కదిరాయుచెర్వు(కలకడ), న్యూస్‌లైన్: ఎన్నికలు ముగిసిపోయినా వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై తెలుగుదేశం పార్టీ,జై సమైక్యాంధ్ర పార్టీ నేతలు దాడులకు పాల్పడుతూనే ఉన్నారు. అధికారులను ఉసిగొలిపి కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. గంగజాతర పేరుతో ఇళ్లతొలగింపునకు పూనుకుంటున్నారు. ఉత్సవాలు, ఊరేగింపులపేరుతో ఈ చర్యలకు పాల్పడుతున్నా రు. న్యాయం చేయాల్సిన అధికారులు టీడీపీ,జేఎస్పీ నేతలకు అండగా నిలవడంతో బాధితులు ఉన్నతాధికారులను కోర్టును ఆశ్రయించారు. వివరాలు ఇలా ఉన్నాయి.
మండలంలోని కదిరాయచెరువు పంచాయతీలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు సుధాకర్, రెడ్డి హుస్సేన్ చాలా కా లం కిందట ఇళ్లు కట్టుకుని నివాసముం టున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో వారుైవైఎస్సార్‌సీపీ మద్దతుగా నిలిచా రు. తమకు వ్యతిరేకంగా పనిచేశారన్న అక్కసుతో వీరి ఇళ్లను కూల్చివేసేందుకు జైసమైక్యాంధ్ర, టీడీపీకి చెందిన నేతలు అధికారులపై ఒత్తిడి తీసుకువస్తున్నారు. ఇదిలా ఉండగా గ్రామంలో నడివీధి గంగమ్మ ఉత్సవాలను నిర్వహిస్తున్నారు.
అమ్మవారిని ఊరేగించేందు కు, ప్రజలు వెళ్లేందుకు సిమెంటు రోడ్లు ఉ న్నాయి. అయినా వీరి ఇళ్లు అడ్డంగా ఉన్నాయని, ఇళ్లను తొలగించాలని అధికారులు ఒత్తిడి తీసుకువస్తున్నారు. వా రం రోజులుగా ఇలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. దీనిపై బాధితులు రెవెన్యూ,పోలీసు అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. అయినా ఫలితం కనిపించలేదు. దీంతో వారు మదనపల్లె సబ్‌కలెక్టర్‌ను కలసి ఇళ్ల కూల్చివేతను అడ్డుకోవాలని విజ్ఞప్తి చేశారు.
కోర్టు ఆశ్రయించి నట్టు బాధితులు తెలిపారు. సోమవారం రాత్రి జాతర చాటింపు వేశారు. మంగళవారం ఉదయం అధికారులు వచ్చి ఇళ్లను కూల్చిలవేయాల్సిందేనని పట్టుబడుతున్నారని బాధితులు వాపోతున్నారు. ఇంటి నిర్మాణం జరిగిన స్థలం, కొనుగోలు పత్రాలు, ఇంటిపన్ను, విద్యుత్ బిల్లు వంటివి ఉన్నప్పటికీ అధికారులు ఏకపక్షంగా ఇళ్ల కూల్చివేతకు పాల్పడుతున్నారని వారు ఆరోపిస్తున్నారు. రాజకీయ కక్షలకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు.
వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై కక్షసాధింపు
Published Wed, May 28 2014 2:02 AM | Last Updated on Fri, Aug 10 2018 8:35 PM
Advertisement
Advertisement