
తెలంగాణ బిల్లుపై చర్చ జరగాల్సిందే: మంత్రి డొక్కా
హైదరాబాద్: విభజన బిల్లు అసెంబ్లీకి వచ్చిన నేపథ్యంలో.. తెలంగాణ ముసాయిదా బిల్లుపై చర్చ జరగాల్సిందేనంటూ మంత్రి డొక్కా మాణిక్కవరప్రసాద్ డిమాండ్ చేశారు. ఈ తెలంగాణ బిల్లులో అనేక లోపాలున్నాయని ఆయన అన్నారు. సభలో మాట్లాడే అవకాశం వస్తే తెలంగాణ బిల్లులోని లోపాలను తెలపుతానని డొక్కా స్పష్టం చేశారు. విభజనతో సంబంధం లేకుండా.. 2011 జనాభా ప్రకారం ఎస్సీ, ఎస్టీలకు కేటాయించే నియోజకవర్గాలు పెంచాలని డొక్కా మాణిక్యవరప్రసాద్ డిమాండ్ చేశారు.