
కొత్తపార్టీపై నెలాఖర్లోగా తేలుతుంది: రాయపాటి
సీఎంతో భేటీ.. ఉండవల్లి కూడా..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రచారంలో ఉన్న కొత్త పార్టీపై ఈ నెలాఖరులోగా ఏదో ఒకటి తేలిపోతుందని గుంటూరు ఎంపీ రాయపాటి సాంబశివరావు వ్యాఖ్యానించారు. దీనిపై అభిప్రాయాలు ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నాయని, అసెంబ్లీ సమావేశాల తరువాత ఒక స్పష్టత వస్తుందని అన్నారు. రాయపాటి సోమవారం అసెంబ్లీలోని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి చాంబర్లో ఆయనతో భేటీ అయారు. ఈ సందర్భంగా కొంతవుంది విలేకరులతో ఆయన ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. మరో ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ కూడా అసెంబ్లీకి వచ్చి సీఎంతో సవూవేశమయ్యూరు. ఇలా వుండగా కొత్త పార్టీపై ఇప్పటికీ ఒక స్పష్టత లేదని, ఈనెల 23 తర్వాత తేలవచ్చని మంత్రి పితాని సత్యనారాయణ చెప్పారు.
టీడీపీ, వైఎస్సార్ కాంగ్రెస్‌లలో చేరను: శత్రుచర్ల
తాను టీడీపీలోగానీ, వైఎస్సార్ కాంగ్రెస్‌లోగానీ చేరడం లేదని మంత్రి శత్రుచర్ల విజయరామరాజు చెప్పారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానా? లేదా? ఏ పార్టీ తరఫున పోటీ చేస్తానన్నది ఇప్పుడే చెప్పలేమన్నారు. ఇప్పటికే మూడుసార్లు ఎంపీగా, నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా చేశానన్న సంతృప్తి ఉందని చెప్పారు. సోమవారం అసెంబ్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు.