
కేసీఆర్‌పై ‘డొక్కా’ పొగడ్తల వర్షం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సీఎం కె.చంద్రశేఖరరావుపై మాజీమంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ పొగడ్తల వర్షం కురిపించారు. ఒక్కో దళిత కుటుంబానికి మూడెకరాల భూమి పంపిణీ, మైనారిటీలకు 12 శాతం రిజర్వేషన్లు వంటి నిర్ణయాలు తీసుకున్న కేసీఆర్‌పై రోజురోజుకూ గౌరవం పెరుగుతోందన్నారు. సీఎల్పీ కార్యాలయం వద్ద గురువారం మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ అమలు చేస్తున్న ఆయా నిర్ణయాలను ఏపీలోనూ అమలు చేయాలని సీఎం చంద్రబాబును డిమాండ్ చేస్తామన్నారు. అయితే ఫీజు రీయింబర్స్‌మెంట్ విషయంలో కేసీఆర్ తీసుకున్న నిర్ణయం అనర్థాలకు దారితీస్తుందని అభిప్రాయపడ్డారు.