విభజనపై హైకమాండ్ నిర్ణయానికి కట్టుబడి ఉంటా: డొక్కా
రాష్ట్ర విభజన అంశంపై హైకమాండ్ తీసుకున్న నిర్ణయానికే కట్టుబడి ఉంటా అని మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ అన్నారు. చిన్నజిల్లాలు ఉండాలనే అభిప్రాయాన్ని కేంద్ర మంత్రుల బృందానికి వివరిస్తానని మంత్రి డొక్కా తెలిపారు. చిన్న రాష్ట్రాల వల్ల ప్రయోజనంలేదని ఎవరన్నారని డొక్కా ప్రశ్నించారు.
సమ్మెవల్ల సామాన్య జనానికి ఇబ్బంది కలుగుతోంది అని, పరిస్థితిని గ్రహించి ఉద్యోగులు సమ్మె విరమించాలని డొక్కా సూచించారు. రాష్ట్ర విభజనపై ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు స్పష్టమైన వైఖరిని చెప్పడం లేదని.. ఆయన సమైక్యవాదా లేక విభజన వాదా అని చెప్పాలని మంత్రి డొక్కా డిమాండ్ చేశారు. చంద్రబాబును రాయపాటి కలవడంలో ఎలాంటి రాజకీయ ప్రాధాన్యతలేదు అని అన్నారు. తాను, రాయపాటి సాంబశివరావు కాంగ్రెస్‌లోనే కొనసాగుతామని డొక్కా ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు.