
డొక్కా మాణిక్య వరప్రసాద్
మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పెద్ద అవినీతిపరుడని మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ ఆరోపించారు.
హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పెద్ద అవినీతిపరుడని మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ ఆరోపించారు. సీఎంగా సంపాదించిన నల్లధనాన్ని మార్చుకునేందుకే ఆయన బీజేపీ వైపు చూస్తున్నారన్నారు.
విభజనను వ్యతిరేకించిన కిరణ్ విభజనకు సహకరించిన బీజేపీలో ఎలా చేరతారని ఆయన ప్రశ్నించారు. టీడీపీ, బీజీపీ మధ్య సంబంధాలు చెడగొట్టడమే కిరణ్ ఎజెండా అని మాణిక్యవరప్రసాద్ విమర్శించారు.