తన వ్యవహార శైలితో సహచర మంత్రులకు ఇప్పటికే దూరం అయిన ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డిపై తాజాగా మరో మంత్రి విరుచుకు పడ్డారు. సీఎం కిరణ్ పొడగ్తలకు అలవాటు పడ్డారని మంత్రి డొక్కా మణిక్య వర ప్రసాద్ వ్యాఖ్యానించారు. కిరణ్ పక్కన భజన బృందం చేరిందని.... అందుకే ముక్కుసూటిగా ప్రశ్నించే తనను ఆయన లెక్క చేయటం లేదని మాణిక్య వర ప్రసాద్ అన్నారు. విభజన విషయంలో ఇష్టం లేకపోయినా అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉండాటని ఆయన అభిప్రాయపడ్డారు. సీఎం వ్యాఖ్యలను తనకు ఆందోళన కలిగించాయని వర ప్రసాద్ అన్నారు. అధిష్టానం నిర్ణయాన్ని బహిరంగంగా వ్యతిరేకించటం తప్పని, తనకు ఇష్టం లేకపోయినా కేబినెట్ నిర్ణయాలను సమర్థించినట్లు తెలిపారు. సర్వేలను నమ్ముకుంటే చంద్రబాబు లాగా కొంప మునగటం ఖాయమన్నారు. తన నిర్ణయాలను వినటం లేదనే డీఎల్ రవీంద్రారెడ్డి, శంకర్రావులను సీఎం బయటకు పంపించారని మణిక్య వర ప్రసాద్ ఆరోపించారు.
Published Wed, Oct 2 2013 1:14 PM | Last Updated on Fri, Mar 22 2024 11:32 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement