Nallari Kiran Kumar Reddy
-
Rajampet Lok Sabha: లోకల్ లీడర్ vs గెస్ట్ పొలిటిషన్
అన్నమయ్య: రాజంపేట లోక్‌సభకు అరుదైనపోరు ఆవిర్భవించింది. ఆరుదశాబ్దాల తర్వాత ఏక సామాజికవర్గం మధ్య లోక్‌సభ ఎన్నికల రణరంగానికి రాజంపేట వేదికగా మారింది. ఈ లోక్‌సభపై రాష్ట్రం దృష్టి సారించింది. కారణం కూటమి అభ్యర్థిగా, బీజెపీ నుంచి ఉమ్మడిరాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి పోటీచేస్తుండగా, ఈ స్థానం నుంచి రెండుసార్లు ఎంపీ అయిన పెద్దిరెడ్డి వెంకట మిథున్‌రెడ్డి వైఎస్సార్సీపీ నుంచి బరిలోకి దిగారు. ఇప్పటి వరకు రాజంపేట లోక్‌సభకు బలిజ,రెడ్డి సామాజికవర్గాలకు చెందిన అభ్యర్థుల మధ్య పోటీ కొనసాగుతూ వచ్చింది. ఈ సారి ఇద్దరు రెడ్డి సామాజికవర్గానికి చెందిన వారే లోక్‌సభ ఎన్నికబరిలో ఉండటంతో అరుదైన పోరుగా రాజకీయపరిశీలకులు భావిస్తున్నారు. 1957 నుంచి... రాజంపేట లోక్‌సభ ఆవిర్భవించిన తర్వాత 1957 నుంచి 2019 వరకు 16 సార్లు జరిగిన ఎన్నికల్లో మొదటి రెండు, చివరి రెండుసార్లు మినహా మొత్తం 12 సార్లు కాపు (బలిజ)లే దక్కించుకున్నారు.ఈ నేపథ్యంలో ప్రధాన అభ్యర్థులుగా ఇద్దరు ఓకే సామాజికవర్గానికి వారు తలపడి 62 సంవత్సరాలు అయింది. 1962 తర్వాత.. 2019 ఎన్నికల్లో బలిజ సామాజికవర్గానికి చెందిన ఆదికేశవులనాయుడు సతీమణి సత్యప్రభతో వైఎస్సార్సీపీ అభ్యర్థి మిథున్‌రెడ్డి తలపడి గెలుపొందారు. 2014లోనూ బీజెపీ అభ్యర్థి, ప్రస్తుత బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరిపై పోటీ చేసి గెలుపొందడం విశేషం. 1962 తర్వాత ఒకే సామాజికవర్గానికి చెందిన అభ్యర్థుల మధ్య పోరు 2024 ఎన్నికల్లో ఆవిష్కృతంకావడంతో రాజంపేట లోక్‌సభ స్థానం ప్రత్యేకతను సంతరించుకుంది. బహుశా రాష్ట్రంలో కూడా రెండు ప్రధాన పార్టీల నుంచి ఒకే సామాజికవర్గం వారు పోటీ పడిన సందర్భం ఎక్కడా ఉండకపోవచ్చు. 9 సార్లు కాపుల మధ్యే పోరు రాజంపేట లోక్‌సభ ఏర్పడిన 1957 నుంచి 2019 వరకు ఎన్నికల చరిత్రలోకి వెళితే...ఇప్పటికి 16సార్లు ఎన్నికలు జరిగాయి. తొలి ఎన్నికల్లో 1957లో టీవీఎన్‌రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి కాగా , 1962లో ఇండింపెండెట్గా సీవీఎల్రెడ్డి చేతిలో టీవీఎల్ఎన్రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా ఓటమిపాలయ్యారు. అంటే 1962లో ఇద్దరు ఒకే సామాజికవర్గ అభ్యర్థుల మధ్య పోరు జరిగింది. తర్వాత ఈ వర్గానికి మధ్య ఇప్పటి వరకు పోరు జరగలేదు. 1967లో బలిజ సామాజికవర్గానికి చెందిన పార్థసారధి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. అప్పట్లో ఆయనపై సీఎల్ఎన్రెడ్డి స్వతంత్య్రఅభ్యర్థిగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు. 1971లో కాంగ్రెస్ అభ్యర్థిగా తిరిగి పోటీ చేసిన పార్థసారధిపై,ఎన్సీవో పార్టీ అభ్యర్ధిగా యశోదరెడ్డి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. 1977లో మూడోసారి కాంగ్రెస్ అభ్యర్థిగా పార్థసారధి, బీఎల్డీ అభ్యర్ధి తిమ్మారెడ్డి పై పోటీ చేసి గెలుపొందారు. 1980లో నాలుగోసారి పార్థసారధి కాంగ్రెస్(ఐ) అభ్యర్థిగా పోటీచేశారు. ఈ సారి బలిజ సామాజికవర్గానికి చెందిన కాంగ్రెస్ (యు) అభ్యర్థిగా ఆర్,సభాపతిపై పోటీ చేసి గెలుపొందారు. బలిజసామాజికవర్గానికి చెందిన 1984లో పాలకొండ్రాయుడు టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. కాంగ్రెస్ అభ్యర్థి సాయిప్రతాప్ గెలుపొందారు. 1989లో సాయిప్రతాప్, టీడీపీ నుంచి పోటీ చేసిన సీ.రామచంద్రయ్యపై గెలుపొందారు. 1991లో సాయిప్రతాప్ కాంగ్రెస్ నుంచి పోటీ చేయగా, పాలకొండ్రాయుడు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 1996లో సాయిప్రతాప్ కాంగ్రెస్ అభ్యర్థిగా , టీడీపీ అభ్యర్థి పోతురాజు ప్రతాప్‌పై పోటీ చేసి గెలుపొందారు. 1998లో టీడీపీ అభ్యర్థి గునిపాటిరామయ్యపై కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. 1999లో గునిపాటి గెలుపొందారు. అంటే 1977 నుంచి 2004 వరకు జరిగిన తొమ్మిది ఎన్నికల్లో బలిజసామాజికవర్గం అభ్యర్థుల మధ్య పోటీ సాగింది. నాలుగుసార్లే... 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా సాయిప్రతాప్ టీడీపీ అభ్యర్థి రమేష్‌రెడ్డిపై పోటీ చేసి గెలుపొందారు. 2014లో ప్రస్తుత సిట్టింగ్ ఎంపీ పీవీ మిథున్‌రెడ్డి వైఎస్సార్సీపీ నుంచి పోటీ చేసి ,బీజెపీ అభ్యర్థి పురందేశ్వరిపై గెలుపొందారు. 2019లో మిథున్‌రెడ్డి వైఎస్సార్సీపీ అభ్యర్థిగా టీడీపీ అభ్యర్థి సత్యప్రభపై పోటీ చేసి గెలుపొందారు. అంటే మొత్తం 67 నుంచి జరిగిన ఎన్నికల్లో నాలుగుసార్లు రెడ్డి, బలిజ అభ్యర్ధుల మధ్య పోటీ జరగ్గా , మిగతా అన్నిసార్లు బలిజ,బలిజల మధ్యే ఎన్నికల పోరు కొనసాగింది. లోక్‌సభ స్వరూపమిలా.. ఏపీలోని 25 లోక్‌సభ నియోజకవర్గాల్లో రాజంపేట ఒకటి. ఈ నియోజకవర్గ పరిధి ఆధారంగా అన్నమయ్య జిల్లాను ఏర్పాటుచేశారు. ఇందులో ఏడు శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయి. వీటిలో పుంగనూరు నియోజకవర్గం జిల్లాకేంద్రానికి దగ్గరగా ఉండటానికి చిత్తూరు జిల్లాలో కలిపారు. ► మిథున్‌రెడ్డి, కిరణ్‌కుమార్‌రెడ్డి మధ్య పోరు... రాజంపేట సిట్టింగ్ ఎంపీ పీవీ మిథున్‌రెడ్డి, మాజీ సీఎం నలారి కిరణ్‌కుమార్‌రెడ్డి మధ్య పోరు సాగుతోంది.1962లో జరిగిన ఎన్నికల్లో తప్ప ఇప్పటి వరకు రెడ్డి, రెడ్డి మధ్య జరగని పోరు ఈ సారి ఎన్నికల్లో ఆవిష్కృతం కావడంతో రాజంపేట పార్లమెంట్ పోరు అరుదైన ఘట్టంగా మారిందని రాజకీయపరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. -
నల్లారి వారి నయా డ్రామా.. కమలం పువ్వు చెవిలో పెట్టుకుని..
ఆయన యాక్సిడెంటల్‌గా ఉమ్మడి ఏపీకి ముఖ్యమంత్రి అయ్యారు. ఉమ్మడి రాష్ట్రానికి ఆఖరి ముఖ్యమంత్రిగా మిగిలిపోయారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో కాంగ్రెస్‌ను నట్టేట ముంచి చెయ్యి వదిలేసి వెళ్ళిపోయారు. సొంతంగా పార్టీ పెట్టుకుని విభజిత ఆంధ్రప్రదేశ్ తొలి ఎన్నికల్లో ఘోర పరాభవానికి గురయ్యారు. తర్వాత మూడేళ్ళకు మళ్ళా కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. కాంగ్రెస్‌లో ఉంటే భవిష్యత్ లేదని భావించి గత ఏడాది కమలం గూటికి చేరుకున్నారు. తాజా ఎన్నికల్లో ఏపీలో ఎంపీగా బరిలో దిగారు. ఆ నాయకుడు ఎవరో ఈ పాటికి మీకు అర్థం అయ్యే ఉంటుంది. ఆయన రాజకీయాలు ఎలా సాగాయో పరిశీలిద్దాం 1989లో చిత్తూరు జిల్లా వాయల్పాడు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరపున అసెంబ్లీకి ఎన్నికవ్వడం ద్వారా నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి రాజకీయ ప్రయాణం మొదలైంది. 2004లో డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రభుత్వ చీఫ్ విప్‌గా అవకాశం లభించింది. ఐదేళ్ళ పాటు వైఎస్ నమ్మినబంటుగా ఉంటూ అసెంబ్లీలో చీఫ్ విప్‌గా కొనసాగారు. 2009లో డాక్టర్ వైఎస్ రెండోసారి సీఎం అయ్యాక అసెంబ్లీ స్పీకర్‌గా ఎన్నికయ్యారు. రాజశేఖరరెడ్డి హఠాన్మరణంతో ఆర్థిక మంత్రిగా ఉన్న కొణిజేటి రోశయ్యను ముఖ్యమంత్రి పదవి వరించింది. రోశయ్య సీఎంగా ఉన్నకాలంలోనే అసెంబ్లీ స్పీకర్ పదవిలో ఉంటూనే..ఢిల్లీకి పదే పదే తిరిగి కాంగ్రెస్ హైకమాండ్‌ను బుట్టలో వేసుకున్నారు కిరణ్‌కుమార్‌రెడ్డి. తెలంగాణ రాష్ట్ర ఉద్యమం తీవ్రస్థాయిలో ఉన్న సమయంలో 2010 నవంబర్‌లో రోశయ్య స్థానంలో కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. తెలంగాణ ఉద్యమం పీక్స్‌కు చేరడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనకు కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయం తీసుకుంది. అయితే విభజనను అసెంబ్లీలో వ్యతిరేకిస్తూ..ఆఖరి బాల్ తన దగ్గర ఉందంటూ తెలంగాణ ప్రజల్ని బెదిరిస్తూ..ఆంధ్ర ప్రజల్ని నమ్మిస్తూ..2014లో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాడి కిందపారేసి కాంగ్రెస్‌ను వదిలి వెళ్ళిపోయారు. ఢిల్లీకి..హైదరాబాద్‌కు పదే పదే తిరిగి కాంగ్రెస్ పెద్దలకు ఏవేవో చెప్పి వారిని నమ్మించి ముఖ్యమంత్రి పదవి దక్కించుకున్నారు. నమ్మి రాష్ట్రాన్ని అప్పగించిన పార్టీని రాష్ట్ర విభజన నిర్ణయం తర్వాత నట్టేట ముంచి సొంతంగా జై సమైక్యాంధ్ర పార్టీని స్థాపించి ఎన్నికల్లో పోటీ చేశారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకించిన ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోయింది. చివరి వరకు పదవిని అంటిపెట్టుకుని ఉన్న కిరణ్‌కుమార్‌రెడ్డికి కూడా ఏపీ ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టారు. జై సమైక్యాంధ్ర పార్టీకి ఏ నియోజకవర్గంలోనూ డిపాజిట్లు దక్కలేదు. ఆఖరుకు కిరణ్‌కుమార్‌రెడ్డి, ఆయన తమ్ముడు కూడా ఘోరంగా ఓడిపోయారు. అటు కాంగ్రెస్ పార్టీని..ఇటు ఆంధ్ర ప్రజల్ని మోసం చేసిన కిరణ్‌కుమార్‌రెడ్డి 2014 ఎన్నికల తర్వాత కొన్నాళ్ళ పాటు సైలెంట్‌గా ఉండిపోయారు. ఇలాగే సైలెంట్‌గా ఉండిపోతే రాజకీయ భవిష్యత్‌కు చేతులారా సమాధి కట్టుకోవడమే అవుతుందని భావించి సైకిల్ ఎక్కాలా? మళ్ళీ చేయి పట్టుకుని నడవాలా అని కొన్నాళ్ళ పాటు తర్జన భర్జన పడ్డారు. చివరికి 2018 జులైలో తన సొంత పార్టీని రద్దు చేసుకుని.. రాహుల్ గాంధీ సమక్షంలో మరోసారి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. కాని 2019 ఎన్నికల్లో ఏపీ నుంచి పోటీ చేయడానికి సాహసించలేకపోయారు. కాంగ్రెస్‌లో అసలు ఉన్నారా ? లేరా? అన్నట్లుగా కొనసాగి గత ఏడాది ఏప్రిల్‌లో రెండోసారి హస్తానికి హ్యాండిచ్చి భారతీయ జనతాపార్టీలో చేరిపోయారు. 2014 ఎన్నికల వరకు కాంగ్రెస్‌లో ఉన్నా.. ఆ తర్వాత సొంతంగా పార్టీ పెట్టుకున్నా..2014లో ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, వైఎస్ జగన్‌కు వ్యతిరేకంగానే ఉన్నారు. వైఎస్ జగన్‌పై అక్రమ కేసులు పెట్టించడంలో కాంగ్రెస్ హైకమాండ్‌కు, చంద్రబాబుకు కిరణ్‌కుమార్ పూర్తిగా సహకరించారు. తెలుగుదేశంలో చేరకపోయినా.. పచ్చ మందకు అడుగడుగునా సహకరిస్తూనే ఉన్నారు. ఇప్పుడు టీడీపీ కూటమిలో బీజేపీ చేరడంతో రాజంపేట నుంచి బీజేపీ అభ్యర్థిగా లోక్‌సభకు పోటీ చేస్తున్నారు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినా నియోజకవర్గంలో తనకంటూ ఓట్ బ్యాంక్‌ను ఏర్పాటు చేసుకోలేకపోయారు. ఏపీ ప్రజలు కాంగ్రెస్‌ను ఛీత్కరించడంతో పాటు.. చివరి వరకు మోసపు మాటలతో కాలం గడిపిన కిరణ్‌కుమార్‌రెడ్డిని కూడా ఛీ కొట్టారు. అందుకే గత ఎన్నికల్లో పోటీ చేయడానికే భయపడ్డారు. తాజా ఎన్నికల్లో మూడు పార్టీలు జట్టు కట్టడంతో బీజేపీ తరపున ఎంపీగా పోటీ చేయడానికి కిరణ్‌కుమార్ రెడీ అయ్యారు. కాని రాజంపేటలో తన చిరకాల రాజకీయ ప్రత్యర్థి కుటుంబానికి చెందిన పెద్దిరెడ్డి మిధున్‌రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఇప్పటికే రెండుసార్లు ఎంపీగా గెలిచి ప్రజాదరణతో, వైఎస్ జగన్ ఆశీస్సులతో మూడోసారి మిధున్‌రెడ్డి పోటీ చేస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా అధికారాన్ని అనుభవించి.. కాంగ్రెస్‌ను భూ స్థాపితం చేసి.. ఇప్పుడు కమలం పువ్వును చెవిలో పెట్టుకుని ప్రజా సేవకుడిలా పోజు పెట్టి రాజంపేటలో పోటీ చేస్తే కిరణ్ కుమార్‌రెడ్డిని ప్రజలు నమ్ముతారా? -
చంద్రబాబు ఎత్తులకు తెలుగు తమ్ముళ్లు తుస్!!
సాక్షి రాయచోటి: తెలుగుదేశం పార్టీని నమ్ముకుని ఆవిర్భావం నుంచి అండగా ఉంటున్న వారికి ప్రస్తుతం గడ్డు పరిస్థితులు దాపురించాయి. ‘కష్టకాలంలో అండగా ఉన్నారు...అన్ని విధాల ఆదుకోవడంతోపాటు టికెట్ కూడా మీకే’ అంటూ ఊసరవెళ్లి మాటలతో పార్టీ పెద్దలు బురిడీ కొట్టించారు. పొత్తుల మాయో...లేక బాబు జిత్తులో...డబ్బుల మూటలు తీసుకురాలేరనో గానీ... ఆది నుంచి ఉన్న వారికి టికెట్ల కేటాయింపులో శృంగభంగం తప్పలేదు. జిల్లాలో ఇప్పటికే పలుచోట్ల కొత్త అభ్యర్థులను తెరమీదికి తేవడంతో గరంగరంగా ఉన్న ‘దేశం’ శ్రేణులకు తాజాగా రాజంపేట పార్లమెంటు స్థానాన్ని బీజేపీకి కేటాయించడంతో ఎమ్మెల్యే అభ్యర్థుల్లోనూ అలజడి ప్రారంభమైంది. అన్నమయ్య జిల్లాలో అధికంగా ముస్లిం మైనార్టీ వర్గాలు ఉన్న నేపధ్యంలో ఎన్నికల్లో దెబ్బ తగులుతుందన్న ఆందోళన తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను వెంటాడుతోంది. ‘సుగవాసి’ కుటుంబానికి ఎగనామం రాయచోటి మాజీ ఎమ్మెల్యే సుగవాసి పాలకొండ్రాయుడు కుమారులు సుగవాసి బాలసుబ్రమణ్యం, సుగవాసి ప్రసాద్‌బాబు టీడీపీలో క్రీయాశీలకంగా వ్యవహరిస్తున్నారు. సుగవాసి బాలసుబ్రమణ్యంకు రాజంపేట పార్లమెంటు సీటు కేటాయించినట్లు అంతర్గతంగా చెప్పడంతో ఆయన రెండు నెలలుగా అనునిత్యం తిరుగుతున్నారు. పార్లమెంటు అభ్యర్థిగా తనను బలపరచాలని జిల్లాలో తిరుగుతూ...మరోవైపు ప్రచారం కూడా నిర్వహిస్తున్నారు. ఈ తరుణంలో రాజంపేట పార్లమెంటు స్థానాన్ని బీజేపీకి అప్పజెప్పడంతో కాపు సామాజిక వర్గంలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఇప్పటికే సుగవాసి వర్గీయులు సంబంధిత పార్టీ కార్యాలయాల వద్ద టీడీపీ ఫ్లెక్సీలు, బ్యానర్లు కూడా తొలగించారు. మదనపల్లె, రాయచోటిలోనూ అంతర్గత పోరు జిల్లాలోని ప్రధాన కేంద్రాల్లోనూ టీడీపీ అంతర్గతపోరుతో సతమతమవుతోంది. మదనపల్లె తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా షాజహాన్‌బాషాను ప్రకటించడంతో అప్పటి నుంచి టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న దొమ్మలపాటి రమేష్ కినుక వహించారు. మరోవైపు రాయచోటిలో ఇదివరకే మండిపల్లికి టికెట్ కేటాయించినా.. అభ్యర్థిని మారుస్తారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. పైగా ఇక్కడి టికెట్ ఆశించిన మాజీ ఎమ్మెల్యే రమేష్‌కుమార్‌రెడ్డి స్తబ్దుగా ఉండిపోయారు. రాజంపేట టికెట్‌పై ప్రతిష్ఠంభన కొత్త, పాత అనే తేడా లేకుండా పార్టీకి పనిచేసిన వారికి సంబంధం లేకుండా టిక్కెట్లు అధిష్టానం కేటాయించడంపై శ్రేణులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే రాజంపేట టీడీపీ టిక్కెట్‌కు సంబంధించి కూడా ఇప్పటికే మాజీ ఎమ్మెల్సీ చెంగల్రాయులుకు చెప్పినట్లు సమాచారం. అయితే ఇప్పుడు జిల్లా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్రెడ్డి లేదా సుగవాసి కుటుంబానికి సంబంధించిన బాలసుబ్రమణ్యంకు కేటాయిస్తారని చర్చలు నడుస్తున్నాయి. మరోవైపు జనసేనకు టిక్కెట్ కేటాయిస్తారని ప్రచారం జోరందుకోవడంతో నియోజకవర్గ టీడీపీలో ఉత్కంఠ నెలకొంది. కోడూరులో నైరాశ్యం తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అభ్యర్థి కాకుండా రైల్వేకోడూరు టికెట్‌ను జనసేనకు కేటాయించడంతో తెలుగుదేశం పార్టీలో నైరాశ్యం అలుముకుంది. ముందే గ్రూపు రాజకీయాలతో టీడీపీ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. ఈ పరిస్థితుల్లో జనసేనకు టిక్కెట్ కేటాయించడంతో టీడీపీలో అనిశ్చితి నెలకొంది. పైగా నియోజకవర్గ ఇన్చార్జ్ రూపానందరెడ్డి సూచించిన అభ్యర్థికి కాకుండా కొత్త అభ్యర్థికి టిక్కెట్ కేటాయించడంతో టీడీపీ శ్రేణులు రగిలిపోతున్నాయి. చంద్రబాబు జిత్తులకు బలైన మరో నేత, పారిశ్రామికి వేత్త గంటా నరహరి.. గంటా నరహరి టీడీపీ తరఫున ముందుగా రాజంపేట లోక్‌సభ స్థానం టికెట్ ఆశించారు. ఈ క్రమంలో పట్టణంలో అన్న క్యాంటీన్ ను సొంత డబ్బుతో నిర్వహించారు. తాజాగా రాజంపేట లోక్‌సభ స్థానాన్ని బీజేపీకి కేటాయించి మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. తనకు ఎమ్మెల్యే టికెట్ అయినా వచ్చేస్తుందని గంటా నరహరి ఆశించారు. అయితే ఎమ్మెల్యే టికెట్ కూడా వేరే అభ్యర్థికి ఖరారైందని తెలిసి చివరికి మూడు రోజుల క్రితం వైఎస్సార్సీపీలో చేరారు. టీడీపీ అధినేత చంద్రబాబు తన స్వార్థం కోసం ఎవరినైనా బలి చేస్తారనే విషయం మరోసారి గంటా విషయంలో బహిర్గతమైందని రాజకీయపరిశీలకులు అంటున్నారు. ఇవి చదవండి: కూటమిలో వేరు కుంపట్లు -
బీజేపీలో చేరిన నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి
ఢిల్లీ: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరారు. ఢిల్లీలో శుక్రవారం కీలక నేతల సమక్షంలో ఆయన కాషాయం కండువా కప్పుకున్నారు. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషితో పాటు పలువురు జాతీయ నేతలు, ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ తదితరులు.. కిరణ్‌కుమార్‌రెడ్డిని అధికారికంగా బీజేపీలోకి ఆహ్వానించారు. కొద్దిరోజుల క్రితమే ఆయన కాంగ్రెస్‌కు అధికారికంగా రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్‌ను వీడతానని ఏనాడూ అనుకోలేదు: కిరణ్‌కుమార్‌రెడ్డి బీజేపీలో చేరిన కిరణ్‌కుమార్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ క్రమంలో కాంగ్రెస్ అధిష్టానం తీరుపై అసంతృప్తి వెల్లగక్కారాయన. 1952 నుంచి మా కుటుంబం కాంగ్రెస్‌లోనే ఉంది. కానీ, కాంగ్రెస్‌ను వీడతానని ఏనాడూ అనుకోలేదు. కాంగ్రెస్ హైకమాండ్ తప్పుడు నిర్ణయం వల్ల ఒక్కో రాష్ట్రంలో అధికారం కోల్పోతూ వస్తోంది. కాంగ్రెస్ హైకమాండ్‌కు పవర్ మాత్రమే కావాలి. క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో.. హైకమాండ్ తెలుసుకోలేకపోతోంది. ఎవర్నీ సంప్రదించకుండానే నిర్ణయాలు తీసుకుంటుంది. చేసిన తప్పేంటన్నది కూడా కాంగ్రెస్ తెలుసుకోవడం లేదు. ఓటముల నుంచి కాంగ్రెస్ గుణపాఠం నేర్చుకోవడం లేదు. కాంగ్రెస్‌లో ట్రబుల్ షూటర్స్ లేకుండా పోయారన్నారు కిరణ్‌కుమార్‌రెడ్డి. అందుకే కాంగ్రెస్‌ను వీడినట్లు ప్రకటించారాయన. ఇక మోదీ, అమిత్ షా డైరెక్షన్ బాగుందని కితాబిచ్చారు. అందుకే బీజేపీలోకి చేరాను అని కిరణ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. బీజేపీలో చేర్చుకున్నందుకు ధన్యవాదాలు. నరేంద్ర మోదీ నాయకత్వంలో పని చేస్తా. బిజెపి నాయకుల శ్రమతో పార్టీ ఎంతో ఎదిగింది. అవినీతికి వ్యతిరేకంగా తీసుకున్న చర్యలతో పార్టీ పెరిగింది అంటూ కిరణ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. అంతకు ముందు కిరణ్ కుమార్‌రెడ్డి చేరికను స్వాగతించిన పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి.. ఏపీలో ఇక బీజేపీ బ్యాటింగ్ జోరందుకుంటుందని పేర్కొన్నారు. కాంగ్రెస్‌పై వ్యాఖ్యలు సరికావు:గిడుగు రుద్రరాజు బీజేపీలో చేరిన మాజీ కాంగ్రెస్ నేత కిరణ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు ఏపీ పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు తెలిపారు. నచ్చిన పార్టీలోకి నాయకులు వెళ్ళవచ్చు.. కానీ వెళ్లేప్పుడు కన్నతల్లి లాంటి కాంగ్రెస్ పార్టీపై బురద జల్లడం సరికాదని మండిపడ్డారు. కాంగ్రెస్‌లో అధికారాన్ని ఎంజాయ్ చేశారని.. ఇప్పుడు పార్టీపై బురదజల్లే వ్యాఖ్యలు చేస్తే చూస్తూ ఉరుకోమని హెచ్చరించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, సోనియాగాంధీలపై వ్యాఖ్యలు చెయ్యడం సరికాదన్నారు. ఏపీ రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొననప్పుడే ఆయనను తమ పార్టీ నుంచి తొలగించామని తెలిపారు. సీబీఐ, ఈడీ కేసులకు బయపడి బీజేపీలో చేరారా ? అని ప్రశ్నించారు. ఆంధ్ర ప్రదేశ్‌కు బీజేపీ ఏం చేసిందని ఆ పార్టీలో చేరారని నిలదీశారు. ఎందుకు ఆ పార్టీకి ఆకర్షితులయ్యారో చెప్పాలని డిమాండ్ చేశారు. మూడున్నర సంవత్సరాలు ముఖ్య మంత్రిగా పదవి అనుభవించి ఇప్పుడు ఏ ప్రయోజనాల ఆశించి ఆ పార్టీ లో చేరారో చెప్పాలన్నారు. #WATCH | "I had never imagined that I'll have to leave Congress...There is a saying- 'My king is very intelligent, he doesn't think on his own, doesn't listens to anyone's advice', "says former Congress leader Kiran Kumar Reddy on joining BJP in Delhi. pic.twitter.com/8s43F09WxK — ANI (@ANI) April 7, 2023 #WATCH | Kiran Kumar Reddy, who served as the CM of united Andhra Pradesh, joins Bharatiya Janata Party in Delhi pic.twitter.com/WrlGjG5Uwr — ANI (@ANI) April 7, 2023 గతంలో ఉమ్మడి ఏపీలో కిరణ్‌కుమార్‌రెడ్డి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా పని చేశారు. వైఎస్సార్ హయంలో కాంగ్రెస్ ప్రభుత్వ చీఫ్ విప్‌గా, అసెంబ్లీ స్పీకర్‌గానూ ఆయన పని చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కి 16వ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు(2010 నుంచి 2014 వరకు). విభజన బిల్లుకు వ్యతిరేకిస్తూ ఆయన తన పదవికి రాజీనామా చేసి.. ఆపై ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొన్నాళ్లు కొనసాగారు. ఆ సమయంలో కాంగ్రెస్‌కు రాజీనామా చేసి.. జై సమైక్యాంధ్ర పేరుతో సొంత పార్టీ పెట్టి అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లారు. ఆ ఎన్నికల్లో దారుణంగా ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత పార్టీని రద్దు చేస్తూ.. 2018లో తిరిగి కాంగ్రెస్‌లో చేరారాయన. చివరకు సుదీర్ఘకాలం కొనసాగిన పార్టీకి బై బై చెబుతూ.. బీజేపీకిలోకి చేరిపోయారు. -
కాంగ్రెస్‌కు మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి రాజీనామా
సాక్షి, అమరావతి: సీనియర్ నేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన పార్టీ అధ్యక్షుడికి రాజీనామా లేఖ పంపారు. బీజేపీలోకి కిరణ్‌కుమార్‌రెడ్డి చేరనున్నట్లు సమాచారం. కాగా, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి.. గతంలో నాలుగు పర్యాయాలు ఎమ్మెల్యేగా పని చేశారు. తండ్రి అమర్నాథ్ రెడ్డి మరణంతో తొలిసారిగా 1989 ఎన్నికల్లో వయల్‌పాడు (వాల్మీకిపురం) నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 1999, 2004లోనూ ఇదే స్థానం నుంచి నెగ్గారు. వైఎస్సార్‌కు సన్నిహితుడిగా పేరున్న కిరణ్‌కుమార్‌రెడ్డి.. 2009లో పీలేరు నుంచి ఎమ్మెల్యేగా నెగ్గారు. వైఎస్సార్ ప్రభుత్వంలో ఆయన కాంగ్రెస్ ప్రభుత్వ చీఫ్ విప్‌గా, అసెంబ్లీ స్పీకర్‌గానూ ఆయన పని చేశారు. తెలంగాణ ఉద్యమ సమయ పరిస్థితుల్లో.. ఆంధ్రప్రదేశ్‌కి 16వ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు(2010 నుంచి 2014 వరకు). ఈయన హయాంలోనే మీ సేవా, రాజీవ్ యువకిరణాలు, ఎస్సీ/ఎస్టీ సబ్‌ప్లాన్, బంగారు తల్లి, మన బియ్యం, అమ్మ హస్తం, చిత్తూరు జల పథకం లాంటివి వచ్చాయి. విభజన బిల్లుకు వ్యతిరేకిస్తూ ఆయన తన పదవికి రాజీనామా చేసి.. ఆపై ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొన్నాళ్లు కొనసాగారు. కాంగ్రెస్‌కు రాజీనామా చేసి.. జై సమైక్యాంధ్ర పేరుతో సొంత పార్టీ పెట్టి అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లారు. ఆ ఎన్నికల్లో దారుణంగా ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత పార్టీని రద్దు చేస్తూ.. 2018లో తిరిగి కాంగ్రెస్‌లో చేరారాయన. అప్పటి నుంచి కాంగ్రెస్‌లో ఉండి.. మౌనంగా ఉండిపోయారు. పార్టీలో కీలక బాధ్యతలు అప్పజెప్తామన్న బీజేపీ హామీ మేరకు ఆయన చేరనున్నట్లు తెలుస్తోంది. చదవండి: వెలుగు చూస్తున్న ‘మార్గదర్శి’ అక్రమాలు.. నలుగురు అరెస్ట్ -
బీజేపీలోకి నల్లారి కిరణ్‌కుమార్ రెడ్డి?
అన్నమయ్య: కాంగ్రెస్ సీనియర్ నేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి త్వరలో బీజేపీలో చేరనున్నట్లు సమాచారం. పార్టీలో కీలక బాధ్యతలు అప్పజెప్తామన్న బీజేపీ హామీ మేరకు ఆయన చేరికకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ నేత నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి.. గతంలో నాలుగు పర్యాయాలు ఎమ్మెల్యేగా పని చేశారు. తండ్రి అమర్నాథ్ రెడ్డి మరణంతో తొలిసారిగా 1989 ఎన్నికల్లో వయల్‌పాడు(వాల్మీకిపురం) నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 1999, 2004లోనూ ఇదే స్థానం నుంచి నెగ్గారు. వైఎస్సార్‌కు సన్నిహితుడిగా పేరున్న కిరణ్‌కుమార్‌రెడ్డి.. 2009లో పీలేరు నుంచి ఎమ్మెల్యేగా నెగ్గారు. వైఎస్సార్ ప్రభుత్వంలో ఆయన కాంగ్రెస్ ప్రభుత్వ చీఫ్ విప్‌గా, అసెంబ్లీ స్పీకర్‌గానూ ఆయన పని చేశారు. తెలంగాణ ఉద్యమ సమయ పరిస్థితుల్లో.. ఆంధ్రప్రదేశ్‌కి 16వ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు(2010 నుంచి 2014 వరకు). ఈయన హయాంలోనే మీ సేవా, రాజీవ్ యువకిరణాలు, ఎస్సీ/ఎస్టీ సబ్‌ప్లాన్, బంగారు తల్లి, మన బియ్యం, అమ్మ హస్తం, చిత్తూరు జల పథకం లాంటివి వచ్చాయి. విభజన బిల్లుకు వ్యతిరేకిస్తూ ఆయన తన పదవికి రాజీనామా చేసి.. ఆపై ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొన్నాళ్లు కొనసాగారు. కాంగ్రెస్‌కు రాజీనామా చేసి.. జై సమైక్యాంధ్ర పేరుతో సొంత పార్టీ పెట్టి అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లారు. ఆ ఎన్నికల్లో దారుణంగా ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత పార్టీని రద్దు చేస్తూ.. 2018లో తిరిగి కాంగ్రెస్‌లో చేరారాయన. అప్పటి నుంచి కాంగ్రెస్‌లో ఉండి.. మౌనంగా ఉండిపోయారు. మరో రెండు రోజుల్లో ఆయన కాంగ్రెస్‌కు రాజీనామా చేస్తారని, ఆపై బీజేపీ అగ్రనేతలతో భేటీ అవుతారని తెలుస్తోంది. అయితే దీనిపై కిరణ్‌కుమార్‌రెడ్డి నుంచిగానీ.. ఆయన అనుచరుల నుంచిగానీ, అటు బీజేపీ నుంచిగానీ స్పష్టత రావాల్సి ఉంది. -
కిషోర్‌కు బ్రేకులు
కాంగ్రెస్‌తో టీడీపీ తాజా చెలిమి పీలేరు రాజకీయాలను వేడెక్కిస్తోంది. మాజీ సీఎం కిరణ్‌కుమార్ కుటుంబీకుల మధ్య చిచ్చు రాజేస్తోంది. కిరణ్ సోదరుల మధ్య అంతరం పెంచుతోంది. జిల్లాలో నామమాత్ర ప్రభావమున్న కాంగ్రెస్ రానున్న ఎన్నికల్లో పీలేరు నియోజకవర్గాన్ని కోరుతున్నట్లు అందుతున్న సమాచారం మాజీ సీఎం సోదరుడు కిషోర్ వర్గానికి కునుకు పట్టనీయడం లేదని తెలుస్తోంది. గతంలో తాను ప్రాతినిథ్యం వహించిన పీలేరులో తన కుమారుడిని పోటీ చేయించాలని కిరణ్‌కుమార్ భావిస్తున్నారు. తాజాగా టీడీపీలో చేరి ఇక్కడి నుంచి పోటీచేయాలని ఉవ్విళ్లూరుతున్న కిషోర్‌కుమార్ ఆశలపై ఈ పరిణామం నీల్లు చల్లుతోంది. సాక్షి,చిత్తూరు, తిరుపతి: తెలంగాణలో కాంగ్రెస్‌తో చెట్టపట్టా లేసుకున్న టీడీపీ వచ్చే ఎన్నికల్లో మన రాష్ట్రంలో అదేతీరు కొనసాగిస్తుందనే ఊహాగానాలు బలం పుంజుకుంటున్నాయి. కాంగ్రెస్‌కు వాస్తవానికి జిల్లాలో పట్టులేదు. మాజీ సీఎం నల్లారి కిరణ్ గతంలో ప్రాతినిథ్యం వహించిన పీలేరులో అంతో ఇంతో ఈ పార్టీకి ఉనికి ఉందని ఆయన సన్నిహితుల అంచనా. ఫలితంగా వచ్చే ఎన్నికల్లో ఈ సీటును ఒప్పందం కుదిరితే అడగాలని కాంగ్రెస్ భావిస్తున్నట్లు తెలు స్తోంది. టీడీపీ కూడా ఇందుకు అంగీకరిస్తుందనే సంకేతాలందినట్లు హస్తం పార్టీ నాయకులు చెబు తున్నారు. ఈ ఆకస్మిక రాజకీయ మార్పు కిరణ్ సోదరుడు కిషోర్‌కు మింగుడుపడటంలేదు. సోదరుడి మాట పెడచెవినబెట్టి టీడీపీలోకి వచ్చారని చెబు తున్న ఈయనకు తీవ్రమైన భంగపాటు ఎదురవుతోంది. వచ్చే ఎన్నికల్లో పీలేరు కాంగ్రెస్ అభ్యర్థిగా కిరణ్ తనయుడు నల్లారి నిఖిలేష్‌రెడ్డి పేరు ఖరారు చేయనున్నారని జరుగుతున్న ప్రచారం అనూహ్యమైన షాక్. ఇప్పటివరకూ తానే టీడీపీ అభ్యర్థినని ప్రకటిస్తున్న కిషోర్‌కు ఎదురుదెబ్బ తగులుతోందని ఆయన వర్గీయులు భావిస్తున్నారు. ఉమ్మడి రాష్ట్ర సీఎంగా కిరణ్ 2014 ఎన్నికల తరువాత రాజకీయాలకు దూరంగా ఉండిపోయారు. తమ్ముడు కిషోర్ వైఖరి ఇందుకు కారణమని మాజీ సీఎం వర్గీయుల భావన. టీడీపీలో చేరిన కిషోర్ తరువాత అన్నను దూరంగా పెడుతూ వచ్చారు. అన్న సీఎంగా ఉన్నప్పుడు అన్నీ అనుభవించి... అధికారం పోయాక ఆయన్ను పట్టించుకోలేదు. ఇటీవల సొంతూరు నగరిపల్లి వచ్చినా వీరిద్దరూ కలుసుకోలేదు. తండ్రి సమాధి వద్ద ఎదురుపడ్డా అన్నను పలుకరించకుండా వెళ్లిపోయారు. ఈ పరిస్థితుల్లో చంద్రబాబు ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని కలిసి పొత్తు ఖరారు చేసుకున్నారు. పొత్తు పొసగేనా.. ఇటీవల కిరణ్ మళ్లీ సొంత గూడు కాంగ్రెస్‌లో చేరిపోయారు. తర్వాత జరిగిన పరిణామాల్లో ఈ పార్టీతో టీడీపీకి సఖ్యత కుదిరింది. పొరుగున ఉన్న తెలంగాణాలో ఈ రెండు పార్టీలు కలిసే పోటీ చేస్తున్నాయి. జాతీయ స్థాయిలో కూడా రాహుల్‌తో చంద్రబాబు రాసుకు పూసుకు తిరుగుతున్నారు. దీంతో వచ్చే ఎన్నికల్లో మన రాష్ట్రంలో కూడా పొత్తు ఉంటుందనే సంకేతాలు కాంగ్రెస్‌కు చేరాయి. ఈ నేపథ్యంలోనే పీలేరు కాంగ్రెస్ అభ్యర్థిగా తన సతీమణి ఒత్తిడి మేరకు కిరణ్ కుమార్‌రెడ్డి కుమారుడు నిఖిలేష్‌ను బరిలో దింపాలని నిర్ణయించుకున్నట్లు తెలి సింది. సీఎంగా పనిచేసిన వ్యక్తి పీలేరు అసెంబ్లీ స్థానం అడగటంతో అధిష్టానం కూడా కిరణ్ ప్రతిపాదనను ఓకే చేసినట్లు సమాచారం. చంద్రబాబు నిర్ణయం పీలేరులో టీడీపీలో కలవరం రేపుతోంది. 2014 ఎన్నికల్లో పీలేరు నుంచి త్రిముఖ పోటీ జరిగింది. జై సమైక్యాంధ్ర పక్షాన కిషోర్ ఓడిపోయారు. టీడీపీ తరఫున ఇంతియాజ్ అహ్మద్ ఓటమి పాలయ్యారు. వైఎస్సార్సీపీ విజయకేతనం ఎగురవేసింది. ఓడిపోయినా పార్టీ భరోసా ఇస్తుందని ఆశించిన ఇంతియాజ్‌కు నిరాశ మిగిలింది. కిషోర్‌ను పార్టీలో చేర్చుకుని రంగంలోకి దించడంతో ఈయన ఖంగుతిన్నారు. టికెట్ తనకే వస్తుందని కిషోర్ వర్గం చెబుతుండటంతో ఇప్పటికే వీరిద్దరి మధ్య అంతరం పెరిగింది. తాజాగా ఈ సీటు కాంగ్రెస్‌కు కేటాయిస్తారని తెలియడంతో కిషోర్ డీలా పడిపోయారు. -
కిరణ్ రాక ఆంతర్యం ?
సాక్షి, తిరుపతి: మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి పీలేరు పర్యటన రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. వచ్చే ఎన్నికలే ప్రధాన లక్ష్యంగా పర్యటన సాగుతుందని కాంగ్రెస్ శ్రేణులు చెబుతున్నాయి. కిరణ్ 28న సొంతగ్రామమైన నగరిపల్లి వస్తున్న సంగతి తెలసిందే.. చాలా రోజుల క్రితమే రావాలని భావించారాయన. తమ్ము డు కిషోర్‌కుమార్‌రెడ్డి వైఖరి వల్ల ఆలస్యం చేశారు. కిషోర్ టీడీపీలో చేరినప్పటి నుంచి వారి మధ్య అంతరం పె రిగింది. తమనాయకుడు చంద్రబాబేనని సోదరుడు తేల్చి చెప్పారు. ఈనేపథ్యంలో ఎలాగైనా గ్రామంలో మూడు రోజులు ఉండాలని ఆయన వర్గీయులు పట్టుబట్టారు. పంచాయతీరాజ్ అతిథిగృహంలో బస ఏర్పాటు చేశారు. ఆయన రాక సందర్భంగా భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. సోదరుడు అడ్డుకుంటున్నా కిరణ్ పర్యటనకేమొగ్గు చూపడం ఆసక్తి కలిగిస్తోంది. రాజకీయ సమీకరణాలే లక్ష్యంగా? తాను పదవుల్లో ఉన్నప్పుడు అధికారాన్ని అనుభవించి ఇంటికి వస్తుంటే రాకుండా సోదరుడు అడ్డుకోవటాన్ని కిరణ్ తీవ్రంగా పరిగణించినట్లు సమాచారం. పీలేరు నియోజకవర్గంలో కిరణ్ లేకపోతే కిషోర్ అనే వ్యక్తి ఎవ్వరికీ తెలిసే ప్రసక్తి లేదని స్థానికంగా మాజీ సీఎం వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ పర్యటనను కిరణ్, ఆయన వర్గీయులు సవాలుగా తీసుకున్నట్లు తెలిసింది. వచ్చే ఎన్నికలే లక్ష్యంగా పర్యటన సాగనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఎన్నికల సమయంలో పొత్తులున్నా, లేకపోయినా కిరణ్ పీలేరు నుంచి పోటీ చేయాలని భావిస్తున్నట్లు తెలిసింది. నేరుగా కిరణ్ పోటీ చేయకపోతే మరో తమ్ముడు సంతోష్‌ని బరిలో దింపాలని అలోచనలో ఉన్నట్లు తెలిసింది. అలా కాని పక్షంలో తన కుమారుడు అమరనాథ్‌రెడ్డిని కిరణ్ బరిలోకి దించాలని యోచిస్తున్నారని భోగట్టా. గతంలో ఎన్నికల సమయంలో ప్రచారం కూడా చేసిన అనుభవం ఉంది. ఆ ఇద్దరూ కాకపోతే పలవల రెడ్డప్పను పోటీ చేయించి సత్తా చాటుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. పొత్తులున్నా పోటీనే ఎన్నికల సమయంలో కాంగ్రెస్, టీడీపీ పొత్తుపెట్టుకుంటే పీలేరు అసెంబ్లీ టికెట్ కిరణ్‌కుమార్‌రెడ్డిని కాదనే పరిస్థితి ఉండదు. సీఎంగా పనిచేసిన వ్యక్తి పీలేరు టికెట్ అడిగితే అటు కాంగ్రెస్ కానీ, ఇటు టీడీపీ అడ్డుచెప్పే అవకాశమే లేదు. అదే జరిగితే కిషోర్ హౌసింగ్ బోర్డు చైర్మన్ పదవితో సరిపెట్టుకోవాల్సి వస్తుందని రాజ కీయ విశ్లేషకుల అభిప్రాయం. ఈ పరిస్థితుల్లో కిరణ్ పర్యటనలో ఎవ్వరూ పాల్గొన వద్దని ఆయన అనుచరులకు కిషోర్ చెబుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. కిరణ్ మొదటి నుంచి ఏ విషయంలో అయినా గోప్యత పాటించేవారు. అదే గోప్యతను ఇప్పుడు కూడా పాటిస్తుండటం గమనార్హం. -
చెట్టు ఎక్కి కొమ్మ నరుక్కున్నారు!
మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలోకి తిరిగి స్వాగతించేందుకు ఆయన నివాసానికి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ వ్యవహారాల పర్యవేక్షకుడు ఊమెన్‌చాందీ వెడుతున్నారని పది రోజుల కిందట మధ్యాహ్నభోజన సమయంలో విన్నప్పుడు కేంద్ర మాజీమంత్రి జైరామ్ రమేష్ ఆశ్చర్యం వెలిబుచ్చారు. నాకేమీ అది అసాధారణ చర్యగా కనిపించలేదు. కాంగ్రెస్ సంస్కృతికి, ముఖ్యంగా సోనియాగాంధీ మనస్తత్వానికి తగినట్టుగానే ఉందనిపించింది. రాజకీయాలలో కొందరికి సెంటిమెంట్లు ఏ మాత్రం ఉండవు. కొందరు మాత్రం ఇచ్చిన మాట తప్పకూడదనీ, అసత్యాలు చెప్పకూడదనీ నియమాలు పెట్టుకొని నష్టపోతారు. కష్టపడతారు. ఏదో ఒక విధంగా గెలవడమే పరమావధి అని భావించేవారిని సెంటిమెంట్లు బాధించవు. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఢిల్లీలో శుక్రవారం నాడు కిరణ్‌కుమార్‌రెడ్డికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి తిరిగి ఆహ్వానించినప్పుడు 22 సంవత్సరాల కిందట జరిగిన ఒక ఉదంతం జ్ఞాపకం వచ్చింది. 1996 ఎన్నికలు జరగడానికి ముందు ఏదో పనిమీద ఢిల్లీ వెళ్ళాను. పీవీఆర్కె ప్రసాద్‌ని కలిసేందుకు ఆయన దగ్గరికి వెడితే ‘పీవీ గారింటికి పోతున్నా మీరూ రండి’ అంటూ తీసుకొని వెళ్ళారు. రాజకీయ నాయకులకు అయాచితంగా సలహాలు ఇచ్చే అలవాటు పెద్దగా లేదు కానీ నాకు నచ్చిన, నాకు చనువున్న రాజకీయ నాయకుల హితంకోరి వారు అడగ కపోయినా సలహా ఇచ్చే అమాయకత్వం ఉంది. మేం వెళ్ళినప్పుడు పీవీ, సుబ్రహ్మణ్యస్వామి కూర్చొని తమిళనాడు రాజకీయాల గురించి మాట్లాడుకుంటున్నారు. మేము కూడా వారితోనే కూర్చున్నాం. ‘తమిళనాడులో ఇప్పుడు డిఎంకే హవా ఉంది. జయలలితతో పొత్తు కొనసాగిస్తే మీకు ఒక్క సీటు కూడా రాదు. డీఎంకేతో పెట్టుకుంటే కనీసం 20 వస్తాయి’ అని నేను అన్నాను. ‘అదేనండీ సమస్య. డిఎంకేతో పొత్తు పెట్టుకోలేం. జయలలితే శరణ్యం’ అంటూ నిస్సహాయంగా నిట్టూర్చారు పీవీ. ఆయన అన్ని మాటలు మాట్లాడటమే విశేషం. ‘హీ ఈజ్ టూ సెంటిమెంటల్, యూ నో...,’ అన్నారు స్వామి. నేపథ్యం కాస్త వివరంగా చెప్పాలంటే, రాజీవ్‌గాంధీ హత్య కేసులో శ్రీలంక తీవ్రవాద సంస్థ ఎల్టీటీఈ పాత్ర ఉన్నదనీ, ఆ సంస్థతో డీఎంకేకి సన్నిహిత సంబంధాలు ఉన్నాయనీ, రాజీవ్ హత్య వెనుక డీఎంకే హస్తం ఉన్నదనీ ఆ రోజుల్లో అందరినోటా వినిపించిన మాట. 1991 సార్వత్రిక ఎన్నికలు రెండు దశల్లో జరిగాయి. మానవబాంబు దురంతం తమిళనాడులో ఎన్నికలు రెండో దశలో భాగం. మొదటి దశ తర్వాత తమిళనాడు శ్రీపెరంబదూరులో ఎన్నికల ప్రచారం చేస్తున్న రాజీవ్‌గాంధీని మానవబాంబు రూపంలో సమీపించిన ధను తనను తాను పేల్చుకొని పెద్ద విస్ఫోటనం సృష్టించింది. రాజీవ్ సహా 15 మంది ఆ దుర్ఘటనలో మర ణించారు. ఎల్టీటీఈకి రాజీవ్‌పైన అంత పగ ఎందుకు? శ్రీలంకలో తమిళుల తిరుగుబాటును అణ చివేయడానికి ఆ దేశ అధ్యక్షుడు జయవర్ధనేతో రాజీవ్ ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ మేరకు ఇండియన్ పీస్‌కీపింగ్ ఫోర్స్ (ఐపీకేఎఫ్) పేరుతో భారత సైనికులను తమిళ పులులతో తలబడటానికి జాఫ్నాకు పంపించారు. వారిలో అత్యధికులను ఎల్టీటీఈ బలితీసుకుంది. దారుణంగా విఫలమైన ఈ దౌత్య, సైనిక వ్యూహం రాజీవ్ జీవితంలో మచ్చగా మిగిలిపోయింది. ఆ రోజుల్లో కొలం బోలో భారత హైకమిషనర్‌గా పనిచేసిన జెఎన్ దీక్షిత్ చెప్పినట్టు ఐపీకే ఎఫ్‌ను జాఫ్నాకు పంపించాలనే భారత ప్రభుత్వ నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ మినహా తమిళనాడు లోని రాజకీయ పార్టీలన్నీ నిర్ద్వంద్వంగా వ్యతిరేకించాయి. ఏఐఏడిఎంకె అధినేత జయలలిత రాజీవ్‌కి సన్నిహితురా లుగా కనిపించినప్పటికీ తమిళ రాజకీయాలలో మనుగడ కోసం ఐపీకే ఎఫ్‌ను మాటవరుసకైనా వ్యతిరేకించక తప్ప లేదు. 1991 జనవరి 10న పార్లమెంటులో నాటి ప్రధాని చంద్రశేఖర్ మాట్లాడుతూ, ‘తమిళనాడులోనే కాకుండా జాఫ్నాలోని ఎల్టీటీఈ కేంద్రకార్యాలయానికి కూడా తమి ళనాడు ముఖ్యమంత్రి స్వయంగా వెళ్ళినట్టు నాకు సమా చారం ఉంది. ఇది చాలా తీవ్రమైన విషయం (I have information that the chief minister of Tamil Nadu has gone to the LTTE headquarters not only in Tamil Nadu but also in Jaffna. This is something very serious)' అన్నారు. కరుణానిధి ప్రభుత్వాన్ని బర్త రఫ్ చేసి రాష్ట్రపతి పాలన విధించారు. దాంతో తమిళ నాడులో తమిళ పులులకు శిక్షణ కార్యక్రమాలను నిలిపి వేయవలసి వచ్చింది. అంతవరకూ యధేచ్ఛగా తిరు గుతూ, తమ కార్యక్రమాలను నిర్నిరోధంగా కొనసాగిస్తున్న టైగర్స్ ఉనికికి ప్రమాదం ఏర్పడింది. బర్తరఫ్ చేయాలన్న నిర్ణయం చంద్రశేఖర్ స్వయంగా తీసుకున్నదేననీ, కాంగ్రె స్కు సంబంధం లేదనీ ఆయన దగ్గర ప్రిన్సిపల్ సెక్రట రీగా పని చేసిన ఎస్ఎన్ మిశ్రా తాను రచించిన ‘ఫ్లయింగ్ ఇన్ హై విండ్స్’ అనే పుస్తకంలో స్పష్టం చేశారు. కానీ ఎల్టీటీఈ అధినేత ప్రభాకరన్ మాత్రం చంద్రశేఖర్ ప్రభుత్వానికి బయటి నుంచి మద్దతు ఇస్తున్న కాంగ్రెస్ పార్టీ ఒత్తిడి కారణంగానే డిఎంకే ప్రభుత్వంపైన వేటు వేశారని నమ్మాడు. జయవర్దనేతో ఒప్పందం చేసుకొని ఐపీకేఎఫ్‌ను పంపడమే కాకుండా తమ మిత్రప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించడానికి కారకుడైన రాజీవ్ 1991 ఎన్నికల తర్వాత తిరిగి అధికారంలోకి వచ్చే అవ కాశం ఉంది. అందుకే రాజీవ్ హత్యకు ప్రభాకరన్ వ్యూహం రచించాడు. 1991లో రాజీవ్ హత్య తర్వాత జరిగిన లోక్‌సభ ఎన్నికలలో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్, ఏఐఏడిఎంకేలకు వరుసగా 28, 11 స్థానాలు వచ్చాయి. డిఎంకే ఊసే లేదు. (ఆ రాష్ట్రంలో 39 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి) అయితే 1996లో లోక్‌సభకు జరిగిన ఎన్ని కలలో రాజీవ్ హంతకులైన ఎల్టీటీఈ నాయకులతో సంబంధాలు కలిగిన డిఎంకేతో ఎన్నికల పొత్తు పెట్టు కుంటే రాజీవ్ సతి సోనియా బాధపడిపోతారనీ, ఆగ్రహిస్తారనీ పీవీ భావించి కరుణానిధితో మాట్లాడటానికి కూడా సంకోచించారు. ఇష్టం లేకపోయినా జయలలితతోనే ఎన్ని కల పొత్తు కొనసాగించారు. ఆ ఎన్నికలలో కాంగ్రెస్, ఏఐఏడిఎంకేలు తుడిచి పెట్టుకొని పోయాయి. ఒక్క సీటు కూడా దక్కలేదు. తమిళ మానిల కాంగ్రెస్–మూపనార్ (టీఎంసీ–ఎం)కి 20, డిఎంకేకి 17, సీపీఐకి రెండు స్థానాలు వచ్చాయి. తమిళనాడులో కాంగ్రెస్‌కు ఒక్క సీటు దక్కక పోయినా పర్వాలేదు కానీ డిఎంకేతో పొత్తు పెట్టుకొని సోనియాగాంధీ మనస్సు నొప్పించకూడదని పీవీ భావిం చారు. అదే సోనియాగాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ అదే డిఎంకేతో 2004లో, 2009లో, 2016లో పొత్తు పెట్టుకొని ఎన్నికలలో పోరాడింది. అంటే రాజీవ్ హత్యకు సంబంధించి సోనియాగాంధీకి లేని సెంటిమెంటు పీవీకి ఉంది. కాంగ్రెస్‌పార్టీకి తీరని అపకారం చేసిన కిరణ్ కుమార్‌రెడ్డికి చిరునవ్వుతో స్వాగతం పలుకుతూ కనబడిన రాహుల్‌గాంధీని చూసినప్పుడు ఆ సెంటిమెంటు గుర్తు కొచ్చింది. సెంటిమెంటు లేని సోనియా కుటుంబం సోనియాగాంధీకి సెంటిమెంటు ఉంటే కాంగ్రెస్ పార్టీ 2004లో కేంద్రంలో, ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి రావడానికీ, 2009లో అధికారంలో కొనసాగడానికీ ప్రబల కారకుడైన డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి కుమారుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిపై కేసులు బనాయించి, 16 మాసాలు జైలుపాలు చేసేవారు కాదు. 2004లో మొత్తం 42 లోక్‌సభ స్థానాలలో 29 స్థానాలనూ, 2009లో 33 స్థానాలనూ గెలిచి యూపీఏ ప్రభుత్వ అస్తిత్వాన్ని పరిరక్షించిన వ్యక్తి కుటుంబానికి సెంటిమెంటు ఉన్నవారైతే చేతనైతే సాయం చేసే వారు కానీ కక్షకట్టి, కత్తికట్టేవారు కాదు. కాంగ్రెస్ నుంచి వైదొలిగి సొంత పార్టీ పెట్టుకున్న జగన్మోహన్రెడ్డి అధి కారంలోకి రాకుండా నిరోధించడానికే నాటి హోంమంత్రి చిదంబరం సలహా మేరకు కొణిజేటి రోశయ్యను తొలగించి ముఖ్యమంత్రిగా కిరణ్‌కుమార్‌రెడ్డిని సోనియాగాంధీ నియమించారు. 2014లో వైఎస్సార్సీపీ తలవెంట్రుకవాసిలో ఓడిపోవడంలో కిరణ్‌రెడ్డి పాత్ర ఇసుమంతైనా లేదు. కాంగ్రెస్ నేలమట్టం కావడంలో మాత్రం ప్రధాన భూమిక ఆయనదే. పీవీకి సన్నిహితుడైన అమరనాథరెడ్డి కుమారుడు కిరణ్‌కుమార్‌రెడ్డి. చిత్తూరు రాజకీయాలలో అమర్నాథ్ రెడ్డికీ, చంద్రబాబుకూ పడేది కాదు. 1980లో చిత్తూరు జిల్లా పరిషత్తు అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికలలో నాటి మంత్రి అమరనాథరెడ్డి నిలబెట్టిన అభ్యర్థిని మరో మంత్రి సి దాస్‌తో భుజం కలిపి మంత్రి చంద్రబాబునాయుడు ఓడించారు. డాక్టర్ కుతూహలమ్మను అధ్యక్షురాలుగా గెలిపించారు. సీనియర్ మంత్రి, నాటి పీసీసీ అధ్యక్షుడు కోన ప్రభాకరరావుకు సన్నిహితుడూ అయిన అమరనాథ్ రెడ్డికి అది తీరని అవమానం. తన తండ్రికి ప్రత్యర్థి అయిన చంద్రబాబునాయుడితోనూ, చిదంబరంతోనూ షరీకై జగన్మోహన్రెడ్డిపైన కేసులు పెట్టించడంలో కిరణ్‌కుమార్ రెడ్డికి ఏ సెంటిమెంటూ అడ్డురాలేదు. తనను మనసారా ప్రేమించి, చీఫ్‌విప్‌గా, శాసనసభాపతిగా పదోన్నతి కల్పిం చిన వైఎస్ రాజశేఖరరెడ్డి కుమారుడికి అపకారం చేస్తు న్నాననే స్పృహ రవ్వంతైనా లేకుండా రాజకీయ ప్రయోజ నాలు సాధించడానికి ప్రయత్నించడం మామూలు విష యం కాదు. వ్యక్తుల సంగతి సరే. తన అభ్యున్నతికి కారణమైన కాంగ్రెస్ పార్టీకి కిరణ్‌కుమార్‌రెడ్డి ఏ విధంగా రుణం తీర్చుకున్నారు? ఊపందుకున్న తెలంగాణ ఉద్యమం ప్రత్యేక తెలంగాణ ఉద్యమం వైఎస్ హఠాన్మరణం తర్వాత ఊపందుకున్నది. 2009 డిసెంబర్ తొమ్మిదో తేదీన ఉద్యమ సారధి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పన్నెండు రోజుల నిరశన దీక్షతో దిగివచ్చిన యూపీఏ సర్కార్ చిదం బరం చేత తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు చర్యలు ప్రారం భిస్తామంటూ ప్రకటన చేయించింది. ఇందుకు నిరసనగా కోస్తాంధ్రకు చెందిన కాంగ్రెస్, టీడీపీ ఎంపీలూ, ఎంఎల్ఏలు మూకుమ్మడి రాజీనామాలు చేయడంతో వెనక్కు తగ్గిన కేంద్ర ప్రభుత్వం కాలహరణం కోసం క్షేత్ర వాస్తవికత ఏమిటో కనుక్కో వాలంటూ జస్టిస్ బిఎన్ శ్రీకృష్ణ కమిటీని 2010 ఫిబ్రవరి 3న నియమించింది. 2010 నవంబర్ 24న రోశయ్య రాజీనామా చేశారు. అనంతరం నాలుగు మాసాల తర్వాత, 2011 మార్చి 12న వైఎస్సార్సీపీ ఆవిర్భవించింది. అంతకంటే ముందు 2010 డిసెంబర్లో కాంగ్రెస్ నుంచి వైదొలగడంలో భాగంగా జగన్ కడప పార్లమెంటు సీటుకూ, విజయమ్మ పులివెందుల అసెంబ్లీ సీటుకూ రాజీనామా చేశారు. 2011 మే మొదటివారంలో ఈ రెండు స్థానాలకూ జరిగిన ఉపఎన్నికలలో జగన్ కడప లోక్‌సభ స్థానాన్ని 5,45,671 ఓట్ల ఆధిక్యం తోనూ, విజయమ్మ పులివెందుల సీటును 81,373 ఓట్ల తేడాతోనూ గెలుచుకొని చరిత్ర సృష్టించారు. జగన్‌ను నిరోధించడం రోశయ్య వల్ల కాదని తీర్మానించుకున్న పార్టీ అధిష్ఠానం ఆయనకు ఉద్వాసన చెప్పి రాయలసీమకే, రెడ్డి సామాజికవర్గానికే చెందిన యువనాయకుడు కిరణ్ కుమార్‌రెడ్డిని ముఖ్యమంత్రిగా నియమించింది. 2012 జూన్ 12న 18 అసెంబ్లీ స్థానాలకు, నెల్లూరు లోక్‌సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలకు రెండు వారాల ముందుగా సీబీఐ చేత జగన్మోహన్రెడ్డిని అరెస్టు చేయించారు. విజయమ్మ, షర్మిల ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆ ఉప ఎన్నికలలో వైఎస్సార్సీపీ 15 స్థానాలు గెలుచుకున్నది. నెల్లూరు లోక్‌సభ స్థానాన్ని 2,90,000 మెజారిటీతో నిలబెట్టుకుంది. ఉపఎన్నికలలో పోలైన మొత్తం ఓట్లలో వైఎస్సార్సీపీకి 46.8 శాతం ఓట్లు పడగా, కాంగ్రెస్ ఓట్ల శాతం 22కి తగ్గింది. తెలుగుదేశం పార్టీ సోదిలోకి లేదు. అధికారం ఉంటే చంద్రబాబునాయుడు మాయా మర్మం చేసి ఉపఎన్నికలలో గెలవగలరు కానీ ప్రతిపక్షంలో ఉంటే ధరావత్తు సైతం దక్కించుకోలేరు. పదేళ్ళ ప్రతి పక్షంలో ఉన్నప్పుడు ఒక్క ఉప ఎన్నికలోనూ గెలవలేదు. సీబీఐ ద్వారా జగన్‌పై కేసులు బనాయించి జైలుకు పంపే తెలివితేటలు కిరణ్‌కుమార్‌రెడ్డికి ఉన్నాయి కానీ ఎన్నికలలో జగన్‌ను ముఖాముఖిగా ఎదుర్కొనే శక్తి లేదని కాంగ్రెస్ అధిష్ఠానం గ్రహించింది. కిరణ్ ఇన్నింగ్స్ చివరలో అంతకంటే పెద్ద మూల్యం కాంగ్రెస్ పార్టీ చెల్లించుకోవలసి వచ్చింది. రాష్ట్ర విభజనలో విచిత్రవిన్యాసాలు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర డిమాండ్‌ను ఆమోదించాలని కాంగ్రెస్ పార్టీ కార్యవర్గం, యూపీఏ ప్రభుత్వం నిర్ణయిం చుకున్న తర్వాత పద్ధతి ప్రకారం ఏమి జరగాలి? కాంగ్రెస్ అధిష్ఠానవర్గం ముఖ్యమంత్రినీ, కేంద్ర మంత్రులనూ, పార్టీ ఎంపీలనూ, శాసనసభ్యులనూ, ఇతర ముఖ్యనాయకు లనూ కూర్చోబెట్టుకొని సమాలోచన జరపాలి. విభజన నిర్ణయానికి పార్టీ నాయకులందరినీ ఒప్పించి నిర్ణయం సజావుగా అమలు జరిగేటట్టు చూడాలి. ఆ పని చేయ కుండా ఆంధ్ర, తెలంగాణ కాంగ్రెస్ నాయకుల మధ్య వాదులాటలూ, ఎత్తులూపైఎత్తులూ సాగుతుంటే ప్రేక్షక పాత్ర పోషించింది. రెండు ప్రాంతాల ప్రజల మధ్య విద్వేషాలు రగులుతుంటే బాధ్యతారహితంగా వ్యవహరించింది. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న కిరణ్ తన కార్యాలయంలో విలేఖరుల గోష్ఠి నిర్వహించి వర్కింగ్ కమిటీ, కేంద్ర ప్రభుత్వం చేసిన నిర్ణయాలను తీవ్రంగా విమర్శిస్తూ ఉంటే అధిష్ఠానం నిమ్మకు నీరెత్తినట్టు మౌనం పాటించింది. తాను రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుతానంటూ, చివరి బంతి ఇంకా బౌల్ చేయవలసి ఉన్నదంటూ ఆత్మవంచనకూ, పర వంచనకూ తమ పార్టీ ముఖ్యమంత్రి ఒడిగడుతూ ఉంటే సోనియాగాంధీ కానీ, ప్రధాని మన్మోహన్సింగ్ కానీ, ప్రధాని ఉత్తర్వులను ఢిల్లీ ప్రెస్‌క్లబ్‌లో మీడియా ప్రతినిధుల సమక్షంలో పరపరా చించివేసే తెగువ ఉన్న రాహుల్‌గాంధీ కానీ కిమ్మనలేదు. ఆంధ్రప్రదేశ్ సంక్షోభంలో చిక్కుకొని విలవిలలాడుతుంటే ఎవరికి పుట్టిన బిడ్డరా వెక్కివెక్కి ఏడుస్తోంది అన్న చందంగా కేంద్ర నాయకత్వం స్పందించ కుండా మొండికేసింది. చివరకు ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లును రాజ్యసభ కూడా ఆమోదించిన తర్వాత అందుకు నిరసనగా కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఇంత హంగామా చేసినా, ఎన్ని విలేఖరులు గోష్ఠులు నిర్వహించి ఎంత గంభీరంగా మాట్లాడినా సమైక్యవాదాన్ని గట్టిగా సమర్థించిన నాయకుడిగా ప్రజలకు అర్థమై ఉంటే 2014 ఎన్నికలలో ఆయన నాయకత్వంలోని ‘జై సమైక్యాంధ్ర పార్టీ’కీ, ఎన్నికల సంఘం ప్రసాదించిన చెప్పు గుర్తుకీ జనం బ్రహ్మరథం పట్టేవారు. కిరణ్‌కు పోటీ చేసే ధైర్యం లేకపోయింది. పార్టీ అభ్యర్థులకు ధరావతు రక్షించుకునే ప్రజాదరణ లేకపోయింది. తన పార్టీతో పాటు కాంగ్రెస్ పార్టీ మట్టి కరిచింది. ఎవరు ఎంత ప్రయత్నిం చినప్పటికీ సమీప భవిష్యత్తులో ఆ పార్టీ ఆంధ్రప్రదేశ్‌లో కోలుకోలేదు. అంత దెబ్బ కొట్టారు పార్టీ నాయకులందరూ కలిసి. చెట్టు ఎక్కి కొమ్మ నరుక్కున్నారు. రాహుల్ రాజనీతికి జేజేలు! ఆంధ్రప్రదేశ్ సమైక్యంగా ఉండాలని అంత ప్రగాఢంగా ఆకాంక్షించి ఉంటే కాంగ్రెస్ అధిష్ఠానవర్గంతో వాదించి ఒప్పించి ఉండవలసింది. 2009 ఎన్నికలలో తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)తో పొత్తు పెట్టుకోవాలని సోని యాగాంధీ, దిగ్విజయ్ సింగ్, ఇతర జాతీయ నాయకులు నాటి ముఖ్యమంత్రి వైఎస్‌తో గట్టిగా వాదించారు. పోటీ లేకుండా విజయం సాధిస్తామంటూ వైఎస్ కూడా అంతే గట్టిగా ఎదురు వాదించారు. చివరికి సోనియాగాంధీని ఒప్పించారు. ఒంటరిగానే కాంగ్రెస్ ఎన్నికల బరిలో దిగి విజయం సాధించింది. చేతనైతే అధిష్ఠానవర్గాన్ని ఒప్పించాలి. లేకపోతే అ«ధిష్ఠానం నిర్ణయాన్ని శిరసావహించాలి. క్రమశిక్షణ కలిగిన నాయకుడిగా కిరణ్ సోనియాగాంధీ నిర్ణయాన్ని మన్నించి దాని అమలుకు సహకరించి ఉంటే విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌కు మేలు జరిగేది. కాంగ్రెస్ పార్టీకి కూడా ఇంతటి అపారమైన నష్టం వాటిల్లేది కాదు. 2013 జూలై ప్రాంతంలో వర్కింగ్ కమిటీ ఆంధ్రప్రదేశ్ విభజనపై కసరత్తు చేసినప్పుడే కిరణ్ చొరవ తీసుకొని విభజన నిర్ణయాన్ని ఆమోదించి ఇరు ప్రాంతాలకు చెందిన కాంగ్రెస్ నాయకుల మధ్య సదవగాహన సాధించడానికి ప్రయత్నం చేసి ఉంటే ఎవ్వరి సహకారం లేకుండా జైరామ్ రమేష్ ఒంటరిగా విభజన బిల్లును రూపొందించే అవసరం వచ్చేది కాదు. కనీసం కాంగ్రెస్ పార్టీకి చెందిన శాసనకర్తలైనా ఒక చోట సమావేశమై అన్ని అంశాలనూ సాకల్యంగా పరి శీలించి విభజనబిల్లు తయారు చేసి చట్టం చేసి ఉంటే, రాష్ట్ర విభజన ఎన్నికల కంటే ఏడెనిమిది మాసాల ముందే జరిగి ఉండేది. రెండు రాష్ట్రాలలోనూ కాంగ్రెస్ ప్రభుత్వాలే ఉండేవి. విభజన బిల్లులోని అంశాలు అమలు జరిగితే ప్రజలలో ఏర్పడిన అపోహలు కొంతమేరకైనా తొలగి పోయేవి. కాంగ్రెస్ ముఖ్యమంత్రుల సారథ్యంలో పార్టీ ఎన్నికలలో ప్రత్యర్థులను ఎదుర్కొనేది. అటువంటి అవ కాశం ఇవ్వకుండా, ఎవ్వరినీ సంప్రదించకుండా, ఒంటరి వ్యూహంతో, ఒంటెత్తు పోకడతో కొంప ముంచిన నాయ కుడిని, రహస్యోద్యమం నడిపిన నాయకుడిని ఇంటికి వెళ్ళి పార్టీలో చేరమంటూ అభ్యర్థించడం ఒక్క కాంగ్రెస్ పార్టీకే చెల్లింది. పార్టీకి ఎనలేని ఉపకారం చేసిన వైఎస్ కుటుంబాన్ని అవమానించి, పార్టీకి అన్ని రకాలా నష్టం కలిగించి నాలుగేళ్ళుగా ఆజ్ఞాతవాసంలో ఉంటూ, తమ్ముడిని తెలుగు దేశం పార్టీలో చేరడానికి అనుమతించిన కిరణ్‌కుమార్ రెడ్డిని ప్రత్యేకంగా ఆహ్వానించి అక్కున చేర్చుకున్న రాహుల్ గాంధీ రాజనీతిని ఏమని వర్ణించాలి? ఆయన మెడలో ఎన్ని వీరతాళ్ళు వేయాలి? ‘సిగ్గులేకపోతే సరి’ అన్నట్టే రాజకీయాల్లో ‘సెంటిమెంట్ లేకపోతే సరి’! -కె. రామచంద్రమూర్తి -
కిరణ్ కుమార్ రెడ్డి దేశంలోనే అత్యధిక ధనవంతుడు
-
కిరణ్ చేరిక.. కాంగ్రెస్‌కు ఒక్క ఓటు..
