
సాక్షి, విజయవాడ : జై సమైఖ్యాంధ్ర పార్టీ అధ్యక్షుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి దేశంలోనే అత్యధిక ధనవంతుడైన నాయకుడు అంటూ డొక్కా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన కచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో తిరిగి చేరుతారని నాలుగేళ్ల క్రితమే తాను చెప్పానని టీడీపీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వర ప్రసాద్ గుర్తు చేశారు. శుక్రవారం కిరణ్ కుమార్ రెడ్డి ఢిల్లీలో రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.
దీనిపై మాట్లాడిన డొక్కా.. కిరణ్ చేరిక వల్ల ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీకి ఒక్క ఓటు రాబోతోందని విమర్శించారు. కేవలం కిరణ్ ఓటు మాత్రమే కాంగ్రెస్‌కు పడుతుందని అన్నారు. కిరణ్‌పైనా, తనపైనా విచారణ జరపాలని గతంలోనే గవర్నర్‌కు లేఖ రాసినట్లు డొక్కా వెల్లడించారు. కిరణ్ తమ్ముడు కిషోర్ కుమార్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో బలమైన నాయకుడని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment