గుర్రం జాషువా 120వ జయంతిని పురస్కరించుకుని ‘గుర్రం జాషు వా 120వ జయంతి ఉత్సవ కమిటీ’ ఆధ్వర్యంలో గుంటూరు, ఏసీ కాలేజీ ఆడిటోరియంలో సెప్టెంబర్ 27 ఆదివారం ఉదయం 10 గం టల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ రాష్ట్ర సదస్సు జరుగు తుంది. తెలుగు సాహిత్యంలో జాషువా విశిష్టత, జాషువా శైలి - వస్తు వైవిధ్యం, జాషువా సాహిత్యం - సామాజిక వాస్తవికత అనే మూడు అంశాలపై సమావేశాలు జరుగుతాయి. 50 సంఘాలు సంయుక్తంగా ఈ సదస్సును విశిష్టంగా నిర్వహిస్తున్నాయి.
ప్రారంభ సభలో ఉత్సవ కమిటీ చైర్మన్ డొక్కా మాణిక్య వరప్రసాద్, రాజ్యసభ సభ్యులు జేడీ శీలం, శాసన మండలి సభ్యు లు ఎంవీఎస్ శర్మ, బీవీ రాఘవులు, కొలకలూరి ఇనాక్, కె. శ్రీనివాస్, గోరటి వెం కన్న, ఏసీ కళాశాల ప్రిన్సిపాల్ పి.ముత్యం, కేఎస్ లక్ష్మణరావు పాల్గొంటారు. అనంతరం సదస్సులో తెలకపల్లి రవి, కత్తి పద్మారావు, అద్దేపల్లి రామమోహన్‌రావు, రావెల సాంబశివరావు, రాచపాళెం చం ద్రశేఖర్‌రెడ్డి, సీఎస్‌ఆర్ ప్రసాద్, ఎండ్లూరి సుధాకర్, బి.వేదయ్య, ఖాదర్ మొహియుద్దీన్, కోయి కోటేశ్వరరావు, మాల్యాద్రి, కొలకలూరి మధుజ్యోతి, ఎంఎం.వినోదిని, పెనుగొండ లక్ష్మీనారాయణ, డాక్టర్ ఎం.స్వర్ణలతాదేవి, మోదుగల రవికృష్ణ పాల్గొంటారు. వివరాలకు...
- పి.వి.రమణ, ప్రధాన కార్యదర్శి
గుర్రం జాషువా 120వ జయంతి ఉత్సవ కమిటీ, ఫోన్:73964 9310
జాషువాపై సదస్సు
Published Sat, Sep 26 2015 12:40 AM | Last Updated on Sun, Sep 3 2017 9:58 AM
Advertisement
Advertisement