
సాక్క్షి, గుంటూరు: టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు నివాసంలో కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ దాడులు చేపట్టింది. మంగళవారం ఉదయం నుంచే ప్రత్యేక బృందాల ఆధ్వర్యంలో సోదాలు జరుపుతోంది.
ట్రాన్స్‌స్టాయ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ.. బ్యాంకు రుణాల ఎగవేత అంశంపై గతంలో మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది. కేసు విచారణలో భాగంగానే రాయపాటి నివాసంలో తనిఖీలు చేపట్టారు అధికారులు. హైదరాబాద్, గుంటూరు సహా తొమ్మిది చోట్ల సోదాలు నిర్వహించామని, రాయపాటి, ఇతర ప్రమోటర్ల కార్యాలయాలు, నివాసాల్లో సోదాలు జరిగాయని ఈడీ వర్గాలు పేర్కొన్నాయి.
మరోవైపు హైదరాబాద్ నగరంలో మరోసారి ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. జూబ్లీహిల్స్, మణికొండ, పంజాగుట్టలో మంగళవారం(ఆగస్టు1) ఉదయం నుంచే దాడులు జరుపుతోంది. మాలినేని సాంబశివరావుతో పాటు పలువురి ఇళ్లు, కార్యాలయాల్లో ఈడీ అధికారులు తనిఖీలు చేపట్టారు. మొత్తం 15 బృందాలతో ఏకకాలంలో సోదాలు చేస్తున్నారు.
చదవండి: నార్కో టెస్ట్‌కు నేను రెడీ : పొంగూరు ప్రియ
Comments
Please login to add a commentAdd a comment