Dokka Manikya Vara Prasad
-
డొక్కా.. నోరు అదుపులో పెట్టుకో
సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రాపకం కోసమే డొక్కా మాణిక్య వరప్రసాద్(Dokka Manikya Vara Prasad) వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్(YS Jaganmohan Reddy), పార్టీ నేతల గురించి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి కనకారావు(Kommuri Kanakarao) చెప్పారు. డొక్కా నోరు అదుపులో పెట్టుకోకపోతే గట్టిగా బుద్ధి చెబుతామని హెచ్చరించారు.ఆయన ఆదివారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. పార్టీలు మారే అలవాటున్న డొక్కా, వెన్నుపోట్లు గురించి.. అది కూడా వెన్నుపోటుకి బ్రాండ్ అంబాసిడర్ అయిన చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీలో ఉండి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. డొక్కాను రాజకీయ వ్యభిచారి అని అనాలని ఉన్నా ఆయన వయసును చూసి గౌరవం ఇస్తున్నామని చెప్పారు. చంద్రబాబు మెప్పుకోసం డొక్కా చేస్తున్న ఆరోపణలు చూస్తుంటే మంత్రిగా పనిచేసింది ఈ వ్యక్తేనా అని సందేహం కలుగుతోందన్నారు. చంద్రబాబుకి కూడా డొక్కా వ్యవహారం తెలుసు కాబట్టే ఏ పదవీ ఇవ్వకుండా పక్కన పెట్టేశారని చెప్పారు.జగన్ అన్నం పెట్టడంలేదని విజయమ్మ ఏమైనా డొక్కాకు ఫోన్ చేసి చెప్పారా అని మండిపడ్డారు. వైఎస్ జగన్‌పై అవాకులు చవాకులు పేలితే ఊరుకోబోమని హెచ్చరించారు. దళిత కార్డును అడ్డం పెట్టుకుని ఏది మాట్లాడినా చెల్లుతుందనుకుంటే పొరపాటేనని చెప్పారు. ఈ రాష్ట్రంలో దళితులకు న్యాయం జరిగింది కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలోనే అని తెలిపారు. వైఎస్ జగన్ 5 మంది దళితులకు మంత్రి పదవులు ఇచ్చారని, 15 మంది ఎస్సీలను కార్పొరేషన్ చైర్మన్లుగా నియమించారని తెలిపారు. డొక్కాకు చేతనైతే సూపర్ సిక్స్ హామీలు అమలు చేయకుండా ప్రజలకు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబును ప్రశ్నించాలని కనకారావు చెప్పారు. -
ఏ సీఎం చేయని విధంగా సీఎం జగన్ భూములన్నీ సర్వే చేయిస్తున్నారు
-
ఎస్సీల గురించి మాట్లాడే అర్హతే మీకు లేదు..
-
‘వైఎస్ జగన్‌ది మేనిఫెస్టో.. చంద్రబాబుది మోసఫెస్టో’
సాక్షి, గుంటూరు: వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకొచ్చింది మేనిఫెస్టో అయితే చంద్రబాబు ప్రవేశపెట్టింది మోసఫెస్టోనని మంత్రి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. ఈ అంశాన్ని ప్రజల్లో తీసుకెళ్లాలని అన్నారు. మేనిఫెస్టో గురించి చంద్రబాబు మాట్లాడుతుంటే సిగ్గేస్తోందని విమర్శించారు. గతంలో చంద్రబాబు ఎంతమంది పేదలను దనవంతులుగా చేశాడో చెప్పాలని డిమాండ్ చేశారు. వాగ్ధానాలు చేసి మోసగించిన వ్యక్తి చంద్రబాబు అని మండిపడ్డారు. వైఎస్ జగన్ మేనిఫెస్టో.. చంద్రబాబు మోసఫెస్టోపై ఇంటింటా చర్చ జరగాలని అన్నారు. గుంటూరు జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ‘మేనిఫెస్టో అంటే జగన్’ అనే అంశంపై చర్చా కార్యక్రమం నిర్వహించారు. ఈ చర్చలో వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్, ఏపీ మీడియా అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు, ఆర్థికరంగ విశ్లేషకులు పాపారావు, మంత్రి అంబటి రాంబాబు, ఎమ్మెల్సీలు ఉమారెడ్డి వెంకటేశ్వర్లు, యేసు రత్నం, మర్రి రాజశేఖర్, ఎమ్మెల్యేలు కిలారి రోశయ్య, ముస్తఫా తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు ఆదివారం అంబటి రాంబాబు మాట్లాడుతూ.. ‘రాజకీయాల్లో సీఎం జగన్ ట్రెండ్ సెట్టర్. ఆయన పాలన ప్రజలకు స్వర్గం.. బాబు, ఎల్లో మీడియాకు నరకం. రాజకీయ నాయకులు భష్టు పట్టించిన మేనిఫెస్టోకు పవిత్రత తెచ్చిన వ్యక్తి సీఎ జగన్. జగన్ మోహన్ రెడ్డి రెండు పేజీల మేనిఫెస్టో ఇచ్చారు. అందులో పేర్కొన్నట్లే సంక్షేమ ఫలాలను ఇంటింటికీ తీసుకెళ్లి ప్రజలకు ఇస్తున్నాం. మీకు మేలు చేస్తేనే ఓటేయమని అడుగుతున్నాం. పేదలకు మేలు చేస్తే ఓటేయండి...లేకపోతే వద్దని దమ్ముగా చెప్పిన ఒకే ఒక్కడు వైఎస్ జగన్మోహన్రెడ్డి’ అని అంబటి వ్యాఖ్యానించారు. చదవండి: ఇంకా 25 మంది కాంటాక్ట్‌లోకి రాలేదు: మంత్రి బొత్స కీలక వ్యాఖ్యలు టీడీపీ కుట్రలను బహిర్గతం: డొక్కా మాణిక్య వరప్రసాద్ చెప్పిన ప్రతి అంశాన్ని అమలు పరచిన గొప్ప ముఖ్యమంత్రి జగన్ అని ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ పేర్కొన్నారు. మేనిఫెస్టో అంటే బైబిలు, ఖురాన్, భగవద్గీత అని ముఖ్యమంత్రి అన్నారని.. అందుకే మేనిఫెస్టో అంటే జగన్‌దేనని అన్నారు. ప్రజలను మోసపూరిత మాటలతో చంద్రబాబు మోసం చేస్తున్నారని విమర్శించారు. గుంటూరు జిల్లాలోని ప్రజలకు నిజానిజాలు తెలిపి టీడీపీ కుట్రలను బహిర్గతం చేయాలనే ఈ కార్యక్రమం చేపట్టామని తెలిపారు. చంద్రబాబు మేనిఫెస్టోను ప్రజలు చించేశారు: ఎమ్మెల్సీఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ‘రాజకీయ పార్టీలు తాము గెలిచిన తరువాత ప్రజలకు చేయబోయే పథకాలను తెలియజేస్తారు.కొన్ని పార్టీలు ఎన్నికలకు ముందు విడుదల చేసిన మేనిఫెస్టో గెలిచిన తరువాత చించుతున్నారు. గతంలో చంద్రబాబు విడుదల చేసిన మేనిఫెస్టోను ప్రజలు చెక్ చేస్తే అప్పటికే దానిని చించారని గుర్తించారు. వైఎస్సార్సీపీ తీసుకు వచ్చిన మేనిఫెస్టోను నాయకుల ముందు ఉంచి ఖచ్చితంగా అమలు చేయాలని ఆదేశించి 98 శాతం అమలు చేసిన వ్యక్తి ముఖ్యమంత్రి జగన్’ మేనిఫెస్టోను వెబ్సైట్ నుంచి మాయం చేసిన వ్యక్తి చంద్రబాబు: కొమ్మినేని శ్రీనివాసరావు గతంలో చంద్రబాబు మేనిఫెస్టోలో చెప్పింది ఒక్కటి కూడా అమలు కాలేదని, 2019లో వైఎస్ జగన్ మేనిఫెస్టోలో చెప్పిన ప్రతీ అంశం అమలు చేశారని ఆంధ్రప్రదేశ్ మీడియా అకాడమీ ఛైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు అన్నారు. తన మేనిఫెస్టోను వెబ్ సైట్ నుంచి మాయం చేసిన వ్యక్తి చంద్రబాబు అంటూ కొమ్మినేని దుయ్యబట్టారు. ‘‘మేనిఫెస్టోను భగద్గీత,ఖురాన్,బైబిల్ గా భావించిన వ్యక్తి సీఎం జగన్. మేనిఫెస్టో అంటే సీఎం జగన్ దృష్టిలో ప్రజలకు ఇచ్చిన హామీ. మేనిఫెస్టో అంటే చంద్రబాబు దృష్టిలో ప్రజలను నమ్మించే ఓ కాగితం. దేశమంటే మట్టికాదోయ్.. మనుషులోయ్ అన్నారు గురజాడ.. ఆయన మాటలను తూచా తప్పకుండా పాటిస్తున్న వ్యక్తి వైఎస్ జగన్. ప్రజలను మోసం చేసేందుకు చంద్రబాబు మరోసారి సిద్ధమయ్యారు. సోనియా గాంధీని ఎదిరించి సీఎం జగన్ ఎన్నో ఇబ్బందులు పడ్డారు’’ అని కొమ్మినేని అన్నారు. చంద్రబాబు మేనిఫెస్టో కలగూరగంప: ఆర్ధిక రంగ విశ్లేషకులు పాపారావు వైఎస్ జగన్ మేనిఫెస్టోను తప్పుపట్టిన చంద్రబాబు ఇప్పుడు అదే మేనిఫెస్టోను ఫాలో అవుతున్నాడు. ఏపీ శ్రీలంక అయిపోతుందని ప్రచారం చేశారు. చంద్రబాబు మేనిఫెస్టో కలగూరగంప. జగన్ అవునన్నదల్లా చంద్రబాబు కాదన్నాడు. జగన్ ఎస్ అంటే నో అన్నాడు..నో అంటే ఎస్ అన్నాడు. చంద్రబాబు మేనిఫెస్టోపై ఆయన పార్టీలోనూ చర్చ జరగడం లేదు. మేనిఫెస్టోలో చెప్పిందే జగన్ చేస్తున్నాడు. పేద ప్రజలను మోసం చేయడం లేదు. ఆయన వల్ల ఎవరూ దగాపడలేదు. అమరావతిలో పేదలకు ఇళ్లిస్తామంటే చంద్రబాబు చీదరించుకున్నాడు. పేదలు అమరావతిలో ఉండకూడదా? జనానికి ఉపయోగపడేలా రాజకీయం చేయాలి. పేదలకు వ్యతిరేకంగా భావజాలంతో ఉన్న వారిని తరిమికొట్టాలి మళ్లీ జగనే సీఎం: మర్రి రాజశేఖర్ మేనిఫెస్టోను తూచ తప్పకుండా అమలు చేస్తున్న ఒకే ఒక్క ముఖ్యమంత్రి జగన్ అని ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ పేర్కొన్నారు. సీఎ జగన్ మేనిఫెస్టోకు ఒక విలువ తెచ్చారని ప్రశంసించారు. భారతదేశానికే ఆదర్శవంతమైన వైఎస్ జగన్.. చంద్రబాబులాగా అబద్ధాలు చెప్పుంటే 2014లో సీఎం అయ్యుండేవారని అన్నారు. ఒక్కరూపాయి కూడా లంచం తీసుకోకుండా ప్రజలకు సేవలు అందేలా చేస్తున్న వ్యక్తి వైఎస్ జగన్ అని పేర్కొన్నారు. చంద్రబాబు ప్రకటించిన మేనిఫెస్టోకు ప్రజల నుంచి స్పందన రావడం లేదని ఈ రాష్ట్రానికి మళ్లీ జగనే సీఎం అవుతారని ధీమా వ్యక్తం చేశారు. -
చంద్రబాబు మేనిఫెస్టో మోసపూరితమైనది: డొక్కా మాణిక్య వరప్రసాద్
-
‘38 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చిన ఏకైక ప్రభుత్వం ఇది’
సాక్షి, తాడేపల్లి: 38 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చిన ఏకైక ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమని ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ స్పష్టం చేశారు. గుంటూరు, విజయవాడలోని కొన్ని ప్రాంతాల ప్రజలకు అమరావతిలో ఇళ్ల స్థలాలు ఇచ్చామన్న సంగతి మాణిక్య వరప్రసాద్ మరోసారి తెలిపారు. శనివారం తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మాణిక్యవరప్రసాద్ మాట్లాడుతూ..‘పేదలకు అమరావతిలో ఇల్లు కట్టడాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టుకు వెళ్లారు. పేదల పక్షాన పోరాడుతున్నానని జగన్ చెప్తున్నారు.అమరావతిలో కేవలం ఒక వర్గం మాత్రమే ఉండాలని మీ ఉద్దేశమా?, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ను సీఎం జగన్ ప్రభుత్వం శిరసావహిస్తోంది. ప్రతీ పేదవాడికి ఇంటి స్థలం ఉండాలనేది సీఎం జగన్ ఉద్దేశం. పేదలకోసం పోరాడతామనే వామపక్షాలు, ప్రజాసంఘాలు ఈ జడ్జిమెంట్‌పై కిమ్మనలేదు. రాజ్యాంగం ప్రకారం ప్రతీ వ్యక్తికి సమానత్వం ఉండాలి. పేదలకు మంచి జరుగుతున్నప్పుడు అడ్డుకునే సంస్కృతిని టీడీపీ మానుకోవాలి’ అని పేర్కొన్నారు. -
వ్యధార్థ జీవుల యథార్థ కవి
శ్రీశ్రీ 20వ శతాబ్ది ద్వితీయార్ధంలో నాటి కాలపు సామాజికార్థిక రాజకీయ అంశాలను, ఆకలి పేదరికపు కోరల్లో నలుగుతున్న వ్యధార్థ జీవితాలను కవిత్వీకరించాడు. దేశీయంగా జాతీయ ఉద్యమాన్ని నడుపుతున్న గాంధీ ప్రభావంతో, అంతర్జాతీయంగా మార్క్సిస్ట్ సైద్ధాంతిక ప్రభావంతో సాహిత్య సృజన చేశాడు. ఈ విధంగా శ్రీశ్రీపై జాతీయ ఉద్యమ ప్రభావం దాన్ని నడిపిస్తున్న గాంధీ ప్రభావం, ప్రపంచ పవనంగా వీస్తున్న మార్క్సిస్ట్ దృక్ప థాలతో శ్రీశ్రీ కవిత్వం ముందుకు సాగిందని నేను భావిస్తున్నాను. గాంధీ స్వాతంత్య్రోద్యమ తాత్విక పునాదిపై కవిత్వమే కాదు.. నాటికలు, వ్యాసాలు, కవితలు, వ్యాఖ్యానాలు, అనువా దాలు, ఇంటర్వ్యూలు, ఇలా వివిధ ప్రక్రియల్లో రచనా వ్యాసంగం చేశాడు. ‘మహాసంకల్పం’ కవిత ద్వారా గాంధీ సైద్ధాంతిక భూమికను వ్యక్తం చేస్తూ.. ‘ఇదిగో నా స్వాతంత్య్ర స్వప్నం.. జన సందోహం కరిగి ఒకే వ్యక్తిగా రూపుధరిస్తే/ ఇదేం చిత్ర మని చూశాను ఒక పెద్ద కాంస్య విగ్రహానికి ప్రాణం వచ్చినట్టుగా/ ఒక మేఘం గగనపథం దిగి మానవుడై నిలిచినట్టుగా.. ఒకే ఒక్క మానవ మూర్తి నా కళ్ళ ముందు కనిపించాడు... అతని బాధ్యత వహిస్తామని అందరూ హామీ ఇవ్వండి.. అంటూ గాంధీ తాత్వికతకు బావుటా పట్టాడు. మహాత్ముడి ఆదర్శాల వెలుగులో దేశ ప్రజలు పయనించాలని కాంక్షిస్తూ ఈ రచన చేశాడు. మహా త్ముడి నిర్యాణం తర్వాత శ్రీశ్రీ రాసిన ‘సంభ వామి యుగేయుగే’ వంటి రచన తెలుగులోనే కాదు, మరే ప్రాంతీయ భాషలోనూ రాలేదని ప్రముఖ పాత్రికేయులు నార్ల చిరంజీవి వ్యాఖ్యానించారు. ఓ మహాత్మా ఓ మహర్షీ/ ఏది చీకటి ఏది వెలుతురు ఏది జీవితమేది మృత్యువు/ ఏది పుణ్యం ఏది పాపం/ ఏది నరకం ఏది నాకం.. అంటూ రాసిన ‘ఓ మహాత్మా’ కవితా ఖండిక ప్రజల నాలుకలపై నిలిచి ఉంది. స్వభావరీత్యా శ్రీశ్రీ పసిపాప లాంటి వాడుగా కనిపిస్తాడు. ప్రతిదానికీ స్పందించే లక్షణం ఉంటుంది. ‘అభిప్రాయాల కోసం బాధల్ని లక్ష్యపెట్టని వాళ్లు మాలోకి వస్తారు. అభిప్రాయాలు మార్చుకొని సుఖాల్ని కామించే వాళ్లు మీలోకి వస్తారు’– అని సాహిత్య లోకాన్ని రెండుగా విభజించి ఒక స్పష్టమైన గీత గీసి ప్రజాశిబిరం, ప్రజా వ్యతిరేక శిబిరంగా విడ గొట్టాడు. స్వాతంత్య్రానంతరం ధనిక పేదల మధ్య పెరిగిన అంతరాలు ఆకలి జీవుల, అన్నార్తుల హాహాకారాలను ‘పేదలు’ కవితలో వ్యక్తపరుస్తాడు. ‘ఉద్యోగం ఇవ్వని చదువు/ నిలకడ లేని బతుకు వ్యాపకాలు/ స్వరాజ్య దుఃస్థితిని చూపుతున్నాయి’ అంటాడు. చెదిరి పోయిన కలల్ని ‘బాటసారి’ కవితలో కూటి కోసం, కూలి కోసం, పట్టణంలో బ్రతుకు దామని తల్లి మాటలు చెవిని పెట్టక బయలు దేరిన బాటసారికి ఎదురైన సంక్షోభాన్ని కళ్ళకు కట్టినట్లు చూపుతాడు. గాంధీ గ్రామ స్వరా జ్యంపై అపార నమ్మకం ఉన్న శ్రీశ్రీ గ్రామీణ జీవితంలో ముసురుతున్న రోదనలకు అక్షర రూపం ఇచ్చాడు. అయితే ఇటీవల దళిత సాహితీవేత్తలు శ్రీశ్రీ సాహిత్యం పట్ల నిర్లక్ష్యంగా ఉన్నట్టు నేను భావిస్తున్నాను. సమస్త కార్మిక, కర్షక, అభా గ్యుల, అన్నార్తుల అనాధల, వ్యధార్థజీవుల, యథార్థ బతుకుల్ని తన సాహిత్యంలో చూపిన శ్రీశ్రీని మన క్యాంపులోనే పెట్టుకోవాలి. అవతలి పక్షాలకు అప్పజెప్పి మనం బల హీనులం కాకూడదు. తెలుగు సాహిత్యంలో జాషువాని, శ్రీశ్రీని రెండు కళ్ళుగా స్వీకరించాల్సిన సందర్భం. తద్వారానే సామాజిక పరివర్తనకు మార్గదర్శకులమవుతాం. ఇది నేటి చారిత్రక అవసరం. సామాజిక సంస్కరణ లేకుండా భారతదేశ అభివృద్ధిని కాంక్షించలేము. ఈ సామాజిక లక్ష్యానికి ఒక సాంస్కృతిక కార్యాచరణను ప్రకటించిన వాళ్లు శ్రీశ్రీ, జాషువా. – డొక్కా మాణిక్య వరప్రసాద్, వ్యాసకర్త ఏపీ ప్రభుత్వ విప్, మాజీ మంత్రి (నేడు శ్రీశ్రీ జయంతి) -
దళిత సంక్షేమంలో చంద్రబాబు విఫలం
సాక్షి, అమరావతి: దళిత సంక్షేమంలో చంద్రబాబు ఘోరంగా విఫలమయ్యారని ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ విమర్శించారు. ఊహా ప్రపంచంలో తిరుగుతూ ప్రతిదీ తానే కనిపెట్టానని చెప్పుకొనే చంద్రబాబు.. ఎస్సీ నాయకులంతా తన భ్రమలను ప్రచారం చేయాలని కోరుకుంటున్నారని ఎద్దేవా చేశారు. దళితులకు సంక్షేమం అందించడంలో గొప్ప సంస్కరణలు తీసుకొచ్చిన సీఎం వైఎస్ జగన్‌ను తూలనాడటం సిగ్గు చేటని మండిపడ్డారు. ఆయన శుక్రవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు 14 ఏళ్లు సీఎంగా పనిచేసి కూడా దళితులు గుర్తుంచుకునేలా ఏ ఒక్క పథకాన్నీ అందించలేదన్నారు. ఇప్పటికైనా దళితుల సంక్షేమంపై చర్చించేందుకు చంద్రబాబు ముందుకురావడం శుభపరిణామమని చెప్పారు. కనీసం చర్చ తర్వాతైనా వాస్తవాలు తెలసుకుంటారన్నారు. సీఎం జగన్ దళిత సంక్షేమంలో డిస్టింక్షన్ సాధిస్తే, చంద్రబాబు ఫెయిలయ్యారని పేర్కొన్నారు. దళిత సంక్షేమం, దళితులకు ఎవరు మేలు చేశారనే అంశంపై చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని, అసెంబ్లీ వేదికగా చర్చిద్దామని చెప్పారు. చంద్రబాబుకు దమ్ము, ధైర్యం ఉంటే అసెంబ్లీ వేదికగా దళిత సమస్యలపై చర్చకు రావాలని సవాలు చేశారు. విద్యతోనే దళితుల జీవితాల్లో వెలుగులు విద్యతోనే దళితుల జీవితాల్లో వెలుగులు సాధ్యమన్న అంబేడ్కర్ ఆలోచన స్ఫూర్తిని సీఎం జగన్ అమలు చేస్తున్నారన్నారు. చంద్రబాబు హయాంలో విద్య, వైద్యరంగాల్ని కార్పొరేట్ శక్తుల చేతుల్లో పెట్టి భ్రష్టుపట్టించారని విమర్శించారు. సీఎం జగన్ నాడు–నేడు, ఇంగ్లిష్ మీడియం, ఆరోగ్యశ్రీతో విద్య, వైద్యాలను పెట్టుబడిదారీవ్యవస్థ చేతుల్లోంచి విడిపించి సామాన్యుడికి అందించారని చెప్పారు. రాష్ట్రంలో ఎటువంటి వివక్షకు తావులేకుండా రూ.2.08 లక్షల కోట్లు ప్రజలకు నేరుగా అందింస్తే.. అందులో ఏకంగా రూ.53 వేల కోట్లకుపైగా దళితులకు ఇచ్చి ఆర్థిక ఎదుగుదలకు తోడ్పడ్డారన్నారు. కరోనా తర్వాత పేదవాడికి డబ్బు పంచమని ప్రపంచం అంతా చెబుతుంటే దేశంలో ఏ ముఖ్యమంత్రి ముందుకు రాలేదని చెప్పారు. కానీ సీఎం జగన్ సంక్షేమాన్ని ఆపలేదని గుర్తుచేశారు. ఒకే ఒక్క పరీక్ష ద్వారా గ్రామ, వార్డు సచివాలయాల్లో పారదర్శకంగా నియామకం చేస్తే దాన్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలే అధికంగా ఉద్యోగాలు పొందడం సంస్కరణకు నిదర్శనమని చెప్పారు. మీ ఆర్థికశాస్త్రంలో ఎప్పుడైనా ఉందా? చంద్రబాబులో అసహనం పెరిగిపోతోందని, సీఎం జగన్‌ను నోటికొచ్చినట్టు మాట్లాడటం హేయమని చెప్పారు. తాను చేయలేనిది ఎదుటివారు చేస్తే ఓర్వలేని గుణం చంద్రబాబులో నిలువెల్లా ఉందన్నారు. 30 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు ఇళ్లస్థలాలు ఇస్తే.. సింహభాగం దళితులకే అందాయని తెలిపారు. చంద్రబాబు హయాంలో ఎప్పుడైనా సెంటుస్థలం ఇచ్చారా? ఆయన ఆర్థికశాస్త్రంలో ఆ విధానం ఉందా? అని ప్రశ్నించారు. సీఎం జగన్ చేసిన మేలుతో జగనన్నే మా భవిష్యత్తు అని ప్రతి కుటుంబం చెబుతోందన్నారు. ‘అసెంబ్లీ కంటే ప్రజాస్వామ్యంలో చర్చావేదిక ఏం ఉంటుంది. మీరు చర్చిద్దాం అంటున్నారు కదా. అసెంబ్లీకి రండి. మీరు వస్తానంటే ప్రత్యేక అసెంబ్లీ పెట్టమని కూడా కోరతాం. అమరావతిలో పేదలకు ఇళ్లస్థలాలు ఇస్తామంటే దానికి వ్యతిరేకంగా కేసులు వేసింది మీరే. ఇప్పుడు దళితుల సంక్షేమం గురించి ఏం మాట్లాడతారు. విజయవాడ నడిబొడ్డున రూపుదిద్దుకుంటున్న అంబేడ్కర్ విగ్రహాన్ని చూస్తే దళితుల ఆత్మగౌరవం ఎంతగా పెరుగుతోందో తెలుస్తోంది..’ అని చెప్పారు. దళితులను రాజకీయంగా ఉన్నతస్థానాల్లో కూర్చోబెట్టడమే కాకుండా క్యాబినెట్లో 70 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజికవర్గాలకు ప్రాతినిధ్యం కల్పించడం దేశ చరిత్రలో ఎక్కడా లేదన్నారు. మండలిలో 43 మంది వైఎస్సార్సీపీ సభ్యులు ఉంటే వారిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ సభ్యులు 22 మంది ఉన్నారని చెప్పారు. రాష్ట్రంలో 29 ఎస్సీ నియోజకవర్గాలు, నాలుగు పార్లమెంటు స్థానాలు ఉంటే.. జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో 28 నియోజకవర్గాల్లోను, నాలుగు పార్లమెంటు స్థానాల్లోను గెలిచిన విషయాన్ని చంద్రబాబు మర్చిపోకూడదని ఆయన పేర్కొన్నారు. -
దళితులను చూస్తే చంద్రబాబుకు ఎందుకంత కడుపుమంట?
మంత్రి ఆదిమూలపు సురేష్ మీద చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ ఆ మాటలను వెనక్కు తీసుకోవాలని ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ డిమాండ్ చేశారు.యర్రగొండపాలెంలో చంద్రబాబు కావాలనే జనాన్ని రెచ్చగొట్టారని, టీటీడీ కార్యకర్తల ద్వారా రాళ్ల దాడి చేయించారని అన్నారు. వీడియోలు చూస్తే రాళ్లదాడి చేసిన వారు ఎవరనేది స్పష్టంగా కనిపిస్తుందని, కానీ దాన్ని తోసిపుచ్చి మాపై ఎదురుదాడి చేయటం ఏంటని ప్రశ్నించారు. చంద్రబాబు వైఖరి చూస్తుంటే సురేష్‌కు భద్రత కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. మంత్రి సురేష్ మంచి విద్యావేత్త, అలాంటి వ్యక్తిపై ఇలాంటి దాడులు చేయటం కరెక్ట్ కాదు. చంద్రబాబుకు అసలు దళితులను చూస్తే ఎందుకంత కడుపుమంట అని నిలదీశారు. దళితులకు సీఎం జగన్ ఎంతో మేలుచేస్తూ అవినీతికి తావు లేకుండా పరిపాలన కొనసాగిస్తున్నారని, ప్రస్తుతం వారి జీవన ప్రమాణాలు కూడా పెరిగాయని డొక్కా మాణిక్య వరప్రసాద్ స్పష్టం చేశారు. అంతమాత్రానికే దళితులపై చంద్రబాబు ద్వేషం ఏంటన్నారు. దళిత మంత్రి సురేష్‌కు రక్షణ కావాలని, అంతే కాకుండా చంద్రబాబు వ్యాఖ్యలపై విచారణ చేయాలని డిమాండ్ చేసారు. దళితులకు మంచి జరుగుతుంటే వారిపై మీ స్టాండ్ ఏంటని అన్నారు. రెండు లక్షల కోట్ల డబ్బు నేరుగా పేదలకే చేరితే చంద్రబాబుకు ఎందుకంత కడుపుమంట అని కూడా ప్రశ్నించారు. -
సీఎం జగన్ యువతలో నమ్మకాన్ని కలిగిస్తున్నారు: ఎమ్మెల్సీ డొక్కా
-
గుంటూరు: సంత్ శ్రీ సేవాలాల్‌కు ఎమ్మెల్సీ డొక్కా నివాళులు
-
న్యాయ విచారణలో రాజకీయ వ్యాఖ్యలు అవాంఛనీయం
సాక్షి, అమరావతి: న్యాయస్థానాలు, న్యాయమూర్తులు, న్యాయ వ్యవస్థ స్వతంత్ర ప్రతిపత్తిపై ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు, తమకు అపార గౌరవం ఉందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ నొక్కి వక్కాణించారు. ఏదైనా ఉంటే తీర్పులో రాస్తే దాన్ని గౌరవంగా అమలు చేస్తామని తెలిపారు. తీర్పుపై విభేదిస్తే అప్పీల్ చేస్తామన్నారు. కానీ, ఇలా చేయకుండా జడ్జి రాజకీయ పార్టీల మాదిరిగా మాట్లాడుతూ.. ఎల్లో మీడియా, దుష్ట చతుష్టయానికి ఉపయోగపడేలా వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. రాజకీయ పార్టీల మాదిరిగా న్యాయమూర్తి వ్యాఖ్యలు చేస్తే ప్రజాస్వామ్యంలో రాజ్యాంగ స్ఫూర్తిని, న్యాయవ్యవస్థ గౌరవాన్ని ఏ విధంగా కాపాడుకున్న వాళ్లమవుతామని అన్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం మాణిక్య వరప్రసాద్ మీడియాతో మాట్లాడారు. ఇటీవల హైకోర్టులో ఒక న్యాయమూర్తి చేస్తున్న వ్యాఖ్యలకు ఎల్లో మీడియా తనదైన వక్రభాష్యం చెబుతూ కథనాలు అచ్చేస్తోందన్నారు. న్యాయ వ్యవస్థను పక్కదారి పట్టించి, తమకు కావాల్సిన రాజకీయ ప్రయోజనాల కోసం ఆ వ్యాఖ్యలను రాజకీయ పార్టీలు వాడుకుంటున్నాయన్నారు. ఇటీవల ఒక న్యాయమూర్తి కోర్టులో లేని అంశాలను ప్రస్తావిస్తూ ఎన్నికలు తొందరగా వస్తాయని వ్యాఖ్యానించడం బాధాకరమన్నారు. అందులో ఆయన ఉద్దేశం ఏమిటో తమకు అర్థం కావడం లేదన్నారు. న్యాయమూర్తి వ్యాఖ్యలపై వెంటనే అడ్వొకేట్ జనరల్ స్పందించి.. ఎన్నికలు నిర్దేశిత సమయంలోనే జరుగుతాయని తేల్చిచెప్పారన్నారు. ఆ న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలపై న్యాయ వ్యవస్థలో ఉన్న పెద్దలు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. కోర్టులో వాదనలు జరిగేటప్పుడు న్యాయమూర్తులు వ్యక్తిగతంగా రాజకీయ వ్యాఖ్యలు చేయకుండా చూడాలని హైకోర్టుకు ఆయన విన్నవించారు. వాదనల సందర్భంగా న్యాయమూర్తులు చేస్తున్న కొన్ని వ్యాఖ్యలు రాజకీయ పార్టీలు, కొన్ని సంస్థలు, విద్రోహశక్తులకు ఉపయోగపడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కోర్టుల్లో ఉన్న రాజధాని అంశంపై వ్యాఖ్యలా? రాజకీయ వ్యాఖ్యలు చేయకుండా సంయమనం పాటించాలని న్యాయమూర్తులకు మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సూచించారని మాణిక్యవరప్రసాద్ గుర్తుచేశారు. ఇటీవల చెన్నై కోర్టు ఒక కేసులో ఎన్నికల సంఘంపై హత్య కేసు నమోదు చేయాలని ఆదేశించడంపై సుప్రీంకోర్టు.. అలా పరిధి దాటి మాట్లాడకూడదని చెన్నై కోర్టుకు దిశానిర్దేశం చేసిందన్నారు. ఏపీకి రాజధాని ఎక్కడో తెలియదని తన కుమార్తె అన్నారని ఇటీవల ఓ న్యాయమూర్తి వ్యాఖ్యలు చేశారని ఆయన గుర్తుచేశారు. రాజధాని అంశంపై హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో విచారణ సాగుతోందని, ఈ సమయంలో దానిపై వ్యాఖ్యలు చేయడం సబబు కాదన్నారు. ఆ వ్యాఖ్యలపై ఆత్మపరిశీలన చేసుకోవాలి.. గతంలో ఎన్నడూ లేని రీతిలో ఎస్సీల సంక్షేమం, అభివృద్ధికి చిత్తశుద్ధితో పనిచేస్తున్న ప్రభుత్వంపై కొన్ని రాజకీయ పార్టీలు, ఎల్లో మీడియాకు ఉపయోగపడేలా న్యాయమూర్తి వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు వాంఛనీయం? సబబు? అని మాణిక్య వరప్రసాద్ ఆవేదన వ్యక్తంచేశారు. రాజకీయ పార్టీలకు ఎన్నో లక్ష్యాలు ఉంటాయని.. వాటి సాధనలో ఆ పార్టీలే మార్గాలు చూసుకుంటాయని తెలిపారు. వాటికి మీ సహకారం అవసరమా... అనేది ఆలోచించుకోవాలన్నారు. రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసేలా రాజకీయ వ్యాఖ్యలు చేయడంపై న్యాయమూర్తి ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇదీ చదవండి: గుంటూరు: డిగ్రీలు లేని పరిశోధకుడు.. 500 అదృశ్య గ్రామాలను గుర్తించి.. -
అమరావతి రైతులను ఆదుకునేందుకు సిద్ధంగా ఉన్నాం: డొక్కా మాణిక్య వరప్రసాద్
-
Gurram Jashuva: మనువును జయించిన విశ్వనరుడు
‘‘కులమతాలు గీచుకున్న గీతల జొచ్చి / పంజరాన గట్టువడను నేను నిఖిల లోకమెట్లు నిర్ణయించిన నాకు తరుగు లేదు విశ్వనరుడ నేను’’ అంటూ విశ్వమానవతను ప్రకటించాడు తన కవిత్వం ద్వారా జాషువా మహాకవి. తాను నమ్మిన విలువల్ని, సిద్ధాంతాల్ని తన రచనల ద్వారా నిక్కచ్చిగా ప్రకటించాడు. తన సాహితీ ప్రస్థానంలో సామాజికంగా ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నా వెనుదిరగలేదు. కులమతాల దాడులకు వెరవక తన ప్రస్థానాన్ని కొనసాగించాడు. ‘పలుకాకుల మూకలు అసూయ చేత నన్ను ఏవిధంగా దూషించిన నా సాహితీ సౌరభం మాయమై పోద’నీ, ‘నన్ను వరించిన శారద లేచి పోవునే’ అని అన్నాడు. ‘ప్రపంచం ఎట్లా నిర్ణయించిన నాకు కొదవలేదు నేను విశ్వనరుడను’ అని ప్రకటించాడు. కసరి బుసగొడుతున్న నాగరాజుల వైపు కవితా దివిటీలను విసిరాడు. కేవలం విశ్వమానవతను ప్రకటించడమే కాకుండా తన కవితా ప్రస్థానమంతటా జాగరూకుడై కవిత్వమై ప్రతి స్పందించాడు. జాతీయోద్యమ కాలంలో జాతి జనుల్లో భారతమాత గొప్పతనాన్ని చాటి చెప్పే అనేక విషయాలను తన కవిత్వంలో పొందుపరచాడు. సింధు గంగా నదులు జీవజల క్షీరాన్ని నిరంతరాయంగా ప్రవహింపజేస్తూ తమ సంతానాన్ని పోషించుకుంటున్నదని పచ్చి బాలింతరాలుగా కన్న దేశాన్ని కీర్తించాడు. తద్వారా ప్రజల్లో దేశభక్తిని పాదుకొల్పాడు. దేశాన్ని గతంలో పాలించిన రాజుల వైభవాన్నీ, తాత్విక మార్గదర్శకులుగా ఉండిన మహనీయుల గురించీ, విశ్వవిఖ్యాతి చెందిన వారి ఘనతను గురించీ ప్రజలకు కనువిప్పు కలిగించే విధంగా, జాతీయభావాలు ఉప్పొంగేలా కవిత్వం రాసిన పద్యాల పరుసవేది జాషువా. బుద్ధుని తాత్విక చింతనలోని సారాంశాన్ని వర్ణిస్తూ... ‘రెండు వేల ఐదువందల ఏళ్ళు గడిచినా నీ కమనీయ బోధలకు నిగ్గు రవ్వంత కూడ తగ్గలేదు’ అంటాడు. అశోకుని వంటి మహా చక్రవర్తుల గుండెలను సైతం బౌద్ధం పెళ్ళగించి అహింసా సిద్ధాంతం వైపు మళ్ళించిందని పేర్కొన్నాడు. మరో సందర్భంలో భారతీయ సంస్కృతీ ఔన్నత్యాన్ని విశ్వసభల్లో చాటిన మహనీయుడు స్వామి వివేకానంద గొప్పదనం గురించి ‘వివేకానంద’ అనే ఖండికలో వివరించాడు. పేదరికం, అవమానాలతో కుంగిపోక ధీరోదాత్తునిలా ఎదుర్కొని విశ్వనరుడి స్థాయికి ఎదిగాడు. నవయుగ కవి చక్రవర్తిగా కీర్తినొందాడు. తెలుగుదనాన్ని తన పద్యంలో జాలువార్చి స్వచ్ఛమైన తెలుగుభాషకు ప్రాణప్రతిష్ఠ చేశాడు. అటు సంప్రదాయ సాహిత్య సంస్కారాన్నీ, ఇటు ఆధుని కతనూ మేళవించి తన సాహిత్య ప్రస్థానాన్ని కొనసాగిం చాడు. కావుననే జాషువా పద్యం జానపదుల నాలుకలపై జీవించి వుంది. ఇంతటి ప్రాచుర్యం పొందిన కవి తెలుగు భాషలో అరుదని చెప్పొచ్చు. జాషువా సాహిత్యంలో భారత పురాణ పురుషులే గాక, ప్రపంచ శాంతికి సత్యం, అహింస వంటి ఆయుధాలను అందించిన గౌతమ బుద్ధుడు, అహింసామూర్తి గాంధీ, సామాజిక తత్వవేత్త అంబేడ్కర్ వంటి మహానీయులు అందరూ దర్శనమిస్తారు. బుద్ధుని బోధనల్లోని అహింసా తత్వాన్నీ, విశ్వమానవ ప్రేమనూ, ఏసుక్రీస్తు బోధనల్లోని శాంతి, కరుణ, సత్యం, సౌశీల్యాన్నీ ఆయన ప్రజల్లో దేశభక్తిని పాదుకొల్పేవిగా పేర్కొన్నాడు. ఆయన దృష్టిలో జాతీయత అంటే అన్ని మతాలు సహనంతో కలగలసి జీవించడం. ఏసుక్రీస్తు చెప్పినట్లు ‘నీవలే నీ పొరుగువారిని ప్రేమించడం’. సామాజిక సమానత, సంక్షేమం కోసం కవిత్వం రాశాడు. ‘కాందిశీకుడు’ రచనలో ‘కపాలం’ ద్వారా మాట్లాడుతూ సమాజంలోని అసమానతలు తొలగిపోయి విశ్వ సమానతా భావం, విశ్వ సోదరభావం పెంపొందినపుడే జాతీ యతా భావం ఆవిర్భావం జరుగుతుందని చెబుతాడు. నా జాతి నాయూరు నాదేశమని పొంగు స్వాభీ మానము శూన్యమయిన దాక విశ్వసౌభ్రాత్రంబు వెలయించునైక్య సం ఘావ్యాప్తిదిశల పెంపారు దాక... అంటాడు. మహాత్ముడి అకాల మరణానికి దిగ్భ్రాంతికి గురయిన జాషువా ‘బాపూజీ’ లఘు కావ్యాన్ని రచించాడు. గాంధీజీ అహింసా సిద్ధాంతాల పట్ల అత్యంత ప్రేమాదరణను కన బరచిన ఆయన ఈ కావ్యానికి ముందు మాటగా ‘వినతి’ని రాస్తూ ‘ప్రపంచ చరిత్రలో నెట్టివాడు నీయుగమున గడింపని కీర్తి నతడార్జించి, అనుంగు బిడ్డలగు భారతీయుల కంకిత మొనర్చినాడు. ప్రతిఫలముగా తనకు లభించినది బలవన్మరణము. భస్మస్వరూపము. అది తలంపరాని విషమ ఘడియ’. ‘నాడు రాలిన యశ్రు కణములే ఈ కావ్యము’ అంటాడు. బాపూజీ కావ్యంలో జాషువా హృదిలో ముద్రించుకున్న చిత్రం దృశ్యమానంగా కళ్ళకు కట్టి కనిపిస్తుంది. అహింసావాదిగా కరుణా మూర్తిగా, సంఘ సంస్కర్తగా, హిందూ ముస్లిం సమైక్యతావాదిగా గాంధీజీని చిత్రించాడు. గోచిపాత గట్టుకొని జాతి మానంబు నిలిపినట్టి ఖదరు నేతగాడు విశ్వసామరస్య విజ్ఞాన సంధాత కామిత ప్రదాత గాంధితాత’’ అంటాడు. గాంధీ సైద్ధాంతిక నిష్టను, నైతికతను మనఃపూర్వకంగా ఒప్పు కున్నాడు. ఆచరింప దగినవిగా భావించాడు. ఈ నేపథ్యంలో ఆయన ‘నివసించుటకొక నిలయము తప్ప గడన చేయుటకు ఆశపడను’ అన్నాడు. ‘ఆలు బిడ్డలకు ఆస్తి పాస్తులు గూర్చ పెడత్రోవలో కాలు పెట్టను’ అన్నాడు. ఈ నైతిక, సామాజిక నిష్ఠను గాంధీజీ దృక్పథం నుండి జాషువా గ్రహించాడు. ఆయన దృష్టిలో దేశభక్తి, విశ్వమానవత ప్రాధాన్యాలు. నిత్యం అనేక సామాజిక అవరోధాలను ఎదుర్కొన్నా, తాను మాత్రం జాతీయతా దృక్పథంతోనూ, విశ్వమానవ తత్పరతతోనూ రచనా వ్యాసంగాన్ని కొనసాగించాడు. మహాకవి దృష్టిలో దేశభక్తీ, విశ్వమానవతా రెండూ నాణేనికి రెండు వైపుల వంటివి. జీవించినంత కాలం ఈ సైద్ధాంతిక భూమికకు కట్టుబడే పనిచేశాడు. కాబట్టే బుద్ధుడు, మహాత్ముడు తనకు ఆరాధ్యులుగా భావించాడు. - డొక్కా మాణిక్యవరప్రసాద్ ఏపీ ప్రభుత్వ విప్, మాజీమంత్రి (జాషువా జయంతి వారోత్సవాలు నేటి నుంచి ఈ నెల 28 వరకు గుంటూరులో జరుగుతున్న సందర్భంగా) -
AP: శాసన మండలిలో ఇద్దరు విప్ల నియామకం
సాక్షి, అమరావతి: శాసన మండలిలో ఇద్దరు విప్‌లను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించింది. శాసన మండలిలో ప్రభుత్వ విప్‌లుగా ఎమ్మెల్సీలు జంగా కృష్ణమూర్తి, డొక్కా మాణిక్య వరప్రసాద్‌ను నియమిస్తూ సాధారణ పరిపాలన (రాజకీయ) శాఖ ముఖ్యకార్యదర్శి ముత్యాలరాజు ఉత్తర్వులిచ్చారు. ఈ నియామకాలు వెంటనే అమల్లోకి వచ్చాయని స్పష్టం చేశారు. ప్రభుత్వ ప్రతిష్ట పెంచేలా పనిచేస్తా: జంగా కృష్ణమూర్తి దాచేపల్లి: శాసన మండలిలో ప్రభుత్వ ప్రతిష్టను పెంచేలా పని చేస్తానని మండలిలో ప్రభుత్వ విప్‌గా నియమితులైన ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి చెప్పారు. గామాలపాడు సచివాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శాసన మండలిలో ప్రభుత్వ విప్‌గా తనను నియమించటంపై కృతజ్ఞతలు తెలిపారు. తనపై బాధ్యత మరింతగా పెరిగిందని చెప్పారు. (క్లిక్: గ్రామ, వార్డు సచివాలయాలకు రూ.3,000 కోట్లు) తాడికొండ అసెంబ్లీ నియోజకవర్గ అదనపు సమన్వయకర్తగా డొక్కా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు గుంటూరు జిల్లాకు చెందిన శాసనమండలి సభ్యుడు డొక్కా మాణిక్య వరప్రసాదరావును తాడికొండ అసెంబ్లీ నియోజకవర్గ అదనపు సమన్వయకర్తగా నియమించారు. ఈ మేరకు శుక్రవారం పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. (క్లిక్: గుంటూరులో బీజేపీకి బిగ్ షాక్) -
శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్సీలు శివరాంరెడ్డి, డొక్కా మాణిక్యవరప్రసాద్
-
ఏపీలో జరుగుతున్న అభివృద్ధిపై కోదండరాం ఎందుకు మాట్లాడరు?
-
‘చంద్రబాబు ట్రాప్‌లో కోదండరాం ఎలా పడ్డారో, అర్థం కావడం లేదు’
సాక్షి, అమరావతి: చంద్రబాబు చేసిన అక్రమాలను కోదండరాం ఎందుకు ప్రశ్నించరని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ మండిపడ్డారు. మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో 30 లక్షల మంది పేదలకు ప్రభుత్వం ఇళ్లు కట్టించి ఇస్తోందని, అమరావతిలో భూములిచ్చిన రైతులకు ప్యాకేజ్‌లను కూడా పెంచామన్నారు. లబ్దిదారులకు నేరుగా సంక్షేమ పథకాలు అందుతున్నాయని చెప్పారు. ప్రభుత్వ పాలనను సీఎం జగన్ ప్రజలకు చేరువ చేస్తున్నారని , రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిపై కోదండరాం ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు. దళితుల కోసం చంద్రబాబు ఏనాడైనా పనిచేశాడా అంటూ ప్రశ్నించారు. దళిత రాజధాని అనేది పచ్చి అబద్ధమని, దాని కోసం ఖరీదైన లాయర్లను టీడీపీ పెట్టిందంటే ఎలా నమ్మారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ట్రాప్‌లో కోదండరాం, హరగోపాల్ ఎలా పడ్డారో అర్ధం కావడం లేదని తెలిపారు. చంద్రబాబు తనకి అనుకూలమైన వారి భూములు గ్రీన్ జోన్ వెలుపల, అనుకూలం కాని వారి భూములు గ్రీన్ జోన్ పరిధిలో పెట్టినపుడు వాళ్లేందుకు ప్రశ్నించలేదని మండిపడ్డారు. అంబేద్కర్ పేరిట జిల్లా ఉండాల్సిందేనని మహానాడులో చంద్రబాబు తీర్మానం ఎందుకు చేయలేదని, కోనసీమలో జరిగిన విధ్వంసాన్ని చంద్రబాబు,పవన్ కళ్యాణ్ ఎందుకు వ్యతిరేకించలేదడం లేదని ధ్వజమెత్తారు. -
అభివృద్ధి కోసమే మరిన్ని జిల్లాలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న చారిత్రక నిర్ణయంపై ప్రజల నుంచి సర్వత్రా హర్షం వ్యక్తమవుతోందని మాజీ మంత్రి, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ చెప్పారు. అభివృద్ధిపై మరింతగా దృష్టి పెట్టడం కోసం జిల్లాల పునర్విభజన ఉపకరిస్తుందని చెప్పారు. తాడేపల్లిలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్ జగన్ ప్రతి పార్లమెంట్ స్థానాన్ని ఒక జిల్లాగా ఏర్పాటు చేస్తానని గతంలో ప్రకటించారని, ఆ మేరకు నేడు నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. సీఎం నిర్ణయానికి వాడవాడలా మద్దతు లభిస్తోందన్నారు. నిర్ణయం వెలువడిన మొదటి రోజే ప్రజాచైతన్యం వెల్లువెత్తిందని అన్నారు. రెండో రోజు రాష్ట్రవ్యాప్తంగా మహిళా చైతన్యం కనిపించిందన్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ మహిళలు ర్యాలీలు చేశారన్నారు. మహిళలు తొలినుంచీ సీఎం జగన్ నిర్ణయాలకు పూర్తి మద్దతు ప్రకటిస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో మహిళలకు ముఖ్యమంత్రి జగన్ మొదటి నుంచీ అగ్రప్రాధాన్యం ఇస్తున్న విషయం తెలిసిందేనన్నారు. తాను ఉమ్మడి ఏపీలో గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నప్పుడు జిల్లాల పునర్వ్యవస్థీకరణపై ఓ నివేదికను అప్పటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డికి అందించి సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేయాలని కోరినట్లు చెప్పారు. ఆయన పెద్దగా ఆసక్తి చూపలేదన్నారు. జనాభా పెరుగుతుండటం, బలహీన వర్గాలకు సంక్షేమ, అభివృద్ధి ఫలాలు అందించడానికి ప్రభావశీలమైన పరిపాలన కోసం కొత్త జిల్లాల రూపకల్పన ఉపయోగపడుతుందని చెప్పారు. వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రజలకు వివిధ ప్రయోజనాలను అందించడంపై దృష్టి పెడుతోందన్నారు. అభివృద్ధి, పరిపాలన సౌలభ్యం కోసం సీఎం జగన్ నూతన జిల్లాలను ఏర్పాటు చేశారని ప్రజలంతా గుర్తించి వారి మద్దతు తెలుపుతున్నారని చెప్పారు. కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడతామని సీఎం జగన్ పాదయాత్రలో ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చారని ఈ ప్రాంత ప్రజలు ఎంతో సంబరపడుతున్నారన్నారు. కొత్త జిల్లాలు ఏర్పాటులో కొన్ని ఇబ్బందులు ఏ ప్రభుత్వానికైనా సహజమన్నారు. 100 శాతం అందరినీ మెప్పించటం ఎవరికైనా సవాలేనన్నారు. కానీ అందర్నీ మెప్పించేందుకు సీఎం జగన్ శాయశక్తులా కృషి చేస్తున్నారని తెలిపారు. -
ఒక అసమర్థుడి మనో దర్శనం
త్రిపురనేని గోపీచంద్ ‘అసమర్థుని జీవయాత్ర’ తెలుగు సాహిత్యంలో వచ్చిన మొదటి మనోవైజ్ఞానిక నవల. మానవ మనుగడలోని వైరుధ్యాలను ముఖ్యంగా హేతువుకూ, సహజ జ్ఞానానికీ; ఆదర్శానికీ, ఆచరణకూ మధ్య తలెత్తిన ఘర్షణను కళ్ళకు కట్టినట్టు చూపిన నవల ఇది. పందొమ్మిదో శతాబ్దపు చివరి భాగంలో ప్రపంచంపై రెండు సిద్ధాంతాలు ప్రగాఢమైన ప్రభావం చూపాయి. ఒకటి ఫ్రాయిడ్ మనస్తత్వ శాస్త్రం కాగా, మరొకటి కార్ల్ మార్క్స్ కమ్యూనిజం. ఒకటి సంక్లిష్టమైన మానవ మనస్సును విశ్లేషిస్తే, మరొకటి సమాజాన్ని తీవ్రంగా ప్రభావితం చేసే ఆర్థిక సంబంధాలను విశ్లేషించింది. జాతీయోద్యమపు చివరిఘట్ట కాలంలో– స్వాతంత్య్ర కాలంలో వచ్చింది ‘అసమర్థుని జీవయాత్ర’. ఆనాటి తెలుగు సమాజ పల్లెటూళ్ళను, వాటి మధ్య ఉన్న మానవ సంబంధాలు, ఆస్తి అంతస్థుల అంతరాలను, జమిందారీ వ్యవస్థ బీటలు వారుతూ పెట్టుబడీదారీ వ్యవస్థ రూపుఎత్తడం వంటి సరికొత్త సందర్భానికి ఈ నవల అద్దం పట్టింది. ఇందులో సీతారామారావు జీవితంలో ఎదురైన ప్రతి విషయాన్నీ హేతువాద దృష్టితో తీర్చుకుంటాడు. తన ప్రశ్నలకు తానే సమాధానాలను అంగీకరించక జీవితాంతం సంఘర్షణ పడుతూ చివరికి శ్మశానంలో తన గొంతు తానే పిసుక్కుని చనిపోయిన విషాదాంత జీవనయానం సీతారామారావుది. ఈ నవల రాసేటప్పుడు రచయిత గోపీచంద్ మనసులో ఉన్న సందిగ్ధ స్థితి నవలలో కనిపిస్తుంది. తండ్రి త్రిపురనేని రామస్వామి నుంచి వచ్చిన హేతువాద భావాలు, మరోవైపు మానసికంగా కలిగిన అంతరాత్మ ప్రబోధాల మధ్య ఎటువైపు వెళ్ళాలో తెలియనీయని సంఘర్షణలను నవలలో చిత్రించారు. ఈ నేపథ్యంలోనే గోపీచంద్ అరవిందుని సమాకలనవాదం వైపు ఆకర్షితుడయ్యాడు. అరవిందుని దర్శనం లాంటి సంక్లిష్ట తత్త్వాన్ని తాను సృష్టించిన సీతారామారావు పాత్రలో ప్రతిఫలింప జేశాడు. ఇందుకు నిదర్శనమే సీతారామారావు శ్మశానంలో తండ్రి సమాధి వద్దకు వచ్చినపుడు ‘తండ్రి తనవైపు క్రూరంగా చూస్తూ కనిపిస్తాడు’. ‘ఇదట్రా నువ్వు చేసిన పని? నీ మీద ఎంతో ఆశపెట్టుకున్నానే– చివరకు నువ్వు చేసిన పని ఇదా? నా గౌరవాన్ని, నా వంశ ప్రతిçష్ఠనూ, కుటుంబ ఔన్నత్యాన్ని బుగ్గిపాలు చేశావు’– అంటూ గుడ్లు ఉరిమాడు. అప్పటికే తనలోని ద్వంద్వాల నుండి, అహంభావ స్థితినుండి బయటపడ్డ సీతారామారావుకు తండ్రిమీద కోపం వస్తుంది. ‘నీ సంప్రదాయాలే నన్నీ స్థితికి తీసుకొచ్చాయి. పోతున్నాను, పాతాళానికి పోతున్నాను’ అంటూ సంభాషిస్తాడు. చనిపోయిన తల్లికూడా కనిపిస్తుంది. ‘నువ్వు మారావు నాయనా!’ అంది. ‘నేను మారానా అమ్మా!’ అన్నాడు. తల్లి సమాధి పాదాల దగ్గర పడి భోరున ఏడుస్తూ ‘మరి లాభం లేదమ్మా! ఆలస్యం అయిపోయిందమ్మా?’ అంటాడు. సీతారామారావు జీవితం చుట్టూ అలుముకున్న భ్రమల తెరలు మంచుతెరల్లా కరిగిపోయే సమయానికి జీవిత నాటకమే పూర్తి కావస్తుంది. అసమర్థుని జీవయాత్ర నవల రచించి 75 వసంతాలు గడిచినా దాని ప్రాసంగికతను కోల్పోలేదు. కారణం– అది మనిషి అంతరంగంలో చెలరేగే ద్వైదీ భావాలయిన హేతువాదాన్ని, ఆత్మజ్ఞానాన్ని, ఆత్మన్యూనతను, అంతరాత్మ చేతనను, అచేతనలను వెలికిచెప్పిన నవలారాజం. సహజ జ్ఞానం జంతువులకు సంబంధించినది. హేతుజ్ఞానం మానవులకు సంబంధించినది. హేతుజ్ఞాని అయిన మానవుడు సుఖపడుతున్నాడా? అన్న అన్వేషణ ఈ రచన ఆసాంతం నడుస్తుంది. మనిషి మెలకువగా ఉన్నంతసేపూ ఏదో ఆలోచన చేస్తూనే ఉంటాడు. ఆలోచన, ఆచరణ వైరుధ్యం వల్లనే మనసు ఘర్షణకు లోనవుతుంది. ఈ ఒడుదొడుకులను సరిదిద్ది మళ్ళీ ఒక క్రమం ఏర్పరచుకోవడానికి మనిషి నిద్రించే వేళ మెదడు జరిపే ప్రయత్నం కలలకు కారణం. అందువలన మనిషికి స్వప్నావస్థ చాలా అవసరమూ, ఆరోగ్యప్రదమూ అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అందువలన కనీసం భౌతిక అవసరాలు తీరుతుంటే కలలో కూడా చాలా మార్పులు వస్తాయి. కానీ, పెట్టుబడి ప్రధానంగా వస్తు వినిమయం ఒక అంతస్థుగా నడుస్తున్న ప్రస్తుత సమాజంలో భౌతిక ఘర్షణలు అనివార్యంగా పెరుగుతాయి. మానసిక ప్రపంచంలో కలలు ఘోరంగా ఉంటాయి. ఈ పరిస్థితిని సవరించి సమాజంలో మార్పు రావాలనే గోపీచంద్ ఆరాటం, ఆలోచన. -డొక్కా మాణిక్యవరప్రసాద్ వ్యాసకర్త ఎమ్మెల్సీ, మాజీ మంత్రి (‘అసమర్థుని జీవయాత్ర’కు 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నవంబర్ 2న విజయవాడలో చర్చా కార్యక్రమం జరగనుంది.) -
కృష్ణా జలాలపై తెలంగాణ వైఖరి సరికాదు
నెహ్రూనగర్ (గుంటూరు ఈస్ట్): శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల జలాశయాల్లోని కృష్ణాజలాల వినియోగంలో కేసీఆర్ నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం అడ్డగోలుగా వ్యవహరించటం సరికాదని ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ చెప్పారు. మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబూ జగ్జీవన్‌రామ్ 35వ వర్ధంతిని పురస్కరించుకుని మంగళవారం ఆయన గుంటూరులో జగ్జీవన్‌రామ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. బచావత్ తీర్పులకు వ్యతిరేకంగా, కేంద్ర జలశక్తి సంఘం, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఆదేశాలను లెక్కచేయకుండా శ్రీశైలంలో డెడ్‌స్టోరేజి నీటిని కూడా పరిగణనలోకి తీసుకోకుండా ఇష్టానుసారం విద్యుదుత్పత్తికి వినియోగించటం తెలంగాణ ప్రభుత్వ దుందుడుకు చర్య అని విమర్శించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిని, ప్రస్తుత సీఎం జగన్మోహన్రెడ్డిని తెలంగాణ మంత్రులు ఇష్టం వచ్చినట్లు పరుష పదజాలంతో దూషించటం చూసి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రజలు సిగ్గుపడుతున్నారన్నారు. శ్రీశైలం జలాలను ముందుగా తాగు, సాగు అవసరాలకే వినియోగించాలని చట్టాలు స్పష్టంగా చెబుతున్నా.. తెలంగాణ ప్రభుత్వం మొండితనంగా విద్యుత్ ఉత్పత్తి చేస్తూ నీటిని వృథాగా సముద్రంలోకి వదిలేయటం దుర్మార్గమని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం, బీజేపీ నాయకత్వం రెండు రాష్ట్రాల్లో తమ రాజకీయ ప్రయోజనాల కోసమే చూస్తున్నాయని విమర్శించారు. ఇప్పటికైనా కేసీఆర్ మొండివైఖరిని విడనాడాలని, చర్చల ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల ప్రయోజనాలను కాపాడాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం తక్షణం జోక్యం చేసుకోవాలన్నారు. వైఎస్సార్సీపీ నాయకులు కాకుమాను పున్నారావు, దాసరి జాన్‌బాబు, కొరిటపాటి ప్రేమ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రభుత్వంపై తప్పుడు ప్రచారానికే చంద్రబాబు పరిమితం : డొక్కా మాణిక్యవరప్రసాద్
-
‘కళ్ల జోళ్లు ఇస్తాం.. ఒకసారి వెళ్లి చూసి రండి’
సాక్షి, తాడేపల్లి : టీడీపీ సభ్యులు పార్లమెంటు వేదికగా అబద్ధాలు ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ విమర్శించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో రాష్ట్రానికి మంచి పేరు వస్తుందని చెడగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. అచ్చెన్నాయుడు నియోజకవర్గంలో నంది విగ్రహం మార్చి పెట్టాలని ప్రయత్నం చేశారని దుయ్యబట్టారు. అలాంటి వారిని అరెస్ట్ చేస్తే తప్పా అని నిలదీశారు. మీరేం చేసినా పట్టించుకోకుంటే మంచిదా అని ప్రశ్నించారు. తప్పులు చేస్తూ అన్ని చోట్లా దొరికారని. దానిలో సరైన సాక్షాలు కేంద్ర హోంమంత్రి అమిత్ షాకే ఇస్తున్నామని పేర్కొన్నారు. వీళ్ళందరి జాతకాలను వీడియో సాక్షిగా కేంద్రానికి తెలుపుతామని పేర్కొన్నారు. రాష్ట్రంలో మత మార్పిడిలు ఎక్కడ జరుగుతున్నాయని పిర్యాదు చేశారని టీడీపీ నాయకులను ప్రశ్నించారు. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడన్నా మత కలహాలు జరిగిన చరిత్ర ఉందా అని నిలదీశారు. చదవండి: టీడీపీ ఎంపీలు కాళ్ల బేరానికి వెళ్లారు.. రాజకీయంగా ప్రజలు తిరస్కరించిన తర్వాత ఇప్పుడు మత కలహాలు అనడం మీరు(టీడీపీ) బతకడం కోసమేనని డొక్కా దుయ్యబట్టారు. టీడీపీ పార్టీ నుంచి చాలా మంది వలస వెళ్లిపోతున్నారన్న ఆయన దాన్ని ఒప్పుకోడానికి మనసు ఒప్పక మతకలహాలు అనడం దివాళా కోరు పద్ధతని విమర్శించారు. అమిత్ షాకి ప్రవీణ్ చక్రవర్తి వీడియో చూపించారని, ఒకవేళ అది టీడీపీ హయాంలో జరిగితే దాన్ని అమిత్ షాకి చూపుతారా.. అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ విషయంలో తాము వాస్తవాలు వెల్లడిస్తామన్నారు. పాస్టర్ ప్రవీణ్ చక్రవర్తిని ఎవరు అరెస్ట్ చేశారో? అప్పుడు మీరెందుకు అరెస్ట్ చేయలేదని, మోదీపై మీరు ఏవిధంగా మాట్లాడారో ఆ వీడియోలను కూడా బీజేపీకి అందిస్తామని హెచ్చరించారు. అమిత్ షాపై దాడి చేసిందేవరో కూడా వివరిస్తామని అన్నారు. లేనివి ఉన్నవిగా ప్రచారం చేస్తూ బురదజల్లే ప్రయత్నం చేయడం మానుకోవాలని టీడీపీ నేతలకు డొక్కా మాణిక్య వరప్రసాద్ హితవు పలికారు. ‘మోదీకి కుటుంబం లేదని మాట్లాడింది మీరు కాదా. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం మీరు రెచ్చగొడుతున్నారు. విజయవాడలో 40 దేవాలయాలు కూల్చింది మీరు కాదా. FRBM అనుమతి లేకుండా అప్పు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఆ అనుమతి లేకుండా చట్టానికి లోబడకుండా ఎవరైనా అప్పులు ఇస్తారా. ఏ రాష్ట్రమైనా, కేంద్రమైనా అప్పులు తెస్తుంది. నీ హయాంలో కూడా అప్పులు తెచ్చిన మాట మర్చిపోవద్దు. పోలవరం గురించి మాట్లాడే అర్హత వీళ్లకు ఉందా...?అది ఎక్కడ పూర్తి అయ్యి సీఎం జగన్‌కు మంచి పేరువస్తుందో అని ఆగిపోయిందని ఆరోపణలు చేస్తున్నారు. కళ్ళజోళ్ళు ఇస్తాం....ఒకసారి వెళ్లి చూసి రండి. జీవీఎల్ చేసిన వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలి. వాస్తవాలు తెలుసుకోవాలి. కావాలంటే డేటా పంపుతాం. టీడీపీ హయాంలో జరిగిన డేవాలయాలపై దాడుల విషయంపై మీకు సమాచారం లేదా. దేశంలో రాష్ట్ర గౌరవం పెంచేలా మాట్లాడాలి కానీ చెడ్డపేరు వచ్చేలా మాట్లాడటం సరికాదు’ అంటూ ఎంపీ జీవీఎల్ నరసింహరావును ఉద్ధేశించి వ్యాఖ్యలు చేశారు. -
సెంటు స్థలం ఇవ్వని వారికి విమర్శించే హక్కుందా?
