మండలానికో ఐఏఎస్ అధికారి! | an IAS officer for each mandal, says chandra babu naidu | Sakshi
Sakshi News home page

మండలానికో ఐఏఎస్ అధికారి!

Published Mon, Oct 13 2014 11:22 AM | Last Updated on Thu, Sep 27 2018 3:20 PM

an IAS officer for each mandal, says chandra babu naidu

హుదూద్ తుఫాను పునరావాస చర్యలను పరిశీలించేందుకు మండలానికో ఐఏఎస్ అధికారిని నియమిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. యుద్ధప్రాతిపదికన సహాయ చర్యలు చేపట్టాలని అన్నారు. ముఖ్యంగా తుఫాను వల్ల తీవ్రంగా ప్రభావితమైన విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు వీరిని పంపుతున్నామన్నారు.

హుదూద్ తుఫాను బాధితులు మొత్తం 2.48 లక్షల మంది ఉన్నారని, మొత్తం 223 సహాయక శిబిరాలు ఏర్పాటు చేశామని, 1.35 లక్షల మందిని పునరావాస కేంద్రాలకు తరలించామని ప్రభుత్వ వర్గాలు చెప్పాయి. నాలుగు జిల్లాల పరిధిలోని  44 మండలాలు, 330 గ్రామాల్లో తుఫాను ప్రభావం ఉందన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement