rayapati samba siva rao
-
టీడీపీ నేత రాయపాటి సాంబశివరావు ఇంట్లో ఈడీ సోదాలు
సాక్క్షి, గుంటూరు: టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు నివాసంలో కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ దాడులు చేపట్టింది. మంగళవారం ఉదయం నుంచే ప్రత్యేక బృందాల ఆధ్వర్యంలో సోదాలు జరుపుతోంది. ట్రాన్స్‌స్టాయ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ.. బ్యాంకు రుణాల ఎగవేత అంశంపై గతంలో మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది. కేసు విచారణలో భాగంగానే రాయపాటి నివాసంలో తనిఖీలు చేపట్టారు అధికారులు. హైదరాబాద్, గుంటూరు సహా తొమ్మిది చోట్ల సోదాలు నిర్వహించామని, రాయపాటి, ఇతర ప్రమోటర్ల కార్యాలయాలు, నివాసాల్లో సోదాలు జరిగాయని ఈడీ వర్గాలు పేర్కొన్నాయి. మరోవైపు హైదరాబాద్ నగరంలో మరోసారి ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. జూబ్లీహిల్స్, మణికొండ, పంజాగుట్టలో మంగళవారం(ఆగస్టు1) ఉదయం నుంచే దాడులు జరుపుతోంది. మాలినేని సాంబశివరావుతో పాటు పలువురి ఇళ్లు, కార్యాలయాల్లో ఈడీ అధికారులు తనిఖీలు చేపట్టారు. మొత్తం 15 బృందాలతో ఏకకాలంలో సోదాలు చేస్తున్నారు. చదవండి: నార్కో టెస్ట్‌కు నేను రెడీ : పొంగూరు ప్రియ -
టీడీపీలో కన్నా చేరికపై రాయపాటి సాంబశివరావు సంచలన వ్యాఖ్యలు
-
రాయపాటికి రూట్ క్లియర్!
-
ఓడిపోయే పార్టీ టిక్కెట్లు మనకెందుకు?
సాక్షి, గుంటూరు: ఐదేళ్ల టీడీపీ పాలనలో కొనసాగించిన అవినీతి, అరాచకాల నేపథ్యంలో తమ పార్టీ గెలుపు కష్టమని తెలుగుదేశం నేతలు, కార్యకర్తలు ఆంతరంగిక సమావేశాల్లో అంగీకరిస్తున్నారు. గుంటూరు జిల్లా నరసరావుపేట పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో సాక్షాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు వచ్చి పోటీ చేసినా నెగ్గలేరని అంటున్నారు. నరసరావుపేట ఎంపీ టిక్కెట్‌ను రాయపాటి సాంబశివరావుకు, సత్తెనపల్లి ఎమ్మెల్యే టిక్కెట్‌ను రాయపాటి రంగారావుకు కేటాయించే విషయంలో చంద్రబాబు ఇంకా స్పష్టత ఇవ్వలేదు. దీంతో రాయపాటి వర్గీయులు గురువారం గుంటూరులో సాంబశివరావు నివాసంలో ఆందోళనకు దిగారు. నరసరావుపేట ఎంపీ సీటుకు భాష్యం రామకృష్ణ పేరు తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలో టీడీపీని వీడే అంశంపై నిర్ణయం తీసుకునేందుకు రాయపాటి సాంబశివరావు గురువారం తన వర్గీయులతో భేటీ అయ్యారు. ఈ విషయం తెలుసుకున్న టీడీపీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్, ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు రాయపాటి నివాసానికి చేరుకుని ఆయనను బుజ్జగించేందుకు ప్రయత్నించారు. గుంటూరు జిల్లాలో ఎక్కడా టీడీపీ గెలిచే పరిస్థితి లేదని, ఓడిపోయే పార్టీ టిక్కెట్లు తమకు అవసరం లేదని డొక్కా, జీవీకి రాయపాటి అనుచరులు తేల్చిచెప్పారు. రూ.వంద కోట్లు ఖర్చు పెట్టినా టీడీపీ గెలవదు ‘‘సత్తెనపల్లి టిక్కెట్ కోడెలకు ఇస్తామంటున్నారు. అక్కడి కార్యకర్తలు ఆయనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఓడిపోయే వాళ్లకే టిక్కెట్లిస్తారా? కోడెల కుటుంబం చేసిన అరాచకాల కారణంగా నరసరావుపేట పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లోని ప్రజల్లో టీడీపీపై వ్యతిరేకత ఉంది. రూ.వంద కోట్లు ఖర్చుపెట్టినా ఆ నియోజకవర్గాల్లో టీడీపీ ఒక్క సీటు కూడా గెలవదు. చంద్రబాబు పోటీ చేసినా గెలవడం కష్టం. ఆ సీట్లు మాకు అవసరం లేదు. ఓటమి భయంతోనే కోడెల నరసరావుపేట నుంచి పోటీ చేయను అంటున్నారు. గెలిచే పరిస్థితి ఉంటే కోడెలను నరసరావుపేట నుంచి పోటీ చేయమనండి’’ అని డొక్కా మాణ్యివరప్రసాద్, జీవీ ఆంజనేయులపై రాయపాటి వర్గీయులు మండిపడ్డారు. -
బాబు దర్శనం కోసం నిరీక్షణ
నిరాశగా వెనుదిరిగిన కార్యకర్తలు సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి దర్శనం కోసం ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు శుక్రవారం పడిగాపులు గాయాల్సి వచ్చింది. అసెంబ్లీ సమావేశం వాయిదా పడ్డాక చంద్రబాబు మధ్యాహ్నం రెండున్నరకు క్యాంపు కార్యాలయానికి వచ్చారు. అప్పటికే అక్కడ పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయన కోసం నిరీక్షిస్తున్నారు. అయితే ఆయన నేరుగా సంక్షేమ కార్యక్రమాలకు ఆధార్ కార్డులను లింక్ చేసే అంశంపై అధికారులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో మంత్రి అయన్నపాత్రుడు కూడా పాల్గొన్నారు. దీంతో ప్రతి రోజూ నిర్వహించే జనరల్ విజిట్ కార్యక్రమాన్ని రద్దు చేశామంటూ అక్కడకు వచ్చిన ప్రజలను అధికారులు వెనక్కి పంపేశారు. వైద్య సహయంకోసం వచ్చిన వారి నుంచి దరఖాస్తులను స్వీకరించి 20 రోజుల్లో మీ ఇంటికి లెటర్ వస్తుందని చెప్పి పంపించారు. ఎంపీలు రాయపాటి సాంబశివరావు, ఎస్పీవై రెడ్డి, ఎమ్మెల్యేలు రామకృష్ణారెడ్డి, గోరంట్ల బుచ్చయ్యచౌదరి, సీనియర్ నాయకులు టిడి జనార్దనరావు, రావుల చంద్రశేఖరరెడ్డి, ఎల్వీఎస్సార్కే ప్రసాద్‌లు చంద్రబాబును కలిశారు. వైద్యసాయం కోసం వచ్చిన వారితో పాటు సమస్యల పరిష్కారం కోసం వచ్చిన ప్రజలు, టీడీపీ కార్యకర్తలకు సీఎం క్యాంపు కార్యాలయంలో కొద్ది రోజులుగా నిరీక్షణ తప్పడంలేదు. సుదీర్ఘ కాలం తర్వాత పార్టీ అధికారంలోకి రావడంతో ఎన్నికల్లో టికెట్లు దొరకని, అవకాశం రాని వారంతా నామినేటెడ్ పదవులను ఆశిస్తున్నారు. దరఖాస్తులను పార్టీ అధినేతకు సమర్పించేందుకు క్యూ కడుతున్నారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన తెలుగు తమ్ముళ్లు సైతం నామినేటెడ్ పదవులను ఆశిస్తున్నవారిలో ఉన్నారు. చిత్తూరు, గుంటూరు, అనంతపురం,కర్నూలు తదితర జిల్లాలకు చెందిన టీడీపీ నాయకులు దరఖాస్తు చేసుకునేందుకు లేక్‌వ్యూ అతిథిగృహానికి వచ్చారు. వారెవరికీ చంద్రబాబు దర్శనం దొరకలేదు. శనివారం మధ్యాహ్నం 3 గంటల లోపు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వద్ద కలుసుకోవాల్సిందిగా సిఎం వ్యక్తిగత సిబ్బంది వారికి సూచించారు. దీంతో కార్యకర్తలు ఉసూరుమంటూ వెనుతిరగాల్సి వచ్చింది. -
'ఈ నెల 31న టీడీపీలో చేరుతున్నా'
ఈ నెల 31న టీడీపీలో చేరుతున్నట్లు కాంగ్రెస్ పార్టీ బహిష్కృత ఎంపీ రాయపాటి సాంబశివరావు ప్రకటించారు. శనివారం తిరుమలలో శ్రీవారిని విఐపీ ప్రారంభ సమయంలో ఆయన ఆదర్శించుకున్నారు. అనంతరం రాయపాటి విలేకర్లతో మాట్లాడుతూ... నిజాయితితో కూడిన సుపరిపాలన చంద్రబాబు నాయుడికే సాధ్యమన్నారు. ప్రజాభిష్టం మేరకే తాను టీడీపీలో చేరుతున్నట్లు తెలిపారు. ఎన్నో ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీకి అంకితభావంతో సేవలందించానని, అయిన ఆ పార్టీ తనను బహిష్కరించిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లు లోక్‌సభలో రానున్న సమయంలో ఆ పార్టీ సభ్యులైన రాయపాటి, లగడపాటి, ఉండవల్లి, సబ్బం హరితోపాటు పలువురు ఎంపీలు కాంగ్రెస్ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టారు. దాంతో కాంగ్రెస్ పార్టీ సదరు ఎంపీలను పార్టీ నుంచి బహిష్కరించిన సంగతి తెలిసిందే. దాంతో పలువురు రాయపాటి తెలుగుదేశం పార్టీవైపు మొగ్గు చూపగా, సబ్బం హరి, ఉండవల్లి, జీవి హర్షకుమార్లు మాజీ ముఖ్యమంత్రి ఎన్.కిరణ్ కుమార్ రెడ్డి స్థాపించిన జై సమైక్యాంధ్ర పార్టీలో చేరిన విషయం విదితమే. -
విష్ణు, వెల్లంపల్లికి ‘కిరణ్’ షాక్
ఉడా నామినేటెడ్ కమిటీలో రాయపాటి వర్గానికి చోటు నలుగురు సభ్యులతో గవర్నింగ్ బాడీ జిల్లాకు దక్కని ప్రాతినిధ్యం సాక్షి, విజయవాడ : విజయవాడ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాసరావులకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి షాక్ ఇచ్చారు. చివరి వరకు తనతో ఉండి రాజీనామా తర్వాత వదిలేసిన ఎమ్మెల్యేలకు తనదైన శైలిలో సమాధానమిచ్చారు. ఉడా గవర్నింగ్బాడీలో ఎమ్మెల్యేలు ఇచ్చిన పేర్లను తొలగించి తనకు అండగా నిలబడిన గుంటూరు ఎంపీ రాయపాటి సాంబశివరావు వర్గానికి కట్టబెట్టారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించే కొన్ని గంటల ముందు వీజీటీఎం ఉడాకి గవర్నింగ్ బాడీని నియమిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. ప్రస్తుతం ఉడాకు చైర్మన్‌గా గుంటూరు జిల్లాకు చెందిన వణుకూరు శ్రీనివాసరెడ్డి వ్యవహరిస్తున్నారు. పాలకవర్గాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేయలేదు. ప్రభుత్వం తన పదవీకాలం ముగుస్తున్న దశలో రాజపుత్ర సత్యంసింగ్, తాడికొండ సాంబశివరావు, ఎం,మల్లికార్జునరావు, నూకవరపు హరికృష్ణలను గవర్నింగ్ బాడీ సభ్యులుగా నియమించింది. వీరు రెండేళ్ల పాటు పదవిలో కొనసాగుతారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రిన్సిపల్ కార్యదర్శి ఎస్కే జోషి శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. వీరిలో ముగ్గురు కమ్మ సామాజిక వర్గానికి చెందినవారు కాగా, ఒకరు బీసీ సామాజిక వర్గానికి చెందినవారు. వీరిలో తాడికొండ సాంబశివరావు విజయవాడలో గత ఏడేళ్లుగా నివసిస్తున్నారు. ఆయన రాయపాటి సాంబశివరావుకు బంధువని సమాచారం. సాంబశివరావు తప్ప మిగిలిన వారంతా గుంటూరు జిల్లాకు చెందినవారే. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసేవరకు పక్కనే ఉండి, గవర్నర్ వద్దకు వెళ్లి వచ్చిన తర్వాత కిరణ్‌కుమార్‌రెడ్డికి దూరంగా జరిగిన విజయవాడ సెంట్రల్, పశ్చిమ ఎమ్మెల్యేలకు షాక్ ఇస్తూ పాత తేదీతో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి వీరి నియామకానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. కంగుతిన్న మల్లాది, వెల్లంపల్లి... విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు కుందేటి శ్యామ్ పేరును, వెల్లంపల్లి శ్రీనివాసరావు వక్కలగడ్డ శ్రీకాంత్ పేరును ఉడా కమిటీ కోసం సిఫార్సు చేసినట్లు తెలిసింది. చివరి వరకు జాబితాలో ఈ పేర్లు ఉన్నా జీవో వచ్చేసరికి లేకపోవడంతో వారు కంగుతిన్నారు. ఉడా పదవుల కోసం జిల్లా నుంచి పలువురు తీవ్రస్థాయిలో ప్రయత్నాలు చేశారు. విజయవాడ నగర మాజీ అధ్యక్షుడు పైలా సోమినాయుడు ఉడా చైర్మన్ పదవి కోసం ఎంపీ లగడపాటితో కలిసి ప్రయత్నించారు. కిరణ్‌కుమార్‌రెడ్డి ఈ పదవిని గుంటూరు జిల్లాకు కట్టబెట్టారు. కనీసం ఉడా పాలకవర్గంలోనైనా చోటు దక్కుతుందని ఆశించిన జిల్లా కాంగ్రెస్ నేతలకు నిరాశే ఎదురైంది. జిల్లాకు చెందిన నేతలు సొంత ప్రయోజనాలే చూసుకున్నారని, స్థానిక నేతల గురించి పట్టించుకోలేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒకవైపు రాష్ట్రపతి పాలన విధిస్తున్న సమయంలో ఈ పాలకవర్గం వేయడం ఎంతవరకు సమంజసమని పలువురు ప్రశ్నిస్తున్నారు. -
కిరణ్ వెంట ఒక్క ఎమ్మెల్యే అయినా వస్తాడా ?
హైదరాబాద్: కిరణ్ కుమార్ రెడ్డి కొత్త పార్టీ పెడతారని తాను చెప్పలేదని, ప్రెస్ మీట్ మాత్రమే పెడతారనే చెప్పానని మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ వివరణ ఇచ్చారు. సీఎం కిరణ్ ఆదివారం తన సన్నిహితులతో సమావేశం కానున్నరని, ఆ సమావేశంలో కూడా కొత్త పార్టీ పెట్టే విషయంపై ఏమీ తేలదని ఆయన అన్నారు. వారం తర్వాత విస్తృత సమావేశమంటూ కిరణ్ దాటవేశరన్నారు. సీఎం సొంత జిల్లా చిత్తూరు నుంచి ఒక ఎమ్మెల్యే అయినా తనతో వస్తారమోనని కిరణ్ ఎదురుచూస్తున్నారని డొక్క చెప్పారు. రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ హైకమాండ్ వైఖరికి నిరసనగా సీఎం పదవికి రాజీనామా చేసిన కిరణ్ కుమార్ రెడ్డి కొత్త పార్టీ పెడతారనే వార్తలు జోరుగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే కాంగ్రెస్ వాది అయిన రాయపాటి సాంబశివరావు కిరణ్‌ను నమ్మి కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరణకు గురైయ్యారని డొక్క తెలిపారు. రాయపాటిని తిరిగి పార్టీలో చేర్చుకోవాలని తాను హైకమాండ్‌ను కోరుతున్నట్టు ఆయన చెప్పారు. కాగా, కాంగ్రెస్ నుంచి బహిష్కరనులంతా తమ పరిస్థితి ఏమిటని అంటున్నారని డొక్క మాణిక్య వరప్రసాద్ తెలిపారు. -
కొత్తపార్టీపై నెలాఖర్లోగా తేలుతుంది: రాయపాటి
సీఎంతో భేటీ.. ఉండవల్లి కూడా.. సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రచారంలో ఉన్న కొత్త పార్టీపై ఈ నెలాఖరులోగా ఏదో ఒకటి తేలిపోతుందని గుంటూరు ఎంపీ రాయపాటి సాంబశివరావు వ్యాఖ్యానించారు. దీనిపై అభిప్రాయాలు ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నాయని, అసెంబ్లీ సమావేశాల తరువాత ఒక స్పష్టత వస్తుందని అన్నారు. రాయపాటి సోమవారం అసెంబ్లీలోని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి చాంబర్లో ఆయనతో భేటీ అయారు. ఈ సందర్భంగా కొంతవుంది విలేకరులతో ఆయన ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. మరో ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ కూడా అసెంబ్లీకి వచ్చి సీఎంతో సవూవేశమయ్యూరు. ఇలా వుండగా కొత్త పార్టీపై ఇప్పటికీ ఒక స్పష్టత లేదని, ఈనెల 23 తర్వాత తేలవచ్చని మంత్రి పితాని సత్యనారాయణ చెప్పారు. టీడీపీ, వైఎస్సార్ కాంగ్రెస్‌లలో చేరను: శత్రుచర్ల తాను టీడీపీలోగానీ, వైఎస్సార్ కాంగ్రెస్‌లోగానీ చేరడం లేదని మంత్రి శత్రుచర్ల విజయరామరాజు చెప్పారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానా? లేదా? ఏ పార్టీ తరఫున పోటీ చేస్తానన్నది ఇప్పుడే చెప్పలేమన్నారు. ఇప్పటికే మూడుసార్లు ఎంపీగా, నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా చేశానన్న సంతృప్తి ఉందని చెప్పారు. సోమవారం అసెంబ్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. -
తడిగుడ్డతో గొంతు కోసింది
-
తడిగుడ్డతో గొంతు కోసింది
కాంగ్రెస్‌లో మా భవిష్యత్ ముగిసినట్లే మీట్ ది ప్రెస్‌లో ఐదుగురు సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు చిన్న రాష్ట్రాల డిమాండ్లున్నచోట లబ్ధి పొందేందుకే విభజన అని విమర్శ సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ తడిగుడ్డతో తమ గొంతు కోసిందని.. ఆ పార్టీలో తమ భవిష్యత్తు ముగిసినట్టేనని సీమాంధ్ర కాంగ్రెస్ లోక్‌సభ సభ్యులు కొందరు స్పష్టం చేశారు. ఉండవల్లి అరుణ్‌కుమార్, రాయపాటి సాంబశివరావు, హర్షకుమార్, సబ్బం హరి, లగడపాటి రాజగోపాల్ ఆదివారం హైదరాబాద్‌లో ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టుల ఫోరం (ఏపీజేఎఫ్) నిర్వహించిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో పాల్గొని తమ అభిప్రాయాలను కుండబద్దలు కొట్టారు. విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. కాంగ్రెస్‌లో తమ భవిష్యత్తు ముగిసినట్లేనని.. కొత్త పార్టీ ఏర్పాటు విషయంలో జనవరి 23 తర్వాతే ఆలోచిస్తామని రాయపాటి సాంబశివరావు చెప్పారు. తమ భవిష్యత్తు రాష్ట్రం సమైక్యంగా ఉంటుందా? లేదా? అన్నదానిపైనే ఆధారపడి ఉందన్నారు. సబ్బం హరి మాట్లాడుతూ.. 2014 ఎన్నికలకు ముందు ఆంధ్రప్రదేశ్‌ను విభజించడం ద్వారా దేశంలో చిన్న రాష్ట్రాలు కోరుకుంటున్న ప్రాంతాలలో కాంగ్రెస్ 40 లోక్‌సభ సీట్ల వరకు గెలుచుకోవాలనే దురుద్దేశంతోనే ఈ ప్రక్రియను చేపట్టిందని విమర్శించారు. ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు కేంద్ర మంత్రుల మధ్య.. అసెంబ్లీ స్పీకర్, డిప్యూటీ స్పీకర్ల మధ్య, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేల మధ్య చీలికలు తీసుకొస్తున్నారని ఆరోపించారు. సమైక్య పోరాటం విషయంలో కాంగ్రెస్ సహా ఎవరినీ నమ్మే పరిస్థితి లేదన్నారు. ఇక, విభజన ప్రక్రియలో రెండు ప్రాంతాల ప్రజల మధ్య ఏకాభిప్రాయం తేవడానికి పార్టీ అధిష్టానంగానీ, కేంద్ర ప్రభుత్వంగానీ ఎలాంటి ప్రయత్నాలు చేయలేదని హర్షకుమార్ అన్నారు. సొంత పార్టీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం ద్వారా విభజన ప్రక్రియను అడ్డుకోవాలన్నది తమ ఆలోచనగా చెప్పారు. రాజకీయాలను పక్కనపెట్టాలి.. కాంగ్రెస్ పార్టీ తడిగుడ్డతో తమ గొంతు కోసిందని ఉండవల్లి అరుణ్‌కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీలో విభజన బిల్లుపై చర్చలో పాల్గొంటే సభ్యులు విభజనకు అంగీకరించినట్టేనన్న వాదనను ఆయన తప్పుపట్టారు. చర్చ సందర్భంగా సభ్యుడు మొదట, చివరిలో తాను బిల్లును వ్యతిరేకిస్తున్నానని చెప్పి ఎంతసేపు మాట్లాడినా.. బిల్లును వ్యతిరేకించినట్టే అవుతుందని తెలిపారు. జనవరి 23 వరకు పార్టీలు రాజకీయాలను పక్కనపెట్టి అసెంబ్లీలో బిల్లుపై చర్చ అంశంపై ఒక్కటిగా పనిచేయాలని సూచించారు. సభలో ఎమ్మెల్యేలు ఎవరేమి మాట్లాడాలన్న దానిపై వ్యూహం ఖారారు చేస్తున్నామని చెప్పారు. 1969లో ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నా, రాష్ట్రపతి ఎన్నికల విషయంలో నాటి సీడబ్ల్యూసీ తీర్మానానికి వ్యతిరేకంగా వ్యవహరించారని.. అలాగే తాము కూడా ప్రజాభిప్రాయానికి అనుగుణంగా నడుచుకుంటున్నామన్నారు. అసెంబ్లీలో మెజార్టీ సభ్యులు బిల్లును తిరస్కరిస్తే, రాష్ట్రపతి దాన్ని పార్లమెంట్‌కు పంపే ముందు సుప్రీంకోర్టుకు పంపుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. సమైక్యాంధ్రకు మద్దతుగా సభ్యులు అఫిడవిట్లను అసెంబ్లీలో అందజేసి.. వా టితో సుప్రీంకోర్టుకు వెళ్లాలన్న ఆలోచన ఉందన్నారు. లగడపాటి మాట్లాడుతూ.. విభజన బిల్లుపై చర్చకు గతంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నాలుగు వారాలు అదనపు సమయం ఇవ్వాలని రాష్ట్రపతిని కోరితే ఇచ్చారన్నారు. మనం 8 వారాలు అదనపు సమయం అడిగితే ఇవ్వక తప్పదని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయులు కొమ్మినేని శ్రీనివాసరావు, కందుల రమేష్, ఏపీజేఎఫ్ అధ్యక్షుడు చెవుల కృష్ణాంజనేయులు, ప్రధాన కార్యదర్శి వంశీకృష్ణ, పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు. రాష్ట్రపతిని కలిసిన సీమాంధ్ర ఎంపీలు సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు ఉండవల్లి, రాయపాటి, సబ్బంహరి, హర్షకుమార్, లగడపాటి రాష్ట్రపతి ప్రణబ్‌ను ఆదివారం కలిశారు. మెజారిటీ ప్రజలు రాష్ట్రం సమైక్యంగా ఉండాలని కోరుకుంటున్నందున విభజనను నిలిపేయాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు.