
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యునిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఏకగ్రీంగా ఎన్నికయ్యారు. కొద్దిసేపటి క్రితం ఎమ్మెల్సీ ఎన్నిక నామినేషన్ల గడువు ముగిసింది. అయితే ఎమ్మెల్సీ స్థానానికి మాణిక్య వరప్రసాద్ ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది. కాగా, ఈ ఏడాది ప్రారంభంలో శాసనమండలి ప్రత్యేక సమావేశాలు జరుగుతున్న సమయంలోనే.. టీడీపీలో సీనియర్ నాయకుడిగా ఉన్న డొక్కా మాణిక్యవరప్రసాద్ తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అనంతరం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
Comments
Please login to add a commentAdd a comment