. ప్రధానితో సీఎం కిరణ్ భేటీ.. తుపాను సాయం ప్రకటనకు ముందు ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి నేతృత్వంలో పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, ఎంపీల బృందం ప్రధానిని ఆయన నివాసంలో కలిసింది. బృందం వెంట రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్‌సింగ్ ఉన్నారు. రాష్ట్రంలో ఇటీవలి కాలంలో వరుసగా సంభవించిన ప్రకృతి వైపరీత్యాలతో పెద్ద ఎత్తున ప్రాణనష్టం, పంటనష్టం, ఆస్తినష్టం జరిగిందని సీఎం, బృంద సభ్యులు ప్రధానికి విన్నవించారు. రంగాలవారీగా నష్టం అంచనాలను తెలుపుతూ, రాష్ట్రానికి ఉదారంగా సాయం అందించాలని కోరుతూ వినతిపత్రాన్ని అందజేశారు. పంటరుణాలపై వడ్డీని పూర్తిగా మాఫీచేసే అంశాన్ని పరిశీలించాలని అందులో కోరారు. తమ వినతికి స్పందించి ప్రధాని రూ.1000 కోట్ల మొత్తాన్ని అడ్వాన్స్‌గా రాష్ట్రానికి విడుదల చేశారని సీఎం కిరణ్ చెప్పారు. ప్రధానితో భేటీ అనంతరం ఆయన పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, కేంద్ర, రాష్ట్ర మంత్రులతో కలిసి ఏపీ భవన్లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 2009-10 నుంచి 2012-13 వరకు తుపాన్లు, కరువు వల్ల నష్టపోయిన రాష్ట్రానికి జాతీయ విపత్తు సహాయ నిధి నుంచి రావాల్సిన ఆర్థిక సహాయంలో రూ.1,145.46 కోట్లు కోత పెట్టారని, ఉన్నతస్థాయి కమిటీ మంజూరుచేసిన ఈ మొత్తాన్ని సైతం వెంటనే రాష్ట్రానికి విడుదల చేయాలని ప్రధానిని కోరామన్నారు. దీనికి ప్రధాని స్పందిస్తూ, ఈ విషయంలో అన్నీ సవ్యంగా ఉంటే ఆ మొత్తాన్ని కూడా వెంటనే విడుదల చేయడానికి ఆదేశాలిస్తామని చెప్పారని కిరణ్ పేర్కొన్నారు. కేంద్ర మంత్రులు పల్లంరాజు, చిరంజీవి, పనబాక, ఎంపీలు సాయిప్రతాప్, వెంకట్రామిరెడ్డి, కేవీపీ, రాష్ట్ర మంత్రులు పార్థసారథి, గంటా శ్రీనివాసరావు, శైలజానాథ్ తదితరులు కూడా ముఖ్యమంత్రితోపాటు ప్రధానిని కలిసిన బృందంలో ఉన్నారు. -
వెన్ను విరిగిన రైతన్న
పదిహేను రోజుల్లోనే 50 మంది అన్నదాతల మృతి పురుగుల మందు తాగి కొందరు.. గుండె పగిలి మరికొందరు వరి, పత్తి, మొక్కజొన్న, మిర్చి రైతుల విలవిల పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితి లేదని ఆవేదన గడచిన రెండ్రోజుల్లో ఐదుగురి ఆత్మహత్య మట్టి బిడ్డల లోగిళ్లలో విషాద ఛాయలు సాక్షి నెట్వర్క్: ఎనిమిదెకరాల్లో పంటలు వేసినా ఆ రైతన్నను ఆదుకోలేకపోయాయి. పత్తి అప్పుల కత్తిగా మారింది. మొక్కజొన్న మొండిచేయి చూపింది. వర్షాలతో చేను చెరువైంది. రైతు గుండె బరువైంది. కిందటేడాది అప్పులు, తాజా పెట్టుబడి ఖర్చులు రూ.4 లక్షలకు చేరాయి. చేనులో పురుగులను చంపాల్సిన మందు ఆ రైతు గొంతులోకి దిగింది. అప్పటిదాకా కంటిపాపలా చూసుకున్న ఆ చేనులోనే ఆయన జీవితం కడతేరింది. - కరీంనగర్ జిల్లా బెజ్జంకి మండలం లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన ముక్కీస కేశవరెడ్డి(50) దీన గాథ ఇది! మరో 15 రోజుల్లో పంట చేతికి వస్తుందని, ఈసారైనా అప్పులు తీరతాయని ఆ రైతు తన ఐదెకరాల వరి పొలంపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. కానీ అకాల వర్షాలు ఆ ఆశలను చిదిమేశాయి. రుణ అర్హత కార్డు లేకపోవడంతో ఆయనకు ప్రభుత్వ బ్యాంకులు అప్పులివ్వలేదు. దీంతో భూయజమాని వద్ద, ఇతర చోట్ల అప్పులు తెచ్చాడు. తనకు సాగు పనుల్లో చేదోడుగా ఉంటున్న సైకిల్‌ను కూడా అమ్మేసి ఎకరానికి రూ.20 వేల చొప్పున లక్ష రూపాయల వరకు పెట్టుబడులు పెట్టాడు. వర్షాలకు ఐదెకరాలు తుడిచిపెట్టుకుపోవడంతో అదే చేనులో పురుగుల మందు తాగి తనువు చాలించాడు. ఇల్లు కూడా లేకపోవడంతో ఈయన భార్య, ఇద్దరు పిల్లలు రోడ్డునపడ్డారు. - ఇది తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం పాటిచెరువుకు చెందిన కౌలు రైతు సత్యనారాయణ(34) వ్యథ!! నీలం.. పై-లీన్.. అకాల వర్షాలు, వరదలు.. ఇలా ఏటా ఏదో ఓ విపత్తు అన్నదాత ఉసురు తీస్తోంది. చేతికొచ్చిన పంటలపై ప్రకృతి పడ గ విప్పుతోంది. రైతుల గుండెలో గుబులు రేపిన పై-లీన్ గండం గడిచిందో లేదో.. కుండపోత వర్షాలు రాష్ట్రాన్ని ముంచెత్తాయి. కనీవినీ ఎరుగని వానలతో ఏకంగా 29 లక్షల ఎకరాల్లో పంటలు నీటమునిగాయి. వరి, పత్తి, మొక్కజొన్న, వేరుశెనగ, మిర్చి... ఒక్కటేమిటి అన్నీ నాశనమయ్యాయి. కొద్దిరోజులు ఆగితే రైతన్న ఇంటి ముంగిట ఉండాల్సిన పంటలవి. విపరీతంగా పెరిగిన ఎరువులు, విత్తనాలు, పురుగు మందుల ధరలు, సాగు ఖర్చులను ఓర్చుకొని సాగు చేసిన పంటలు నీటమునగడంతో రైతులు అల్లాడుతున్నారు. వర్షాలకు పోను కాస్తోకూస్తో మిగిలిన పంటలు కూడా పనికిరాకుండా పోయాయి. మెక్కజొన్న కోతలు పూర్తయ్యాయి. ఆరబోసిన మొక్కజొన్నల కంకులు పూర్తిగా తడిసిపోయి మొలకలు వచ్చాయి. వరిపొలాల్లో ఇంకా చాలాచోట్ల నీరు నిలిచి ఉంది. పంట నేలవాలడం తో వరి కంకులకు మొలకలు వస్తున్నాయి. మరికొన్ని మార్కెట్ యార్డులకు తీసుకువచ్చిన వచ్చిన పత్తి వానకు తడిసి రంగు మారింది. పంట బాగుంటేనే అరకొర ధరతో సరిపెడుతున్న అధికారులు.. ఇక ఈ తడిసిన పంటను కొనేందుకు అసలే ముందుకు రావడం లేదు. దీంతో రైతులు ఆత్మహత్యల బాటపడుతున్నారు. పంట నష్టాన్ని తట్టుకోలేక చేనులోనే పురుగు మందు తాగి ప్రాణాలు తీసుకుంటున్నవారు కొందరైతే.. గుండెపగిలి మరణిస్తున్న వారు ఇంకొందరు. వెరసి రైతుల లోగిళ్లలో విషాద ఛాయలు అలముకుంటున్నాయి. గత పక్షం రోజుల్లోనే రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 50 మంది రైతులు ప్రాణాలు తీసుకున్నారు. గడచిన రెండ్రోజుల్లో ఐదుగురు తనువు చాలించారు. దీపావళి వెలుగులకు బదులు ఆ రైతుల కుటుంబాల్లో అమావాస్య చీకట్లు అలముకున్నాయి. కదిలిస్తే కన్నీళ్లే...: పంటలు కోల్పోయిన రైతులు ఎవరిని కదిపినా కన్నీళ్లపర్యంతమవుతున్నారు. అప్పులు తెచ్చి పెట్టిన పెట్టుబడులన్నీ నీళ్లపాలయ్యాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రబీ పంట సాగు చేద్దామంటే చేతిలో చిల్లిగవ్వ లేదని గోడు వెళ్లబోసుకుంటున్నారు. ‘‘నేను తొమ్మిది ఎకరాలు కౌలుకు తీసుకుని పత్తి సాగు చేశాను. వానతో పంట అంతా దెబ్బతింది. చాలా వరకు నీటిపాలైంది. మిగిలింది రంగు మారిపోయింది. ఎకరానికి రూ.10 వేల దాకా నష్టపోతున్నా’’ అని కృష్ణా జిల్లా నందిగామ మండలం రాఘవపురానికి చెందిన కోట రామయ్య చెప్పారు. ఇదే జిల్లా కంకిపాడు మండలం చలివేంద్రపాలెంకు చెందిన కొల్లి సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. ‘‘కూలీకి వెళ్లలేక రైతుగా బతుకుదామని రెండెకరాలు కౌలు చేస్తున్నాను. ఎకరాకు కౌలు 20 బస్తాలు ఇవ్వాలి. ఇప్పటికే ఎకరాకు రూ.15 వేలు వరకూ పెట్టుబడులు పెట్టాను. పైరు చిరు పొట్ట దశ, కంకులు దశకు చేరుకునే సరికి తెగుళ్లు వ్యాప్తి చెందటంతో ఖర్చులు ఎకరాకు రూ.3 వేలు వరకూ అదనంగా అయ్యాయి. పైరు తేరుకుంటుందని భావించా. ఇంతలోనే వర్షం వచ్చి పడింది. ఎకరాకు 5 నుంచి 9 బస్తాలు వరకూ దిగుబడి తగ్గే అవకాశం ఉంది. పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితి లేదు’’ అని చెప్పారు. ‘‘నేను మూడెకరాల్లో పత్తి వేశా. రూ.50 వేల దాకా పెట్టుబడులు పెట్టాను. మొన్నటి వర్షాలతో పత్తి కాయలన్నీ మురిగిపోయాయి. ఆకుకు ఎర్రబొమ్మిడి తెగులు సోకింది. పంట బాగుంటే ఎకరానికి 15 క్వింటాళ్ల దాకా దిగుబడి వచ్చేది. ఇప్పుడు 7 నుంచి 8 క్వింటాళ్ల లోపే వచ్చే అవకాశం ఉంది. ఎకరానికి రూ.8 వేల దాకా నష్టం వాటిల్లింది’’ అని కరీంనగర్ జిల్లా చందుర్తి మండలం మర్రిగడ్డకు చెందిన గంగిపెల్లి రమేశ్ ఆవేదన వ్యక్తంచేశారు. విపత్తు నిధి ఏర్పాటు చేయాలి ప్రకృతి వైపరీత్యాలవల్ల తీవ్రంగా నష్టపోయిన రైతులను తక్షణం ఆదుకుని భరోసా కల్పించాల్సిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్ర నిర్లక్ష్యం చూపుతున్నాయి. వారికి తక్షణం ఆర్థికసాయం అందించి భవిష్యత్తుపై భరోసా కల్పించాలి. బాధిత కుటుంబాలకు బియ్యం, దుస్తులు లాంటి తాత్కాలిక సాయం ఇవ్వడానికే రాష్ట్ర ప్రభుత్వం పరిమితమవుతోంది. ఇటీవల భారీ వర్షాలు, వరదలవల్ల 16 జిల్లాల్లో 29 లక్షల ఎకరాల్లో పంట నాశనమైంది. పెట్టుబడి రాయితీ అందించే ఏర్పాటు ఉంటే రైతులకు కాస్త ఊరట కలుగుతుంది. ఏడాది తరువాత గానీ వారికి పెట్టుబడి రాయితీ అందడంలేదు. - రామకృష్ణ, రాష్ట్ర రైతు సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రకాశం జిల్లా మార్టూరు మండలం ఇసుకదర్శికి చెందిన ఈయన పేరు షేక్ మౌలాలి(49). కౌలు రైతు. ఎకరా రూ.15 వేల చొప్పున కౌలుకు తీసుకుని మూడెకరాల్లో వరి సాగు చేశాడు. ఇటీవలి వర్షాలతో పంట నీటిపాలైంది. దీంతో మౌలాలి మానసిక వేద నకు గురయ్యాడు. కిందటి నెల 28న గుండెపోటుతో కుప్పకూలి కన్నుమూశాడు. ఇంటికి పెద్ద దిక్కు మృతి చెందడంతో ఆయన కుటుంబం దిక్కుతోచని పరిస్థితుల్లో పడింది. 9వ తరగతి చదువుతున్న కుమారుడు రహంతుల్లా చదువు సందిగ్ధంలో పడింది. రూ.2.50 లక్షల అప్పు ఎలా తీర్చాలో తెలియక మౌలాలి భార్య కన్నీరుమున్నీరవుతోంది. ఈ రైతు పేరు. రెడ్డిమాసు లెవన్(51). నల్లగొండ జిల్లా కట్టంగూరు మండలం చిన్నపురి. మూడెకరాల పొలానికి తోడు ఈసారి మరో ఏడెకరాలు కౌలుకు తీసుకుని పత్తి సాగుచేశాడు. డబ్బు చాలక మరో రూ.3 లక్షల వరకు అప్పు చేశాడు. ఏకధాటిగా కురిసిన వర్షాలతో వరద వచ్చి పంటను ముంచెత్తింది. పంట పూర్తిగా నాశనమైంది. ఆశలన్నీ ఆవిరయ్యాయి. కిందటి మంగళవారం ఉదయం ఇంటి నుంచి వెళ్లి అక్కడే పురుగు మందు తాగాడు. అనంతరం అక్కడ్నుంచే హైదరాబాద్‌లో పీజీ చదువుతున్న తన కొడుకు కిరణ్‌కు ఫోన్ చేశాడు. ఆందోళనతో కిరణ్ తన తల్లికి విషయాన్ని చేరవేశాడు. ఆమె వెళ్లేలోగా భర్త ఊపిరి ఆగిపోయింది. లెవన్ 12 ఏళ్లుగా పత్తి సాగు చేస్తున్నాడు. రెండేళ్ల నుంచి వరుసగా నష్టాలే వచ్చాయి. నల్లగొండ జిల్లా మోత్కూరు మండలం ముశిపట్లకు చెందిన ఈ రైతు కేమిడి అవిలి మల్లయ్య (30)ది మరో దీనగాథ. ఈయన తనకున్న మూడెకరాలతోపాటు ఏడెకరాలు కౌలుకు తీసుకున్నాడు. తన వద్ద ఉన్న రూ.2 లక్షలు, అప్పు తెచ్చిన రూ.4 లక్షలతో పెట్టుబడి పెట్టాడు. తొమ్మిది ఎకరాల్లో పత్తి, ఎకరంలో కంది వేశాడు. మొదటి దఫా పత్తి తీయడం మొదలుపెట్టగానే వర్షం ముంచుకొచ్చి పంట పనికిరాకుండా పోయింది. దీంతో అప్పు తీరే అవకాశం లేక గత నెల 27న పొలం వద్దకు వెళ్లి పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మల్లయ్య తండ్రి రాములు పొలం వద్దకు వెళ్లి చూడగా అప్పటికే చనిపోయి కనిపించాడు. మల్లయ్య మృతితో భార్య చంద్రకళ, ఏడాదిన్నర బాబు మనోజ్, నాలుగేళ్ల చిన్నారి శివాని, వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు దిక్కులేని వారయ్యారు. ఈ మహిళా రైతు పేరు ఉప్పలమ్మ (60). వరంగల్ జిల్లా వర్దన్నపేట. భర్త బక్కయ్య, ఉప్పలమ్మ తమకున్న మూడెకరాలతో పాటు మరో నాలుగెకరాలు కౌలుకు తీసుకుని పత్తి వేశారు. మరో రెండ్రోజుల్లో పత్తి తీద్దామనుకునే సరికి వర్షాలు కురిసి పంట నేల రాలింది. చెట్టుపై ఉన్న పత్తి మొలకొచ్చింది. దీంతో ఉప్పలమ్మ తీవ్ర ఆందోళనకు గురైంది. వీరు పంట కోసం రూ.92 వేలు ఖర్చు చేశారు. వాటిలో రూ.80 వేలు అధిక వడ్డీపై అప్పు తెచ్చారు. ఈ అప్పులను తలచుకొని ఆదివారం ఉప్పలమ్మ తీవ్ర అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు. అదే రోజు సాయంత్రం గుండెపోటుతో ఆమె మృతి చెందింది. ఈయన పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలు మండలం సూరాపురానికి చెందిన కౌలు రైతు బల్లెం సుబ్బారావు(48). గతంలో సొంతంగా కొంత పొలం తీసుకుని వ్యవసాయం చేశాడు. నష్టాల ఊబిలో కూరుకుపోయూడు. గత ఏడాది నీలం తుపానుకు పంట మునగడంతో అప్పు తెచ్చి పెట్టుబడి పెట్టిన రూ.1.30 లక్షలు నీటిపాలయ్యాయి. ఈసారి రూ.లక్ష దాకా అప్పు తెచ్చి పంట సాగు చేశాడు. ఇటీవలి వర్షాలకు పంట నీటమునిగింది. నీట మునిగిన పంటను చూసి సుబ్బారావు దిగులు చెందాడు. అప్పులు ఎలా తీర్చాలన్న బెంగపట్టుకుంది. అదే వ్యథతో గుండెపోటుకు గురై శుక్రవారం మరణించాడు. సుబ్బారావుకు భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ఈ ఏడాదైనా అప్పుల బాధ నుంచి గట్టెక్కుదామని భావించిన ఈ అన్నదాత ఆశలు నెరవేరలేదు. ఈయన పేరు ర్యాపని మల్లయ్య(45). మహబూబ్‌నగర్ జిల్లా బల్మూర్ మండలం పోలేపల్లి. ఆరెకరాల్లో పత్తి, మొక్కజొన్న, వరి సాగుచేశాడు. ఇందుకు స్థానిక పీఏసీఎస్‌లో రూ.80 వేలు, ప్రైవేట్‌గా మరో రూ.40 వేలు అప్పు చేశాడు. గత వేసవిలో రూ.60 వేలు అప్పుచేసి మూడు బోరుబావులను తవ్వించగా ఒక్కదాంట్లోనే నీరు పడింది. రూ. లక్షన్నర నష్టపోయాడు. పంటల కోసం ఈ రెండేళ్లలో రూ.3 లక్షలు అప్పుచేశాడు. ఈసారి పంటలు బాగా పండి అప్పులు తీరుతాయని భావించాడు. కానీ వర్షాలకు ఆరెకరాల్లో పంట నాశనమైంది. దీంతో కలతచెంది గత నెల 27న ఇంట్లోనే పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతునికి భార్య, కొడుకు, కూతురు ఉన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా లింగాల మండలం శ్రీరంగాపూర్‌కు చెందిన ఈ రైతు పేరు సత్యనారాయణగౌడ్ (35). ఈ ఏడాది తనకున్న ఐదెకరాలతో పాటు మరో ఐదెకరాలను కౌలుకు తీసుకున్నాడు. మొక్కజొన్న పంట సాగుచేశాడు. ఇందుకు రూ.3 వడ్డీ చొప్పున రూ.3 లక్షల అప్పు చేశాడు. గతేడాది పీఏసీఎస్‌లో రూ.30 వేల అప్పు తీసుకున్నాడు. ఈ అప్పుల నేపథ్యంలో పంటను కంటికిరెప్పలా చూసుకున్నాడు. ఇటీవల కురిసిన వర్షాలకు పదెకరాల్లో పంట మొత్తం కొట్టుకుపోయింది. అప్పులు తీర్చే మార్గం తెలియక కుటుంబ సభ్యుల వద్ద కలతచెందాడు. కిందటి నెల 28న పొలాన్ని చూసేందుకు వెళ్లి అక్కడే పురుగుమందు తాగి తనువు చాలించాడు. సత్యనారాయణ మృతితో భార్య అలివేల, ఇద్దరు కొడుకులు దిక్కు లేనివారయ్యారు. -సాక్షి నెట్వర్క్ -
వాతావరణ మార్పుతో ఆర్థిక ముప్పు!
లండన్: వాతావరణ మార్పు కారణంగా 2025 నాటికి ప్రపంచవ్యాప్తం గా వివిధ దేశాలపై తీవ్ర ప్రభావం పడనుంది. ఆర్థికంగా పెను ప్రమాదం ఎదుర్కోనున్న దేశాల్లో భారత్ సైతం ఉంది. ‘క్లైమేట్ చేంజ్ అండ్ ఎన్విరాన్మెంటల్ రిస్క్ అట్లాస్’ పేరుతో బ్రిటన్‌కు చెందిన మాప్లర్‌క్రాఫ్ట్ సంస్థ బుధవారం విడుదల చేసిన వార్షిక నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. నివేదికలో కీలకమైన ‘వాతావరణ మార్పు ముప్పు సూచీ’ ప్రకారం... వరదలు, తుపానులు, కరువు వంటి వాతావరణ మార్పు ప్రభావాల వల్ల 44 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక ఉత్పాదకత ఉండే 67 దేశాలపై ప్రభావం పడనుందని అంచనా. మొత్తం 193 దేశాల్లో ఆర్థికంగా అత్యంత తీవ్రంగా నష్టపోయే దేశాల జాబితాలో బంగ్లాదేశ్ మొదటి స్థానంలో నిలవగా.. భారత్ 20వ స్థానంలో, పాకిస్థాన్ 24వ స్థానంలో, చైనా 61వ స్థానంలో ఉన్నాయి. అలాగే వచ్చే 30 ఏళ్లలో తీవ్ర ఆర్థిక ప్రభావం పడే 50 నగరాల్లో ఢాకా, ముంబై, కోల్‌కతా, మనీలా, బ్యాంకాక్ నగరాలు మొదటి ఐదు స్థానాల్లో ఉన్నాయి. ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌లలో పై-లీన్ తుపాను సృష్టించిన విధ్వంసం వాతావరణ మార్పు వల్ల కలిగే ఆర్థిక నష్టాలకు ఉదాహరణగా నిలుస్తుందని నివేదికలో ప్రస్తావించారు. -
ఏటీఎంల కోసం ఒడిశా వాసులు.. ఛలో ఆంధ్ర
ఫై-లీన్ తుపాన్ ప్రభావం నుంచి ఒడిశా ప్రజలు ఇంకా కోలుకోలేకపోతున్నారు. భారీ వర్షాలు, వరదల ధాటికి అపార ఆస్థి నష్టం జరగగా, పునరుద్ధరణ కార్యక్రమాలు ఇంకా పూర్తి స్తాయిలో చేపట్టలేదు. బరంపురం, తదితర పట్టణాల్లో ఏటీఎంలు, బ్యాంక్ కార్యకలాపాలు స్తంభించిపోవడంతో అక్కడి ప్రజలు డబ్బుల కోసం ఆంధ్రప్రదేశ్‌కు తరలివస్తున్నారు. పట్టు పరిశ్రమకు ప్రఖ్యాతిగాంచిన బరంపురంలో తుపాన్ ప్రభావానికి చాలా ఏటీఎంలు ధ్వంసం కాగా, మిగిలినవి విద్యుత్ అంతరాయం వల్ల పనిచేయడం లేదు. పట్టణంలో ఒకే ఒక ఎస్బీఐ ఏటీఎం పనిచేస్తోంది. ఇక్కడ డబ్బులు తీసుకువాలంటే గంటల కొద్దీ క్యూలో ఎదురు చూడాల్సిన పరిస్థితి. దీంతో ఇచ్చాపురం తదితర ఆంధ్రప్రదేశ్ పట్టణాలకు వస్తున్నారు. వీరిలో సరిహద్దు ఒడిశా పట్టణాల ప్రజలు, అందులోనూ తెలుగు మాట్లాడేవారు ఎక్కువగా ఉన్నారు. ఏటీఎంల కోసమే గాక మొబైల్ ఫోన్లకు రీచార్జ్ చేయించాలన్నా రాక తప్పదని ఓ బరంపురం వాసి చెప్పాడు. -
విభజన తుపానును అడ్డుకుంటాం: కిరణ్
ప్రకృతి విపత్తు అయిన పై-లీన్ తుపానును ఆపలేకపోయాం గానీ.. అంతకంటే తీవ్రమైన రాష్ట్ర విభజన తుపానును అడ్డుకుంటామని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి వ్యాఖ్యానించారు. శ్రీకాకుళం జిల్లాలోని తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఆయన ఆదివారం పర్యటించారు. ఈ సందర్భంగా కవిటిలో తుపాను బాధిత రైతులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. కొబ్బరి రైతులు తమ కష్టాలు చెప్పిన తర్వాత ఆయన మాట్లాడేందుకు ఉపక్రమించారు. అంతలో సభలో ఉన్న కొందరు వ్యక్తులు సమైక్యాంధ్రకు మద్దతుగా నినాదాలు చేస్తూ, ఈ అంశంపై మాట్లాడాలని కోరారు. దీనిపై మాట్లాడేందుకు ఇది తగిన సందర్భం కాదని తొలుత నిరాకరించిన సీఎం.. అంతలోనే ఒక్క ముక్క మాట్లాడతానంటూ ‘‘పై-లీన్ తుపాను బీభత్సాన్ని అడ్డుకునే శక్తి మనకు లేదు. దాన్ని అడ్డుకోలేకపోయినా.. రాష్ట్ర విభజన తుపానును మాత్రం అడ్డుకుని తీరతాం’’ అని అన్నారు. సమైక్యాంధ్ర పరిరక్షణే లక్ష్యంగా పనిచేస్తామని చెప్పారు. ఇందుకు మీరంతా సహాయ సహకారాలు అందించాలని విజ్ఞప్తి చేశారు. కొబ్బరి ఇన్పుట్ సబ్సిడీ పెంచాలని యోచిస్తున్నాం పై-లీన్ తుపాను తాకిడి తీవ్రంగా నష్టపోయిన శ్రీకాకుళం జిల్లా మత్స్యకారులకు రూ.40 కోట్ల ప్యాకేజీ ఇస్తామని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి వెల్లడించారు. ఇచ్ఛాపురం నియోజకవర్గంలోని తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన తర్వాత ఇచ్ఛాపురంలో విలేకరులతో మాట్లాడారు. తుపాను ప్రభావిత గ్రామాల ప్రజలను ముందుగానే సురక్షిత ప్రాంతాలకు తరలించడం వల్ల ప్రాణనష్టం ఎక్కువగా లేదని తెలిపారు. ఇళ్లు నష్టపోయినవారికి ఐఏవై కింద ఉచితంగా ఇళ్లు ఇవ్వాలని కలెక్టర్‌ను ఆదేశించినట్టు చెప్పారు. తుపాను దెబ్బతో సుమారు 880 గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయిందన్నారు. అధికారులు యుద్ధప్రాతిపదికన పనులు చేపట్టి, 7 గ్రామాలు మినహా అన్ని ప్రాంతాలకు సరఫరా పునరుద్ధరించారని వివరించారు. నీటి పథకాలు దెబ్బతిన్న గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా తాగునీటి సరఫరాకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. మత్స్యకార కుటుంబాలకు ఇప్పటికే పది కేజీల చొప్పున బియ్యం అందించామని, కలెక్టర్ సలహా మేరకు అదనంగా మరో 30 వేల మంది స్వదేశీ మత్స్యకారులకు బియ్యం సరఫరా చేయాలని ఆదేశించినట్లు చెప్పారు. కొబ్బరి రైతుకు తీవ్రనష్టం జరిగిందని, పదేళ్ల పాటు ఈ నష్టం కొనసాగుతుందని, నష్టం అంచనాలు పూర్తయ్యాక ఇన్పుట్ సబ్సిడీ ప్రకటిస్తామని సీఎం వెల్లడించారు. ప్రస్తుతం ఇన్పుట్ సబ్సిడీ చెట్టుకు రూ.150గా ఉందని, దీన్ని పెంచే ఆలోచన చేస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం కొబ్బరి మొక్కలు వేసుకునేందుకు వీలుగా ఎకరాకు రూ.5 వేలు ఎన్ఆర్ఈజీఎస్ కింద ఇస్తామని ప్రకటించారు. తుపాను సమయంలో జిల్లా అధికార యంత్రాంగం చక్కగా పనిచేసిందని ముఖ్యమంత్రి ప్రశంసించారు. సమ్మెలో ఉన్న ఉద్యోగులు కూడా విధుల్లో చేరి ఎనలేని సేవలందించారన్నారు. జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఇతర అధికారులు సమర్థంగా వ్యవహరించారని, మీడియా కూడా మంచి పాత్ర పోషించిందని కితాబిచ్చారు. సమావేశంలో కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి, రాష్ట్ర మంత్రులు గంటా శ్రీనివాసరావు, శత్రుచర్ల విజయరామరాజు, కొండ్రు మురళి, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు, ఎమ్మెల్యేలు జుత్తు జగన్నాయకులు, కొర్ల భారతి, మీసాల నీలకంఠం, బొడ్డేపల్లి సత్యవతి, ఎమ్మెల్సీ విశ్వప్రసాద్, తదితరులు పాల్గొన్నారు. సమైక్యవాదిపై పోలీసు జులుం ముఖ్యమంత్రి రాక సందర్భంగా విశాఖ విమానాశ్రయం వద్ద పోలీసులు ఓవరాక్షన్ చేశారు. సమైక్యవాదులపై జులుం ప్రదర్శించారు. శ్రీకాకుళం పర్యటన కోసం సీఎం కిరణ్ ఆదివారం విశాఖ విమానాశ్రయానికి చేరుకునే సమయానికి సమైక్యవాదులు అక్కడకు తరలివెళ్లారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు సమైక్యాంధ్రకు మద్దతుగా నినాదాలు చేశారు. ముందు వారిని వారించిన పోలీసులు.. అనంతరం ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. సమైక్యాంధ్ర నినాదాలు చేస్తున్న వైఎస్సార్ సీపీ నాయకుడు పల్లా పెంటారావు నోరునొక్కి ఈడ్చుకెళ్లారు. జీపు ఎక్కించి, ఎయిర్పోర్ట్ జోన్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. విషయం తెలుసుకున్న పార్టీ కేంద్ర కార్యనిర్వాహకమండలి సభ్యుడు డాక్టర్ జహీర్ అహ్మద్, సమన్వయకర్తలు గండి బాబ్జీ, తిప్పల నాగిరెడ్డి, కిడారి సర్వేశ్వరరావు, ఉత్తరాంధ్ర ఎన్నికల పరిశీలకుడు కొయ్య ప్రసాద్‌రెడ్డి తదితరులు పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని ఆయన్ను విడిచిపెట్టాలని కోరడంతో పోలీసులు పెంటారావును వదిలిపెట్టారు. -
ఏ ఎండకా గొడుగులా సిఎం కిరణ్ తీరు!
-
విభజన తుఫాన్ ఆపుతాం: సీఎం కిరణ్
దేవగుడితోట: రాష్ట్ర విభజనను కచ్చితంగా ఆపుతామని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి అన్నారు. రాష్ట్రానికి నష్టం కలిగించే విభజనను అడ్డుకుంటామని ఆయన స్పష్టం చేశారు. శ్రీకాకుళం జిల్లాలో పై-లిన్ తుఫాన్ బాధిత ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా కవిటిమండలం దేవగుడితోటలో నిర్వహించిన సభలో ముఖ్యమంత్రి మాట్లాడారు. సమైక్యాంధ్ర గురించి మాట్లాడే సమయం, సందర్భం కాదంటూ విభజనను అడ్డుకుంటామంటూ ఒక్కమాట చెప్పారు. పై-లిన్ తుఫాన్‌ను ఆపలేకపోయమని, కానీ ఈ సైక్లోన్(విభజన తుఫాన్)ను ఆపి తీరుతామని ఆయన ప్రకటించారు. తుఫాన్ బాధితులను ఆదుకుంటామని సీఎం హామీయిచ్చారు. కొబ్బరి రైతులకు ఇచ్చే పరిహారం పెంచుతున్నట్టు ప్రకటించారు. బాధిలతులు తమ పేర్లను అధికారుల వద్ద నమోదు చేసుకోవాలని సూచించారు. -
ఫైలిన్ తుఫాన్‌తో సిక్కోలు కుదేలు
-
ముందస్తు హెచ్చరికలతో ప్రాణనష్టం తగ్గింది: జైపాల్‌రెడ్డి
న్యూఢిల్లీ: పై-లీన్ తుఫాన్‌పై వాతావరణశాఖ ముందస్తు హెచ్చరికల వల్లనే పెద్ద ఎత్తున ప్రాణనష్టం తప్పిందని కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి జైపాల్‌రెడ్డి చెప్పారు. తుఫాన్ బారిన పడకుండా 10 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామని తెలిపారు. ఉత్తరాఖండ్‌లో భారీ వర్షం కురుస్తుందని ముందే చెప్పామని, కానీ శాఖల మధ్య సమన్వయం లోపించడంతో భారీ నష్టం సంభవించిందన్నారు. శాస్త్ర పరిశోధనకు 11, 12వ ప్రణాళికల్లో అధిక నిధులు ఇచ్చామని తెలిపారు. వెదర్ రాడార్ కోసం రూ. 715 కోట్లు వెచ్చించామన్నారు. వెదర్ రాడార్‌తో రైతులకెంతో మేలు జరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. పై-లీన్ తుఫాన్ కారణంగా ఒడిశాలో 25 మంది మృతి చెందగా భారీ స్థాయిలో ఆస్తినష్టం సంభవించింది. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాపై పై-లీన్ ప్రభావం ఎక్కువగా పడింది. -
బీహార్‌కు మళ్లిన పైలిన్ తుపాను
ఫై-లిన్ తుపాను క్రమంగా బలహీనపడుతోంది. తుపాన్ వాయుగుండంగా మారి బీహార్‌కు మళ్లినట్లు విశాఖపట్నం వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో తీర ప్రాంతంలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, ఉత్తర కోస్తాలో తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు పై-లిన్ తుపాను ధాటికి పెను నష్టం వాటిల్లింది. ఒడిశాలో గంజాం, మన రాష్ట్రంలో శ్రీకాకుళం జిల్లా కకావికలం అయ్యింది. లక్షల ఎకరాల్లో పంటలు, తోటలు నేలమట్టం అయ్యాయి. విద్యుత్, టెలికం వ్యవస్థలు భారీగా దెబ్బతిన్నాయి. సహాయక శిబిరాల్లో దాదాపు 9లక్షల మంది తలదాచుకుంటున్నారు. శ్రీకాకుళంలో రూ.1000 కోట్ల మేర పంటనష్టం వాటిల్లింది. సహాయ శిబిరాల్లో ఇంకా లక్షమంది ఉన్నారు. తుపాను వల్ల ఒడిశాలో 21మంది, మన రాష్ట్రంలో ఇద్దరు మృతి చెందారు. -
తుపాను బాధితులకు వైఎస్సార్సీపీ చేయూత
వజ్రపుకొత్తూరు/పూండి/కవిటి/టెక్కలి, న్యూస్‌లైన్: పై-లీన్ తుపాను ప్రభావిత ప్రాం తాల్లో వైఎస్సార్సీపీ నేతలు పర్యటించారు. తుపాను వల్ల వాటిల్లిన నష్టాన్ని పరిశీలించారు. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి పిలుపుమేరకు సహాయక చర్యల్లో పాల్గొన్నారు. తుపాను బాధితులకు ఆహార పొట్లాలు, దుప్ప ట్లు పంపిణీ చేశారు. వజ్రపుకొత్తూరు మండలంలోని వజ్రపుకొత్తూరు, శారదాపురం, కిడిసింగి తదితర ప్రాంతాల్లో వాటిల్లిన నష్టాన్ని వైఎస్సార్సీపీ కేంద్ర పాలక మండలి సభ్యుడు డాక్టర్ కణితి విశ్వనాథం పరిశీలించారు. తుపాను వల్ల నష్టపోయిన జీడిమామిడి, కొబ్బరి, వరి రైతులతో పాటు మత్స్యకారులను ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. వజ్రపుకొత్తూరు మండలంలో తుఫాన్ బాధితులకు వైఎస్సార్ సీపీ పలాస నియోజకవర్గ సమన్వయకర్త వజ్జ బాబూరావు అల్పాహారం అందించారు. హుకుంపేట, మంచినీళ్ళపేట గ్రామాల్లో 600 మందికి రొట్టెలు, పాలు, పండ్లు అందజేశారు. నువ్వలరేవు గ్రామస్తులకు ఆదివారం ఉదయం అల్పాహారం అందజేశారు. అనంతరం పల్లిసారథి గ్రామంలో టేకు చెట్టు పడి ఇల్లు ధ్వంసమైన పోతనపల్లి అప్పలస్వామిని పరామర్శించారు. పార్టీ ప్రచార కమిటీ కన్వీనర్ టి.సురేష్‌రెడ్డి ఆర్థిక సాయంతో నిర్వహిస్తున్న కార్యక్రమంలో పార్టీ నేతలు డబ్బీరు భవానీశంకర్, బల్ల గిరిబాబు, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన వైఎస్సార్సీపీ శ్రీకాకుళం పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకుడు పిరియా సాయిరాజ్, విజయలక్ష్మి బాధితులకు ధైర్యం చెప్పారు. అనంతరం ఇద్దివానిపాలెంలో ఉద్దానం ఫౌండేషన్ ద్వారా మత్స్యకారులకు దుప్పట్లను పంపణీ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ శ్రీరాంప్రసాద్ పాల్గొన్నారు. టెక్కలి, సంతబొమ్మాళి మండలాల్లోని తుపాను ప్రభావిత గ్రామాల్లో వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త దువ్వాడ శ్రీనివాస్ పర్యటించి పరామర్శించారు. నియోజకవర్గంలో వాటిల్లిన నష్టంపై పార్టీ తరపున నివేదిక రూపొందించి జిల్లా ఉన్నతాధికారులకు సమర్పిస్తామని శ్రీనివాస్ తెలిపారు. ఇళ్లు కోల్పోయిన బాధితులకు ప్రభుత్వం పక్కా ఇళ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. -
నడవని రైళ్లు
