‘ఫాస్ట్’ ప్రాంతీయ దురహంకార జీవో | In the High Court, the former minister Dokka pill | Sakshi
Sakshi News home page

‘ఫాస్ట్’ ప్రాంతీయ దురహంకార జీవో

Aug 8 2014 1:46 AM | Updated on Aug 31 2018 8:26 PM

‘ఫాస్ట్’ ప్రాంతీయ దురహంకార జీవో - Sakshi

‘ఫాస్ట్’ ప్రాంతీయ దురహంకార జీవో

తెలంగాణలో 1956 నవంబర్ 1 నాటికి స్థిరపడిన కుటుంబాల విద్యార్థులకే ఆర్థిక సాయం అందచేసే నిమిత్తం తెలంగాణ విద్యార్థులకు ఆర్థిక సాయం (ఫాస్ట్) పేరుతో ప్రభుత్వం జారీ చేసిన జీవో 36ను సవాలు చేస్తూ హైకోర్టులో

హైకోర్టులో మాజీ మంత్రి డొక్కా పిల్
 
హైదరాబాద్: తెలంగాణలో 1956 నవంబర్ 1 నాటికి స్థిరపడిన కుటుంబాల విద్యార్థులకే ఆర్థిక సాయం అందచేసే నిమిత్తం తెలంగాణ విద్యార్థులకు ఆర్థిక సాయం (ఫాస్ట్) పేరుతో ప్రభుత్వం జారీ చేసిన జీవో 36ను సవాలు చేస్తూ హైకోర్టులో మరో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. మాజీ మంత్రి డొక్కా మాణిక్య వర ప్రసాద్ ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు.

రాష్ట్రపతి ఉత్తర్వులకు విరుద్ధంగా ఉన్న ఈ జీవోను కొట్టివేసి, ప్రవేశాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్ విషయంలో గత విధానాన్నే అమలు చేసేలా ఆదేశాలు జారీ చేయాలని కోర్టును అభ్యర్థించారు. ప్రాంతీయ దురహంకారంతో ఉన్న ఈ ఫాస్ట్ జీవో సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని తెలిపారు. ఈ వ్యాజ్యాన్ని సోమవారం ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం విచారించే అవకాశం ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement