సీఎం దత్తత గ్రామం ఎర్రవల్లి లో డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణాన్ని స్విట్జర్లాండ్‌కు చెందిన ఇంజినీర్ అండ్రెక్స్ పరిశీలించార.
నగరంలోని బేగంపేట ఫ్లైఓవర్‌పై బుధవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ట్యాంకర్ ఢీకొని ఓ వ్యక్తి మృతిచెందాడు. స్థానికంగా నివాసముంటున్న కిరణ్‌కుమార్(35) ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈక్రమంలో ఈరోజు కార్యాలయానికి వెళ్తుండగా.. వేగంగా వెళ్తున్న ట్యాంకర్ ఢీకొట్టింది. దీంతో వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.