అడ్వాన్స్ బుకింగ్, సేల్ లేదు: కిరణ్ | Jai samaikyandhra party not sold Tickets, says Kiran Kumar Reddy | Sakshi
Sakshi News home page

అడ్వాన్స్ బుకింగ్, సేల్ లేదు: కిరణ్

Published Mon, Mar 10 2014 8:35 PM | Last Updated on Sat, Sep 2 2017 4:33 AM

అడ్వాన్స్ బుకింగ్, సేల్ లేదు: కిరణ్

అడ్వాన్స్ బుకింగ్, సేల్ లేదు: కిరణ్

హైదరాబాద్: తమ పార్టీలో టిక్కెట్లు అమ్ముకోబోమని మాజీ ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డి అన్నారు. అడ్వాన్స్ బుకింగ్ లేదు, సేల్ లేదని ఆయన చమత్కరించారు. తన పార్టీ పేరును 'జై సమైక్యాంధ్ర'గా కిరణ్ ప్రకటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజల కోసమే పనిచేసే వాళ్లకే టిక్కెట్లు ఇస్తామని చెప్పారు. ఎవరికీ ఎన్ని సీట్లు ఇవ్వాలో ప్రజల గుండె చప్పుడు చెబుతుందన్నారు.

వ్యవస్థాపక అధ్యక్షుడిగా చండ్రు శ్రీహరిరావు వ్యవస్థాపక అధ్యక్షుడిగా, తాను అధ్యక్షుడిగా ఉంటానని కిరణ్ తెలిపారు. సాయి ప్రతాప్, సబ్బం హరి, ఉండవల్లి అరుణ్ కుమార్, హర్షకుమార్, పితాని సత్యనారాయణ, శైలజానాథ్ ఉపాధ్యక్షులుగా వ్యవహరిస్తారని చెప్పారు. కార్యదర్శిగా గంగాధర్ను నియమించినట్టు చెప్పారు. లగడపాటి రాజగోపాల్ వ్యూహకర్తగా వ్యవహరిస్తారని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement