కిరణ్ వెంట ఒక్క ఎమ్మెల్యే అయినా వస్తాడా ?
హైదరాబాద్: కిరణ్ కుమార్ రెడ్డి కొత్త పార్టీ పెడతారని తాను చెప్పలేదని, ప్రెస్ మీట్ మాత్రమే పెడతారనే చెప్పానని మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ వివరణ ఇచ్చారు. సీఎం కిరణ్ ఆదివారం తన సన్నిహితులతో సమావేశం కానున్నరని, ఆ సమావేశంలో కూడా కొత్త పార్టీ పెట్టే విషయంపై ఏమీ తేలదని ఆయన అన్నారు. వారం తర్వాత విస్తృత సమావేశమంటూ కిరణ్ దాటవేశరన్నారు. సీఎం సొంత జిల్లా చిత్తూరు నుంచి ఒక ఎమ్మెల్యే అయినా తనతో వస్తారమోనని కిరణ్ ఎదురుచూస్తున్నారని డొక్క చెప్పారు. రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ హైకమాండ్ వైఖరికి నిరసనగా సీఎం పదవికి రాజీనామా చేసిన కిరణ్ కుమార్ రెడ్డి కొత్త పార్టీ పెడతారనే వార్తలు జోరుగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే.
అయితే కాంగ్రెస్ వాది అయిన రాయపాటి సాంబశివరావు కిరణ్ను నమ్మి కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరణకు గురైయ్యారని డొక్క తెలిపారు. రాయపాటిని తిరిగి పార్టీలో చేర్చుకోవాలని తాను హైకమాండ్ను కోరుతున్నట్టు ఆయన చెప్పారు. కాగా, కాంగ్రెస్ నుంచి బహిష్కరనులంతా తమ పరిస్థితి ఏమిటని అంటున్నారని డొక్క మాణిక్య వరప్రసాద్ తెలిపారు.