ఆమదాలవలస, న్యూస్‌లైన్: పై-లీన్ ప్రభావంతో రైళ్లు ఎక్కడికక్కడే నిలిచిపోయూరుు. దసరా పండగకు స్వగ్రామాలకు చేరుకోవాలనుకునే దూరప్రాంత ప్రయూణికులు ఇబ్బందులు పడ్డారు. ప్రైవేటు వాహనాలను ఆశ్రరుుంచి గమ్యస్థానాలకు చేరుకున్నారు. తూర్పుకోస్తా రైల్వే (భువనేశ్వర్), దక్షిణ మధ్యరైల్వే (సికింద్రాబాద్), దక్షణ తూర్పు రైల్వే(కోల్కత్తా) డివిజన్ల పరిధిలోని రైళ్లను ఆదివారం కూడా రద్దు చేశారు. దీంతో రైల్వే ఆదాయూనికి భారీ గండి పడింది. పలాస-విశాఖపట్నంల మధ్య పాసింజర్ సర్వీసులను, భువనేశ్వర్-విశాఖపట్నం ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్(18411/18412)లను రెండు రోజుల కిందటే నిలిపివేశారు. కొన్ని గూడ్స్రైళ్లు శ్రీకాకుళం రోడ్(ఆమదాలవలస) రైల్వే స్టేషన్లోనే నిలుపుదల చేశారు. యశ్వంత్‌పూర్, ప్రశాంతి, చెన్నై మెయిల్, విశాఖ ఎక్స్‌ప్రెస్, కోణార్క్, ఫలక్నామా, ఈస్ట్‌కోస్ట్ వంటి రైళ్లన్నీ రద్దు చేశారు. దీంతో ప్రయాణికులు ముందు చేయించుకున్న రిజర్వేషన్లను రద్దు చేసుకోవడంతో రైల్వే శాఖకు భారీ నష్టం వాటిల్లింది. టిక్కెట్ చార్జీలను తిరిగి చెల్లించారు. ప్రస్తుతం వాతావరణం ప్రశాంతంగా ఉండడంతో రైల్వే ఉన్నతాధికారులు లైన్లను పరిశీలిస్తున్నారు. సిబ్బందితో పాడైన లైన్ల పునరుద్ధరణ పనులు వేగవంతం చేశారు. ఒడిశాలోని రైల్వేలైన్లు ఎక్కువగా దెబ్బతిన్నాయని, వాటి పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నందున సోమవారం నాటికి రైళ్లు నడిచే అవకాశాలు ఉన్నాయని రైల్వే అధికారులు తెలిపారు. వాల్తేరు నుంచి వచ్చిన రైల్వే ఉన్నతాధికారుల బృందం ైరైల్వే లైన్ల పనులను పరిశీలిస్తోంది. -
74 వేల మత్స్యకార కుటుంబాలకు నిత్యావసర సరుకులు
టెక్కలి రూరల్, న్యూస్‌లైన్: పై-లీన్ తుపాను ప్రభావాన్ని జిల్లాలో సమర్ధంగా ఎదుర్కొన్నామని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ఎన్.రఘువీరారెడ్డి చెప్పారు. టెక్కలిలో కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి నివాసంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆస్తి నష్టాలను పక్కన పెడితే ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని వెల్లడించారు. తుపాను ప్రభావిత తీర గ్రామాలకు చెందిన సుమారు 74 వేల మత్స్యకార కుటుంబాలను నిత్యావసర సరుకులను పంపిణీ చేస్తున్నామని చెప్పారు. తుపాన్ నష్టాలను పారదర్శకంగా అంచనా వేస్తామని స్పష్టం చేశారు. రాష్ట్ర విభజనపై అడిగిన ప్రశ్నకు బదులిస్తూ 2014 ఎన్నికల వరకు రాష్ట్రం సమైక్యంగానే ఉంటుందన్నారు. శాసనసభలో తెలంగాణ బిల్లును వ్యతిరేకిస్తామన్నారు. సమావేశంలో కేంద్ర మంత్రి కృపారాణి, రాష్ట్ర మంత్రులు బాలరా జు, గంటా శ్రీనివాస్ పాల్గొన్నారు. నష్టపరిహారం అందిస్తాం.. సోంపేట(కంచిలి): తుపాను వల్ల నష్టపోయినవారికి పరిహారం అందిస్తామని రాష్ట్ర రెవెన్యూ మంత్రి రఘువీరారెడ్డి నేతృత్వంలోని మంత్రుల బృందం హామీ ఇచ్చింది. తుపాను బాధిత గ్రామాలైన బారువ కొత్తూరు, వాడపాలెం, కవిటి తదితర ప్రాంతాల్లో ఆదివారం ఉదయం మంత్రుల బృందం పర్యటించింది. బాధితులతో మాట్లాడి వివరాలు తెలుసుకుంది. బోట్లు, వలలు సముద్రంలో కొట్టుకుపోవటం, చిరిగిపోవటంతో ఒక్కో కుటుంబానికి లక్షలాది రూపాయల్లో నష్టం వాటిల్లిందని బాధిత మత్స్యకారులు వాపోయారు. కంటి తుడుపు చర్యగా వచ్చి పరామర్శించి వెళ్లిపోవటం సరికాదని కొందరు మహిళలు మంత్రుల్ని నిలదీశారు. ప్రభుత్వ స్పందన బాగోలేదని ఆరోపించారు. ఈ సందర్భంగా మంత్రి రఘువీరారెడ్డి మాట్లాడుతూ ఇంతటి నష్టం జరగటం బాధాకరమేనని, తొందర్లో సహాయం అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఈ పర్యటనలో కేంద్రమంత్రి డాక్టర్ కిల్లి కృపారాణి, రాష్ట్ర మంత్రులు శత్రుచర్ల విజయరామరాజు, కోండ్రు మురళీమోహన్, గంటా శ్రీనివాస్, బాలరాజు పాల్గొన్నారు. వీరితోపాటు వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే పిరియా సాయిరాజ్, కాంగ్రెస్ నేత డాక్టర్ ఎన్.దాస్ తదితరులు పాల్గొన్నారు. -
ఉద్దానం కకావికలం
(ఉద్దానం నుంచి సాక్షి బృందం): పై-లీన్ తుపాను బీభత్సానికి శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతం కకావికలమైంది. శనివారం రాత్రి వీచిన ప్రచండ గాలులకు ఒకరు మృతి చెందారు. సుమారు రూ.1,000 కోట్లకు పైగా నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక అంచనా. ఉద్యాన పంటలు దాదాపు తుడిచిపెట్టుకుపోయాయి. మిగతా పంటలు కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయి. వందల సంఖ్యలో విద్యుత్ స్తంభాలు నేలమట్టమయ్యాయి. 200 విద్యుత్ ఫీడర్లు, 16 సబ్ స్టేషన్లు పాడయ్యాయి. చెరువులు, రోడ్లు, భవనాలకు తీవ్రంగా నష్టం వాటిల్లింది. 87 పశువులు మృత్యువాత పడ్డాయి. మత్స్యకారులకు తీవ్ర నష్టం వాటిల్లింది. పడవలు, వలలు, ఇళ్లు దెబ్బతిన్నాయి. ఈ నష్టం రూ.6 కోట్ల వరకు ఉండొచ్చని ప్రాథమిక అంచనా. ఉద్దానం ప్రాంతంలోని ఇచ్ఛాపురం, కవిటి, కంచిలి, సోంపేట, మందస, వజ్రపుకొత్తూరు మండలాల్లోని 233 గ్రామాలు అతలాకుతలమయ్యాయి. 1999లో విరుచుకుపడిన సూపర్ సైక్లోన్ రోజును మళ్లీ గుర్తు చేశాయి. అప్పుడు కూడా దసరాకు ముందే భీకర గాలులు వీచాయి. ఆ నష్టం నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న రైతులకు తాజా తుపాను శరాఘాతమైంది. కొబ్బరి సుమారు 16,325 ఎకరాలు, మామిడి 1,000 ఎకరాలు, అరటి 500 ఎకరాలు, మునగ 100 ఎకరాల మేర దెబ్బతిన్నాయి. 29 వేల ఎకరాల వరి పంటకు నష్టం వాటిల్లింది. 5,141 హెక్టార్లలో ఉద్యానవన పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఆరు మండలాల్లో సుమారు వంద ఇళ్లు కూలిపోయాయి. మరో 50 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. రోడ్డుపై చెట్లు పడిపోవడంతో వందలాది గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మత్స్యకార గ్రామాల పరిస్థితి దయనీయంగా ఉంది. అలల తాకిడికి, వరద ఉధృతికి రోడ్లు దాదాపు దెబ్బతిన్నాయి. వందల సంఖ్యలో వలలు, పదుల సంఖ్యలో పడవలు కొట్టుకుపోయాయి. చాలా ఇళ్లు దెబ్బతిన్నాయి. కాగా, తుపాను నేపథ్యంలో శ్రీకాకుళంలోని పునరావాస కేంద్రాలలో ఆశ్రయం పొందుతున్న వారి పరిస్థితి దయనీయంగా ఉంది. వారి అవసరాలను పట్టించుకునే వారే కరవయ్యారు. తుపాన్ తీరం దాటాక బాధిత గ్రామాలకు అధికారులు వెళ్లడంలో శ్రద్ధ చూపించడం లేదు. జిల్లా వ్యాప్తంగా 52 పునరావాస కేంద్రాల్లో దాదాపు 61 వేల మందికి ఆశ్రయం కల్పించారు. చాలా మందికి సరిగా భోజనం అందలేదు. కొన్నిచోట్ల మంచినీళ్లతోనే సరిపెట్టేశారు. తమను పట్టించుకునే వారే కన్పించలేదని బారువ శివారు గ్రామాలైన కొత్తూరు, వాడపాలెం మత్స్యకారులు వాపోయారు. నష్టపోయిన గ్రామాల పరిస్థితేంటో ఆరా తీసే ప్రయత్నం జరగలేదు. అధికార యంత్రాంగం కార్యాలయాల్లోనే ఉండి నష్టం అంచనాలు వేస్తున్నారు. జాతీయ విపత్తు నివారణ బృందాలే కొన్ని గ్రామాల్లో సహాయ చర్యలు చేపడుతున్నాయి. మొత్తం 9 బృందాలు స్థానిక పోలీసులు, రెవెన్యూ విభాగాల సహకారంతో సహాయ చర్యల్లో పాల్గొంటున్నాయి. ఈ ఆపరేషన్ పూర్తయ్యేంత వరకూ తమ సిబ్బంది ఇక్కడే ఉంటారని అసిస్టెంట్ కమాండెంట్ కృష్ణకుమార్ ‘సాక్షి’కి చెప్పారు. కాగా, ఇచ్ఛాపురం మండలంలోని మండపల్లి, మశాకపురం, తేలుకుంచి, కొళిగాం, పాయితారి, కీర్తిపురం, రత్తకన్న, డొంకూరు, పెదలక్ష్మీపురం గ్రామాలను వరద నీరు భయపెడుతోంది. ఈ గ్రామాలకు వెళ్లాలంటే అటు భీమ సముద్రం ఇటు బహుదానది మధ్య ఉండే ఒకే ఒక రోడ్డు వరద నీటిలో చిక్కుకుంది. మరోపక్క విజయనగరం జిల్లాలోని సీతానగరం, బలిజిపేట, మక్కువ, సాలూరు మండలాల్లో వందలాది ఎకరాల్లో పంట నాశనమైంది. మొక్కజొన్న, అరటి, చెరుకు పంటలు ఎక్కువగా దెబ్బతిన్నాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో చెట్లు విరిగి రాకపోకలకు ఇబ్బంది కలిగింది. -
పలు రైళ్ల పునరుద్ధరణ
సాక్షి, విశాఖపట్నం: పై-లీన్ తుపాను ప్రభావం కాస్త తగ్గడంతో కొన్ని రైళ్లను పునరుద్ధరిస్తున్నట్లు తూర్పు కోస్తా రైల్వే ఆదివారం ప్రకటించింది. పలు స్టేషన్లలో నిలిచిపోయిన ప్రయాణికుల కోసం ప్రత్యేక రైళ్లను నడిపినట్లు తెలిపింది. హౌరా- పూరి మధ్య రైలు సర్వీసులను పునరుద్ధరించినట్లు పేర్కొంది. భువనేశ్వర్-రూర్కెలా ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్, పూరి- సంబల్పూర్ ఎక్స్‌ప్రెస్, భువనేశ్వర్-న్యూఢిల్లీల మధ్య సంపర్క్‌క్రాంతి, రాజధాని ఎక్స్‌ప్రెస్‌లు ఆదివారం సాయంత్రం షెడ్యూల్ సమయం కన్నా ఆలస్యంగా భువనేశ్వర్ నుంచి బయల్దేరినట్లు తెలిపింది. పూరి నుంచి బయల్దేరనున్న కొన్ని ఎక్స్‌ప్రెస్ రైళ్లను షెడ్యూల్ ప్రకారమే నడిపిస్తున్నామని, మరికొన్ని ఆలస్యంగా బయల్దేరుతాయని పేర్కొంది. రద్దు లేదా పాక్షిక రద్దు: పై- లీన్ తుపాను ప్రభావం ఆదివారం రైల్వే వ్యవస్థపై తీవ్రంగా పడింది. ముఖ్యంగా విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు ఒడిశా వైపు వెళ్లే దాదాపు అన్ని రైళ్లను రద్దు చేయడమో, లేక కొద్దిదూరం వరకు తీసుకెళ్లి నిలిపేయడమో చేశారు. దాంతో ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. రైల్వే శాఖ కూడా భారీగా నష్టపోతోంది. వాల్తేరు డివిజన్‌కు ఇప్పటివరకు రూ. 32 కోట్లకు పైగా నష్టం వాటిల్లినట్లు అధికారులు తెలిపారు. తూర్పు కోస్తా రైల్వే, దక్షిణ మధ్య రైల్వే దాదాపు 70 రైలు సర్వీసులను రద్దు చేశాయి. విశాఖపట్నం హౌరాల మధ్య అన్ని రైళ్లను ఆదివారం కూడా రద్దుచేశారు. ముంబై, చెన్నైల నుంచి హౌరా వైపు వస్తున్న కొన్ని రైళ్లను దారి మళ్లించారు. తుపాను ప్రభావంతో ట్రాకులు దెబ్బతినడం, ట్రాకులపైకి నీళ్లు రావడంతో ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించాయి. హైదరాబాద్-హౌరా ఈస్ట్‌కోస్ట్, సికింద్రాబాద్- గువాహటి ఎక్స్‌ప్రెస్ రైళ్లను కాజీపేట్, నాగపూర్ మీదుగా నడుపుతున్నారు. జల్పాయ్గురి -చెన్నై ఎక్స్‌ప్రెస్‌ను బిలాస్పూర్, నాగ్‌ఫూర్, వరంగల్, విజయవాడల మీదుగా; హల్దియా-చెన్నై ఎక్స్‌ప్రెస్‌ను ఖరగ్ఫూర్, బిలాస్పూర్, బల్లార్షా, విజయవాడల మీదుగా నడుపుతున్నారు. కొన్ని ముఖ్యమైన ఎక్స్‌ప్రెస్ రైళ్లను మాత్రం తూర్పుగోదావరి జిల్లా వరకే నడిపి తిరిగి అక్కడినుంచి వెనక్కు పంపుతున్నారు. రైళ్లు రద్దు కావడంతో రిజర్వేషన్లు చేయించుకున్న ప్రయాణికులకు డబ్బులు వెనక్కు ఇచ్చేందుకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటుచేసింది. విశాఖ నుంచి విజయవాడ మీదుగా వెళ్లే రైళ్లలో గరీబ్థ్,్ర గోదావరి, ముంబై వైపు వెళ్లే ముఖ్యమైన వాటిని ఆలస్యమైనా పంపేందుకు ప్రయత్నిస్తున్నారు. రద్దు చేసిన సర్వీసులు: భువనేశ్వర్- తిరుపతి, భువనేశ్వర్- సికింద్రాబాద్, పూరి- తిరుపతి, తిరుపతి-బిలాస్పూర్, భువనేశ్వర్- ముంబై, తిరుపతి-భువనేశ్వర్, ఎక్స్‌ప్రెస్ రైళ్లు, విజయవాడ-రాయిగఢ్, మచిలీపట్నం-విశాఖ, విజయవాడ-విశాఖ, కాకినాడ-విశాఖ ప్యాసెంజర్ రైళ్లను కూడా రద్దు చేశారు. ముంబై-భువనేశ్వర్ (కోణార్క్ ఎక్స్‌ప్రెస్), బెంగళూరు- భువనేశ్వర్(ప్రశాంతి ఎక్స్‌ప్రెస్), యశ్వంత్‌ఫూర్- పూరి ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్-భువనేశ్వర్(విశాఖ ఎక్స్‌ప్రెస్) రైళ్లను విశాఖపట్నం, భువనేశ్వర్‌ల మధ్య పాక్షికంగా రద్దు చేశారు. పలాస వరకే అనుమతి: ఒడిశా, శ్రీకాకుళం ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు కొన్నిచోట్ల పట్టాలు దెబ్బతిన్నట్లు గుర్తించారు. దాంతో వాల్తేరు డివిజన్ పరిధిలో సికింద్రాబాద్, విజయవాడ, తిరుపతి, బెంగళూరు, చెన్నై, మహారాష్ట్రల నుంచి విశాఖ మీదుగా ఒడిశా, కోల్‌కతా వెళ్లే రైళ్లతో పాటు ప్యాసింజర్ రైళ్లను శ్రీకాకుళం జిల్లా పలాస వరకు మాత్రమే నడుపుతున్నారు. పలాసలో ఆహార, వసతి తదితర ఇబ్బందులు కలిగే అవకాశముండటంతో కొన్ని రైళ్లను విశాఖ వద్ద రద్దుచేస్తున్నారు. -
సైబీరియా అతిథులను కబళించిన పై-లీన్
సాక్షి, ఇచ్ఛాపురం: ఖండాంతరాలు దాటి.. వేల కిలోమీటర్లు ప్రయాణించి.. సిక్కోలు తీరం వచ్చిన ‘విదేశీ అతిథుల’ను పై-లీన్ పొట్టన పెట్టుకుంది. ప్రతి సంవత్సరంలాగే ఈ ఏడాది కూడా శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండలంలోని తేలుకుంచి గ్రామానికి సైబీరియా నుంచి వలసవచ్చిన సుమారు నాలుగు వేలకు పైగా పక్షులు శనివారం రాత్రి పెను తుపాను తాకిడికి మృతి చెందాయి. సైబీరియా పక్షులు (నత్తగొట్టు పిల్లలు,కొంగ లు, సిలికాన్ పక్షులు) ఏటా జూన్, జూలై నెలల్లో సంతానోత్పత్తి కోసం ఇక్కడికి వలస వస్తాయి. దాదాపు ఐదారు నెలలు ఇక్కడే ఉండి సంతానోత్పత్తి అనంతరం తిరిగి తమ దేశాలకు వెళ్లిపోతాయి. ఏటా క్రమం తప్పకుండా వేల సంఖ్యలో వచ్చే ఈ పక్షులను ఆత్మబంధువులుగా భావించే స్థానికులు ఎంతో పదిలంగా సంరక్షిస్తారు. ఈ పక్షులను ఎవరూ వేటాడటం కానీ, పట్టుకుని అమ్మటం కానీ చేయరాదనేది ఊరి కట్టుబాటు. శనివారం రాత్రి తుపాను తీరం దాటే సమయంలో దాదాపు 220 కిలోమీటర్ల వేగంతో వీచిన ఈదురు గాలులకు దాదాపు నాలుగు వేల పక్షులు ప్రాణాలొదిలాయి. కొన్ని పక్షులను ఇక్కడి నత్తగొట్టు పిల్లల సంరక్షణ కేంద్రంలో భద్రపరిచినా ప్రయోజనం లేకపోయింది. కాగా.. ఒంటికాలిపై నిలబడి తమ అందాలతో చూపరుల్ని ఆకర్షించే విదేశీ పక్షులు ఇక్కడి జంతువులకు ఆహారమైపోతున్నాయి. విపత్కర సమయాల్లో అటవీశాఖ నిర్లక్ష్యం వహిస్తోంది. ఎన్నోమార్లు విజ్ఞప్తి చేస్తే చిన్న షెడ్ ఒకటి కట్టించారు తప్పితే వాటి సంరక్షణకు టవర్ నిర్మాణం చేపట్టలేదు. నెట్ తరహా రక్షణ ఉంటే ఇంత జరిగేది కాదని నిపుణులు చెప్తున్నారు. -
లార్డ్ స్వరాజ్‌పాల్ రూ. 25 లక్షల సాయం
బీకాన్స్‌ఫీల్డ్(ఇంగ్లండ్): భీకర పై- లీన్ తుపానును సమర్ధంగా ఎదుర్కొన్నారని భారతీయ అధికారులను ప్రవాస భారతీయ పారిశ్రామికవేత్త లార్డ్ స్వరాజ్‌పాల్ ప్రశంసించారు. ప్రాణనష్టం తగ్గించేందుకు కేంద్ర, రాష్ట్రాల అధికారులు, త్రివిధ దళాలు చేసిన ప్రయత్నాలు ప్రశంసనీయమంటూ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. సహాయ, పునరావాస కార్యక్రమాల కోసం తన వంతుగా * 25 లక్షలను అందిస్తున్నట్లు తెలిపారు. ప్రముఖుల ట్వీట్స్ అమితాబ్‌బచ్చన్: ‘దేవతల ఆగ్రహ ఫలితం పై-లీన్. జాగ్రత్తగా ఉండండి’ మాధురీదీక్షిత్: ‘ఈ తుపాను కష్టం నుంచి గట్టెక్కే ధైర్యాన్ని బాధిత ప్రజలకు ఇవ్వాల్సిందిగా దేవుడిని ప్రార్థిస్తున్నా’ అక్షయ్‌కుమార్: ప్రకృతి ప్రకోపానికి గురైన వారికోసం ప్రార్థిస్తున్నా. శాంతించాలని తప్ప పై-లీన్‌ను ఇంకేం కోరగలం’ మీరానాయర్: ‘ఒడిశా నా స్వరాష్ట్రం. నా రాష్ట్రప్రజలకు ధైర్యం ఇవ్వాల్సిందిగా ఆ దేవుడిని ప్రార్థిస్తున్నా’ అనుపమ్‌ఖేర్: ‘ప్రకృతి ఆగ్రహించిన ప్రతీసారి మన ఆస్తిత్వం ప్రశ్నార్థకమవుతుంది’ -
అప్రమత్తతే కాపాడింది
న్యూఢిల్లీ: పై-లీన్ తుపానుపై అప్రమత్తంగా ఉండడంతో భారీ స్థాయిలో ప్రాణ నష్టం తప్పిందని అధికారులు తెలిపారు. తుపాను స్థితిగతులపై కచ్చితమైన అంచనా, ప్రజలను త్వరగా సురక్షిత ప్రాంతాలకు తరలించడం, భారీస్థాయిలో ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడంతో నష్టాన్ని వీలైనంత మేర తగ్గించగలిగినట్లు చెప్పారు. విపత్తును ఎదుర్కోడానికి తాము ప్రణాళికాబద్ధంగా చేసిన ప్రయత్నాలు ఫలించాలని జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ(ఎన్డీఎంఏ) ఉపాధ్యక్షుడు మర్రి శశిధర్ రెడ్డి ఆదివారం పీటీఐతో అన్నారు. ముప్పును సరిగ్గా అంచనా వేసిన వాతావరణ విభాగం, సహాయ కార్యక్రమాలను సమన్వయం చేసిన కేంద్ర హోం శాఖ, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. భువనేశ్వర్‌లోని డాప్లర్ రాడార్ల సాయంతో పై-లీన్ తీవ్రతను, గమనాన్ని కచ్చింతగా అంచనా వేయగలిగామని భారత వాతావరణ విభాగం డెరైక్టర్ జనరల్ ఎల్ఎస్ రాథోడ్ చెప్పారు. -
బలహీనపడుతున్న పై-లీన్ తుపాను
భువనేశ్వర్/విశాఖపట్నం: పై-లీన్ తుపాను క్రమంగా బలహీనపడుతోంది. ఉత్తరాంధ్ర, ఒడిశాలలో 90 లక్షల మందిపై ఇది ప్రభావం చూపింది. లక్షల సంఖ్యలో ఇళ్లు దెబ్బతిన్నాయి. వరి, కొబ్బరి, జీడి మామిడి తోటలు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. ఒక్క ఒడిశాలోనే 2,400 కోట్ల రూపాయల విలువైన పంట నష్టం జరిగింది. ఒడిశాలోని 14,514 గ్రామాలపై తుపాను ప్రభావం పడింది. 2.34 లక్షల ఇళ్లు ధ్వంసం అయ్యాయి. విద్యుత్, టెలికమ్యూనికేషన్లకు తీవ్ర అంతరాయం కలిగింది. గంజాం జిల్లా తీవ్రంగా దెబ్బతింది. గోపాల్పూర్ ప్రాంతంలో రెస్టారెంట్లు హొటళ్లు ధ్వంసం అయ్యాయి. తుపాను బాధితులు స్వస్థలాలకు తిరిగి వస్తున్నారు. గోపాల్పూర్ లైట్‌హౌస్ తుపానువేగాన్ని తట్టుకుని నిలబడింది. శ్రీకాకుళం జిల్లాలో 39 గ్రామాల్లోకి నీళ్లు వచ్చి చేరాయి. ఒడిశాలోని ఎన్‌హెచ్-5పై వాహనాలు ఇంకా నిలిచే ఉన్నాయి. గోపాల్పూర్ సమీపంలో రోడ్డుమార్గం మూసుకుపోయింది. తుపాను భయంతో రోడ్డు వెంబడి హోటళ్లు, దాబాలు మూసివేశారు. విశాఖ - కోల్‌కత రోడ్డు మార్గంలో అనేకచోట్ల ట్రాఫిక్ జామ్ అయింది. హౌరా- పూరి మధ్య రైలు సర్వీసులు ప్రారంభించారు. ప్రస్తుతం ఒడిశాలోని జర్సగూడా వద్ద గంటకు 70 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. కోల్‌కత సమీపంలో సరుకు రవాణానౌక మునిగిపోయింది. కోల్‌కత సముద్రతీరానికి 25 కి.మీ దూరంలో ఈ ఘటన జరిగింది. పనామాకు చెందిన ఎం.వి.బింగోగా దీనిని గుర్తించారు. -
ప్రచండ పవనాల ముప్పు ముగిసింది: ఐఎండీ
న్యూఢిల్లీ: ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు ప్రచండ పవనాల ముప్పు ఇక తప్పినట్టే. పై-లీన్ తుఫాన్ తీరాన్ని దాటే సమయంలో విజృంభించిన గాలులు బీభత్సం సృష్టించాయి. దాదాపు గంటకు 220-240 కిలోమీటర్ల వేగంతో విరుచుకుపడిన పెనుగాలుల ధాటికి సముద్రతీర ప్రాంతాలు చిగురుటాకులా వణికాయి. ప్రభుత్వం యంత్రాంగం చురుగ్గా స్పందించడంతో ప్రాణనష్టం లేనప్పటికీ ఆస్తినష్టం ఎక్కువగానే జరిగింది. తీరప్రాంత వాసులకు పెనుగాలుల ముప్పు ఇక లేనట్టేనని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) తాజాగా వెల్లడించింది. అయితే 48 గంటల్లో ఒడిశా, ఆంధ్రప్రదేశ్ సహా బీహార్‌లోనూ భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ డైరెక్టర్ జనరల్ ఎల్ఎస్ రాథోడ్ తెలిపారు. వచ్చే 12 గంటల్లో ఒడిశాలో గంటకు 100-110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశముందన్నారు. ఒడిశాలోని సంబల్పూర్కు 50 కిలోమీటర్ల దూరంలో తుఫాన్ కేంద్రీకృతమైవుందన్నారు. దీని ప్రభావంతో ఒడిశా, ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపారు. అప్రమత్తంగా ఉండాలని బీహార్‌కు సూచించామని రాథోడ్ చెప్పారు. పై-లీన్ తుఫాన్ నేపాల్ వైపు మళ్లే అవకాశముందన్నారు. -
మరుభూమిగా మారిన బరంపురం
-
కిరణ్‌తో బొత్స, మంత్రుల భేటీ
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డితో క్యాంపు కార్యాలయంలో పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, పలువురు మంత్రులు సమావేశమయ్యారు. పై-లీన్ తుఫాన్ ప్రభావంపై సమీక్ష జరుపుతున్నారు. తుఫాన్ సహాయక చర్యల గురించి తెలుసుకుంటున్నారు. మరోవైపు రాష్ట్ర రెవెన్యు మంత్రి రఘువీరా రెడ్డి ఉత్తరాంధ్ర జిల్లాల్లో పర్యటిస్తున్నారు. పై-లీన్ తుపాన్ కారణంగా తలెత్తిన పరిస్థితిని ఆయన అంచనా వేస్తున్నారు. తుపాను ప్రభావం వల్ల వేటకు వెళ్లని మత్స్యకారులను ఆదుకోవాలని సీఎంను ఆయన కోరారు. 74వేల మత్స్యకార కుటుంబాలకు నిత్యవసరాలు పంపిణీ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఉత్తరకోస్తాకు ఇంకా తుఫాను ముప్పు తొలగిపోలేదన్న హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం మరింత అప్రమత్తమయింది.వచ్చే12 గంటల్లో ఉత్తరకోస్తాలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. -
పై-లీన్ తుపాను కకావికలం
గోపాల్పూర్ వద్ద పై-లిన్ తుపాను శనివారం(12-10-13) సాయంత్రం 6.25 గంటలకు తీరాన్ని తాకింది. తుపాను తీరం తాకినట్లు అమెరికా వాతావరణ శాఖ ప్రకటించింది. తుపాను ప్రభావం వల్ల కొన్నిచోట్ల సముద్రం 20 మీటర్లు ముందుకు వచ్చింది. కొన్ని చోట్ల అలలు 5 మీటర్ల ఎత్తున ఎగసిపడ్డాయి. బందరువానిపేట గ్రామం వైపు వేగంగా దూసుకొస్తున్న అలలుబందరువానిపేటలో అలల ఉధృతిబందరువానిపేటలో బోట్లను ఒడ్డుకు చేరుస్తున్న మత్స్యకారులుబందరువానిపేట తీరంలో సముద్రం నుంచి ఒడ్డుకు చేరుకున్న పడవలుసురక్షిత ప్రాంతాలకు వెళ్లాలంటూ అగ్నిమాపక సిబ్బంది ప్రచారంసముద్రంలో చిక్కుకున్న బోటుఇచ్ఛాపురం మండలం ఈదుపురంలో బస్సుల్లోకి జనాలను తరలిస్తున్న దృశ్యంకొర్లాం జంక్షన్లో పడిపోయిన దుర్గామండపంఇచ్ఛాపురం: పునరావాస కేంద్రాల్లో భోజనాలు చేస్తున్న బాధితులుఇచ్ఛాపురం తహశీల్దార్ కార్యాలయానికి తరలి వస్తున్న ప్రజలుకళింగపట్నంలో వరద తాకిడికి తడిసి ముద్దయిన వలలుబందరువానిపేట ఊరిలోకి చొచ్చుకొచ్చిన సముద్రం నీరుబోట్లను బయటకు లాగుతున్న జాలర్లుబందరువానిపేట వద్ద రాకాసి అలల్లో కొట్టుకుపోతున్న పడవులుఎచ్చెర్ల:ట్రక్కులో తరలి వెళుతున్న మత్స్యలేశం ప్రజలుబందరువానిపేట వద్ద సముద్రంలో చిక్కుకున్న పడవలను బయటకు తెస్తున్న మత్స్యకారులుమొగదాలపాడు బ్రిడ్జి వద్ద సముద్రపు అలలుపూండి: మంచినీళ్లపేట వద్ద అలల ఉధృతికి కొట్టుకొచ్చిన బోట్లుపలాసలో కూలిన పూరిగుడిసెసోంపేట పునరావాస కేంద్రంలో బాధితులుసంతబొమ్మాళి:కోతకు గురైన కొత్తపేట రోడ్డుకొర్లాంలో గాలులకు ఎగిరిపోయిన ఇంటి రేకులుబందరువానిపేటలో నీటమునిగిన స్కూళుకళింగపట్నం వద్ద నీట మునిగిన అమ్మవారి ఆలయంఇచ్ఛాపురం:అమ్మవారి ఆలయంలో కూలిన కర్రల టెంటుఅలల తాకిడికి కొట్టుకుపోయిన కళింగపట్నం బీచ్‌కు వెళ్లే దారిఇచ్ఛాపురం: ఫ్లై ఓవర్ కింద మేకలను ఉంచిన కాపరులుఈదురు గాలికి చెట్లలుఇచ్ఛాపురం:బంగ్లా రోడ్లో విరిగిన చెట్లుకంచిలి మండల పరిషత్ కార్యాలయం వద్ద పడిపోయిన చెట్టు -
పై-లీన్ పంజా
గోపాల్పూర్/శ్రీకాకుళం/విశాఖపట్నం, సాక్షి: ప్రళయ భీకర పెనుగాలులతో.. ఉవ్వెత్తున ఎగసిపడే రాకాసి అలలతో.. ఎడతెగని కుంభవృష్టితో.. పెను తుపాను పై-లీన్ తూర్పు తీరంపై పంజా విసిరింది. నింగినీ నేలనూ ఏకం చేస్తూ ఆంధ్రప్రదేశ్ సరిహద్దులో ఒడిశాలోని గోపాల్పూర్ వద్ద శనివారం రాత్రి 9:12 గంటలకు ఈ ‘ఇంద్రనీలం’ తుపాను తీరం దాటింది. ఇల్లూ వాకిలీ వదిలి తీరం నుంచి ముందుగానే దూరంగా తరలిపోవటంతో ప్రజల ప్రాణాలు దక్కాయి. కానీ.. గంటకు 200 కిలోమీటర్ల వేగంతో వీస్తున్న ప్రచండ గాలులు, ఆకాశానికి చిల్లుపడ్డట్లు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాతో పాటు, ఒరిస్సాలోని గంజాం, పూరి, కేంద్రపడ, ఖుర్దా, జగత్సింగ్పూర్ జిల్లాలను అతలాకుతలం చేస్తున్నాయి. మహా వృక్షాలు కూకటి వేళ్లతో కూలిపోతున్నాయి. పూరిళ్లు గడ్డిపరకల్లా ఎగిరిపోతున్నాయి. విద్యుత్ స్తంభాలు విరిగిపడుతున్నాయి. విద్యుత్ లైన్లు, టెలిఫోన్ లైన్లు తెగిపోయాయి. లక్షలాది ఎకరాల్లో పంటలు నీటమునిగాయి. వందల సంఖ్యలో ఇళ్లు కూలిపోయాయి. రోడ్డు, రైలు, వాయు, జల మార్గాల్లో రవాణా స్తంభించిపోయింది. విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. తుపాను ప్రభావిత ప్రాంతమంతటా అంధకారం అలముకుంది. తుపాను తాకటానికి ముందు భారీ గాలులకు ఒడిషాలో చెట్లు కూలి ముగ్గురు వ్యక్తులు మరణించటం మినహా.. అర్థరాత్రి వరకూ ఎలాంటి ప్రాణనష్టం వార్తలు రాలేదు. ఒడిశాలో ఐదు లక్షల మంది, ఆంధ్రప్రదేశ్‌లో లక్ష మందికి పైగా సహాయ శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. అయితే.. తుపాను తీరం దాటినప్పటికీ ఇంకా ఆరేడు గంటల పాటు తీవ్ర తుపానుగానే ఉంటుందని.. పెనుగాలులు, భారీ వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో తుపాను సృష్టించే బీభత్సం ఎంతగా ఉంటుందన్నది ఆదివారం కానీ అంచనా వేయలేని పరిస్థితి నెలకొంది. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు రాత్రంతా భయాందోళనలతో గడుపుతున్నారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయ చర్యల కోసం జాతీయ విపత్తు సహాయ దళం, కేంద్ర రిజర్వు పోలీసు దళంతో పాటు.. త్రివిధ సైనిక బలగాలు రంగంలోకి దిగాయి. తీరం దాటేందుకు గంట సమయం... ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌లలోని సముద్ర తీర ప్రజలను నిలువునా వణికించిన పెను తుపాను పై-లీన్ శనివారం రాత్రి 9:12 గంటలకు.. కళింగపట్నం (ఆంధ్రప్రదేశ్) - పారాదీప్ (ఒడిశా)ల మధ్య గంజాం జిల్లా గోపాల్పూర్ వద్ద తీరాన్ని తాకింది. దాదాపు 15 కిలోమీటర్లు విస్తరించివున్న తుపాను నేత్రం (సైక్లోన్ ఐ) తీరం దాటడానికి గంట సమయం పట్టిందని వాతావరణ శాఖ తెలిపింది. కళింగపట్నం నుంచి పారాదీప్‌ల మధ్య ప్రాంతంలో పెను విధ్వంసం జరిగే అవకాశముందని వాతావరణ అధికారులు పేర్కొన్నారు. తుపాను తీరం దాటిన గంజాం జిల్లాతో పాటు.. ఇటువైపు ఉన్న శ్రీకాకుళం జిల్లా, అటువైపు ఒడిశాలోని ఖుర్దా, పూరి, జగత్సింగ్పూర్ జిల్లాల్లోనూ దీని ప్రభావం అత్యంత తీవ్రంగా ఉంది. ప్రభావిత ప్రాంతాల్లో శుక్రవారం రాత్రి నుంచే మొదలైన వర్షాలు, ఈదురు గాలులు శనివారం క్రమక్రమంగా పెరుగుతూ తుపాను తీరం దాటే సమయానికి కుంభవృష్టిగా, పెను గాలులుగా మారాయి. తుపాను తీరం దాటేటపుడు, దాటిన తర్వాత గంటకు 200 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. సముద్రంలో మూడు మీటర్ల నుంచి ఐదు మీటర్ల ఎత్తుకు అలలు ఉప్పొంగుతున్నాయి. ప్రభావిత ప్రాంతాల్లో 300 మీటర్ల నుంచి 600 మీటర్ల వరకూ సముద్రం ముందుకు చొచ్చుకొచ్చింది. ఈ జిల్లాలతో పాటు గజపతి, నయాగఢ్, కటక్, భద్రక్, కేంద్రపర జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఐదు లక్షల మందికి పైగా సహాయ శిబిరాలకు... ఒడిశాను అతలాకుతలం చేసి దాదాపు పది వేల మంది ప్రాణాలను బలిగొన్న 1999 నాటి పెను తుపాను తర్వాత.. మళ్లీ అంతటి తీవ్రస్థాయిలో ముంచుకొచ్చిన పై-లీన్ తుపానును ఎదుర్కొనేందుకు ఒడిశా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు ముందు నుంచే సహాయ చర్యలు చేపట్టాయి. ఒడిశాలో 4.25 లక్షల మందిని సహాయ శిబిరాలకు తరలించారు. తుపాను నేపథ్యంలో ఒడిశా రాజధాని భువనేశ్వర్ నుంచి శనివారం విమానాలు, రైలు సర్వీసులను రద్దు చేశారు. హౌరా - విశాఖపట్నంల మధ్య రైళ్ల రాకపోకలన్నిటినీ నిలిపివేశారు. ఒడిశా తీర ప్రాంతంతో పాటు, ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో శనివారం విద్యుత్ సరఫరా నిలిపివేశారు. రాత్రంతా కొనసాగనున్న తుపాను.. పై-లీన్ పెను తుపాను తీరం దాటేసినా మరో ఆరు గంటల పాటు దాని తీవ్రత కొనసాగుతుందని భారత వాతావరణ విభాగం ప్రకటించింది. ప్రస్తుతం 200 కిలోమీటర్ల వేగంతో వీస్తున్న గాలులు, అత్యంత భారీ వర్షాలు కొనసాగుతాయని.. శ్రీకాకుళం జిల్లా వాసులు ఇళ్లలో నుంచి బయటకు వెళ్లవద్దని రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ కమిషనరు డాక్టర్ టి.రాధ సూచించారు. తుపాను ప్రభావం ఆదివారం కూడా కొనసాగే అవకాశాలున్నాయని, తీర ప్రాంతాల్లో భారీ వర్షాలకు అవకాశం ఉందని విశాఖ వాతావరణ విభాగం తెలిపింది. తుపాను తీరం దాటేసినా దానిని అంటిపెట్టుకుని ఉన్న ‘వాల్ ఐ క్లౌడ్’ ప్రభావంతో మరో 24 గంటలు వర్షాలు, గాలులకు అవకాశం ఉంటుందన్నారు. తుపాను తీరం దాటిన ఆరు గంటల తర్వాత మరో ఆరు గంటల పాటు 100 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, ఆ తర్వాత మరో ఆరు గంటల పాటు 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో గాలులు ఉంటాయని వాతావరణ శాఖ వివరించింది. రాబోయే 48 గంటల్లో గంజాం, పూరి, గజపతి, ఖుర్దా, జగత్సింగ్పూర్, నయాగడ్, కటక్, భద్రక్, కేంద్రపర జిల్లాల్లో అతి భారీ వర్షాలు ఉంటాయని తెలిపింది. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్ని బట్టి కళింగపట్నం, భీమునిపట్నం తీరాల్లో 10వ నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. విశాఖపట్నం, గంగవరం, కాకినాడ పోర్టుల్లో 8వ నంబరు, మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం ఓడరేవుల్లో 3వ నెంబరు ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. ఆదివారం ఉదయం నుంచి పెను తుపాను క్రమంగా బలహీనపడి తొలుత తుపానుగా తర్వాత వాయుగుండంగా కొనసాగుతుందని అధికారులు పేర్కొన్నారు. పై-లీన్ కుండపోత తీవ్రత తగ్గేదిలా.. పై-లీన్ తీరాన్ని దాటిన మొదట్లో ఆకాశం చిల్లు పడిందా అన్నట్లుగా కుండపోత వర్షం కురుస్తోంది. గంటలు గడిచేకొద్దీ పెనుతుపాను బలహీనపడుతుంది. బలహీనపడే కొద్దీ వర్షం తీవ్రత దశలవారీగా తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. వర్షపాతం నాలుగు దశల్లో క్రమంగా తగ్గే అవకాశం ఉందంటున్నారు. బంగాళాఖాతంలో తీవ్ర తుపానులు 2008 మేలో సంభవించిన నర్గీస్ తుపాను మయన్మార్‌లో బీభత్సం సృష్టించింది. ఏకంగా.. 1,38,000 మందిని బలిగొన్న ఈ తుపాను మిగిల్చిన నష్టం 60 వేల కోట్లకు పైమాటే. భారీ భవనాలు సహా వేల సంఖ్యలో ఇళ్లు నామరూపాల్లేకుండా పోయాయి. 1999 లో ఒడిశాను పెను తుపాను కుదిపేసింది. ఏకంగా గంటకు 250 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచిన ఈ తుపాను.. పదివేల మందిని పొట్టనబెట్టుకొంది. దాదాపు 15 లక్షల ఇళ్లు నేలమట్టమయ్యాయి. 1991 ఏప్రిల్‌లో వచ్చిన భయంకరమైన తుఫానుకు బంగ్లాదేశ్‌లో 1,39,000 మంది మరణించారు. గంటకు 225 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయడంతో పాటు ఎనిమిది మీటర్ల ఎత్తుతో అలలు ఎగిసిపడ్డాయి. 1977 నవంబర్‌లో భారీ తుపాను దివిసీమను కబళించి, దాదాపు 50,000 మందిని బలిగొంది. దాదాపు మూడు వేల కోట్ల రూపాయల నష్టాన్ని మిగిలించింది. 1970 నవంబర్‌లో సంభవించిన భారీ తుపాను మిగిల్చిన నష్టం ఊహాతీతం. గంటకు 224 కి.మీ. వేగంతో గాలులు, పది మీటర్ల ఎత్తై అలలతో విరుచుకుపడ్డ ఈ తుపాను 3,00,000 మందిని బలిగొంది. ఎక్కడివారు అక్కడే.. పై-లీన్ తుపాను కారణంగా శ్రీకాకుళం, విజయనగరంతో పాటు ఒడిశా తీర ప్రాంతమంతటా వాహనాలు నిలిచిపోయాయి. భారీ సంఖ్యలో రైళ్లు రద్దయ్యాయి. కోల్‌కతా నుంచి చెన్నైని కలి పే ఐదో నంబరు జాతీయ రహదారిపై భువనేశ్వర్ నుంచి గోపాల్పూర్వరకూ రాకపోకలు ఆగాయి. రా ష్ట్రం నుంచి ఒడిశా కు, పశ్చిమబెంగాల్‌కు రవాణా ఆగింది. కిలోమీటర్ల కొద్దీ వా హనాలు నిలిచి పోయాయి. -
సహాయ కార్యక్రమాలలో పాల్గొనాలని జగన్ పిలుపు
హైదరాబాద్: తుపాను సహాయ, పునరావాస కార్యక్రమాల్లో పాల్గొనాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన రెడ్డి పిలుపు ఇచ్చారు. ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల నేతలతో ఆయన ఫోన్లో మాట్లాడారు. ఉత్తరాంధ్ర జిల్లాలలో ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో పై-లీన్ తుపాను ప్రభావం చూపుతున్న విషయం తెలిసిందే. శ్రీకాకుళం జిల్లాలో భారీ వర్షం కురుస్తోంది. చెట్లు, విద్యుత్ స్తంభాలు, ఇళ్లు కూలిపోయాయి. ఈ జిల్లాలో ఎక్కువ భాగం అంథకారంలో ఉంది. సహాయ కార్యక్రమాలలో పార్టీ నేతలు చురుకుగా పాల్గొనాలని జగన్ విజ్ఞప్తి చేశారు. -
పై-లీన్ తుపాను దృశ్యాలు
గోపాల్పూర్ వద్ద పై-లిన్ తుపాను శనివారం(12-10-13) సాయంత్రం 6.25 గంటలకు తీరాన్ని తాకింది. తుపాను తీరం తాకినట్లు అమెరికా వాతావరణ శాఖ ప్రకటించింది. తుపాను ప్రభావం వల్ల కొన్నిచోట్ల సముద్రం 20 మీటర్లు ముందుకు వచ్చింది. కొన్ని చోట్ల అలలు 5 మీటర్ల ఎత్తున ఎగసిపడ్డాయి. -
వజ్రపుకొత్తూరు మండలం బెండి వద్ద తీరం దాటిన తుపాను
-
శ్రీకాకుళం జిల్లా బెండి వద్ద తీరం దాటిన తుపాను
శ్రీకాకుళం: వజ్రపుకొత్తూరు మండలం బెండి వద్ద పై-లీన్ తుపాను తీరం దాటింది. ఆరుగంటలపాటు తుపాను తీవ్రత ఉంటుందని వాతావరణ అధికారులు చెబుతున్నారు. దీని ప్రభావంతో జిల్లాలో భారీ వర్షం కురుస్తోంది. జిల్లాలో విద్యుత్ స్తంభాలు కూలిపోవడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. టెక్కలి, సంతబొమ్మాళి మండలాలు అంథకారంలో ఉన్నాయి. కళింగపట్నంలో కూడా భారీ వర్షం కురుస్తోంది. గోపాల్పూర్ వద్ద తుపాను తీరాన్ని తాకిన విషయం తెలిసిందే. తుపాను ప్రభావంతో 6 రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. గోపాల్పూర్ వద్ద, బెండి వద్ద గంటకు 220 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. -
తీరాన్ని తాకిన పై-లిన్ తుపాను
-
ఒడిషా, శ్రీకాకుళంలలో తుపాను విలయతాండవం
భువనేశ్వర్/ విశాఖపట్నం: ఒడిషాలో తుపాను విలయతాండవం చేస్తోంది. గోపాల్పూర్ వద్ద పై-లీన్ తుపాను తీరాన్ని తాకింది. అయితే వాతావరణ శాఖ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించలేదు. తీరప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గోపాల్పూర్ వద్ద వీచే గాలులకు నిలవలేని పరిస్థితి ఏర్పడింది. బరంపూర్‌లో తీవ్రస్థాయిలో ఈదురు గాలులు వీస్తున్నాయి. ఒడిషా తీరప్రాంతంలో, శ్రీకాకుళం జిల్లాలో విద్యుత్ సరఫరా నిలిపిపోయింది. వందల గ్రామాలు అంధకారంలో ఉన్నాయి. తీరప్రాంతవాసులు బిక్కుబిక్కుమంటున్నారు. కనీవిని ఎరుగని రీతిలో ఈదురు గాలులు వీస్తున్నాయి. పారాదీప్ నుంచి కళింగపట్నం వరకు ఈదురుగాలులు విపరీతంగా వీస్తున్నాయి. ఆరు గంటల పాటు తుపాను తీవ్రత కొనసాగే అవకాశం ఉంది. తుపాను ప్రభావంతో శ్రీకాకుళం జిల్లా అల్లాడుతోంది. ఈ జిల్లాలో ఈదురుగాలులతో కూడి భారీ వర్షం కురుస్తోంది. చిన్నాపెద్ద చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగిపడ్దాయి. తుపాను ప్రభావం వల్ల ఒడిశా, ఉత్తరాంధ్రలలో రేపు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉంది. -
గోపాల్పూర్ వద్ద తీరాన్ని తాకిన పై-లీన్ తుపాను
భువనేశ్వర్: గోపాల్పూర్ వద్ద పై-లీన్ తుపాను ఈ సాయంత్రం 6.25 గంటలకు తీరాన్ని తాకింది. తుపాను తీరం తాకినట్లు అమెరికా వాతావరణ శాఖ ప్రకటించింది. ఆరు గంటల పాటు తుపాను తీవ్రత కొనసాగే అవకాశం ఉంది. శ్రీకాకుళం జిల్లా కళింగపట్నంలో ఈదురుగాలులతో కూడి భారీ వర్షం కురుస్తోంది. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. పై-లిన్ తుపాను వల్ల ఒడిషాలో కురుస్తున్న భారీ వర్షాలకు ముగ్గురు మృతి చెందారు. తుపాను ప్రభావం వల్ల ఒడిశా, ఉత్తరాంధ్రలలో రేపు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉంది. -
శ్రీకాకుళం జిల్లాలో తుపాను బీభత్సం : కుండపోత వర్షం
విశాఖపట్నం: శ్రీకాకుళం జిల్లాలో పై-లీన్ తుపాను బీభత్సం మొదలైంది. కవిటి, ఉద్ధానం గ్రామాలలో ప్రచండ గాలులు వీస్తున్నాయి. భీకర గాలులకు చెట్లు కూలిపడిపోయాయి. కుండపోతగా వర్షం కురుస్తోంది. సొంపేటలో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. తుపాను ప్రభావం వల్ల కొన్నిచోట్ల సముద్రం 20 మీటర్లు ముందుకు వచ్చింది. కొన్ని చోట్ల అలలు 5 మీటర్ల ఎత్తున ఎగిసిపడుతున్నాయి. వేలాది కొబ్బరి చెట్లు, కరెంటు స్తంభాలు, కచ్చా ఇళ్లు కూలిపోతున్నాయి. విద్యుత్, టెలిఫోన్ వ్యవస్థ స్తంభించిపోయింది. బందరువానిపేట, పూడిలంక, ఒంటూరు, ఈదుపురం, ఇద్దివానిపాలెం, కపాసుకుద్ది, నువ్వలరేవు, మంచినీళ్లపేట, బారువ తదితర తీర గ్రామాల్లోకి సముద్రపు నీరు చొచ్చుకొచ్చింది. రోడ్లపై ఎక్కడికక్కడ చెట్లు కూలిపోవడంతో రవాణా వ్యవస్థ అస్తవ్యస్తమైంది. ఒడిషాలోని గోపాల్‌పూర్‌కు 80 కిలోమీటర్ల దూరంలో తుపాను కేంద్రీకృతమై ఉంది. గంటకు 20 కిలోమీటర్ల వేగంతో తుపాను కదులుతోంది. ఉత్తర కోస్తా, ఒడిషాలలో అతిభారీ వర్షం కురిసే అవకాశం ఉంది. ఒడిషా, ఆంధ్ర ప్రదేశ్ తీర ప్రాంతాలలో 5 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. గోపాల్‌పూర్‌లో పై-లిన్ తుపాను భీకర రూపం దాల్చింది. వాహనాలు కొట్టుకుపోయేలా గాలి వీస్తోంది. భీకరగాలులకు చెట్లు విరిగిపడుతున్నాయి. గోపాల్పూర్ వెళ్లే మార్గంలో వాహనాలు నిలిచిపోయాయి. గోపాల్పూర్ గ్రామస్తులు ముందు జాగ్రత్తగా బరంపూర్ తరలి వెళ్లిపోయారు. ఇళ్లకు కాపలాగా ఉన్నవారు మాత్రమే ఇక్కడ ఉన్నారు. తుపానుకు వారూ వణికిపోతున్నారు. * తుపాన్ కంట్రోల్ రూమ్‌ల ఫోన్ నెంబర్లు: శ్రీకాకుళం: 0894-2240557/ 9652838191 విశాఖపట్టణం: 1800425002 విజయనగరం: 0892-2236947 టోల్ ఫ్రీ: 1077 తూర్పుగోదావరి: 0884-2365506 - 0884-1077 అమలాపురంలో ఆర్డీవో కార్యాలయంలో తుఫాన్ కంట్రోల్ రూమ్ నెంబర్: 08856 233100 - జిల్లాలోని ఇండియన్ కోస్ట్ గార్డ్ :1554, మెరైన్ పోలీస్ :1093 పశ్చిమగోదావరి: 0881230617 కృష్ణా: 086722525, టోల్ ఫ్రీ: 1077 గుంటూరు జిల్లా: 08644 223800,-0863 2345103/ 0863 2234990 తెనాలి: 08644 223800 నెల్లూరు: 1800 425 2499, 08612 331477 -
మొదలైన పై-లీన్ తుపాను అలజడి
విశాఖపట్నం: పై-లీన్ తుపాను అలజడి మొదలైంది. కాకినాడ-ఉప్పాడ తీరంలో 3 మీటర్ల ఎత్తుకు అలలు ఎగసిపడుతున్నాయి. వాకలపూడి బీచ్ వద్ద సముద్రం 20 మీటర్ల ముందుకొచ్చింది. * విజయనగరం జిల్లా బోగాపురంలో 33 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. 15వేల మందిని అధికారులు తరలిస్తున్నారు. *చింతపల్లి తీరంలో సముద్రం 40 మీటర్లు ముందుకొచ్చింది. * నెల్లూరు జిల్లాలో కూడా సముద్రం మందుకు చొచ్చుకు వస్తోంది. తీరప్రాంత ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. * పై-లిన్ తుఫాన్ ప్రభావం కారణంగా పలు రైళ్లు రద్దు చేశారు. * విశాఖపట్నం పోర్టు రక్షణ గోడ రెండు చోట్ల కూలింది. * భీమిలి మండలం మంగమారిపేట గ్రామంలో సముద్రపు నీరు ఇళ్లలోకి చేరుతోంది. * తుపాన్ కంట్రోల్ రూమ్‌ల ఫోన్ నెంబర్లు: శ్రీకాకుళం: 0894-2240557/ 9652838191 విశాఖపట్టణం: 1800425002 విజయనగరం: 0892-2236947 టోల్ ఫ్రీ: 1077 తూర్పుగోదావరి: 0884-2365506 - 0884-1077 అమలాపురంలో ఆర్డీవో కార్యాలయంలో తుఫాన్ కంట్రోల్ రూమ్ నెంబర్: 08856 233100 - జిల్లాలోని ఇండియన్ కోస్ట్ గార్డ్ :1554, మెరైన్ పోలీస్ :1093 పశ్చిమగోదావరి: 0881230617 కృష్ణా: 086722525, టోల్ ఫ్రీ: 1077 గుంటూరు జిల్లా: 08644 223800,-0863 2345103/ 0863 2234990 తెనాలి: 08644 223800 నెల్లూరు: 1800 425 2499, 08612 331477 -
భీకర రూపం దాల్చిన పై-లిన్ తుపాను
-
తుఫాను తీవ్రతపై అప్రమత్తంగా ఉన్నాం: రఘువీరారెడ్డి
పై-లీన్ తుఫాను తీవ్రతపై తాము అప్రమత్తంగా ఉన్నామని, లోతట్టు ప్రాంతాల ప్రజలు ఖాళీ చేయకపోతే వారిని బలవంతంగా ఖాళీ చేయిస్తున్నామని రాష్ట్ర రెవెన్యూ మంత్రి రఘువీరారెడ్డి తెలిపారు. తుఫాను ప్రభావం తీవ్రంగా ఉన్న విశాఖపట్నానికి ఆయన ఉదయమే చేరుకున్నారు. సహాయక చర్యలను ఆయన దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. తీరప్రాంతాల్లో ఇప్పటికే ఆర్మీ, మిలటరీ, నేవీ దళాలు గస్తీ నిర్వహిస్తున్నాయని, సముద్రంలో చిక్కుకుపోయిన 40 మంది మత్స్యకారులు పారాదీప్‌లో సురక్షితంగా ఉన్నారని చెప్పారు. విశాఖ తీరంలో 40బోట్లు దెబ్బతినగా, 3 ఇళ్లు కూలిపోయాయని, బాధితులకు పూర్తిస్థాయిలో న్యాయం చేస్తామని రఘువీరారెడ్డి చెప్పారు. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో సుమారు 64వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు చెప్పారు. మూడు రోజుల పాటు రఘువీరారెడ్డి విశాఖలోనే ఉండి తుపాను సహాయక చర్యలను పర్యవేక్షిస్తారు. తుపాను ప్రభావిత జిల్లాల అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్ష జరుపుతున్నారు. కంట్రోల్ రూం నెంబర్లు శ్రీకాకుళం: 0894-2240557/ 9652838191 విశాఖపట్టణం: 1800425002 విజయనగరం: 0892-2236947 టోల్ ఫ్రీ: 1077 తూర్పుగోదావరి: 0884-2365506 పశ్చిమగోదావరి: 0881230617 కృష్ణా: 086722525, టోల్ ఫ్రీ: 1077 గుంటూరు : 08632345103/08632234990 నెల్లూరు: 08612331477 -
భీకర రూపం దాల్చిన పై-లీన్ తుపాను
గోపాల్పూర్: (భువనేశ్వర్): గోపాల్‌పూర్‌లో పై-లీన్ తుపాను భీకర రూపం దాల్చింది. తుపాను సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందించడానికి సాక్షి బృందం గోపాల్పూర్ చేరుకుంది. వాహనాలు కొట్టుకుపోయేలా గాలి వీస్తోంది. భీకరగాలులకు చెట్లు విరిగిపడుతున్నాయి. గోపాల్పూర్ వెళ్లే మార్గంలో వాహనాలు నిలిచిపోయాయి. తుపానుకు గోపాల్పూర్ వాసులు వణికిపోతున్నారు. చాలా మంది గ్రామస్తులు బరంపూర్ తరలి వెళ్లిపోయారు. ఇళ్లకు కాపలాగా ఉన్నవారు మాత్రమే ఇక్కడ ఉన్నారు. ఏ నిమిషంలోనైనా తీవ్రరూపం దాల్చే ప్రమాదం విశాఖపట్నం: పై-లీన్ తుపాను చాలా విభిన్నమైనదని విశాఖపట్నం వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఇప్పటివరకు రాష్ట్రం మీదుగా చాలా తుఫాన్లు వచ్చి వెళ్లినా, వాటన్నింటి కంటే దీని ప్రవర్తన చాలా తేడాగా కనిపిస్తోంది. నాలుగు రోజుల క్రితం 1200 కిలోమీటర్ల దూరంలో ఉన్న పై-లీన్ తుపాను కడపటి వార్తలు అందేసరికి తీరానికి 200 కిలోమీటర్ల దూరానికి వచ్చింది. అంటే ఇది అత్యంత వేగంగా పయనిస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో్ని 8 ఓడరేవుల్లో మూడో నెంబరు ప్రమాద హెచ్చరిక ఎగరేశారు. రెండు చోట్ల సెక్షన్ ౩ హెచ్చరికలు కూడా జారీచేశారు. తుఫాను ప్రభావం ఎప్పుడు, ఏ నిమిషంలో ఎలా ఉంటుందో నిపుణులు కూడా చెప్పలేకపోతున్నారు. అర నిమిషంలోనే ఒక్కసారిగా తీవ్రరూపం దాల్చి, పెనుముప్పునకు కారణం కావచ్చని చెబుతున్నారు. లేదా.. అసలు ఎలాంటి నష్టం కలగజేయకుండా కూడా తీరాన్ని దాటే అవకాశం లేకపోలేదన్నది వాతావరణ నిపుణుల అభిప్రాయం. కేవలం ఈసారి మాత్రమే ఇలా అవుతోంది. ఇంతకుముందు వచ్చిన 73 తుఫాన్లలో ఏ ఒక్కటీ ఇలా ప్రవర్తించలేదని తెలుస్తోంది. తుపాన్ కంట్రోల్ రూమ్‌ల ఫోన్ నెంబర్లు: శ్రీకాకుళం: 0894-2240557/ 9652838191 విశాఖపట్టణం: 1800425002 విజయనగరం: 0892-2236947 టోల్ ఫ్రీ: 1077 తూర్పుగోదావరి: 0884-2365506 - 0884-1077 అమలాపురంలో ఆర్డీవో కార్యాలయంలో తుఫాన్ కంట్రోల్ రూమ్ నెంబర్: 08856 233100 - జిల్లాలోని ఇండియన్ కోస్ట్ గార్డ్ :1554, మెరైన్ పోలీస్ :1093 పశ్చిమగోదావరి: 0881230617 కృష్ణా: 086722525, టోల్ ఫ్రీ: 1077 గుంటూరు జిల్లా: 08644 223800,-0863 2345103/ 0863 2234990 తెనాలి: 08644 223800 నెల్లూరు: 1800 425 2499, 08612 331477 -
కృష్ణా, నెల్లూరు జిల్లాల్లో ముందుకు చొచ్చుకొచ్చిన సముద్రం
ఫైలిన్ తుపాన్ ప్రభావానికి కృష్ణా, నెల్లూరు జిల్లాల్లో సముద్రం ముందుకు చొచ్చుకొచ్చింది. మచిలీపట్నంలో 40 అడుగులు ముందుకు వచ్చింది. నెల్లూరు జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ]దీంతో తీర ప్రాంత ప్రజల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. తీర ప్రాంతాల్లో బలమైన ఈదురు గాలులు వీస్తున్నాయి. కృష్ణా జిల్లాలో వేటకు వెళ్లిన 16 సోనా బోట్లు తిరిగి రావాల్సివుంది. సాయంత్రానికి తీరం చేరుకోవచ్చని భావిస్తున్నారు. కంట్రోల్ రూంలు, హెల్ప్ లైన్ల నెంబర్లు.. శ్రీకాకుళం: 0894-2240557/ 9652838191 విశాఖపట్టణం: 1800425002 విజయనగరం: 0892-2236947 టోల్ ఫ్రీ: 1077 తూర్పుగోదావరి: 0884-2365506 పశ్చిమగోదావరి: 0881230617 కృష్ణా: 086722525, టోల్ ఫ్రీ: 1077 గుంటూరు : 08632345103/08632234990 నెల్లూరు: 08612331477 -
పైలీన్ గండం
-
కూలిన విశాఖ పోర్టు రక్షణ గోడ
విశాఖపట్నం: : పై-లిన్ తుపాన్ వల్ల ఫిషింగ్ హార్బర్‌కు ప్రమాదం పొంచి ఉంది. రెండు చోట్ల పోర్టు రక్షణ గోడ కూలింది. ఈ పరిస్థితులలో సముద్రపు బ్యాక్ వాటర్ హార్బర్లోకి చొచ్చుకువెళ్లే ప్రమాదం ఉంది. పోర్టు యాజమాన్యం స్పందించాలని మత్స్యకారులు కోరుతున్నారు. ఇదిలా ఉండగా, భీమిలి మంగమారిపేట గ్రామంలో ఇళ్లలోకి సముద్రపు నీరు వచ్చి చేరుతోంది. -
ఫైలిన్ తుఫాన్‌పై మర్రి శశిధర్ రెడ్డి మీడియా సమావేశం
-
పైలీన్ తుఫాను - తీసుకోవలసిన జాగ్రత్తలు
-
జాగ్రత్తలు తీసుకున్నాం - భయపడవద్దు : సీఎం కిరణ్
హైదరాబాద్ : పై-లిన్ తుపాన్ చాలా పెద్ద తుపానుగా చెబుతున్నారని, దీని ప్రభావం కూడా ఎక్కువగా ఉంటుందని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చెప్పారు. సచివాలయంలో ఈ మధ్యాహ్నం ఆయన విలేకరులతో మాట్లాడారు. తుపాను ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నామని, ఎవరూ భయబ్రాంతకు లోనుకావద్దని కోరారు. ఇప్పటి వరకు లక్ష మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు తెలిపారు. తీరానికి చేరని బోట్లు సురక్షితంగా ఉన్నట్లు సమాచారం అందిందని చెప్పారు. వైద్యులను, పారామెడికల్ సిబ్బందిని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వైర్లెస్ సెట్లు, హ్యామ్ రేడియోలు సిద్ధం చేసినట్లు చెప్పారు. మంత్రులు ఆయా జిల్లాలలోనే ఉండి పరిస్థితులను సమీక్షిస్తున్నారని, అన్ని జిల్లాలలో పర్యవేక్షణకు ఐఏఎస్ అధికారులను నియమించినట్లు వివరించారు. తుపాను వేగం గురించి గానీ, తీరం దాటే ప్రదేశంపైన గానీ ఏకాభిప్రాయంలేదని చెప్పారు. వీటిపై ఖచ్చిమైన అంచనాలు ఏవీలేవన్నారు. తుపాను వల్ల ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు. కొబ్బరి, జీడిమామిడి తోటలకే ఎక్కువ నష్టం జరిగే అవకాశం ఉందని తెలిపారు. తుపాను వల్ల తక్కువ నష్టం జరగాలని ప్రార్ధిద్దాం అన్నారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలలో ప్రభావం ఎక్కువగా ఉంటుందని తెలిపారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అధికారులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. బలవంతంగా తరలించే పరిస్థితి తీసుకురావద్దని కోరారు. 22 మత్స్యకారుల బోట్ల జాడ ఇంకా తెలియలేదని చెప్పారు. పునరావాస కేంద్రాల్లో ఉన్న ప్రజలకు అన్ని రకాల వసతి కల్పించే ఏర్పాటు చేస్తున్నామన్నారు. తీవ్రత ఎక్కువగా ఉంటే అవసరమైన హెలికాప్టర్లను సిద్ధంగా ఉంచుతున్నామని సీఎం చెప్పారు. -
ఉద్ధానంలో విద్యుత్, టెలిఫోన్ వ్యవస్థలు నిలిపివేత
శ్రీకాకుళం : శ్రీకాకుళం జిల్లా ఉద్ధానంలో ముందు జాగ్రత్త చర్యగా విద్యుత్, టెలిఫోన్ వ్యవస్థలను అధికారులు శనివారం నిలిపివేశారు. పై-లిన్ తుపాన్ ప్రభావంతో ఉద్దానంలో జోరుగా ఈదురు గాలులు వీస్తున్నాయి. కాగా ఇప్పటివరకూ జిల్లాలో 60వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు మంత్రి కొండ్రు మురళి తెలిపారు. ప్రతి మండలంలో నాలుగు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. హెల్ప్ లైను నెంబర్లు: శ్రీకాకుళం: 0894-2240557/ 9652838191 విశాఖపట్టణం: 1800425002 విజయనగరం: 0892-2236947 టోల్ ఫ్రీ: 1077 తూర్పుగోదావరి: 0884-2365506 పశ్చిమగోదావరి: 0881230617 కృష్ణా: 086722525, టోల్ ఫ్రీ: 1077 గుంటూరు : 08632345103/08632234990 నెల్లూరు: 08612331477 ..... కాగా పై-లిన్ తుఫాన్ ప్రభావంతో పలు రైళ్లు రద్దు భువనేశ్వర్-తిరుపతి ఎక్స్‌ప్రెస్ రద్దు (భువనేశ్వర్-సికింద్రాబాద్) విశాఖ ఎక్స్‌ప్రెస్ రద్దు గుంటూరు- సింహాద్రి ఎక్స్‌ప్రెస్ రద్దు హౌరా-భువనేశ్వర్ జనశతాబ్ధి ఎక్స్‌ప్రెస్ రద్దు హౌరా-పూరి శతాబ్ది ఎక్స్‌ప్రెస్ రద్దు భువనేశ్వర్-ఢిల్లీ రాజధాని ఎక్స్‌ప్రెస్ రద్దు హౌరా-విశాఖ దారిలో ప్రయాణించే రైళ్లు రద్దు హౌరా నుంచి చెన్నై వెళ్లాల్సిన పలు రైళ్లు దారి మళ్లింపు -
ముందుగానే తీరం దాటనున్న ఫైలిన్
విశాఖ : పై-లిన్ తుపాను అనుకున్న సమయం కన్నా ముందుగానే తీరం దాటనుంది. ఈరోజు సాయంత్రం ఆరు గంటల నుంచి రాత్రి 8గంటల మధ్య తుపాను తీరం దాటనుంది. తీరం దాటే సమయంలో గంటకు 240 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. ఒడిశాలోని గోపాల్ పూర్ వద్ద తుపాను తీరం దాటనుంది. తీరం దాటే సమయంలో 3.5 మీటర్ల ఎత్తుకు అలలు ఎగిసి పడనున్నాయి. అలాగే తీర ప్రాంతాల్లో 6 నుంచి 8 గంటలపాటు తుపాను ప్రభావం చూపనుంది. తీరం దాటాక తీవ్ర వాయుగుండంగా మారనుంది. ఒడిశా, కోస్తాంధ్రలో 2.5 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు అధికారులు తరలిస్తున్నారు. ఒక్క గోపాల్ పూర్లోనే లక్షమందిని తరలించారు. మరోవైపు పారాదీప్ పోర్టులో కార్యకలాపాలను అధికారులు నిలిపివేశారు. సీ-17 విమానంలో అత్యవసర సామాగ్రిని తరలించారు. శ్రీకాకుళం: 0894-2240557/ 9652838191 విశాఖపట్టణం: 1800425002 విజయనగరం: 0892-2236947 టోల్ ఫ్రీ: 1077 తూర్పుగోదావరి: 0884-2365506 పశ్చిమగోదావరి: 0881230617 కృష్ణా: 086722525, టోల్ ఫ్రీ: 1077 గుంటూరు : 08632345103/08632234990 నెల్లూరు: 08612331477 -
ఓషియన్ ఇన్ఫర్మేషన్ సెంటర్ సూచనలు
-
'పైలిన్'ను ఎదుర్కొనేందుకు సిద్ధం: రాధా
హైదరాబాద్ : పై-లిన్ తుపాను ముప్పును ఎదుర్కొనేందుకు అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నామని విపత్తు నివారణ శాఖ కమిషనర్ రాధా తెలిపారు. క్షేత్రస్థాయిలో అధికార యంత్రాంగాన్ని సిద్ధం చేసినట్లు ఆయన శనివారమిక్కడ పేర్కొన్నారు. ప్రతీ తీర ప్రాంతంలో రెవెన్యూ బృందం అప్రమత్తంగా ఉందని, తుపాను తీరం దాటేటప్పుడు గాలులు ఎక్కువగా ఉండవచ్చని తెలిపారు. మరబోట్లతో సముద్రంలోకి వేటకు వెళ్లిన జాలర్ల జాడ కనుక్కోవటం కష్టంగా ఉందని రాధా చెప్పారు. కాగా విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం బర్రెపేటలో ముగ్గురు, పిప్పల వలసలో ఒకరు సముద్రంలో చిక్కుకున్నారు. తుపాను ప్రభావిత తీర ప్రాంత గ్రామాల్లో సహాయక చర్యల కోసం 250మంది ఆర్మీ సైన్యం జిల్లాకు చేరుకుంది. కాకినాడలో తుపాను నేపధ్యంలో కాకినాడ-ఉప్పాడ బీచ్‌రోడ్డును పోలీసులు మూసివేసి, వాహనాల రాకపోకలను నిలిపివేశారు. సహాయక చర్యలను పర్యవేక్షించేందుకు విశాఖ చేరుకున్న రెవెన్యూ మంత్రి రఘువీరారెడ్డి ఫిషింగ్ హార్బర్‌ను సందర్శించారు. శ్రీకాకుళం: 0894-2240557/ 9652838191 విశాఖపట్టణం: 1800425002 విజయనగరం: 0892-2236947 టోల్ ఫ్రీ: 1077 తూర్పుగోదావరి: 0884-2365506 పశ్చిమగోదావరి: 0881230617 కృష్ణా: 086722525, టోల్ ఫ్రీ: 1077 గుంటూరు : 08632345103/08632234990 నెల్లూరు: 08612331477 -
తుఫాన్ కంట్రోల్ రూమ్‌ల ఫోన్ నెంబర్లు ఇవి
పైలిన్ తుపాన్ దూసుకోస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. కోస్తా తీరంలోని అన్ని జిల్లాల యంత్రాంగాన్ని ప్రభుత్వం అప్రమత్తం చేసింది. అందులోభాగంగా కోస్తా తీరం వెంబడి అన్ని జిల్లాల కలెక్టర్ కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేసింది. తుపాన్ వల్ల ఎవరికి ఎటువంటి విపత్కర పరిస్థితులు ఎదురైన వెంటనే అయా జిల్లాలోని కంట్రోల్ రూమ్‌లకు ఫోన్ చేయాలని ప్రభుత్వం సూచించింది. శ్రీకాకుళం కలెక్టరేట్లో కంట్రోల్ రూం నెంబర్లు: 08942 240557, 96528 38191 తూర్పు గోదావరి జిల్లాలోని కాకినాడ కలెక్టరేట్లో తుపాన్ కంట్రోల్ రూమ్ నెంబర్ల నంబర్లు: 0884-2365506,0884-1077 అమలాపురంలో ఆర్డీవో కార్యాలయంలో తుఫాన్ కంట్రోల్ రూమ్ నెంబర్: 08856 233100 జిల్లాలోని ఇండియన్ కోస్ట్ గార్డ్ :1554, మెరైన్ పోలీస్ :1093 పశ్చిమగోదావరి జిల్లా కంట్రోల్ రూం నెంబర్: 08812 230617 గుంటూరు జిల్లా కంట్రోల్ రూం నెంబర్: 08644 223800, తెనాలి కంట్రోల్ రూమ్ నెంబరు 08644 223800 నెల్లూరు కలెక్టరేట్లో కంట్రోల్ రూం నెంబర్లు 1800 425 2499, 08612 331477 -
కళింగపట్నం, భీమిలీలో 10వ నెం. ప్రమాద హెచ్చరికలు
విశాఖ : పై-లిన్ తుపాన్ నేపథ్యంలో విశాఖ జిల్లా కళింగపట్నం, భీమిలీ పోర్టులో 10వ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. విశాఖ, గంగవరంలో 8వ నెంబర్ ప్రమాద హెచ్చరికలను అధికారులు శనివారం జారీ చేశారు. ఇక కాకినాడలో 5వ నెంబర్, నిజాంపట్నం, మచిలీపట్నం, కృష్ణపట్నంలో 3వ నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు పై-లీన్ తుపాను తీరం వైపు వేగంగా కదులుతోంది. కడపటి సమాచారం మేరకు కళింగపట్నానికి 200 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. తుపాను తీరం దాటే సమయంలో పెను ముప్పు తప్పదని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. తీరం వెంబడి 220 కిలోమీటర్ల వేగంతో పెను గాలులు వీస్తాయి. సముద్రపు అలలు 50 అడుగులకు పైగా ఎగసిపడుతున్నాయి. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. అత్యధికంగా 25 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదు అవుతుందని అంచనా. శ్రీకాకుళం సహా 4 జిల్లాలకు పెనుముప్పు తప్పదని అంచనా వేస్తున్నారు. జిల్లాలో 52000మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇప్పటికే అన్ని పోర్టుల్లో ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. మత్స్యకారులు వేటకు వెళ్లరాదని ఆదేశించారు. పలు రైళ్లు రద్దు అయ్యాయి. పెనుతుపాను ఈరోజు రాత్రికి గోపాల్ పూర్ వద్ద తీరం దాటే అవకాశం ఉంది. తీరప్రాంతాల్లో ఇప్పటికే వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. రెవెన్యూ కేంద్రాల్లో కంట్రోలు రూమ్‌లు ఏర్పాటు చేశారు. శ్రీకాకుళం: 0894-2240557/ 9652838191 విశాఖపట్టణం: 1800425002 విజయనగరం: 0892-2236947 టోల్ ఫ్రీ: 1077 తూర్పుగోదావరి: 0884-2365506 పశ్చిమగోదావరి: 0881230617 కృష్ణా: 086722525, టోల్ ఫ్రీ: 1077 గుంటూరు : 08632345103/08632234990 నెల్లూరు: 08612331477 -
5లక్షల మందిని ఖాళీ చేయిస్తున్న ఒడిశా సర్కార్
-
5లక్షల మందిని ఖాళీ చేయిస్తున్న ఒడిశా సర్కార్
భువనేశ్వర్ : పై-లిన్ తుపాను ప్రభావంతో ఒడిశా గడగడ వణికిపోతోంది. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ శనివారం సహాయక చర్యలపై శనివారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. మరోవైపు ఒడిషాలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. భువనేశ్వర్ పూర్తిగా తడిచి ముద్దయ్యింది. లోతట్టు ప్రాంతాల వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. సహాయక చర్యలను ముమ్మరం చేశారు. ఒడిశాలోని గోపాల్పూర్ వద్ద తుపాను తీరం దాటనుంది. ప్రస్తుతం 200 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. పై-లీన్ తుపాను వల్ల ప్రాణనష్టం సాధ్యమైనంత తక్కువగా ఉండాలన్న లక్ష్యంతో ఒడిశా సర్కారు చర్యలు చేపట్టింది. తుపాను తీవ్ర ప్రభావం చూపే 7 కోస్తా జిల్లాల్లో దాదాపు 5 లక్షల మందిని ఖాళీ చేయిస్తోంది. గంజాం, గజపతి, పూరి, ఖుద్రా, జగత్సింగ్పూర్, కేంద్రపర, నయాగఢ్ జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న ప్రభుత్వం భద్రక్, బాలాసోర్ జిల్లాలనూ అప్రమత్తం చేసింది. తుపాను నేపథ్యంలో వాయుసేనకు చెందిన 2 ఐఎల్-76 విమానాల్లో విపత్తు సహాయ దళం బృందాలు, పరికరాలను అధికారులు భువనేశ్వర్ తరలించారు. రాయ్‌పూర్, నాగ్‌పూర్, జగ్దల్పూర్, బారక్పూర్, రాంచి, గ్వాలియర్ తదితర వైమానిక స్థావరాల్లో వైమానిక బలగాలను సిద్దంగా ఉంచారు. తుపాను తీరాన్ని తాకగానే సహాయ, రక్షణ చర్యలు చేపట్టడానికి 28 ఎన్డీఆర్ఎప్ దళాలను అందుబాటులో ఉంచారు. అన్ని ప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించారు.మరోవైపు ఏ క్షణంలో ముప్పు ముంచుకు వస్తుందోననే ప్రజలు భయంతో బిక్కుబిక్కుమంటున్నారు. తీర ప్రాంత జిల్లాల ప్రజలు ప్రమాదం ఎప్పుడు దాటిపోతుందా అని క్షణమొక యుగంలా కాలం గడుపుతున్నారు. -
పై-లిన్ పై అలర్ట్
-
73 తుపాన్లలో అక్టోబర్‌లోనే 30 తుపానులు
హైదరాబాద్ : రాష్ట్రంలో 1891 నుంచి 2012 దాకా 73 తుపానులు సంభవించాయి. ఈ 73 తుపాన్లలో అక్టోబర్‌లోనే 30 తుపానులు సంభవించాయి. నవంబర్‌లో 19, మేలో తొమ్మిది, సెప్టెంబర్‌లో ఎనిమిది, జూన్‌లో మూడు, డిసెంబర్లో మూడు, జులైలో ఒకసారి తుపాను వచ్చింది. వీటిల్లో 23 తుపానులు నెల్లూరు జిల్లాలో తీరం తాకగా, 15 కృష్ణాలో, 11 తూర్పుగోదావరిలో, పది శ్రీకాకుళం జిల్లాలో, ఏడు విశాఖపట్నంలో, అయిదు ప్రకాశం జిల్లాలలో తీరం దాటాయి. శ్రీకాకుళం: 0894-2240557/ 9652838191 విశాఖపట్టణం: 1800425002 విజయనగరం: 0892-2236947 టోల్ ఫ్రీ: 1077 తూర్పుగోదావరి: 0884-2365506 పశ్చిమగోదావరి: 0881230617 కృష్ణా: 086722525, టోల్ ఫ్రీ: 1077 గుంటూరు : 08632345103/08632234990 నెల్లూరు: 08612331477 -
పై-లిన్‌పై భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్
భువనేశ్వర్ : బంగాళాఖాతంలో క్రమంగా బలోపేతం అవుతూ తూర్పు తీరం వైపు వేగంగా కదులుతున్న పై-లీన్ తుపానుపై భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. 54 అడుగులకు పైగా ఎత్తులో అలలు ఎగిసిపడి తీరంపై విరుచుకుపడతాయని వాతావరణ శాఖ హెచ్చరికలు చేసింది. కాగా పై-లిన్ తుపాన్ ఒడిశాలోని గోపాల్‌పూర్‌కు ఆగ్నేయ దిశలో 260 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని జాతీయ విపత్తు నివారణ సంస్థ వైస్ ఛైర్మన్ మర్రి శశిధర్ రెడ్డి తెలిపారు. ఈ సాయంత్రం తుఫాన్ తీరం దాటే అవకాశముందని ఆయన పేర్కొన్నారు. మరోవైపు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తుపాను ప్రభావంపై అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. ఇప్పటికే రెవెన్యూ శాఖ మంత్రి రఘువీరారెడ్డి విశాఖ చేరుకున్నారు. తుపాను ప్రభావ నేపథ్యంలో సహాయక చర్యలపై సమీక్షించనున్నారు. శ్రీకాకుళం: 0894-2240557/ 9652838191 విశాఖపట్టణం: 1800425002 విజయనగరం: 0892-2236947 టోల్ ఫ్రీ: 1077 తూర్పుగోదావరి: 0884-2365506 పశ్చిమగోదావరి: 0881230617 కృష్ణా: 086722525, టోల్ ఫ్రీ: 1077 గుంటూరు : 08632345103/08632234990 నెల్లూరు: 08612331477 -
తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
పై-లిన్ తుపాను పట్ల తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నెల్లూరు జిల్లా కలెక్టర్ ఎన్. శ్రీకాంత్ విజ్ఞప్తి చేశారు. తుపాన్ ప్రభావం ఉండే 21 మండలాల్లో 23 మంది ప్రత్యేక అధికారులను నియమించారు. కావలి, విడవలూరుకు ఇద్దరు చొప్పున అధికారులు నియమితులయ్యారు. 21 మండలాల్లో కంట్రోల్ రూంలను ఏర్పాటు చేశారు. ఇప్పటికే కృష్ణపట్నం పోర్టులో మూడో నెంబరు ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. జిల్లాలో తుపాన్ తీవ్రత ఎక్కువగా ఉండే మండలాల అధికారులతో కలెక్టర్ శ్రీకాంత్ తరచూ సంప్రదిస్తున్నారు. మండలాల వారీగా ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెలుసుకుంటున్నారు. ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేలా వారికి సూచనలు ఇస్తున్నారు. ప్రత్యేక అధికారులు రాత్రి వేళలో మండలాల్లోనే ఉండాలని ఆదేశాలు ఇచ్చారు. మత్స్యకారులు చేపల వేటకెళ్లకుండా చర్యలు చేపట్టారు. తీరప్రాంత గ్రామాల్లో దండోరా వేయించి ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. కలెక్టరేట్లో కంట్రోలు రూం ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నారు. పునరావాస కేంద్రాల్లో అవసరమైన నిత్యావసర సరుకులు సిద్ధమయ్యాయి. తుపాన్ ప్రభావంతో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది వచ్చినా కంట్రోల్ రూంకు తెలియచేయాలని అధికారులు సూచించారు. కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు నంబర్లు: 1800 425 2499, 08612-331477 శ్రీకాకుళం: 0894-2240557/ 9652838191 విశాఖపట్టణం: 1800425002 విజయనగరం: 0892-2236947 టోల్ ఫ్రీ: 1077 తూర్పుగోదావరి: 0884-2365506 పశ్చిమగోదావరి: 0881230617 కృష్ణా: 086722525, టోల్ ఫ్రీ: 1077 గుంటూరు : 08632345103/08632234990 నెల్లూరు: 08612331477 -
100 అడుగుల ముందుకు వచ్చిన సముద్రం
-
అప్రమత్తమైన కృష్ణాజిల్లా యంత్రాంగం
మచిలీపట్నం : పై-లిన్ తుపాను దృష్ట్యా కృష్ణాజిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. తుపాను తీరం దాటే సమయంలో భారీ వర్షాలు పడే అవకాశం ఉండటంతో పర్యాటకులను, జాలర్లను అధికారులు అనుమతించటం లేదు. దాదాపు ఆరడుగుల ఎత్తులో అలలు ఎగసిపడుతున్నాయి. గిలకలదిండి హార్బర్ వద్ద మూడో నంబరు ప్రమాద హెచ్చరిక ఎగురవేశారు. దీంతో మంగినపూడి బీచ్‌లోకి పర్యాటకులను కూడా అనుమతించలేదు. కాగా సముద్రంలో ఉండిపోయిన 24 బోట్లు సముద్రపు పోటు అధికంగా ఉన్న సమయంలో హార్బర్‌కు చేరే అవకాశం ఉంది. మరోవైపు తుపాను కారణంగా కురిసిన భారీ వర్షాలతో పశ్చిమ కృష్ణాలోని కొండవాగు, బుడమేరు, పోతులవాగు, కుంపిణీ వాగు పొంగి ప్రవహిస్తున్నాయి. కృష్ణా: 086722525, టోల్ ఫ్రీ: 1077 శ్రీకాకుళం: 0894-2240557/ 9652838191 విశాఖపట్టణం: 1800425002 విజయనగరం: 0892-2236947 టోల్ ఫ్రీ: 1077 తూర్పుగోదావరి: 0884-2365506 పశ్చిమగోదావరి: 0881230617 కృష్ణా: 086722525, టోల్ ఫ్రీ: 1077 గుంటూరు : 08632345103/08632234990 నెల్లూరు: 08612331477 -
100 అడుగుల ముందుకు వచ్చిన సముద్రం
శ్రీకాకుళం : శ్రీకాకుళం జిల్లాకు పొంచి ఉన్న ‘పై-లీన్’ పెను తుపాను ముప్పును ఎదుర్కొని సహాయ చర్య లు చేపట్టేందుకు జిల్లా యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. మరోవైపు సముద్ర తీరంలో ఇప్పటికే 3 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తుతో కెరటాలు వస్తున్నాయి. తుపాను ప్రభావితం చేసే 11 మండలాల్లో 237 గ్రామాలు గుర్తించారు. దాంతో 134 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. కవిటి మండలం ఇత్తివానిపాలెం, గార మండలం బందరువాణి పేట వద్ద సముద్రం 100 అడుగుల ముందుకు వచ్చింది. 12,500మందిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తుపాను తీరం దాటే సమయంలో పెనుగాలుల ధాటికి చెట్లు, టెలిఫోన్, విద్యుత్ స్తంభాలు, ఇళ్లు కూలిపోయి ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. కలెక్టరేట్లో 24 గంటలూ పనిచేసే కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని, అవసరమైన సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందవచ్చని తెలిపారు. శ్రీకాకుళం కలెక్టరేట్లో కంట్రోల్ రూం నెంబర్లు : నంబర్లు-08942 240557, 96528 38191 శ్రీకాకుళం: 0894-2240557/ 9652838191 విశాఖపట్టణం: 1800425002 విజయనగరం: 0892-2236947 టోల్ ఫ్రీ: 1077 తూర్పుగోదావరి: 0884-2365506 పశ్చిమగోదావరి: 0881230617 కృష్ణా: 086722525, టోల్ ఫ్రీ: 1077 గుంటూరు : 08632345103/08632234990 నెల్లూరు: 08612331477 -
ఉత్తరాంధ్రలో కురుస్తున్న వర్షాలు
-
పై-లీన్ తుపాను సహాయక చర్యలపై రఘువీరా సమీక్ష
విశాఖ : రెవెన్యూ శాఖ మంత్రి రఘువీరారెడ్డి శనివారం ఉదయం విశాఖ చేరుకున్నారు. పై-లీన్ తుపాను నేపథ్యంలో ఆయన సహాయక చర్యలు పర్యవేక్షించనున్నారు. ఈ సందర్భంగా రఘువీరారెడ్డి మాట్లాడుతూ తీరప్రాంతాల్లో ఇప్పటికే ఆర్మీ, మిలటరీ, నేవీ దళాలు గస్తీ నిర్వహిస్తున్నాయన్నారు. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో సుమారు 64వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు చెప్పారు. మూడు రోజుల పాటు రఘువీరారెడ్డి విశాఖలోనే ఉండి తుపాను సహాయక చర్యలను పర్యవేక్షిస్తారు. తుపాను ప్రభావిత జిల్లాల అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్ష జరుపుతున్నారు. శ్రీకాకుళం: 0894-2240557/ 9652838191 విశాఖపట్టణం: 1800425002 విజయనగరం: 0892-2236947 టోల్ ఫ్రీ: 1077 తూర్పుగోదావరి: 0884-2365506 పశ్చిమగోదావరి: 0881230617 కృష్ణా: 086722525, టోల్ ఫ్రీ: 1077 గుంటూరు : 08632345103/08632234990 నెల్లూరు: 08612331477 -
ఉత్తరాంధ్రలో కురుస్తున్న వర్షాలు
కళింగపట్నానికి 340 కి.మీ దూరంలో పైలిన్ తుపాన్ కేంద్రీకృతమైంది. దాంతో ఆంధ్రప్రదేశ్, ఒడిశా తీర ప్రాంతంలో సముద్రం అల్లకల్లోలంగా ఉంది. తుపాన్ వల్ల 50 అడుగులకు పైగా అలలు ఎగిసిపడే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. కోస్తా తీరం వెంబడి అన్ని నౌకాశ్రయాల్లో మూడవ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. పైలిన్ తుపాన్ ఈ రాత్రికి గోపాలుపూర్ వద్ద తీరం దాటే అవకాశం ఉంది. గంటలకు 220 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీచే అవకాశం ఉంది. తుపాన్ తీరం దాటేటప్పుడు 25 సెంటీమీటర్ల మేర వర్షపాతం నమోదు అయ్యే అవకాశం ఉందని విశాఖలోని తుఫాన్ హెచ్చరిక కేంద్రం భావిస్తుంది. ఉత్తరాంధ్ర జిల్లాల్లో వర్షాలు ఇప్పటికే కురుస్తున్నాయి. విశాఖ - ఒడిశాల మధ్య శనివారం పలు రైళ్ల సర్వీసులను రద్దు చేస్తున్నట్లు ఈస్ట్ కోస్ట్ రైల్వే ఓ ప్రకటన విడుదల చేసింది. శ్రీకాకుళం: 0894-2240557/ 9652838191 విశాఖపట్టణం: 1800425002 విజయనగరం: 0892-2236947 టోల్ ఫ్రీ: 1077 తూర్పుగోదావరి: 0884-2365506 పశ్చిమగోదావరి: 0881230617 కృష్ణా: 086722525, టోల్ ఫ్రీ: 1077 గుంటూరు : 08632345103/08632234990 నెల్లూరు: 08612331477 -
తీవ్ర పెను తుఫానుగా మారిన ఫైలిన్
-
'ఫైలిన్.. తీవ్ర తుపాన్ గా మారే అవకాశం'
విశాఖపట్నం: పడగెత్తిన పెను తుపాను తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో రాష్ట్రం గజగజా వణికొపోతుంది. సాగర కెరటాల మాటు నుంచి తుపాను రూపంలో ప్రమాదం ఉందని అధికారులు తెలపడంతో ప్రజలు భయాందోళనలకు గురౌతున్నారు. ఫైలిన్ తుఫాన్.. తీవ్ర తుఫాన్ గా మారే అవకాశం ఉందని శనివారం వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఒకవేళ తీవ్ర తుఫాన్ గా మారితే మాత్రం 150 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. దీంతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. తుఫాను హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. కంట్రోల్ రూమ్ లను ఇప్పటికే ఏర్పాటు చేసిన ప్రభుత్వం ప్రమాద పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది. ముంచుకొచ్చే ముప్పుకు ముందస్తు సంకేతంగా గురువారం అక్కడక్కడా కురిసిన కుండపోత వర్షాలతో అస్తవ్యస్త పరిస్థితి నెలకొంది. ఎటువంటి విపత్తునైనా ఎదుర్కోవడానికి కలెక్టర్ల నేతృత్వంలో అధికార యంత్రాంగం సమాయత్తమవుతోంది. మరోవైపున వివిధ నదులు పొంగిపొర్లుతూ ఉండడంతో పంటలను ముంపు భయం వెంటాడుతోంది. కంట్రోల్ రూమ్ నంబర్లు.. శ్రీకాకుళం: 0894-2240557/ 9652838191 విశాఖపట్టణం: 1800425002 విజయనగరం: 0892-2236947 టోల్ ఫ్రీ: 1077 తూర్పుగోదావరి: 0884-2365506 పశ్చిమగోదావరి: 0881230617 కృష్ణా: 086722525, టోల్ ఫ్రీ: 1077 గుంటూరు : 08632345103/08632234990 నెల్లూరు: 08612331477 -
ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలకు సైన్యం: ఏకే ఆంటోనీ
న్యూఢిల్లీ: పై-లిన్ తుఫాన్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమయింది. తుఫాన్ తీవ్రరూపం దాల్చడంతో ముందస్తు చర్యలు చేపట్టింది. తీరం దాటే సమయంలో తుఫాన్ బీభత్సం సృష్టించే అవకాశముందన్న హెచ్చరికల నేపథ్యంలో రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ దీనిపై దృష్టి సారించారు. ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలకు వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని సైనిక దళాలను కోరారు. ఐఏఎఫ్‌కు చెందిన ఐఎల్-76 రెండు విమానాలు ఇప్పటికే తుఫాన్ సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. విపత్తు నివారణ బృందాలను, సహాయక సామాగ్రిని భువనేశ్వర్‌కు తరలించాయి. రెండు సీ 130జే విమానాలు, 18 హెలికాప్టర్లు, రెండు ఏఎన్-32 ఎయిర్క్రాప్ట్లు సహాయక చర్యలకు సిద్ధంగా ఉంచారు. పై-లిన్ తుఫాన్ రేపు తీరందాటనుందని వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పలు జిల్లాల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసింది. ఫ్రీ నంబర్లు అందుబాటులో ఉంచింది. శ్రీకాకుళం: 08942 240557, 9652838191 గుంటూరు : 08644 - 223800 తూర్పుగోదావరి: 08856 - 233100 పశ్చిమగోదావరి: 08812 230617 నెల్లూరు: 1800 425 2499, 08612 331477 -
పై-లిన్ పై అప్రమత్తం: రఘువీరా
హైదరాబాద్ : పైలిన్ తుపాను వల్ల ఎదురయ్యే సమస్యలను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సన్నద్ధం అవుతోంది. తుపానుతో భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని రెవెన్యూ శాఖ మంత్రి రఘువీరారెడ్డి తెలిపారు. లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నట్లు మంత్రి చెప్పారు. తుపాను తీవ్ర ప్రభావం చూపు అవకాశం ఉన్న శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో 64వేల మందిని సురక్షిత ప్రాంతానికి తరలించేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. అధికారులు ఇచ్చే సూచనలను పాటించి ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. మరోవైపు ఫైలిన్ తుపాను సూపర్ సైక్లోన్‌గా మారే అవకాశం లేదని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. అదే సమయంలో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. తుపాను తూర్పు ఆగ్నేయ దిశగా ప్రయణించి శనివారం నాటికి ఒడిశా-కళింగపట్నం-గోపాలపూర్ ప్రాంతాల్లో తుపాను తీరం దాటే అవకాశం ఉందని వివరించారు. అల్పపీడన ద్రోణి కూడా కొనసాగుతున్న కారణంగా రానున్న 12 గంటల్లో ఉత్తర కోస్తాంధ్రలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. కోస్తా అంతటా భారీగా ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లొద్దని సూచించారు. శ్రీకాకుళం: 0894-2240557/ 9652838191 విశాఖపట్టణం: 1800425002 విజయనగరం: 0892-2236947 టోల్ ఫ్రీ: 1077 తూర్పుగోదావరి: 0884-2365506 పశ్చిమగోదావరి: 0881230617 కృష్ణా: 086722525, టోల్ ఫ్రీ: 1077 గుంటూరు : 08632345103/08632234990 నెల్లూరు: 08612331477 For the latest stories, you can like Sakshi News on Facebook and also follow us on Twitter. Get the Sakshi News app for Android or iOS -
ఫైలిన్ తుపానుపై అప్రమత్తం: రఘువీరా
-
ఫైలిన్ తుపానుతో జిల్లా అంతటా వర్షం
నల్లగొండ అగ్రికల్చర్, న్యూస్‌లైన్ ఫైలిన్ తుపానుతో పత్తి రైతుకు కష్టాలు వచ్చి పడ్డాయి. వర్షానికి పత్తి కాయలు పగిలిపోయి రాలిపోతుండడంతో తీవ్ర నష్టాల్లో కూరుకుపోయే ప్రమాదం ఏర్పడింది. జిల్లాలో 3లక్షల 12వేల 647 హెక్టార్లలో పత్తి పంట సాగు చేశారు. ఇటీవల కురిసిన వర్షాల కారణంగా పత్తిచేలకు లాభం చేకూరింది. పత్తి పూత, కాత బాగా ఉండడంతో రైతులు దిగుబడిపై భారీగా ఆశలు పెట్టుకున్నారు. పత్తి దిగుబడి సుమారు 46లక్షల 80 వేల క్వింటాళ్లు వచ్చే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ కూడా అంచనాలు వేసింది. కానీ, ప్రస్తుతం కురుస్తున్న తుపాను పత్తి రైతులఆశలపై నీళ్లు చల్లింది. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా పత్తి మొదటి దశ విరుపుడు పూర్తయి రెండవ దశ విరుపుడు చేస్తున్నారు. రెండు, మూడో దశ విరుపుడు సమయంలోనే పత్తి కాయ పెద్ద ఎత్తున పగులు తుంది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షం కారణంగా చేనుపై ఉన్న పత్తి తడిసి నేలరాలిపోతుంది. మరో రెండు, మూడు రోజులు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతుండడంతో పత్తి రైతుల్లో ఆందోళన నెలకొంది. ఇదేవిధంగా వర్షం కురిస్తే పత్తి మొత్తం నేలపాలయ్యే ప్రమాదం ఉంది. చేనుపై మిగిలిన పత్తి కూడా గింజలు మొలకెత్తి రంగు మారనుంది. రంగుమారిన పత్తికి ధర కూడా తక్కువగానే చెల్లిస్తారు. దీని కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది. కోటి ఆశలతో పత్తి సాగు చేసిన అన్నదాతను ఫైలిన్ తుపాను ముంచే అవకాశం లేకపోలేదు. 27.3 మి.మీ వర్షపాతం నమోదు తూర్పు, మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఫైలిన్ తుపాను కారణంగా బుధవారం నుంచి గురువారం వరకు విస్తారంగా వర్షం కురుస్తుంది. జిల్లాలో సగటున 27.3 మిల్లీమీటర్ల వర్షం కురిసినట్లు అధికారులు చెపుతున్నారు. నూతన్‌కల్ మండలం మినహా మిగతా 58 మండలాల్లో విస్తారంగా వర్షం కురిసింది. అత్యధికంగా తిరుమలగిరి మండలంలో 60 మిల్లీమీటర్లు, అత్యల్పంగా చండూరు మండలంలో 4.2 మిల్లీమీటర్ల కురిసింది. అర్వపల్లి మండలంలో 59.8, మోత్కూరులో 55.2, కేతెపల్లిలో 54.8, మర్రిగూడలో 53.8, వలిగొండలో 53.2, గుండాలలో 50, బొమ్మలరామారంలో 19, తుర్కపల్లిలో 10.2, రాజాపేటలో 35.4 మీల్లీమీటర్ల వర్షం కురిసింది. యాదగిరిగుట్టలో 42, ఆలేరులో 35.6, ఆత్మకూరు(ఎం)లో 28.2, భువనగిరిలో 13.2, బీబీనగర్‌లో 10.6, పోచంపల్లిలో 42.2, చౌటుప్పల్‌లో 26.2, రామన్నపేటలో 43.4 మిల్లీమీటర్లు కురిసింది. అదేవిధంగా శాలిగౌరారంలో 40.2, చిట్యాలలో 35, నార్కట్‌పల్లిలో 48.6, కట్టంగూరులో 26.4, నకిరేకల్‌లో 38.2, తిప్పర్తి, వేములపల్లిలలో 11.4, నల్లగొండలో 36.2, మునుగోడులో 17.2, నారాయణపురం, కనగల్ మండలాల్లో 7, గుర్రంపోడ్లో 11.8, నాంపల్లిలో 45.4, చింతపల్లిలో 33.6, పీఏపల్లిలో 10.8, దేవరకొండలో 5.4, డిండిలో 31.2 మిల్లీమీటర్ల కురిసింది. చందంపేటలో 8.8, నిడమనూరులో 14.8, త్రిపురారంలో 33.6, మిర్యాలగూడలో 5, గరిడెపల్లి 9.4, హుజూర్నగర్ 27.4, మఠంపల్లి 14.4, నేరెడుచర్ల 10.2, దామరచర్ల 54, అనుముల 38.4 మిల్లీమీటర్లు కురిసింది. పెద్దవూరలో 10.4, తుంగతుర్తిలో 13.4, సూర్యాపేటలో 21.4, చివ్వెంలలో 38.2, మోతెలో 18.6, మునగాలలో 45.4, నడిగూడెం 36.4, పెన్పహడ్ 11.4, చిలుకూరు 11.6, కోదాడలో 10.4, మేళ్లచెర్వు మండలంలో 7.2 మిల్లీమీటర్లు కురిసింది. -
జగన్, చంద్రబాబుకు ఎన్డీఎమ్ఏ లేఖ
న్యూఢిల్లీ: ఫైలిన్ తుఫాన్ తీవ్రరూపం దాల్చచడంతో జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ(ఎన్డీఎమ్ఏ) అప్రమత్తమయింది. ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలకు తుఫాన్ ముప్పు పొంచివుండడంతో ముందస్తు జాగ్రత్తగా చర్యలు చేపట్టింది. సహాయక చర్యలు కొనసాగించేందుకు రాజకీయ పార్టీల నాయకులు సహకరించాలని ఎన్డీఎమ్ఏ ఉపాధ్యక్షుడు కోరారు. మానవతా దృక్పథంలో ఆందోళన కార్యక్రమాలు 15 రోజులు వాయిదా వేసుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఇరువురు నేతలకు లేఖలు రాశారు. ఢిల్లీలో దీక్ష చేస్తున్న చంద్రబాబుకు లేఖ అందజేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు, కేంద్ర సిబ్బంది తుఫాన్ సహాయక చర్యల్లో పాల్గొనాల్సివుందని తెలిపారు. ఫైలిన్ తుఫాన్ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కళింగపట్నం - పారాదీప్‌ల మధ్య ఈనెల 12న ఫైలిన్ తుపాన్ తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది. ఈ నేపథ్యంలో రెండు రాష్ట్రాలకు ఎన్‌ఎమ్‌డీఏ సహాయక బృందాలు పంపింది. ఒడిశాకు 8, ఆంధ్రప్రదేశ్‌కు 9 బృందాలు పంపింది. అలాగే ఎయిర్‌ఫోర్స్, నావికాదళం, ఆరోగ్య శాఖల సహకారం కూడా ఎన్‌ఎమ్‌డీఏ కోరింది. మరోవైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పలు జిల్లాల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసింది. ఫ్రీ నంబర్లు అందుబాటులో ఉంచింది. శ్రీకాకుళం: 08942 240557, 9652838191 గుంటూరు : 08644 - 223800 తూర్పుగోదావరి: 08856 - 233100 పశ్చిమగోదావరి: 08812 230617 నెల్లూరు: 1800 425 2499, 08612 331477 -
పలు జిల్లాల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు
విశాఖపట్నానికి 950 కిలోమీటర్ల దూరంలో ఉత్తర దిశగా ఫైలిన్ తుఫాన్ కదులుతుందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం గురువారం వెల్లడించింది. పారాదీప్నకు 850 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైందని తెలిపింది. తీరం వెంబడి అలల ఉధృతి పెరుగుతుందని వివరించింది. అలాగే కళింగపట్నం - పారాదీప్‌ల మధ్య ఫైలిన్ తుపాన్ తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది. శ్రీకాకుళం: ఫైలిన్ తుపాను నేపథ్యంలో జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేసినట్లు జిల్లా కలెక్టర్ సౌరభ్ గౌర్ గురువారం శ్రీకాకుళంలో వెల్లడించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లోని అధికారులతో ఆయన సమీక్షలు నిర్వహిస్తున్నారు. శ్రీకాకుళం కలెక్టరేట్లో కంట్రోల్ రూం ఏర్పాటు చేసినట్లు వివరించారు. తుఫాన్ నేపథ్యంలో ఎవరికి ఎటువంటి విపత్కర పరిస్థితులు ఎదురైన టోల్ ఫ్రీ నంబర్లు-08942 240557, 9652838191కు ఫోన్ చేయవచ్చని వివరించారు. గుంటూరు: ఫైలిన్ తుఫాను నేపథ్యంలో అప్రమత్తంగా ఉన్నట్లు జిల్లా కలెక్టర్ గురువారం వెల్లడించారు. జిల్లాలోని నిజాంపట్నం ఓడరేవులో 2వ ప్రమాద హెచ్చరిక జారీ చేసినట్టు తెలిపారు.సూర్యలంక బీచ్‌లో అలలు ఎగిసిపడుతున్నాయని, మత్స్యకారులు వేటకు వెళ్లొదని హెచ్చరికలు జారీ చేసినట్లు వివరించారు. అలాగే గుంటూరు, తెనాలి ఆర్డీవో కార్యాలయాల్లో కంట్రోల్ రూంలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. తెనాలి కంట్రోల్ రూమ్ 08644 - 223800 వెల్లడించారు. అలాగే తూర్పు గోదావరి జిల్లాలోని అమలాపురంలోని ఆర్డీవో కార్యాలయంలో తూఫాన్ కంట్రోల్ రూమ్ 08856 - 233100 ఏర్పాటు చేసినట్లు ఉన్నతాధికారులు తెలిపారు. ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లాలోని మండల ప్రత్యేక అధికారులతో జిల్లా కలెక్టర్ సిద్ధార్థ జైన్ గురువారం ఉదయం ఏలూరులో సమీక్ష నిర్వహించారు. నర్సాపురం డివిజన్‌పై ప్రత్యేక దృష్టి సారించాలని ఆ ప్రాంత అధికారులను ఆదేశించారు. తీరప్రాంతంలోని లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. ఏలూరు కలెక్టరేట్లో కంట్రోల్ రూంలో టోల్ ఫ్రీ నెంబర్: 08812 230617ను ఏర్పాటు చేశామన్నారు. నెల్లూరు: తుపాను పట్ల అప్రమత్తంగా ఉండాలని తీరప్రాంత ప్రజలను నెల్లూరు జిల్లా కలెక్టర్ ఎన్.శ్రీకాంత్ కోరారు. జిల్లా కలెక్టరేట్లోని కంట్రోల్ రూమ్‌లో 1800 425 2499, 08612 331477 ట్రోల్ ఫ్రీ నెంబర్లు ఏర్పాటు చేసినట్లు వివరించారు. -
ప్రకాశం జిల్లా కలెక్టరేట్లో టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు
ఫైలిన్ తుపాన్ నేపథ్యంలో జిల్లాలో అధికారులను అప్రమత్తం చేసినట్లు ప్రకాశం జిల్లా కలెక్టర్ విజయ కుమార్ గురువారం ఉదయం వెల్లడించారు. తీర ప్రాంతంలోని 11 మండలాలకు ప్రత్యేక అధికారులను నియమించినట్లు చెప్పారు. లోతట్టు ప్రాంతవాసులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఇప్పటికే ప్రత్యేక అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. తమ కార్యాలయంలో కంట్రోల్ రూం ఏర్పాటు చేసినట్లు వివరించారు. తుపాన్ వల్ల ఎవరికి ఎటువంటి ఇబ్బందులు ఏదురైన వెంటనే 08592 281400కు ఫోన్ చేయాలని ఆయన జిల్లా వాసులకు విజ్ఞప్తి చేశారు.