సాక్షి, విజయవాడ : జై సమైఖ్యాంధ్ర పార్టీ అధ్యక్షుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి దేశంలోనే అత్యధిక ధనవంతుడైన నాయకుడు అంటూ డొక్కా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన కచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో తిరిగి చేరుతారని నాలుగేళ్ల క్రితమే తాను చెప్పానని టీడీపీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వర ప్రసాద్ గుర్తు చేశారు. శుక్రవారం కిరణ్ కుమార్ రెడ్డి ఢిల్లీలో రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీనిపై మాట్లాడిన డొక్కా.. కిరణ్ చేరిక వల్ల ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీకి ఒక్క ఓటు రాబోతోందని విమర్శించారు. కేవలం కిరణ్ ఓటు మాత్రమే కాంగ్రెస్‌కు పడుతుందని అన్నారు. కిరణ్‌పైనా, తనపైనా విచారణ జరపాలని గతంలోనే గవర్నర్‌కు లేఖ రాసినట్లు డొక్కా వెల్లడించారు. కిరణ్ తమ్ముడు కిషోర్ కుమార్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో బలమైన నాయకుడని చెప్పారు. -
కుట్రలు, కుమ్మక్కులు చెల్లవు
సమాధుల్లోని ప్రేతాల్లో కదలిక వచ్చింది. స్మశానాలకు పచ్చతోరణాలు కట్టి భ్రమల్లో ముంచెత్తే ప్రయత్నాలు మొదలయ్యాయి. అఖి లాంధ్ర ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా అడ్డగో లుగా రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్ పార్టీకి ప్రాణ ప్రతిష్ట చేసేందుకు ఆ పార్టీ ఢిల్లీ పెద్దలు రంగం లోకి దిగారు.మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డిని మళ్లీ ఆ పార్టీలో చేర్చుకుంటారట. పార్టీకి దూర మైన నాయకులను, మాజీ ఎంపీలను మళ్లీ సంప్ర దిస్తున్నారట. వీరందరితో మళ్లీ గత వైభవా నికి పథక రచన చేస్తున్నారట. 2014 ఎన్నికల్లో ఆ పార్టీకి ఓటర్లు గట్టిగా బుద్ధి చెప్పారు. ఒక్కచోట కూడా డిపాజిట్ రాకుండా ఓడించారు.రాష్ట్రంలో కాంగ్రెస్ ఒకసారి కాదు... వరసగా రెండుసార్లు ఘన విజయం సాధించడానికి కార ణమైన దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి కనుమరుగయ్యాక ఆ పార్టీ అధి ష్టానం ఉమ్మడి రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్త రిగా మార్చింది. అత్యంత జనాదరణ, అత్యధిక మంది పార్టీ ఎమ్మెల్యేల మద్దతుగల వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చెప్పుడు మాటలు విని ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెట్టింది. ఓదార్పు యాత్రకు అడ్డం కులు సృష్టించడానికి ప్రయత్నించింది. ఆయన సోనియాగాంధీతో విభేదించి బయటకు వెళ్లి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని స్థాపించి ఎదుగు తుంటే అధిష్టానానికి కంటగింపు అయింది. ముఖ్యంగా కిరణ్‌కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఆనాటి ప్రతిపక్ష నాయకుడు చంద్ర బాబు నాయుడుతో కుమ్మక్కయి జగన్మోహన్ రెడ్డిపై అన్యాయంగా కేసులు పెట్టించి జైలుకు పంపారు. ఆ కుటుంబాన్ని అనేక విధాల ఇబ్బం దులు పెట్టారు. కేవలం జగన్మోహన్రెడ్డిని రాజకీయంగా బలహీనపరిచే ఉద్దేశంతో కాంగ్రెస్ అధి నాయ కత్వం ఆనాడు రాష్ట్ర విభజనకు కుట్ర పన్నింది. ఆరోజు లోక్‌సభ తలుపులు మూసి ప్రత్యక్ష ప్రసా రాన్ని నిలిపివేసి విభజన తీర్మానం ఆమోదించి నట్లు ప్రకటించిన కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీఏ ప్రభుత్వ మాయోపాయాలను జనం ఎన్నటికీ మరువరు. ఈ పరిణామాలు, వాటి ఆంతర్యం తెలిసి కూడా కాంగ్రెస్‌లో ఉన్న సీనియర్ నాయకులు ఒక్కరంటే ఒక్కరు గట్టిగా పోరాడలేదు. కిరణ్ కుమార్ రెడ్డి అయితే చివరి వరకూ విభజన జరగ దని కల్లబొల్లి కబుర్లు చెప్పారు. ఆనాటి యూపీఏ ప్రభుత్వం విభజన చేసినంత అత్యుత్సాహంగా, విభజన హామీల అమలుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయలేదు. కనుకనే ప్రత్యేక హోదా వంటి ముఖ్య మైన అంశంపై చంద్రబాబు మోదీ ప్రభుత్వానికి వంత పాడి నాలుగేళ్ల విలువైన కాలాన్ని వృధా చేశారు. అది అమలై ఉంటే ఈపాటికే వేలాదిమం దికి ఉపాధి దొరికేది. ఆంధ్ర ప్రజానీకానికి ఇలా అనేక విధాల ద్రోహం చేసినవారంతా రానున్న ఎన్నికల సందర్భంగా ప్రజలను వంచించేందుకు వస్తు న్నారు. మళ్లీ చంద్రబాబుతో కుమ్మక్కయి ప్రజ లను పక్కదోవ పట్టించి తెలుగుదేశానికి మేలు కలిగించేందుకే ఈ ఎత్తుగడలన్నీ. వీరికి రాష్ట్ర ప్రజల విజ్ఞతపైనా, వివేకంపైనా తక్కువ అభి ప్రాయం ఉన్నట్లుంది. జగన్మోహన్రెడ్డి ప్రజా సంకల్పయాత్రకు ఎగిసి వస్తున్న జన కెరటాలను గమనిస్తే, ఆయ నపట్ల అన్ని వర్గాల ప్రజలు చూపుతున్న ఆదరణ, విశ్వాసం పరిశీలిస్తే ఈసారి వైఎస్సార్ కాంగ్రెస్‌కు తిరుగులేని స్థాయిలో మెజారిటీ ఖాయమని స్పష్టంగా అర్ధమవుతుంది. నాలుగేళ్లుగా అన్ని వర్గాలనూ వంచించిన తెలుగుదేశం, రాష్ట్రాన్ని విభజించి ఇక్కట్లపాలు చేసిన కాంగ్రెస్ కలిసి పోటీ చేసినా, తెరవెనక కుమ్మక్కయి విడివిడిగా పోటీకి దిగినా ప్రజలు వారిని నమ్మరుగాక నమ్మరు.అరచేతిని అడ్డుపెట్టి సూర్యోదయాన్ని ఆప డానికి ఈ రెండు పార్టీలు చేసే ప్రయత్నాలన్నీ జనాగ్రహంలో కొట్టుకుపోతాయి. వచ్చే అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ విజయభేరి మోగిస్తుంది. ఆపార్టీకి ప్రజలు అత్యధిక మెజా రిటీ ఇచ్చి ప్రత్యేక హోదాను సాధించుకోవడం ఖాయం. పిల్లి ప్రేమకుమార్, పిఠాపురం, తూర్పుగోదావరి జిల్లా ‘ 85558 70102 -
సమయం వచ్చినపుడు చెబుతా: కిరణ్‌కుమార్‌రెడ్డి
హైదరాబాద్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డితో ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి, కేరళ మాజీ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ భేటీ అయ్యారు. కిరణ్ కుమార్ రెడ్డి త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరతారన్న ఊహాగానాల నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. సుమారు గంటన్నర పాటు ఈ సమావేశం కొనసాగింది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆదేశం మేరకు గతంలో కాంగ్రెస్‌ను వీడిన వారందరినీ తిరిగి సొంత గూటికి రప్పించే ప్రయత్నం చేస్తున్నామని సమావేశం అనంతరం ఊమెన్ చాందీ తెలిపారు. అందులో భాగంగానే కిరణ్ కుమార్ రెడ్డితో సమావేశం అయ్యామని వివరించారు. తమ ఆహ్వానంపై కిరణ్ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందని తెలిపారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దయనీయంగా ఉందని, పార్టీని పటిష్ట పర్చాల్సిన అవసరం ఉందన్నారు. కిరణ్ కాంగ్రెస్ కుటుంబ మనిషి అని, కాంగ్రెస్ పార్టీలో తప్పక తిరిగి చేరతారనే నమ్మకం ఉందని ఊమెన్ చాందీ చెప్పారు. సమయం వచ్చినపుడు ఏపార్టీలో చేరేదీ, అసలు చేరనిదీ అన్ని విషయాలు తానే మీడియాకు చెబుతానని కిరణ్‌కుమార్ రెడ్డి వెల్లడించారు. -
'వయస్సు వేరైనా ఆయనతో అనుబంధం గొప్పది'
హైదరాబాద్: ఎలక్ట్రిసిటీ రిటైర్డ్ చీఫ్ ఇంజినీర్ కె.వి.రంగయ్య 87వ పుట్టిన రోజు వేడుకలను ఆదివారం ఖైరతాబాద్‌లోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్ కార్యాలయంలో అధికారులు, కుటుంబసభ్యుల మధ్య ఘనంగా జరుపుకున్నారు. కార్యక్రమానికి మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై రంగయ్య దంపతులను జ్ఞాపిక, పూలమాలతో సత్కరించారు. ఈ సందర్భంగా కిరణ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ రంగయ్యతో తనకు మొదట్లో బ్రహ్మానందరెడ్డి పార్క్‌లో వాకర్స్‌గా పరిచయం ప్రారంభమైందన్నారు. వయస్సు వేరైనా ఆయనతో ఉన్న అనుబంధం చాలా గొప్పదన్నారు. తెలంగాణ జెన్కో అండ్ ట్రాన్స్‌కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు మాట్లాడుతూ విద్యుత్ రంగానికి రంగయ్య పునాది లాంటివారన్నారు. ఈ సందర్భంగా కె.కృష్ణయ్య రచించిన యువత కాపాడుకో నీ భవిత, మాతృభాష తెలుగుకు వెలుగు చూపు, ఎ గైడ్ టు ఈహెచ్‌టీ సబ్ స్టేషన్స్ అనే పుస్తకాలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో రిటైర్డ్ ఐఏఎస్ జి.నారాయణరావు, ప్రొఫెసర్ టి.ఎల్.శంకర్, ఎస్ఆర్టీసీ ఎక్జిక్యూటివ్ డెరైక్టర్ బి.శేఖర్, నటుడు చలపతిరావు, వాసవి ఆస్పత్రి చైర్మన్ గంజి రాజమౌళిగుప్త, అవోపా అధ్యక్షుడు వి.రామకృష్ణలతో పాటు ఉద్యోగులు, రంగయ్య కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. -
పుస్తకం రాస్తున్న కిరణ్ కుమార్ రెడ్డి
హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మరోసారి వార్తల్లోకి వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్ర విభజనలో సీఎంగా ఉన్న ఆయన పుస్తకం రాస్తున్నారు. విభజన సమయంలో తెరవెనుక సాగిన మంత్రాంగాలను తన పుస్తకంలో పొందుపరుస్తానని ఆయన వెల్లడించినట్టు ఓ ఆంగ్లపత్రిక పేర్కొంది. విభజనపై కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, పలువురు ఏపీ కాంగ్రెస్ నేతలు అనుసరించిన ద్వంద్వ ప్రమాణాల గురించి ఇందులో వెల్లడించనున్నారు. ఇప్పటికు 400 పేజీల వరకు పూర్తిచేసినట్టు కిరణ్ తెలిపారు. ఎన్నికలు పూర్తైన తర్వాత ఆయన అమెరికా వెళ్లారు. ఆ సమయంలోనే ఈ పుస్తకం చాలావరకు రాసినట్టు సమాచారం. "ఆంధ్రప్రదేశ్ విభజన సమమంలో చోటుచేసుకున్న పరిణామాలన్నీ నాకు తెలుసు. రాజకీయ పార్టీలు, నాయకులు ఎలా వ్యవహరించారనే దానిపై డాక్యమెంటరీ ఎవిడిన్స్ నా దగ్గర ఉన్నాయి' అని కిరణ్ పేర్కొన్నారు. అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్, సోనియా గాంధీ, యూపీఏ మంత్రులతో చర్చించిన విషయాలను ఈ పుస్తకంలో కిరణ్ వెల్లడించే అవకాశముందంటున్నారు. అలాగే పార్టీ హైకమాండ్ కు సీనియర్ నాయకులు పంపిన నివేదికల్లోని విషయాలను ఇందులో ప్రస్తావిస్తారని తెలుస్తోంది. ఇంకా పేరు పెట్టని ఈ పుస్తకంతో కిరణ్ కుమార్ రెడ్డి సంచలనం సృష్టిస్తారని ఆయన సన్నిహితులు భావిస్తున్నారు. -
కిరణ్ పలకరింపు.. రఘువీరా చిరునవ్వు!
నేదురుమల్లి సంతాపసభలో తారసపడిన ఇద్దరు నేతలు.. కలవని మాటలు హైదరాబాద్: సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చివరి ముఖ్యమంత్రిగా పనిచేసిన నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి, విభజనాంతర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కాంగ్రెస్ అధ్యక్షునిగా వ్యవహరిస్తున్న రఘువీరారెడ్డిలు ఎదురెదురుగా తారసపడినప్పటికీ ఇద్దరి మధ్య మాటలు కలవలేదు. తనకు సమీపంలో కూర్చున్న రఘువీరాను మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ‘బాగున్నారా ప్రెసిండెంట్ గారూ’ అని పలకరించగా.. రఘువీరా నుంచి చిరునవ్వు మాత్రమే బదులొచ్చింది. ఆదివారం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ హోటల్లో జరిగిన మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి సంతాపసభలో ఈ సంఘటన చోటుచేసుకుంది. కార్యక్రమంలో నేదురుమల్లి సతీమణి రాజ్యలక్ష్మితోపాటు కేంద్రమంత్రి ఎం.వెంకయ్యనాయుడు, తెలంగాణ అసెంబ్లీలో ప్రతిపక్షనేత కె.జానారెడ్డి, శాసనమండలి చైర్మన్ చక్రపాణి, ఆర్బీఐ మాజీ గవర్నర్ వేణుగోపాలరెడ్డి, ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, దత్తాత్రేయ, రాయపాటి సాంబశివరావు, సీపీఎం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి పి.మధు, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావుతోపాటు పెద్ద సంఖ్యలో వివిధ పార్టీల నాయకులు, పలువురు మాజీ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు పాల్గొన్నారు. కార్యక్రమానికి హాజరైన కిరణ్‌కుమార్‌రెడ్డి తన సహచరులందరితో కలివిడిగా మాట్లాడానికి ప్రయత్నించారు. తనపక్కనే ఉన్న జానారెడ్డితో ఎక్కువగా మాట్లాడుతూ గడిపారు. పాలనాధక్షుడు నేదురుమల్లి: వక్తలు మాజీ సీఎం నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి మంచి పాలనాధక్షుడని సంతాపసభలో వక్తలు కొనియాడారు. వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. ప్రస్తుత తరుణంలో రాజకీయాల్లో చోటుచేసుకుంటున్న పరిణామాలకు భిన్నంగా తనకు ఎంత కష్టమొచ్చినా పార్టీ వీడని వ్యక్తి అని కొనియాడారు. పార్టీపరంగా కేంద్ర స్థాయిలో తగినంత గుర్తింపు ఇవ్వకపోయినా పార్టీ మారలేదన్నారు. రాష్ట్ర రెవెన్యూ మంత్రిగా ఆయన ఉన్నప్పుడు పట్టాదారు పాసు పుస్తకాలను ప్రవేశపెట్టాలన్న నిర్ణయం తీసుకోవడం రైతులకు లబ్ధి కలిగించిందన్నారు. ఉమ్మడి రాష్ట్రానికి సీఎంగా నేదురుమల్లి విగ్రహాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజాప్రతినిధులకు నియోజకవర్గ అభివృద్ధి నిధులు కేటాయించే ప్రక్రియకు దేశంలో నాంది పలికింది నేదురుమల్లేనని కిరణ్‌కుమార్‌రెడ్డి కొనియాడారు. రాష్ట్రంలో ఎమ్మెల్యేలకు నియోజకవర్గ నిధుల పథకాన్ని ఆయన తెచ్చాకే కేంద్రం ఎంపీ లాడ్స్ పథకాన్ని ఏర్పాటు చేసిందని చెప్పారు. పదవుల్లో ఉన్నప్పుడు ప్రజాప్రతినిధిగా, ఏ పదవీ లేనప్పడు మానవతావాదిగా నిరంతరం ప్రజలతో సత్సంబంధాలు కలిగివున్న వ్యక్తి నేదురుమల్లి అని జానారెడ్డి కీర్తించారు. 1983లో తనను రాజకీయాల్లో ప్రోత్సహించింది జనార్దన్రెడ్డినేనని మేకపాటి తెలిపారు. రాజకీయంగా పదేళ్ల విరామం తరువాత తిరిగి తాను నరసరావుపేట లోక్‌సభకు పోటీ చేయడానికి నేదురుమల్లి సహకరిస్తే, వైఎస్సార్ ఆశీర్వదించారని చెప్పారు. జనార్దన్‌రెడ్డి విగ్రహాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేసేలా తెలంగాణ ప్రభుత్వంతో మాట్లాడడంలో కాంగ్రెస్ పార్టీ చొరవ తీసుకుంటుందని రఘువీరా తెలిపారు. -
కేసీఆర్ ప్రమాణస్వీకారానికి కిరణ్ వస్తారా?
హైదరాబాద్: తెలంగాణ మొదటి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి రాజకీయ రంగంతో పాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను ఆహ్వానించారు. ప్రోటోకాల్ ప్రకారం మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని ఆహ్వానం అందింది. కేసీఆర్ ఆహ్వానించనప్పటికీ ప్రోటోకాల్ ప్రకారం ప్రమాణ స్వీకారానికి ఆయనను ఆహ్వానించారు. అయితే ఎన్నికలు ముగిసినప్పటి నుంచి కిరణ్ మౌనంగా ఉండిపోయారు. అసలు ఆయనెక్కడ ఉన్నారో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. తెలంగాణ ఏర్పాటును కిరణ్ వ్యతిరేకించారు. విభజనను వ్యతిరేకిస్తూ ముఖ్యమంత్రి పదవిని, కాంగ్రెస్ పార్టీని వదులుకున్నారు. జై సమైక్యాంధ్ర పార్టీ పెట్టి ఎన్నికలకు వెళ్లి భంగపాటుకు గురైయ్యారు. తెలంగాణలో టీఆర్ఎస్ అధికారంలోకి రావడంతో కేసీఆర్ ముఖ్యమంత్రి కాబోతున్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ ప్రమాణ స్వీకారానికి మాజీ ముఖ్యమంత్రి హోదాలో కిరణ్ ను ఆహ్వానించారు. అయితే ఆయన ఈ కార్యక్రమానికి హాజరవుతారా, లేదా అనేది ఆసక్తికరంగా మారింది. కిరణ్ రాకపై ఎటువంటి సమాచారం లేకపోవడంతో ఆయన ఈ కార్యక్రమానికి హాజరుకాకపోవచ్చని భావిస్తున్నారు. -
మాజీ సీఎం కనబడుట లేదు!
శీర్షిక చదివి చకితులవకండి. ఇది నికార్సైన నిజం. ఎన్నికలు ముగిసిన నాటి నుంచి నల్లారి వారు నలుసైపోయారు. సార్వత్రిక ఎన్నికల సమరం ముగిసి నాలుగు రోజులైనా ఆయన దర్శనం లేదు. కనీసం మాట కూడా వినిపించలేదు. సమైక్య చాంపియన్ నేనేనంటూ భుజాలెగరేసి తన పార్టీని బరిలోకి దింపి భంగపడ్డారు కిరణయ్య. 'జై సమైక్యాంధ్ర'తో ప్రజలు జేజే అందుకోవాలన్న ఆయనగారి ఆశలు ఫలించకపోవడంతో ముఖం చాటేశారా? సార్వత్రిక ఎన్నికల్లో జై సమైక్యాంధ్ర పార్టీ అడ్రస్ లేకుండా పోయింది. 150పైగా స్థానాల్లో పోటీ చేసినా ఒక్కచోట కూడా ఆ పార్టీ విజయం గెలవలేదు. సొంత నియోజకవర్గం పీలేరు సీటైనా వస్తుందనుకున్న కిరణ్‌కు చేదుఅనుభవమే ఎదురైంది. అత్యధిక స్థానాల్లో జై సమైక్యాంధ్ర అభ్యర్థులు డిపాజిట్లు కోల్పోయి ఘోర పరాభవాన్ని చవిచూశారు. ఎన్నికల ఫలితాలు విడుదలై నాలుగు రోజులు గడుస్తున్నా మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఇప్పటివరకు మీడియా ముందుకు రాలేదు. పార్టీ ఓటమిపైన కానీ, పోలింగ్ సరళిపైన కానీ తన స్పందన వెల్లడించలేదు. అన్ని ప్రధాన పార్టీల అధ్యక్షులు ఎన్నికల ఫలితాలపై తమ స్పందన తెలిపారు. చివరి బంతి వరకు వేచిచూసే అలవాటున్న కిరణ్ ఈ విషయంలోనే అదే పంథా అనుసరిస్తున్నట్టు కనబడుతోంది. కిరణ్ ప్రత్యర్థులు మాత్రం మాజీ సీఎం కనబడుట లేదు అంటూ జోకులు పేలుస్తున్నారు. ఇప్పటికైనా పలుకైనా కిరణ్ పలుకుతారో, లేదో? -
నల్లారిది ముగిసింది.. ముగియాల్సింది నారావారిదే!
ఆంధ్రప్రదేశ్ విభజన అంశంతో రాష్ట్ర రాజకీయాల్లో తలపండిన నాయకులు కనుమరుగైపోయారు. రాష్ట్ర విభజనకు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కు అన్నివిధాల సహకరించిన అప్పటి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ తన పాత్ర పూర్తయిందని నిర్ఱారించుకున్న తర్వాత సమైక్య రాష్ట్రం కోసం తానే చాంఫియన్ అనే రీతిలో జై సమైక్యాంధ్ర అనే ఓ రాజకీయ దుకాణాన్ని తెరిచారు. మంత్రివర్గంలోని తన సహచరులంతా వెంటనడుస్తారనే అతివిశ్వాసంతో జనంలోకి వెళ్లిన నల్లారికి ఊహించని షాకే తగిలింది. నల్లారి దళంలో నేతలు ఒక్కొక్కరే జారుకోవడంతో నల్లారి పరిస్థితి రాష్ట్ర రాజకీయాల్లో అతి దయనీయంగా మారింది. ఎలాగోలా కష్టపడి అభ్యర్ధులను నిలబెట్టి పాదరక్షలిచ్చిన నల్లారికి ఒక్కొక్కరు చేతులెత్తేశారు. పరిస్థితి చేజారిపోయిందనుకున్న నల్లారి స్వంత జిల్లాలో బరిలో సైతం నిలవకుండా తుస్సు మనిపించారు. ఇక జట్టు కెప్టెనే చేతులేత్తేసాక.. అభ్యర్ధులు, నేతలు ఏం చేస్తారు.. ఒక్కొక్కరు తమకు దొరికిన ఆసరాతో జంప్ జిలానీల జాబితాలో చేరారు. ఇక చిత్తూరు జిల్లాలో మిగిలి ఉన్న నాయకుడు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పరిస్థితి కూడా దయనీయంగా ఉంది. సీమాంధ్ర ప్రాంతంలో బలంగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎదుర్కొనేందుకు తన బలం సరిపోదనుకున్న నారా వారు నరేంద్ర మోడీ బలంతో నెగ్గుకు రావడానికి ప్రణాళిక రచించారు. వైస్ జగన్ ను ఢీకొట్టేందుకు మోడీ ప్రభావం సరిపోదనుకున్న చంద్రబాబు.. సినీ గ్లామర్ ను ఆశ్రయించారు. అప్పుడప్పుడే జనసేన అంటూ కొత్త దుకాణం తెరిచిన పవన్ కళ్యాణ్ ను గట్టేక్కించాలని వేడుకున్నారు. అయినా 'గడ్డంత్రయం' మోడీ, పవన్, చంద్రబాబు ల ప్రభావం అంతంతా మాత్రమే అని తేలిపోయింది. పరిస్థితులు ఇలా ఉండగా.. ఎన్నికల తర్వాత చంద్రబాబు నాయుడు ఇక కనిపించరని.. తెలుగుదేశం పార్టీ కూడా కనుమరుగై పోవడం ఖాయమని వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పారు. ఇప్పటికే పదేళ్లపాటు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న చంద్రబాబు.. రాబోయే రోజుల్లో ఆయన పరిస్థితి దిగజారి పరిస్థితి ఉంది. అందుకే వైఎస్ఆర్ సీపీని ఎదుర్కొనేందుకు అన్ని అడ్డదారులు తొక్కుతూ, ఎల్లో మీడియా అసత్య ప్రచారాలు కూడా కాపాడలేకపోతున్నాయి. ఇప్పటికే రాష్ట్ర రాజకీయాల్లో నల్లారి శకం ముగిసింది. ఇక ఎన్నికల తర్వాత నారావారి శకానికి ముగియడం ఖాయమని రాజకీయ వర్గాల్లో ప్రచారం జోరందుకుంది. -
నల్లారి శకం ముగిసింది
చిత్తూరు జిల్లాలో చంద్రబాబు వ్యాఖ్య రాష్ట్ర రాజకీయాల్లో నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి శకం ముగిసిపోయిందని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు వ్యాఖ్యానించా రు. ఆదివారం చిత్తూరు జిల్లాలోని పీలేరు, పుంగనూరు, పలమనేరు, కుప్పంలో ఎన్నికల బహిరంగసభల్లో ఆయన మాట్లాడారు. అధికారంలో ఉన్నన్నాళ్లూ సీమాంధ్రకు న్యాయం చేయలేని కిరణ్ ఇప్పుడేదో ఉద్ధరిస్తానంటూ ప్రగల్భాలు పలకడం హాస్యాస్పదమన్నారు. రాష్ట్ర విభజనను అడ్డుకోలేని అసమర్థ సీఎంగా కిరణ్ చరిత్రలో మిగిలిపోతాడని దుయ్యబట్టారు. టీడీపీ ప్రభుత్వం తమ హయాంలో సింహాచలం, శేషాచలం అడవుల్లో ఎర్రచందనం మొక్కలు నాటిందన్నారు. అయితే కిరణ్ సోదరుడు, పీలేరు అభ్యర్థి నల్లారి కిషోర్‌కుమార్‌రెడ్డి వాటిని నరికించి అమ్మేశాడని ఆరోపించారు. ఈ ఎన్నికలతో సీమాంధ్రలో జై సమైక్యాంధ్ర, కాంగ్రెస్ పార్టీలు గల్లంతు కావడం తథ్యమని అన్నారు. కాగా పీలేరు బహిరంగ సభలో చంద్రబాబునాయుడి ప్రసంగంలో రాజంపేట బీజేపీ ఎంపీ అభ్యర్థి పురందేశ్వరి పేరు ప్రస్తావించకపోవడం గమనార్హం. కాగా, చంద్రబాబు బహిరంగ సభకు జనాన్ని తరలించడం కోసం పార్టీ నేతలు నానా తంటాలు పడ్డారు. కొద్దిమందితోనే సభను అరగంటలో ముగించారు. కుప్పం సభకు రాష్ట్ర సరిహద్దు గ్రావూల నుంచి ప్రజలను తరలించారు. డబ్బులు విచ్చలవిడిగా పంపిణీ చేసి విందు భోజనాలు పెట్టారు. -
కిరణ్.. నిండా ముంచారు
నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి... సీఎం పదవిని అడ్డుపెట్టుకుని సీమాంధ్ర పాలిట అక్షరాలా సైంధవ పాత్ర పోషించారు. విడదీసేందుకు వీల్లేదని పైకి మేకపోతు గాంభీర్యం ఒలకబోస్తూనే లోలోన విభజనకు కావాల్సిన రంగాన్నంతా సిద్ధం చేశారు. కేంద్రం ఆడించినట్టల్లా ఆడుతూ, విభజనకు కావాల్సిన సమాచారం దగ్గరి నుంచి అన్ని రకాల సాయమూ ఎప్పటికప్పుడు అం దించి సహకరించారు. రాష్ట్ర కాంగ్రెస్ నేతలకు శల్య సారథ్యం వహించారు. వారి నుంచి అధిష్టానానికి ఎలాంటి ఇబ్బం దులూ తలెత్తకుండా కాపు కాశారు. ‘విభజన బిల్లు రాకముందే మేల్కొందాం. రాష్ట్రం సమైక్యంగా ఉండాలంటూ ముందుగానే అసెంబ్లీలో తీర్మానం చేద్దాం’’ అని సొంత పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఎంతగా మొత్తుకున్నా కాకమ్మ కథలతో వారించారు. రాజీనామాలన్నా చేద్దామన్నా, ‘అసెంబ్లీలో సమైక్య గళాన్ని ఎవరు విన్పిస్తా’రంటూ దానికీ అడ్డుపడ్డారు. విభజనను ఆపేందుకు బ్రహ్మాస్త్రముంది లెమ్మంటూ బీరాలు పలికారు. చివరికి విభజన బిల్లుపై అసెంబ్లీలో సజావుగా చర్చ జరిగేలా, అది సభ అభిప్రాయంతో పాటుగా రాష్ట్రపతికి తిరిగి వెళ్లేలా దగ్గరుండి అన్ని జాగ్రత్తలూ తీసుకుని తరించారు. -
సీమాంధ్ర అసెంబ్లీలో అడుగుపెట్టను
అందుకే పోటీ చేయడంలేదు: కిరణ్ బొబ్బిలి, 175 మంది ఎమ్మెల్యేలుండే అసెంబ్లీలో తాను అడుగుపెట్టబోనని, అందుకే తాను పోటీ చేయడం లేదని జై సమైక్యాంధ్ర పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. రేపు అవసరమనుకుంటే ఎవరినో ఒకరిని రాజీనామా చేయించి ఎమ్మెల్యేగా ఎన్నికవ్వడం పెద్ద సమస్యేమీ కాదన్నారు. విజయనగరం జిల్లా బొబ్బిలిలో శనివారం నిర్వహించిన ప్రచారసభలో ఆయన మాట్లాడారు. పదవి కోసం ఏగడ్డి అయినా తినే వ్యక్తిని తాను కాదన్నారు. విభజనపై సుప్రీంకోర్టులో తాను వేసిన కేసుకు సంబంధించిన వాదనలు మే 5న ఉన్నాయని చెప్పారు. -
నాపై పోటీకి దమ్ముందా?
* సమైక్యద్రోహి కిరణ్ *కమీషన్ల కోసమే కండలేరు తాగునీటి పథకం * ప్రజల సొమ్ము దోచుకోలేదని ప్రమాణానికి సిద్ధమేనా ? * రాజంపేట వైఎస్సార్సీపీ లోక్‌సభ అభ్యర్థి మిథున్‌రెడ్డి ధ్వజం పీలేరు, న్యూస్‌లైన్ : మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి సహా ఆయన సోదరుల్లో ఎవరికైనా దమ్ము, ధైర్యం ఉంటే తనపై పోటీ చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజంపేట పార్లమెంట్ అభ్యర్థి పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి సవాల్ విసిరారు. శుక్రవారం ఆయన పీలేరులో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తనపై పోటీ చేసి డిపాజిట్టు తెచ్చుకున్నా రాజకీయాల నుంచి వైదొలగడానికి సిద్ధమేనన్నారు. మూడన్నరేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నా ప్రజల దాహార్తి తీర్చలేని కిరణ్ ఏ మొహం పెట్టుకుని నామినేషన్ వేస్తార ని ప్రశ్నించారు. ప్రజలు రోజూ బిందె నీరు రూ. 3 నుంచి రూ. 5కు కొనుక్కోవాల్సిన దుస్థితి ఆయనవల్లే వచ్చిందని కిరణ్‌పై మండిపడ్డారు. పీలేరు లో ప్రభుత్వ భూముల తోపాటు గుట్టలు, పుట్టలు, చెట్లు, వాగులు, వంకలు ఆక్రమించి వందల కోట్లు దండుకున్నది ఆయన అనుచరులేనని ఆగ్రహం వ్యక్తంచేశారు. పదవిపోయే ముందు కమీషన్ల కోసం కండలేరు నుంచి తాగునీరు జిల్లాకు తరలించే ప్రక్రియ చేపట్టలేదా ? అని ప్రశ్నించారు. కమీషన్లు, ప్రజాధనాన్ని మూడన్నరేళ్లలో దోచుకోలేదని ప్రమాణం చేయడానికి సిద్ధమా అంటూ నల్లారి సోదరులకు సవాల్ విసిరారు. రూ. 9 కోట్లతో ఏర్పాటు చేసిన కాంతి కిరణాలు మొహం చాటేశాయని, వీటిని ఏర్పాటు చేసిందీ కమీషన్ కోసం కాదా ? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో సమైక్య ద్రోహిగా మొదటి స్థానం కిరణ్‌కుమార్‌రెడ్డికే దక్కుతుందన్నారు. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించడానికి కేంద్రానికి పూర్తి సహాయ సహకారాలు అందించిన ఆయన సమైక్యవాదినంటూ ఇప్పుడు డ్రామాలాడితే ప్రజలు నమ్మరన్నారు. సమైక్య ద్రోహులు జై సమైక్యాంధ్ర అంటూ పార్టీని ఏర్పాటు చేయడం సిగ్గు చేటన్నారు. ఆ పార్టీకి ఇవే చివరి ఎన్నికలన్నారు. పీలేరు ప్రజలు కిరణ్ సోదరుల మాయమాటలు నమ్మే పరిస్థితిలో ఇక ఎన్నడూ ఉండరని తెలిపారు. రూ. 7 కోట్లతో పీలేరు పట్టణ ప్రజల దాహార్తిని శాశ్వతంగా పరిష్కరించవచ్చని, సీఎంగా ఈ పని కూడా చేయని కిరణ్ ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని ఇక్కడి నుంచి పోటీ చేస్తారో ప్రజలు గుర్తుంచుకోవాలన్నారు. ఒక్క రోజైనా అన్నదమ్ములు ఎండలో కష్టపడ్డారా ? వ్యాపారాలేమైనా చేశారా ? ఏమి చేయకనే వేల కోట్లు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. కిరణ్ రోడ్‌షోలు జనం లేక అట్టర్ ఫ్లాప్ అయ్యాయని విమర్శించారు. సొంత జిల్లాలో ఒక్క ఎమ్మెల్యేని కూడా తన వెంట పెట్టుకోలేని కిరణ్‌కు ఆయన సత్తా ఏ పాటిదో చెప్పాల్సిన అవసరం లేదన్నారు. మతతత్వ పార్టీ బీజేపీతో పొత్తుపెట్టుకుంటున్న చంద్రబాబును చరిత్ర క్షమించదన్నారు. ముస్లిం మైనారిటీలు చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతాన్ని గుర్తించి ఈ ఎన్నికల్లో చిత్తు చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రజలు జగన్మోహన్రెడ్డి నాయకత్వాన్ని కోరుకుంటున్నారని తెలిపారు. సీమాంధ్రలో 130 నుంచి 150 స్థానాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో పార్టీ నేతలు నారే వెంకట్రమణారెడ్డి, మల్లెల రెడ్డిబాషా, బీడీ నారాయణరెడ్డి, కడప గిరిధర్‌రెడ్డి, షామియానా షఫీ, లోకనాథరెడ్డి, ఎస్ హబీబ్‌బాషా, దండు జగన్మోహన్రెడ్డి, సదుం నాగరాజ, మల్లికార్జునరెడ్డి, గడిబాషా, కొత్తపల్లె సురేష్‌కుమార్‌రెడ్డి, ఉదయ్‌కుమార్, అల్లాబక్షు, మల్లెల మస్తాన్, బాబ్జిరెడ్డి, మధుకర్‌రెడ్డి, ఆదినారాయణ, శ్రీనాథపురం మణి, జయపాల్‌రెడ్డి, వెంకటరమణ, మార్కొండరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
రాజంపేట లోక్‌సభకు కిరణ్ పోటీ!
సాక్షి, హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి ‘జై సమైక్యాంధ్ర’ పార్టీ తరఫున రాజంపేట లోక్‌సభ స్థానానికి పోటీ చేయనున్నారని తెలుస్తోంది. ఈ మేరకు ఒకటిరెండు రోజుల్లో పార్టీ ప్రెసిడెన్సియల్ బ్యూరోలో చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు. కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రస్తుతం చిత్తూరు జిల్లా పీలేరు శాసనసభా స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పీలేరులో వ్యతిరేక పవనాలు వీస్తుండడంతో కిరణ్ అక్కడినుంచి పోటీచేయడానికి వెనుకాడుతున్నట్లు తెలుస్తోంది. -
నల్లారి బ్రదర్స్ పక్కచూపులు
మాజీ ముఖ్యమంత్రి, జై సమైక్యాంధ్ర పార్టీ అధ్యక్షుడు నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డికి ఈ సార్వత్రిక ఎన్నికలు అగ్ని పరీక్షగా మారాయి. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా, జై సమైక్యాంధ్ర పార్టీ ఏర్పాటు తదితర పరిణామాల తరువాత తొలిసారిగా ఆయన గురువారం జిల్లాకు వస్తున్నారు. ఈ ఏడాది మార్చి 10వ తేదీన కొత్త పార్టీ ఆవిర్భావంపై ఆయన హైదరాబాద్‌లో అధికారికంగా ఒక ప్రకటన చేశారు. సరిగ్గా నెల రోజుల తరువాత సొంత జిల్లాకు వస్తుండటం గమనార్హం. పార్టీ ఏర్పాటు సమయంలో ఆయన వెంట నిలిచిన పలువురు ప్రముఖులు, మాజీ మంత్రులు ఒక్కొక్కరుగా జారుకున్నారు. జిల్లాలో ఆయనకు బాసటగా నిలిచిన ప్రథమశ్రేణి నాయకులు ఒక్కరు కూడా లేరు. సీఎం హోదాలో హంగూ ఆర్భాటంతో వచ్చే కిరణ్ ఈసారి పర్యటన మాజీ సీఎం హోదాలో జరగనుండటంతో అందరి కళ్లు ఈ పర్యటనపై పడ్డాయి. సీఎం పదవికి రాజీనామా చేసిన తరువాత కొత్త పార్టీ ఏర్పాటు విషయంలో తర్జనభర్జనలు పడినప్పటికీ చివరికి నిర్ణయం తీసుకున్నారు. రాజమండ్రిలో పార్టీ ఆవిర్భావ సభ నిర్వహించారు. ఈలోగా మున్సిపల్, పరిషత్ ఎన్నికలు ముంచుకురావడంతో జేఎస్పీ కార్యకలాపాలకు విరామం ఇచ్చారు. మున్సిపల్ ఎన్నికల తరువాత పర్యటనలు ప్రారంభించారు. ఇందులో భాగంగా గురువారం సాయంత్రం మదనపల్లెలో రోడ్ షో నిర్వహించనున్నారు. అనంతపురం జిల్లా కదిరి నుంచి మదనపల్లెకు చేరుకుని రోడ్ షోలో పాల్గొన్న తరువాత స్వగ్రామమైన కలికిరి మండలం నగిరిపల్లెకు వెళ్లి రాత్రికి అక్కడే బస చేస్తారు. తదుపరి పర్యటన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. జేఎస్పీ అధ్యక్షుని హోదాలో తొలిసారిగా జిల్లాకు వస్తున్న ఆయన ప్రజలకు ఇచ్చే సందేశంపై ఆసక్తి వ్యక్తమవుతోంది. సీఎంగా రాజీనామా తరువాత సొంత ని యోజకవర్గం పీలేరులో పట్టు కోల్పోయిన కిరణ్ సోదరులు ఇప్పుడు దిక్కులు చూస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఈ నెల ఆరో తేదీ జరిగిన పరిషత్ ఎన్నికల్లోనూ పీలేరు నియోజకవర్గంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుమారుడు మిధున్‌రెడ్డి చక్రం తిప్పారు. పలు మండలాల్లో కిరణ్ వర్గీయుల ను వైఎస్సార్సీపీలో చేర్పించడంలో కృతకృత్యులయ్యారు. ఈ ప్రభావం పరిషత్ ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది. ఈ ఎన్నికల ప్రచారం లో కిరణ్ సోదరుడు కిషోర్‌కుమార్‌రెడ్డి కూడా పెద్దగా పాల్గొనలేదు. ఫలితాలను ముందుగానే ఊహించే కిషోర్ ప్రచారానికి దూరంగా ఉన్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సొంతపార్టీ జెండాతో సార్వత్రిక ఎన్నికలను ఒంటిరిగా ఎదుర్కోవడంపై కిరణ్ సోదరులు ఆందోళనలో ఉన్నట్టు చెబుతున్నారు. ఇందులో భాగంగా కొత్త వ్యూహాలకు తెరతీస్తున్నారని రాజకీయవర్గాల్లో ప్రచారం జరుగుతోంది. జై సమైక్యాంధ్ర పార్టీ తరఫున పీలేరు నియోజకవర్గం నుంచి కిరణ్ ఈ దఫా అసెం బ్లీకి పోటీచేసే విషయంలో ముందూవెనకా ఆలోచిస్తున్నారని తెలుస్తోంది. గెలిచినాఓడినా లోక్‌సభకు పోటీ చేయడం శ్రేయస్కరంగా భావిస్తున్నట్టు సమాచారం. ఇందుకోసం రాజంపేట నియోజకవర్గం నుంచి లోక్‌సభకు పోటీచేసే అంశం తీవ్రంగా పరిశీలిస్తున్నట్టు తెలిసింది. పొత్తుల్లో భాగంగా ఈ స్థానం బీజేపీకి కేటాయించడం వెనుక జాతీయస్థాయిలో కిరణ్ పావులు కదిపినట్టు టీడీపీ వర్గాలు బలం గా చెబుతున్నాయి. రాజంపేట నియోజకవర్గం పరిధిలో టీడీపీకి బలం ఉండటంతో పాటు పలువురు ముఖ్య నాయకులు టికెట్టు కోసం పోటీపడ్డారు. అయితే బీజేపీ ఒత్తిడి మేరకు ఆ స్థానాన్ని టీడీపీ వదులుకుంది. ముందుగానే బీజేపీతో కుదుర్చుకున్న లోపాయికారి ఒప్పందం మేరకు ఇక్కడ నుంచి బలహీనమైన అభ్యర్థిని బీజేపీ బరిలోకి దించినట్టయితే తనకు కొంతవరకైనా మేలు జరుగుతుందని ఉద్దేశ్యంలో కిరణ్ ఉన్నట్టు చెబుతున్నారు. రాజంపేట టికెట్టు ఆశించిన టీడీపీ మాజీ ఎంపీ ఒకరు అంతర్గత సంభాషణల్లో ఈ విషయాన్ని కుండబద్దలు కొట్టినట్టు చెబుతుండటం గమనార్హం. సొంత నియోజకవర్గమైన పీలేరులో కిరణ్ సోదరుడు కిషోర్‌ను బరిలోకి తెచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇక్కడ టీడీపీకి అభ్యర్థి దొరకని పరిస్థితి. దీంతో టీడీపీ సహకారంతో వైఎస్సార్సీపీని ఎదుర్కోవాలనే వ్యూహం జేఎస్పీ నేతలో ఉన్నట్టు చెబుతున్నారు. ఆ మేరకు రహస్య ఒప్పందాలు జరుగుతున్నాయనే ప్రచారం రాజకీయవర్గాల్లో జరుగుతోంది. ఈ నెల 12న ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుండటంతో కిరణ్ తన వ్యూహాలను అమలు చేసేందుకు నియోజకవర్గానికి వస్తున్నట్టు సమాచారం. -
విభజనకు సహకరించిన పార్టీలకు బుద్ధి చెప్పండి
ఒంగోలు టూటౌన్, న్యూస్‌లైన్: తెలంగాణలో సీట్ల కోసం సోనియా రాష్ట్రాన్ని విభజించిందని జైసమైక్యాంధ్ర రాష్ట్ర అధ్యక్షుడు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి విమర్శించారు. రోడ్‌షోలో భాగంగా శనివారం జిల్లాకు వచ్చిన ఆయన ఒంగోలులోని సీవీఎన్ రీడింగ్ రూం సమీపంలో నిర్వహించిన రోడ్‌షోలో మాట్లాడారు. ఎటువంటి ప్రణాళికలు లేకుండా రాష్ర్ట విభజనకు అనుకూలంగా వ్యవహరించిన పార్టీలకు వచ్చే ఎన్నికల్లో ఓటుతో తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. 50 ఏళ్లకుపైగా కష్టపడి అభివృద్ధి చేసుకున్న హైద రాబాద్‌ను తెలంగాణకు ఇవ్వడం వెనుక కేసీఆర్, సోనియాల స్వార్థం ఉందన్నారు. విభజన వల్ల సాగు, తాగునీటి కోసం నిత్యం కొట్లాటలు జరుగుతాయన్నారు. యువత భవిష్యత్తు కోసమే జైసమైక్యాంధ్ర పార్టీని పెట్టామని చెప్పారు. తాను అధికారంలో ఉన్నప్పుడు ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్, బంగారు తల్లి, పిల్లలకు డైట్ చార్జీలు వంటి పథకాలను ప్రవేశపెట్టానని చెప్పారు. * 46 వేల కోట్లుగా ఉన్న రాష్ట్ర బడ్జెట్‌ను *80 వేల కోట్లకు తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు. పావలా వడ్డీ బకాయిలు, మైక్రో ఫైనాన్స్ ఆగడాలకు అడ్డుకట్ట వేయడానికి స్త్రీనిధి పెట్టామన్నారు. ఆల్ ఫ్రీ అని చెప్పే నాయకుల మాటలు నమ్మవద్దన్నారు. విభజన వల్ల రెండు చోట్ల జీతాలిచ్చే పరిస్థితి లేదన్నారు. జైసమైక్యాంధ్ర పార్టీకి ఓట్లేసి గెలిపించాలని కోరారు. కేసీఆర్, బీజేపీ నేతలు అద్వానీ, సుష్మాస్వరాజ్, చంద్రబాబుల తీరును దుయ్యబట్టారు. యువకులను, పోరాట యోధులను అసెంబ్లీ, పార్లమెంట్‌కు పంపుతామన్నారు. కార్యక్రమంలో జైసమైక్యాంధ్ర పార్టీ జిల్లా బాధ్యుడు జడా బాలనాగేంద్రం, నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌లు సంజీవరెడ్డి, జగన్మోహన్రావు, జిల్లా నాయకులు రామస్వామి, మాదా శ్రీదేవి, కే లక్ష్మీకుమారి వివిధ పార్లమెంటరీ నియోజకవర్గాల నాయకులు రఘునాథ్, న్యాయవాదుల జేఏసీ నాయకురాలు దేవకుమారి, యన్ఆర్కె. నాగిరెడ్డి, విద్యార్థి జేఏసీ నాయకులు నాగరాజు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
చంద్రబాబును తరిమి కొట్టండి
పొన్నూరు, న్యూస్‌లైన్: రాష్ర్ట విభజనకు సహకరించిన పార్టీలకు ఓట్లేయొద్దని, అలా వేస్తే మీరూ విభజనకు సహకరించినట్టేనని మాజీ ముఖ్యమంత్రి జై సమైక్యంధ్ర పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. నాడు తెలుగుజాతి ఐక్యత కోసం ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెడితే నేడు ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు అదే జాతిని చీల్చిన వ్యక్తిగా చరిత్రలో మిగిలిపోయారని ధ్వజమెత్తారు. వరంగల్ సభలో చంద్రబాబు జై తెలంగాణ నినాదమిచ్చారని, ఆయనను తెలుగు ప్రజలు తరిమి, తరిమి కొట్టాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన జిల్లాలోని తెనాలి, పొన్నూరు ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రాత్రి పొన్నూరులో ఏర్పాటు చేసిన జై సమైక్యంధ్ర పార్టీ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ స్థానిక ఎన్నికల్లో ఏ పార్టీకి ఓటేసినా సార్వత్రిక ఎన్నికల్లో మాత్రం తెలుగుజాతిని చీల్చిన పార్టీలకు ఓటు వేయవద్దని కోరారు. రాజకీయాల్లో అవకాశవాదానికి తావులేదని, అధికారం కోసం గడ్డితింటే ప్రజలు ఉరుకోరన్నారు. ముఖ్యమంత్రిగా తాను అమలు చేసిన సంక్షేమ పథకాలను వివరించారు. కాంగ్రెస్ అధిష్టానం దుర్మార్గంగా తెలుగు ప్రజలను విడదీయడం వల్లే ఆ పార్టీకి, ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసినట్టు చెప్పారు. జై సమైక్యాంధ్ర పార్టీ తన కోసం కాదని తెలుగుజాతి కోసం పెట్టానని వివరించారు. పార్టీ గుర్తుగా పాదరక్షలు ఎంచుకున్నానని, ఢిల్లీ పెద్దలకు చెంపదెబ్బ కొట్టేలా తీర్పివ్వాలని ఓటర్లును కోరారు. ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీలన్నీ అమలు చేయలేని హామీలు ఇస్తున్నాయని విమర్శించారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాల ప్రజలు తరమికొట్టే రోజు దగ్గర్లోనే ఉందని హెచ్చరించారు. కార్యక్రమంలో జై సమైక్యంద్ర పార్టీ నాయకులు గంగాధర్, రాష్ట్ర మాల మహాసభ అధ్యక్షుడు మల్లెల వెంకట్రావు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వెలవెలబోయిన రోడ్‌షో తెనాలిలో కిరణ్‌కుమార్‌రెడ్డి నిర్వహించిన రోడ్‌షోకు జన స్పందన అంతగా లభించలేదు. రోడ్డుపక్కనున్న జనానికి అభివాదం చేస్తూ ముందుకు సాగిపోవాల్సి వచ్చింది. సెంటర్లో నిర్వహించిన సభకు కూడా కొద్దిపాటి కార్యకర్తలే హాజరయ్యారు. పొన్నూరులో రాత్రి అయినప్పటికీ ఆశించిన జనస్పందన కనిపించలేదు. -
తాటాకు చప్పుళ్లకు భయపడం..: కిరణ్
ఇదేమన్నా నీ జాగీరా.. కేసీఆర్‌పై కిరణ్ ఆగ్రహం సాక్షి, హైదరాబాద్: ‘ఆంధ్రా ఉద్యోగులు ఆంధ్రాకే.. తెలంగాణ వారు తెలంగాణలోనేనా? ఉద్యోగులకు ఆప్షన్లుండవా? ఇదేమన్నా నీ జాగీరా.. తాటాకు చప్పుళ్లకు భయపడేవారెవ్వరూ లేరిక్కడ. ఉద్యోగుల ఇష్టానికి భిన్నంగా ఎవ్వర్నీ పంపలేరు. అసలు పార్లమెంటులో పాసయ్యిందేమిటి.. మీరు మాట్లాడుతుందేమిటి? ఏమన్నా అర్థం ఉందా?’ అంటూ జై సమైక్యాంధ్ర పార్టీ అధ్యక్షుడు నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగులకు తాము అండగా ఉంటామన్నారు. హైదరాబాద్‌లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో గురువారం మీడియా సమావేశంలో పార్టీ ఉపాధ్యక్షుడు పితాని సత్యనారాయణ, మీడియా కమిటీ చైర్మన్ ఎన్.తులసిరెడ్డిలతో కలసి కిరణ్‌కుమార్‌రెడ్డి మాట్లాడారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్, కేంద్రమంత్రి చిరంజీవిలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ‘డిజైన్ మార్చకుంటే పోలవరాన్ని నిర్మించనీయమని కేసీఆర్ అంటున్నారు. ఆపేదానికి ఆయనెవరు? ఏ హక్కుతో, ఏ సామర్థ్యంతో ఆ మాటంటున్నారో చెప్పాలి..’ అని ప్రశ్నించారు. -
కాంగ్రెస్‌తో జతకట్టబోం: కిరణ్
ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేసిన ప్రతినిధులు విశాఖపట్నం, న్యూస్‌లైన్: తెలుగు ప్రజలను విడగొట్టిన కాంగ్రెస్ పార్టీతో ఎట్టి పరిస్థితుల్లో జత కట్టబోమని మాజీ ముఖ్యమంత్రి, జై సమైక్యాంధ్ర పార్టీ వ్యవస్థాపకుడు నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. విశాఖలో సోమవారం ముస్లింలు, న్యాయవాదులు, వైద్యులు, ఉత్తరాంధ్ర జర్నలిస్టులు, అర్చకుల జేఏసీ ప్రతినిధులతో తెలుగు జాతి ఆత్మగౌరవ సభ నిర్వహించారు. పలు జేఏసీల ప్రతినిధులు, విద్యార్థులు ఆయనను ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశారు. కాంగ్రెస్‌తో కలుస్తారా? అని ప్రశ్నించడంతో ఆ పార్టీతో కలిసేది లేదన్నారు. రాష్ట్ర విభజన జరిగిపోరుున తర్వాత సమైక్యాంధ్ర కోసం పోరాట ఫలితం ఉంటుందా..? అని అడిగితే విభజనకు సంబంధించి కోర్టులో ఉన్న కేసులకు తీర్పులు అనుకూలంగా వస్తాయన్న ఆశాభావం ఉందన్నారు. -
'గోదావరి జిల్లాల దెబ్బ కాంగ్రెస్ కు తెలియదు'
రాజమండ్రి: గోదావరి జిల్లాల దెబ్బ కాంగ్రెస్‌కు తెలియదని తాజా మాజీ సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి అన్నారు. గోదావరి జిల్లాల్లో నెగ్గిన పార్టీయే అధికారంలోకి వస్తుందన్నారు. రాష్ట్రాన్ని విడగొట్టినందుకే జై సమైక్యాంధ్ర పార్టీ పుట్టిందన్నారు. అన్యాయంగా రాష్ట్రాన్ని విభజించినందుకే సీఎం పదవిని వదులుకున్నానని చెప్పారు. రాజమండ్రిలో జరిగిన జై సమైక్యాంధ్ర పార్టీ ఆవిర్భావ సభలో కిరణ్ మాట్లాడారు. పెద్దమ్మ(సోనియా), చిన్నమ్మ(సుష్మా స్వరాజ్) కలిసి రాష్ట్రాన్ని విడగొట్టారని విమర్శించారు. రాష్ట్రాన్ని విభజించమని ఎవరు సిఫారసు చేశారని ప్రశ్నించారు. ఎవరి కోసం రాష్ట్రాన్ని ముక్కలు చేశారని నిలదీశారు. అసెంబ్లీ తిరస్కరించిన బిల్లును పార్లమెంట్లో ఎలా ఆమోదిస్తారన్నారు. తెలుగుజాతి విడిపోయిందన్న బాధ ప్రతిఒక్కరిలో ఉందన్నారు. అయితే విభజన పూర్తిగా అయిపోలేదన్నారు. ఈ ఎన్నికల్లో తెలుగు ప్రజలు ఇచ్చే తీర్పు కాంగ్రెస్‌కు గుణపాఠం కావాలన్నారు. తనకు ప్రజలే బీఫారం ఇస్తారని కిరణ్ అన్నారు. పదవి వదిలేసి తెలుగు ప్రజల కోసం జీవితం అంకితం చేస్తున్నానని చెప్పారు. ఈ సందర్భంగా జై సమైక్యాంధ్ర పార్టీ జెండాను కిరణ్ ఆవిష్కరించారు. లేత పసుపుపచ్చ, పచ్చరంగులో ఉన్న జెండా మధ్యలో ఆంధ్రప్రదేశ్ పటం ఉంచారు. -
అడ్వాన్స్ బుకింగ్, సేల్ లేదు: కిరణ్
హైదరాబాద్: తమ పార్టీలో టిక్కెట్లు అమ్ముకోబోమని మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి అన్నారు. అడ్వాన్స్ బుకింగ్ లేదు, సేల్ లేదని ఆయన చమత్కరించారు. తన పార్టీ పేరును 'జై సమైక్యాంధ్ర'గా కిరణ్ ప్రకటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజల కోసమే పనిచేసే వాళ్లకే టిక్కెట్లు ఇస్తామని చెప్పారు. ఎవరికీ ఎన్ని సీట్లు ఇవ్వాలో ప్రజల గుండె చప్పుడు చెబుతుందన్నారు. వ్యవస్థాపక అధ్యక్షుడిగా చండ్రు శ్రీహరిరావు వ్యవస్థాపక అధ్యక్షుడిగా, తాను అధ్యక్షుడిగా ఉంటానని కిరణ్ తెలిపారు. సాయి ప్రతాప్, సబ్బం హరి, ఉండవల్లి అరుణ్ కుమార్, హర్షకుమార్, పితాని సత్యనారాయణ, శైలజానాథ్ ఉపాధ్యక్షులుగా వ్యవహరిస్తారని చెప్పారు. కార్యదర్శిగా గంగాధర్‌ను నియమించినట్టు చెప్పారు. లగడపాటి రాజగోపాల్ వ్యూహకర్తగా వ్యవహరిస్తారని అన్నారు. -
కిరణ్ పార్టీ పేరు 'జై సమైక్యాంధ్ర'
-
కిరణ్ పార్టీ పేరు 'జై సమైక్యాంధ్ర'
హైదరాబాద్: తాను పెట్టబోయే పార్టీ పేరు 'జై సమైక్యాంధ్ర' అని మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. తెలుగువారి ఆత్మగౌరవ నినాదంతో కొత్త పార్టీ పెడుతున్నట్టు చెప్పారు. తెలుగు ప్రజలను కలుపుకుని పోయేలా పార్టీ ఉంటుందని అన్నారు. తెలుగు జాతికి మేలు చేయడం కోసం తమ పార్టీ పనిచేస్తుందన్నారు.ఆత్మగౌరవంతో ఓటు వేయాలనుకునే వారి కోసం పార్టీ పెడుతున్నట్టు వెల్లడించారు. సమైక్యాంధ్ర కోసం పనిచేసిన వారందరినీ పార్టీలో చేర్చకుంటామన్నారు. పిరికితనమున్న చంద్రబాబుతో కలిసి పనిచేయడం తనకు అవమానకరమన్నారు. విభజనకు ముఖ్య కారకుడు చంద్రబాబేనని అన్నారు. విభజన ద్వారా తెలుగు ప్రజలకు ద్రోహం చేసింది చంద్రబాబే అన్నారు. తెలుగువారికి కాంగ్రెస్, బీజేపీ తీవ్ర అన్యాయం చేశాయని ధ్వజమెత్తారు. లాభనష్టాలు ఆలోచించకుండా విభజన చేశారని విమర్శించారు. తెలుగు జాతికి అన్యాయం చేసిన తర్వాత కాంగ్రెస్‌లో కొనసాగకూడదన్న ఉద్దేశంతో ఆ పార్టీ నుంచి బయటకు వచ్చానని వెల్లడించారు. తెలుగువారందరూ కలిసిమెలిసి ఉండాలన్నదే తమ పార్టీ లక్ష్యమన్నారు. -
కిరణ్ అలా చెప్పుకోవడం సిగ్గుచేటు: కిషన్‌రెడ్డి
హైదరాబాద్: మాజీ సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి పార్టీ పెట్టి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్‌రెడ్డి విమర్శించారు. ఎన్నికలకు ముందు పార్టీ పెడతారా, లేదా అనేది తేలాల్సివుందన్నారు. సమైక్య రాష్ట్రం కోసం రాజీనామా చేశానని కిరణ్ చెప్పుకోవడం సిగ్గుచేటని కిషన్‌రెడ్డి అన్నారు. కిరణ్ యువ కిరణాలు దళారులకు వెళ్లాయని ఎద్దేవా చేశారు. తెలంగాణ బిల్లు ఆమోదం విషయంలో బీజేపీదే కీలకపాత్ర అని కిషన్‌రెడ్డి అన్నారు. మార్చి 11న హైదరాబాద్‌లో జరగనున్న సభకు తమ పార్టీ అగ్రనేతలు రాజ్‌నాథ్ సింగ్, అరుణ్ జైట్లీ హాజరవుతారని చెప్పారు. -
కొత్త రాజకీయం
ప్రజాగ్రహానికి గురికాకుండా కాంగ్రెస్ పడవ నుంచి దూకేసిన జిల్లా ఎమ్మెల్యేలు ఏ ఒడ్డుకు చేరుకోవాలో తెలియక కొట్టుమిట్టాడుతున్నారు. దరి ఎంపిక చేసుకునే సమయంలో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి సొంత కుంపటి ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించడంతో కొంత అయోమయం చోటుచేసుకుంది. కొత్త పార్టీ ప్రకటన తర్వాత కిరణ్ సోదరుడు కిషోర్ జిల్లాలో పావులు కదపడం ప్రారంభించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఆకర్షించే పనిలో ఉన్నారు. అందులో భాగంగా పలువురితో మంతనాలు జరిపినట్టు తెలిసింది. దీంతో వారు ఎటూ తేల్చుకోలేక ఊగిసలాట ధోరణిలో ఉన్నారు. నిన్నటి వరకు అధికార పార్టీ పేరు చెప్పుకున్న వారు ఇప్పుడు కాంగ్రెస్ పేరు చెబితేనే ఈసడించుకుంటున్నారు. ప్రత్యామ్నాయం కనిపించక అంతే స్థాయిలో ఆందోళన చెందుతున్నారు. గంగాధరనెల్లూరు, పూతలపట్టు, మదనపల్లె, చిత్తూరు ఎమ్మెల్యేలు గుమ్మడి కుతూహలమ్మ, డాక్టర రవి, షాజహాన్‌బాషా, సీకే.బాబులు రాజకీయ భవిష్యత్తుపై నిర్ణయం తీసుకోలేని పరిస్థితి. మాజీ మంత్రి గల్లా అరుణకుమారి మాత్రం ఒక అడుగు ముందుకేశారు. శనివారం చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరేందుకు అనుచరులతో హైదరాబాద్ చేరుకున్నారు. అయితే ఆమె ఆశించినట్టుగా పెద్ద సంఖ్యలో ఆమె వెంట కాంగ్రెస్ శ్రేణులు వెళ్లలేదు. చంద్రగిరి నియోజకవర్గం నాయకులతో పాటు ఇద్దరుముగ్గురు పడమటి మండలాలకు చెందిన ద్వితీయశ్రేణి నాయకులు ఉన్నారు. పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ రవి, అరుణమ్మతో పాటు టీడీపీలో చేరుతారని ప్రచారం జరిగిన ప్పటికీ ఆయన ప్రస్తుతానికి ముఖం చాటేసినట్టు చెబుతున్నారు. సెల్ఫోన్లో కూడా అందుబాటులో లేరు. కిరణ్‌ను కలిసిన కుతూహలమ్మ మాజీ ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డితో గంగాధరనెల్లూరు ఎమ్మెల్యే గుమ్మడి కుతూహలమ్మ శుక్రవారం భేటీ అయ్యారు. మధ్యాహ్నంగా కిరణ్ ఇంటికి వెళ్లిన ఆమె గంటకు పైగా మంతనాలు జరిపినట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఆమె తెలుగుదేశం పార్టీలో చేరుతారని విస్తృతంగా ప్రచారం జరిగింది. అయితే కిరణ్‌తో భేటీ కావడంతో అనుమానాలకు తెరతీస్తోంది. భేటీ వివరాలు తెలియరానప్పటికీ ఏ పార్టీలో చేరాలన్న విషయమై డోలాయమానంలో ఉన్నట్టు సమాచారం. కుతూహలమ్మను కిరణ్ ఇంటికి రప్పించడంలో ఆయన సోదరుడు కిషోర్‌కుమార్‌రెడ్డి కీలకపాత్ర పోషించారని చెబుతున్నారు. కాగా మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్‌బాషా రెండు రోజులుగా అందుబాటులో లేరు. ప్రస్తుతం ఆయన ఢిల్లీలో ఉన్నట్టు చెబుతున్నారు. ఒకవైపు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులతో సంప్రదింపులు కొనసాగిస్తూనే మరోవైపు ఇతర ప్రత్యామ్నాయాల వైపు కూడా దృష్టి సారించారని సమాచారం. నియోజకవర్గ నాయకులతో ఆయన టచ్‌లో లేరు. షాజహాన్‌కు అత్యంత సన్నిహితుడైన మదనపల్లె వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీరాం చినబాబు టీడీపీలో చేరేందుకు అరుణమ్మతో హైదరాబాద్ వెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న షాజహాన్, అరుణమ్మపై ఆగ్రహంతో ఉన్నారని అంటున్నారు. శని, ఆదివారాల్లో హైదరాబాద్ చేరుకుంటారని చెబుతున్నారు. చిత్తూరు ఎమ్మెల్యే సీకే బాబు ఇంకా గుంభనంగా వ్యహరిస్తున్నారు. ఆయన ఎటువైపు మొగ్గుతారనేది ఊహకు అందడం లేదు. ప్రస్తుతం చిత్తూరు కార్పొరేషన్‌కు జరుగుతున్న ఎన్నికలపై ఆయన దృష్టి సారించారు. దీనికి సంబంధించిన కసరత్తు పూర్తి చేసిన తర్వాత ఒక నిర్ణయం తీసుకుంటారని సీకే అనుచరవర్గాలు అంటున్నాయి. నగరి మాజీ ఎమ్మెల్యే రెడ్డివారి చెంగారెడ్డి పరిస్థితి కూడా ఇంతే. మున్సిపల్ ఎన్నికలు ముగిసే వరకు భవిష్యత్తుపై నిర్ణయం తీసుకునే పరిస్థితుల్లో లేరని ఆయన అనుచరవర్గాల్లో ప్రచారం జరుగుతోంది. కిరణ్ పార్టీలోకి రెడ్డివారి రాజశేఖర్‌రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి నేతృత్వంలో ఏర్పాటు చేస్తున్న కొత్త పార్టీలో చేరేందుకు మాజీ ఎమ్మెల్యే రెడ్డివారి రాజశేఖర్‌రెడ్డి సన్నాహాలు చేస్తున్నారు. ఆ మేరకు చర్చలు జరిగినట్టు తెలిసింది. చంద్రగిరి నియోజకవర్గం నుంచి రాజశేఖర్‌రెడ్డి సతీమణి భార్గవిని పోటీ చేయించే విషయమై వారి మధ్య చర్చకు వచ్చినట్టు విశ్వసనీయ సమాచారం. అదేవిధంగా తిరుచానూరు మాజీ సర్పంచ్ సీఆర్ రాజన్‌తో సంప్రదింపులు జరుగుతున్నాయి. -
కిరణ్ కొత్త పార్టీ
* ఎట్టకేలకు ప్రకటించిన మాజీ సీఎం * 12న రాజమండ్రి సభలో పార్టీ పేరు, విధానాల ప్రకటన * తెలుగుజాతి ఆత్మగౌరవ పరిరక్షణే లక్ష్యం * కిరణ్ వెంట నలుగురు కాంగ్రెస్ బహిష్కృత ఎంపీలు, ఓ మాజీ మంత్రి సాక్షి, హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి ఎట్టకేలకు కొత్త పార్టీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈనెల 12న రాజమండ్రి బహిరంగ సభలో కొత్తపార్టీ పేరు, విధానాలు ప్రకటిస్తామన్నారు. తెలుగుజాతి ఆత్మగౌరవ పరిరక్షణ కోసమే పార్టీ పెడుతున్నామని, పార్టీలోకి అందరినీ ఆహ్వానిస్తున్నామని పిలుపునిచ్చారు. కిరణ్‌కుమార్‌రెడ్డి గురువారం తన ప్రైవేటు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి కొత్త పార్టీ గురించి ప్రకటన చేశారు. ఆ సమయంలో కాంగ్రెస్ బహిష్కృత ఎంపీల్లో కేవలం నలుగురు (లగడపాటి రాజగోపాల్, సబ్బంహరి, సాయిప్రతాప్, హర్షకుమార్), మాజీ మంత్రి పితాని సత్యనారాయణ, ఎమ్మెల్సీ రెడ్డపరెడ్డి మాత్రమే ఉన్నారు. కిరణ్ చెప్పిన మాటలు నమ్మి సొంతపార్టీని వీడి ఆయన వెంట నడిచిన నాయకులు తమ పరిస్థితి ఎటూ కాకుండాపోతోందని ఒత్తిడిచేయడంతో ఎట్టకేలకు పార్టీ ఏర్పాటుకు నిర్ణయించారని తెలుస్తోంది. ఆయనేమన్నారంటే... * రాష్ట్ర విభజన ద్వారా తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాంగ్రెస్, బీజేపీలు దెబ్బతీశాయి. బిల్లు రూపొందించిన తీరు, పార్లమెంటులో అప్రజాస్వామికంగా ఆమోదించిన విధానం సిగ్గుచేటు. * అధికార దాహంతోనే టీడీపీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు ప్రజలను మోసం చేశాయి. ఇద్దరూ విభజనకు అనుకూలంగా లేఖలు ఇచ్చారు. బాబు, జగన్‌లకు సీఎం పదవిలోకి ఏదోవిధంగా రావాలన్నదొక్కటే లక్ష్యం. * పురుడుపోసి తల్లిని చంపేశారని మోడీ చెబుతున్నారు. నలుగురు ఎంపీలు పోడియంలోకి వెళ్తే హృద యం గాయపడింద ని ప్రధాని అంటున్నారు. కానీ వీరెవ్వరూ తెలుగు ప్రజల గుండెకు తగిలిన గాయం గురించి ఆలోచించలేదు. * ప్రస్తుతం ఎన్నికల సంఘం కొత్తగా ‘నోటా’ (పైవారెవ్వరూ కాదు అన్న ఆప్షన్) పెడుతున్నందున రాష్ట్ర ప్రజలంతా ఆయా పార్టీలకు కాకుండా నోటాపై ఓటువేసే ఉద్దేశంతో ఉన్నారు. అలాంటి వారందరికీ విన్నవిస్తున్నాను. మీ ఆలోచనల మేరకు నడిచే, మీ ఆత్మగౌరవాన్ని పరిరక్షించేందుకు కొత్త పార్టీ పెడుతున్నాం. ‘నోటా’కు బదులుగా మాకు ఓటేయండి. * రాజమండ్రి బహిరంగసభలో పార్టీపేరు, విధానాలు, అధ్యక్షుడితోపాటు అన్ని విషయాలూ చెబుతాం. సీమాంధ్రతోపాటు, తెలంగాణలోని అన్ని స్థానాల్లో పోటీచేస్తాం. * నా జీవితం తెరచిన పుస్తకం. నాపై ఆరోపణలు చేస్తున్నవారు ఆధారాలు చూపించాలని సవాల్ విసురుతున్నాను. నేను చేసిన ప్రతి నిర్ణయం చట్టం, నిబంధనల ప్రకారమే జరిగింది. గవర్నర్‌కే కాదు ఎక్కడైనా ఫిర్యాదులు ఇచ్చుకోనివ్వండి. నన్నెవరూ ఏమీ చేయలేరు. * సీఎం నిర్ణయాలు తిరగదోడేందుకు గవర్నర్ ఎవరు? వచ్చే ప్రభుత్వాలు తిరగదోడొచ్చేమో కానీ గవర్నర్ ఎవరు? తిరగదోడితే మాత్రం ఏమవుతుంది? ఆయన కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకుంటే మంచిది. * రాష్ట్ర విభజనపై నేను సుప్రీంకోర్టును ఆశ్రయించా. ఏమవుతుందో చూడాలి. మాకు అన్ని పార్టీలూ ప్రధాన పోటీదారులే. * ఒకప్పుడు వేర్వేరుగా ఉన్న ఉభయ జర్మనీ దేశాలు గోడలు పగులకొట్టి మరీ ఏకంకాలేదా? ఇక్కడ అలా గోడలు కూడా లేవు కదా? -
నల్లారి కిరణం..‘తూర్పు’న తెల్లబోనుంది..!
పోరులో వైరిపక్షం గెలిచాక.. కత్తికి పదును పెడుతున్నట్టుంది మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి తీరు. రాష్ట్రం ముక్కలు కాకుండా చక్రం అడ్డువేస్తానన్న ఆయన వీరాలాపాలు ఉత్తర కుమార ప్రగల్భాలేనని విభజన బిల్లుకు పార్లమెంట్ ఉభయసభలు ఆమోదముద్ర వేశాక మాత్రమే పదవిని వీడినప్పుడే తేలిపోయింది. ఇప్పుడు తెలుగు ప్రజల ఆత్మగౌరవం, ప్రయోజనాల పరిరక్షణకు పార్టీ పెడతానన్న ఆయన పలుకులకు చిల్లిగవ్వ విలువ లేదని నిన్నటి వరకూ ఆయనను అంటి పెట్టుకుని ఉన్న నేతలే వ్యాఖ్యానిస్తున్నారు. ఈనెల 12న రాజమండ్రిలోనే పార్టీకి ‘పురుడు’ పోస్తానని ఆయన చెపుతున్నా.. ఈ జిల్లాలోనే ఆయన‘రాజకీయ మానస పుత్రిక’ను ముద్దు చేసే వారు కరువయ్యే పరిస్థితి నెలకొంది. సాక్షి, కాకినాడ : రాష్ర్ట విభజన తంతు పూర్తయ్యే వరకు ముఖ్యమంత్రి పదవిని పట్టుకొని వేలాడిన నల్లారి కిరణ్ కుమార్‌రెడ్డి ఎట్టకేలకు కొత్త పార్టీ పెడుతున్నట్టు ప్రకటించారు. ఈ నెల 12న రాజమండ్రిలో పార్టీ ఆవిర్భావ ప్రకటన చేస్తానని, అదేరోజు పార్టీ జెండా, అజెండాలను వెల్లడిస్తానని గురువారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చెప్పారు. అయితే అధికారంలో ఉన్నప్పుడు వెంట నడిచిన నేతలంతా నేడు ఆయన పార్టీలో చేరేందుకు ముఖం చాటేస్తున్నారు. ఇప్పటికే పలువురు వైఎస్సార్ సీపీ, టీడీపీల్లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకోగా మిగిలిన వారిలోనూ అత్యధికులు తాము కాంగ్రెస్‌లోనైనా ఉంటాము తప్ప కిరణ్ పార్టీలో చేరబోమంటూ తేల్చిచెబుతున్నారు.ఉవ్వెత్తున సాగిన సమైక్య ఉద్యమాన్ని నీరుగార్చడమే కాక విభజనలో తెరవెనుక కాంగ్రెస్ అధిష్టానానికి అన్ని విధాలా సహకరించిన కిరణ్ అంతా అయిపోయాకే పదవికి రాజీనామా చేశారు. తానే అసలు, సిసలు సమైక్యవాదినని ప్రగల్భాలు పలుకుతూ తెలుగుప్రజలనే కాదు తననే నమ్ముకున్న పార్టీ నేతలనూ నిలువునా ముంచారు. విభజన బిల్లు ఉభయసభల ఆమోదం పొందాక రాజీనామా చేసిన ఆయన పక్షం రోజుల పాటు మీడియాకు ముఖం చాటేశారు. కొత్త పార్టీ పెడతారని ప్రచారం జరిగినా ఇన్నాళ్లూ దాని గురించి పెదవి విప్పలేదు. కిరణ్‌ను నమ్ముకొని లోక్‌సభలో సమైక్య నాటకం రక్తికట్టించిన రాజమండ్రి, అమలాపురం ఎంపీలు ఉండవల్లి అరుణ్‌కుమార్, జీవీ హర్ష కుమార్ కాంగ్రెస్ నుంచి బహిష్కరణకు గురయ్యారు. ఇక సమైక్యాంధ్ర పేరుతో తమను నట్టేట ముంచిన కిరణ్ వెంట నడవలేమని మెజార్టీ ఎమ్మెల్యేలు ఎవరి దారి వారు చూసుకున్నారు. అధికారంలో ఉన్నప్పుడు కిరణ్ అడుగులకు మడుగులొత్తిన పలువురు ఎమ్మెల్యేలు ఇప్పుడు కిరణ్ పేరు చెబితేనే ముఖం చిట్లిస్తున్నారు. ‘మున్సిపల్ ఎన్నికలతో పాటు సార్వత్రిక ఎన్నికల షెడ్యూలూ విడుదలైంది. ఇప్పుడు కొత్త పార్టీ పెట్టడం వలన ఎలాంటి ప్రయోజనం లే’దని నిన్నమొన్నటి వరకు కిరణ్ వెంట నడిచిన నేతలే చెబుతున్నారు. వైఎస్సార్ సీపీలో చోటు దక్కని వారిలో పలువురు ఇప్పటికే టీడీపీలో చేరగా, మరికొంత మంది ఆ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇలాంటి సమయంలో కిరణ్ కొత్తపార్టీ జిల్లాలో ఎలాంటి ప్రభావం చూపదని విశ్లేషకులు భావిస్తున్నారు. జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలే కాదు.. ముఖ్యనేతలెవరూ కిరణ్‌తో వెళ్లే అవకాశం లేదని మాజీ మంత్రి తోట నరసింహం బాహాటంగానే చెప్పారు. ఇప్పుడు పార్టీ పెట్టడం వల్ల ఉపయోగం లేదని తుని ఎమ్మెల్యే రాజా అశోక్‌బాబు వ్యాఖ్యానించారు. తన ఉనికిని చాటుకునేందుకే కిరణ్ ఈ కొత్త పార్టీ ఎత్తుగడ వేశారని చెప్పుకొచ్చారు. పుట్టి మునిగాక పార్టీ పెట్టి లాభమేంటి..? ఇప్పటికే కాంగ్రెస్ క్యాడర్ దాదాపు ఖాళీ అయి పోయిందని, అలాంటప్పుడు ఈయన పార్టీ పెట్టడం వలన ప్రయోజనమేమిటని మరికొంతమంది నేతలు ప్రశ్నిస్తున్నారు. కిరణ్ పార్టీ పెడితే చేరతానంటూ బాహాటంగానే ప్రకటించిన రామచంద్రపురం ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకోగా అదేబాటలో మరో ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు పయనిస్తున్నట్టు సమాచారం. కాకినాడ రూరల్, పిఠాపురం ఎమ్మెల్యేలు కురసాల కన్నబాబు, వంగా గీత కూడా టీడీపీలో చేరనున్నట్టు తెలుస్తోంది. నిన్నకాక మొన్న ఇక రానున్న ఎన్నికల్లో పోటీ చేయనన్న అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి శేషారెడ్డితో పాటు ఏ పార్టీలోనూ అవకాశం లేని పాముల రాజేశ్వరీదేవి, పంతం గాంధీమోహన్లు మాత్రం కార్యకర్తలతో చర్చించి ఏ పార్టీలో చేరేదీ త్వరలో ప్రకటిస్తామంటూనే రాష్ర్టంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కిరణ్ పార్టీ ప్రభావం పెద్దగా ఉండబోదని చెప్పుకొచ్చారు. విభజనపై సీడబ్ల్యూసీ నిర్ణయం తీసుకున్నప్పుడే రాజీనామా చేసి, కొత్త పార్టీ పెట్టి ఉంటే ప్రయోజనం ఉండేదని, విభజనకు పరోక్షంగా అన్ని విధాలా సహకరించిన కిరణ్ మాటలు విశ్వసించేవారెవరూ నేడు లేరని పలువురు అంటున్నారు. కిరణ్ పార్టీ ప్రభావం ప్రస్తుతం జరుగుతున్న మున్సిపల్ ఎన్నికలపై కానీ, ఆ తర్వాత జరుగనున్న సార్వత్రిక ఎన్నికల్లో కానీ ఏమాత్రం ఉండదని రాజకీయ విశ్లేషకులే అంటున్నారు. ఇక ‘నేను ఎన్నికల్లో పోటీ చేయను.. పోటీ చేసినా గెలవను.. ఏ పార్టీలోనూ చేరను’ అంటూ కబుర్లు చెప్పిన ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌తో పాటు మరో ఎంపీ జీవీ హర్షకుమార్ కిరణ్ పార్టీ వెనుక మంత్రాంగం జరపడం హాస్యాస్పదంగా ఉందని సామాన్యులే వ్యాఖ్యానిస్తున్నారు. మొత్తం మీద నల్లారి వారి ‘కిరణం’ తూర్పున తెల్లబోక తప్పదన్న అభిప్రాయమే సర్వత్రా వ్యక్తమవుతోంది. -
ఇంకా ఊగిసలాటే..!
-
ఇంకా ఊగిసలాటే..!
* కొత్తపార్టీపై కిరణ్ ఎడతెరిపిలేని చర్చలు * ప్రజల్లో స్పందన లేదన్న సన్నిహితులు.. సందిగ్ధంలోనే మాజీ సీఎం సాక్షి, హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి కొత్త పార్టీ ఏర్పాటుపై ఇంకా ఊగిసలాటలోనే ఉన్నారు. గత కొద్దిరోజులుగా ఆయన తన అనుచర నేతలతో చర్చోపచర్చలు సాగిస్తున్నా పార్టీ ఏర్పాటుపై ఒక నిర్ణయానికి రాలేకపోతున్నారు. కిరణ్ తన మనసులోని అభిప్రాయాలను బయటపెట్టకుండానే నేతలతో చర్చలు కొనసాగిస్తుండడంతో వారు కూడా ఇదమిత్థంగా ఏమీ చెప్పలేకపోతున్నారు. ప్రజల్లో మరింతగా అప్రతిష్ట పాలవుతామంటూ ఒకరిద్దరు నేతలు పార్టీ ఏర్పాటు దిశగా ఒత్తిడి పెంచుతున్నా ప్రజల్లో స్పందన మాట అటుంచి తనతో కలసి వచ్చేవారెంత మంది ఉంటారో అర్థంకాక కిరణ్ ముందుకు వెళ్లాలా? లేదా? అన్న సందిగ్థంలో కొట్టుమిట్టాడుతున్నట్టు సమాచారం. ఎప్పటిలాగానే ఈ అంశంపై ఒకటీ రెండురోజుల్లో స్పష్టత ఇచ్చే అవకాశముందని కిరణ్ సన్నిహిత నేతలు పేర్కొంటున్నారు. మాజీ మంత్రులు పితాని సత్యనారాయణ, సాకే శైలజానాధ్, తోట నరసింహం, మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్, ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కందుల రాజమోహన్‌రెడ్డి, రేపాల శ్రీనివాస్, ఎమ్మెల్సీ రెడ్డపరెడ్డి, మాజీ డీసీసీ అధ్యక్షుడు అమాసరాజశేఖర్ చిత్తూరు జిల్లాకు చెందిన పలువురు నేతలు బుధవారం కిరణ్‌తో సమావేశమయ్యూరు. లోక్‌సభ, శాసనసభ సాధారణ ఎన్నికలకు షెడ్యూల్, తదితర అంశాలపై చర్చించారు. షెడ్యూల్ వచ్చేసినందున ఇక కొత్త పార్టీ ద్వారా ప్రజలకు చేరువయ్యేందుకు సమయం లేదన్న అభిప్రాయానికి నేతలు వచ్చారని తెలుస్తోంది. సమైక్యవాదం విన్పించినప్పటికీ.. తాజాగా పలు సంస్థలు నిర్వహించిన సర్వేల్లో కూడా ప్రజల్లో స్పందన వ్యక్తం కాలేదని, ఈ పరిస్థితుల్లో కొత్త పార్టీ ఏర్పాటుచేసినా ఫలితం ఉండదని నేతలు కిరణ్‌కు తెలిపారు. అంతిమంగా పార్టీ పెట్టాలా? వద్దా? అనే అంశంపై ఎలాంటి తుది నిర్ణయానికి రాకుండానే కిరణ్ ఈ భేటీని ముగించారు. గురువారం కూడా మరికొందరు నేతలతో సమావేశమైన తర్వాత నిర్ణయం వెలువడే అవకాశముందని కిరణ్ సన్నిహితుడొకరు తెలిపారు. -
కిరణ్ ఇచ్చిన పోస్టింగులన్నీ రద్దు
* ఐఏఎస్‌ల బదిలీలపై గవర్నర్ నరసింహన్ మార్కు సాక్షి, హైదరాబాద్: నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడానికి ఒకటీ రెండు రోజుల ముందు తన పేషీలో పనిచేస్తున్న కార్యదర్శులకు ఇచ్చిన కీలక పోస్టింగులను గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ రద్దు చేశారు. అజయ్ కల్లాం మినహా జవహర్‌రెడ్డి, ఎన్.శ్రీధర్, శంషీర్‌సింగ్ రావత్, సురేందర్‌ల బదిలీలను రద్దు చేశారు. వారిని ఇతర శాఖలకు బదిలీ చేశారు. కిరణ్‌కుమార్‌రెడ్డి హయాంలో ఇచ్చిన పోస్టింగ్‌లను ఒకటి తరువాత ఒకటి రద్దు చేస్తూ కొత్త పోస్టింగ్‌లు ఇస్తున్నారు. జెన్కో మేనేజింగ్ డెరైక్టర్‌గా బదిలీ అయిన శంషీర్‌సింగ్ రావత్ ఆ పోస్టులో చేరకముందే.. ఆయన్ను సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శిగా మంగళవారం బదిలీ చేశారు. అలాగే కిరణ్‌కుమార్‌రెడ్డి వద్ద కార్యదర్శిగా పనిచేసి, చివరలో నీటిపారుదల శాఖ కార్యదర్శిగా నియమితులైన జవహర్‌రెడ్డిపై కూడా బదిలీ వే టు వేశారు. ఆయన్ను పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శిగా నియమించారు. అక్కడ ముఖ్య కార్యదర్శిగా ఉన్న వి.నాగిరెడ్డిని నీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్శిగా నియమించారు. నీటిపారుదల శాఖలో చేరి కొద్ది రోజులైనా కాకముందే జవహర్‌రెడ్డిపై బదిలీ వేటు గమనార్హం. సాగునీటి శాఖ నుంచి బదిలీ అయిన ఆదిత్యనాథ్ దాస్‌ను తిరిగి అదే శాఖలో ముఖ్య కార్యదర్శిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇక కిరణ్ వెళ్తూ వెళ్తూ తన వద్ద ప్రత్యేక కార్యదర్శిగా పనిచేసిన ఎన్.శ్రీధర్‌ను ఏపీ బ్రూవరీస్, డిస్టిలరీస్, బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా నియమించగా.. ఇప్పుడు ఆయన్ను ప్రాధాన్యం లేని రాష్ట్ర విద్యా, సంక్షేమ మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ ఎండీగా నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి ఉత్తర్వులు జారీ చేశారు. ముఖ్యమంత్రి కార్యాలయంలో ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీగా పనిచేసిన సురేందర్‌ను కిరణ్ చివరిరోజున రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ ఎండీగా నియమించారు. అయితే అక్కడున్న ఎండీ సుధాకర్ క్యాట్‌ను ఆశ్రయించి స్టే తెచ్చుకున్న విషయం విదితమే. దీనితో సురేందర్‌ను ఏపీఐఐసీకి బదిలీ చేశారు. గవర్నర్ సంయుక్త కార్యదర్శిగా బసంత్‌కుమార్... గవర్నర్ నరసింహన్ తన వద్ద గతంలో సంయుక్త కార్యదర్శిగా పనిచేసి, తర్వాత ఐఏఎస్‌కు ఎంపికై చిత్తూరు జిల్లా జాయింట్ కలెక్టర్‌గా వెళ్లిన బసంత్‌కుమార్‌ను మళ్లీ రాజ్‌భవన్‌కు రప్పించుకున్నారు. బసంత్‌కుమార్‌ను గవర్నర్ సంయుక్త కార్యదర్శిగా నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) ఎండీగా ఉన్న రాహుల్ బొజ్జాను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రత్యేక కమిషనర్‌గా బదిలీ చేశారు. అలాగే రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ ఎండీ సీహెచ్ శ్రీధర్‌ను చిత్తూరు జాయింట్ కలెక్టర్‌గా బదిలీ చేశారు. కాగా హౌసింగ్‌బోర్డు ప్రత్యేక కమిషనర్‌గా బదిలీ అయిన భారతి హోళికేరి పోస్టింగ్‌ను రద్దు చేసి, ఆమెను ప్రస్తుతం ఉన్న హౌసింగ్ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్‌గా కొనసాగాలని పేర్కొంటూ మహంతి ఉత్తర్వులు జారీ చేశారు. ట్రైనీ ఐఏఎస్‌లకు పోస్టింగులు... ఈ మధ్యనే ఐఏఎస్‌లుగా ఎంపికైన ఆరుగురు అధికారులకు ప్రభుత్వం శిక్షణ నిమిత్తం వివిధ జిల్లాలకు జాయింట్ కలెక్టర్లుగా నియమించింది. డాక్టర్ ఎన్.సత్యనారాయణ (నల్లగొండ), డాక్టర్ సి.శ్రీధర్ (కృష్ణా), ఎ.మహ్మద్ ఇంతియాజ్ (నెల్లూరు), పి.కోటేశ్వరరావు (రంగారెడ్డి), ఎస్.అరవింద్‌సింగ్ (వరంగల్), ఎం.ప్రశాంతి (హైదరాబాద్) ఆరు నెలల పాటు శిక్షణ పొందుతారు. గవర్నర్ వద్దకు ‘ప్రాసిక్యూషన్ ఫైళ్లు’! రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన.. తన మార్క్ చూపిస్తున్న గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్.. తొలి ఝలక్‌గా మాజీ సీఎం చివరి సంతకాలపై నజర్.. ఈ పరిణామాలను బేరీజు వేసిన అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ).. ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులను కోర్టు మెట్లు ఎక్కించాలని యోచిస్తోంది. ఇందులో భాగంగానే సర్కారు వద్ద పెండింగ్‌లో ఉన్న ప్రాసిక్యూషన్ అనుమతుల ఫైళ్ల అంశాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ద్వారా గవర్నర్ దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించింది. మంగళవారం గవర్నర్‌తో మర్యాదపూర్వకంగా భేటీ అయిన ఖాన్.. ప్రాసిక్యూషన్ అనుమతి అంశాన్నీ ప్రస్తావించినట్లు తెలిసింది. ఈ లేఖపై రాజ్‌భవన్ నుంచి సానుకూల స్పందన వచ్చి ప్రాసిక్యూషన్‌కు అనుమతులు లభిస్తాయని ఏసీబీ అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఆక్టోపస్ పగ్గాలు జేవీ రాముడికి... ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (ఎస్పీఎఫ్) డెరైక్టర్ జనరల్ తేజ్‌దీప్ మీనన్‌ను రాష్ట్ర ప్రింటింగ్, స్టేషనరీ విభాగం కమిషనర్‌గా, ఆక్టోపస్ అదనపు డీజీపీ ఏబీ వెంకటేశ్వరరావును ఎస్పీఎఫ్ డీజీగా బదిలీ చేసింది. ఆక్టోపస్ బాధ్యతలను రాష్ట్ర ఆపరేషన్స్ విభాగం డీజీపీ జాస్తి వెంకటరాముడుకు అప్పగించింది. కాగా ఇంటెలిజెన్స్ ఎస్పీ రవికృష్ణను ఏపీఎస్పీ నాల్గో బెటాలియన్ (మన్ననూర్, వరంగల్) కమాండెంట్‌గా బదిలీ చేసింది. -
'సీఎంగా ఉన్నానో, లేదో తెలియడం లేదు'
-
'సీఎంగా ఉన్నానో, లేదో తెలియడం లేదు'
హైదరాబాద్: దొంగచాటుగా తెలంగాణ బిల్లును ఆమోదించారని కిరణ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. తెలుగుజాతికి అన్యాయం చేసింది కాబట్టే కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టానని వెల్లడించారు. తాను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసినా.. ఆపద్దర్మ సీఎంగా కొనసాగిస్తున్నారని అన్నారు. తాను సీఎంగా ఉన్నానో, లేదో తెలియడం లేదని వాపోయారు. మాదాపూర్ ఇమేజ్ గార్డెన్లో సీమాంధ్ర విద్యార్థులతో కిరణ్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... తెలుగు జాతికి మేలు చేసేందుకు యువతతో కలిసి పోరాటం చేస్తానన్నారు. బీఫారం ఇచ్చి సంకెళ్లు వేయాలని చూస్తే.. అది తనకు అక్కర్లేదన్నారు. చీకటి ఒప్పందాలు చేసుకుని రాష్ట్రాన్ని విభజిస్తే మనం ఒప్పుకోవాల్సిన అవసరం లేదన్నారు. అసెంబ్లీ తిరస్కరించిన బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టడం ప్రజలను అవమానించడమేనని చెప్పారు. ఎన్నో పార్టీలు వ్యతిరేకించినా బిల్లును ఆమోదింపజేసుకోవడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. విభజనతో సీమాంధ్ర యువత విద్య, ఉద్యోగ అవకాశాలు కోల్పోతారన్నారు. విభజనతో తెలంగాణకు ఎక్కువ నష్టమని తెలిపారు. విభజనపై సుప్రీంకోర్టుకు వెళ్లే ఆలోచనలో ఉన్నట్టు కిరణ్ చెప్పారు. కొత్త పార్టీ ఏర్పాటుపై సరైన సమయంలో నిర్ణయం ప్రకటిస్తానన్నారు. -
'కొత్త పార్టీ పెడుతున్నట్టు చెప్పలేదు'
హైదరాబాద్: కిరణ్‌కుమార్ రెడ్డితో ఎలాంటి రాజకీయాల గురించి చర్చించలేదని ఏపీఎన్జీవోల రాష్ట్ర అధ్యక్షుడు అశోక్‌బాబు తెలిపారు. మర్యాద పూర్వకంగానే కిరణ్‌ను కలిశామని చెప్పారు. ఈ సాయంత్రం కిరణ్‌కుమార్ రెడ్డితో సమావేశం ముగిసిన తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడారు. కొత్త పార్టీ పెడుతున్నట్టు కిరణ్ తమతో చెప్పలేదని తెలిపారు. ఒకవేళ పార్టీ పెట్టి మద్దతు తెలపాలని కోరితే తామంతా చర్చించి నిర్ణయం తీసుకుంటామని అశోక్‌బాబు చెప్పారు. అత్యంత దుర్మార్గంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చీల్చిన బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను సీమాంధ్ర ప్రజలు క్షమించరని అంతకుముందు అన్నారు. జరిగిన అన్యాయం గురించి కలత చెంద కుండా, నష్టాన్ని పూడ్చుకోవడంపై దృష్టి పెడతామన్నారు. ప్రజలు ఎన్నుకున్న రాజకీయ నేతలు మోసం చేసినందున, వచ్చే ఎన్నికల్లో స్వార్థపరులైన నాయకులను దూరం పెట్టాలన్నారు. -
'కిరణ్ పారిపోయినా చిరంజీవి ఉన్నారు'
హైదరాబాద్: సీఎం కిరణ్ కుమార్ రెడ్డి వ్యవహారాన్ని అసమర్థుని జీవయాత్ర నవలతో పోల్చారు మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్. సీఎం కిరణ్ కాంగ్రెస్‌కు ఎందుకు రాజీనామా చేశారో తెలియదని వ్యాఖ్యానించారు. కిరణ్ కొత్త పార్టీ పెట్టరనే అనుకుంటున్నట్టు చెప్పారు. కాంగ్రెస్ నుంచి కిరణ్ పారిపోయినా చిరంజీ విలాంటి నేతలు పార్టీలో ఉన్నారని అన్నారు. రాష్ట్రం రెండుగా చీలిపోవడానికి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డే ప్రధాన కారణమని నిన్న ఆరోపించారు. విభజనకు సహకరిస్తూ సీమాంధ్ర ప్రజలను మోసగించారని మండిపడ్డారు. ఢిల్లీ పెద్దలతో మాట్లాడుకుని రెండు ప్లాన్లు సిద్ధం చేసుకున్నారని చెప్పారు. ఏం చేసినా.. కిరణ్ మళ్లీ కాంగ్రెస్ టోపీయే పెట్టుకుని వస్తారని వెల్లడించారు. విభజన నిర్ణయం తీసుకున్నప్పుడే కిరణ్ రాజీనామా చేయాల్సిందని ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ ఢిల్లీలో అన్నారు. సీమాంధ్ర ప్రజలను మోసం చేయడానికే కిరణ్ ఇన్నాళ్లు పదవిలో కొనసాగారని ఆరోపించారు. కిరణ్ కొత్త పార్టీపై ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తోందో చూడాలని మాజీ మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. -
47రోజుల నాటకానికి తెర
-
సీఎం పార్టీ పెట్టినా భూస్థాపితమే: పాల్వాయి
హైదరాబాద్: ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి కొత్తపార్టీపెట్టినా, పెట్టకున్నా ఒక్కటేనని ఎంపీ పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. కిరణ్‌కుమార్‌రెడ్డి పార్టీ పెడతారో... ఆతరువాత రాజకీయంగా భూస్థాపితమే అవుతారో కానీ వాటితో తమకు సంబంధం లేదని తెలంగాణకు అడ్డుపడే ప్రయత్నాలేవీ ఫలించవని అన్నారు. బుధవారం ఆయన సీఎల్పీలో మీడియాతో మాట్లాడుతూ కిరణ్‌కు పిచ్చిపట్టి తెలంగాణ బిల్లును అడ్డుకుంటానని మాట్లాడుతున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి సోదరుడు వివాదాస్పద భూములను సెటిల్మెంట్లు చేస్తూ కోట్లాది రూపాయలుదండుకుంటున్నారని ఆరోపించారు. సీఎంను క్షణాల్లో తప్పించే అవకాశమున్నా సోనియా గాంధీ ఓపిక పడుతున్నారని, పగసాధిస్తున్నారన్న అభిప్రాయం ఏర్పడుతుందని వెనుకడుగు వేస్తున్నారే తప్ప వేటు వేయలేక కాదని స్పష్టంచేశారు. అక్రమాలకు పాల్పడుతున్న కిరణ్‌కుమార్‌రెడ్డి జైలుకు వెళ్లకతప్పదన్నారు. ఏఐసీసీ సమావేశంలో సమైక్యం పేరుతో గొడవ చేస్తే అక్కడి కార్యకర్తలు వారిని మెడపట్టి గెంటేస్తారని హెచ్చరించారు. అవినీతి అక్రమార్కులను పార్టీలో చేర్చుకోవద్దని ఏఐసీసీ సమావేశంలో తాను తీర్మానం ప్రవేశపెడతానని తెలిపారు. యువనేత రాహుల్‌గాంధీ పార్టీ ప్రభుత్వ పదవులు స్వీకరిస్తారని ఆశిస్తున్నామని పేర్కొన్నార. రాహుల్‌కు రాక్షస జాతికి చెందిన మోడీకి మధ్య యుద్ధం జరుగుతోందని అంతిమంగా రాహుల్ విజయం ఖాయమన్నారు. చంద్రబాబు జీవితం మొత్తం మోసాలతోనే గడిచిందని, ఆయనంత అబద్ధాల పుట్ట ఎవరూ లేరన్నారు. సోనియాకు ధన్యవాద తీర్మానం: పొంగులేటి తెలంగాణ ఇచ్చినందున పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి ఏఐసీసీ సవూవేశంలో ప్రత్యేక ధన్యవాద తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నామని ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి తెలిపారు. తెలంగాణ తీర్మానాన్ని వెనక్కు తీసుకోవాలని, ఈమేరకు ఏఐసీసీలో చర్చించాలని ఎంపీ లగడపాటి రాజగోపాల్ లేఖ రాయడం హాస్యాస్పదమన్నారు. సీఎల్పీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ సీడబ్ల్యూసీ తీర్మానం శిలాశాసనమని స్పష్టంచేశారు. చంద్రబాబు రెండుకళ్ల సిద్ధాంతంతో తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలోని రెండుచోట్లా భూస్థాపితం కావడం ఖాయమన్నారు. -
సర్కారుకు అప్పు తిప్పలు
* పడిపోయిన రాష్ట్ర ప్రభుత్వ రుణ పరపతి * నాలుగు నెలలుగా అడిగినంత అప్పు పుట్టని పరిస్థితి * సెక్యూరిటీల కొనుగోలుకు ఆర్థికసంస్థల వెనకడుగు * అప్పు దొరికినా దానిపై వడ్డీ రేట్లు పెరుగుతున్న వైనం * సర్కారుపై పెట్టుబడిదారులకు విశ్వాసం లేకపోవటంవల్లే! * తమిళనాడుకైతే అడిగిన దాని కన్నా ఎక్కువ అప్పులు సాక్షి, హైదరాబాద్: ఒకవైపు ‘ఉత్తమ ప్రభుత్వం’ అవార్డు వచ్చిందంటూ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి కొన్ని పత్రికల్లో పెద్ద పెద్ద ప్రకటనలు ఇస్తూ ప్రచారం చేసుకుంటున్నారు. మరోవైపు రాష్ట్రప్రభుత్వ రుణ పరపతి మాత్రం దారుణంగా పడిపోయింది. సీఎం కిరణ్ ‘ఉత్తమ పాలన’ ప్రభావమో లేక రాష్ట్ర విభజన కారణమో తెలియదు కానీ.. 4 నెలలుగా అడిగినంత అప్పు కూడా పుట్టని దుస్థితికి రాష్ట్ర ప్రతిష్ట దిగజారింది. ప్రతి నెలా ఆర్థికశాఖ సెక్యూరిటీల వేలం ద్వారా చేస్తున్న అప్పులే ఇందుకు నిదర్శనం. మరోవైపు తమిళనాడుకైతే అడిగిన దానికన్నా ఎక్కువగా అప్పుల్ని ఆర్థిక సంస్థలు మంజూరు చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్కుమాత్రం అడిగినదాని కన్నా తక్కువగా అప్పు పుడుతోంది. అలాగే చేస్తున్న అప్పులపై వడ్డీ శాతమూ పెరుగుతోంది. మిగతా రాష్ట్రా లకన్నా ఆంధ్రప్రదేశ్, బీహార్, ఉత్తర ప్రదేశ్లు చేస్తున్న అప్పులపై వడ్డీ శాతం అధికంగా ఉంటోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో భాగంగా సెక్యూరిటీల విక్రయం ద్వారా అప్పులు చేస్తుంది. ఇలా చేసిన అప్పులను ఆస్తుల కల్పన రంగాలకు వెచ్చిస్తుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సెక్యూరిటీల వేలంద్వారా రూ.27,700 కోట్లు అప్పు చేయాలని బడ్జెట్లో ప్రతిపాదించారు. ప్రతి నెలా ఆర్బీఐ ద్వారా సెక్యూరిటీలు వేలంవేసి అప్పు చేస్తారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు అడిగినంత రుణం పుట్టినప్పటికీ వడ్డీ 8 శాతం నుంచి 9.84 శాతం వరకు పెరిగిపోయింది. సెప్టెంబర్ నెల 10, 24 తేదీల్లో రెండుసార్లు, అక్టోబర్ 22న మరోసారి, మళ్లీ నవంబర్, డిసెంబర్ నెలల్లో రెండుసార్లు సెక్యూరిటీల వేలంతో అప్పుకు వెళ్లినా సర్కారు అడిగినంత అప్పు పుట్టలేదు. ఇందుకు ప్రధాన కారణం వేలంలో ఆర్థిక సంస్థలు ముందుకు రాకపోవడమేనని ఆర్థికశాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. తరచూ రాష్ట్రప్రభుత్వం అప్పులు చేయటంతోపాటు రాష్ట్ర విభజన ప్రభావమూ కొంతమేర పడిందని, అలాగే రాష్ట్రప్రభుత్వంపై పెట్టుబడిదారులకు విశ్వాసం కలగక పోవడమూ రుణపరపతి పడిపోవడానికి కారణమని ఉన్నతాధికారి ఒకరు విశ్లేషించారు. ఇదే సమయంలో తమిళనాడుకు అడిగినదానికన్నా రూ.400 కోట్ల నుంచి రూ.500 కోట్ల చొప్పున ఎక్కువగా అప్పుపుట్టింది. -
కిరణ్ ఎందుకిలా చేస్తున్నారు?
హైదరాబాద్: శాసనమండలిలో సీఎం కిరణ్ వ్యాఖ్యలపై వైఎస్ఆర్సీపీ శాసనసభాపక్ష ఉపనేత శోభానాగిరెడ్డి మండిపడ్డారు. విభజన విషయంలో బీహార్, యూపీ సంప్రదాయాలను పాటించాలని చెబుతున్న సీఎం- ఇక్కడెందుకు వాటిని అమలు చేయడం లేదని ప్రశ్నించారు. అక్కడ విభజన తీర్మానంపై చర్చ జరిగాకే బిల్లు పెట్టారని గుర్తు చేశారు. మరిక్కడ ఎందుకిలా చేస్తున్నారని నిలదీశారు. సీఎంగా మీ బాధ్యతలేంటో మీరు నిర్వహించాలని సూచించారు. సమైక్య ముసుగులో సోనియా గాంధీ ఆదేశాలను అమలు చేస్తున్నారని ఆరోపించారు. అసెంబ్లీలో తెలంగాణ బిల్లును ఓడిద్దామని గతంలో చెప్పిన సీఎం - శాసనసభా వ్యవహారాల కమిటీ(బిఏసి) సమావేశంలో ఎందుకు మౌనంగా ఉన్నారని అంతకుముందు ఆమె ప్రశ్నించారు. సీఎం కిరణ్ కుమార్ రెడ్డి వెంటనే రాజీనామా చేయాలని ఆమె డిమాండ్ చేశారు. -
'డిగ్గి డైరెక్షన్, నారా, నలారి యాక్షన్'
-
మొహం చాటేసిన కిరణ్, బాబు: శోభా నాగిరెడ్డి
హైదరాబాద్: విభజన బిల్లు అసెంబ్లీకి వచ్చినప్పుడు చూసుకుందామన్న సీఎం కిరణ్ ఇప్పుడు ఎక్కడ ఉన్నారని వైఎస్ఆర్ సీఎల్పీ ఉపనేత శోభా నాగిరెడ్డి ప్రశ్నించారు. తెలంగాణ ముసాయిదా బిల్లు అసెంబ్లీకి వస్తే కిరణ్, చంద్రబాబు మొహం చాటేశారని విమర్శించారు. వారం రోజులుగా ప్రెస్మీట్లు పెట్టిన చంద్రబాబు నాయుడు ఇప్పుడెక్కడ అని అడిగారు. కిరణ్, చంద్రబాబు కలిసి డ్రామాలాడుతున్నారని ఆరోపించారు. సోనియా అజెండాను బాబు, కిరణ్ కలిసి అమలు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు అన్ని పార్టీల నేతలు ఐక్యంగా రావాలని వైఎస్ జగన్ చెప్పారని తెలిపారు. విభజనపై టీడీపీ ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందని విమర్శించారు. టి.టీడీపీ ఎమ్మెల్యేలు స్పీకర్‌పై అవిశ్వాస నాటకమాడుతున్నారని శోభా నాగిరెడ్డి అన్నారు. -
మొహం చాటేసిన కిరణ్, బాబు: శోభా నాగిరెడ్డి
-
శ్రీవారి సేవలో సీఎం
సాక్షి, తిరుమల : ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి గురువారం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. మొదటి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచి ఆలయం వద్దకు చేరుకున్నారు. మహద్వారం వద్ద టీటీడీ ఈవో గిరిధర్ గోపాల్, జేఈవో కేఎస్ శ్రీనివాసరాజు అర్చకులతో కలసి సీఎంకు ఇస్తికఫాల్ స్వాగతం పలికారు. ముందుగా ధ్వజస్తంభానికి మొక్కుకుని బంగారువాకిలి ద్వారా కులశేఖరపడి వద్దకు చేరుకున్నారు. పచ్చకర్పూరపు వెలుగులో శ్రీవేంకటేశ్వర స్వామివారి దివ్యమంగళరూపాన్ని దర్శించుకున్నారు. స్వామి పాదాల వద్ద ఉంచిన పట్టు శేషవస్త్రాన్ని సీఎంకు బహూకరించారు. తర్వాత వకుళమాతను దర్శించుకుని హుండీలో కానుకలు సమర్పించారు. స్వామి దర్శనం తర్వాత సీఎం ఆలయం వెలుపలకు రాగానే కొందరు భక్తులు ‘జై సమైక్యాంధ్ర’ అంటూ నినదించారు. శ్రీవారి దర్శనం ముగించుకుని మధ్యాహ్న భోజనం తర్వాత 1.30 గంటలకు బయలుదేరి రేణిగుంట విమానాశ్రయం నుంచి హైదరాబాద్‌కు వెళ్లారు. గొల్ల మంటపంపై సీఎం ఆరా శ్రీవారి ఆలయం సమీపంలోని పురాతన గొల్ల మంటపంపై సీఎం ఆరా తీశారు. దీనిని కూల్చకపోతే ప్రమాదమని ఇటీవల నిపుణులు హెచ్చరించారు. అయితే, తమ మనోభావాలతో ముడిపడి ఉన్న మంటపాన్ని కూల్చివేస్తే అడ్డుకుంటామని యాదవసంఘ నేతలు హెచ్చరించారు. టీటీడీ తిరుమల జేఈవో కేఎస్ శ్రీనివాసరాజు ఈ వివాదాన్ని ఆయనకు వివరించారు. ఎవరి మనోభావాలకు ఇబ్బందులు లేకుండా పరిష్కరించాలని జేఈవోకు సీఎం సూచించినట్టు తెలిసింది. కాగా తిరుమల శ్రీవారి ట్రస్టులకు చెన్నైకి చెందిన టీబీ. రావు అనే భక్తుడు గురువారం రూ.50 లక్షలు విరాళంగా అందజేశారు. -
యూటీకి కిరణ్ ఓకే!
రాష్ట్ర విభజనపై సీఎం కిరణ్ డబుల్ గేమ్ ఆడుతున్నారు. ఆయన వేసుకున్న సమైక్యం ముసుగు క్రమంగా తొలిగిపోతోంది. సీమాంధ్రలో చాంపియన్ కావాలని కిరణ్ ఆడుతున్న నాటకాలు వెల్లడవుతున్నాయి. ముఖ్యమంత్రి పదవి పోయినా లెక్కచేయబోనని, రాష్ట్రాన్ని ముక్కలు చేయడానికి ఒప్పుకునేది లేదని కిరణ్ చెబుతున్న మాటలు ఉత్తర కుమార ప్రగల్భాలేనని స్పష్టమవుతోంది. విభజనకు సహకరిస్తూ బయటకు మాత్రం సమైక్యం అంటున్నారని అర్థమవుతోంది. రాష్ట్ర విభజన జరగనీయబోమని చెబుతూనే లోలోన మాత్రం ఆ విషయంలో అధిష్టానానికి తన పూర్తి సహకారాన్ని యథాతథంగా కొనసాగిస్తూనే ఉన్నారు. తాను కరడుగట్టిన సమైక్యవాదినని ప్రతి వేదికపైనా కిరణ్ డబ్బా కొట్టుకుంటున్నారు. సమైక్యాంధ్ర కోసం పదవీ త్యాగానికి కూడా సిద్ధమని చెబుతున్నారు. సీఎం పోస్టు తనకో లెక్కకాదన్నట్టు లెక్చర్లు దంచారు. ఎన్నికల కోసం రాష్టాన్ని విభజించాలనుకోవడం సరికాదంటూ సన్నాయి నొక్కులు నొక్కాయి. సమైక్యాంధ్ర కొనసాగుతుందని, తన తర్వాత సమైక్య రాష్ట్రానికి ముఖ్యమంత్రులు ఉంటారని జోస్యం చెప్పారు. బయటికి సమైక్యం అంటున్నా హైకమాండ్ ఒత్తిడికి ఆయన తలొగ్గినట్టు కనబడుతోంది. పైకి సమైక్యం అంటూనే విభజనకు ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతం చేస్తే విభజనకు తనకెలాంటి అభ్యంతరమూ లేదని అధిష్టానికి కిరణ్ స్పష్టంగా చెప్పినట్టు తెలుస్తోంది. సీమాంధ్రకు చెందిన ఇద్దరు కేంద్ర మంత్రులు సీఎంతో ఫోన్లో మాట్లాడుతూ యూటీ ప్రతిపాదన తెచ్చినప్పుడు ఆయన సానుకూలంగా స్పందించినట్టు సమాచారం. కేంద్ర మంత్రి జేడీ శీలం ఈ విషయాన్ని సూచాయగా వెల్లడించారు. హైదరాబాద్‌ను రెండేళ్లు యూటీ చేస్తే విభజనకు కిరణ్ అడ్డుచెప్పరని ఆయన చెప్పారు. ‘‘సీమాంధ్రకు కొత్త రాజధానిని నిర్మించుకోవడానికి కనీసం రెండు నుంచి నాలుగేళ్ల సమయం పడుతుంది. అందుకే అప్పటిదాకా హైదరాబాద్‌ను యూటీ చేయాలని కోరుతున్నాం. మా ప్రతిపాదనకు అంగీకరిస్తే విభజన బిల్లుకు సీమాంధ్ర ఎమ్మెల్యేలందరినీ ఒప్పిస్తాం’’ అని శీలం తెలిపారు. అంటే కిరణ్‌ను కూడా విభజనకు ఒప్పిస్తారా అని ప్రశ్నించగా, అందరిలో సీఎం కూడా ఒకరని బదులిచ్చారు. విభజనపై కిరణ్ డబుల్ గేమ్ ఆడుతున్నారని శీలం వ్యాఖ్యలతో తేలిపోయింది. అయితే ఇదంతా కాంగ్రెస్ హైకమాండ్ ఆడిస్తున్న నాటకమని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. రెండు ప్రాంతాల్లో పార్టీని కాపాడుకునే వ్యూహంలో భాగంగా కిరణ్‌తో సమైక్యం డ్రామా నడుపుతోందని అంటున్నాయి. మరోవైపు రాష్ట్రం విడిపోతే తన రాజకీయ భవిష్యత్ ప్రశ్నార్థకం అవుతుందని భావిస్తున్న కిరణ్ సొంత పార్టీ పెట్టే యోచనలో కూడా ఉన్నారని ఆయన సన్నిహితులు అంటున్నారు. సమైక్య ముసుగులో కిరణ్ ఆడుతున్న నాటకాలపై సమైక్యవాదులు మండిపడుతున్నారు. విభజనను అడ్డుకోవాలని కోరుతున్నారు. -
జర్నలిజంలోకి వస్తా: సీఎం కిరణ్
హైదరాబాద్: సీఎం సీటు ఖాళీ చేసిన తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి జర్నలిజంలోకి రానున్నారా అంటే అవుననే సమాధానం వస్తోంది. ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోతే పెన్ను పట్టుకుని పాత్రికేయుడి అవతారం ఎత్తుతానంటున్నారు నల్లారివారు. ఆయనే స్వయంగా ఈ మాట సెలవిచ్చారు. రాష్ట్రం విడిపోతే మీ రాజకీయ భవిష్యత్ ఏంటని విలేకరులు ప్రశ్నించగా.. 'రాజకీయాల్లో ఉండాలని ఏముంది. మీ వృత్తి(జర్నలిజం)లోకి కూడా ప్రవేశించొచ్చు' అంటూ సరదాగా సమాధానమిచ్చారు. తాను ముఖ్యమంత్రి పదవి చేపట్టి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయనీ వ్యాఖ్యలు చేశారు. అలాంటి పరిస్థితి పగవాడికి కూడా వద్దు సమైక్యాంధ్ర లేదా కాంగ్రెస్ పార్టీ ఏదోటి తేల్చువాలనే పరిస్థితి వస్తుందని కల్లో కూడా ఊహించలేకపోతున్నానని కిరణ్ చెప్పారు. ఇలాంటి పరిస్థితి పగవాడికి కూడా రాకూడదని కోరుకుంటున్నానని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రం సమైక్యంగానే కొనసాగుతుందన్న నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు తాను 16వ సీఎం అని... 17, 18 ముఖ్యమంత్రులు వస్తారంటూ వందో సీఎం కూడా ఎందుకు రాకుడదంటూ ప్రశ్నించారు. -
ఇది చంద్రబాబు పాలన-2 : రోజా
మూడేళ్ల కిరణ్ పాలనపై వైఎస్సార్ సీపీ నేత రోజా ధ్వజం కరెంటు, ఆర్టీసీ, గ్యాస్ ధరలన్నీ పెంచేశారు.. వైఎస్ చేపట్టిన సంక్షేమ పథకాలన్నీ నీరు గార్చేశారు సమైక్య సింహం పేరుతో విభజన నేతగా మారారు సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి వీర విధేయుడిగా ఉంటూ ఆమె కనుసన్నల్లో ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి మూడేళ్ల పాటు సాగించిన పాలనలో గొప్పలు చెప్పుకోవడం తప్ప చేతల్లో ప్రజలకు చేసిందేమీలేదని వైఎస్సార్ కాంగ్రెస్ సీఈసీ సభ్యురాలు, అధికార ప్రతినిధి ఆర్.కె. రోజా ధ్వజమెత్తారు. ఆమె పార్టీ కేంద్ర కార్యాలయంలో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కిరణ్ పాలన అంతా 2004కు ముందు టీడీపీ అధినేత ఎన్.చంద్రబాబు నాయుడు పాలన-2 మాదిరిగా ఉంది తప్పితే ఏ మాత్రం ప్రజలకు మేలు జరుగలేదన్నారు. వాస్తవానికి బాబు సలహాలతోనే కిరణ్ ఇలాంటి పాలనను కొనసాగించారని ఆమె అన్నారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో రాష్ట్ర ప్రజలను తామేదో ముందుకు తీసుకువెళ్లామని కిరణ్ పెద్దపెద్ద ప్రకటనలు ఇచ్చి చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ప్రజా సంక్షేమ పథకాల అమలును పూర్తిగా గాలికి వదిలేసిన కిరణ్.. అమలు చేసినవేమైనా ఉన్నాయి అంటే అవి, కరెంటు చార్జీలు పెంచడం, సర్‌చార్జిలను వడ్డించడం, ఆర్టీసీ బస్సు చార్జీలు, గ్యాస్ ధరలు పెంచడమేనని రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. బృహత్తరమైన ఆరోగ్యశ్రీ పథకం నుంచి 133 వ్యాధులను తొలగించిన ఘనత కిరణ్ సర్కారుదేనన్నారు. 108, 104 వాహనాలకు డీజిల్లేని పరిస్థితి, సిబ్బంది జీతాలివ్వని దుర్గతి ఆయన పాలనలోనేనని విమర్శించారు. వికలాం గుల, వితంతువుల, వృద్ధుల పెన్షన్లలో కోత విధించడం, ఉన్నత విద్యాభ్యాసం చేసే విద్యార్థులకు చెల్లించే ఫీజులపై పరిమితులు విధించి వారిని వేధించడం, వైఎస్ హయాంలో భారీగా చేపట్టిన పక్కా ఇళ్ల నిర్మాణానికి నిధులివ్వకపోవడం కిరణ్ హయాంలోనే జరిగిందన్నారు. వైఎస్ పథకాలకు కిరణ్ నీళ్లొదిలారు.. ప్రజల అవసరాలు ఏమిటో తెలుసు కనుక అందుకు అనుగుణంగా వైఎస్సార్ పథకాలను ప్రవేశపెడితే కిరణ్ వాటిని నిర్లక్ష్యం చేశారని రోజా అన్నారు. 2009 ఎన్నికల్లో వ్యవసాయ రంగానికి ఏడు నుంచి తొమ్మిది గంటల ఉచిత విద్యుత్, మరో పదికిలోలు అదనంగా సబ్సిడీ బియ్యం ఇస్తామని వైఎస్ ప్రజలకు ఇచ్చిన హామీలను కిరణ్ తుంగలో తొక్కారని ఆమె దుయ్యబట్టారు. ఇక రాష్ట్ర విభజన విషయానికి వస్తే.. పైకి సమైక్య సింహం మాదిరిగా పోజులు కొడుతూ లోలోపల ఢిల్లీ పెద్దలకు విభజనకు అన్ని విధాలా సహకరిస్తున్నారని ఆమె అన్నారు. కేంద్ర మంత్రివర్గం ముందుకు విభజన నోట్ రాకముందే అసెంబ్లీని సమావేశపర్చి సమైక్య తీర్మానం చేద్దామని తమ పార్టీ చెప్పినా కిరణ్ వినిపించుకోలేదని, నిజంగా ముఖ్యమంత్రి సమైక్యవాది అయి ఉంటే ఆ పని చేసేవారన్నారు. -
సీఎం హిట్ వికెట్
-
సీఎం హిట్ వికెట్
* సమైక్యవాది అనిపించుకునే యత్నంలో సీఎం సెల్ఫ్‌గోల్ * విభజనకు నిరసనగా ఢిల్లీ పర్యటన వాయిదా అంటూ సొంత చానల్లో ప్రచారం * అధిష్టానాన్ని ధిక్కరించి జీవోఎం భేటీకి వెళ్లడం లేదంటూ కథనాలు * బాలల దినోత్సవంలో పాల్గొనాల్సి ఉండడం వల్లే సీఎం ఢిల్లీ రాలేదని బయటపెట్టిన షిండే హోంమంత్రి ప్రకటనతో ఫెయిలైన సీఎం ప్లాన్ సాక్షి, హైదరాబాద్: విభజన నేపథ్యంలో కాంగ్రెస్ మట్టికరవనున్న సీమాంధ్రలో సమైక్య హీరో అనిపించుకోవడానికి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఈ దఫా తన మంత్రివర్గ సహచరుడు కన్నా లక్ష్మీనారాయణను టార్గెట్ చేసి పావులు కదిపారు. గురువారం సీఎం జీవోఎం ముందు హాజరై ప్రభుత్వ పరంగా విభజనపై పలు అంశాలను వివరించాల్సి ఉంది. కానీ అంతర్జాతీయ బాలల చలనచిత్ర కార్యక్రమ ప్రారంభోత్సవం ఉన్న కారణంగా కేంద్ర మంత్రికి సమాచారం ఇచ్చి ఆయన పర్యటన 18వ తేదీకి వాయిదా వేసుకున్నారు. అయితే సమైక్యం కోసం కట్టుబడి ఉన్నందునే సీఎం జీవోఎం భేటీకి వెళ్లడం లేదంటూ తన సొంత టీవీ చానల్లో ప్రచారం మొదలుపెట్టారు. భేటీకి రాకుండా అధిష్టానాన్ని ధిక్కరించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి కిరణ్‌ను మార్చి ఆ స్థానంలో కన్నా లక్ష్మీనారాయణను కూర్చోబెట్టాలని పెద్దలు నిర్ణయించారంటూ ఆయన సన్నిహితులతో లీకులిప్పించారు. తద్వారా కన్నాను దెబ్బతీయడంతోపాటు తనకుతానుగా సమైక్యం కోసం కట్టుబడి ఉన్నట్టుగా చిత్రీకరించుకునే వ్యూహంతో కిరణ్‌కుమార్ రెడ్డి ముందుకువెళ్లారు. అయితే ముఖ్యమంత్రి జీవోఎం ముందు హాజరుకాకపోవడానికి బాలల చలనచిత్రోత్సవ కార్యక్రమమే కారణమని స్వయంగా కేంద్ర హోం మంత్రి సుశీల్‌కుమార్ షిండే ప్రకటన చేయడంతో కిరణ్ ప్లానంతా ఫెయిలైంది. షిండే ప్రకటనతో కాంగ్రెస్ నేతలు ఖంగుతిని ఇదంతా కిరణ్ ఒక ఎత్తుగడ ప్రకారం చేసిన డ్రామాయేనని సాయంత్రానికి తేల్చుకున్నారు. ఉదయం నుంచి సాయంత్రందాకా లీకులే లీకులు.. రాష్ట్ర విభజనపై తమ ముందుకు రావలసిందిగా కిరణ్‌ను జీవోఎం ఆదేశించినట్లు, గురువారం రాత్రి 8 గంటలకు సమయాన్ని ఖరారు చేసినట్లు బుధవారమే సీఎం కార్యాలయవర్గాలు మీడియాకు సమాచారమిచ్చాయి. గురువారం సాయంత్రం నాలుగు గంటలకు సీఎం ఢిల్లీకి బయలుదేరనున్నట్లు కూడా బుధవారం ప్రకటించారు. అయితే గురువారం ఉదయానికే సీన్ మారిపోయింది. సీఎం కిరణ్ జీవోఎం ముందు హాజరయ్యేందుకు ఢిల్లీ వెళ్లడం లేదని టీవీ చానళ్లకు లీకులు అందాయి. దాంతో పాటు సొంత చానల్లో అదే విషయాన్ని ఊదరగొట్టారు. మంత్రుల బృందం రాష్ట్ర విభజన సమస్యలపై ఏర్పడినందున దాని ముందు హాజరుకావడమంటే విభజనకు అంగీకరించినట్లే అవుతుందని, అందుకే సీఎం కిరణ్ ఢిల్లీ పర్యటనను రద్దుచేసుకున్నారని వ్యూహాత్మకంగా ప్రచారం చేయించారు. సమైక్యవాదం కోసం అధిష్టానాన్ని, కేంద్రమంత్రుల బృందాన్నీ కిరణ్‌కుమార్‌రెడ్డి ఎదిరించి నిలబడుతున్నారన్న కలరింగ్ ఇప్పించారు. ఒకే దెబ్బకు ‘కన్నా’ వికెట్ కూడా.. కన్నా లక్ష్మీనారాయణ మూడు రోజుల కిందట సోనియాగాంధీని కలిసిన నేపథ్యంలో దీనిపైనా సీఎం ప్రచారాన్ని సాగించారు. సమైక్యవాదిగా సీఎం ధిక్కారస్వరం తీవ్రమైందని, అందుకే జీవోఎంకు వెళ్లడం లేదని, ఆయన్ను మార్చాలన్న ఆలోచనతోనే సోనియాగాంధీ స్వయంగా కన్నాను పిలిచి మాట్లాడారన్న కథనాలు ప్రసారమయ్యేలా చేశారు. నిజంగానే సీఎం అధిష్టానాన్ని, కేంద్రాన్ని ధిక్కరించే ఢిల్లీకి వెళ్లడం లేదా? అన్న అనుమానం వచ్చిన కొంతమంది తెలంగాణ నేతలు దీనిపై ఆరా తీస్తే అసలు విషయం బయటపడిందని చెబుతున్నారు. ఈనెల 25వ తేదీకి కిరణ్‌కుమార్‌రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టి మూడేళ్లు పూర్తవుతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో సమైక్య వాదం వినిపిస్తున్న కారణంగానే కిరణ్‌ను మార్చాలన్న ఆలోచనతో హైకమాండ్ ఉన్నట్టుగా ఆయనకు ఆయనే ప్రచారంలో పెట్టించడంతో పాటు ఇటీవలి కాలంలో తనకు దూరమైన కన్నా లక్ష్మీనారాయణను విభజన వాదిగా ముద్రవేయాలన్న ప్రణాళికబద్ధంగా ఇదంతా చేశారని కాంగ్రెస్‌లో గుప్పుమంటోంది. జీవోఎం సమయమే కేటాయించలేదు: యాదవరెడ్డి మంత్రుల బృందం కిరణ్‌కు గురువారం సమయమే కేటాయించలేదని జీవోఎం అధికారులు తమకు చెప్పారని తెలంగాణ ప్రాంత ఎమ్మెల్సీ యాదవరెడ్డి మీడియాకు చెప్పారు. మరికొందరు నేతలూ ఇదే అన్నారు. హైదరాబాద్‌లో జరుగుతున్న అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవాలకు కేంద్రమంత్రి మనీష్ తివారీ ముఖ్యఅతిథిగా హాజరవుతున్నందున సీఎం కూడా ఈ ఉత్సవాల్లో పాల్గొనాల్సి ఉంటుందని, అందుకు వీలుగా భేటీని వాయిదా వేయాలని కేంద్ర మంత్రే జీవోఎంకు లేఖ రాశారని, ఆ కారణంగానే సీఎం ఢిల్లీ పర్యటన 18కి వాయి దా పడిందని సాయంత్రానికి సీఎంవో మీడియాకు వివరణ ఇచ్చింది. సీఎం మార్పు ఉండదు: మంత్రులు తాజా కథనాలపై సీఎం సన్నిహిత మంత్రులు కూడా వేర్వేరుగా స్పందించారు. సీఎంను మార్చడం అంత సులభమైన విషయం కానేకాదని, విభజన నిర్ణయంతో ఇప్పటికే ఒక తప్పుచేసిన పార్టీ అధిష్టానం ముఖ్యమంత్రి మార్పుతో మరో తప్పు చేయబోదని రాష్ట్ర మంత్రి టీజీ వెంకటేష్ అన్నారు. ముఖ్యమంత్రి స్వచ్ఛందంగానైనా తప్పుకోవాలని, శాసనసభాపక్ష సమావేశం పెట్టయినా నిర్ణయం తీసుకోవలసి ఉందని అన్నారు. శాసనసభాపక్ష సమావేశంలో ఏక వాక్య తీర్మానంతో సీఎం ఎంపిక కుదరబోదని రాష్ట్ర న్యాయశాఖ మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి అన్నారు. ఈ సమయంలో ఎవరు ఢిల్లీకి వెళ్లినా సీఎం మార్పు జరుగుతుందనే ప్రచారం సాధారణమైపోయిందని అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయ బాలల చిత్రోత్సవం ప్రారంభోత్సవానికి కేంద్ర మంత్రి మనీష్ తివారీ హైదరాబాద్‌కు రావడంతో ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్లే కార్యక్రమాన్ని వాయిదా వేసుకున్నారని మరో మంత్రి శైలజానాథ్ తెలిపారు. ముఖ్యమంత్రిని మారుస్తున్నారనే ప్రచారం మీడియాలోనే జరుగుతోందని, తమకు మాత్రం ఎలాంటి సమాచారం లేదని స్పష్టంచేశారు. నా ప్రతిష్టను దెబ్బతీయడానికే: కన్నా తనపై జరిగిన ప్రచారాన్ని మంత్రి కన్నా లక్ష్మీనారాయణ గురువారం గుంటూరులో మీడియాతో మాట్లాడుతూ తీవ్రంగా ఖండించారు. తాను సమైక్యవాదినేనని, అధిష్టానంతో ఒప్పందం చేసుకున్నట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. దీనివెనుక ఎవరున్నారో త్వరలోనే బయటపెడతానన్నారు. తన ప్రతిష్ట దెబ్బతీయడానికి ఇదంతా జరిగిందన్నారు. -
నేడు ఢిల్లీకి ముఖ్యమంత్రి
* జీవోఎంతో సమావేశం * 21న కేంద్ర మంత్రివర్గానికి టీ-బిల్లు * ఆ రోజే ఆమోదం, రాష్ట్రపతికి నివేదన * బిల్లును అసెంబ్లీకి పంపనున్న ప్రణబ్ సాక్షి, న్యూఢిల్లీ/హైదరాబాద్: విభజన ప్రక్రియ మరింత వేగం పుంజుకుంది. తెలంగాణ బిల్లు చకచకా సిద్ధమవుతోందని, దాన్ని నవంబర్ 21న కేంద్ర మంత్రివర్గానికి సమర్పించనున్నారని సమాచారం. అదే రోజున బిల్లుకు మంత్రివర్గం ఆమోదం కూడా తెలుపుతుందని జోరుగా ప్రచారం జరుగుతోంది. విభజన విధి విధానాలపై ఏర్పాటైన కేంద్ర మంత్రుల బృందం తాను కేంద్ర మంత్రివర్గానికి సమర్పించాల్సిన నివేదికకు ఇప్పటికే తుది రూపునిస్తోంది. రాష్ట్రానికి చెందిన పార్టీలతో భేటీలు పూర్తి చేసిన జీవోఎం, కేంద్ర శాఖల కార్యదర్శులతో సమావేశాలను కూడా గురువారంతో ముగించనుంది. గురువారం రాత్రి ముఖ్యమంత్రితో కూడా సమావేశమయ్యాక నివేదిక కసరత్తును అది వేగవంతం చేయనుంది. రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులతో ఈ నెల 18న జరిపే భేటీతో జీవోఎం పని పూర్తవుతుంది. ఆ వెంటనే అది నివేదికను పూర్తి చేసి ఈ నెల 21న జరగనున్న కేంద్ర మంత్రివర్గ సమావేశంలో సమర్పించనుంది. జీవోఎం నివేదికతో పాటే తెలంగాణ బిల్లు కూడా సిద్ధమవుతుందని, దానికి 21నే మంత్రివర్గం ఆమోదం కూడా తెలుపుతుందని చెబుతున్నారు. అనంతరం తెలంగాణ బిల్లును రాష్ట్రపతికి పంపుతారు. బిల్లును పరిశీలించే క్రమంలో రాష్ట్రపతి తన విచక్షణాధికారాలను ఉపయోగించే ఆస్కారముంది. అవసరమనుకుంటే మరింత స్పష్టత, వివరణ వంటివి కోరుతూ బిల్లును మంత్రివర్గానికి ఆయన తిప్పి పంపవచ్చు. అనంతరం బిల్లుపై అభిప్రాయం తెలపాల్సిందిగా కోరుతూ శాసనసభకు ఆయన పంపుతారు. అభిప్రాయం తెలిపేందుకు అసెంబ్లీకి ఎంత గడువివ్వాలన్నది కూడా రాష్ట్రపతి విచక్షణకు లోబడే ఉంటుంది. అసెంబ్లీని ప్రొరోగ్ చేయనందున, మూడు రోజుల ముందు నోటీస్ జారీ చేసి దాన్ని సమావేశపరిచే అధికారం స్పీకర్‌కు ఉంటుంది. రాష్ట్రపతి నుంచి బిల్లు అందిన మూడు నాలుగు రోజుల్లోనే అసెంబ్లీని స్పీకర్ సమావేశపరుస్తారని జీవోఎం వర్గాలంటున్నాయి. అంతా కేంద్రం అనుకున్నట్టుగా జరిగితే డిసెంబర్ 5న ప్రారంభం కానున్న పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టే అవకాశముందని ఆ వర్గాలు తెలిపాయి. అంతేగాక మొత్తం ప్రక్రియనూ సాధ్యమైనంత త్వరలో పూర్తి చేస్తామన్నాయి. నేడు ఢిల్లీ వెళ్లనున్న సీఎం ఓడరేవులు, రైల్వే, ఆర్థిక, న్యాయ శాఖల కార్యదర్శులతో జీవోఎం గురువారం భేటీ కానుంది. కార్యదర్శులతో దాని చర్చలు అక్కడితో ముగుస్తాయి. రాత్రి 8 గంటలకు జీవోఎం ముందు హాజరవాలంటూ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి ఆహ్వానం అందింది. దాంతో గురువారం సాయంత్రం ఆయన ఢిల్లీ వెళ్లనున్నారు. విభజనకు సంబంధించి సీమాంధ్రలో చేపట్టాల్సిన అంశాలను వివరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే జీవోఎంకు సవివరంగా నివేదిక సమర్పించడం తెలిసిందే. ఈ తరుణంలో కిరణ్ కూడా తన అభిప్రాయాలను జీవోఎం ముందుంచనున్నారు. ఆ భేటీ అనంతరం కేంద్రంలోని ముఖ్య నేతలతోనూ ఆయన భేటీ కానున్నారు. తరువాత నేరుగా విశాఖ జిల్లాకు చేరుకుని, అక్కడ జరిగే రచ్చబండ కార్యక్రమాలకు హాజరవుతారని సీఎంవో వర్గాలు వివరించాయి. పూర్తయిన మొక్కుబడి మరోవైపు నివేదిక రూపకల్పనలో జీవోఎం బిజీగా ఉంది. జీవోఎం సారథి, కేంద్ర హోం మంత్రి సుశీల్‌కుమార్ షిండే, సభ్యులు చిదంబరం, ఎ.కె.ఆంటోనీ, గులాంనబీ ఆజాద్, వీరప్ప మొయిలీ, నారాయణస్వామి తదితరులు తమ రోజువారీ కార్యక్రమాలను పక్కనబెట్టి మరీ కొద్ది రోజులుగా పనుల్లోనే తలమునకలుగా ఉన్నారు. రాష్ట్ర పార్టీలతో జీవోఎం రెండు రోజుల పాటు జరిపిన చర్చలు బుధవారం ముగిశాయి. ఎంఐఎం, బీజేపీ, సీపీఐ, కాంగ్రెస్, టీఆర్ఎస్లతో మంగళవారం, విభజనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సీపీఎం, వైఎస్సార్సీపీలతో బుధవారం జీవోఎం చర్చలు జరిపింది. ఇక విభజనపై వైఖరిని ఎటూ తేల్చకుండా గోడ మీద పిల్లివాటం ప్రదర్శిస్తున్న టీడీపీ మాత్రం జీవోఎం ముందుకు రాలేదు. విభజనకు అనుకూలంగా ఉన్న పార్టీలను ప్రధానంగా హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతం చేయడం, ఉమ్మడి రాజధాని పరిధి, ఆదాయ పంపిణీ గురించే జీవోఎం ప్రశ్నించింది. యూటీ ప్రతిపాదనను అవన్నీ తిరస్కరించడం, హైదరాబాద్‌పై కేంద్రం పెత్తనాన్ని అంగీకరించబోమని తేల్చిచెప్పడం తెలిసిందే. కాంగ్రెస్ మాత్రం యథాప్రకారంగా తన డబుల్ గేమ్‌ను కొనసాగించింది. ఆ పార్టీ తరఫున ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ విభజనకు అనుకూలంగా, మంత్రి వట్టి వసంతకుమార్ వ్యతిరేకంగా వాదన వినిపించారు. వైఎస్సార్సీపీతో జరిపిన 20 నిముషాల భేటీలో మాత్రం జీవోఎం సభ్యులు ఏ అంశాన్నీ ప్రస్తావించకుండా మౌనముద్ర దాల్చారు. పార్టీ ప్రతినిధులు ఎం.వి.మైసూరారెడ్డి, గట్టు రామచంద్రరావు చెప్పిన అంశాలను వినడానికే పరిమితమయ్యారు. పైగా వారడిగిన పలు ప్రశ్నలకు సభ్యులు తెల్లమొహాలు వేసినట్టు సమాచారం. ఇక సీపీఎంతో భేటీని 10 నిమిషాల్లో ముగించారు. పైగా మంగళవారం ఐదు పార్టీలతో చర్చలకు జీవోఎం సభ్యుల్లో దాదాపు అందరూ హాజరవగా బుధవారం సీపీఎం, వైఎస్సార్సీపీలతో చర్చలకు మాత్రం ముగ్గురే వచ్చారు! మొత్తంమీద పార్టీలతో చర్చలను తూతూమంత్రంగా ముగించారు. అన్ని పార్టీలతోనూ చర్చించామని నివేదికలో పేర్కొనడానికి మినహా వీటితో జీవోఎం సాధించిందంటూ ఏమీ లేదు. పార్టీలు పేర్కొన్న అభిప్రాయాలను నివేదికలో యథాతథంగా పొందుపరచనున్నారు. -
ఢిల్లీలా హైదరాబాద్
-
ఢిల్లీలా హైదరాబాద్
* హెచ్ఎండీఏ పరిధిలో ఉమ్మడి రాజధాని.. శాంతిభద్రతలు కేంద్రం చేతిలో.. * విభజనకు మార్గనిర్దేశనం చేసిన కిరణ్ ప్రభుత్వం * సమైక్యవాదినని చెప్పుకొంటూ విభజనకు ఆది నుంచీ సీఎం పూర్తి సహకారం * తాజాగా విభజన ఎలా చేయాలో చెబుతూ కేంద్రానికి సీఎస్ ద్వారా ప్రత్యేక నివేదిక * ఇరు రాష్ట్రాలకు పదేళ్ల పాటు ఒకే గవర్నర్ ఉండేలా చర్యలు తీసుకోవాలి.. * డీఎస్సీ, జోనల్ పోస్టుల్లో నియమితులైన స్థానికేతరులను ఇక్కడే ఉంచాలి.. * సీమాంధ్ర ఉద్యోగులు ఇక్కడే ఉంటామంటే సూపర్ న్యూమరరీ పోస్టులు సృష్టించాలి.. * భద్రాచలాన్ని తూర్పుగోదావరి జిల్లాలో, మునగాలను కృష్ణా జిల్లాలో కలపాలంటూ సూచనలు ఢిల్లీ నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: సమైక్య చాంపియన్.. అంటూ తన గురించి తాను ప్రచారం చేయించుకుంటున్న ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్ రెడ్డి అసలు ‘విభజన’ రూపం మరోసారి బట్టబయలైంది. విభజన తుపాన్‌ను ఎలాగైనా అడ్డుకుంటానని పైకి చెబుతూ.. మరోవైపు అధిష్టానానికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్న ఆయన.. విభజన అసలు ఎలా ఉండాలన్నదానిపై ఇటీవల తన ప్రభుత్వ యంత్రాంగంతో ఒక కీలక మార్గదర్శక నివేదిక తయారు చేయించారు. రాష్ట్రాన్ని ఎలా విభజించాలో.. హెచ్ఎండీఏలో ఎంత పరిధిని ఉమ్మడి రాజధానిగా చేయాలో.. రెండు ప్రాంతాల ఉద్యోగులను ఎలా పంచాలో చెబుతూ ఆ నివేదికలో పలు సిఫార్సులు చేశారు. ఆ నివేదిక ద్వారా విభజనలో తన కోర్కెల చిట్టాను కేంద్ర ప్రభుత్వానికి పంపారు. వారం కిందటే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి.కె.మహంతి దాన్ని కేంద్రానికి సమర్పించారు. నివేదికలోని వివరాలు తాజాగా వెల్లడయ్యాయి. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ(హెచ్ఎండీఏ) పరిధినంతటినీ ఉమ్మడి రాజధాని కిందకు తెచ్చి.. శాంతిభద్రతల అంశాన్ని ఢిల్లీ తరహాలో కేంద్ర ప్రభుత్వం పర్యవేక్షించాలని అందులో కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. దీంతోపాటు.. సీమాంధ్ర ప్రజలు ప్రధానంగా హైదరాబాద్‌పైనే ఆందోళన చెందుతున్నారని, వారి రక్షణ, ఆస్తుల పరిరక్షణకు సంబంధించి న్యాయ, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ రెండు రాష్ట్రాలకు పదేళ్ల పాటు ఒకే గవర్నర్ ఉండేలా విధానం రూపొందించాలని సలహా ఇచ్చారు. ఉద్యోగుల పంపిణీ, ఉద్యోగ నియామకాలకు సంబంధించి 371డి, ఆస్తులు, ఆదాయం పంపిణీలకు సంబంధించి ఆయన పలు సూచనలు చేశారు. నివేదికలో చేసిన కీలక సిఫార్సులివీ.. ఆ ఉద్యోగుల్ని ఇక్కడే కొనసాగించాలి.. తెలంగాణ ప్రాంతంలోని జిల్లా ఎంపిక కమిటీల(డీఎస్సీ) ద్వారా 20 శాతం, జోనల్ పోస్టుల్లో 30 శాతం ఓపెన్ కేటగిరీ కింద ఎంపికైన సీమాంధ్ర ఉద్యోగులను ఇక్కడే కొనసాగించాలి. తమ రాష్ట్రానికి వెళ్లాలని ఉద్యోగులు కోరే వరకు వారిని ఇక్కడే కొనసాగించాలి. ఇదే సూత్రాన్ని సీమాంధ్రలో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులకు కూడా వర్తింపజేయాలి. ఎక్కువ మంది ఉద్యోగులు హైదరాబాద్‌లో ఉండాలని భావిస్తే పోస్టులు లేకపోయినా సూపర్ న్యూమరరీ పోస్టులు సృష్టించి వారిని కొనసాగించాలి. అఖిల భారత సర్వీసులోని ఉద్యోగులకు వారి నివాసం, స్థానికత అంశాల ఆధారంగా ఆప్షన్ కల్పించాలి. భార్యా భర్తలు ఒకే చోట పని చేసేవారు, తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నవారు, రెండేళ్లలో పదవీ విరమణ చేసే ఉద్యోగులకు విభజన నుంచి మినహాయింపు ఇవ్వాలి. పదవీ విరమణ చేసిన ఉద్యోగులు చాలా మంది హైదరాబాద్‌లో స్థిర నివాసాలు ఏర్పరచుకున్నారు. ఆరోగ్యం, విద్య, ఉద్యోగావకాశాలను దృష్టిలో ఉంచుకుని ఇక్కడ ఉంటున్నారు, ఈ నేపథ్యంలో రాష్ట్ర విభజన అనంతరం సీమాంధ్ర పెన్షనర్లను వారి రాష్ట్రానికి పంపరాదు. ఇదే సూత్రాన్ని సీమాంధ్రలో స్థిరనివాసం ఏర్పాటు చేసుకున్న తెలంగాణ పెన్షనర్లకు వర్తింప చేయాలి. అధికరణ 371(డి) ఎత్తివేస్తే ఏ ప్రాతిపదిక ఆధారంగా నియామకాలను జరుపుతారో స్పష్టం చేయాలి. 1956కు పూర్వం ఉన్న ప్రకారమే విభజన.. 1956కు పూర్వం ఉన్న ప్రకారమే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలి. ఖమ్మం జిల్లాలోని భద్రాచలం డివిజన్‌ను తూర్పుగోదావరి జిల్లాలో కలపాలి. ప్రస్తుతం నల్లగొండ జిల్లాలోని మునగాల మండలాన్ని కృష్ణా జిల్లాలో కలపాలి. రెండు రాష్ట్రాల ఏర్పాటు అనంతరం అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలను పునర్వ్యవస్థీకరించాలి. నదీ జలాలను యథాతథంగా కొనసాగించాలి. విభజన వల్ల నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టులు రెండుగా చీలిపోతాయి. హైదరాబాద్‌కు నీటి పంపిణీ చాలా క్లిష్టమైన సమస్య అవుతుంది, దాని పరిష్కారానికి చట్టబద్ధమైన అధికారాలు కావాలి. ప్రస్తుతం ఉన్న నీటి కేటాయింపులను ఇరు రాష్ట్రాలకు నిజాయితీగా ఆమోదయోగ్యమయ్యేలా పంపిణీ చేయడానికి అవసరమైన యంత్రాంగా న్ని ఏర్పాటు చేయాలి. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి రూ.1,10,000 కోట్లు అవసరం కాగా ఆంధ్రా ప్రాజెక్టులకు దాదాపు రూ. 29,029 కోట్లు(26.39%), రాయలసీమ ప్రాజెక్టులకు రూ. 7,700 కోట్లు(7 శాతం), తెలంగాణ ప్రాజెక్టులకు దాదాపు రూ. 73,216 కోట్లు(66.56%) అవసరం. ఎత్తిపోతల ద్వారా నడిచే తెలంగాణ ప్రాజెక్టులకు 6,489 మెగావాట్లు విద్యుత్ అవసరం ఉంటుంది. ఇందుకు రూ.38,000 కోట్ల మూలధనం కావాలి. ఆస్తులు-ఆదాయం పంపిణీ రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆస్తులు, ఆదాయ పంపిణీ జనాభా ప్రాతిపదికన చేయాలి. ఆర్టీసీ, ఏపీ, జెన్కో, ఏపీ ట్రాన్స్‌కో, సింగరేణిలో తెలంగాణకు 42 శాతం వాటా ఇవ్వాలి. గనుల నుంచి వచ్చే రాయల్టీని ఏ రాష్ట్రానికి చెందినది ఆ రాష్ట్రానికే ఇవ్వాలి. ఆర్టీసీ ప్రాంతీయ కార్యాలయాలను ప్రాంతాల వారీగా విభజించినా, హైదరాబాద్‌లోని ఆస్తులు బ్యాంకుల్లో తాకట్టు ఉన్నందున జనాభా నిష్పత్తి ఆధారంగా ఆస్తులు, అప్పులు పంపిణీ చేయాలి. కొత్త రాజధానిలో పూర్తిగా పన్ను మినహాయింపు ఇవ్వాలి. రాష్ట్ర విభజన అనంతరం హైదరాబాద్‌లోని ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్న సీమాంధ్ర ఉద్యోగులను వెళ్లిపోమనే అవకాశం ఉంది... ఈ నేపథ్యంలో వారికి రక్షణ, ఉపాధి అవకాశాలను కొనసాగించేందుకు తగిన యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలి. -
ఏ మొహం పెట్టుకొని తెలంగాణకు వస్తావ్?
కరీంనగర్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అడుగడుగునా అడ్డుపడుతూ.. సమైక్యాంధ్రే తన లక్ష్యం అని చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తెలంగాణ ప్రాంతంలో ఏమొహం పెట్టుకొని రచ్చబండకు వస్తారో స్పష్టం చేయాలని టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు డిమాండ్ చేశారు. కరీంనగర్లో ఆదివారం ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌తో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రచ్చబండ పేరిట తెలంగాణలో పర్యటించే ప్రయత్నం చేస్తున్న ముఖ్యమంత్రికి ఈ ప్రాంతంలో అడుగుపెట్టే నైతిక అర్హత లేదన్నారు. సీమాంధ్రలో జరుగుతున్న ఉద్యమం దృష్ట్యా మూడు నెలలపాటు రచ్చబండను వాయిదా వేసిన సీఎం తెలంగాణలో పర్యటించాలనే దురుద్దేశంతోనే మళ్లీ ఆ కార్యక్రమాన్ని తలపెట్టారని ఆరోపించారు. ఏడాదిన్నర క్రితం జరిగిన రచ్చబండ అర్జీలు ఏమయ్యాయి, ఎన్ని నిధులు కేటాయించారు, ఏం అభివృద్ధి జరిగిందో వెల్లడించాలన్నారు. రైతుల ఆత్మహత్యల పరంపర కొనసాగుతున్నా తడిసిన ధాన్యాన్ని, పత్తిని కొనుగోలు చేయడం లేదని, సీసీఐ జాడే లేదని తెలిపారు. సమస్యలతో సతమతమవుతున్న తెలంగాణ రైతుల బాధలు పట్టని ముఖ్యమంత్రి రచ్చబండ పేరిట ఎందుకు అడుగుపెడుతున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. ‘తెలంగాణకు ఏం చేశారని మీ మోహం చూడమంటారు.. అసెంబ్లీ సాక్షిగా ఒక్క పైసా కూడా ఇవ్వను రాసిపెట్టుకో అంటూనే.. చిత్తూరు జిల్లాకు రూ.5,800 కోట్ల నిధులను తీసుకెళ్లినందుకా? రెండో మెడికల్ కాలేజీని సైతం చిత్తూరులో పెట్టుకున్నందుకా? తెలంగాణ రైతులకు ఒక్క పైసా ఇవ్వకుండా సీమాంధ్రలో పై-లీన్ తుపాను బాధితులకు కోట్లు కేటాయించినందుకా? నీ మొహం చూసేది..’ అని ప్రశ్నించారు. సమైక్యవాదులను తెలంగాణలో తిరగనివ్వమన్న మంత్రులు జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఇతర కాంగ్రెస్ నేతలు మాటకు కట్టుబడి ఉండాలని కోరారు. ఇటీవల నల్లగొండకు వచ్చిన వైఎస్.విజయమ్మను అడ్డుకున్న కాంగ్రెస్ నేతలు, సమైక్యరాగం ఆలపిస్తున్న ముఖ్యమంత్రిని కూడా అడ్డుకోవాలని, లేనట్టయితే ప్రజలే తగిన బుద్ధి చెప్పే రోజులు వస్తాయని హెచ్చరించారు. కిరణ్‌తో రచ్చబండలో పాల్గొనే మంత్రులు తెలంగాణ ద్రోహులుగా మిగిలిపోతారని హెచ్చరించారు. విజయమ్మను అడ్డుకున్న కాంగ్రెస్ శ్రేణులు, కిరణ్‌ను ఎందుకు అడ్డుకోరు..? విజయమ్మకో న్యాయం, కిరణ్‌కో న్యాయమా? అంటూ ప్రశ్నించారు. -
డీఎల్వి వెకిలి చేష్టలు: వరదరాజులు రెడ్డి
హైదరాబాద్: ముఖ్యమంత్రి ఎన్. కిరణ్‌కుమార్‌రెడ్డి కొత్త పార్టీ పెడితే తన వంతుగా రూ.10 లక్షలు ఇస్తానని మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి చేసిన వ్యాఖ్యలు వెకిలిచేష్టలుగా ఉన్నాయని మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులు రెడ్డి వ్యాఖ్యానించారు. ఇటువంటి వెకిలి ప్రవర్తన, అవినీతి పనుల కారణంగానే ఆయన్ని సీఎం మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేశారని విమర్శించారు. మంగళవారం సచివాలయంలో వరద రాజులు రెడ్డి మీడియాతో మాట్లాడారు. తాను సొంత పార్టీ పెడుతున్నట్టు సీఎం కిరణ్ స్వయంగా ఎప్పుడూ ప్రకటించలేదని అది కేవలం మీడియా చేస్తున్న అసత్య ప్రచారమేననని చెప్పారు. డీఎల్ రవీంద్రారెడ్డి అక్రమంగా రూ.2వేల కోట్లు సంపాదించారని, వైద్య మంత్రిగా ఉండగా ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 10శాతం సీట్లు కోత వేసి వాటిని ప్రైవేటు కళాశాలలకు కేటాయించేందుకు పావులు కదిపారని, ఇందుకు గాను ప్రైవేటు వైద్య కళాశాలల నుంచి రూ.30 కోట్లు లంచం తీసుకున్నారని ఆరోపించారు. డీఎల్ అవినీతి బాగోతాలు సోనియాగాంధీకి కూడా చేరడంతో ఆమె ఆదేశాల మేరకు సీఎం కిరణ్ డీఎల్‌ను బర్తరఫ్ చేశారన్నారు. సమైక్యాంధ్ర కోసం సీఎం కిరణ్ నిజాయితీగా పోరాడుతున్నారని వరదరాజుల రెడ్డి చెప్పారు. -
తెరవెనుక కిరణ్ కసరత్తు
ఓట్లు, సీట్లే లక్ష్యంగా రాష్ట్ర విభజనకు తెరతీసిన కాంగ్రెస్ అధిష్టానం గేమ్‌ప్లాన్‌ను ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తూచా తప్పకుండా అమలుచేస్తున్నారు. ‘విభజనతో సమస్యలు’, ‘విభజన తుపానును అడ్డుకుంటా’ అనే ప్రకటనలతో ఒకవైపు ప్రజలను ఏమార్చుతూ.. అంతర్గతంగా విభజనకు అన్నివిధాలా సహకరిస్తున్నారని సీడబ్ల్యూసీ ప్రకటన వెలువడ్డ నాటి నుంచి జరుగుతున్న పరిణామాలు స్పష్టంచేస్తున్నాయి. * రాష్ట్ర విభజనకు కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకున్నదనే విషయం నాటి సీడబ్ల్యూసీ భేటీకన్నా చాలా ముందే కిరణ్‌కు తెలుసు. అయినా స్పందించలేదు. ఆయన అప్పుడే రాజీనామా చేస్తానంటే అధిష్టానం పునరాలోచనలో పడేది. * సీడబ్ల్యూసీ భేటీకి ముందు కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశంలో అధికారికంగా విభజన నిర్ణయం తీసుకునేటప్పుడు కిరణ్ స్వయంగా ఉన్నారు. ‘రోడ్ మ్యాప్’ కూడా అందించారు. కానీ.. విభజన నిర్ణయంపై కనీసం అభ్యంతరం కూడా వ్యక్తం చేయలేదు. * రాష్ట్రాన్ని విభజించాల్సిందిగా కేంద్రానికి సిఫారసు చేస్తూ సీడబ్ల్యూసీ ప్రకటన చేసినా కిరణ్ స్పందించలేదు. నిరసన వ్యక్తం చేయలేదు. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా ఊసే లేదు. * విభజన ప్రకటనపై సీమాంధ్ర భగ్గుమన్నా.. ఉవ్వెత్తున ఉద్యమం ఎగసిపడ్డా ఆయన కిమ్మనలేదు. ప్రకటన వెలువడిన 9 రోజుల తర్వాత తీరిగ్గా మీడియా ముందుకొచ్చారు. ‘విభజనతో సమస్యలే’నంటూ సన్నాయి నొక్కులతో సరిపెట్టారు. * విభజన నిర్ణయంపై ఆగ్రహంతో కాంగ్రెస్ సీమాంధ్ర నేతలు.. రాజీనామాలతో రాజకీయ సంక్షోభం సృష్టిద్దామంటే.. వారిని కిరణ్ వారించారు. తెలంగాణపై అసెంబ్లీలో తీర్మానం ఉంటుంది.. దాన్ని ఓడిద్దామని మాయమాటలు చెప్తూ కొంతకాలం నెట్టుకొచ్చారు. * మళ్లీ 50 రోజులకు కిరణ్ మరోసారి మీడియా ముందుకొచ్చి.. ‘విభజిస్తే సమస్యలే’నంటూ పలు అంశాలను వల్లెవేశారు. తద్వారా ‘స్వయంగా ముఖ్యమంత్రే విభజనను అడ్డుకుంటున్నారు’ అనే భావన కలిగించే ప్రయత్నం చేశారు. * దాదాపు 80 రోజుల పాటు ఉద్యోగుల సమ్మె, ఆందోళనలతో కేంద్రానికి ఇబ్బందికర పరిస్థితి తలెత్తినప్పుడు కిరణే రంగప్రవేశం చేసి.. తెలంగాణ తీర్మానాన్ని అడ్డుకుంటామన్న సాకు చూపి సమ్మెను విరమింపజేశారు. అది రాజకీయ మలుపు తిరగకుండా జాగ్రత్తపడ్డారు. * విభజనపై కేంద్రం కేబినెట్ నోట్ రూపకల్పనకు ముందే అసెంబ్లీలో సమైక్య తీర్మానం చేయించి కేంద్రానికి పంపినా అది దాని ముందరి కాళ్లకు బంధంగా మారేది. కానీ కిరణ్ కావాలనే విస్మరించారు. వైఎస్సార్ కాంగ్రెస్ ఎంతగా డిమాండ్ చేసినా పట్టించుకోలేదు. * తెలంగాణపై అసెంబ్లీ తీర్మానం ఉండదని తేలిపోవడంతో కొత్తగా ఉద్యోగ నియామకాలకు సంబంధించిన 371 (డి) అధికరణాన్ని సాకుగా చూపుతూ.. ‘నేనున్నంత వరకు విభజన జరగదు’ అంటూ కొత్త రాగం అందుకున్నారు. * తన పరిధిలో ఉన్న అసెంబ్లీ తీర్మానం విషయాన్ని దాటవేస్తున్న కిరణ్.. రాష్ట్ర విభజన రాజ్యాంగ విరుద్ధమంటూ రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ, ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌లకు లేఖల పేరుతో మరోసారి డ్రామా ఆడారు. * నిజానికి అసెంబ్లీ ఇప్పటికీ ప్రొరోగ్ కాలేదు. సమావేశం నిర్వహించే అధికారం కిరణ్ చేతిలోనే ఉంది. విభజనపై ఏర్పాటైన జీఓఎంకు నివేదిక సమర్పించటానికి ముందే అసెంబ్లీలో సమైక్య తీర్మానం చేస్తే ఉపయోగముంటుంది. కిరణ్ దీనినీ పట్టించుకోవటం లేదు. * విభజనకు సహకరించి.. అంతా అయిపోయాక చివరికి సమైక్యవాది ముసుగులో కొత్త పార్టీకి కిరణే నేత ృత్వం వహిస్తారని.. ఇదంతా కాంగ్రెస్ గేమ్ ప్లాన్ అనేది ఇప్పుడు బహిరంగ రహస్యం. -
విభజన కిరణం!
* సీఎం డెరైక్షన్లోనే చురుగ్గా విభజన ఏర్పాట్లు * కిరణ్ సూచనలతో ఢిల్లీకి సీఎస్.. అక్కడ పలువురు కేంద్ర అధికారులతో భేటీ * సీఎస్ తిరిగొచ్చాక రాష్ట్రానికి కేంద్ర టాస్క్‌ఫోర్స్ బృందం రాక * కావాల్సిన సమాచారం అందిస్తూ పూర్తిగా సహకరిస్తున్న రాష్ట్ర సర్కారు * విభజన భేటీలకు రాష్ట్ర అధికారులు హాజరయ్యేలా ఆదేశాలు * ఇప్పటికే అఖిల భారత సర్వీసు, ఉద్యోగుల వివరాలు ఢిల్లీకి అందజేసిన సీఎస్ * విద్యుత్, విద్య, వైద్యం, ఆరోగ్య శాఖల సమాచారం.. ఆస్తులు, అప్పులు, ఆదాయ వివరాలు కూడా.. * విభజన వేగంగా చేయడానికి కేంద్రం హడావుడి * ఓ వైపు ఈ ఏర్పాట్లన్నీ చకచకా చేయిస్తూ.. మరో వైపు సమైక్యవాదినంటూ సీఎం డాంబికాలు * పైగా వచ్చే ఏడాది రాష్ట్ర అవతరణ దిన వేడుకలు జరుపుకొంటామో లేదోనంటూ నిట్టూర్పు సాక్షి, హైదరాబాద్: అంతా అనుకుంటున్నట్లే జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం డెరైక్షన్‌లో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి చేసిన ప్లాన్ చకచకా అమలవుతోంది. సీఎం కనుసన్నల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన ప్రక్రియ వేగంగా ముందుకు సాగుతోంది. ఒకపక్క సమైక్య వాదం వినిపిస్తున్న కిరణ్‌కుమార్‌రెడ్డి మరో పక్క మాత్రం.. విభజనకు కావాల్సిన ఏర్పాట్లను చక్కబెట్టడంలో నిమగ్నమయ్యారు. రాష్ట్రం సమైక్యంగానే ఉంటుందని ప్రకటనలు చేస్తున్న ఆయన నేతృత్వంలోని ప్రభుత్వమే.. ఇటు రాష్ట్ర విభజనకు అవసరమైన సకల సమాచారాన్ని కేంద్రానికి చేరవేస్తుండడం గమనార్హం. అయితే ముఖ్యమంత్రి ఇప్పటికీ సమైక్య ప్రకటనలతో రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టడం చూసి.. విభజన ఏర్పాట్లు చూస్తున్న అధికారులు సైతం విస్తుపోతున్నారు. శుక్రవారం రాష్ట్ర అవతరణ దిన వేడుకల్లో సైతం తాను గట్టి సమైక్యవాదినంటూ కిరణ్‌కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చూసి వారు కంగుతిన్నారు. వచ్చే ఏడాది రాష్ట్ర అవతరణ వేడుకలు జరుపుకొంటామో లేదోనంటూ ఆయన నిట్టూర్చడం చూసి ఆశ్చర్యపోయారు. రాష్ట్ర ప్రభుత్వ కనుసన్నల్లోనే విభజన నోట్.. వాస్తవానికి విభజనకు కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేయడానికి ముందే రాష్ట్రానికి సంబంధించిన సమాచారమంతా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్రానికి చేరింది. కిరణ్‌కుమార్ రెడ్డి సమైక్యవాదినంటూ ప్రకటనలు చేస్తున్న సమయంలోనే ముఖ్యమంత్రి కార్యాలయమైన ‘సీ బ్లాక్’ సాధారణ పరిపాలన శాఖలో నోడల్ అధికారిని నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. అంతకు ముందు ప్రణాళిక శాఖ నుంచి పూర్తి స్థాయిలో నివేదికలు కేంద్ర హోంశాఖకు చేరాయి. సీడబ్ల్యూసీ తీర్మానం రోజున ముఖ్యమంత్రి ఢిల్లీలో ఉండగానే రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన సీనియర్ అధికారులు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ దిగ్విజయ్‌సింగ్‌కు అవసరమైన సమాచారాన్ని మెయిల్ చేశారు. ఈ అధికారులు తరచూ ముఖ్యమంత్రితో సంప్రదింపులు జరుపుతూనే దిగ్విజయ్ కార్యాలయం అడిగిన ప్రతి సమాచారాన్ని అందచేశారు. అదే విషయాన్ని ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రికి వివరించారు. సీడబ్ల్యూసీ తీర్మానానికి ముందే అప్పటి డీజీపీ దినేష్‌రెడ్డిని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పిలిచి రాష్ట్ర విభజనపై చర్చలు జరిపింది. సీఎస్ సహా పలువురు సీనియర్ అధికారులు అప్పటికే ఢిల్లీ వెళ్లి వారికి అవసరమైన సమాచారాన్ని అందజేశారు. తెలంగాణ విభజనకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలియజేయడానికి రూపొందించిన నోట్ రాష్ట్ర ప్రభుత్వ కనుసన్నల్లోనే తయారైంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇచ్చిన సమాచారంతో పాటు ఆ నోట్లో ఏయే అంశాలు ఉన్నాయన్నది సీఎంకు ముందే చేరవేశామని సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. సీఎం ఓకే.. విభజన సమావేశాలకు అధికారుల హాజరు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటునకు సంబంధించి కేంద్ర హోం శాఖతో పాటు వివిధ శాఖలు అడుగుతున్న సమాచారాన్ని ఆగమేఘాల మీద ఢిల్లీకి పంపించడంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి వివిధ శాఖల ఉన్నతాధికారులు ప్రస్తుతం నిమగ్నమై ఉన్నారు. దీంతో పాటు ముఖ్యమంత్రి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో సీఎస్ సహా వివిధ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు ఢిల్లీలో కేంద్రం ఏర్పాటు చేసిన సమావేశాల్లో పాల్గొంటున్నారు. కేంద్ర టాస్క్‌ఫోర్స్ బృందంలో ఎవరెవరు ఉండాలి? రాష్ట్రంలో ఎవరి నుంచి సలహాలు స్వీకరించాలి? వంటి అంశాలను చర్చించేందుకు ప్రధాన కార్యదర్శి మహంతిని గత వారం ఢిల్లీ పిలిపించారు. ఆ వెంటనే సీనియర్ ఐపీఎస్ అధికారి విజయ్‌కుమార్ నేతృత్వంలో టాస్క్‌ఫోర్స్ బృందాన్ని ఏర్పాటు చేశారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో తలెత్తే శాంతిభద్రతల అంశాలను గుర్తించడంతో పాటు వాటి పరిష్కారానికి అనుసరించాల్సిన వ్యూహపత్రం రూపొందించడానికి రాష్ట్రానికి వచ్చి మూడు రోజుల పాటు ఉన్న కేంద్ర టాస్క్‌ఫోర్స్ బృందానికి సీఎస్ మహంతి, డీజీపీ ప్రసాదరావు అన్ని విధాలుగా సహకరించారు. ఈ బృందం సమావేశాలకు హాజరు కావాల్సిందిగా ఇంటెలిజెన్స్ అదనపు డీజీ, హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్, ఉన్నత విద్యా శాఖ ముఖ్య కార్యదర్శులను ప్రధాన కార్యదర్శి ఆదేశించారు. టాస్క్‌ఫోర్స్ బృందానికి నాయకత్వం వహిస్తున్న విజయ్‌కుమార్ కూడా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో సమావేశమై చర్చించారు. ఉద్యోగులు, విద్యుత్ పంపిణీ వివరాలు ఇప్పటికే ఢిల్లీకి.. రాష్ట్రంలో అఖిల భారత సర్వీసు అధికారులతోపాటు ఉద్యోగుల పంపిణీకి సంబంధించిన వివరాలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి గత నెల 30నే ఢిల్లీ వెళ్లి కేంద్రానికి అందజేశారు. అధికారులు, ఉద్యోగుల పంపిణీకి సంబంధించి అవలంబించాల్సిన విధానం గురించి కేంద్ర సిబ్బంది, శిక్షణ శాఖ అధికారులు సీఎస్‌కు వివరించడంతో పాటు అధికారుల వివరాలు పంపించడానికి ప్రత్యేకంగా నమూనా పత్రాన్ని అందజేశారు. ఆ పత్రం మేరకు వివరాలను త్వరగా పంపించాలని సూచించారు. రాష్ట్ర విద్యుత్ రంగం విభజనకు సంబంధించి ప్రధానంగా విద్యుత్ ఉత్పత్తి, సరఫరా అంశాల విభజనపై కేంద్ర ఇంధన శాఖ ఉన్నతాధికారులతో శుక్రవారం ఢిల్లీలో రాష్ట్ర విద్యుత్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.సాహు సమావేశమై చర్చించారు. జిల్లాల వారీగా విద్యుత్ ఉత్పత్తి, వినియోగం, సరఫరా అంశాలతో పాటు బొగ్గు, గ్యాస్ వివరాలను కేంద్ర ఇంధన శాఖకు అందజేశారు. విద్యపై కేంద్రం భేటీకి రాష్ట్ర అధికారుల హాజరు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నేపథ్యంలో ఉన్నత విద్య, సెకండరీ విద్య అంశాల పంపిణీకి సంబంధించి కూడా శుక్రవారం కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన సమావేశానికి రాష్ట్ర ఉన్నత విద్యా శాఖ ముఖ్యకార్యదర్శి అజయ్ మిశ్రా, సెకండరీ విద్యా శాఖ ముఖ్యకార్యదర్శి రాజేశ్వర్ తివారీ హాజరయ్యారు. జిల్లాల వారీగా ఉన్న విశ్వవిద్యాలయాలు, ఉన్నత విద్యా సంస్థలు, విద్యార్థులు, అధ్యాపకుల సంఖ్యలను ఈ సందర్భంగా కేంద్రానికి అందజేశారు. కేంద్ర ప్రాయోజిత విద్యా సంస్థలు ఏ ప్రాంతంలో ఉన్నాయి, ఏ ప్రాంతంలో లేవనే వివరాలను కూడా అందజేశారు. అలాగే ఇప్పటికే రాష్ట్ర అప్పులు, ఆస్తులు, ఆదాయ వివరాలను కూడా ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు కేంద్రానికి పంపించారు. ఈ-మెయిల్లో సమాచారం కోరుతున్న జలసంఘం జలవనరులు, సాగునీటి ప్రాజెక్టుల వివరాలను, నీటి కేటాయింపుల వివరాలను కూడా రాష్ట్ర అధికారులు కేంద్రానికి పంపించారు. జలవనరుల పంపిణీకి సబంధించిన విషయంలో కేంద్ర జల సంఘం కీలక పాత్ర వహిస్తోంది. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అధికారులు ఏదైనా అంశంపై సమాచారం కావాలంటే సంబంధిత శాఖల ఉన్నతాధికారులకు ఫోన్, ఈ-మెయిల్ ద్వారా ఆ సమాచారాన్ని పంపించాలని కోరుతున్నారు. కేంద్రం కోరిన సమాచారాన్ని సంబంధిత ఉన్నతాధికారులు ఈ-మెయిల్ ద్వారా పంపిస్తున్నారు. అలాగే జిల్లాల వారీగా ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కాలేజీలు, సీట్ల వివరాలను ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి పంపించారు. ప్రభుత్వానికి చెందిన ప్రధాన ఆసుపత్రులు ఏ ప్రాంతంలో ఏమేమి ఉన్నాయనే వివరాలను కూడా కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం అందజేసింది. కేంద్ర ప్రభుత్వ అధికారుల తీరు చూస్తుంటే రాష్ట్ర విభజనను వీలైనంత త్వరగా పూర్తి చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు అనిపిస్తోందని ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు. సమాచారం కోసం ఫోన్లు చేస్తూ ఐదు నిమిషాల్లో ఈ-మెయిల్స్ పంపాలని కేంద్ర అధికారులు కోరుతున్నారని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. కేంద్రం హడావుడి చూస్తుంటే ఈ నెలలోనే రాష్ట్ర విభజన బిల్లు అసెంబ్లీకి వచ్చేలాగ ఉందని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. నవంబర్ చివరి వారంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లును అసెంబ్లీ అభిప్రాయానికి పంపించాలనే లక్ష్యంతో కేంద్రం పనిచేస్తోందని ఉన్నతాధికార వర్గాలు తెలిపాయి. సమైక్య ముసుగులో రాజకీయాలు భారీ వర్షాల వల్ల పంటలు దెబ్బతిన్న రైతాంగాన్ని పరామర్శించడానికి వెళుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మను అడ్డుకొని అదుపులోకి తీసుకోవడంతోనే కిరణ్‌కుమార్ రెడ్డి సమైక్య రాజకీయం బయటపడింది. సమైక్యవాదినని ప్రచారం చేసుకోవడమే తప్ప ఆచరణలో ఆయన దానిని అమలు చేయడం లేదని స్పష్టమైందని పోలీసులే వ్యాఖ్యానిస్తున్నారు. ‘ముఖ్యమంత్రి నిజంగా సమైక్యవాది అయితే నల్లగొండలో విజయమ్మ పర్యటనకు అవకాశం కల్పించేవారు. కానీ, ఆయనకు ఇష్టం లేకపోవడం వల్లే పోలీసులు ఆమెను అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు’ అని రాయలసీమకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే ఒకరు మండిపడ్డారు. సచివాలయం సీ బ్లాక్ వద్ద విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ.. విజయమ్మను అడ్డుకోవడంతోనే కిరణ్ సమైక్య ముసుగు తొలగిపోయిందని ఆయన వ్యాఖ్యానించారు. -
సోనియమ్మకే సీఎం ద్రోహం చేశారు: జీవన్‌రెడ్డి
రాయికల్: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ రాజకీయ భిక్షతో ముఖ్యమంత్రి పీఠంపై కూర్చున్న కిరణ్‌కుమార్‌రెడ్డి ఆమెకే ద్రోహం చేశారని మాజీ మంత్రి జీవన్‌రెడ్డి ధ్వజమెత్తారు. కరీంనగర్ జిల్లా రాయికల్ మండలం మూటపల్లిలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎలాంటి గుర్తింపు లేని కిరణ్‌ను సోనియాగాంధీ ముఖ్యమంత్రిని చేశారని, ఆమె తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్న తర్వాత ఆమె నిర్ణయాన్నే ఎదిరించిన ఘనుడు కిరణ్ అని మండిపడ్డారు. కేవలం అధికారం కోసమే సోనియాగాంధీ తెలంగాణ నిర్ణయం తీసుకున్నారని కొంతమంది సీమాంధ్ర నాయకులు అనడం వారి అవివేకానికి నిదర్శనమన్నారు. సీమాంధ్రలో 25 ఎంపీ స్థానాలు ఉంటే తెలంగాణలో 17 ఎంపీ స్థానాలే ఉన్న విషయం వారు మరిచినట్టున్నారన్నారు. వర్షాలకు నష్టపోయిన రైతులను ఆదుకోవాలని, ఆంధ్ర, రాయలసీమకు ఎలాంటి పరిహారం ఇస్తున్నారో... అలాగే తెలంగాణ రైతులను కూడా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఇటీవల వ్యవసాయశాఖ మంత్రి రఘువీరారెడ్డిని కలిసి విజ్ఞప్తి చేశామని జీవన్‌రెడ్డి చెప్పారు. -
రాష్ట్రవిభజన అనే తుఫానులో సిల్లీబ్రాండ్
-
ఎందుకీ నాటకాలు?
రాష్ట్ర విభజన తుపానును ఆపడానికి ప్రయత్నిస్తానని ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. శ్రీకాకుళంలో తుపాను బాధిత ప్రాంతాల్లో పర్యటించిన సందర్భంగా ఈ మేరకు కిరణ్ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన వన్నీ వట్టి ఉత్తరకుమార ప్రగల్భాలేనన్నారు. సమైక్య ఉద్యమాన్ని నీరుగార్చే కుట్రలో అంతర్భాగంగానే కిరణ్ వ్యవహరిస్తున్నారు తప్ప మరొకటి కాదన్నారు. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడానికి వెనుకాడిన సీఎం, ఇప్పుడు ఇలాంటి మాటలు చెప్పి ప్రజలను ఇంకా మభ్యపెట్టాలని చూస్తున్నారని ఆదివారం ‘సాక్షి’తో రాంబాబు దుయ్యబట్టారు. ‘‘సోనియాగాంధీకి కోవర్టులాగా వ్యవహరించి, రాష్ట్ర విభజనను వేగవంతంచేసేలా ప్రయత్నిస్తున్నది నువ్వు కాదా? ‘విభజన విషయంలో నా చేతిలో ఏమీ లేదు’ అని ఎన్జీవోల నేతలతో నువ్వు స్వయంగా అనలేదా? సమైక్య రాష్ట్రం కోసం సీమాంధ్ర ఉద్యోగులు ఉవ్వెత్తున ఉద్యమిస్తే వారి సమ్మెను నయానా భయానా విరమింపజేసింది నువ్వు కాదా? నువ్వు చేస్తున్నవన్నీ విభజనకు అనుకూల చర్యలే కాదా? ఇలా రోజుకో రకంగా మాట్లాడటం ఎవరిని మభ్యపెట్టేందుకు? ఎవరిని మోసగించేందుకు ఈ నాటకాలన్నీ? నీ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రజల జీవితాలతో ఎందుకిలా ఆటలాడుతున్నావు? విభజన ప్రకటన వచ్చిన వెంటనే నువ్వు రాజీనామా చేసి ఉంటే లక్షలాది మంది ఉద్యోగులు, కోట్లాది మంది ప్రజలు నడిబజారుకు వచ్చి ఆందోళన చేయాల్సినటువంటి పరిస్థితే దాపురించి ఉండేది కాదు కదా!’’ అని కిరణ్‌ను ప్రశ్నించారు. ‘‘ఆంధ్రప్రదేశ్‌ను విభజిస్తామని జూలై 30న సీడబ్ల్యూసీ అధికారికంగా ప్రకటించింది. వాస్తవానికి అంతకు ముందే రోడ్‌మ్యాప్‌లని, వార్ రూమ్ భేటీలని కాంగ్రెస్ అగ్రనేతలు కిరణ్‌ను, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణను అనేక మార్లు ఢిల్లీకి పిలిపించుకుని సుదీర్ఘంగా చర్చలు జరిపారు. జూలై 30వ తేదీ సాయంత్రం విభజన ప్రకటన చేయబోతున్నారని కూడా వాళ్లిద్దరికీ కచ్చితంగా ముందే తెలుసు. అలాంటప్పుడు, విభజన ప్రకటన వస్తే రాజీనామా చేస్తానని ముందుగానే సోనియాకు కిరణ్ చెప్పి ఉంటే సీడబ్ల్యూసీ ఆ ప్రకటన చేసి ఉండేదా? విభజన ఆగి ఉండేది కాదా?’ అని అంబటి సూటిగా ప్రశ్నించారు. ‘ఇలాంటి అంశంపై ముఖ్యమంత్రి రాజీనామా చేస్తే అది జాతీయ స్థాయిలోనూ, కాంగ్రెస్ అధిష్టానంలోనూ తీవ్రమైన చర్చకు దారి తీసి ఉండేది. కచ్చితంగా ఆ రోజు సీడబ్ల్యూసీ విభజన ప్రకటన చేయకుండా వెనక్కి తగ్గి ఉండేది. కానీ అప్పుడలా చేయని కిరణ్, ఇప్పుడు మాత్రం తన పదవిని తృణప్రాయంగా త్యాగం చేస్తానని, తనకు సమైక్య రాష్ట్రం కన్నా పదవి ముఖ్యం కాదని ఉత్తరకుమార ప్రగల్భాలు పలుకుతున్నాడు. శ్రీకాకుళంలో తుపాను బాధితుల పరామర్శకు వె ళ్లి, ‘తుపానును ఆపలేక పోయాం గానీ, రాష్ట్ర విభజనను ఆపే ప్రయత్నం చేస్తా’నని గొప్పలు చెబుతున్నాడు. సీడబ్ల్యూసీ రాష్ట్ర విభజన ప్రకటనను వెల్లడించగానే కిమ్మనకుండా మౌనం దాల్చిన కిరణ్, సీమాంధ్రలో చెలరేగిన ప్రజాగ్రహాన్ని చూసి బయటకు వచ్చి విభజనకు తాను వ్యతిరేకమన్నట్టుగా మాట్లాడారు. ఆయన అలా మాట్లాడుతూ ఉండగానే విభజన నోట్ కేబినెట్‌కు కూడా వచ్చింది. కేంద్ర మంత్రుల బృందం కూడా విభజన ప్రక్రియకు శ్రీకారం చుట్టింది’’ అని ఆయన విమర్శించారు. సీఎం ఇప్పటికైనా వాస్తవాలను అర్థం చేసుకుని ప్రగల్భాలు మాని, అసెంబ్లీని సమావేశపరచి, సమైక్య తీర్మా నం చేయడం ద్వారా విభజనను అడ్డుకునేందుకు నిజమైన ప్రయత్నం చేయాలని డిమాండ్ చేశారు. -
ఏ ఎండకా గొడుగులా సిఎం కిరణ్ తీరు!
-
విభజన తుఫాన్ ఆపుతాం: సీఎం కిరణ్
దేవగుడితోట: రాష్ట్ర విభజనను కచ్చితంగా ఆపుతామని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి అన్నారు. రాష్ట్రానికి నష్టం కలిగించే విభజనను అడ్డుకుంటామని ఆయన స్పష్టం చేశారు. శ్రీకాకుళం జిల్లాలో పై-లిన్ తుఫాన్ బాధిత ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా కవిటిమండలం దేవగుడితోటలో నిర్వహించిన సభలో ముఖ్యమంత్రి మాట్లాడారు. సమైక్యాంధ్ర గురించి మాట్లాడే సమయం, సందర్భం కాదంటూ విభజనను అడ్డుకుంటామంటూ ఒక్కమాట చెప్పారు. పై-లిన్ తుఫాన్‌ను ఆపలేకపోయమని, కానీ ఈ సైక్లోన్(విభజన తుఫాన్)ను ఆపి తీరుతామని ఆయన ప్రకటించారు. తుఫాన్ బాధితులను ఆదుకుంటామని సీఎం హామీయిచ్చారు. కొబ్బరి రైతులకు ఇచ్చే పరిహారం పెంచుతున్నట్టు ప్రకటించారు. బాధిలతులు తమ పేర్లను అధికారుల వద్ద నమోదు చేసుకోవాలని సూచించారు. -
సోనియాకు రాష్ట్రాన్ని తాకట్టుపెట్టారు
పొందూరు, న్యూస్‌లైన్: ఆంధ్రప్రదేశ్‌ను సీఎం కిరణకుమార్ రెడ్డి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడులు సోనియాగాంధీకి తాకట్టుపెట్టేశారని వైఎస్సార్ పార్టీ నాయకుడు, మాజీ మంత్రి తమ్మినేని సీతారాం విమర్శించారు. సమైక్యాంధ్రకు మద్దతుగా పొందూరులో ఆదివారం ఏర్పాటు చేసిన ప్రజాగర్జన సభకు హాజరైన వారికి తమ్మినేని ముందుగా శిరస్సువంచి పాదాభివందనం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజల అభీష్టం మేరకు వైఎస్ తనయ షర్మిల సమ్య్యై శంఖారావం పూరిస్తే, తనయుడు జగన్మోహన్ రెడ్డి సమైక్యాంధ్ర కోసం ఆమరణ దీక్ష చేస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రజలకు వెన్నుంటి నిలిచి నిరాహార దీక్షకు పూనుకోవడం నిజంగా గర్వించదగ్గ విషయమని అభివర్ణించారు. తెలుగు జాతి ఆత్మ గౌరవాన్ని చంద్రబాబు నాయుడు మంటగలుపుతుంటే ఎన్టీఆర్ కుమారులు చూస్తూ ఉండటం విడ్డూరంగా ఉందన్నారు. తెలుగు రాష్ట్రం ఒక్కటిగా ఉండాలనే ఆశయం ఎన్టీఆర్, వైఎస్ రాజశేఖర్రెడ్డిలదని చెప్పారు. తాత వారసత్వం తీసుకున్నానంటూ జూనియర్ ఎన్టీఆర్ ప్రగల్భాలు పలకడమే తప్ప ఎదిరించేదేమీ లేదన్నారు. తక్షణమే చంద్రబాబుకు వ్యతి రేకంగా ఉద్యమాల్లో భాగస్వాలు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ జిల్లా నాయకుడు కణితి విశ్వనాథం, పాలవలస రాజశేఖరం, హనుమంతు కిరణ్, ఎచ్చెర్ల సూర్యనారాయణ, వరుదు కల్యాణి, బల్లాడ హేమమాలినీ రెడ్డి, జనార్దనరెడ్డి, కూన మం గమ్మ, పైడి కృష్ణప్రసాద్, టి.శివప్రసాదరావు, మార్పు ధర్మారావు తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీలో పలువురి చేరిక జగన్మోహన్రెడ్డి ఆమరణ నిరాహార దీక్షకు మద్దతుగా ప్రజాగర్జన సాక్షిగా కాంగ్రెస్, టీడీపీలకు చెందిన సర్పంచ్‌లు 8 మంది, మాజీ సర్పంచ్‌లు 16 మంది, ఎంపీటీసీ మాజీ సభ్యులు 8 మంది మూకుమ్మడిగా వైఎస్సార్ సీపీలో చేరారు. పార్టీలో చేరిన వారిలో సర్పంచ్‌లు మజ్జి గోపాలకృష్ణ(నందివాడ), సీపాన అనిత (గోకర్ణపల్లి), పప్పల సత్యవతి(తోలాపి), గురుగుబెల్లి సరోజనమ్మ(పిల్లలవలస), బడి మణి(దల్లిపేట), గురుగుబెల్లి ఉషామతి(కోటిపల్లి), చల్ల ముఖలింగం(ధర్మపురం), పెద్దింటి రవి(బాణాం), టీడీపీ మాజీ ఎంపీపీ, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు బి.ఎల్.నాయుడు, మాజీ సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు సింగూరు అమ్మడు, కూన అయ్యపునాయుడు, పైడి గోవిందరావు, పి. సింహాచలం, పొన్నాడ అప్పన్న, రామారావు, సింహాచలం, మెట్ట రమణభట్లు తదితరులు పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అలాగే, కాంగ్రెస్ చెందిన మాజీ సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు సీపాన శ్రీరంగ నాయకులు, గురుగుబెల్లి మధుసూదనరావు, వాసుదేవరావు, మజ్జి నరేంద్రనాయుడు, పెయ్యల తవిటిరాజు, సీపాన చక్రధరనాయుడు, పెద్దింటి శ్రీను, బొడ్డేపల్లి ప్రసాదరావు, కొండమ్మ, వండాన తవిటినాయుడు, పోతురాజు సూర్యారావు, జ్యోతి, మెదలవలస పాపారావు, దుంపల సత్యవతి తదితరులతో సుమారు 5000 మంది వరకు పార్టీలో చేరారు. -
అత్యవసర సేవలకు విఘాతం కలిగించవద్దు: సీఎం
టీటీడీ, విద్యుత్, విద్య, వైద్యం తదితర అత్యవసర సేవలకు విఘాతం కలిగంచవద్దని సమ్మె చేస్తున్న ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాలకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. అత్యవస సేవల ఆవశ్యకతను ఉద్యోగ సంఘాలకు వివరించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, టీటీడీ ఈవో, చిత్తూరు జిల్లా కలెక్టర్, విద్యుత్ అధికారులను ఆదేశించారు. సమ్మె పరిస్థితిపై ముఖ్యమంత్రి బుధవారం సమీక్షించారని పేర్కొంటూ సీఎంవో పత్రికా ప్రకటన విడుదల చేసింది. రాయలసీమ, ఇతర జిల్లాల్లో భారీ వర్షాలు, వరదల పరిస్థితిపై అధికారులను అడిగి తెలసుకున్నారు. సహాయ పునరావాస చర్యలు చేపట్టాలని ఆదేశించారు. -
కిరణ్ విందుకు తెలంగాణ మంత్రుల డుమ్మా
మంత్రులతో తన క్యాంపు కార్యాలయంలో సీఎం కిరణ్ కుమార్ రెడ్డి నిర్వహించిన సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి రాజకీయాలు ప్రస్తావించ లేదని తెలిసింది. భేటీ ముగిసిన తర్వాత సీఎం కిరణ్.. గ్రాండ్ కాకతీయ హోటల్‌కు వెళ్లారు. 14వ ఆర్థిక సంఘం చైర్మన్ గౌరవార్థం ఇక్కడ సీఎం విందు ఏర్పాటు చేశారు. ఈ విందుకు ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ సహా పలువురు తెలంగాణ మంత్రులు గైర్హాజరయ్యారు. తెలంగాణ నుంచి ఒక్క గీతారెడ్డి మాత్రమే హాజరయ్యారు. సమైక్యాంధ్రలో జరుగుతున్న ఉద్యమానికి సీఎం కిరణ్ పరోక్షంగా అండ దండలు అందిస్తున్నారని తెలంగాణ ప్రాంత నాయకులు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. -
సమ్మె, శాంతిభద్రతల పరిస్థితిని సమీక్షించిన సీఎం
ఉద్యోగుల సమ్మె నేపథ్యంలో అత్యవసర సేవలకు విఘాతం కలగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. సమ్మె, శాంతిభద్రతల పరిస్థితిని మంగళవారం ఆయన సమీక్షించారు. ఈమేరకు సీఎంవో మంగళవారం పత్రికా ప్రకటన విడుదల చేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి.కె.మహంతి, సీఎంవో, పోలీసు అధికారులు సమావేశంలో పాల్గొన్నారు. గణేష్ చతుర్థి, నవరాత్రుల నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేయాలని సూచించారు. ప్రత్యేకించి జంటనగరాల్లో భద్రత పెంచాలని, సున్నిత ప్రాంతల్లో తనిఖీలు చేయాలని ఆదేశించారు. రైతులకు ఇబ్బంది లేకుండా అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించాలని వ్యవసాయ శాఖ అధికారులకు సూచించారు. -
చాలా కాలం పడుతుంది: సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి
ఢిల్లీ నుంచి వచ్చాక రాష్ర్ట విభజనపై మంత్రులతో సీఎం వ్యాఖ్య కేంద్రం ముందుకెళ్లాలంటే ఎటుచూసినా సమస్యలే ఉమ్మడి రాజధానిగా ఉన్నప్పుడు యూటీ చేయాల్సిందే ‘371డి’ వంటి రాజ్యాంగ చిక్కుముడులూ ఉన్నాయి నీటి సమస్యలకు పరిష్కారం చూపటమూ ఇబ్బందే నవంబర్ తర్వాత ఐదు రాష్ట్రాల ఎన్నికలు వస్తాయి బడ్జెట్ సమావేశాల వరకూ ముందుకు కదలదేమో సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన పూర్తికావటానికి చాలా సమయం తీసుకుంటుందని.. ఈలోగా జరిగే పరిణామాలతో అది ఎన్ని మలుపులు తిరుగుతుందోనని ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి అభిప్రాయపడుతున్నట్లు తెలిసింది. ఢిల్లీలో రెండు రోజుల పర్యటన ముగించుకుని గురువారం హైదరాబాద్ తిరిగివచ్చిన ముఖ్యమంత్రిని రాష్ట్ర మంత్రులు గంటా శ్రీనివాసరావు, విశ్వరూప్, ఏరాసు ప్రతాప్‌రెడ్డి, మహీధర్‌రెడ్డి, పితాని సత్యనారాయణ, డొక్కా మాణిక్యవరప్రసాద్‌లు కలిశారు. ఈ సందర్భంగా విభజనపై ఢిల్లీలో నెలకొన్న పరిస్థితుల గురించి ఆయన చూచాయగా సహచరులకు వివరించినట్లు చెప్తున్నారు. విభజనపై కేంద్రం ముందుకు వెళ్లాలంటే ఎటుచూసినా అన్నీ సమస్యలే ఎదురవుతున్నాయని కిరణ్ వ్యాఖ్యానించినట్లు సమాచారం. సీడబ్ల్యూసీ తీర్మానంలోనే రెండు రాష్ట్రాలకు పదేళ్ల పాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంటుందని పేర్కొన్న విషయాన్ని సీఎం ప్రస్తావిస్తూ.. రెండు రాష్ట్రాల రాజధానిగా ఉన్న ప్రాంతం ఏదో ఒక ప్రభుత్వ పాలనలో ఉండటం సరైంది కాదని, పదేళ్ల పాటు ఒక రాష్ట్ర ప్రభుత్వ కీలక వ్యవస్థలు, విభాగాలు హైదరాబాద్‌లో వేరే ప్రభుత్వ అధికార పరిధిలో పని చేయటం ఎక్కడా ఉండదని, ఉమ్మడి రాజధానిగా చేస్తే తప్పనిసరిగా కేంద్రపాలిత ప్రాంతంగా చేయటం తప్ప మరో మార్గం ఉండదని అభిప్రాయపడినట్లు తెలిసింది. విభజనపై రాజ్యాంగపరమైన చిక్కుముడులు కూడా ఉన్నాయంటూ గతంలో రాజ్యాంగ సవరణ చేసి 371డి అధికరణ కింద రాష్ట్రానికి కొన్ని ప్రత్యేక రక్షణలు కల్పించిన విషయాన్ని సీఎం ప్రస్తావించినట్లు చెప్తున్నారు. ఇప్పుడు మళ్లీ రాజ్యాంగ సవరణతో ఆ అధికరణాన్ని మార్చిన తర్వాతే విభజనపై ముందుకు వెళ్లాల్సి ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డట్లు తెలిసింది. ‘రాజ్యాంగ సవరణ కావాలంటే లోక్‌సభలో మూడింట రెండొంతుల మద్దతు లభించాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో యూపీఏకు అంత బలం లేదు కనుక పార్లమెంటులో బిల్లు ఆమోదం పొందే అవకాశాలు ఏమేరకు ఉంటాయో తెలియదు’ అని ఆయన వ్యాఖ్యానించినట్లు సమాచారం. నీటి సమస్యలకు పరిష్కారం చూపించటమూ చాలా ఇబ్బందేనని.. సీమాంధ్రలో ఉద్యమ తీవ్రత కారణంగా ఇవన్నీ తేలాకనే విభజనపై ముందుకు వెళ్లాల్సి ఉంటుందని పేర్కొన్నట్లు చెప్తున్నారు. ఈ పరిస్థితుల్లో విభజనకు చాలా కాలం పడుతుందని ఆయన అభిప్రాయపడ్డట్లు తెలిసింది. ‘నవంబర్ వరకు ఉద్యమం తీవ్రంగా కొనసాగినా ఆ తరువాత ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు వస్తాయి. పార్టీ అధిష్టానం ఆ ఎన్నికల హడావుడిలో పడుతుంది. ఆ తరువాత కూడా ఏవో సమస్యలు రాకతప్పదు. చివరకు బడ్జెట్ సమావేశాల వరకు రాష్ట్ర విభజన అంశం ముందుకు కదలకపోవచ్చు. అప్పటికి సాధారణ ఎన్నికలు దగ్గరపడతాయి. ఈలోగా రాజకీయంగా ఎన్ని పరిణామాలు మారుతాయో, కేంద్రంలో సమీకరణాలు ఎలా మారుతాయో చెప్పలేం. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికల ముందు విభజనకు ఎన్ని పార్టీలు అంగీకరిస్తాయో, ఎన్ని వ్యతిరేకిస్తాయో చెప్పలేం...’ అంటూ సీఎం మంత్రులతో వ్యాఖ్యానించినట్లు సమాచారం. -
హస్తినకు నేడు సీఎం కిరణ్
* అధిష్టానం పిలుపు.. * సమైక్య ఉద్యమం, తాజా పరిస్థితులపై చర్చ * నేడు ఆంటోనీ కమిటీ ముందుకు సీమాంధ్ర ప్రతినిధులు * అంతకుముందే ముఖ్యమంత్రి కిరణ్‌తో భేటీ కానున్న కమిటీ * ఢిల్లీ పర్యటనకు దూరంగా సీనియర్ మంత్రులు సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డికి అధిష్టానం నుంచి పిలుపొచ్చింది. దీంతో ఆయన మంగళవారం ఉదయాన్నే ఢిల్లీ వెళ్లనున్నారు. సమైక్యాంధ్ర ఉద్యమంతో సీమాంధ్రలో పరిస్థితులు తీవ్రరూపం దాల్చిన నేపథ్యంలో ఢిల్లీ పెద్దలు సీఎంను హుటాహుటిన ఢిల్లీకి పిలిపించుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇప్పటివరకు శాంతియుతంగా సాగుతున్న ఉద్యమంలో ఇటీవలి కాలంలో చెదురుమదురుగా అవాంఛనీయ సంఘటనలు కూడా చోటుచేసుకుంటున్న నేపథ్యంలో రాష్ట్రంలో శాంతిభద్రతలు, రాజకీయపరమైన తాజా పరిస్థితులపై సీఎంతో పార్టీ పెద్దలు చర్చించనున్నారని తెలుస్తోంది. విభజన నిర్ణయంపై సీమాంధ్ర ప్రాంతంలో ఇంత తీవ్ర నిరసన ఎదురవుతుందని అంచనా వేయలేకపోయిన పార్టీ పెద్దలు ఇప్పుడు ఆచితూచి అడుగులు వేస్తున్నారు. సీడబ్ల్యూసీ తీర్మానాన్ని ఆదరాబాదరాగా వెలువరించిన అధిష్టానం... సీమాంధ్రనేతల ప్రతిఘటన నేపథ్యంలో దాని అమలులో మాత్రం నెమ్మదించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే ఆంటోనీ కమిటీ ఏర్పాటు చేసి ఇరుప్రాంతాల కాంగ్రెస్ నేతలతో భేటీలు నిర్వహిస్తోంది. తెలంగాణ ప్రాంత మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు సోమవారం ఆంటోనీ కమిటీ ముందు హాజరై తమ వాదన వినిపించారు. సీమాంధ్రప్రాంత మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నేతలు మంగళవారం కమిటీని కలవనున్నారు. ఈ తరుణంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కూడా ఢిల్లీలో అందుబాటులో ఉండాల్సిందిగా అధిష్టానం ఆదేశించింది. విభజన కారణంగా పలు సమస్యలు తలెత్తుతాయని, భవిష్యత్తులో అవి ప్రమాదకర పరిణామాలకు దారితీస్తాయని సీమాంధ్ర ప్రాంత నేతలు వాదిస్తున్నారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణలు సీమాంధ్రప్రాంత నేతలతో వరుసగా రెండుసార్లు నిర్వహించిన సమావేశంలో వారంతా ఈ సమస్యలను ఏకరవుపెట్టి రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు రెండుసార్లూ తీర్మానాలు చేసి పార్టీ అధిష్టానానికి పంపారు. ఈ రెండింటిపైనా సీఎం, పీసీసీ అధ్యక్షులిద్దరూ సంతకాలు చేశారు. ఈ లేఖలు ఆంటోనీ కమిటీకి కూడా పంపించారు. సీమాంధ్ర ప్రాంత కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు మంగళవారం ఆంటోనీ కమిటీని కలవనున్న నేపథ్యంలో అంతకుముందుగానే సీఎం ఆ కమిటీతో భేటీ అయ్యే అవకాశాలున్నాయని తెలుస్తోంది. సీమాంధ్ర ప్రజాప్రతినిధులు వెలువరిస్తున్న అనుమానాలను ఆయన పార్టీ అధిష్టానానికి, ఆంటోనీ కమిటీకి వివరించనున్నారు. విభజన నిర్ణయం అమలులో తలెత్తే ఇతర క్లిష్ట సమస్యలను కూడా ఆయన పార్టీ పెద్దలకు తెలియచేయనున్నారని తెలుస్తోంది. ఢిల్లీకి సీమాంధ్ర నేతలు ఏకే ఆంటోనీ కమిటీ మంగళవారం రాత్రి అపాయింట్మెంట్ ఇచ్చిన నేపథ్యంలో సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు పలువురు ఢిల్లీ వెళ్లేందుకు సిద్ధమయ్యారు. సోమవారం సాయంత్రం మంత్రులు శైలజానాథ్, కన్నా లక్ష్మీనారాయణ, మాజీమంత్రి గాదె వెంకటరెడ్డి హస్తిన వెళ్లారు. గంటా శ్రీనివాసరావు, మహీధర్‌రెడ్డి, కాసు కృష్ణారెడ్డి, పితాని సత్యనారాయణ, తోట త్రిమూర్తులు, పార్థసారథి తదితర మంత్రులు మంగళవారం ఉదయం వెళ్లనున్నారు. విభజన వల్ల ఎదురయ్యే అంశాలపై సమగ్రమైన వివరాలతో ఒక నోట్‌ను ఆంటోనీ కమిటీకి అందించనున్నారు. అధిష్టానం కనుక తమ మాటను వినిపించుకోలేని పరిస్థితులు కనిపిస్తే మాత్రం అంతిమంగా తమ జిల్లాలను తెలంగాణతో పాటు కలిపి ఉంచాలన్న వాదనను తెరపైకి తేవాలని కర్నూలు, అనంతపురం జిల్లాల నేతలు భావిస్తున్నారు. అయితే మంత్రి శైలజానాథ్, ఎంపీ అనంతవెంకటరామిరెడ్డి సమైక్యవాదులుగా ఉన్నందున వారిద్దరూ ఈ విషయంలో మౌనందాల్చే పరిస్థితి కనిపిస్తోంది. దూరంగా సీనియర్ మంత్రులు సమైక్యాంధ్ర ఉద్యమం, రాష్ట్రాన్ని ఐక్యంగా ఉంచేందుకు సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ మంత్రులు, నేతలు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ అదే ప్రాంతానికి చెందిన సీనియర్ మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, రఘువీరారెడ్డి తదితరులు దూరంగా ఉండటం విమర్శలకు దారితీస్తోంది. ఒకరిద్దరు మంత్రులు ఈ బాధ్యతలను భుజాలకెత్తుకున్నా... వారు జూనియర్లు కావడంతో పార్టీ అధిష్టానంలో కానీ, ఇటు రాష్ట్ర నేతలపై కానీ అంతగా ప్రభావం పడడం లేదు. అదే సీనియర్లు రంగంలోకి దిగి ఉంటే అధిష్టానం కూడా ఒకింత స్పందించేందుకు అవకాశముంటుందని పలువురు నేతలు అభిప్రాయపడుతున్నారు. పైగా సీమాంధ్ర నేతలందర్నీ పదేపదే ఢిల్లీకి తీసుకువెళ్లడం తలకు మించిన భారంగా మారింది. ప్రజలు స్వచ్ఛందంగా ఉద్యమం చేస్తున్నా... కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇతర కాంగ్రెస్ నేతలు మాత్రం ఎవరైనా ఢిల్లీ యాత్రకయ్యే ఖర్చులు భరిస్తేనే వస్తామన్నట్లుగా వ్యవహరిస్తుండడం బాధ్యతలు తీసుకున్న మంత్రులకు సమస్యగా మారింది. ‘‘మేమెన్ని సార్లని భరిస్తాం. విమాన టిక్కెట్లు తీయడం, ఢిల్లీలో వసతి, భోజన రవాణా ఏర్పాట్లు చేయించడం మావల్ల అయ్యేది కాదు. ఒకటిరెండుసార్లు అంటే ఫర్వాలేదు కానీ వరుసగా అన్నీ మేమే భరించాలంటే కష్టమే. అందుకే ఢిల్లీ యాత్ర ఉంది రండని సమాచారమిస్తున్నాం. సొంత ఖర్చులతో వచ్చేవారు వస్తారు. లేని వారు మానేస్తారు. ఇంతకుమించి మేము కూడా ఏమీ చేయలేం’’ అని ఒక నేత తమ బాధలు వివరించారు.