తెలంగాణ బిల్లు మంగళవారం పార్లమెంట్లో చర్చకు వచ్చిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు రాజీనామాలు చేస్తున్నారు. రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి, రాష్ట్ర మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు గంటా మంగళవారం తన రాజీనామా లేఖను గవర్నర్కు ఫ్యాక్స్ ద్వారా పంపారు. అలాగే మరో మంత్రి డొక్కా మాణిక్య వర ప్రసాద్ కూడా కాంగ్రెస్ పార్టీకి, మంత్రి పదవికి గుడ్ బై చెప్పారు. గాజువాక ఎమ్మెల్యే చింతలపూడి వెంకటరామయ్య తన శాసన సభ్యత్వానికి రాజీనామా చేశారు. రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ పార్టీ సీమాంధ్ర ప్రజల మనోభావాలను కొంచం కూడా పట్టించుకోకుండా ముందుకు వెళ్తుంది. ఈ నేపథ్యంలో సీమాంధ్రకు చెందన పలువురు రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు రాజీనామా చేసేందుకు సిద్ధమవుతున్నారు.
Published Tue, Feb 18 2014 2:57 PM | Last Updated on Fri, Mar 22 2024 10:56 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement