
సహాయ కార్యక్రమాలలో పాల్గొనాలని జగన్ పిలుపు
హైదరాబాద్: తుపాను సహాయ, పునరావాస కార్యక్రమాల్లో పాల్గొనాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన రెడ్డి పిలుపు ఇచ్చారు. ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల నేతలతో ఆయన ఫోన్లో మాట్లాడారు.
ఉత్తరాంధ్ర జిల్లాలలో ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో పై-లీన్ తుపాను ప్రభావం చూపుతున్న విషయం తెలిసిందే. శ్రీకాకుళం జిల్లాలో భారీ వర్షం కురుస్తోంది. చెట్లు, విద్యుత్ స్తంభాలు, ఇళ్లు కూలిపోయాయి. ఈ జిల్లాలో ఎక్కువ భాగం అంథకారంలో ఉంది. సహాయ కార్యక్రమాలలో పార్టీ నేతలు చురుకుగా పాల్గొనాలని జగన్ విజ్ఞప్తి చేశారు.