Jai Saimaikyadhra Party
-
మండలాధీశులు
మొత్తం 65 మండలాల్లో 37 టీడీపీ కైవశం, 22 చోట్ల వైఎస్సార్సీపీ రెండు చోట్ల జేఎస్పీ..మరో చోట ఇండిపెండెంట్ ఎర్రవారిపాళెం, నిమ్మనపల్లె, కేవీబీ పురం ఎన్నిక లు వాయిదా మండలాలను ఏలే పాలకులు కొలువుదీరారు. జిల్లాలోని 65 మండల పరిషత్‌లలో శుక్రవారం 62 స్థానాలకు ఎన్నికలు ముగిశాయి. 37 మండలాల్లో టీడీపీ, 22 స్థానాల్లో వైఎస్సార్సీపీ పాలకవర్గాలు కొలువుదీరాయి. కలికిరి, గుర్రంకొండలో జై సమైక్యాంధ్రపార్టీ పాలకవర్గాలను ఏర్పాటు చే సింది. పెద్దమండ్యంలో పాలకవర్గాన్ని స్వతంత్రులు ఏర్పాటు చేయడం గమనార్హం. కేవీబీ పురం, నిమ్మనపల్లె మండలాల ఎన్నికలు శనివారానికి వాయిదా పడ్డాయి. ఎర్రావారిపాళెంలో సభ్యులెవరూ రాకపోవడంతో ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఈ విషయూన్ని రాష్ట్ర ఎన్నికల సంఘానికి నివేదించారు. ‘పుర’ పాలకవర్గాలతో పాటు ‘మండల పరిషత్’ పాలకవర్గాల ఎన్నికలు కూడా ముగిశాయి. జిల్లా వ్యాప్తం గా 65 మండలాలకు శుక్రవారం పాలకవర్గాల ఎన్నిక జరగాలి. అయితే చంద్రగిరి నియోజకవర్గం ఎర్రావారిపాళెం, సత్యవేడు నియోజకవర్గం కేవీబీ పురం, మదనపల్లె నియోజకవర్గంలోని నిమ్మనపల్లె మండలాల ఎన్నికలు అనివార్య కారణాలతో వాయిదా పడ్డాయి. తక్కిన అన్ని స్థానాలకు ప్రశాంతంగా ఎన్నికల తంతు ముగి సింది. కేవీబీ పురం ఎన్నికలో చిక్కు ప్రశ్న కేవీబీ పురం మండలంలో 12ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. అందులో 10 టీడీపీ, 2 స్థానాలను వైఎస్సార్సీపీ దక్కించుకున్నాయి. మండలాధ్యక్ష స్థానం ఎస్టీ సామాజికవర్గానికి రిజర్వ్ అయింది. అయితే పాలకవర్గాన్ని ఏర్పా టు చేసేందుకు మెజారిటీ దక్కించుకున్న టీడీపీలో ఎస్టీ సభ్యులు లేరు. వైఎస్సార్సీపీ నుంచి గెలిచిన ఇద్దరిలో సులోచన ఎస్టీ సామాజికవర్గానికి చెందిన ఎంపీటీసీ సభ్యురాలు. రిజర్వేషన్ల ప్రకారం సులోచనకు మండలాధ్యక్ష పదవి దక్కాలి. అయితే ఇందుకు టీడీపీ ససేమిరా అంటోంది. శుక్రవారం పాలకవర్గ ఎన్నికకు టీడీపీ సభ్యులు గైర్హాజరయ్యారు. దీంతో శనివారానికి ఎన్నిక వాయిదా పడింది. శనివారం కూడా ఇదే తంతు జరిగితే... కేవీబీ పురం ఎన్నిక సమస్యను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ దృష్టికి తీసుకెళ్లనున్నారు. ఎర్రావారిపాళెంలో చిత్రమైన సమస్య ఎర్రావారిపాళెంలో 8 ఎంపీటీసీ స్థానా లు ఉన్నాయి. ఇందులో 3 కాంగ్రెస్, 3 స్థానాలను వైఎస్సార్సీపీ దక్కించుకున్నాయి. టీడీపీ రెండు స్థానాల్లో గెలుపొందింది. వీరు ఏ పార్టీకి మద్దతు ఇవ్వలేదు. ఎవరూ ఎన్నికలకు వెళ్లలేదు. దీంతో ఎన్నిక వాయిదా పడింది. సభ్యురాలి అనారోగ్యకారణంతో.. మదనపల్లె నియోజకవర్గంలో నిమ్మనపల్లె పాలకవర్గం ఎన్నిక శనివారానికి వాయిదా పడింది. ఇక్కడ పాలకవర్గాన్ని ఏర్పాటు చేసేందుకు వైఎస్సార్సీపీకి స్పష్టమైన మెజారిటీ ఉంది. అయితే ఆ పార్టీకి చెందిన ఎంపీటీసీ సభ్యురాలు హాజీరాంజీ అనారోగ్యకారణాలతో ఆస్పత్రికి వెళ్లారు. దీంతో ఎన్నిక వాయిదా పడింది. 4 నియోజకవర్గాల్లో క్లీన్ స్వీప్ : జిల్లాలోని మొత్తం 14 నియోజకవర్గాలకుగాను మదనపల్లె నియోజకవర్గంలో మదనపల్లె, రామసముద్రం మండలాలను వైఎస్సార్సీపీ దక్కించుకున్నాయి. నిమ్మనపల్లె కూడా నేడు వైఎస్సార్సీపీ ఖాతాలోకి చేరనుంది. అలాగే శ్రీకాళహస్తి పరిధిలోని 4,కుప్పం నియోజకవర్గంలో 4,చిత్తూరు పరిధిలో 2 మండల పరిషత్‌లను టీడీపీ క్లీన్ స్వీప్ చేసింది. ఐరాల లక్కీగా టీడీపీకి ..: పూతలపట్టు నియోజకవర్గంలోని ఐరాల మండలంలో 14 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. టీడీపీ, వైఎస్సార్సీపీ చెరో ఏడింటిలో నెగా్గాయి. దీంతో ఎంపీపీ ఎన్నికకు ఁలక్కీ డ్రిప్రూ. నిర్వహించారు. ఇందులో టీడీపీ అభ్యర్థి పేరు వచ్చింది. దీంతో ఁలక్కీరూ.గా ఐరాల స్థానం టీడీపీ వశమైంది. జేఎస్సీ ఖాతాలో రెండు : పీలేరు నియోజకవర్గంలోని కలికిరి, గుర్రంకొండలో జై సమైక్యాంధ్రపార్టీ పాలకవర్గాలను ఏర్పాటు చేసింది. ఈ పార్టీ సభ్యులు పీలేరు మండలంలో గెలిచినప్పటికీ పీలేరు పాలకవర్గం ఎన్నికకు గైర్హాజరయ్యారు. అలాగే తంబళ్లపల్లె నియోజకవర్గంలోని పెద్దమండ్యం మండల పాలకవర్గాన్ని స్వతంత్రులు ఏర్పాటు చేశారు. ఇక్కడ ప్రధానపార్టీలకు పూర్తిస్థాయి మెజారిటీ లేదు. దీంతో స్వతంత్ర అభ్యర్థికి ఎంపీపీ స్థానం దక్కింది. -
వాకా బీజేపీలో చేరిక
పెడన, న్యూస్‌లైన్ : జై సమైక్యాంధ్ర పార్టీ పెడన నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి వాకా వాసుదేవరావు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర హోం మంత్రి రాజ్‌నాధ్‌సింగ్ సమక్షంలో మంగళవారం ఆయన పెడనకు చెందిన 15 మంది పార్టీ నాయకులతో కలసి ఢిల్లీలో పార్టీలో చేరారు. ఈ విషయాన్ని స్థానిక విలేకరులకు ఫోన్లో వివరించారు. జిల్లాలో రైతులు, చేనేత కార్మికులు, మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యలను రాజ్‌నాధ్‌సింగ్ దృష్టికి తీసుకెళ్లినట్లు ఆయన తెలిపారు. మాసాబత్తుల శ్రీనివాసరావు, బొర్రా నటేష్, మహాంతి ప్రసాదు, పిచ్చుక శంకర్, గోళ్ల రామాంజనేయులు తదితరులు బీజేపీలో చేరినవారిలో ఉన్నారు. -
వైఎస్సార్సీపీ కార్యకర్తలపై కక్షసాధింపు
కదిరాయుచెర్వు(కలకడ), న్యూస్‌లైన్: ఎన్నికలు ముగిసిపోయినా వైఎస్సార్సీపీ కార్యకర్తలపై తెలుగుదేశం పార్టీ,జై సమైక్యాంధ్ర పార్టీ నేతలు దాడులకు పాల్పడుతూనే ఉన్నారు. అధికారులను ఉసిగొలిపి కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. గంగజాతర పేరుతో ఇళ్లతొలగింపునకు పూనుకుంటున్నారు. ఉత్సవాలు, ఊరేగింపులపేరుతో ఈ చర్యలకు పాల్పడుతున్నా రు. న్యాయం చేయాల్సిన అధికారులు టీడీపీ,జేఎస్పీ నేతలకు అండగా నిలవడంతో బాధితులు ఉన్నతాధికారులను కోర్టును ఆశ్రయించారు. వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని కదిరాయచెరువు పంచాయతీలో వైఎస్సార్సీపీ కార్యకర్తలు సుధాకర్, రెడ్డి హుస్సేన్ చాలా కా లం కిందట ఇళ్లు కట్టుకుని నివాసముం టున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో వారుైవైఎస్సార్సీపీ మద్దతుగా నిలిచా రు. తమకు వ్యతిరేకంగా పనిచేశారన్న అక్కసుతో వీరి ఇళ్లను కూల్చివేసేందుకు జైసమైక్యాంధ్ర, టీడీపీకి చెందిన నేతలు అధికారులపై ఒత్తిడి తీసుకువస్తున్నారు. ఇదిలా ఉండగా గ్రామంలో నడివీధి గంగమ్మ ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. అమ్మవారిని ఊరేగించేందు కు, ప్రజలు వెళ్లేందుకు సిమెంటు రోడ్లు ఉ న్నాయి. అయినా వీరి ఇళ్లు అడ్డంగా ఉన్నాయని, ఇళ్లను తొలగించాలని అధికారులు ఒత్తిడి తీసుకువస్తున్నారు. వా రం రోజులుగా ఇలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. దీనిపై బాధితులు రెవెన్యూ,పోలీసు అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. అయినా ఫలితం కనిపించలేదు. దీంతో వారు మదనపల్లె సబ్‌కలెక్టర్‌ను కలసి ఇళ్ల కూల్చివేతను అడ్డుకోవాలని విజ్ఞప్తి చేశారు. కోర్టు ఆశ్రయించి నట్టు బాధితులు తెలిపారు. సోమవారం రాత్రి జాతర చాటింపు వేశారు. మంగళవారం ఉదయం అధికారులు వచ్చి ఇళ్లను కూల్చిలవేయాల్సిందేనని పట్టుబడుతున్నారని బాధితులు వాపోతున్నారు. ఇంటి నిర్మాణం జరిగిన స్థలం, కొనుగోలు పత్రాలు, ఇంటిపన్ను, విద్యుత్ బిల్లు వంటివి ఉన్నప్పటికీ అధికారులు ఏకపక్షంగా ఇళ్ల కూల్చివేతకు పాల్పడుతున్నారని వారు ఆరోపిస్తున్నారు. రాజకీయ కక్షలకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. -
