
సీఎం రాజీనామా అవసరం లేదు: డొక్కా
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి రాజీనామా చేయాల్సిన అవసరం లేదని మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ పేర్కొన్నారు. సీఎం పదవి నుంచి కిరణ్‌ను తప్పించడానికి అసమ్మతి నేతలు ఎన్ని ప్రయత్నాలు చేసినా పార్టీ అధినేత్రి సోనియా గాంధీ వాటిని ఆమోదించలేదన్నారు. ఆదివారం సీఎల్పీ కార్యాలయం వద్ద మంత్రి మీడియాతో మాట్లాడారు. సీఎం నిజమైన కాంగ్రెస్‌వాది అని, ఆయన కొత్త పార్టీ పెడతారని అనుకోవట్లేదని చెప్పారు. కాగా, ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధుల్లో దాదాపు సగానికిపైగా ఖర్చు చేయలేదని, ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న తరుణంలో ఈ మిగిలిపోయిన నిధులను వచ్చే ఏడాదికి కొనసాగించాలని కోరారు. ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో మౌలిక సదుపాయాలను కల్పించాల్సిన అవసరముందన్నారు. వచ్చే ఏడాది బడ్జెట్లో ఎస్సీ, ఎస్టీలకు కేటాయింపులు పెంచాలని, వాటిని సకాలంలో ఖర్చు చేయాలని కోరారు.