
సమ్మె, శాంతిభద్రతల పరిస్థితిని సమీక్షించిన సీఎం
ఉద్యోగుల సమ్మె నేపథ్యంలో అత్యవసర సేవలకు విఘాతం కలగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. సమ్మె, శాంతిభద్రతల పరిస్థితిని మంగళవారం ఆయన సమీక్షించారు. ఈమేరకు సీఎంవో మంగళవారం పత్రికా ప్రకటన విడుదల చేసింది.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి.కె.మహంతి, సీఎంవో, పోలీసు అధికారులు సమావేశంలో పాల్గొన్నారు. గణేష్ చతుర్థి, నవరాత్రుల నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేయాలని సూచించారు. ప్రత్యేకించి జంటనగరాల్లో భద్రత పెంచాలని, సున్నిత ప్రాంతల్లో తనిఖీలు చేయాలని ఆదేశించారు. రైతులకు ఇబ్బంది లేకుండా అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించాలని వ్యవసాయ శాఖ అధికారులకు సూచించారు.