రాష్ట్ర విభజనను కచ్చితంగా ఆపుతామని ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డి అన్నారు. రాష్ట్రానికి నష్టం కలిగించే విభజనను అడ్డుకుంటామని ఆయన స్పష్టం చేశారు. శ్రీకాకుళం జిల్లాలో పై-లిన్ తుఫాన్ బాధిత ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా కవిటిమండలం దేవగుడితోటలో నిర్వహించిన సభలో ముఖ్యమంత్రి మాట్లాడారు. సమైక్యాంధ్ర గురించి మాట్లాడే సమయం, సందర్భం కాదంటూ విభజనను అడ్డుకుంటామంటూ ఒక్కమాట చెప్పారు. పై-లిన్ తుఫాన్ను ఆపలేకపోయమని, కానీ ఈ సైక్లోన్(విభజన తుఫాన్)ను ఆపి తీరుతామని ఆయన ప్రకటించారు. అంతకుముందు ముఖ్యమంత్రికి విశాఖపట్నం పర్యటనలో ఆదివారం చేదు అనుభవం ఎదురైంది. సీఎం సమైక్యాంధ్ర ద్రోహి అని నినాదాలు చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు నిరసన తెలియజేశారు. ఆయన కాన్వాయ్ను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. వైఎస్ఆర్ సీపీ నేత పెంటయ్య సహా పలువురు కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు.
Published Sun, Oct 20 2013 3:34 PM | Last Updated on Thu, Mar 21 2024 5:16 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement