
సహాయక చర్యలో పాల్గొనండి: వైఎస్ జగన్
రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా వరద ముంపునకు గురైన ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆ పార్టీ శ్రేణులను ఆదేశించారు. శుక్రవారం హైదరాబాద్లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్రం కార్యాలయంలో వైఎస్ జగన్ భారీ వర్షాలపై ఆ పార్టీ ముఖ్య నేతలతో చర్చించారు.
లోతట్టు ప్రాంతాల్లో చిక్కుకున్న ప్రజలకు సురక్షిత ప్రాంతాలకు, అలాగే నిలువ నీడ లేని బాధితులను పునరావాస కేంద్రాలను తరలించేందుకు తక్షణమే స్పందించాలని ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ శ్రేణులకు సూచించారు. ఇటీవల రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలు రాష్ట్రాన్ని అతలాకుతలం చేశాయి. ఈ నేపథ్యంలో సహాయ చర్యలు చేపట్టాలని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి చేశారు.