బాబూ.. పగటి కలలు కనొద్దు: జేఎస్పీ నేత సుధ
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినట్లు చంద్రబాబు నాయుడు అప్పుడే పగటి కలలు కంటున్నారని, ఆయన మాట్లాడే మాటలు, ఇచ్చే హామీలు దీన్ని స్పష్టం చేస్తున్నాయని జై సమైక్యాంధ్ర పార్టీ(జేఎస్పీ) అధికార ప్రతినిధి డాక్టర్ సుధారాణి విమర్శించారు. నరేంద్ర మోడీ ఆదుకుంటే తప్ప తెలుగువారికి భవిష్యత్తే ఉండదని చంద్రబాబు చెప్పడం తెలుగుజాతిని మరోసారి అవమానించడమే అవుతుందని దుయ్యబట్టారు. ఆదివారం పార్టీ కార్యాలయంలో ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. చంద్రబాబుపై తీవ్రంగా ధ్వజమెత్తారు. తొమ్మిదేళ్లపాటు రాష్ట్రానికి సీఎంగా పనిచేసిన చంద్రబాబు ప్రజలకు ఒరగబెట్టిందేమిటని ప్రశ్నించారు. అదేవిధంగా కేంద్రంలో పాలన సాగించిన ఎన్డీఏ సర్కారు కూడా చేసిందేమీ లేదన్నారు. -
చంద్రబాబువల్లే ముక్కలైన రాష్ట్రం: కిరణ్
కాకినాడ: టీడీపీ అధినేత చంద్రబాబునాయుడి రెండు కళ్ల విధానంవల్లే రాష్ర్టం రెండు ముక్కలైందని జై సమైక్యాంధ్ర పార్టీ అధ్యక్షుడు నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. రాష్ర్ట విభజన బిల్లుపై అసెంబ్లీలో చర్చ జరిగినప్పుడు చంద్రబాబు బెల్లం కొట్టిన రాయిలా కూర్చున్నాడే తప్ప ఒక్క మాట కూడా మాట్లాడిన పాపాన పోలేదన్నారు. తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు, జగ్గంపేట, పిఠాపురం, కాకినాడ సిటీ, కాకినాడ రూరల్, రాజ మండ్రి నగరాల్లో శుక్రవారం రోడ్‌షోలు నిర్వహించారు. చంద్రబాబు లేఖతో రాష్ట్రాన్ని కాంగ్రెస్ రెండు ముక్కలు చేస్తే, దానికి బీజేపీ మద్దతు ఇచ్చిందన్నారు. ఇప్పుడు ఆ బీజేపీతో చంద్రబాబు అంటకాగుతున్నారని దుయ్యబట్టారు -
కిరణ్‌కుమార్‌రెడ్డికి షాక్
వైఎస్సార్ సీపీలో బరకం రవికుమార్‌రెడ్డి చేరిక తుడుచుకుపెట్టుకుపోయిన జేఎస్పీ కలకడ, న్యూస్‌లైన్: మాజీ ముఖ్యమంత్రి, జై సమైక్యాంధ్ర పార్టీ అధినేత నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డికి సొంత నియోజకవర్గమైన పీలేరులో పెద్ద షాక్ తగిలింది. ఐదు దశాబ్దాలకు పైగా, రెండు తరాలుగా నల్లారి కుటుంబంతో అనుబంధం ఉన్న బరకం రవికుమార్‌రెడ్డి బుధవారం రాత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైఎస్సార్ సీపీ రాజంపేట లోక్‌సభ అభ్యర్థి పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. ఆయన చేరికను వైఎస్సార్ సీపీ సీనియుర్ నాయకులు వంగి మళ్ల మాధుసూదన్‌రెడ్డి, జెల్లా రాజగోపాల్‌రెడ్డి స్వాగతించారు. అలాగే కోన సర్పంచ్ పుల్లమ్మ, టీడీపీ నాయకులు రెడ్డెప్ప తదితరులు వైఎస్సార్ సీపీలో చేరారు. నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి సోదరుడు కిషోర్‌కుమార్‌రెడ్డి జేఎస్పీ పీలేరు ఎమ్మెల్యే అభ్యర్థి గా పోటీ చేస్తున్నారు. అయితే బరకం రవికుమార్‌రెడ్డి వైఎస్సార్ సీపీలో చేరడంతో జే ఎస్పీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. ముడేళ్ల క్రితం మాజీ మండలాధ్యక్షులు వంగివుళ్ల మధుసూదన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా కిరణ్‌కుమార్‌రెడ్డిని విభేదించి పక్కకు వచ్చిన విషయం తెలిసిందే. బుధవారం రాత్రి బరకం రవికుమార్‌రెడ్డి రాకతో కలకడ మండలంలో నల్లారి వర్గం దాదాపుగా తుడుచుపెట్టుకు పోయినట్టు అయింది. అదే సమయంలో పీలేరు నియోజకవర్గంలో వంగిమళ్ల మాధుసూదన్‌రెడ్డి వర్గం బలపడడం, వైఎస్సార్ సీపీకి మంచి పట్టు లభించినట్టు అయింది. బరకం నేపథ్యం ఇదీ క్లాస్-1 కాంట్రాక్టరుగా ఉన్న బరకం రవికుమార్‌రెడ్డి తండ్రి నరసింహారెడ్డి, మాజీ ముఖ్యమంత్రి