సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ప్రత్యేక సమావేశాలు జరుగుతున్న సమయంలో టీడీపీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత డొక్కా మాణిక్యవరప్రసాద్ తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు రాజీనామా లేఖను పంపించారు. అదేవిధంగా తన రాజీనామా లేఖను మీడియాకు కూడా విడుదల చేశారు. ఈ క్రమంలో భవిష్యత్‌లో ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీచేయకూడదని నిశ్చయించుకున్నట్లు డొక్కొ ఆ లేఖలో పేర్కొన్నారు.
మంగళవానం శాసనమండలి సమావేశానికి డొక్కా గైర్హాజర్ కావడంతో అందరిలోనూ అనుమానాలు రేకెత్తాయి. కీలక బిల్లు నేపథ్యంలో మండలికి హాజరుకావాలని చంద్రబాబు ఫోన్ చేసినా డొక్కా స్పందించలేదని టీడీపీ వర్గాలు పేర్కొన్నాయి. రాజీనామా లేఖను చంద్రబాబుకు పంపించి ఆయన అజ్ఞాతంలోకి వెళ్లినట్టు సమాచారం. కాగా, ఈ రోజు మండలి సమావేశానికి డొక్కా మాణిక్యవరప్రసాద్‌తో పాటు శమంతకమణి, నామినేటెడ్ ఎమ్మెల్సీ రత్నబాబు కూడా హాజరుకాకపోవడం గమనార్హం.
చదవండి:
టీడీపీ సభ్యుల తీరుపై స్పీకర్ మనస్తాపం
Comments
Please login to add a commentAdd a comment