relief operations
-
73కు చేరిన ‘జపాన్’ మరణాల సంఖ్య
సుజు: నూతన సంవత్సరం రోజునే భారీ భూకంపం బారిన పడిన జపాన్‌లో సహాయక చర్యలు యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతున్నాయి. ఇషికావా ప్రిఫెక్చర్లో సోమవారం రిక్టర్ స్కేల్‌పై 7.6 తీవ్రతతో వచి్చన భూకంపంలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య బుధవారానికి 73కు పెరిగింది. భారీ వర్షాలు, చంపేసే చలి కారణంగా సహాయక చర్యలకు ఆటంక ఏర్పడుతోందని, అయినాసరే సహాయక చర్యల్ని ముమ్మురం చేసినట్లు ప్రధాని ఫుమియో కిషిదా బుధవారం చెప్పారు. సగం కూలిన భవనాల కింద ఇంకా చాలా మంది చిక్కుకుని ఉన్నారని సహాయక సిబ్బంది అంచనావేశారు. రాత్రంతా కేవలం నాలుగు డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత ఉండటంతో చలిలో శిథిలాల వద్ద అన్వేషణ, గాలింపు చర్యలకు ఆటంకం ఏర్పడింది. గాయపడిన 300 మందిని ఆస్పత్రిలో చికిత్సనందిస్తున్నారు. 33,000 మందిని సహాయక శిబిరాలకు తరలించారు. -
గోదావరి ముంపు ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు
-
గాలింపు చర్యలు ముమ్మరం
శ్రీనగర్: అమర్నాథ్ ఆలయం సమీపంలో అకస్మాత్తుగా సంభవించిన వరదల్లో ఆచూకీ తెలియకుండా పోయిన వారి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. అన్వేషణ, సహాయక చర్యల కోసం ఆర్మీకి చెందిన పర్వత గస్తీ బృందాలను, డ్రోన్లు, జాగిలాలు, అత్యాధునిక పరికరాలను వినియోగిస్తున్నారు. శనివారం ఉదయం ఆరుగురు యాత్రికులను హెలికాప్టర్ల ద్వారా సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్లినట్లు పేర్కొంది. ఇప్పటి వరకు 16 మృతదేహాలను బాల్టాల్ బేస్ క్యాంప్‌నకు తరలించినట్లు బీఎస్ఎఫ్ తెలిపింది. టెంట్లు, సామూహిక వంటశాలల మీదుగా పోటెత్తిన వరద, బురదమట్టి కారణంగా గాయపడిన 25 మంది ఆస్పత్రులకు తరలించారు. మరోవైపు, గుహాలయం సమీపంలో చిక్కుకుపోయిన మొత్తం 15వేల మందినీ దిగువనున్న పంజ్తరణి బేస్ క్యాంపునకు సురక్షితంగా తరలించారు. 11వ బ్యాచ్‌లోని 6వేల మంది యాత్రికులు శనివారం జమ్మూ నుంచి అమర్నాథ్ దిశగా బయలుదేరారని అధికారులు తెలిపారు. అమర్నాథ్లో శుక్రవారం సాయంత్రం 4.30–6.30 గంటల ప్రాంతంలో నమోదైంది 31 మి.మీ. వర్షపాతమేనని వాతావరణ విభాగం తెలిపింది. గంట వ్యవధిలో 100 మి.మీ. వాన నమోదైన సందర్భాల్లోనే కుండపోత వర్షంగా పరిగణిస్తామంది. అకస్మాత్తు వరదలకు ఎగువనున్న పర్వత భాగాల్లో కురిసిన వానలే కారణం కావచ్చని పేర్కొంది. -
అదీ.. అమెరికా అంటే.. ఆ మోసాలపై విచారణకు రెడీ
అమెరికాపై ఎన్ని విమర్శలు ఉన్నా .. పారదర్శకత కోసం ప్రయత్నించడంలో ఎప్పుడూ వెనుకబడలేదు. ఇందుకు సాక్షంగా నిలుస్తోంది అక్కడి న్యాయశాఖ తీసుకున్న నిర్ణయం. కోవిడ్ కష్టకాలంలో సాయంగా ప్రకటించిన భారీ మొత్తంలో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగినట్టు ఆరోపణలు వస్తున్నాయి. దీంతో ఈ కోవిడ్ రిలీఫ్ ఫండ్‌లో చోటు చేసుకుని అవినీతి ఆరోపణలపై విచారించేందుకు ప్రత్యేక డైరెక్టరేట్‌ని ఏర్పాటు చేసింది యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్. 2020లో కోవిడ్ ప్రపంచాన్ని చుట్టేస్తున్న సమయంలో యూఎస్‌లో కూడా లాక్డౌన్ విధించారు. ఇది దీర్ఘకాలం కొనసాగడంతో ప్రజలకు ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. దీంతో ప్రజల సంక్షేమ చర్యల్లో భాగంగా 2.2 ట్రిలియన్ డాలర్ల ప్యాకేజీని ప్రకటించారు. ఇందులో సుమారు 8 బిలియన్ డాలర్లు పూర్తిగా పక్కదారి పట్టినట్టు ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. దీంతో ఈ మోసాల విచారణకు ప్రత్యేక డైరెక్టరేట్‌ని ఏర్పాటు చేసింది. దీనికి డైరెక్టర్‌గా అసోసియేట్ డిప్యూటీ ఆటార్నీ జనరల్ కెవిన్ చాంబర్స్‌ని నియమించారు. - తప్పుడు సమాచారంతో సుమారు 6 బిలియన్ డాలర్ల కోవిడ్ రిలీఫ్ సాయం పొందిన 1800ల మంది వ్యక్తులు. వీరిపై నమోదైన 240 కేసుల విచారణ - వన్ బిలియన్ డాలర్ల కోవిడ్ సహాయ నిధులు పక్కదారి పట్టించినట్లు ఆరోపణలు ఉన్న వెయ్యి ముద్దాయిలపై ఉన్న కేసులు - వన్ బిలియన్ డాలర్ల విలువైన ఎకనామిక్ ఇంజ్యూరీ డిసాస్టర్ లోన్ మంజూరు విషయంలో వస్తున్న ఆరోపణలపై స్పెషల్ డైరెక్టరేట్ విచారణ జరపనుంది. కోవిడ్ రిలీఫ్ సహాయ చర్యల మోసాలకు సంబంధించిన విచారణలో సివిల్, క్రిమినల్, పరిపాలన ఇలా అన్ని విభాగాల సాయం తీసుకోనున్నారు. ఇప్పటికే వివిధ రకాల ఏజెన్సీల నుంచి పక్కా సమాచారం సేకరించినట్టు న్యాయశాఖ చెబుతోంది. ప్రస్తుతం కేసు విచారణకుఏ సహాకరించేలా డేటా విశ్లేషణ పెద్ద ఎత్తున జరుగుతోంది. కోవిడ్ రిలీఫ్ కింద ప్రకటించిన భారీ మొత్తంతో నేరుగా ఆర్థిక సాయం చేయడంతో పాటు పీపీఈ కిట్ల కొనుగోలు, రుణాల మంజూరు, ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయల పెంపు, క్వారెంటైన్ సెంటర్ల ఏర్పాటు ఇలా అనేక కార్యక్రమాలు చేపట్టారు. బాధితులను ఆదుకోవడమలే లక్ష్యంగా చాలా వేగంగా యుద్ధ ప్రతిపాదికన ఈ పనులు చేపట్టడాన్ని.. అవకాశంగా మలుచుకున్న కొందరు అవినీతికి తెర లేపారు. కోవిడ్ నిధుల దుర్వినయోగంపై పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. అనేక కేసులు నమోదు అయ్యాయి. అయితే కోవిడ్ కల్లోలం చల్లారిన తర్వాత యూఎస్ ప్రభుత్వం, అక్కడి న్యాయవ్యవస్థ ఈ అవినీతి వ్యవహారంపై దృష్టి సారించింది. విచారణ వేగం పుంజుకోవడంతో అవినీతిపరుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. -
ప్రభుత్వం ఆదుకోకపోతే బ్యాంకింగ్‌కు కష్టాలే..
ముంబై: ప్రపంచంలోనే అత్యధిక మొండి బకాయిల (ఎన్పీఏ) భారం మోస్తున్న భారత్ ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌కు కేంద్రం సహాయక చర్యలు అందకపోతే పరిస్థితి మరింత విషమిస్తుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)కు గవర్నర్లుగా బాధ్యతలు నిర్వహించిన నలుగురు తీవ్రంగా హెచ్చరిస్తున్నారు. త్వరలో విడుదలకు సిద్ధమవుతున్న ఒక పుస్తకంలో ఈ వివరాలు వెల్లడికానున్నాయి. ‘మహమ్మారి: భారత ఘన బ్యాంకింగ్ కష్టాలు’ పేరుతో పబ్లిషింగ్ హౌస్– రోలీ బుక్స్ ఆవిష్కరించనున్న పుస్తక రచనలో భాగంగా రచయిత, ప్రముఖ పాత్రికేయులు తమల్ బందోపాధ్యాయ నలుగురు గవర్నర్లను ఇంటర్వ్యూ చేశారు. అసలు మొండిబకాయిల సమస్యలకు కారణాలపై గవర్నర్లు విభిన్నంగా స్పందించినప్పటికీ బ్యాంకింగ్ విలీనాలు, పరిపాలనా, బ్యాంకుల విషయంలో ప్రభుత్వ యాజమాన్యంపై ఒకే విధంగా స్పందించడం గమనార్హం. విలీనాలు, భారీ బ్యాంకింగ్ ఏర్పాటుతో సమస్య తీరిపోదని వారు పేర్కొన్నారు. బ్యాంకుల్లో ప్రభుత్వ వాటాలు తగ్గాలని, పాలనా వ్యవస్థ మెరుగుపడాలనీ సూచించారు. సంబంధిత వర్గాల సమాచారం ప్రకారం... ఈ ఇంటర్వ్యూల్లో నలుగురు గవర్నర్లూ ఏమన్నారంటే... అత్యుత్సాహమూ కారణమే కంపెనీల భారీ పెట్టుబడులు, రుణాలు అందించడంలో బ్యాంకర్ల అత్యుత్సాహం ఎన్పీఏలు భారీగా పెరిగిపోడానికి కారణమయ్యాయి. ఆర్థిక మందగమనం మొండిబకాయిల తీవ్రతకు ఒక కారణం అయితే, సత్వర చర్యలు తీసుకోవడంలో వైఫల్యం కూడా సమస్యను మరింత జఠిలం చేసింది. మొండిబకాయిల సత్వర గుర్తింపు, తగిన భారీ మూలధన కల్పన, బ్యాంకింగ్ పాలనా వ్యవస్థ పటిష్టం తక్షణం అవసరం. ఈ దిశలో చర్యలు ఉండాలి. – డాక్టర్ రఘురామ్ రాజన్ (గవర్నర్‌గా.. 2013–2016) అతి పెద్ద సమస్య అవును. భారత్ బ్యాంకింగ్ మొండిబకాయిలు భారీ, వాస్తవ సమస్య. ఈ సమస్య సత్వర పరిష్కారంపై దృష్టి పెట్టాలి. అసలే తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న ఆర్థిక పరిస్థితులు మహమ్మారితో మరింత విషమించాయి. 2008 ప్రపంచ ఆర్థిక సంక్షోభం ముందే ప్రారంభమైన మొండిబకాయిల సమస్య, అటు తర్వాతా కొనసాగింది. కొన్ని అననుకూల పాలనాపరమైన సమస్యల వల్ల మొండిబకాయిలను తరువాత అదుపుచేయలేకపోవడం చోటుచేసుకుంది. – దువ్వూరి సుబ్బారావు (బాధ్యతల్లో.. 2008–2013) ఇతర ఇబ్బందులకూ మార్గం బ్యాంకుల్లో ఉన్న మొండిబకాయిల సమస్య కేవలం అక్కడితో ఆగిపోదు. ఇతర సమస్యలకూ ఇది దారితీస్తుంది. బలహీన ఫైనాన్షియల్ పరిస్థితులు, మొండిబకాయిలు వాస్తవ ఆర్థిక పరిస్థితిపై ప్రభావం చూపుతున్నాయి. రుణాల పెంపునకు వచ్చిన ఒత్తిడులు కూడా మొండిబకాయిల భారానికి కారణం. 2015–16 రుణ నాణ్యత సమీక్ష తరువాత ఆర్థిక వ్యవస్థ విస్తృతమయినప్పటికీ, రుణాల్లో వృద్ధి లేకపోవడం ఇక్కడ గమనార్హం. – వై. వేణుగోపాల్ రెడ్డి (విధుల్లో.. 2003–2008) పెద్ద నోట్ల రద్దు... సంక్షోభం! బ్యాంకింగ్ వ్యవస్థ ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలు ‘ప్రణాళికా బద్దంగా జరగని’’ నోట్ల రద్దుతో మరింత తీవ్రమయ్యాయి. నోట్ల రద్దు ఒక ఆర్థిక సంక్షోభంగా పేర్కొనవచ్చు. బ్యాంకింగ్ వ్యవస్థలో సమస్యకు ఈ వ్యవస్థమాత్రమే కారణం కాదు. ఆర్థిక, రాజకీయ, సామాజిక, పాలనాపరమైన అంశాలెన్నో ఇక్కడ ప్రతిబింబిస్తుంటాయి. పాలనాపరమైన లోపాలను సవరించడం ద్వారా బ్యాంకింగ్ రంగాన్ని ఒక గాడిన పెట్టడం సాధ్యమవుతుంది. – సీ. రంగరాజన్ (పదవీకాలం..1992–1997) -
కానిస్టేబుళ్లకు కమిషనర్ సెల్యూట్!
సాక్షి, సిటీబ్యూరో: ‘నగర పోలీసు విభాగంలో పని చేస్తున్న కానిస్టేబుళ్లకు సెల్యూట్ చేస్తున్నాం. వరదలతో నీట మునిగిన ప్రాంతాల్లో చేపట్టిన రెస్క్యూ ఆపరేషన్స్‌లో వారిదే కీలక పాత్ర’ సీపీ అంజనీకుమార్ వ్యాఖ్యానించారు. ఆయన గురువారం ‘సాక్షి’తో మాట్లాడారు. (చదవండి: బీదర్ నుంచి వస్తున్న ‘రాణి’) ఈత రాకున్నా రంగంలోకి.. ► గతంలో ఎన్నడూ లేని విధంగా కురిసిన వర్షాలకు నగరం అతలాకుతలమైంది. పాతబస్తీ, బోయిన్‌పల్లితో పాటు అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. ► ఇళ్లల్లోకి హఠాత్తుగా నీరు చేయడంతో పలువురు వాటిలోనే చిక్కుకున్నారు. అలాంటి వారిని రెస్క్యూ చేయడానికి నగర పోలీసు విభాగం తీవ్రంగా శ్రమించింది. ► దాదాపు 300 మంది సిబ్బంది, అధికారుల ఇళ్లల్లోకి నీరు చేరింది. అయినప్పటికీ వారంతా నిర్విరామంగా విధులకే అంకితమయ్యారు. అంబర్‌పేటలోని నా ఇంటి వరండాలోకీ 3 అంగుళాల మేర నీరు వచ్చింది. సిబ్బందిలో స్ఫూర్తి కోసం అధికారులు.. ► గురువారం నాటికి అనేక ప్రాంతాల్లో వరద తగ్గినా.. బురద ఉండటంతో సాధారణ స్థితులు నెలకొనలేదు. గడచిన నాలుగు రోజుల్లో పోలీసు విభాగం మొత్తం 200 మందిని వరద నీరు, మునక ప్రాంతాల నుంచి బయటకు తీసుకువచ్చి సురక్షిత ప్రాంతాలకు తరలించింది. ► బుధవారం రాత్రి కురిసిన వర్షంతో కొన్ని చోట్ల నీరు నిలిచినా ఆ తర్వాత ఖాళీ అయింది. ఆయా ప్రాంతాల్లో ప్రస్తుతం జీహెచ్ఎంసీ అధికారులు పారిశుద్ధ్య పనులు చేపడుతున్నారు. ఆ రెండూ సిటీకి లైఫ్‌లైన్.. భారీ వర్షం కారణంగా నీటి ఇన్‌ఫ్లో పెరిగి హిమాయత్‌సాగర్ గేట్లు ఎత్తడంతో మూసీలో ప్రవాహం పెరిగింది. ఫలితంగా ఎంజీబీఎస్ వంతెన పై నుంచి నీరు వెళ్లగా.. గురువారం తెల్లవారుజాము వరకు చాదర్‌ఘాట్ కింది వంతెన, అంబర్‌పేట కాజ్వే పూర్తిగా మునిగిపోయాయి. ► సిటీకి లైఫ్‌లైన్ అయిన ఇవి కొట్టుకుపోయాయనే ప్రచారమూ జరిగింది. గురువారం ఉదయం ఆ రెండూ బయటపడటం, సురక్షితంగా ఉంటడంతో అంతా ఊపిరి పీల్చుకున్నాం. ► ఈ విపత్కర పరిస్థితుల్లో పోలీసులకు ప్రజలు అందించిన సహకారం మరువలేం. మరో రెండు రోజులు నగర పోలీసు విభాగం అప్రమత్తంగానే ఉంటుంది. గడచిన రెండు రోజుల్లో దాదాపు 200 మంది ఫోన్లు చేశారు. ► ఫలానా కానిస్టేబుల్ మా కోసం చాలా కష్టపడ్డాడు అంటూ సిబ్బంది పేర్లతో సహా చెబుతున్నారు. ఇలాంటి ప్రోత్సాహం లభించినప్పుడు మా కష్టమంతా మరిచిపోతాం. (చదవండి: రూ.5 వేల కోట్ల నష్టం..) -
విద్యుత్ సరఫరా పునరుద్ధరణ చాలా ముఖ్యం
-
కృష్ణా, గుంటూరు కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలి..
సాక్షి, తాడేపల్లి: ఎడతెరిపి లేని వర్షాలు, వరదలతో ఆంధ్రప్రదేశ్ తడిసిముద్దయింది. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. కృష్ణా నదికి భారీగా వరద పోటెత్తుతోంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి భారీ వర్షాలు, సహాయక చర్యలపై బుధవారం మధ్యాహ్నం సమీక్ష నిర్వహించారు. మంత్రులు సుచరిత, బొత్స, సీఎస్ నీలంసాహ్ని కార్యక్రమంలో పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్లు,అధికారులతో జిల్లాలవారీగా సీఎం సమీక్షించారు. ప్రభుత్వ యంత్రాంగమంతా అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా సీఎం ఆదేశించారు. విద్యుత్ పునరుద్ధరణ యుద్ధప్రాతిపదికన చేపట్టాలని సీఎం ఆదేశించారు. రోడ్ల పునరుద్ధరణ పనులు వేగంగా చేపట్టి వరద బాధితులకు సాయం చేయాలని అన్నారు. అదేసమయంలో వర్షాల వల్ల వచ్చే వ్యాధులపై దృష్టి పెట్టాలని సీఎం చెప్పారు. పునరావాస కేంద్రాల్లో ఉన్నవారికి అవసరమైన సాయం అందించాలని అన్నారు. తాగునీటి సరఫరాపై దృష్టి పెట్టాలన్న సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. (చదవండి: చిగురుటాకులా వణికిన తీరం ) ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమీక్ష సమావేశంలోని ముఖ్యాంశాలు ప్రకాశం బ్యారేజీకి భారీ వరద: తెలంగాణలో భారీ వర్షాల వల్ల ప్రకాశం బ్యారేజీకి భారీ వరద వస్తోంది. బ్యారేజీ వద్ద ఇప్పటికే భారీ వరద కొనసాగుతోంది. శ్రీశైలం నుంచి 4 లక్షల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. మరో 24 గంటల్లో ఆ వరద చేరుతుంది. ఏ పరిస్థితి అయినా ఎదుర్కోవడం కోసం గుంటూరు, కృష్ణా జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలి. విజయవాడలో ఇళ్లు ఖాళీ చేయించే వారికి తప్పనిసరిగా వసతి కల్పించాలి. ప్రకాశం బ్యారేజీ వద్ద 7.5 లక్షల క్యూసెక్కుల వరద వచ్చే వీలుంది, కాబట్టి ఆ మేరకు సిద్ధంగా ఉండండి. విద్యుత్ పునరుద్ధరించాలి విద్యుత్ సరఫరా పునరుద్ధరణ చాలా ముఖ్యం, దాన్ని యుద్ధప్రాతిపదికన చేపట్టాలి. ఆ తర్వాత కాలువలు, చెరువుల గండ్లు పూడ్చడంతో పాటు, రహదారుల మరమ్మతు పనులు కూడా యుద్ధప్రాతిపదికన జరగాలి. అన్ని చోట్లా రహదారులు బాగు చేసి, అందుబాటులోకి తేవాలి. 4-5 నెలల్లో శాశ్వత ప్రాతిపదికన కూడా మరమ్మత్తులు పూర్తి చేయాలి. ఆర్థిక సహాయం చేయాలి వేర్వేరు జిల్లాలలో చనిపోయిన 10 మంది కుటుంబాలకు వెంటనే పరిహారం చెల్లించండి. అదే విధంగా వెంటనే నష్టం అంచనాలు వేయండి, వారం రోజుల్లో నష్టంపై అంచనాలు పంపండి. తూర్పు గోదావరి జిల్లాలో ఏలేరు రిజర్వాయర్ వల్ల పిఠాపురంలో వరద వస్తోంది కాబట్టి, అవసరమైన ఆధునీకరణ చేపట్టండి. వర్షాలు తగ్గాయి కాబట్టి, ఇంకాస్త అప్రమత్తంగా ఉండండి. నీటిని వృథాగా పోనీయొద్దు రిజర్వాయర్లు నింపడం, అక్కడి నుంచి కాలువల ద్వారా ప్రతి చెరువు నింపడంపై రాయలసీమతో పాటు, శ్రీకాకుళం, విజయనగరం, ప్రకాశం జిల్లాల కలెక్టర్లు ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఆ మేరకు ఒక కార్యాచరణ ప్రణాళిక కూడా సిద్ధం చేయండి. చిత్తూరు జిల్లాలో 40 శాతం అధిక వర్షాలు కురిసినా, కేవలం 30 శాతం మాత్రమే ట్యాంకులు నిండడం పరిస్థితికి అద్దం పడుతోంది. దీన్ని పూర్తిగా మార్చి, కురిసే ప్రతి నీటి బొట్టుని ఒడిసి పట్టాలి,తద్వారా రిజర్వాయర్లు, చెరువులు నింపాలి. కరువు నివారణలో శాశ్వత పరిష్కారం చూడాలి. నెల్లూరు జిల్లాలో కండలేరులో ఈసారి గరిష్టంగా 60 టీఎంసీల నీరు నిల్వ చేయబోతున్నాం. ఇప్పటి వరకు కండలేరులో గరిష్టంగా 50 టీఎంసీలు మాత్రమే నిల్వ చేశాం. మానవతా దృక్పథం చూపండి సహాయ శిబిరాల్లో (షెల్టర్లలో) ఉన్న వారి పట్ల పూర్తి మానవతా దృక్పథంతో వ్యవహరించండి,వారికి కనీసం రూ.500 చొప్పున ఇవ్వండి. వారి ఇళ్లలో పరిస్థితి ఎలా ఉందో తెలియదు కాబట్టి, అన్నింటిని ఆరా తీసి ఆదుకోండి. వ్యవసాయశాస్త్రవేత్తల సూచనలు: పూనం మాలకొండయ్య కాగా, వరదలు తగ్గుముఖం పట్టాక వ్యవసాయ, ఉద్యానవన వర్సిటీలు, కృషి విజ్ఞాన కేంద్రాలకు చెందిన వ్యవసాయ శాస్త్రవేత్తలు రైతులకు అవసరమైన సూచనలు చేస్తారని వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య వెల్లడించారు. పంటల నష్టంపై వీలైనంత త్వరగా అంచనాలు పూర్తి చేసి పంపాలని ఆమె జిల్లాల కలెక్టర్లను కోరారు. భారీ వర్షాలు, వరదలు వచ్చినప్పటికీ ధాన్యం సేకరణ యథావిథిగా కొనసాగుతుందన్న ఆమె, ఆ మేరకు ఇప్పటికే రైతు భరోసా కేంద్రాల వద్ద రిజిస్ట్రేషన్ కొనసాగుతోందని చెప్పారు. పక్కాగా శానిటేషన్: గోపాలకృష్ణ ద్వివేదీ వరదలు సంభవించిన అన్ని చోట్ల శానిటేషన్ కోసం తగిన ఏర్పాట్లు చేశామని, అన్ని చోట్ల అవసరమైన బ్లీచింగ్ పౌడర్ అందుబాటులో ఉంచామని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేదీ వెల్లడించారు. ఇప్పటికే అంతటా శానిటేషన్ చర్యలు మొదలయ్యాయన్న ఆయన, తాగు నీరు కూడా ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్నామని చెప్పారు. -
ఇండోనేసియా మృతులు @ 319
మతరం(ఇండోనేసియా): ఇండోనేసియాలోని లాంబోక్ దీవిలో సంభవించిన భూకంపంలో మృతుల సంఖ్య 319కి పెరిగింది. భూకంపం అనంతరం ప్రకంపనలు కొనసాగడం వల్లే ప్రాణనష్టం అధికంగా జరిగినట్లు అధికారులు తెలిపారు. నిత్యం పర్యాటకులతో సందడిగా ఉండే ఆ ప్రాంతం మరుభూమిగా మారింది. లాంబోక్‌ను ఆదివారం 6.9 తీవ్రతతో భూకంపం కుదిపేసిన సంగతి తెలిసిందే. గురువారం 5.9 తీవ్రతతో వచ్చిన ప్రకంపనలకు భయకంపితులైన ప్రజలు ప్రాణభయంతో ఇళ్ల నుంచి పరుగులు పెట్టినట్లు స్థానిక మీడియాలో ప్రసారమైంది. ప్రకంపనలకు దారుణంగా దెబ్బతిన్న రోడ్ల వల్ల లాంబోక్ శిథిలాల్లో చిక్కుకున్న బాధితులను చేరుకోవడం సహాయక చర్యలు చేపడుతున్న సిబ్బందికి కష్టతరమవుతోంది. -
మండలానికో ఐఏఎస్ అధికారి!
హుదూద్ తుఫాను పునరావాస చర్యలను పరిశీలించేందుకు మండలానికో ఐఏఎస్ అధికారిని నియమిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. యుద్ధప్రాతిపదికన సహాయ చర్యలు చేపట్టాలని అన్నారు. ముఖ్యంగా తుఫాను వల్ల తీవ్రంగా ప్రభావితమైన విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు వీరిని పంపుతున్నామన్నారు. హుదూద్ తుఫాను బాధితులు మొత్తం 2.48 లక్షల మంది ఉన్నారని, మొత్తం 223 సహాయక శిబిరాలు ఏర్పాటు చేశామని, 1.35 లక్షల మందిని పునరావాస కేంద్రాలకు తరలించామని ప్రభుత్వ వర్గాలు చెప్పాయి. నాలుగు జిల్లాల పరిధిలోని 44 మండలాలు, 330 గ్రామాల్లో తుఫాను ప్రభావం ఉందన్నాయి. -
సహాయక చర్యలో పాల్గొనండి: వైఎస్ జగన్
-
సహాయక చర్యలో పాల్గొనండి: వైఎస్ జగన్
రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా వరద ముంపునకు గురైన ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆ పార్టీ శ్రేణులను ఆదేశించారు. శుక్రవారం హైదరాబాద్‌లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్రం కార్యాలయంలో వైఎస్ జగన్ భారీ వర్షాలపై ఆ పార్టీ ముఖ్య నేతలతో చర్చించారు. లోతట్టు ప్రాంతాల్లో చిక్కుకున్న ప్రజలకు సురక్షిత ప్రాంతాలకు, అలాగే నిలువ నీడ లేని బాధితులను పునరావాస కేంద్రాలను తరలించేందుకు తక్షణమే స్పందించాలని ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ శ్రేణులకు సూచించారు. ఇటీవల రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలు రాష్ట్రాన్ని అతలాకుతలం చేశాయి. ఈ నేపథ్యంలో సహాయ చర్యలు చేపట్టాలని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి చేశారు. -
పై-లీన్ సహాయ కార్యక్రమాలు నాలుగు రోజుల్లో పూర్తి
పై-లీన్ తుఫాను సహాయ కార్యక్రమాలన్నీ మరో నాలుగురోజుల్లో పూర్తవుతాయని ఒడిషా ప్రభుత్వం ప్రకటించింది. వరద ప్రభావిత ప్రాంతాలన్నింటి నుంచి నీరు లాగేసిందని, పునరావాస కేంద్రాల్లో తలదాచుకున్న వారిలో చాలామంది తిరిగి తమ ఇళ్లకు వెళ్లారని ఒడిషా రాష్ట్ర ప్రత్యేక సహాయ కమిషనర్ పి.కె. మొహాపాత్ర తెలిపారు. ఈనెల 22వ తేదీకల్లా సహాయ కార్యక్రమాలన్నీ పూర్తవుతాయన్నారు. శనివారం రాత్రి గంజాం జిల్లాలోని గోపాల్పూర్ వద్ద తీరం దాటిన పై-లీన్ తుఫాను పెను విధ్వంసం సృష్టించిన విషయం తెలిసిందే. గంజాం, పూరీ, గజపతి, ఖుర్దా జిల్లాలు ఈ తుఫాను వల్ల ఎక్కువగా దెబ్బతిన్నాయి. బాలాసోర్, భద్రక్, కియోంఝర్, మయూర్భంజ్, జాజ్‌పూర్ జిల్లాల్లో వరదలు వచ్చాయి. ఈ తుఫాను ప్రభావంతో 43 మంది మరణించగా 17 జిల్లాల్లోని 1.2 కోట్ల మంది ప్రజలు ప్రభావితమయ్యారు. -
సహాయ కార్యక్రమాలలో పాల్గొనాలని జగన్ పిలుపు
హైదరాబాద్: తుపాను సహాయ, పునరావాస కార్యక్రమాల్లో పాల్గొనాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన రెడ్డి పిలుపు ఇచ్చారు. ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల నేతలతో ఆయన ఫోన్లో మాట్లాడారు. ఉత్తరాంధ్ర జిల్లాలలో ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో పై-లీన్ తుపాను ప్రభావం చూపుతున్న విషయం తెలిసిందే. శ్రీకాకుళం జిల్లాలో భారీ వర్షం కురుస్తోంది. చెట్లు, విద్యుత్ స్తంభాలు, ఇళ్లు కూలిపోయాయి. ఈ జిల్లాలో ఎక్కువ భాగం అంథకారంలో ఉంది. సహాయ కార్యక్రమాలలో పార్టీ నేతలు చురుకుగా పాల్గొనాలని జగన్ విజ్ఞప్తి చేశారు.