నల్లారి అమర్నాథరెడ్డిలు దశాబ్దాల కాలం కలిసి ఉన్నారు. నరసిం హారెడ్డి వాయల్పాడు సెంట్రల్ బ్యాంక్ అధ్యక్షులుగా, పీలేరు సమితి సభ్యులుగా, జిల్లా బోర్డు సభ్యులుగా ఉండి మండలంలో, నియోజకవర్గంలో తిరుగులేని నాయకుడుగా ఉన్నారు. దీంతో మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి వర్గంలోని ఆంతరంగికుల్లో ముఖ్యమైన వ్యక్తుల్లో రవికుమార్‌రెడ్డి ఒకరు. రవికుమార్‌రెడ్డి వైఎస్సార్ సీపీ చేరికలో కడప డీసీసీబీ చైర్మన్ ఆవుల విష్ణువర్దన్‌రెడ్డి, వైఎస్సార్సీపీ పీలేరు ఎమ్మెల్యే అభ్యర్థి చింతలరావుచంద్రారెడ్డి, వైఎస్సార్ సీపీ నాయుకు లు వంగిమళ్ల మాధుసూదన్‌రెడ్డి, జెడ్పీటీసీ అభ్యర్థి జెల్లారాజగోపాల్రెడ్డి తదితరులు ఉన్నారు. -
చంద్రబాబుది రెండు నాల్కల ధోరణి: కిరణ్
గుర్రంకొండ, రాష్ట్రాన్ని విడగొట్టాలంటూ లేఖ ఇ చ్చి, సీవూంధ్రను ఉద్ధరిస్తావుంటూ ప్రకటనలు గుప్పించ డం టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు రె ండు నాల్కల ధోరణికి నిదర్శనవుని వూజీ సీఎం, జై సమైక్యాంధ్ర పార్టీ అధ్యక్షుడు కిరణ్‌కువూర్‌రెడ్డి వివుర్శించారు. వుంగళవారం చిత్తూరు జిల్లా పీలేరు నియోజకవర్గంలోని గుర్రంకొండ, తరిగొండ గ్రావూల్లో ఆయున తన పార్టీ అభ్యర్థులకు మద్దతుగా రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా వూట్లాడుతూ రాష్ట్ర విభజన తీరులో, బీజేపీతో పొత్తు విషయుంలో చంద్రబాబు అవకాశవాద రాజకీయూలకు పాల్పడ్డారని ధ్వజమెత్తారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో అభ్యర్థుల గెలుపోటవుులను నిర్ణయించేది సీవూంధ్రులేనని అన్నారు. రాష్ట్ర విభజనపై మే 5వ తేదీన సుప్రీంకోర్టులో తీర్పు వెలువడుతుందని, అది సమైక్యాంధ్రకు అనుకూలంగా ఉంటుందన్నారు. -
ఇంకా రాష్ట్రం విడిపోలేదు
విభజనకు సహకరించిన పార్టీలకు బుద్ధిచెప్పండి: కిరణ్ నెల్లూరు/గూడూరు, రాష్ట్ర విభజన ఇంకా పూర్తికాలేదని మాజీ ముఖ్యమంత్రి, జై సమైక్యాంధ్ర పార్టీ అధ్యక్షుడు నల్లారి కిరణ్ కుమార్‌రెడ్డి అన్నారు. సోమవారం శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరుజిల్లా కేంద్రం లో, గూడూరులో నిర్వహించిన రోడ్‌షోలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర విభజనపై తాను సుప్రీంకోర్టును ఆశ్రయించానని, బిల్లును కోర్టు రద్దు చేస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించేందుకు సహకరించిన పార్టీలకు బుద్ధి చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. విభజన పాపం కాంగ్రెస్, టీడీపీ, బీజేపీలదేనని ఆరోపిం చారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు రెండుసార్లు లేఖలు ఇచ్చారని పేర్కొన్నారు. తాను లేఖ ఇచ్చినందువల్లే రాష్ట్రం వచ్చిందని తెలంగాణ లోను.. లాగే, సీమాంధ్రలో తాను సమైక్యవాదిని అని చంద్రబాబు రెండునాల్కల ధోరణి అవలంబి స్తున్నారని విమర్శించారు. తన లేఖ కారణంగా తెలంగాణ వచ్చిందంటున్న బాబు.. చిత్తూరు, నెల్లూరు జిల్లాలకు వచ్చి ఆ మాట చెప్పగలరా అని ప్రశ్నించారు. విభజన జరుగుతున్న నేపథ్యంలో నోరు మెదపకుండా మౌనం వహించిన పిరికిపంద బాబు అని దుయ్యబట్టారు. ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం దీక్షచేసి అమరుడైన శ్రీపొట్టిశ్రీరాములు జిల్లాలో పుట్టిన వెంకయ్యనాయుడు సైతం అడ్డగోలు విభజనకు అనుకూలంగా మాట్లాడటం సమంజసం కాదన్నారు. ప్రాంతాలకు అనుగుణం గా మాట్లాడుతూ ప్రజలను వంచిస్తున్న చంద్రబాబును తనజిల్లా వాసిగా చెప్పుకునేం దుకు సిగ్గుపడుతున్నానని కిరణ్ పేర్కొన్నారు. -
కిరణ్ ప్లాప్ షో
వెలవెలబోయిన సభలు చంద్రబాబుపై తీవ్ర విమర్శలు సాక్షి, తిరుపతి: జై సమైక్యాంధ్ర పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్ కిరణ్‌కుమార్‌రెడ్డి తిరుపతి, శ్రీకాళహస్తి, చంద్రగిరి నియోజకవర్గాల్లో ఆదివారం ఆ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ఎన్నికల ప్రచారం చేశారు. మూడు చోట్ల జనం పలుచగా హాజరయ్యారు. ఒక్క శ్రీకాళహస్తిలో మాత్రం ఓ మోస్తరుగా కనిపిం చారు. ఈ సభల్లో ఆయన ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రధానంగా రాష్ట్ర విభజనకు చంద్రబాబే కారకుడని ఆరోపించారు. స్వగ్రామమైన నగిరిపల్లి నుంచి బయలుదేరిన కిరణ్‌కుమార్‌రెడ్డి తొలుత చంద్రగిరిలో జరిగిన సభకు హాజరయ్యారు. ఈ నియోజకవర్గ పార్టీ అభ్యర్థి మమత వెంట తిరుపతి రూర ల్ మండలం నుంచి వచ్చిన రెండు వందల మంది మాత్రమే కిరణ్ సభలో కనిపించారు. చంద్రగిరి క్లాక్‌టవర్ సెంటర్లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో కిరణ్ పది నిమిషాలు మాత్రమే ప్రసంగించారు. అక్కడి నుంచి నేరుగా శ్రీకాళహస్తి చేరుకున్నారు. శ్రీకాళహస్తి నియోజకవర్గ పార్టీ అభ్యర్థి సీఆర్ రాజన్ ఆధ్వర్యంలో పెండ్లిమండపం సెంటర్లో జరిగిన సభలో ఆయన చంద్రబాబుపై విమర్శల వర్షం కురిపించారు. తాను తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చినందునే రాష్ట్ర విభజన జరిగిందని ఇటీవల వరంగల్‌లో చంద్రబాబు ప్రకటించిన విషయాన్ని ఈ సందర్భంగా కిరణ్ గుర్తు చేశారు. ఎక్కడా సమైక్యాంధ్రకు మద్దతు చెప్పని చంద్రబాబు మన జిల్లా వాసి కావడం మనందరి దురదృష్టమన్నప్పుడు సభకు హాజరైన జనం నుంచి మంచి స్పందన వ్యక్తమైంది. శ్రీకాళహస్తి నుంచి తిరుపతి నియోజకవర్గానికి వచ్చారు. తెలుగుతల్లి విగ్రహం నుంచి అంబేద్కర్, గాంధీ విగ్రహాల మీదుగా నాలుక్కాళ్లమండపానికి చేరుకున్నారు. ఇక్కడ హాజరైన జనాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. జేఎస్పీ పొత్తుపెట్టుకున్న సీపీఎం కార్యకర్తలు ఎక్కువగా ఈ సభలో కనిపించారు. తిరుపతి లోక్‌సభ అభ్యర్థి సుబ్రమణ్యం, తిరుపతి అసెంబ్లీ సెగ్మెంట్ అభ్యర్థి నవీన్‌కుమార్‌రెడ్డి పాల్గొన్నారు. అక్కడి నుంచి శ్రీదేవి కాంప్లెక్స్ పెట్రోల్ బంక్, కరిమారియమ్మ జంక్షన్, మున్సిపల్ ఆఫీసు, ఘంటసాల విగ్రహం వరకు రోడ్‌షోలో పాల్గొన్నారు. ఆయా సెంటర్లలో తిరుపతి జేఎస్పీ అభ్యర్థి నవీన్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో జనసమీకరణ జరిగింది. అన్ని చోట్ల హాజరైన జనానికి అభివాదం చేసుకుంటూ కిరణ్‌కుమార్‌రెడ్డి తన పర్యటనను ముగించారు. -
జేఎస్పీ, సీపీఎంల మధ్య కుదిరిన పొత్తు
18 అసెంబ్లీ, 2 లోక్‌సభ స్థానాల్లో సీపీఎంకు జేఎస్పీ మద్దతు కిరణ్‌కుమార్‌రెడ్డి, మధు వెల్లడి హైదరాబాద్: సీమాంధ్రలో పోటీ చేసేందుకు జై సమైక్యాంధ్ర పార్టీ(జేఎస్పీ), సీపీఎంల మధ్య ఎన్నికల పొత్తు కుదిరింది. సీపీఎంకు 18 అసెంబ్లీ, 2 లోక్‌సభ స్థానాల్లో జేఎస్పీ మద్దతు ప్రకటించింది. ఇరుపార్టీల మధ్య పరస్పర అవగాహన కుదిరిందని బుధవారం జేఎస్పీ కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు కిరణ్‌కుమార్‌రెడ్డి, సీపీఎం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి పి.మధులు ప్రకటించారు. కిరణ్ మాట్లాడుతూ తమ ఆలోచనలకు, సిద్ధాంతాలకు దగ్గరగా ఉన్నందునే సీపీఎంతో ఎన్నికల సర్దుబాటు చేసుకున్నామన్నారు. రాష్ట్ర విభజనకు కారణమైన కాంగ్రెస్, బీజేపీలకు వ్యతిరేకంగా తాము పనిచేస్తామన్నారు. కాగా, ఎన్నికల్లో తన పోటీపై కిరణ్ దాటవేశారు. మధు మాట్లాడుతూ ఇప్పటివరకు 18 అసెంబ్లీ, 2 లోక్‌సభ స్థానాల్లో సీపీఎం పోటీ చేసేందుకు జేఎస్పీతో సూత్రప్రాయంగా పొత్తు కుదిరింద ని చెప్పారు. -
కిరణ్.. అభ్యర్థులను ప్రకటించే దమ్ముందా ?
ధైర్యంవుంటే నాపై పోటీ ఎవరో చెప్పండి సవాల్‌విసిరిన పెద్దిరెడ్డి జైసమైక్యాంధ్రకు డిపాజిట్లూ దక్కవు పుంగనూరు, న్యూస్‌లైన్:మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, జైసమైక్యాంధ్రపార్టీ అధ్యక్షుడు కిరణ్‌కుమార్‌రెడ్డికి ధైర్యం ఉంటే ముందుగా సొంత జిల్లాలో ఆ పార్టీ అభ్యర్థులను ప్రకటించాలని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. మూడు సంవత్సరాలు రాష్ట్రాన్ని పాలించిన కిరణ్‌కు దమ్ముం టే పార్టీకి అభ్యర్థులను నిలబెట్టి డిపాజిట్లు దక్కించుకోవాలని, లేకపోతే... పార్టీని రద్దు చేసి, ఏ పార్టీకైనా మద్దతివ్వాలని ఆయన డిమాండ్ చేశారు. అభ్యర్థులను ప్రకటించకుండా చవట దద్దమ్మలా....రోడ్‌షోలు నిర్వహించేందుకు సిగ్గులేదా ? అని ప్రశ్నించారు. శనివారం పుంగనూరులో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తనపై వ్యక్తిగత కక్షతో పుంగనూరులో మూడేళ్లుగా అభివృద్ధిని అడ్డుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కిరణ్‌కు దమ్ము,ధైర్యం వుంటే తన మీద పోటీకి అభ్యర్థిని నియమించాలని పెద్దిరెడ్డి సవాల్ విసిరారు. జిల్లాలో రోడ్‌షోలకు ప్రజలు రాకపోవడంతో కిరణ్‌కుమార్‌రెడ్డి మీద ఉన్న ప్రేమ తేటతెల్లమైందన్నారు. కిరణ్ సీఎంగా రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించారని మండిపడ్డారు. రాష్ట్ర విభజనకు బిల్లుపెడితే పదవికి రాజీనామా చేస్తానని తొలుత గొప్పలు చెప్పిన కిరణ్, ఆ తరువాత సీఎం కుర్చీకాపాడుకోవడానికి తెలుగుదేశం, కాంగ్రెస్, బీజీపీలతో కలిసి కుట్రలుపన్ని రాష్ర్ట విభజనకు పూనుకున్నారని దుయ్యబట్టా రు. రాష్ట్ర అభివృద్ధి పట్టించుకోని కిరణ్‌కుమార్‌రెడ్డి అవినీతితో వేలాది కోట్లు సంపాదించి, పార్టీ పెట్టే స్థాయి కి ఎదిగారని ఆరోపించారు. తెలుగు ప్రజలను విడగొట్టిన కిరణ్ తప్పులు కప్పిపుచ్చుకునేందుకు పార్టీ ఏర్పాటు చేసి, డ్రామాలాడుతున్నారని విమర్శించారు. సిగ్గూఎగ్గూలేకుండా పార్టీ గుర్తుగా పాదరక్షలను ఎంపికచేసుకున్నారని ఎద్దేవాచేశారు. జైసమైక్యాంధ్ర అభ్యర్థులకు డిపాజిట్లు కూడా దక్కవన్నారు. రాష్ట్ర విభజనను అడ్డుకోలేని కిరణ్ రోడ్‌షోల్లో సమైక్యం పేరుతో ప్రజలను ఆకట్టుకునేందుకు డ్రామాలాడితే ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. జగన్మోహన్రెడ్డిని, వైఎస్ఆర్సీపీని విమర్శించే అర్హత కిరణ్‌కు లేదన్నారు. విశేష ప్రజాభిమానం ఉన్న వైఎస్ జగన్మోహన్రెడ్డి రానున్న ఎన్నికల్లో ముఖ్యమంత్రి కావడం ఖాయమని ధీమావ్యక్తంచేశారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రాగానే కిరణ్‌కుమార్‌రెడ్డి అవినీతి అక్రమాలపై విచారణ జరిపించి, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సమావేశంలో నేతలు రెడ్డెప్ప, వెంకటరెడ్డి యాదవ్, కొండవీటి నాగభూషణం, నాగరాజరెడ్డి, జింకా వెంకటాచలపతి, బెరైడ్డిపల్లె కృష్ణమూర్తి, బాబ్జాన్ తదితరులు పాల్గొన్నారు. మూడేళ్లు రెడ్డెప్పరెడ్డి ఏమైనా పట్టించుకున్నారా ? జిల్లాలో కిరణ్‌కుమార్‌రెడ్డి అనుచరుడుగా ఉన్న ఎమ్మెల్సీ రెడ్డెప్పరెడ్డి ఏనాడైనా పుంగనూరు అభివృద్ధి గురించి పట్టించుకున్నారా..? అంటూ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు సంవత్సరాలు పుంగనూరు అభివృద్ధిని కిరణ్ అడ్డుకోగా.. ఆయన ఏమి చేశారు..? అప్పుడు అభివృద్ధి గురించే మరిచిపోయూరా...? అంటూ నిలదీశారు. సమైక్యాంధ్ర పేరుతో ఓట్ల కోసం వస్తున్న ఇలాంటి అవకాశవాదులకు తగిన గుణపాఠం నేర్పాలని ప్రజలను కోరారు. -
'మల్కాజ్గిరి నుంచి ఉండవల్లి పోటీ'
రాజమండ్రి: జై సమైక్యాంధ్ర పార్టీ తరఫున మల్కాజ్గిరి నుంచి ఉండవల్లి అరుణ్ కుమార్‌ను పోటీకి దింపుతామని అమలాపురం ఎంపీ జీవీ హర్షకుమార్ తెలిపారు. అమలాపురం నుంచే తాను పోటీ చేస్తానని చెప్పారు. అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులు ఖరారు చేసినట్టు వెల్లడించారు. జై సమైక్యాంధ్ర పార్టీ తెలంగాణలోనూ పోటీ చేస్తుందని ఆ పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఇంతకుముందే ప్రకటించారు. మల్కాజ్ గిరిలో అధిక సంఖ్యలో ఉన్న సీమాంధ్ర ఓట్లు ఉండడంతో ఇక్కడి నుంచి తమ పార్టీ అభ్యర్థిని రంగంలోకి దింపాలని జై సమైక్యాంధ్ర పార్టీ నిర్ణయించింది. మల్కాజ్ గిరిలో పోటీకి ఉండవల్లి కూడా సుముఖంగా ఉన్నట్టు తెలుస్తోంది. -
మోదుగులను చంపేసే వారే: ఉండవల్లి
విజయవాడ: అధికార, ప్రతిపక్షాలు కలిసిపోతే పార్లమెంట్లో అత్యాచారం, హత్య జరిగిన బయటకు రాదని జై సమైక్యాంధ్ర పార్టీ నేత ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. పార్లమెంట్లో తెలంగాణ బిల్లు పెట్టినప్పడు సీమాంధ్ర ఎంపీలపై జరిగిన దాడే దీనికి నిదర్శనమన్నారు. లగడపాటి రాజగోపాల్ పెప్పర్ స్ప్రే కొట్టకపోతే మోదుగుల వేణుగోపాల్ రెడ్డిని గొంతు నులిమి చంపేసే వారని చెప్పారు. మహిళా రిజర్వేషన్ బిల్లు రాజ్యసభలో 2005లో ఆమోదం పొందినా ఇప్పటి వరకు ఎందుకు లోక్‌సభలో పెట్టలేదని ఆయన ప్రశ్నించారు. తెలంగాణవాదులు భద్రాచలంను ఎలా అడుగుతారని అన్నారు. భద్రాచలంను నిజాం ప్రభువులు పాలించారా అని ప్రశ్నించారు. తెలంగాణ బిల్లు రాజ్యాంగవిరుద్ధమని అరుణ్ జైట్లీయే చెప్పారన్నారు. రాష్ట్ర విభజన ఇంకా జరగలేదని, దీన్ని ప్రజలు గుర్తించాలన్నారు. తెలంగాణలోనూ జై సమైక్యాంధ్ర పార్టీ పోటీ చేస్తుందని చెప్పారు. ప్రజలు మద్దతిస్తే తమ సత్తా ఏంటో చూపిస్తామని ఉండవల్లి అన్నారు. -
'ఎవరో రాసిచ్చిన డైలాగులు చెప్పడం కాదు'
హైదరాబాద్: ప్రజలను రెచ్చగొట్టే విధంగా కేసీఆర్ మాట్లాడుతున్నారని మాజీ ముఖ్యమంత్రి, జై సమైక్యాంధ్ర పార్టీ నాయకుడు ఎన్. కిరణ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. పూర్తిగా అవాస్తవాలు చెప్పి ప్రజలను మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. కేసీఆర్ తాటాకు చప్పుళ్లకు భయపడాల్సిన అవసరం లేదన్నారు. చిరంజీవి వాస్తవాలు తెలుసుకుని మాట్లాడితే బాగుంటుందని సూచించారు. ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్‌లో డైలాగులు చెప్పడం సరికాదన్నారు. విభజన సమయంలో కిరణ్‌కుమార్ రెడ్డి అబద్దాలు ప్రచారం చేశారని చిరంజీవి ఆరోపించిన సంగతి తెలిసిందే. సీమాంధ్ర ఉద్యోగ సంఘాలతో కిరణ్ ఉద్యమం నడిపించారని అన్నారు. రాష్ట్ర విభజనను ఎవరూ వ్యతిరేకించలేదని చిరంజీవి చెప్పారు. కాంగ్రెస్ పార్టీని దోషిగా చేయడం తగదని పేర్కొన్నారు. -
చంద్రబాబు పిరికిపంద: కిరణ్
రాష్ట్ర విభజనకు సహకరించిన పార్టీలకు ఎన్నికల్లో లెంపకాయ కొట్టాలని మాజీ ముఖ్యమంత్రి, జై సమైక్యాంధ్ర పార్టీ అధ్యక్షుడు ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. విభజించిన కాంగ్రెస్‌కు, విభజనకు అంగీకరిస్తూ రెండుసార్లు లేఖలిచ్చిన టీడీపీకి వచ్చే ఎన్నికల్లో ఒక్కసీటు ఇవ్వకుండా ప్రతీకారం తీర్చుకోవాలన్నారు. ఆదివారం విశాఖ బీచ్‌రోడ్‌లో విద్యార్థి సంఘం నాయకులతో ఆయన సమావేశం నిర్వహిం చారు. అంతకుముందు జై సమైక్యాంధ్ర పార్టీ గుర్తు ‘పాదరక్షలు’ను ఒక చిన్నారితో ఆవిష్కరింపచేశారు. ఈ సందర్భంగా కిరణ్ మాట్లాడుతూ సమైక్యాంధ్ర తమ నినాదం కాదని, విధానమని చెప్పారు. దురదృష్టవశాత్తు చంద్రబాబు తన జిల్లా వాసేనని, తన తండ్రే కాంగ్రెస్ నుంచి టికెట్ ఇప్పించారని కిరణ్ పేర్కొన్నారు. తరువాత టీడీపీలో చేరి మామకు వెన్నుపోటుపొడిచి అధికారాన్ని చేజిక్కించుకుని పాలనాదక్షుడనే ముసుగులో అధికారం కోసం అవాస్తవాలు, అబద్దాలు చెప్పుకుంటూ తిరుగుతున్నాడని ధ్వజమెత్తారు. రాష్ట్ర విభజన ద్వారా ఇరు ప్రాంతాలు నష్టపోతాయని తెలిసీ తెలంగాణకు అనుకూలంగా రెండుసార్లు లేఖలిచ్చిన బాబు పాలనాదక్షుడెలా అవుతాడని ప్రశ్నించారు. తెలంగాణలో ఓట్లు పోతాయన్న భయంతో అసెంబ్లీలో విభజనపై ఒక్కసారి కూడా మాట్లాడలేని పిరికిపంద చంద్రబాబు అని ఘాటుగా వ్యాఖ్యానించారు. కార్యక్రమంలో ఎంపీలు ఉండవల్లి అరుణ్‌కుమార్, హర్షకుమార్ సబ్బం హరి, మాజీమంత్రి పితాని సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
నిరాశాకిరణం
కిరణ్‌కుమార్‌రెడ్డి పర్యటనకు స్పందన నిల్ పార్టీ పెట్టాక తొలిసారి అడుగుపెట్టినా ఆదరణ శూన్యం బెడిసికొట్టిన అంచనాలు సబ్బవరంలో జనం లేక అర్ధంతరంగా ముగిసిన సభ సాక్షి, విశాఖపట్నం : పార్టీ ప్రకటించిన తర్వాత తొలిసారి పర్యటనకు విశాఖ వచ్చిన జై సమైక్యాంధ్ర పార్టీ అధినేత కిరణ్‌కుమార్‌రెడ్డికి జిల్లాలో జనాదరణ కరువైంది. విమానాశ్రయం నుంచి సబ్బవరం సభ వరకు కనీసం చప్పట్లు కొట్టే నాథుడు కూడా లేకపోవడంతో కిరణ్ నీరసించిపోయారు. ఎంతో ఊహించి జిల్లాలో అడుగుపెడితే చివరకు కార్యకర్తల సందడి కూడా కరువవ్వడంతో కంగుతిన్నారు. ఇతర ప్రాంతాల నేతలు, సబ్బంహరి మినహా ఎవరూ వెంట లేకపోవడంతో పర్యటన ఫెయిలైంది. స్పందనేది? : ఉదయం విమానాశ్రయంలో దిగిన కిరణ్‌కు అక్కడ సాదాసీదా స్పందన ల భించింది. పార్టీకి కనీసం క్యాడర్, నేతలు లేకపోవడంతో నీరసంగా విశాఖ ఫంక్షన్ హాల్లో యువతతో సమావేశానికి హాజరయ్యారు. తీరా చూస్తే అక్కడ పెద్దగా విద్యార్థులు లేకపోవడంతో చేసేది లేక చాలాసేపు ఖాళీగా ఉన్నా రు. చివరకు ఎలాగోలా జనాన్ని సమీకరించడంతో పేలవంగా కార్యక్రమం మొదలైంది. జనస్పందన ఆశించినంత లేకపోవడంతో కిరణ్ నీరసంగా మాట్లాడారు. ఆయన వెంట ఒక్క సబ్బంహరి మినహా జిల్లా నేతలెవరూ కనిపించలేదు. సీఎంగా ఉన్నప్పుడు జిల్లాకు వస్తే జనం, నేతలతో సందడిగా గడిపే కిరణ్ పార్టీ పెట్టాక కనీసం అందులో సగం కూడా స్పందన కనిపించలేదు. సాయంత్రం సబ్బవరంలో డ్వాక్రాగ్రూపు సభ్యులతో బహిరంగ సభ ఉన్నట్టు పార్టీ నేతలు ప్రకటించారు. సభ ఆలస్యంగా ప్రారంభం, ఆయన ఏం మాట్లాడుతున్నారో అర్థం కాకపోవడంతో మహిళలు అక్కడి నుంచి జారుకున్నారు. ఆయన ప్రసంగిస్తుండగానే సభా ప్రాంగణం దాదాపుగా ముప్పావు వంతు ఖాళీగా కనిపించడంతో కిరణ్ తన ప్రసంగాన్ని అర్ధంతరంగా ముగించేశారు. పార్టీ గుర్తు చెప్పును ఆవిష్కరించగానే జనం నుంచి కనీస ఆదరణ లేకపోవడం విశేషం. ఎన్నో అంచనాల మధ్య జిల్లాలోకి అడుగుపెట్టిన కిరణ్‌కు జనస్పందన లేకపోవడంతో అనుకున్న అంచనాలన్నీ తలకిందులైనట్లయింది. సబ్బవరం బహిరంగ సభకు వచ్చిన కొద్దిమంది జనంలో కూడా ఇతర నియోజక వర్గాల నుంచి తరలించినవారే అధికంగా ఉండడంతో వారంతా చీకటైపోయిందంటూ బయటకు వెళ్లి లారీలు ఎక్కేశారు. దీంతో పర్యటన నీరసంగా..నిస్తేజంగా మారింది. ఒకపక్క నేతలెవరూ చేరకపోవడం, మరోపక్క అనుకున్నంతగా విద్యార్థులు, మహిళల నుంచి స్పందన లేకపోడంతో కిరణ్ నీరసించిపోయారు. -
అడ్వాన్స్ బుకింగ్, సేల్ లేదు: కిరణ్
హైదరాబాద్: తమ పార్టీలో టిక్కెట్లు అమ్ముకోబోమని మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి అన్నారు. అడ్వాన్స్ బుకింగ్ లేదు, సేల్ లేదని ఆయన చమత్కరించారు. తన పార్టీ పేరును 'జై సమైక్యాంధ్ర'గా కిరణ్ ప్రకటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజల కోసమే పనిచేసే వాళ్లకే టిక్కెట్లు ఇస్తామని చెప్పారు. ఎవరికీ ఎన్ని సీట్లు ఇవ్వాలో ప్రజల గుండె చప్పుడు చెబుతుందన్నారు. వ్యవస్థాపక అధ్యక్షుడిగా చండ్రు శ్రీహరిరావు వ్యవస్థాపక అధ్యక్షుడిగా, తాను అధ్యక్షుడిగా ఉంటానని కిరణ్ తెలిపారు. సాయి ప్రతాప్, సబ్బం హరి, ఉండవల్లి అరుణ్ కుమార్, హర్షకుమార్, పితాని సత్యనారాయణ, శైలజానాథ్ ఉపాధ్యక్షులుగా వ్యవహరిస్తారని చెప్పారు. కార్యదర్శిగా గంగాధర్‌ను నియమించినట్టు చెప్పారు. లగడపాటి రాజగోపాల్ వ్యూహకర్తగా వ్యవహరిస్తారని అన్నారు.