సాక్షి, తాడేపల్లి : విప్లవాత్మక ఆలోచన చేసి పేదలందరికీ ఇల్లు ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికే చెందుతుందని ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ అన్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన శనివారం మాట్లాడుతూ.. ఇళ్ల పట్టాల పంపిణీ కేవలం సంక్షేమ కార్యక్రమం కాదని, ఒక ఆర్థిక కార్యక్రమం కూడా అని పేర్కొన్నారు. దీని ద్వారా ఎంతో మందికి ఉపాధి కలగనుందని తెలిపారు. కరోనా పరిస్థితుల్లో సంక్షేమం అందిస్తూ ఆర్థిక పరిపుష్టికి కృషి చేస్తున్నారు. దీని ద్వారా 20 కోట్ల మందికి పనిదినాలు దొరుకుతాయన్నారు. దీనిని టీడీపీ నాయకులు జీర్ణించుకోలేక పోతున్నారని విమర్శించారు. వారు జీవితంలో ఇలాంటి విప్లవాత్మక కార్యక్రమం చేపట్టారా.. అని ప్రశ్నించారు. అసలు ఒక సెంటు స్థలం అయినా ఇవ్వని వారికి ఈ రోజు విమర్శించే హక్కు ఉందా అని మండిపడ్డారు. చదవండి: ‘పేదలకు ఇళ్లు.. ఆయనకొచ్చిన నష్టమేమిటి?’ అమరావతిలో పేద వారికి ఇల్లు ఇస్తామంటే సామాజిక అసమతుల్యత అన్నది మీరు కాదా. మీకు చిత్త శుద్ధి ఉంటే.. ఎలాంటి దురుద్దేశం లేకపోతే ఆ కేసును ఉపసంహరించుకోండి. పేదలకు ఇళ్ళు ఇద్దాం.ఇల్లు అనేది ఒక ఆత్మగౌరవం...సామాజిక స్థితి పెరుగుతుంది...అది మీకు ఇష్టం లేదా...? ఈ ఇళ్ల కోసమే కదా ఆందోళనలు చేసింది. ఒక ముఖ్యమంత్రి నేను ఇస్తాను అంటే వ్యతిరేకిస్తారా. కనీసం ఇలాంటి పోరాటాలు చేసిన కమ్యూనిస్టులు అయినా అభినందలు తెలపండి. ఇళ్ల పట్టాలపై స్టే తెచ్చిన వారంతా ఉపసంహరించుకోండి. లేదంటే మీరు చరిత్ర హీనులుగా మిగులుతారు. మీరు రైతులను బెదిరించి భూములు తీసుకున్నారు...మా జగన్ గారు చట్టప్రకారం 2013 యాక్ట్ ప్రకారం సేకరించారు. చదవండి: సొంతింటి కల సాకారం -
35ఏళ్లపాటు ఉచిత విద్యుత్‌కు ఢోకాలేదు
సాక్షి, గుంటూరు: వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్ పొందడం రైతుల హక్కు అని మాజీమంత్రి, శాసనమండలి సభ్యులు డొక్కా మాణిక్యవరప్రసాద్ అన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఉచిత విద్యుత్ పథకాన్ని మరింత మెరుగైన రీతిలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అమలు చేస్తున్నారని చెప్పారు. వచ్చే 35ఏళ్ల వరకు వ్యవసాయానికి ఉచిత విద్యుత్ కు ఢోకా ఉండదని స్పష్టం చేశారు. శనివారం స్థానిక రామన్నపేటలోని ఏపీ మద్యవిమోచన ప్రచార కమిటీ కార్యాలయంలో జనచైతన్య వేదిక ఆధ్వర్యాన నిర్వహించిన విలేకరుల సమావేశంలో డొక్కా మాణిక్యవరప్రసాద్ మాట్లాడారు. ఉచితవిద్యుత్ పథకానికి నగదు బదిలీ చేయడంతో ప్రభుత్వానికి బాధ్యత, రైతుకు జవాబు దారీతనం వస్తుందన్నారు. పగటిపూట నాణ్యమైన విద్యుత్ పొందడం వ్యవసాయం చేసే రైతుకు హక్కుగా ఉండాలనే సంకల్పంతోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నగదుబదిలీ నిర్ణయానికి శ్రీకారం చుట్టారని వివరించారు. (దేవుళ్ల రథాలపై మరింత నిఘా.. ) దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి అధికారంలోకి రాగానే ఉచిత విద్యుత్ పథకానికి సంబంధించి మొట్టమొదటి ఫైలుపై సంతకం చేసి అమలు చేశారని గుర్తుచేశారు. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఉచిత విద్యుత్ పథకాన్ని నీరుగార్చాయన్నారు. టీడీపీ సర్కార్ హయాంలో పగటి పూట 9 గంటల పాటు కరెంటు ఇచ్చే పరిస్థితులే లేవన్నారు. వైఎస్ఆర్ సీపీ అధికారంలోకి వచ్చిన కొత్తలో దాదాపు 40 శాతం ఫీడర్లలో పగటి పూట 9 గంటలు కరెంటు ఇవ్వడానికి మౌలిక సదుపాయాలే లేవన్నారు. ఈ పరిస్థితులను మార్చడానికి, ఫీడర్ల ఏర్పాటు, అప్‌గ్రేడేషన్ పనుల కోసం వైఎసార్ ప్రభుత్వం రూ.1,700 కోట్లు కేటాయించిందని.. దీని వల్ల ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో 89 శాతం ఫీడర్లలో పగటిపూటే 9 గంటలపాటు ఉచితంగా విద్యుత్ ఇస్తున్నట్లు డొక్కా మాణిక్యవరప్రసాద్ చెప్పారు. మిగిలిన చోట్ల కూడా వేగంగా పనులు పూర్తి చేసి రబీ నాటికి పూర్తి స్థాయిలో 9 గంటలపాటు పగటి పూటే కరెంటు ఇస్తారని వివరించారు. జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు, ఏపీ మద్య విమోచన ప్రచార కమిటీ చైర్మన్ వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి మాట్లాడుతూ.. 2019 మార్చి 31 నాటికి చంద్రబాబు ఉచిత విద్యుత్ పథకం కింద డిస్కంలకు డబ్బులు ఇవ్వకుండా దాదాపు రూ.8 వేల కోట్లు బకాయిపెట్టారని..వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆ డబ్బు మొత్తం చెల్లించిందని చెప్పారు. ఈ డబ్బులు చెల్లించడమే కాకుండా నాణ్యమైన కరెంటు ఇవ్వడానికి తీసుకోవాల్సిన అన్ని చర్యలూ తీసుకుంటున్నట్లు వివరించారు. రైతుల విశాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని వచ్చే 30 నుంచి 35 సంవత్సరాలపాటు ఉచిత విద్యుత్ పథకానికి ఎలాంటి ఢోకా రానివ్వకుండా 10 వేల మెగావాట్ల సోలార్ విద్యుత్ కోసం ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించిందన్నారు. తద్వారా యూనిట్ కరెంటు రూ.2.5 కే ప్రభుత్వానికి వచ్చేలా ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పారు దీని వల్ల ప్రభుత్వంపై భారం తగ్గుతుందని.. ఉచిత విద్యుత్ పథకం స్థిరంగా, నిరంతరాయంగా కొనసాగడానికి ఇది దోహదం చేస్తుందని లక్ష్మణరెడ్డి స్పష్టంచేశారు. (ఎన్ని గుళ్లు తిరిగినా ఆయన పాపాలు పోవు) రైతులపై ఒక్క పైసా భారం పడదన్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వం మనసున్న, రైతుల పక్షపాత ప్రభుత్వమని.. రైతులకు ఒక్క పైసాకూడా నష్టం జరగదని పేర్కొన్నారు. ఎస్పీడీసీఎల్ ఏడి సురేష్ బాబు మాట్లాడుతూ ఉచిత విద్యుత్ పథకానికి నగదు బదిలీ వంటి కొత్తగా తీసుకొస్తున్న సంస్కరణల వల్ల ఉచిత విద్యుత్ రూపేణా ఎంత వాడుతున్నాం.. ఎంత ఖర్చు చేస్తున్నామో తెలుస్తుందన్నారు. ప్రభుత్వం ప్రత్యేక ఖాతాల్లోకి వేసే డబ్బును రైతులే డిస్కంలకు చెల్లిస్తారని వివరించారు.నాణ్యమైన కరెంట్ పగటి పూట 9 గంటల పాటు రాకపోతే రైతులు డిస్కంలను నిలదీయొచ్చని.. సంబంధిత అధికారులను ప్రశ్నించవచ్చున్నారు. దీని వల్ల జవాబుదారీతనం, బాధ్యత పెరుగుతాయని..అధికారులకు కూడా రైతుల పట్ల జవాబుదారీతనం పెరుగుతుందన్నారు. ప్రతినెలా రైతులకు ఖాతాల్లో డబ్బులు పడతాయని.. ఆ డబ్బులు డిస్కంలకు వెళతాయన్నారు. దీనివల్ల డిస్కంల ఆర్థిక పరిస్థితులు కూడా బాగుంటాయని సురేష్ బాబు వివరించారు. విలేకరుల సమావేశంలో ప్రముఖ విద్యావేత్త కన్నా మాస్టారు, ఏపీ ఇంటెలెక్చువల్ ఫోరం అధ్యక్షులు శాంతమూర్తి, రిటైర్డ్ ఎస్పీ చక్రపాణి, చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు ఉద్యోగుల సంఘం నాయకులు వీరారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
అసలు అక్కడ ఉద్యమమే లేదు
సాక్షి, అమరావతి: ‘అమరావతిలో జరుగుతున్నది అసలు ఉద్యమమే కాదు.. అక్కడ ప్రజా ఉద్యమమే లేదు.. అదో రియల్ ఎస్టేట్ ఉద్యమం.. కెమెరా ఉద్యమం.. అక్కడ జరిగేది భూస్వామ్య, పెట్టుబడిదారి, ధనవంతుల ఉద్యమం’ అని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబు మనుషులు కెమెరాల కోసం చేసే అల్లరిని ఉద్యమం అంటే, ఉద్యమం అన్న పేరుకే అది అవమానం అన్నారు. సోమవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వారు సంయుక్తంగా విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అంబటి మాట్లాడుతూ.. బాబు రాజధాని కోసం అలుపెరగని పోరాటం చేస్తున్నట్టు భ్రమ కల్పిస్తున్నారన్నారు. ఇంకా ఏమన్నారంటే.. ► అమరావతి అనేది పెద్ద స్కాం. బాబు తన తాబేదార్ల కోసం పెట్టిందే అమరావతి. రాజధాని కోసం 85 మంది చనిపోయిన దాఖలాలు లేవు. అదంతా ఓ కట్టుకథ. రాజధాని కోసం త్యాగాలు లేవు. ఎవ్వరూ చనిపోలేదు. సాధారణంగా చనిపోయిన వారిని అమరావతి కోసం చనిపోయారని ప్రచారం చేస్తున్నారు. 85 మంది అమరావతి కోసం చనిపోతే ఉద్యమం ఇలా ఉంటుందా? ► దళితులకు ఇచ్చిన భూములను టీడీపీ నేతలు బలవంతంగా లాక్కున్నారు. అమరావతిలో జరుగుతున్నది దళిత వ్యతిరేక ఉద్యమం. టీడీపీ దళిత వ్యతిరేక పార్టీ. అమరావతిలో జరిగిన అక్రమాలపై విచారణ జరుగుతోంది. ఇప్పటికే కొంత మందిని అరెస్ట్ చేశారు. త్వరలో మరికొంత మందిని అరెస్ట్ చేస్తారు. ► అభివృద్ధి అంతా హైదరాబాద్‌లో కేంద్రీకృతం కావడం వల్ల మనం నష్టపోయాం. ఏ ప్రాంతానికీ అన్యాయం జరగకూడదనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పరిపాలన వికేంద్రీకరణ చేశారు. అమరావతి ఉద్యమం బాబు కుట్ర ► ఈ 250 రోజుల్లో ఎక్కడా ఉద్యమమే లేదు. రాజధానిలో బాబు, ఆయన బినామీల అక్రమాలు బయట పడుతున్నాయి. అభివృద్ధిని అమరావతిలో కేంద్రీకృతం చేసి లబ్ధిపొందాలనేది బాబు కుట్ర. ► జూమ్‌లో బాబు ప్రజలను రెచ్చగొడుతున్నారు. ఎవరినీ సంప్రదించకుండా మూడు రాజధానులపై నిర్ణయం తీసుకున్నారని మాట్లాడటానికి చంద్రబాబుకు సిగ్గుండాలి. పరిపాలన వికేంద్రీకరణపై శాసనసభలో చర్చ సమయంలో బాబు పారిపోయారు. ► వికేంద్రీకరణపై బాబుకు ఎందుకు వ్యతిరేకత? సెక్రటేరియట్ విశాఖకు వెళితే, హైకోర్టు కర్నూలుకు వెళితే చంద్రబాబుకు వచ్చిన నష్టమేమిటి? కమ్యూనిస్ట్‌లు కేపిటలిస్ట్లుగా మారిపోయారు. 54 వేల మంది పేదలకు ఇదే రాజధాని భూముల్లో ఇళ్ల స్థలాలు ఇవ్వటానికి ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తే, ఇళ్ల స్థలాల పంపిణీని అడ్డుకున్న బాబుకు కమ్యూనిస్ట్‌లు ఎలా మద్దతిస్తారు? ► సీపీఐ కాస్తా చంద్రబాబు పార్టీ ఆఫ్ ఇండియాగా మారిందా? పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసం రామకృష్ణ లాంటి కమ్యూనిస్ట్‌లు దిగజారిపోయారు. ► రమేష్ హాస్పిటల్స్ నిర్లక్ష్యం కారణంగా పది మంది చనిపోయారు. డాక్టర్ రమేష్‌ను బాబు దాచిపెట్టారు. నేరస్తులను దాచిపెట్టడం కూడా నేరమే అవుతుంది. ఇప్పటికైనా డాక్టర్ రమేష్‌ను బాబు పోలీసులకు అప్పగించాలి. పది మంది ప్రాణాలు పోవడానికి కారణమైన వారికి బాబు మద్దతు ఇవ్వటం దారుణం. బాబుకు కమ్యూనిస్టుల మద్దతు దారుణం ► పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వొద్దన్న బాబుకు కమ్యూనిస్ట్‌లు మద్దతు తెలపటం దారుణం అని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ మండిపడ్డారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. ► రాజధానిలో దళితులకు ఇళ్ల స్థలాలు ఇస్తే సామాజిక సమతుల్యం దెబ్బ తింటుందంటారా? అఫిడవిట్లో ఇటువంటి వ్యాఖ్యలు చేసినందుకు ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేయాలి. ► అమరావతి ఉద్యమంలో ఉన్న వారు చంద్రబాబు ట్రాప్‌లో పడ్డారు. రాజకీయంగా బాబు వారిని ఉపయోగించుకుంటున్నారు. ► రైతులు ప్రభుత్వంతో ఘర్షణ పడటం, సీఎం వైఎస్ జగన్‌ను దూషించటం సరికాదు. అమరావతిలో దళిత ఉద్యమం లేదు.. అది దగా ఉద్యమం. -
న్యాయం చేసేలా వికేంద్రీకరణ
-
‘చంద్రబాబు.. ఇలా అయినా సంతోషించు’
సాక్షి, తాడేపల్లి : విజయవాడ నడిబొడ్డున అంబేడ్కర్ విగ్రహానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శంకుస్థాపన చేయడం గర్వించచదగ్గ విషయమని మాజీ మంత్రి, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వర ప్రసాద్ అన్నారు. నగరంలో అంబేడ్కర్ విగ్రహం ఉంటే విజయవాడకు ఎంతో గౌరవం వస్తుందన్నారు. విజయవాడలో అంబేడ్కర్ విగ్రహం పెట్టడాన్ని ప్రశ్నిస్తున్న టీడీపీ తీరును ఖండిస్తున్నామన్నారు. తన హయాంలో పూర్తి చేయలేని విగ్రహాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పూర్తి చేస్తున్నందుకు చంద్రబాబు సంతోష పడాలన్నారు. విగ్రహం ఏర్పాటుకు చంద్రబాబు సహకరించాలని సూచించారు. అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటుపై టీడీపీ రాజకీయాలు చేయడం తగదని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ రాజకీయాలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. చంద్రబాబు వ్యాపార ధోరణి మీద గతంలో స్వరాజ్య మైదానం మీద కేసు వేశారని, ఇప్పుడు స్వరాజ్య మైదానం మీద కోర్టులో ఎలాంటి కేసు లేదని స్పష్టం చేశారు. (సీఎం జగన్‌ను కలిసిన మాణిక్య వరప్రసాద్) అంబేడ్కర్ విగ్రహానికి చంద్రబాబు శంకుస్థాపన మాత్రమే చేశారని మాణిక్య వర ప్రసాద్ అన్నారు. చంద్రబాబు అంబేడ్కర్ డమ్మీ విగ్రహం ఒకటి రాజధానిలో పెట్టారని, అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుకు సంబంధించి ఎలాటి పనులు జరగలేదని ఆయన అన్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం పెట్టాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారని, 125 అడుగులు విగ్రహం విజయవాడ నడిబొడ్డున పెట్టాలని నిర్ణయం తీసుకున్న సీఎం జగన్‌కు ధన్యవాదాలు తెలిపారు. అంబేడ్కర్ ఒక కులానికి, మతానికి చెందిన వ్యక్తి కాదని దేశం మెచ్చిన వ్యక్తి అని కొనియాడారు. విజయవాడ పెద్ద టూరిస్టు సెంటర్ అవుతుందని అశాభావం వ్యక్తం చేశారు. ప్రపంచ వ్యాప్తంగా విజయవాడకు మంచి గుర్తింపు వస్తుందన్నారు. (‘ఏడాదిలోనే విత్తన శుద్ధి కేంద్రాలు పూర్తి చేస్తాం’) -
‘చంద్రబాబు.. ఇలా అయినా సంతోషించు’
-
సంక్షేమ ‘ప్రదాత’
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, సంక్షేమం గురించి చెప్పాలంటే రాజన్న పాలనకు ముందు, తరువాత అని చెప్పటంలో అతిశయోక్తి లేదు. బడుగు, బలహేన వర్గాల ఆరాధ్య దైవం దివంగత డా. యెడుగూరి సందింటి రాజశేఖరరెడ్డి. వెనుకబడిన వర్గాల సమూహాల ఉద్ధరణ కోసం ఎనలేని కృషి చేశారు. ప్రజాభివృద్ధి కోసం ఆయన చేసిన కృషి నిరుపమానం. పరోపకారం, సేవాగుణం ఆయనను విశిష్టమూర్తిగా నిలబెడితే... ఇచ్చిన మాట తప్పకపోవటం, వేసిన అడుగు వెనక్కి తీసుకోకపోవటం ఆయనను ప్రజల హృదయాల్లో శిఖరాగ్రాన నిలబెట్టింది. అప్పటి అధికార పక్షం నిర్వాకం కారణంగా ఉమ్మడి ఏపీలో ఉపాధి అవకాశాలు హరించుకుపోతూ పేదల బతుకులు పొగచూరుతున్నాయి. దళితులు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు అత్యంత దయనీయమైన జీవనం సాగిస్తున్నారు. సామాన్యుల బతుకు వెతలను స్వయంగా పరికించి వాళ్ళలో భరోసాను, ధైర్యాన్ని నింపేందుకు వైఎస్సార్ 2003లో రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్రను చేపట్టారు. ఉమ్మడి ఏపీలో 1,467 కి.మీ.లు పాదయాత్ర చేసిన ఆయన... రైతులను, కార్మికులను, మహిళలను అక్కున చేర్చుకున్నారు. చదువులకోసం విద్యార్థులు పడుతున్న కష్టాలు చూసి చలించి పోయారు. మొక్కవోని దీక్షతో పాదయాత్రను కొనసాగించి అందరి అభిమానాన్ని చూరగొన్నారు. ఈ పాదయాత్ర 2004లో జరిగిన 12వ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అప్రతిహత విజయానికి తోడ్పాటును అందించింది. పాదయాత్రలో ప్రజలకిచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేర్చి ప్రజల పాలిట దేవుడయ్యారు. అధికారం చేపట్టిన వెంటనే ఉచిత విద్యుత్తుపై తొలి సంతకం పెట్టారు. సాధారణ పేదలకు అత్యంత ఖరీదైన ఆధునిక కార్పొరేట్ వైద్యాన్ని అందుబాటులోకి తేవాలని అభిలషించి ఆరోగ్యశ్రీని అమల్లోకి తెచ్చారు. ఇందిరమ్మ ఇల్లు, ఫీజు రీయింబర్స్మెంట్, మహిళలకు పావలా వడ్డీ రుణాలు, వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు పెన్షన్ల పెంపు, ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్ బిల్లును అసెంబ్లీలో నాచేతనే ప్రవేశపెట్టి చర్చను ప్రారంభించి ముస్లిం లకు రిజర్వేషన్ ప్రాధాన్యతను కలిపించిన ఆ సంతృప్తి ఇప్పటికీ నా కళ్ళ ముందు మెదులుతుంది. 108 వంటి పథకాలు ప్రవేశపెట్టి సంక్షేమంలో స్వర్ణయుగాన్ని ప్రజలకు అందించారు. రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసేం దుకు, వృ«థాగా పోయే ప్రతి నీటి చుక్కను బీడువారిన పొలాలకు మళ్లిం చేందుకు జలయజ్ఞం పథకానికి రూపకల్పన చేశారు. ఆయన స్మిత పూర్వ భాషి అంటే మాటల కన్నా ముందు ఆయన చిరునవ్వు ఎదుటవారిని పలకరిం చేది. ప్రతి పనిలోనూ ప్రజా శ్రేయస్సు, ప్రతి ప«థకంలోనూ ప్రజా సంక్షేమమే ప్ర«థమ ధ్యేయంగా ముందుకు సాగారు. 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం వంటి పార్టీలు ఎదురొచ్చినా వైఎస్ఆర్ అమలు చేసిన సంక్షేమ పథకాలే శ్రీరామరక్షగా నిలిచి మళ్ళీ సునాయాసమైన గెలుపును అందించింది. ఆయన జన్మ దినోత్సవం సందర్భంగా ప్రజల నేతగా పేరొందిన వైఎస్సార్‌ను మనసారా స్మరించుకుందాం. వైఎస్సార్ ఆశీస్సులతో ప్రజల అండదండలతో 2019 ఎన్నికల్లో ఆయన వారసుడిగా జగన్మోహన్రెడ్డి అధికారాన్ని చేపట్టారు. రాజన్న రాజ్యం నిర్మిస్తానని ప్రజలకిచ్చిన వాగ్దానం నెరవేర్చే దిశగా నవరత్నాలు అమలు చేస్తున్నారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ సొంత ఇళ్ళు ఉండాలనే రాజన్న కలను నేడు జగనన్న నెరవేరుస్తూ ప్రజల ఆశీస్సులు పొందుతున్నారు. దేశ చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే దాదాపు 30 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వడం మహాద్భుతం. వైఎస్ఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని రైతు దినోత్సవ కార్యక్రమం జరపటం రైతులకు ఆయన అందించిన సాయం, నింపిన స్ఫూర్తికి నిదర్శనంగా నిలుస్తుంది. వ్యాసకర్త: డొక్కా మాణిక్యవరప్రసాద్ శాసన మండలి సభ్యులు, మాజీ మంత్రివర్యులు -
సీఎం జగన్‌ను కలిసిన మాణిక్య వరప్రసాద్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యుడిగా ఎన్నికైన నేపథ్యంలో మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీగా తాను ఏకగ్రీవంగా ఎన్నికైన నేపథ్యంలో ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా డొక్కా మాణిక్య వరప్రసాద్ మాట్లాడుతూ.. ఒకేసారి 30 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వడం ప్రపంచంలోనే ఎక్కడా జరగలేదని ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించారు. కేవలం సంక్షేమంపై దృష్టిపెట్టి.. అభివృద్ధిని మరిచారు అనే ప్రతిపక్షాల మాటలు అర్థం లేనివని కొట్టిపారేశారు. సంక్షేమంలోనే అభివృద్ధి కూడా ఉందన్న వాస్తవాన్ని వారు గుర్తించాలని హితవు పలికారు. (ధ్రువీకరణ పత్రం అందుకున్న మాణిక్య వరప్రసాద్) గత ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోవడంలో ఆలస్యం చేసేవని.. అయితే ఇప్పుడు పరిస్థితులు మారాయని సీఎం వైఎస్ జగన్ సూటిగా, స్పీడుగా నిర్ణయాలు తీసుకుని అమలు చేస్తున్నారని డొక్కా కొనియాడారు. కాగా క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌కు కలిసిన వారిలో ఎమ్మెల్యే అంబటి రాంబాబు సహా ఇతర నాయకులు కూడా ఉన్నారు. ఇక ఇటీవల శాసనసభ్యుల కోటాలో ఖాళీగా ఉన్న ఎమ్మెల్సీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో వైఎస్సార్ సీపీ తరఫున మాణిక్య వరప్రసాద్ ఒక్కరే నామిషన్ దాఖలు చేయగా.. ఆయన ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారి ప్రకటించిన విషయం విదితమే. దీంతో శాసనమండలిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారిక సభ్యుల సంఖ్య 10కి చేరింది. చదవండి: అత్యాధునిక 108, 104 సర్వీసులు రేపే ప్రారంభం -
ధ్రువీకరణ పత్రం అందుకున్న మాణిక్య వరప్రసాద్
సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యునిగా ఎన్నికైన మాజీ మంత్రి డొక్కా మణిక్య వరప్రసాద్ సోమవారం ధ్రువీకరణ పత్రం అందుకున్నారు. ఇటీవల శాసనసభ్యుల కోటాలో ఖాళీగా ఉన్న ఎమ్మెల్సీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో మాణిక్య వరప్రసాద్ ఒక్కరే నామిషన్ దాఖలు చేశారు. నేడు నామినేషన్ ఉప సంహరణ గడువు పూర్తికావడంతో ఆయన గెలిచినట్టు రిటర్నింగ్ అధికారి అధికారికంగా ప్రకటించారు. దీంతో శాసనమండలిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారిక సభ్యుల సంఖ్య 10కి చేరింది. కాగా, శాసనసభలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి పూర్తి స్థాయి మెజారిటీ ఉండటంతో మాణిక్య వరప్రసాద్ ఎన్నిక లాంచనమైన సంగతి తెలిసిందే. -
ఎమ్మెల్సీగా మాణిక్య వరప్రసాద్ ఏకగ్రీవం
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యునిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఏకగ్రీంగా ఎన్నికయ్యారు. కొద్దిసేపటి క్రితం ఎమ్మెల్సీ ఎన్నిక నామినేషన్ల గడువు ముగిసింది. అయితే ఎమ్మెల్సీ స్థానానికి మాణిక్య వరప్రసాద్ ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది. కాగా, ఈ ఏడాది ప్రారంభంలో శాసనమండలి ప్రత్యేక సమావేశాలు జరుగుతున్న సమయంలోనే.. టీడీపీలో సీనియర్ నాయకుడిగా ఉన్న డొక్కా మాణిక్యవరప్రసాద్ తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అనంతరం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. -
డొక్కా మాణిక్య వరప్రసాద్ నామినేషన్
సాక్షి, అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా డొక్కా మాణిక్య వరప్రసాద్ గురువారం నామినేషన్ దాఖలు చేశారు. అసెంబ్లీ కార్యదర్శి బాలకృష్ణమాచార్యులుకు నామినేషన్ పత్రాలు అందచేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నేతలు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి, ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్యేలు అంబటి రాంబాబు, నంబూరి శంకర్రావు, ఉండవల్లి శ్రీదేవి, జంగా కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. కాగా ఈ ఏడాది ప్రారంభంలో ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ప్రత్యేక సమావేశాలు జరుగుతున్న సమయంలోనే.. టీడీపీలో సీనియర్ నాయకుడిగా ఉన్న డొక్కా మాణిక్యవరప్రసాద్ తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అనంతరం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ‘‘2014, 2015లోనే వైఎస్సార్సీపీలో చేరాల్సి ఉన్నా, రాయపాటితో కలిసి అప్పట్లో టీడీపీలో చేరాను. వైఎస్ జగన్ నాయకత్వంలో జరుగుతున్న కార్యక్రమాల్లో భాగస్వామిని కావాలని వైఎస్సార్సీపీలో చేరాను. జగన్ చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు నన్ను ఆకర్షించాయి’’ అని పార్టీలో చేరిన సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. -
అంబేడ్కర్ ఆలోచనలే కరోనా కట్టడికి మార్గం
మనిషి లాభాపేక్షకు ప్రతిగా ప్రకృతి ప్రకోపం నుంచి ఉద్భవించినది కరోనా. కరోనా వంటి విపత్తులను ఎదుర్కోవాలంటే రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాల నుంచి స్ఫూర్తిని పొందాలి. ఆదేశిక సూత్రాలలో అంబేడ్కర్ ప్రకృతి పరిరక్షణను, ప్రకృతిని ఆలంబనగా చేసుకొని జీవనం సాగించడాన్ని ప్రబోధిం చారు. రాజ్యాంగంలో పొందుపరచిన ఆశయాలకు ఒక సుదీర్ఘ సామాజిక సాంస్కృతిక నేపథ్యం వుంది. కుటీర పరిశ్రమలను ప్రభుత్వ బాధ్యతగా చేయాలనీ, పశుపోషణ, వ్యవసాయాభివృద్ధిని ప్రభుత్వ విధుల్లో చేర్చాలనీ ప్రతిపాదించారు. రాజ్యాంగం నాలుగో భాగంలో అధికరణం 37 నుంచి 51 వరకూ ఈ ఆదేశిక సూత్రాలను వివరించారు. ఆధునిక ప్రజాస్వామ్య ప్రభుత్వానికి అవసరమైన ఆర్థికాభివృద్ధి, సామాజిక, రాజకీయ ప్రణాళికకు ఆదేశిక సూత్రాలు దోహదం చేస్తాయి. ప్రవేశికలో పేర్కొన్న న్యాయం, సమానత, సౌభ్రాతృత్వంలను సాధించడానికి, ఇవి మార్గదర్శకాలుగా నడిపిస్తాయి. ఒకానొక సందర్భంలో రాజ్యాంగ నిర్ణయసభ సలహాదారు బి.ఎన్.దావ్రో మాట్లాడుతూ ఒకోసారి దేశ ప్రామాణిక ఆరోగ్యాన్ని, జీవన ప్రమాణాలను మెరుగుపరిచే తన ప్రాథమిక బాధ్యతను నిర్వహించడంలో భాగంగా రాజ్యం/ప్రభుత్వం వ్యక్తిగత హక్కులలో జోక్యం చేసుకోవలసివస్తుంది అని చెప్పాడు. దేశ నాయకత్వం రాష్ట్ర నాయకులను కలుపుకొని ఒక ధన్వంతరీ అవతారమెత్తి మొత్తం ఆరోగ్య వ్యవస్థను దాని చుట్టూ పరివేష్టించివున్న ఆర్థిక, సామాజిక రుగ్మతలకు మందు కనిపెట్టాలి. కేవలం చప్పట్లు కొట్టడం, వీధుల్లో దీపాలు వెలిగించడం మాత్రమే కాకుండా దేశ భవిష్యత్తుకై ప్రణాళికలు సిద్ధంచేసి ప్రజలను ముందుకు నడిపించాలి. అభివృద్ధి చెందామని చెప్పుకుంటూ ఇప్పుడు కూలిపోయిన దేశాల వ్యాపారధోరణులు, విధానాలు మన దేశానికి పనికిరావని గుర్తించాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆరోగ్యం, విద్య, సామాజిక న్యాయం అను మూడు అంశాలను సమన్వయం చేసుకొని ముందుకు సాగాలి. ముందుగా ప్రజారోగ్య వ్యవస్థలోని సబ్–సెంటర్లను, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (పీహెచ్సీ) వ్యవస్థను పటిష్టపరచాలి. అందుకు కావలసిన ఆర్థిక వనరులను వెంటనే సమకూర్చి పారామెడికల్ సిబ్బందిని, డాక్టర్లను యుద్ధ ప్రాతిపదికన భర్తీచేయాలి. గతంలో మనదేశానికి టి.బి., ఎయిడ్స్, ఆటలమ్మ వంటి మహమ్మారులను పారదోలిన చరిత్ర వుంది. అవసరమయితే అమెరికాతో కుదుర్చుకున్న ఆయుధ సరఫరా ఒప్పందాన్ని రద్దుచేసుకొని ఆ డబ్బుతో దేశంలో ఒక లక్షమంది డాక్టర్లను, పది లక్షలమంది పారా మెడికల్ సిబ్బం దిని నియమించి కరోనాపై యుద్ధాన్ని ప్రకటించాలి. ఆరోగ్యంతోపాటుగా అత్యంత కీలక విషయం విద్య. మనదేశంలో ప్రాథమిక, మాధ్యమిక విద్యపై కొన్ని మెరుగైన విధానాలు ఉన్నా ఇంకా విద్య సార్వజనీనం కావడానికి ప్రత్యేక శ్రద్ధ వహించాలి. పరిశోధనపై ప్రత్యేక శ్రద్ధపెట్టి ప్రపంచానికి మార్గదర్శకం కావాలి. సాధ్యమైనంతవరకూ మన చుట్టుపక్కలనే వున్న వనరులను ఉపయోగించుకోవాలి. దానివలన దూరం నుండి కాక మనకు దగ్గరలోనే అవసరమైన వనరులను పొందగలుగుతాము. దేశంలో అమలవుతున్న విని మయ విధానాన్ని కట్టడిచేయాలి. విలాస వస్తువులపై పెద్దస్థాయిలో పన్ను విధించాలి. ప్రకృతి వనరులను భవిష్యత్తు తరాలకోసం ఒక పద్ధతిలో వినియోగించాలి. దేశం స్వయంపోషకంగా ఉంటూ మన దేశంలో తయారుచేసిన వస్తువులను ఉపయోగించుకోవాలి. అంబేడ్కర్ సహజవనరులను, ప్రధాన పరిశ్రమలను, ఆర్థిక వ్యవస్థలోని కీలక అంశాలను ప్రభుత్వ ఆస్తిగా పరిగణించాలని పేర్కొన్నాడు. ఇప్పుడు ఆదేశిక సూత్రాలను భారత ప్రజలు అంతరాత్మగా స్వీకరించి ముందుకు సాగాలి. భారత స్వాతంత్య్ర ప్రకటన బ్రిటిష్ వలసపాలకుల నుంచి విముక్తి మాత్రమే కాదు. అది భారత ప్రజల రాజకీయార్థిక, సామాజిక సాంస్కృతిక స్వావలంబన. ఇటువంటి భావనలు వాస్తవరూపం దాల్చాలంటే సంక్షేమ రాజ్యస్థాపనే పరమ లక్ష్యంగా రాజ్యాంగంలో పొందుపరచిన ఆదేశిక సూత్రాల అమలు ఒక్కటే మార్గం. ఆర్థిక సమానత్వాన్ని సాధించి సామ్యవాద తరహా సమాజాన్ని నిర్మించడమే వీటి ముఖ్య ఉద్దేశ్యం. అధికరణం 38 ప్రకారం సామాజిక , ఆర్థిక, రాజకీయ న్యాయంతో కూడిన ప్రజాసంక్షేమానికి అనుగుణమైన వ్యవస్థ ఏర్పడటానికి ఆదాయంలో హోదాలో సౌకర్యాలలో అసమానతలను తగ్గించడానికి ప్రభుత్వం (రాజ్యం) కృషి చేయాలి. అలాగే అధికరణం 39 (బి) – ప్రజలందరి సమష్టి మేలు సమకూర్చేలా సమాజంలోని భౌతికవనరులపై యాజమాన్యం నియంత్రణలను చేకూర్చేందుకు విధానాన్ని రూపొందించుకోవాలి. 39 (సి) ప్రకారం ‘జన సామాన్యానికి హాని కలగకుండా, సంపద, ఉత్పత్తి సాధనాలను వికేంద్రీకరించేలా ప్రభుత్వం తన విధానాన్ని రూపొందించుకోవాలి. ఇటువంటి ప్రజా విధానాల రూపకల్పనే లక్ష్యంగా రూపొందిన అదేశిక సూత్రాల అమలులోని ఉదాసీనతే కరోనా వైరస్ వంటి వ్యాధులకు కారణమై.. ప్రజల ఆరోగ్యాన్ని, ఆర్థిక వ్యవస్థను సామాజిక జీవనాన్ని చిన్నాభిన్నం చేస్తున్నాయి. ఈ వైఫల్యాల ఫలితమే నేడు దేశంలో 40 శాతం ప్రజలు పేదరికంలో మగ్గుతున్నారు. అధికరణం 40 ప్రకారం గ్రామ పంచాయితీలను వ్యవస్థీకరించి, స్వపరిపాలనా సంస్థలుగా అవి పని చేయడానికి అవసరమైన అధికారాలను, ప్రాధికారాలను ప్రభుత్వం ఇవ్వాలి. మానవతా పరిస్థితులతో కూడిన పనిని చూపేందుకు ప్రభుత్వం ప్రసూతి, వైద్య సదుపాయాలు ఇవ్వాలి. కార్మికులకు జీవన భృతిని, ఉన్నత ప్రమాణాలతో కూడిన జీవనాన్ని గడిపేందుకు అవసరమైన పరిస్థితులను సాంఘిక, సాంస్కృతిక అవకాశాలను కల్పించేందుకు, ప్రభుత్వం కృషిచేయాలి– అధికరణం 43. పౌష్టికాహార స్థాయిని, జీవన ప్రమాణ స్థాయిని పెంపొందించి, ప్రజారోగ్యాన్ని మెరుగుపర్చడంలో ప్రభుత్వం కృషి చేయాలి– అధికరణం 47 ప్రకారం. గోవులను, ఇతర పాడి పశువులను, పెంపుడు జంతువుల వధని నిషేధించి, వాటి ఉత్పాదనను మెరుగుపర్చడానికి ప్రభుత్వం కృషి చేయాలి– అధికరణం 48. అధికరణం 51 (జి) ప్రకారం ప్రాకృతిక సంపదలైన అడవులు, నదులు, నదీ జలాలు వన్యప్రాణుల సంరక్షణ కొరకు ప్రభుత్వం కృషి చేయాలి. ఈ ఆదేశిక సూత్రాల వైఫల్యాల పాలన ఫలితమే కరోనా వంటి వైరస్ల ఉధృతికి కారణం. కరోనా వంటి మహమ్మారిని ఎదుర్కోవాలంటే అంబేడ్కర్ ఆలోచనా విధానం లోంచి రాజ్యాంగ స్ఫూర్తిలోంచి భారత దేశం తనదైన ‘గ్రీన్ పాలిటిక్స్’ను నిర్వహించుకోవాలి. డొక్కా మాణిక్యవరప్రసాద్ వ్యాసకర్త మాజీ మంత్రి -
వైఎస్ జగన్ పాలన మెచ్చి
-
వైఎస్సార్సీపీలోకి డొక్కా, రెహమాన్
సాక్షి, అమరావతి: మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్, విశాఖ మాజీ ఎమ్మెల్యే ఎస్ఏ రెహమాన్‌లు వైఎస్సార్సీపీలో చేరారు. సోమవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో వారు వేర్వేరుగా వచ్చి పార్టీలో చేరారు. వారికి సీఎం వైఎస్ జగన్ పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. డొక్కా చేరిక కార్యక్రమంలో ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రి ఆదిమూలపు సురేష్, ఎమ్మెల్యేలు అంబటి రాంబాబు, మేరుగ నాగార్జున తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు క్యాంపు కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడారు. జగన్ నాయకత్వం ఆకర్షించింది 2014, 2015లోనే వైఎస్సార్సీపీలో చేరాల్సి ఉన్నా, రాయపాటితో కలిసి అప్పట్లో టీడీపీలో చేరాను. అక్కడ నాకు కలిసి రాలేదు. వైఎస్ జగన్ నాయకత్వంలో జరుగుతున్న కార్యక్రమాల్లో భాగస్వామిని కావాలని వైఎస్సార్సీపీలో చేరాను. జగన్ చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు నన్ను ఆకర్షించాయి. – డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆ రోజే సీఎంకు మద్దతు తెలిపాను విశాఖపట్నంను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా ప్రకటించిన రోజే సీఎం నిర్ణయానికి మద్దతు తెలిపాను. నా సతీమణి మద్యపాన నిషేధం కోసం పోరాటం చేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో అమలవుతున్న మద్యం విధానం బావుంది. పదవుల కోసం పార్టీలో చేరలేదు. విశాఖపట్నం మేయర్ పీఠాన్ని కచ్చితంగా వైఎస్సార్సీపీ గెలుచుకుంటుంది. – ఎస్ఏ రెహమాన్ -
వైఎస్సార్సీపీలో చేరిన మాజీమంత్రి
-
వైఎస్సార్సీపీలో చేరిన మాజీమంత్రి
సాక్షి, అమరావతి : టీడీపీ ఎమ్మెల్సీ, మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ వైఎస్సార్సీపీలో చేరారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో సోమవారం ఆయన వైఎస్సార్సీపీ తీర్థం పుచ్చుకున్నారు. విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, ఎమ్మెల్యే అంబటి రాంబాబుతో కలిసి సీఎం జగన్ వద్దకు వెళ్లి పార్టీలో చేరారు. అనంతరం డొక్కా వరప్రసాద్ మాట్లాడుతూ.. సీఎం జగన్ చేస్తున్న అభివృద్ధిలో భాగస్వామ్యం కావడానికే వైఎస్సార్సీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. ఆయన తీసుకునే నిర్ణయాలను స్వాగతిస్తున్నట్లు పేర్కొన్నారు. 2014లోనే వైఎస్సార్సీపీలో చేరాలని నిర్ణయించుకున్నానని, కానీ కొన్ని కారణాల రిత్యా టీడీపీలో చేరవల్సి వచ్చిందని వివరించారు. అయినా కూడా టీడీపీలో సరైన గౌరవం లభించలేదని, కాలం కలసిరాలేదని అన్నారు. ఇక డొక్కాను పార్టీలోకి సాధరంగా ఆహ్వానిస్తున్నట్లు మంత్రి సురేష్, ఎమ్మెల్యే అంబటి ప్రకటించారు. (టీడీపీకి డొక్కా మాణిక్య వరప్రసాద్ రాజీనామా) కాగా ఇటీవలే ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేసిన డొక్కా మాణిక్య వరప్రసాద్ సోమవారమే టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేసిన విషయం తెలిసిందే. టీడీపీ అధిష్టాన వైఖరి తీవ్ర ఆవేదనకు గురిచేసిందని లేఖలో పేర్కొన్నారు. రాజధాని రైతుల జేఏసీ పేరుతో తనపై తప్పుడు ఆరోపణలు చేశారని తెలిపారు. టీడీపీ నేతల చౌకబారు విమర్శలను ఆయన తీవ్రంగా ఖండించారు. 2019 ఎన్నికల్లో తాను తాడికొండ సీటును ఆశించానని.. కానీ ఓడిపోతానని తెలిసినా ప్రత్తిపాడు సీటు ఇచ్చారని ఆరోపించారు. ఎన్నికల తర్వాత కూడా టీడీపీ అధిష్టానం తీరు తనను మానసికంగా కలచివేసిందని లేఖలో పేర్కొన్నారు. -
టీడీపీకి ఎదురుదెబ్బ.. ఎమ్మెల్సీ రాజీనామా
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ప్రత్యేక సమావేశాలు జరుగుతున్న సమయంలో టీడీపీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత డొక్కా మాణిక్యవరప్రసాద్ తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు రాజీనామా లేఖను పంపించారు. అదేవిధంగా తన రాజీనామా లేఖను మీడియాకు కూడా విడుదల చేశారు. ఈ క్రమంలో భవిష్యత్‌లో ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీచేయకూడదని నిశ్చయించుకున్నట్లు డొక్కొ ఆ లేఖలో పేర్కొన్నారు. మంగళవానం శాసనమండలి సమావేశానికి డొక్కా గైర్హాజర్ కావడంతో అందరిలోనూ అనుమానాలు రేకెత్తాయి. కీలక బిల్లు నేపథ్యంలో మండలికి హాజరుకావాలని చంద్రబాబు ఫోన్ చేసినా డొక్కా స్పందించలేదని టీడీపీ వర్గాలు పేర్కొన్నాయి. రాజీనామా లేఖను చంద్రబాబుకు పంపించి ఆయన అజ్ఞాతంలోకి వెళ్లినట్టు సమాచారం. కాగా, ఈ రోజు మండలి సమావేశానికి డొక్కా మాణిక్యవరప్రసాద్‌తో పాటు శమంతకమణి, నామినేటెడ్ ఎమ్మెల్సీ రత్నబాబు కూడా హాజరుకాకపోవడం గమనార్హం. చదవండి: టీడీపీ సభ్యుల తీరుపై స్పీకర్ మనస్తాపం ‘డర్టీ పొలిటీషియన్ అని అదే కేసీఆర్ అనలేదా’ సర్వతోముఖాభివృద్ధే మా లక్ష్యం -
తాడికొండలో పుట్టి.. ప్రత్తిపాడులో పోటీ
సాక్షి, ప్రత్తిపాడు : ప్రత్తిపాడు నియోజకవర్గంలో ఇప్పుడు ఓ అంశం చర్చనీయాంశమవుతోంది. అందరి నోళ్లలోనూ ఇదే నానుతోంది. ఇది ప్రత్తిపాడు నియోజకవర్గమా లేక తాడికొండ నియోజకవర్గమా అంటూ ఓటర్లు ఛలోక్తులు విసురుతున్నారు. కారణం ప్రత్తిపాడు అసెంబ్లీ బరిలో పోటీలో ఉన్న ప్రధాన పార్టీల అభ్యర్థులంతా తాడికొండ నియోజకవర్గ వాసులు, ఆ నియోజకవర్గంతో అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్న వ్యక్తులే కావడంతో పొలిటికల్ కారిడార్‌లో చక్కర్లు కొడుతుందీ టాపిక్. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మేకతోటి సుచరిత స్వగ్రామం తాడికొండ నియోజకవర్గంలోని ఫిరంగిపురం. ఈమె 2009లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీలో నిలిచి విజయం సాధించారు. ప్రస్తుతం 2019 ఎన్నికల్లో సైతం ప్రత్తిపాడు నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో నిలుస్తున్నారు. జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి రావెల కిషోర్‌బాబుది సైతం తాడికొండ నియోజకవర్గమే. తాడికొండ మండలం రావెల గ్రామం. 2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా బరిలో నిలిచి విజయం సాధించి మంత్రి పదవిని కైవసం చేసుకున్నారు. తాజాగా 2019 ఎన్నికల్లో ప్రత్తిపాడు నుంచి జనసేన అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో నిలిచిన డొక్కా మాణిక్యవరప్రసాద్ కూడా తాడికొండ నియోజకవర్గానికి సుపరిచితులే. స్వగ్రామం ఆ నియోజకవర్గం కాకున్నప్పటికీ గత కొద్ది సంవత్సరాలుగా అక్కడి ప్రజలతో ఆయనకు సన్నిహిత సంబంధాలున్నాయి. ఆ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు కూడా. ప్రస్తుతం ఈయన ఎమ్మెల్సీగా కొనసాగుతూ ప్రత్తిపాడు నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. భారతీయ జనతా పార్టీ కూడా తాడికొండ నియోజకవర్గ అల్లుడికే ప్రత్తిపాడు సీటును కేటాయించింది. వృతిరీత్యా వైద్యుడైన డాక్టర్ చల్లగాలి కిషోర్ తాడికొండకు చెందిన డాక్టర్ సబితను వివాహం చేసుకున్నారు. ఈయన ప్రస్తుతం ప్రత్తిపాడు నుంచి బీజేపీ తరఫున బరిలో ఉన్నారు. -
కిరణ్ కుమార్ రెడ్డి దేశంలోనే అత్యధిక ధనవంతుడు
-
కిరణ్ చేరిక.. కాంగ్రెస్‌కు ఒక్క ఓటు..
సాక్షి, విజయవాడ : జై సమైఖ్యాంధ్ర పార్టీ అధ్యక్షుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి దేశంలోనే అత్యధిక ధనవంతుడైన నాయకుడు అంటూ డొక్కా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన కచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో తిరిగి చేరుతారని నాలుగేళ్ల క్రితమే తాను చెప్పానని టీడీపీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వర ప్రసాద్ గుర్తు చేశారు. శుక్రవారం కిరణ్ కుమార్ రెడ్డి ఢిల్లీలో రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీనిపై మాట్లాడిన డొక్కా.. కిరణ్ చేరిక వల్ల ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీకి ఒక్క ఓటు రాబోతోందని విమర్శించారు. కేవలం కిరణ్ ఓటు మాత్రమే కాంగ్రెస్‌కు పడుతుందని అన్నారు. కిరణ్‌పైనా, తనపైనా విచారణ జరపాలని గతంలోనే గవర్నర్‌కు లేఖ రాసినట్లు డొక్కా వెల్లడించారు. కిరణ్ తమ్ముడు కిషోర్ కుమార్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో బలమైన నాయకుడని చెప్పారు. -
‘ప్రధాని ఎవరో చంద్రబాబు నిర్ణయిస్తారు’
సాక్షి, అమరావతి: బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా.. సీఎం చంద్రబాబుకు రాసిన లేఖ అబద్ధాల పుట్ట అని టీడీపీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ విమర్శించారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... బాహుబలి సినిమాలో కాలకేయుడు పలికిన కిలికిలి భాషలో అమిత్ షా లేఖ ఉందని ఎద్దేవా చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా అబద్దాల ఫ్యాక్టరీలో తయారైన లేఖను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఐదు కోట్ల మంది ఏపీ ప్రజలను బీజేపీ మోసం చేసిందని మండిపడ్డారు. మాట వినని వారిపై సీబీఐ కేసులంటూ బెదిరిస్తున్నారని ఆరోపించారు. ప్రత్యేక హోదానే దేశ రాజకీయాలు శాసిస్తుందన్నారు. వచ్చే ఎన్నికల తర్వాత దేశానికి కాబోయే ప్రధానమంత్రి ఎవరో చంద్రబాబు నాయుడు నిర్ణయించబోతున్నారని జోస్యం చెప్పారు. -
మాధవ్ వర్సెస్ వరప్రసాద్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో అధికార మిత్రపక్షాలు టీడీపీ, బీజేపీ మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. ప్రత్యేక హోదా అంశంపై ఇరు పార్టీల నేతలు పరస్పర విమర్శలకు దిగుతున్నారు. బుధవారం శాసనమండలిలో టీడీపీ, బీజేపీ సభ్యుల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. తమపై టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని బీజేపీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ అంటే, ఏపీని కేంద్రం నిర్లక్ష్యం చేస్తోందని టీడీపీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ ఆరోపించారు. టీడీపీ తప్పుడు రాతలు: ఎమ్మెల్సీ మాధవ్ ‘టీడీపీ మాపై తప్పుడు ప్రచారం చేస్తోంది. చంద్రబాబుకు ప్రధానమంత్రి అపాయింట్మెంట్ ఇవ్వలేదంటున్నారు ఎప్పుడు ఇవ్వలేదో చెప్పమనండి. ఎయిమ్స్ పనిజరగడం లేదని టీడీపీ అధికార వెబ్సైట్లో తప్పుడు రాతలు రాస్తున్నారు. మంగళగిరి వెళ్లి పనులు పరిశీలించి మాట్లాడండి. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి ఒక్క రూపాయి కూడా కేంద్రం నుంచి బాకీ లేదు, బిల్లులు ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తున్నాం. 2019 ఎన్నికల కోసం హడావుడిగా స్పిల్‌వే పనులు చేపట్టారు. నిర్వాసితుల సమస్యలపై దృష్టి పెట్టడం లేదు. మేము అన్నీ నిజాలే చెబుతామ’ని బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ అన్నారు. ఏపీపై కేంద్రం పోలీసింగ్: ఎమ్మెల్సీ డొక్కా ‘రాజధాని నిర్మాణానికి కేంద్రం నిధులు ఇవ్వడం లేదు. ఇది రాజకీయ ధర్మమా, మిత్ర ధర్మమా? ఏపీ ప్రభుత్వం అడిగిన ప్రతివిషయాన్ని కేంద్రం నిర్లక్ష్యం చేస్తోంది. అహ్మదాబాద్, ముంబై మెట్రోకు వేల కోట్లు కేటాయిస్తారు. అమరావతి మెట్రోకు మాత్రం నిధులు కేటాయించడం లేదు. రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్రం పోలీసింగ్ చేస్తోంది. అభివృద్ధి ఎలా చేయాలో చంద్రబాబు నుంచి కేంద్రం నేర్చుకోవాలి. పార్లమెంటు చట్టాలంటే బీజేపీకి గౌరవం లేదు. ఐదుకోట్ల ఏపీ ప్రజలను నిర్లక్ష్యం చేయొద్దు. కేంద్రంపై పోరాటం చేసేవరకూ తెచ్చుకోవద్ద’ని ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ పేర్కొన్నారు. -
జాషువాపై సదస్సు
గుర్రం జాషువా 120వ జయంతిని పురస్కరించుకుని ‘గుర్రం జాషు వా 120వ జయంతి ఉత్సవ కమిటీ’ ఆధ్వర్యంలో గుంటూరు, ఏసీ కాలేజీ ఆడిటోరియంలో సెప్టెంబర్ 27 ఆదివారం ఉదయం 10 గం టల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ రాష్ట్ర సదస్సు జరుగు తుంది. తెలుగు సాహిత్యంలో జాషువా విశిష్టత, జాషువా శైలి - వస్తు వైవిధ్యం, జాషువా సాహిత్యం - సామాజిక వాస్తవికత అనే మూడు అంశాలపై సమావేశాలు జరుగుతాయి. 50 సంఘాలు సంయుక్తంగా ఈ సదస్సును విశిష్టంగా నిర్వహిస్తున్నాయి. ప్రారంభ సభలో ఉత్సవ కమిటీ చైర్మన్ డొక్కా మాణిక్య వరప్రసాద్, రాజ్యసభ సభ్యులు జేడీ శీలం, శాసన మండలి సభ్యు లు ఎంవీఎస్ శర్మ, బీవీ రాఘవులు, కొలకలూరి ఇనాక్, కె. శ్రీనివాస్, గోరటి వెం కన్న, ఏసీ కళాశాల ప్రిన్సిపాల్ పి.ముత్యం, కేఎస్ లక్ష్మణరావు పాల్గొంటారు. అనంతరం సదస్సులో తెలకపల్లి రవి, కత్తి పద్మారావు, అద్దేపల్లి రామమోహన్‌రావు, రావెల సాంబశివరావు, రాచపాళెం చం ద్రశేఖర్‌రెడ్డి, సీఎస్ఆర్ ప్రసాద్, ఎండ్లూరి సుధాకర్, బి.వేదయ్య, ఖాదర్ మొహియుద్దీన్, కోయి కోటేశ్వరరావు, మాల్యాద్రి, కొలకలూరి మధుజ్యోతి, ఎంఎం.వినోదిని, పెనుగొండ లక్ష్మీనారాయణ, డాక్టర్ ఎం.స్వర్ణలతాదేవి, మోదుగల రవికృష్ణ పాల్గొంటారు. వివరాలకు... - పి.వి.రమణ, ప్రధాన కార్యదర్శి గుర్రం జాషువా 120వ జయంతి ఉత్సవ కమిటీ, ఫోన్:73964 9310 -
చంద్రబాబు సాక్షిగా పార్టీలో చేరిన డోక్కా
-
'రాజధాని' పేదలకు 5 ఎకరాల భూమి ఇవ్వాలి
గుంటూరు: రాజధాని ప్రాంతంలోని భూమి లేని పేదలకు ఒక్కో కుటుంబానికి 5 ఎకరాల అటవీభూమి ఇవ్వాలని చంద్రబాబు ప్రభుత్వాన్ని మాజీ మంత్రి డొక్కా మాణిక్య వర ప్రసాద్ డిమాండ్ చేశారు. శనివారం గుంటూరులో డొక్కా మాణిక్య వర ప్రసాద్ మాట్లాడుతూ... 18 సంవత్సరాలు నిండినవారికి ఉపాధి చూపేంత వరకు నెలకు రూ. 5 వేల భృతి ఇవ్వాలని ప్రభుత్వానికి సూచించారు. అనంతవరంలోని శ్రీవెంకటేశ్వరస్వామి దేవాలయాన్ని మరో తిరుపతిలా అభివృద్ధి చేయాలని చంద్రబాబు ప్రభుత్వానికి ఆయన విజ్ఞప్తి చేశారు. -
‘ఫాస్ట్’ ప్రాంతీయ దురహంకార జీవో
హైకోర్టులో మాజీ మంత్రి డొక్కా పిల్ హైదరాబాద్: తెలంగాణలో 1956 నవంబర్ 1 నాటికి స్థిరపడిన కుటుంబాల విద్యార్థులకే ఆర్థిక సాయం అందచేసే నిమిత్తం తెలంగాణ విద్యార్థులకు ఆర్థిక సాయం (ఫాస్ట్) పేరుతో ప్రభుత్వం జారీ చేసిన జీవో 36ను సవాలు చేస్తూ హైకోర్టులో మరో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. మాజీ మంత్రి డొక్కా మాణిక్య వర ప్రసాద్ ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. రాష్ట్రపతి ఉత్తర్వులకు విరుద్ధంగా ఉన్న ఈ జీవోను కొట్టివేసి, ప్రవేశాలు, ఫీజు రీయింబర్స్మెంట్ విషయంలో గత విధానాన్నే అమలు చేసేలా ఆదేశాలు జారీ చేయాలని కోర్టును అభ్యర్థించారు. ప్రాంతీయ దురహంకారంతో ఉన్న ఈ ఫాస్ట్ జీవో సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని తెలిపారు. ఈ వ్యాజ్యాన్ని సోమవారం ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం విచారించే అవకాశం ఉంది. -
కేసీఆర్‌పై ‘డొక్కా’ పొగడ్తల వర్షం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సీఎం కె.చంద్రశేఖరరావుపై మాజీమంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ పొగడ్తల వర్షం కురిపించారు. ఒక్కో దళిత కుటుంబానికి మూడెకరాల భూమి పంపిణీ, మైనారిటీలకు 12 శాతం రిజర్వేషన్లు వంటి నిర్ణయాలు తీసుకున్న కేసీఆర్‌పై రోజురోజుకూ గౌరవం పెరుగుతోందన్నారు. సీఎల్పీ కార్యాలయం వద్ద గురువారం మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ అమలు చేస్తున్న ఆయా నిర్ణయాలను ఏపీలోనూ అమలు చేయాలని సీఎం చంద్రబాబును డిమాండ్ చేస్తామన్నారు. అయితే ఫీజు రీయింబర్స్మెంట్ విషయంలో కేసీఆర్ తీసుకున్న నిర్ణయం అనర్థాలకు దారితీస్తుందని అభిప్రాయపడ్డారు. -
నల్లధనాన్ని మార్చుకునేందుకే బిజెపి వైపు చూపు!
హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పెద్ద అవినీతిపరుడని మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ ఆరోపించారు. సీఎంగా సంపాదించిన నల్లధనాన్ని మార్చుకునేందుకే ఆయన బీజేపీ వైపు చూస్తున్నారన్నారు. విభజనను వ్యతిరేకించిన కిరణ్ విభజనకు సహకరించిన బీజేపీలో ఎలా చేరతారని ఆయన ప్రశ్నించారు. టీడీపీ, బీజీపీ మధ్య సంబంధాలు చెడగొట్టడమే కిరణ్ ఎజెండా అని మాణిక్యవరప్రసాద్ విమర్శించారు. -
తాడికొండ నుంచి పోటీ చేయను: డొక్కా మాణిక్య
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో తన సొంత నియోజకవర్గమైన గుంటూరు జిల్లా తాడికొండ నుంచి పోటీ చేయబోనని మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ స్పష్టం చేశారు. పార్టీ ఎక్కడ పోటీ చేయమని ఆదేశిస్తే అక్కడే తాను పోటీ చేస్తానన్నారు. సోమవారం ఇందిరాభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాయపాటితో పాటు టీడీపీలో చేరడం తనకు ఇష్టం లేదని, అదే విషయాన్ని ఆయనకు తెలియచేశానన్నారు. కాంగ్రెస్‌లోనే కొనసాగుతానని స్పష్టం చేశానన్నారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు చేయడం ద్వారా టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పీడను సీమాంధ్రకు లేకుండా చేసినందుకు సోనియాగాంధీకి కృతజ్ఞతలు తెలుపుతున్నట్టు చెప్పారు. -
కెసిఆర్ నుంచి సీమాంధ్రకు విముక్తి
హైదరాబాద్: టిఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు(కెసిఆర్) నుంచి సీమాంధ్రను విముక్తి చేసినందుకు ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీకి మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణను సీమాంధ్రులు దోచుకున్నారనే విమర్శలు ఇకపై కేసీఆర్ నుంచి ఉండవన్నారు. తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని చెప్పారు. గుంటూరు జిల్లా తాడికొండ మినహా జిల్లాలో మరెక్కడైనా పోటీకి సిద్ధంగా ఉన్నట్లు డొక్కా తెలిపారు. -
ఫ్లాప్ షో..!
సాక్షి, ఒంగోలు: ‘కాశీకి వెళ్లానని..కాషాయం..’ అంటూ ఇంద్ర సినిమా డైలాగ్‌తో ప్రారంభమైన ఆయన ప్రసంగం కాంగ్రెస్ కార్యకర్తల బుర్రను వేడెక్కించింది. నూనుగు మీసాల వయసులో ఒంగోలులో తాను తిరిగిన జ్ఞాపకాలు మదిలో మెదులుతున్నాయని చెప్పిన ఆయన గుర్తులు వేదికపైనున్న కాంగ్రెస్ పెద్దల్ని అయోమయానికి గురిచేశాయి. ‘కాంగ్రెస్ పార్టీ అనేది ప్రకృతి గద్ద.. రెక్కలు విప్పుకుని ఆకాశంలో ఎగిరిన పక్షిలా.. నేడు యువకులు రూపాంతరం చెందాలి.. కార్యోన్ముఖులు కావాలి..’ కాంగ్రెస్ ప్రచారకమిటీ అధ్యక్ష బాధ్యత చేపట్టిన కేంద్రమంత్రి చిరంజీవి పొంతనలేకుండా చేసిన వ్యాఖ్యలివి.. సోమవారం ఒంగోలులో కాంగ్రెస్ బస్సుయాత్ర కాస్తా తుస్సుమంది. గుంటూరు జిల్లా నుంచి నేరుగా ఒంగోలులోకి ప్రవేశించిన బస్సుయాత్ర నగరంలో ట్రంకురోడ్డు, చర్చిసెంటర్, కలెక్టరేట్, రామ్‌నగర్ మీదుగా సాగింది. అనంతరం ఓ ప్రైవేటు ఫంక్షన్‌హాలులో ఏర్పాటు చేసిన సమావేశానికి సీమాంధ్ర పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి, చిరంజీవి, కేంద్రమంత్రులు పనబాక లక్ష్మి, జేడీ శీలం, మాజీమంత్రులు కన్నా లక్ష్మీనారాయణ, డొక్కా మాణిక్యవరప్రసాద్, ఎమ్మెల్యేలు తదితరులు హాజరయ్యారు. డీసీసీ అధ్యక్షుడు, కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశం ఆద్యంతం గందరగోళంగా నడిచింది. చిరంజీవి అభిమానులు అక్కడికొచ్చినా... వారు తమ అభిమాన నేతను కలిసే విషయంలో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలతో తీవ్రంగా విభేదించి వాగ్వాదానికి దిగారు. అక్కడ ఏర్పాటు చేసిన పార్టీ ఫ్లెక్సీలను కూడా చించేశారు. నేతల ప్రసంగాలకు అడ్డుతగులుతున్న చిరు అభిమానుల హడావుడిపై రఘువీరారెడ్డి తీవ్ర అసహనానికి గురై మైక్‌లో కేకలేశారు. స్వయంగా చిరంజీవి పైకిలేచి ..మైకు పట్టుకుని క్రమశిక్షణ అంటూ అభిమానులను కట్టడిచేసే ప్రయత్నం చే సినా.. వారిమధ్య వాగ్వాదాలు సద్దుమణగలేదు. పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి మాట్లాడుతూ సీమాంధ్రను నవ్యాంధ్రగా మార్చే సత్తా కాంగ్రెస్ పార్టీకే ఉందన్నారు. దొంగే..దొంగదొంగ అని అరిచినట్లు చంద్రబాబు కాంగ్రెస్‌ను విమర్శిస్తున్నారని.. అతనికి భవిష్యత్‌లో ఘోరపరాభవం ఎదురుకానున్నదని రఘువీరా జోస్యం చెప్పారు. కేంద్రమంత్రి పనబాక మాట్లాడుతూ చిరంజీవిని సూపర్‌స్టార్ అని సంభోదించగా.. ఆమెకు వ్యతిరేకంగా నినాదాలు వినిపించాయి. పవర్‌స్టార్, జై జనసేన అంటూ పవన్‌కల్యాణ్‌ను స్తుతిస్తూ కొందరు పవన్‌కల్యాణ్ అభిమానులు పెద్దగా నినాదాలివ్వడంతో వేదికపై నేతలు డైలామాలో పడ్డారు. పలువురు రాష్ట్ర నేతలు మాట్లాడినప్పటికీ.. రాష్ట్రవిభజనపై కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయాలు, సీమాంధ్ర ప్యాకేజీలపై కార్యకర్తల్లో సరైన అవగాహన కల్పించలేకపోయారు. చివరికి చిరంజీవి ప్రసంగంలో ఒంగోలును జపాన్ చేస్తానని.. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంతో ప్రకాశం రైతులకు మేలంటూ .. చెప్పడంపై విసుగు చెందిన పలువురు నేతలతో పాటు సమావేశం నుంచి భారీగా కార్యకర్తలు బయటకు వెళ్లిపోయారు. ‘స్టాలిన్’ డైలాగ్‌ను గుర్తుచేసిన పనబాక కేంద్రమంత్రి పనబాక లక్ష్మి మాట్లాడుతూ చిరంజీవి నటించిన స్టాలిన్ సినిమా డైలాగ్‌ను చెబుతూ.. కాంగ్రెస్‌పై ఇతర పార్టీలు చేస్తున్న దుష్ర్పచారాన్ని ఒకరు మరో ముగ్గురుతో మాట్లాడి తిప్పికొట్టాలని సూచించారు. చిరంజీవి అభిమానులు ఈలలు, చప్పట్లకు పరిమితం కాకూడదంటూ.. రానున్న కాలంలో యువతకు తమపార్టీ పెద్దపీట వేస్తుందని చెప్పారు. మరో కేంద్రమంత్రి జేడీ శీలం మాట్లాడుతూ చంద్రబాబు బీజేపీతో అశ్లీలపొత్తుకు సిద్ధపడటం సిగ్గుచేటన్నారు. ఆయన తొమ్మిదేళ్లహయాంలో ఇంకుడు గుంతలు, నీరు, మీరు, వనం..మనం తదితర పథకాలతో పచ్చకండువాల నేతలకు రాష్ట్ర్రాన్ని బేరం పెట్టడం అందరికీ తెలిసిందేనన్నారు. సీమాంధ్రకు కేంద్రమిచ్చిన ప్రత్యేక ప్యాకేజీతో ఒక్కో పట్టణాన్ని ఒక్కో భాగ్యనగరంగా తీర్చిదిద్దుతామన్నారు. మాజీమంత్రి కొండ్రు మురళి మాట్లాడుతూ పదవులు అనుభవించి పక్కకెళ్లిన నేతల కారణంగా కాంగ్రెస్‌కు కష్టాలు దాపురించాయన్నారు. త్వరలో సీమాంధ్ర అద్భుతప్రగతిని చూస్తుందన్నారు. మాజీమంత్రులు కన్నా లక్ష్మీనారాయణ, డొక్కా మాణిక్యవరప్రసాద్, ఎమ్మెల్యే జీవీ శేషు తదితరులు మాట్లాడారు. కాంగ్రెస్ బస్సుయాత్రకు ఎమ్మెల్యేలు ఉగ్ర నరసింహారెడ్డి, జీవి శేషు మినహా ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, మాజీమంత్రి మానుగుంట మహీధర్‌రెడ్డితోపాటు ఇతర కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా దూరంగా ఉన్నారు. కార్యక్రమం అంతటా చిరంజీవి అభిమానులు తప్ప కాంగ్రెస్ కార్యకర్తలు, నేతలు పెద్దగా కనిపించలేదు. గతంలో తాను పీఆర్పీ అధినేతగా సమైక్యాంధ్ర కోసం పోరాడానంటూనే.. అప్పట్లో తనను ఎవరూ మెచ్చుకోనందున.. కాంగ్రెస్‌లో కలిశానని.. ఇప్పుడు తన హక్కులు, అధికారాలు పరిమితమయ్యాయని చిరంజీవి చెప్పుకోవడంపై అభిమానులు పెదవి విరిచారు. చిరంజీవి మాట్లాడుతూ మాగుంట కాస్త అటూఇటుగా ఉన్నారని, ఆయన మళ్లీ కాంగ్రెస్‌లోకి వస్తారని అన్నారు. విభజనపై తాను బాధపడుతున్నానని ఆయన చెప్పుకుంటూనే కాంగ్రెస్‌ను ఓట్లేసి గెలిపించమనడం ఎంతవరకు సబబని కార్యకర్తలు ఒకరికొకరు ప్రశ్నించుకున్నారు. మొత్తానికి కాంగ్రెస్ బస్సుయాత్ర ఫ్లాప్‌షోగా మిగిలిపోయింది. -
కాంగ్రెస్ ఓ మహాసముద్రం
గుంటూరు మెడికల్, న్యూస్‌లైన్:కాంగ్రెస్ మహాసముద్రం లాంటిదని కేంద్ర మంత్రి చిరంజీవి అభివర్ణించారు. కుళ్లూ, చెత్తా ఒడ్డుకు చేరుకుంటాయని, సముద్రం మాత్రం పవిత్రంగా ఉంటుందని పేర్కొన్నారు. రాష్ట్ర విభజన విషయంలో ప్రాంతీయ పార్టీలన్నీ కాంగ్రెస్‌పై దుష్ర్పచారం చేశాయనీ, నిజాలు అందరికీ తెలిపి పార్టీ విజయానికి కృషి చేయాలని కార్యకర్తలను కోరారు. బస్సుయాత్రలో భాగంగా సోమవారం గుంటూరు నగరానికి చేరుకున్న కాంగ్రెస్ ముఖ్య నేతలు గుంటూరు జీటీ రోడ్డులోని సన్నిధి ఫంక్షన్ హాల్లో జరిగిన జిల్లా, నగర కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ యువతరానికి అవకాశం ఇస్తుందనీ, యువత వినియోగించుకోవాలని సూచించారు. నిఖార్సయిన వాడ్ని కాబట్టే కాంగ్రెస్‌లో కొనసాగుతున్నా.. తాను నికార్సయిన వ్యక్తిని కాబట్టే కాంగ్రెస్‌లో కొనసాగుతున్నానని చిరంజీవి చెప్పారు. టీడీపీ, వైఎస్సార్ సీపీ బీసీలు, దళితులను ముఖ్యమంత్రులనుచేస్తారా అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌లోనే అందరికీ సమానావకాశాలుంటాయని, సామాజిక న్యాయం జరుగుతుందన్నారు. కాంగ్రెస్‌లో ఉన్నవాళ్లే విభజన సాకుతో పార్టీని ఎక్కువగా బలహీన పరచారని, కిరణ్‌కుమార్‌రెడ్డి కాంగ్రెస్‌కు వెన్నుపోటు పొడిచారని ఆరోపించారు. స్టాలిన్ సినిమాలోని డైలాగులు చెప్పి కార్యకర్తలను ఉత్తేజ పరిచేందుకు ప్రయత్నించారు. కాంగ్రెస్ తప్పులేదని చెప్పండి.. పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికోసం కాంగ్రెస్‌పార్టీ చేసిన పనులను ఏకరవు పెట్టారు. రాష్ట్ర విభజనపై టీడీపీ, వైఎస్సార్ సీపీలు ఇచ్చిన లేఖల ప్రతులను చూపించారు. వాటిని ఇంటింటికీ చూపించి విభజన విషయంలో కాంగ్రెస్ పార్టీ తప్పులేదనే విషయాన్ని వివరించాలని కార్యకర్తలను కోరారు. గుంటూరు మిర్చి ఘాటు, పల్నాటి పౌరుషాన్ని చూపించి ప్రాంతీయ పార్టీలను భూస్థాపితం చేయాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే మస్తాన్‌వలి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం బలహీనపడితే రాష్ట్రం బలహీనపడినట్లేనన్నారు. బడా వ్యాపారవేత్తలు పార్టీ ముసుగులు ధరించి వస్తున్నారని, వారి ఉచ్చులో ఇరుక్కోవద్దని కోరారు. కేంద్ర మంత్రి జేడీ శీలం మాట్లాడుతూ నరరూప రాక్షసుడు నరేంద్ర మోడీతో చంద్రబాబు జతకట్టారని, ప్రజలు వారికి తగిన బుద్ధి చెప్పాలని తీవ్రంగా వ్యాఖ్యానించారు.వ్యాపారులను టీడీపీలోకి చేర్చుకోవడంపై మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ పార్టీ నడుతున్నారా వ్యాపార సంస్థ నడుపుతున్నారా అంటూ ఆ పార్టీ అధినేత చంద్రబాబును ప్రశ్నించారు. కాంగ్రెస్‌లోనే కొనసాగుతా.. మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ మాట్లాడుతూ తాను కాంగ్రెస్‌లోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. నాలుగు రోజులుగా సందిగ్ధంలో ఉన్న తాను తన కుమార్తె ఇచ్చిన నైతిక స్థైర్యంతో స్థిర నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.సమావేశంలో కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి, డీసీసీ అధ్యక్షుడు మక్కెన మల్లికార్జునరావు, మాజీ మంత్రులు కాసు కృష్ణారెడ్డి, కొండ్రు ముర ళి, ఎమ్మెల్సీలు సింగం బసవపున్నయ్య, మహమ్మద్ జానీ, ఉడా చైర్మన్ వణుకూరి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే యర్రం వెంకటేశ్వరరెడ్డి, మాజీ ఎమ్మెల్యే లింగంశెట్టి ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
సీమాంధ్రలో కాంగ్రెస్‌కు గడ్డుకాలం
పార్టీలో ఉండలా వద్దా ఆలోచిస్తున్నా: డొక్కా కాంగ్రెస్ పార్టీలో కొనసాగాలా? వద్దా?, టీడీపీలో చేరాలా? వద్దా? అనే అంశాలపై తాను సందిగ్ధంలో ఉన్నానని మాజీ మంత్రి, కాంగ్రెస్ ప్రచార కమిటీ కో చైర్మన్ డొక్కా మాణిక్యవరప్రసాద్ పేర్కొన్నారు. ఆదివారం తన అనుచరులతో మాట్లాడి తుదినిర్ణయం తీసుకుంటానని చెప్పారు. సీమాంధ్రలో కాంగ్రెస్ తీవ్ర గడ్డుపరిస్థితిలో ఉందని, అది కోలుకోవడం కష్టమేనని వ్యాఖ్యానించారు. ఆయన శనివారమిక్కడ సీఎల్పీ కార్యాలయం ఎదుట మీడియాతో మాట్లాడారు. తనకు అన్నివిధాలా అండదండలందిస్తూ సోదరుడిలా నిలచిన రాయపాటిని బహిష్కరించడం ద్వారా కాంగ్రెస్ పొరపాటు చేసిందన్నారు. ఈ నేపథ్యంలో రాయపాటి టీడీపీలో చేరాలన్న అభిప్రాయానికి వచ్చారన్నారు. తనమీదున్న అభిమానంతో ఆయనతోపాటు తానూ వస్తానని చెప్పానని, అయితే ఈ విషయంలో తానింకా ఏమీ తేల్చుకోలేకపోతున్నానని డొక్కా వివరించారు -
ఆర్నెల్లలో అక్రమార్జన రూ. 10 వేల కోట్లు
తాజా మాజీ సీఎం కిరణ్ అవినీతిపై గవర్నర్‌కు డొక్కా లేఖ సాక్షి, హైదరాబాద్: మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి పదవీ కాలంలోని చివరి ఆరునెలల్లో పలు ఫైళ్లను అక్రమంగా క్లియర్ చేసి ఐదు నుంచి పదివేల కోట్ల రూపాయలు అక్రమంగా ఆర్జించారని ఆయన కేబినెట్ సహచరుడు, మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ ఆరోపించారు. మంత్రులు అక్రమంగా సంపాదించారన్న అపవాదులు వస్తున్నాయన్నారు. తనతో పాటు కిరణ్‌కుమార్‌రెడ్డి నిర్ణయాలపైనా విచారణ చేయాలని రాష్ట్ర గవర్నర్ నరసింహన్‌ను డొక్కా ఒక లేఖలో కోరారు. ఆ లేఖను గురువారం సీఎల్పీ కార్యాలయం వద్ద మీడియాకు విడుదల చేశారు. అవినీతి, అక్రమార్జనలపై ఎక్కడ విచారణ చేయిస్తారోననే కిరణ్ కొత్త పార్టీ పెట్టాలని అనుకుంటున్నారని డొక్కా విమర్శించారు. పార్టీ పెట్టాను కనుకనే తనను వేధిస్తున్నారని చెప్పుకోవడానికే ఈ పార్టీ స్థాపన అన్నారు. గతంలో ఎన్నడూ లేనంతగా అవినీతి పెరిగిపోయిందని, ఆరునెలలుగా కిరణ్ రెండు చేతులతో సంతకాలు చేస్తూ భారీగా ఆస్తులు కూడబెట్టారని ఆరోపించారు. చివరికి బదిలీలు చేయడానికి కూడా భారీగా డబ్బులు వసూలు చేశారన్నారు. ముఖ్యంగా ఐఏఎస్, ఐపీఎస్‌ల పోస్టింగుల్లో డబ్బు చేతులు మారిందన్నారు. సీఎంగా కిరణ్ ఉండగా ఆయన ఇద్దరు తమ్ముళ్లూ బ్యాక్ ఆఫీసు నిర్వహించి సెటిల్మెంట్లు, ఫైళ్ల క్లియరెన్సులు చేశారని ఆరోపించారు. వారిద్దరిపైనా కూడా విచారణ చేయాలన్నారు. తాను మంత్రిగా పనిచేసిన ఒక కారు కొనుక్కొన్నానని, ఓ అపార్టుమెంటుకు అడ్వాన్సు ఇచ్చానని, ఇంతకుమించి తనకు ఆస్తులు లేవని డొక్కా తెలిపారు. కిరణ్ అవినీతి విషయంలో గవర్నర్‌ను స్వయంగా కలుద్దామని భావించానని, ఆయన హైదరాబాద్‌లో లేనందున ఫ్యాక్స్ ద్వారా లేఖ పంపానన్నారు. తనపై వచ్చిన ఆరోపణలు అవాస్తవమని భావిస్తే వాటిని రుజువు చేసుకోవాల్సిన బాధ్యత కిరణ్‌పైనే ఉందన్నారు. -
'ఆరు నెలల్లో రూ. 10 వేల కోట్లు సంపాదించాడు'
మాజీ ముఖ్యమంత్రి ఎన్.కిరణ్ కుమార్ రెడ్డి తన అవినీతిని కప్పి పుచ్చుకునేందుకు కొత్త పార్టీ అంటూ డ్రామా లాడుతున్నారని మాజీ మంత్రి డొక్కా మణిక్యవర ప్రసాద్ ఆరోపించారు. కిరణ్ అవినీతిపై విచారణ జరపాలని రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్‌కు ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు గురువారం గవర్నర్‌కు మాణిక్యవర ప్రసాద్ లేఖ రాశారు. ఆరు నెలలుగా అవినీతి ఫైళ్లపై కిరణ్ రెండు చేతులతో సంతకాలు చేశారని విమర్శించారు. ఆరు నెలల కాల వ్యవధిలో రూ. 5 నుంచి 10 వేల కోట్లు కిరణ్ సంపాదించారన్నారు. రాష్ట్రంలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీలను కూడా వదిలిపెట్టకుండా సీఎంగా కిరణ్ మాముళ్లు వసూళ్లు చేశారన్నారు. కిరణ్ అవినీతి సామ్రాజ్యాన్ని విస్తరించారన్నారు. కిరణ్ బ్యాక్ అఫీస్ ద్వారా ఆయన తమ్ముడు వసూళ్లు చేశారని డొక్కా మణిక్యవర ప్రసాద్ ఆరోపించారు. కిరణ్‌కు డొక్యా మాణిక్యవరప్రసాద్ అత్యంత సన్నిహితుడు. ఆయన మంత్రి వర్గంలో గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా వ్యవహరించారు. అయితే కిరణ్ తన సీఎం పదవికి రాజీనామా చేసిన వెంటనే డొక్యా మణిక్యవర ప్రసాద్ సంచలనాత్మకమైన ఆరోపణలు చేశారు. ప్రముఖ రచయిత గోపిచంద్ వ్రాసిన అసమర్థుని జీవ యాత్ర నవలలోని సీతారామరావు పాత్రకు కిరణ్ అచ్చుగుద్దినట్లు సరిపోతారని ఎద్దేవా చేసిన సంగతి తెలిసిందే. -
ఒకరికి ఛాన్స్..!
సాక్షి ప్రతినిధి, గుంటూరు :ఢిల్లీలో రోజురోజుకు మారుతున్న రాజకీయ సమీకరణ లతో జిల్లా నాయకులు బిజిబిజీగా మారుతున్నారు. రెండు రాష్ట్రాలకు వేర్వేరు పీసీసీ, ముఖ్యమంత్రులను ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్‌సింగ్ ప్రకటించిన నేపథ్యంలో వీటి కోసం నాయకులు తమ లాబీయింగ్‌ను వేగవంతం చేశారు. ముఖ్యమంత్రి రేసులో కన్నా లక్ష్మీనారాయణ పేరు మొదటి నుంచి వినపడుతున్నప్పటికీ తాజాగా చిరంజీవి పేరు తెరపైకి వచ్చింది. జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో కన్నా లక్ష్మీనారాయణ సీనియర్‌గా ఉన్నారు. ఆయన వరుసగా ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నిక కావడంతో పాటు సీనియర్ మంత్రిగా వున్నారు. సమైక్యాంధ్ర ఉద్యమ సమయంలో సైతం ఏనాడూ పార్టీ అధిష్టానాన్ని వ్యతిరేకించే ప్రయత్నం చేయలేదు. అయితే పార్టీని విలీనం చేసి కష్టకాలంలో కాంగ్రెస్‌ను గట్టెక్కించిన చిరంజీవి ఆయనకు గట్టిపోటీ ఇస్తున్నారు. ఇద్దరిలో ఎవరిని సీఎం పదవి వరించనుందనే అనే విషయంపై చర్చ సాగుతోంది. ఇక పీసీసీ పదవిని దక్కించుకునేందుకు మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. డొక్కా తాడికొండ నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి కేబినెట్లో మంత్రిగా చేరారు. ప్రస్తుతం సీమాంధ్రలో ఎస్సీ వర్గానికి పెద్ద పీట వేయాలని అధిష్టానం భావించడం డొక్కాకు కలిసి వచ్చే అంశంగా మారింది. తన రాజకీయ గురువు ఎంపీ రాయపాటి సాంబశివరావు పార్టీకి వ్యతిరేకంగా గళం విప్పినా డొక్కా మాత్రం పార్టీకి విధేయత చూపారు. దీంతో పాటు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని తీవ్రస్థాయిలో వ్యతిరేకించి అధిష్టానం దృష్టిలో పడ్డారు. మంగళవారం ఢిల్లీలో దిగ్విజయ్‌సింగ్‌ను కలిసి పార్టీ మెరుగుపడేందుకు తీసుకోవాల్సిన చర్యలపై నివేదిక ఇచ్చినట్లు ఇక్కడప్రచారం జరుగుతుంది. అలాగే తెలంగాణ లో మందా కృష్ణమాదిగ వారి సామాజిక వర్గం ఓట్లను చీల్చేందుకు ప్రయత్నం చేస్తున్నారన్న అనుమానంతో అదే సామాజిక వర్గానికి చెందిన డొక్కాను సీమాంధ్రకు పీసీసీ అధ్యక్షునిగా నియమిస్తే ఎలా ఉంటుందని అధిష్టానం ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఇదిలావుంటే, కన్నాకు ముఖ్యమంత్రి పదవి లభిస్తే డొక్కాకు ఏ పదవి దక్కదని, చిరంజీవికి సీఎం పదవి వస్తే అదే సామాజిక వర్గానికి చెందిన కన్నాకు పీసీసీ అధ్యక్ష పదవి లభించే అవకాశాల ఉండవని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. -
కిరణ్ వెంట ఒక్క ఎమ్మెల్యే అయినా వస్తాడా ?
హైదరాబాద్: కిరణ్ కుమార్ రెడ్డి కొత్త పార్టీ పెడతారని తాను చెప్పలేదని, ప్రెస్ మీట్ మాత్రమే పెడతారనే చెప్పానని మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ వివరణ ఇచ్చారు. సీఎం కిరణ్ ఆదివారం తన సన్నిహితులతో సమావేశం కానున్నరని, ఆ సమావేశంలో కూడా కొత్త పార్టీ పెట్టే విషయంపై ఏమీ తేలదని ఆయన అన్నారు. వారం తర్వాత విస్తృత సమావేశమంటూ కిరణ్ దాటవేశరన్నారు. సీఎం సొంత జిల్లా చిత్తూరు నుంచి ఒక ఎమ్మెల్యే అయినా తనతో వస్తారమోనని కిరణ్ ఎదురుచూస్తున్నారని డొక్క చెప్పారు. రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ హైకమాండ్ వైఖరికి నిరసనగా సీఎం పదవికి రాజీనామా చేసిన కిరణ్ కుమార్ రెడ్డి కొత్త పార్టీ పెడతారనే వార్తలు జోరుగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే కాంగ్రెస్ వాది అయిన రాయపాటి సాంబశివరావు కిరణ్‌ను నమ్మి కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరణకు గురైయ్యారని డొక్క తెలిపారు. రాయపాటిని తిరిగి పార్టీలో చేర్చుకోవాలని తాను హైకమాండ్‌ను కోరుతున్నట్టు ఆయన చెప్పారు. కాగా, కాంగ్రెస్ నుంచి బహిష్కరనులంతా తమ పరిస్థితి ఏమిటని అంటున్నారని డొక్క మాణిక్య వరప్రసాద్ తెలిపారు. -
'నా ఛాయిస్.... జేడీ, కొండ్రు పనబాక'
హైదరాబాద్: సీఎం సీటును కిరణ్ కుమార్ రెడ్డి ఖాళీ చేయటంతో రాష్ట్రంలో ఇప్పుడు ముఖ్యమంత్రి పదవిని ఎవరు చేపడతారనే దానిపై జోరుగా చర్చలు కొనసాగుతున్నాయి. ఆపద్దర్మ ముఖ్యమంత్రిగా కిరణ్ కొనసాగనని చెప్పటంతో ఆశావాహులు సీఎం సీటుపై కన్నేశారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత డొక్కా మాణిక్య వరప్రసాద్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ అధిష్టానం ఎవరిని ముఖ్యమంత్రిగా నియమించినా మద్దతు ఇస్తానని ఆయన తెలిపారు. అయితే కొత్త ముఖ్యమంత్రిగా తన ఛాయిస్ ఎస్సీ వర్గానికి చెందిన జేడీ శీలం, కొండ్రు మురళి, పనబాక లక్ష్మి అని అన్నారు. ఒకవేళ అధిష్టానం బొత్స సత్యనారాయణను సీఎంను చేసినా మద్దతు తెలుపుతానని చెప్పారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన వారికి ముఖ్యమంత్రి పదవి అప్పగించినా అభ్యంతరం లేదన్నారు. మరోవైపు రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించవద్దని... తమకు ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలంటూ బొత్స సత్యనారాయణ ఆధ్వర్యంలో కన్నా లక్ష్మీ నారాయణ, ఆనం రాంనారాయణ రెడ్డి, రఘువీరారెడ్డి గురువారం గవర్నర్‌ను కలిసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కొత్త ముఖ్యమంత్రిగా ఎవరు వస్తారనేది సర్వత్రా ఆసక్తి నెలకొంది. -
విభజనకు కిరణే కారణం: మంత్రి డొక్కా
సీఎం తెరవెనుక ఒప్పందాల వల్లే రాష్ట్రం చీలిక : మంత్రి డొక్కా సోనియా ఏడాది కిందటే తెలంగాణకు ప్యాకేజీ ఇస్తామన్నారు సీఎం పదవిని కోల్పోవాల్సి వస్తుందని కిరణ్ అడ్డుపడ్డారు విభజనకు సహకరిస్తూ సీమాంధ్ర ప్రజలను మోసగించారు ఢిల్లీ పెద్దలతో మాట్లాడుకుని రెండు ప్లాన్లు సిద్ధం చేసుకున్నారు ఏం చేసినా.. కిరణ్ మళ్లీ కాంగ్రెస్ టోపీయే పెట్టుకుని వస్తారు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రం రెండుగా చీలిపోవడానికి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డే ప్రధాన కారణమని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ ధ్వజమెత్తారు. ఢిల్లీలోని కొందరు పెద్దలతో ఆయన తెరవెనుక ఒప్పందాలు చేసుకొని తెలంగాణ బిల్లుకు చివరి వరకు తన సహకారాన్ని అందించారంటూ నిప్పులు చెరిగారు. సీఎం కిరణ్ పైకి సమైక్యవాదం వినిపిస్తూ లోలోపల విభజనకు తోడ్పాటునందించి సీమాంధ్ర ప్రజలను దారుణంగా మోసపుచ్చారని డొక్కా మండిపడ్డారు. ఆయన మంగళవారం సీఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ కిరణ్ తీరును ఎండగట్టారు. లోక్‌సభలో విభజన బిల్లు ప్రవేశపెడితే రాజీనామా అన్న సీఎం.. ఇంకా నేడు, రేపు అంటూ నాన్చడం చిత్రంగా ఉందన్నారు. ‘‘కిరణ్ ఇటీవలి కాలంలో లగేజీలు సర్దుకోవడంపైనే దృష్టి పెట్టారు. ఇంకా కొంత లగేజీ మిగిలిపోయిందట. కొన్ని బ్యాగులు, పుస్తకాలు సర్దుకోవలసిన అవసరముంది. అవన్నీ సర్దుకున్నాకైనా ఆయన రాజీనామా చేస్తారో లేదో చూడాలి’’ అని డొక్కా వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. రాష్ట్ర విభజనలో సీఎం కిరణ్ పాత్ర గురించి డొక్కా చేసిన విమర్శలు ఆయన మాటల్లోనే... తెలంగాణ విషయంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఏడాది కిందటే ఒక నిర్ణయానికి వచ్చి రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచుతామని, తెలంగాణకు ప్రత్యేక ప్యాకేజీని ప్రకటిస్తామని సీఎం కిరణ్‌కు చెప్పారు. కానీ.. తెలంగాణకు ప్యాకేజీ ప్రకటిస్తే అందులో భాగంగా తాను సీఎం పదవిని కూడా కోల్పోవలసి వస్తుందని భావించి సీఎం అధిష్టానం సూచనలకు కుంటిసాకులు చెప్తూ అడ్డుపడ్డారు. అనంతర పరిణామాల్లో రాష్ట్ర విభజనకు అనుకూలంగా కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది. ఏఐసీసీలో కీలకపాత్ర పోషిస్తున్న పలువురు పెద్దలతో చేసుకున్న ఒప్పందంలో భాగంగానే కిరణ్‌కుమార్‌రెడ్డి సీమాంధ్ర ప్రజలను మోసగించి నిండా ముంచారు. ఢిల్లీ పెద్దలతో చేసుకున్న ఒప్పందాల ప్రకారం కిరణ్ రెండు ప్లాన్లు రూపొందించుకున్నారు. రాష్ట్ర విభజనకు సహకరిస్తూనే పైకి సమైక్యవాదాన్ని వినిపించడం. సమైక్య ఉద్యమాన్ని మెల్లగా నీరుగార్చటం. చివర్లో అసెంబ్లీలో విభజన బిల్లు ప్రక్రియను పూర్తిచేసి పంపడం. ఆపై పార్లమెంటులో బిల్లు ఆమోదం పొందేవరకు వేచి చూసి రాజీనామా చేయడం. కొత్త పార్టీ పెట్టి ఆరేడు నెలలు హడావుడి చేసి ఆ తరువాత దాన్ని మూసేసి మళ్లీ కాంగ్రెస్‌లో చేరి పార్టీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టడం. ఇది మొదటి ప్లాన్‌లో భాగం. రెండో ప్లాన్‌లో భాగంగా.. బిల్లు ఆమోదం పొందాక రాజకీయంగా వైరాగ్యాన్ని ప్రకటించడం. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని చెప్పి కొన్ని రోజులు బెంగళూరులో, ఆపై అమెరికాలో గడిపి రెండేళ్ల తరువాత మెల్లగా ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా కొత్త అవతారం ఎత్తడం. కిరణ్ సమైక్యవాది అనడం శుద్ధ తప్పు. దాన్ని ఎవరూ నమ్మడం లేదు. ఆయన తెరవెనుక విధానాల వల్ల సమైక్యాంధ్రను కోల్పోయాం. సీడబ్ల్యూసీ నిర్ణయం ప్రకటించిన నాడైనా ఆయన రాజీనామా చేసి ఉంటే రాష్ట్రంలో రాజకీయం సంక్షోభం ఏర్పడి 2014 ఎన్నికల వరకు తెలంగాణ అంశం వాయిదా పడేది. కిరణ్ మాయలో పడి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ప్రభుత్వాన్ని చివరివరకు రక్షించుకుంటూ వచ్చి నిండా మునిగారు. సీమాంధ్ర మంత్రులు కూడా సీఎం మాయలో పడి ముందు ఆయన వెనుకే వెళ్లినా.. ఇప్పుడు ఏంచేయాలో పాలుపోని స్థితిలో పడ్డారని తెలిపారు. -
కాంగ్రెస్ పార్టీకి 'గంటా' గుడ్ బై
-
కిరణ్‌కు అత్యంత సన్నిహితుడ్ని
-
కిరణ్‌కు అత్యంత సన్నిహితుడ్ని
సీఎం కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ వాది అని రాష్ట్ర మంత్రి డొక్క మాణిక్య వర ప్రసాద్ స్పష్టం చేశారు. సోమవారం ఆయన హైదరాబాద్‌లో మాట్లాడారు. రాజ్యసభ ఎన్నికలు, నామినేటేడ్ ఎమ్మెల్సీల అంశంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆదేశాలను కిరణ్ తూచా తప్పకుండా పాటించారని చెప్పారు. సీఎం కిరణ్‌కు తాను అత్యంత సన్నిహితుడినని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. కిరణ్ ఎట్టి పరిస్థితులలో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయరని తెలిపారు. రాష్ట్రంలో కొత్త పార్టీ ఏర్పాటుకు అనుకూల వాతావరణం లేదన్నారు. పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ నివాసంలో ఈ రోజు సాయంత్రం జరగనున్న భేటీకి రావాలని తనకు ఆహ్వనం అందిందని డొక్క మాణిక్యవర ప్రసాద్ వెల్లడించారు. అయితే ఆ భేటీకి హజరవుతున్నట్లు డొక్క మాణిక్య వర ప్రసాద్ చెప్పారు. -
ప్రెస్‌మీట్ పెట్టినంత సులువు కాదు
సీఎం కొత్త పార్టీపై మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ వ్యాఖ్య సాక్షి, హైదరాబాద్: రాజకీయ పార్టీ పెట్టడమంటే ప్రెస్‌మీట్ పెట్టినంత సులభం కాదని రాష్ట్ర మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కొత్త పార్టీ పెట్టనున్నారంటూ జరుగుతున్న ప్రచారంపై మంత్రి తనదైన శైలిలో స్పందించారు. శనివారం సీఎల్పీ కార్యాలయం వద్ద ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర సమైక్యతంటూ సీఎం తరచూ ప్రెస్మీట్లు పెడుతున్నారని, కొత్త పార్టీ ఏర్పాటు దిశగా ఆయన ఏ విధంగా భావిస్తున్నారో కానీ అది అంత సులభం కాదనేది తన అభిప్రాయమన్నారు. సీఎం కిరణ్, తాను నియోజకవర్గానికంటే ఎక్కువ స్థాయి నేతలమని చెప్పారు. అలాంటి స్థాయి నుంచి తాను మంత్రి, కిరణ్ ముఖ్యమంత్రి కాగలిగామంటే అందుకు సోనియానే కారణమని చెప్పారు. ఆమె ఇచ్చిన అవకాశాల వల్లే తాము ఈ స్థాయికి ఎదిగామన్నారు. సీఎం రెండు చేతులతో ఎడాపెడా సంతకాలు చేస్తున్నా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలేవీ ముందుకు సాగడం లేదని చెప్పారు. విభజన విషయంలో కేంద్రం ఏకపక్షంగా వ్యవహరించడం సరికాదని డొక్కా పేర్కొన్నారు. ఏడు కోట్ల సీమాంధ్రుల ఆకాంక్షలను ఎంపీలు వ్యక్తపరుస్తుంటే పట్టించుకోకుండా కేంద్రం ముందుకెళ్లడాన్ని ఆయన తప్పుపట్టారు. -
సీఎం రాజీనామా అవసరం లేదు: డొక్కా
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి రాజీనామా చేయాల్సిన అవసరం లేదని మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ పేర్కొన్నారు. సీఎం పదవి నుంచి కిరణ్‌ను తప్పించడానికి అసమ్మతి నేతలు ఎన్ని ప్రయత్నాలు చేసినా పార్టీ అధినేత్రి సోనియా గాంధీ వాటిని ఆమోదించలేదన్నారు. ఆదివారం సీఎల్పీ కార్యాలయం వద్ద మంత్రి మీడియాతో మాట్లాడారు. సీఎం నిజమైన కాంగ్రెస్‌వాది అని, ఆయన కొత్త పార్టీ పెడతారని అనుకోవట్లేదని చెప్పారు. కాగా, ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధుల్లో దాదాపు సగానికిపైగా ఖర్చు చేయలేదని, ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న తరుణంలో ఈ మిగిలిపోయిన నిధులను వచ్చే ఏడాదికి కొనసాగించాలని కోరారు. ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో మౌలిక సదుపాయాలను కల్పించాల్సిన అవసరముందన్నారు. వచ్చే ఏడాది బడ్జెట్లో ఎస్సీ, ఎస్టీలకు కేటాయింపులు పెంచాలని, వాటిని సకాలంలో ఖర్చు చేయాలని కోరారు. -
‘తెలుగునాడు’గా సీమాంధ్ర: డొక్కా
అసెంబ్లీ సీట్లను 175నుంచి 225కు పెంచాలి సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన అనంతరం అవశేష ఆంధ్రప్రదేశ్ పేరును ‘తెలుగు నాడు’గా మార్చాలని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ కోరారు. సీమాంధ్ర పరిధిలోని 175 అసెంబ్లీ స్థానాలను 225కు, తెలంగాణలోని 119 సీట్లను 153కు పెంచాలని కూడా కోరారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లులో ఈ మేరకు మార్పులు కోరుతూ మంత్రి మాణిక్యవర ప్రసాద్ శుక్రవారం శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్‌కు సవరణలను ప్రతిపాదించారు. రాయలసీమలోని అనంతపురం, కర్నూలు జిల్లాలను తెలంగాణలో కలిపేసి, ‘రాయల తెలంగాణ’ను ఏర్పాటు చేయాలని, భద్రాచలం డివిజన్‌ను సీమాంధ్రలో కలపాలని సూచించారు. తాను సూచించిన సవరణలను సభ పరిగణనలోకి తీసుకోని పక్షంలో విభజన బిల్లును వ్యతిరేకిస్తానని పేర్కొన్నారు. -
తెలంగాణ బిల్లుపై చర్చ జరగాల్సిందే: మంత్రి డొక్కా
హైదరాబాద్: విభజన బిల్లు అసెంబ్లీకి వచ్చిన నేపథ్యంలో.. తెలంగాణ ముసాయిదా బిల్లుపై చర్చ జరగాల్సిందేనంటూ మంత్రి డొక్కా మాణిక్కవరప్రసాద్ డిమాండ్ చేశారు. ఈ తెలంగాణ బిల్లులో అనేక లోపాలున్నాయని ఆయన అన్నారు. సభలో మాట్లాడే అవకాశం వస్తే తెలంగాణ బిల్లులోని లోపాలను తెలపుతానని డొక్కా స్పష్టం చేశారు. విభజనతో సంబంధం లేకుండా.. 2011 జనాభా ప్రకారం ఎస్సీ, ఎస్టీలకు కేటాయించే నియోజకవర్గాలు పెంచాలని డొక్కా మాణిక్యవరప్రసాద్ డిమాండ్ చేశారు. -
మంత్రి డొక్కా కారు అడ్డగింత
మార్టూరు, న్యూస్‌లైన్ : రోడ్డు విస్తరణలో భాగంగా స్థానిక జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న 325 షాపులను తొలగించాలని అధికారులు నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ మేరకు మార్టూరు గ్రామచావిడిలో భవనాలకు సంబంధించిన యజమానులకు గురువారం నోటీసులు కూడా అందించారు. సెంటుకు రూ. 50 వేలు చెల్లించనున్నట్లు తెలుసుకున్న భవన యజమానులు మార్కెట్ విలువ ప్రకారం రూ. సెంటు 30 లక్షల వరకు ఉందని, ప్రభుత్వం రూ. 50 వేలు చెల్లించటాన్ని నిరసిస్తూ జాతీయ రహదారిపై శుక్రవారం ధర్నా చేపట్టారు. గుంటూరు నుంచి ఒంగోలు వైపు అదే మార్గంలో మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ వెళ్తున్నారని సమాచారం అందుకున్న షాపుల యజమానులు అప్రమత్తమయ్యారు. మార్టూరు సమీపంలోకి రాగానే డొక్కా కారును అడ్డగించి తమకు న్యాయం చేయాలని కారును చుట్టుముట్టారు. కారు నుంచి దిగిన మంత్రి.. పరిహారం పెంచేందుకు ప్రయత్నిస్తానని హామీ ఇవ్వడంతో షాపుల యజమానులు ధర్నాను విరమించారు. కార్యక్రమంలో మార్టూరు మాజీ సర్పంచ్ బొప్పూడి శ్రీనివాసరావు, హనుమంతరావు, షాపుల యజమానులు పాల్గొన్నారు. -
విభజనపై హైకమాండ్ నిర్ణయానికి కట్టుబడి ఉంటా: డొక్కా
రాష్ట్ర విభజన అంశంపై హైకమాండ్ తీసుకున్న నిర్ణయానికే కట్టుబడి ఉంటా అని మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ అన్నారు. చిన్నజిల్లాలు ఉండాలనే అభిప్రాయాన్ని కేంద్ర మంత్రుల బృందానికి వివరిస్తానని మంత్రి డొక్కా తెలిపారు. చిన్న రాష్ట్రాల వల్ల ప్రయోజనంలేదని ఎవరన్నారని డొక్కా ప్రశ్నించారు. సమ్మెవల్ల సామాన్య జనానికి ఇబ్బంది కలుగుతోంది అని, పరిస్థితిని గ్రహించి ఉద్యోగులు సమ్మె విరమించాలని డొక్కా సూచించారు. రాష్ట్ర విభజనపై ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు స్పష్టమైన వైఖరిని చెప్పడం లేదని.. ఆయన సమైక్యవాదా లేక విభజన వాదా అని చెప్పాలని మంత్రి డొక్కా డిమాండ్ చేశారు. చంద్రబాబును రాయపాటి కలవడంలో ఎలాంటి రాజకీయ ప్రాధాన్యతలేదు అని అన్నారు. తాను, రాయపాటి సాంబశివరావు కాంగ్రెస్‌లోనే కొనసాగుతామని డొక్కా ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. -
సీఎం చుట్టూ భజన బృందం
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిపై రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ మండిపడ్డారు. పార్టీ అధిష్టానవర్గం నిర్ణయాన్ని ధిక్కరిస్తూ ముఖ్యమంత్రి మీడియాతో మాట్లాడడాన్ని తప్పుపట్టారు. ‘ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి చుట్టూ భజన బృందం చేరింది. పొగడ్తలకు ఆయన పడిపోతున్నారు. పొగిడే వారికే ప్రాధాన్యత ఇస్తున్నారు. నాకు పొగడడం రాదు. నేను చెప్పే విషయాలను ముఖ్యమంత్రి గౌరవించరు. ముఖ్యమంత్రిగా ఆయన తీసుకున్న చాలా నిర్ణయాలు నాకు నచ్చవు. అనేక నిర్ణయాలపై విభేదించాలని ఉన్నా..ఆ నిర్ణయాలను విమర్శించకుండా గౌరవిస్తున్నాను. రాష్ట్రవిభజన పై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) నిర్ణయాన్ని పార్టీ నాయకులు గౌరవించాల్సిందే. మనకు నచ్చకపోయినా సరే, పార్టీ శ్రేయస్సు కోసం కట్టుబడి ఉండాల్సిందే. ముఖ్యమంత్రి నిర్ణయాలను వ్యతిరేకిస్తున్నారని శంకర్రావును, డీఎల్ రవీంద్రారెడ్డిని కిరణ్‌కుమార్‌రెడ్డి తప్పించలేదా..? నేను ముఖ్యమంత్రి నిర్ణయాలను వ్యతిరేకిస్తే నన్ను తొలగించరా..?’ అని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ ప్రశ్నించారు. సీడబ్ల్యూసీ నిర్ణయాన్ని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తప్పుపట్టడాన్ని ప్రస్తావిస్తూ,.. మంత్రులను తప్పించినట్లు ముఖ్యమంత్రిని కూడా తప్పించాలని మాణిక్యవరప్రసాద్ పరోక్షంగా కోరారు. ఆయన బుధవారం సచివాలయంలోని తన చాంబర్లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘పార్టీ నాకు మంత్రి హోదా కల్పించింది. ఈ హోదా లేకుంటే మీరెవరూ వచ్చేవారు కాదు. అలాంటప్పుడు పార్టీ నిర్ణయాన్ని అంగీకరించాలి’ అన్నారు. విభజనపై సీమాంధ్ర ప్రజల వునోభావాలను చెప్పే సమయంలో పార్టీ అధిష్టానం గురించి ముఖ్యమంత్రి ప్రస్తావించకుంటే బావుండేదన్నారు. చంద్రబాబుకు పట్టిన గతే... ‘ముఖ్యమంత్రి చుట్టూ చేరిన వారు సర్వేలు, రేటింగ్‌లు అంటూ ఆయనను తప్పుదోవపట్టిస్తున్నారు. సర్వేలను, రేటింగ్లను నమ్ముకున్న చంద్రబాబుకు గతంలో ఏ గతి పట్టిందో కిరణ్‌కుమార్‌రెడ్డికి అదే గతిపడుతుంది. రాష్ట్రాన్ని విభజిస్తే జలయుద్ధాలు వస్తాయని ముఖ్యమంత్రి చెబుతారు. అదే సమయంలో,.. ముఖ్యమంత్రికి ప్రీతిపాత్రుడైన భారీ నీటిపారుదల శాఖ మంత్రి మాత్రం, జల యుద్దాలు రానేరావంటారు. ఇలా ఒకే మంత్రివర్గం నుంచి భిన్న వాదనలు రావడం మంచిది కాదు. వ్యవస్థను గౌరవించాలి. విభజనకు సంబంధించి సీమాంధ్రకు న్యాయం చేయాలని మేమంతా కోరుతున్నాం. విభజన నిర్ణయాన్ని పునస్సమీక్షించాలని కోరాం. దీనిపై ఆంటోనీ కమిటీ నివేదిక రావాలి. అది వచ్చిన తరువాత ఏమి చేయాలో నిర్ణయిస్తాం. కాగా సోమవారం పలువురు మంత్రులం కలిసి, సేవ్ ఏపీ.. సేవ్ కాంగ్రెస్ నినాదంతో ముందుకెళ్తాం’ అని మంత్రి చెప్పారు. సమైక్యాంధ్రను గట్టిగా కోరేవారు కొద్దిమందే... సమైక్యాంధ్ర కావాలని గట్టిగా కోరుతున్న వారు గాదె వెంకటరెడ్డి, కేవీపీ రామచంద్రరావు, ైశె లజానాథ్ ఇలా నలుగురైదుగురు మాత్రమే ఉన్నారని, మిగిలిన వారు సందిగ్ధంలో ఉన్నారని మంత్రి అన్నారు. రాష్ట్రం 1972లోనే విడిపోయి ఉంటే బావుండేదనిపిస్తోందని, ఇంతకాలం తరువాత విడిపోవడమంటే బాధగా ఉంటుందని అన్నారు. ప్రస్తుత పరిస్థితులను చక్కదిద్దాలంటే ఎన్టీఆర్ లేదా రాజశేఖరరెడ్డి రావాల్సిందేనని మంత్రి అభిప్రాయపడ్డారు. పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా పూర్తి విధేయంగా ఉంటానని ఒక ప్రశ్నకు సమాధానంగా మంత్రి చెప్పారు. రాజకీయ పార్టీలన్నీ తమ అభిప్రాయాలు చెప్పిన తరువాతే, తెలంగాణకు అనుకూలంగా కాంగ్రెస్ నిర్ణయం తీసుకుందన్నారు. సీడబ్ల్యూసీ నిర్ణయానికి ముందుగా, ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు, డిప్యూటీ సీఎంలతో కూడా పార్టీ పెద్దలు మాట్లాడిన విషయాన్ని గుర్తు చేశారు. టీడీపీ లేఖ ఇవ్వడమేకాక.. అసెంబ్లీలో తీర్మానాన్ని బలపరుస్తావుని కూడా ప్రకటించిందన్నారు. -
'సీఎం పొగడ్తలకు అలవాటు పడ్డారు' : వర ప్రసాద్
-
'సీఎం పొగడ్తలకు అలవాటు పడ్డారు' : వర ప్రసాద్
హైదరాబాద్ : తన వ్యవహార శైలితో సహచర మంత్రులకు ఇప్పటికే దూరం అయిన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డిపై తాజాగా మరో మంత్రి విరుచుకు పడ్డారు. సీఎం కిరణ్ పొడగ్తలకు అలవాటు పడ్డారని మంత్రి డొక్కా మణిక్య వర ప్రసాద్ వ్యాఖ్యానించారు. కిరణ్ పక్కన భజన బృందం చేరిందని.... అందుకే ముక్కుసూటిగా ప్రశ్నించే తనను ఆయన లెక్క చేయటం లేదని మాణిక్య వర ప్రసాద్ అన్నారు. విభజన విషయంలో ఇష్టం లేకపోయినా అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉండాటని ఆయన అభిప్రాయపడ్డారు. సీఎం వ్యాఖ్యలను తనకు ఆందోళన కలిగించాయని వర ప్రసాద్ అన్నారు. అధిష్టానం నిర్ణయాన్ని బహిరంగంగా వ్యతిరేకించటం తప్పని, తనకు ఇష్టం లేకపోయినా కేబినెట్ నిర్ణయాలను సమర్థించినట్లు తెలిపారు. సర్వేలను నమ్ముకుంటే చంద్రబాబు లాగా కొంప మునగటం ఖాయమన్నారు. తన నిర్ణయాలను వినటం లేదనే డీఎల్ రవీంద్రారెడ్డి, శంకర్రావులను సీఎం బయటకు పంపించారని మణిక్య వర ప్రసాద్ ఆరోపించారు.